1 ENS Live Breaking News

రైతుల ఖాతాల్లో రూ.46.25 కోట్లు..

తూర్పుగోదావ‌రి జిల్లాలో నివ‌ర్ తుపాను కార‌ణంగా 737 గ్రామాల‌కు చెందిన 77,381 మంది రైతులు నష్ట‌పోయార‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి నివ‌ర్ తుపాను పంట న‌ష్ట‌ప‌రిహారం, రైతు భ‌రోసా సాయం కింద రాష్ట్ర వ్యాప్త రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1,766 కోట్ల‌ను జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్నివీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌రేట్ వివేకానంద స‌మావేశ మందిరం నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. జిల్లాలో నివ‌ర్ తుపాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లో రూ.46.25 కోట్లు మేర పెట్టుబ‌డి రాయితీ మొత్తం జ‌మ‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రికి క‌లెక్ట‌ర్ తెలిపారు. అదే విధంగా 2020-21కు సంబంధించి వైఎస్సార్ రైతుభ‌రోసా-పీఎం కిసాన్ ప‌థ‌కం ప‌రిధిలో చివ‌రి విడ‌త సాయం కింద 4,64,229 మంది రైతుల ఖాతాల్లో రూ.102.27 కోట్లు జ‌మ‌వుతుంద‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. పార‌ద‌ర్శ‌క గ‌ణ‌న‌: జిల్లాలో న‌వంబ‌ర్‌లో సంభ‌వించిన నివ‌ర్ తుపాను కార‌ణంగా 47 మండ‌లాల్లో వ‌రి, మినుములు, ప‌త్తి, మొక్క‌జొన్న‌, పొగాకు పంట‌ల‌కు సంబంధించి రైతులు న‌ష్ట‌పోయిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు యుద్ధ ప్రాతిప‌దిక‌న పంట న‌ష్టాల నివేదిక‌ల‌ను రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. పార‌ద‌ర్శ‌క‌త‌, సామాజిక త‌నిఖీ ప్ర‌క్రియ‌లో భాగంగా జాబితాల‌ను గ్రామ స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించిన‌ట్లు వెల్ల‌డించారు. ఏ సీజ‌న్‌లో జ‌రిగిన పంట న‌ష్టానికి అదే సీజ‌న్ ముగిసేలోపు పెట్టుబ‌డి రాయితీ అందిస్తుండ‌టంతో రైతుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంద‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, వ్య‌వ‌సాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్ర‌సాద్‌, డీడీఏ ఎస్‌.మాధ‌వరావు, ఉద్యాన‌శాఖ డీడీ రాంమోహ‌న్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో తూర్పుగోదావ‌రి జిల్లా మామిడికుదురు మండ‌లం పాస‌ర్ల‌పూడి గ్రామ రైతు కొనుకు నాగ‌రాజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో మాట్లాడారు. ఆ రైతు మ‌నోగ‌తం ఆయ‌న మాట‌ల్లోనే.. మా ముఖ్య‌మంత్రి.. రైతుల ప‌క్ష‌పాతి.. రెండున్న‌ర ఎక‌రాల్లో వ‌రి పంట వేశాం. న‌వంబ‌ర్‌లో నివ‌ర్ తుపాను కార‌ణంగా పంట మొత్తం నీట మునిగింది. ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కులు నాతో పాటు గ్రామంలోని రైతులంద‌రి పంట న‌ష్టాల వివ‌రాలు తీసుకున్నారు. ఈ రోజు ప‌రిహారం కింద రూ.13,360 ఖాతాలో జ‌మ‌వుతోంది. ఇలా వెంట‌నే ప‌రిహారం అందించే ప‌రిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. రైతుల ప‌క్ష‌పాతిగా నేడు మా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్నారు.  గ‌తంలో బీమా కంపెనీకి ఎక‌రాకు రూ.625 చెల్లించినా ఎప్పుడూ మా ఖాతాలో రూపాయి ప‌డింది లేదు. కానీ, ఒక్క రూపాయితో రూ.18,034 బీమా మొత్తం నా ఖాతాలో జ‌మ‌యింది. రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది.. గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అన్న‌మ‌హాత్ముని ఆశ‌యాలకు అనుగుణంగా మీరు నేడు పాల‌న సాగిస్తున్నారు. మ్యానిఫెస్టోలో రైతుల‌కు సంబంధించి పెట్టిన ప్ర‌తి అంశాన్నీ తు.చ‌.త‌ప్ప‌కుండా అమ‌లుచేస్తున్నందుకు మీకు రైతుల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు. మీ మానస‌పుత్రిక‌లైన రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు విత్త‌నాలు వేసింది మొద‌లు పంట మార్కెటింగ్ వ‌ర‌కు ఎంతో మేలు జ‌రుగుతోంది. నాన్న‌గారు కంటే మ‌రో అడుగు ముందుకేసి మీరు రైతుల‌కు అండ‌గా ఉంటున్నారు.

Kakinada

2020-12-29 16:04:04

అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందాలి..

అనంతపురం జిల్లాలో అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే వెంటనే వారికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఇందుకు సంబంధించి వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేసి ధృవీకరించుకొని ఎవరైనా అర్హులు ఉంటే 90 రోజుల్లో ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కింద ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఏపిడిలు, ఏపీఓ లు, విఆర్వో లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, భవిష్యత్తులో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నప్పుడు అర్హులు ఎవరైనా ఉండి ఇంటి పట్టా రాకపోతే చేయి పైకి ఎత్తాలని అన్నప్పుడు ఎవరూ చేతులెత్తకుండా అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పట్టా రాలేదని చెప్పిన వారికి ఎందుకు ఇళ్ల పట్టా రాలేదో విఆర్వో, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు సదరు వ్యక్తికి ఏ కారణం చేత ఇంటి పట్టా ఇవ్వలేదో సమాధానం చెప్పేలా స్పష్టమైన వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులకు ఉంటే వారికి ఇంటి పట్టాలు 90 రోజుల్లోగా వచ్చేలా చూడాలన్నారు.  జిల్లాలో కొన్నిచోట్ల అర్హత కలిగిన వ్యక్తులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూమి ఉన్నమేరకు మాత్రమే పట్టాలు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, అలా కాకుండా అర్హత కలిగిన వారికి ప్రైవేటు భూమి కొనుగోలు చేసైనా సరే ఖచ్చితంగా పట్టాలు ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వకపోతే సంబంధిత విఆర్వోలు, తహసిల్దార్ లపై చర్యలు తీసుకునేందుకు వెనకాడమని, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వెంటనే సరిదిద్దుకుని అర్హత ఉన్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు ఇచ్చే కార్యక్రమంలోకి చేర్చి వారికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి వాలంటీర్ కూడా వారికి ఇచ్చిన 50, 60 ఇళ్లలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చాయి, ఎంత మందికి రాలేదు, రాం అటువంటి వారికి ఎందుకు రాలేదు అనేది వివరాలతో సహా సిద్ధం చేసి తమకు పంపించాలన్నారు. అన్ని వివరాలు వాలంటీర్, విఆర్వో, వార్డు కమ్యూనిటీ సెక్రటరీ, విలేజ్ వెల్ఫేర్ సెక్రెటరీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాలలో విఆర్వో, వార్డు కమ్యూనిటీ సెక్రటరీ, విలేజ్ వెల్ఫేర్ సెక్రెటరీ లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇచ్చాము, మా గ్రామంలో అర్హత ఉన్న ఇంటి పట్టా పొందలేకున్నా వారు ఒక్కరు కూడా లేరని సర్టిఫికెట్ అందించాలన్నారు.  ప్రతి ఒక్క లబ్ధిదారునికి వారికి కేటాయించిన లేఔట్ స్థలంలోనే తక్షణం పట్టా అందించాలని, తహశీల్దార్ లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కరికి వారి ఫ్లాట్లోనే పట్టాలచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ ఎంత మందికి ఇంటి పట్టాలు అందించారు అనేది రిపోర్టులు అందించాలని, ఇంటి పట్టాల పంపిణీ కి ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదారునికి వారికి కేటాయించిన ఫ్లాట్లోనే ఇంటి స్థలం పట్టా అందించేలా చూడాలని, ఇది ఒక లబ్ధిదారునికి వారి ఫ్లాట్ ను ఖచ్చితంగా చూపించాలన్నారు. ఇంటి పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఇంటి పట్టాలకు సంబంధించి లబ్ధిదారులను వరుసగా నిలబెట్టి జియో ట్యాగింగ్ చేయాలని, జనవరి 7వ తేదీ లోపు జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు తహసిల్దార్లు, ఆర్డీవోలు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల శాంక్షన్ ప్రొసీడింగ్స్ ను, ఇళ్ల నిర్మాణాలు ఆప్షన్ ఫామ్ లను కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని సూచించారు. 

Anantapur

2020-12-29 13:23:52

కళాకారులకు కెఎన్ఆర్ చిరు సత్కారం..

భారతదేశ మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి జయంతి వారోత్సవాలు సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విస్తృతస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం దీనిలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న కళాకారులు, క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. జబర్థస్థ్ కళాకారుడు ప్రముఖ డాన్సు మాస్టర్ జబర్ధస్థ్ రమేష్ , డీ డాన్సు టీవీ షో కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్ , బాలు రైడర్స్ డాన్సు మాస్టర్ బాలు తోపాటు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్టృ స్థాయి క్రికెట్ పోటీలలో మొదటి స్థానం లో విజయం సాదించి కప్ గెలిచి విశాఖ వచ్చిన క్రీడాకారుల క్రికెట్ టీం సభ్యులను పాత కర్నవానిపాలెం ఆయన క్యాంప్ కార్యాలయంలో విజేతలకు దుశ్శాలువా కప్పి పూలమాలలు సత్కరించారు. ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ, నేటి యువత క్రీడలపై ఎక్కువ మక్కువ చూపాలని అన్నారు . క్రీడలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోలువులలో ఉద్యగాలు పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాదించాలని ఆకాంక్షించారు. తన వంతు సహాయసహకారాలు కళాకారులకు , క్రీడాకారులకు ఎల్లప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు.

Visakhapatnam

2020-12-29 13:10:19

సీఎం వైఎస్ జగన్ పేదల గుండెల్లో నిలిచిపోతారు..

ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రంలో 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల పట్టాలను జగన్ ప్రభుత్వం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేదల హృదయాలలో ముఖ్యమంత్రి శాశ్వతంగా నిలిచిపోతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం లో మంత్రి పేర్ని నాని సోమవారం 731 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేశారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గతి లేని పరిస్థితిలో పేదరికం అనుభవిస్తూ అద్దె ఇంటిలో ఒక కప్పు కింద రెండు మూడు కాపురాలు చేస్తూ బతుకు దుర్భరంగా గడుపుతున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఒక పండుగ సందర్భం అని అన్నారు. వివాహమైన కుమారుడు లోపల నిద్రపోతే , ఇంటి వసారాలో తల్లితండ్రులు నిద్రిస్తూ నిత్యం నానా అవస్థలు పడుతున్న పేద వారికి నివేశన స్థలాలు ప్రభుత్వం అందచేయడం ఒక భాగ్యమన్నారు. అలాగే అద్దె కట్టడానికి ఆర్ధిక స్తోమత్తు లేక చెట్టు కిందనో , కాలువ గట్టునో చిన్న పరదా చాటున భారంగా బతుకు ఈడ్చుతున్న వారికి ఇళ్ల స్థలాలు పొందడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. జగన్మోహరెడ్డి తన సుధీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టాలు ఇవ్వడమే కాక లబ్ధిదారులకు ఇళ్లూ నిర్మించి ఇస్తామని తెలిపారు. తన మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేల మందికి, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వేలమందికి ఇళ్ల స్థలాలు అందచేయడంతో తన జీవితానికి తగిన సార్ధకత లభించిందని అన్నారు. ఇంటి స్థలం రాలేదని ఏ ఒక్కరూ నిరాశ పడరాదని , అర్హులకు 90 రోజులలో మరల స్ధలాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు అప్పికట్ల నాగలక్ష్మి, కొనకళ్ల శివ నాగమణి, కోడూరు అరుణ, షేక్ హసీనా బేగం, తమ్ము లక్ష్మి,లకు మంత్రి చేతుల మీదుగా ఇంటిస్థలాల పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత , బందరు ఆర్డీవో ఖాజావలి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఎంపిడీవో సుధా ప్రవీణ, హోసింగ్ డి ఇ భానోజీ రావు తదితరులు పాల్గొన్నారు.

Kerebettu

2020-12-28 23:04:21

కేంద్రం నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి..

అనంతపురం జిల్లాలో వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని, నిధుల వినియోగంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని దిశా కమిటీ చైర్మన్, ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో చైర్మన్, ఎంపీ రంగయ్య, కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉష శ్రీ చరణ్, శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా దిశా కమిటీ మీటింగ్ అజెండాలోని జల్ జీవన్ మిషన్, నాడు నేడు, కోవిడ్ మేనేజ్మెంట్, నేషనల్ హైవే తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ ప్రతి శాఖ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, కేంద్ర పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇంతకు ముందు కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం నిధులు ఖర్చు చేయాల్సిందిగా ఉండేదని, ప్రస్తుతం కేంద్రం 60 శాతం రాష్ట్రం 40 శాతం ఖర్చు చేయాల్సిందిగా వివిధ పథకాల్లో మార్పులు జరిగాయని, వివిధ కేంద్ర పథకాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అంతా సక్రమంగా పని చేయాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. జిల్లాలో వివిధ కేంద్ర పథకాల కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులతో కలిసి పనిచేసేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు.  జల్ జీవన్ మిషన్ కింద పేదలందరికీ ఇల్లు కింద ఏర్పడనున్న రెండు లక్షల పైచిలుకు ఇల్లు, కొత్త కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకం కింద చేర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడు పనుల కింద జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని పనులు చేసేలా ప్రతిపాదనలు పంపించాలన్నారు.  కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని వాటిని సరిచేయాలని, జాతీయ రహదారుల పైన మధ్యలో గడ్డి పెరుగుతోందని, దానిని తొలగించాలని, పాడైన లైట్లను వేయించాలని, జాతీయ రహదారులపై మెయింటెనెన్స్ చేసే వారి వివరాలు నంబర్లు ప్రదర్శించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.  జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది - దిశా కమిటీ కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దిశా కమిటీ కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రిపోర్టులను తయారు చేసి మొత్తం వివరాలు తమకు అందజేయాలని, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అడిగితే బాగుంటుంది అనే వివరాలు అందించాలన్నారు. జిల్లాలో రైల్వే, రోడ్లు, పర్యాటకం తదితర అంశాల పరిధిలో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో అధికారులు తెలియజేయాలని సూచించారు. జాతీయ రహదారులపై మొక్కలు కాలిపోతున్నాయని, గడ్డిని కాల్చకుండా తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలి - ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో ఎలాంటి తాగునీటి  సిస్టం లేని 39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరారు. తమ నియోజకవర్గంలో శ్రీ రామ రెడ్డి తాగునీటి పథకం చేయలేదని, 39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలన్నారు. కొన్ని చోట్ల పాఠశాలలు సగం వరకే కట్టి వదిలేశారని వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుండ్లపల్లి నుంచి బొమ్మనహల్ వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 2024 లోపు ప్రతి ఇంటికి నీటి కొళాయి కనెక్షన్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరికి 55 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉందని, అందుకనుగుణంగా జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి అందులో నీళ్లు వచ్చేలా చూడాలన్నారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని 39 గ్రామాల కింద సర్వే పూర్తిచేసి నీటి సరఫరాకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే జిల్లాలో పాఠశాలల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి జాబితా తయారు చేయాలని, జాతీయ రహదారులపై మెయింటెనెన్స్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కేంద్ర పథకాల అమలుకు సంబంధించి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.  జల్ జీవన్ మిషన్ కింద 4 మేజర్ పంచాయతీలను చేర్చాలి - ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి జల్ జీవన్ మిషన్ కింద అనంతపురం నియోజకవర్గం పరిధిలోని 4 మేజర్ పంచాయతీలను చేర్చాలని, ఇంతవరకు ఎందుకు చేర్చలేదని, వెంటనే ఆయా పంచాయతీలను  జల్ జీవన్ మిషన్ కింద చేర్చాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. నాడు నేడు పథకం కింద వచ్చే మార్చి లోపు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో పని చేసిన డాక్టర్లు, ఉద్యోగులకు ప్రాముఖ్యత ఇవ్వాలని, కోవిడ్ సమయంలో భోజనం అందించిన హోటల్ వాళ్ళ బిల్లులు చెల్లించాలన్నారు. జాతీయ రహదారులపై తపోవనం వద్ద, పామిడి వద్ద ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది చనిపోతున్నారని, జాతీయ రహదారిపై లైట్లు వేయాలని, పాడైన రోడ్లను బాగు చేయాలని, నగరంలో జాతీయ రహదారి బ్రిడ్జి కింద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  కొత్తగా వచ్చే కాలనీలకు నీటి సౌకర్యం కల్పించాలి - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేదలందరికీ ఇల్లు కింద కొత్తగా వచ్చే కాలనీలకు నీటి సౌకర్యం కల్పించేలా జల్ జీవన్ మిషన్ కింద, పిఏ బీఆర్ ట్యా0కుల ద్వారా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. అలాగే రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కురుగుంట, వైయస్సార్ కాలనీ, కామారుకాలనీలకు, చెన్నేకొత్తపల్లి కి నీరు అందించేలా చూడాలన్నారు. అనంతపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కు సంబంధించి భూ సేకరణ పై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ రహదారిని పట్టాలెక్కించేలా చూడాలన్నారు. భూసేకరణకు అత్యధిక వ్యయం అవుతుందని చెబుతున్నారని, దీని ద్వారా రహదారి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి పరిధిలో గత వేసవిలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేశామని, ఇందుకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్ కింద పుట్టపర్తి నియోజకవర్గం లో పనులు వేగవంతంగా చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ తిలక్ విద్యాసాగర్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, దిశా కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-28 21:57:10

457 మందికే తొలివిడత అక్రిడిటేషన్లు మంజూరు..

తూర్పుగోదావరి జిల్లాలో తొలివిడతగా వివిధ మీడియా సంస్థలకు చెందిన అర్హులైన 457 మంది జర్నలిస్ట్ లకు 2021-2022 ద్వైవార్షిక కాలానికి మీడియా అక్రిడిటేషన్లు జారీ చేశామని జిల్లా కలెక్టర్  డి.మురళీధరరెడ్డి తెలియజేశారు.   రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతనంగా ఏర్పాటైన  తూర్పు గోదావరి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశం సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో జిల్లాలో వివిధ మీడియా సంస్థలు, వాటి ప్రతినిధుల నుండి మీడియా అక్రిడిటేషన్ కోరుతూ ఆన్ లైన్ ద్వారా అందిన 2,271 ధరఖాస్తులను కమిటీ పరిశీలించి, జి.ఓ.142, తేది.20.11.2019 లో జారీ అయిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2019లో నిర్థేశించిన అన్ని అర్హతలు కలిగిన 457 మంది జర్నలిస్ట్ లకు 2021-2022 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు జారీ చేసామని ఆయన తెలిపారు.  నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా 1,814 ధరఖాస్తులను పెండింగ్ లో ఉంచడం జరిగిందని, ఏ ధరఖాస్తును తిరస్కరించలేదన్నారు.  నిబంధనలలో నిర్థేశించిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి, వాటి ప్రింట్ కాపీలను సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ కార్యాలయంలో అందజేసిన యెడల వాటన్నిటినీ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తదుపరి సమావేశంలో పరిశీలిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఎన్.బుల్లిరాణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వి.ఎస్.గౌరీశ్వరరావు, సమాచార శాఖ జాయింట్ డైరక్టర్ ఎల్.స్వర్ణలత, ఆర్టిసి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.  

Kakinada

2020-12-28 21:10:56

కరోనా టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలి..

కరోనా టీకాలు వేయడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆమె రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలందరికీ టీకాలు వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ముందుగా రూపొందించుకోవాలన్నారు. వేక్సీన్ వేసేందుకు ముందుగా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి, వ్యాక్సిన్ ను భద్రపరచడం, రవాణా  రోజుకు ఎంతమందికి వేయాలి మొదలైనవన్నీ ముందుగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అంతకు ముందు రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులపై ఆమె పరిశీలన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరుణ తగ్గుముఖం పడుతున్నప్పటికీ  అజాగ్రత్తగా ఉండ రాదన్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండి పరిస్థితులను గమనించాలన్నారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారిపై నిఘా వుంచి వారిని పరీక్ష చేయడం తదితర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణా రావు జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-28 21:03:43

పండుగలా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ..

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి  ఉరందూరులో  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ప్రజల హర్షద్వానాల  నడుమ ఉప్పొంగిన అభిమానంతో వెల్లువలా  వచ్చిన ప్రజానికంతో బహిరంగ సభ విజయవంతమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలుత బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించి సభా వేదికకు చేరుకొన్న ముఖ్యమంత్రికి ప్రజలు పెద్ద ఎత్తున కరతాళద్వనులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త స్వాగత ఉపన్యాసం చేయగా, శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి  అద్యక్షత వహించగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా  రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు ప్రసంగించిన  అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరగగా, ముఖ్యమంత్రికి  జ్ఞాపికను జిల్లా యంత్రాంగం తరపున మంత్రులు, శాసన సభ్యులు, కలెక్టర్ సత్కరించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ లు రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపిా‌ఐఐసి చైర్ పర్సన్ రోజా, శాసన సభ్యులు కరుణాకర రెడ్డి, ఆదిమూలం, నవాజ్ బాషా, ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, వెంకటే గౌడ్, ఆరణి శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలకులు తలశీల రఘురాం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్లు డి. మార్కండేయులు, వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Srikalahasti

2020-12-28 20:11:57

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సాదర వీడ్కోలు..

‘నవరత్నాల లో బాగంగా పేదలందరికీ ఇళ్లు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గం,శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు గ్రామ పంచాయతీ నందు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేసి తిరిగి  మధ్యాహ్నం 2.20  గంటలకు   సభా స్థలం నుండి బయలుదేరి ఊరందురు గ్రామాం నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న  రాష్ట్రముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి సదార వీడ్కోలు పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  కె.నారాయణ స్వామి,  రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు  జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, శాసన సభ్యులు శ్రీకాళహస్తి,బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి, భూమన కరుణాకర రెడ్డి,  సత్యవేడు ఆదిమూలం, జిల్లా కలెక్టర్ డాక్టరు నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి,ముఖ్యమంత్రి కి  వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఊరందురు హెలిప్యాడు నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

Srikalahasti

2020-12-28 20:10:23

అన్నివర్గాల సంక్షేమమే వైఎస్సార్సీపీపీ లక్ష్యం..

 అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణ స్వామి తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఉరందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  లాంఛనంగా ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రను సృష్టించారని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ పథకాల నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు.           రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక . . పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం అని, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీకి డిసెంబర్ 25న శ్రీకారం చుట్టి 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అధికారం లోకి వచ్చిన 18 నెలల్లోనే 90 శాతం మ్యానిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 2,45,633 ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం 1896.26 ఎకరాల ప్రభుత్వ భూమిని 1862.11 ఎకరాల పట్టా భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. టిడ్కో ద్వారా 9,730 మందికి, 94,128 మందికి పొసెషన్ సర్టిఫికేట్లు అందించడం జరుగుతున్నదని, నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.           రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు మాట్లాడుతూ సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి నవరత్నాలు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే మహోన్నత కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ మన రాష్ట్రానికే చెందుతుందని, ఈ కార్యక్రమం అనంతరం 17,500 వై.ఎస్. ఆర్ జగనన్న కాలనీలు ఏర్పడతాయని, వీటిలో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.               శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమైన విషయం అని ఈ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ ఏ సంక్షేమ పథకం ద్వారా పొందే లబ్ధినైనా మహిళలకే చెందేలా పథకాల రూపకల్పన జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తిలో నేడు పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాలకు కేటాయించిన భూమికి మంచి మార్కెట్ విలువ కలదని, ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ళు కేటాయించడం అదృష్టమని, ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మినీ శ్రీకాళహస్తిగా మారనున్నదని సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్.ఎస్. కెనాల్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.    చిత్తూరు జిల్లాలో మరో బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టం అని మొదట 2020 జనవరి 9 న అమ్మఒడి కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగిందని, మరోమారు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభించడం జిల్లా ప్రజలు చేసుకున్నా అదృష్టం అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,760 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నామని, తద్వారా 2,46,631 మందికి లబ్ధి చేకూరననుంది. భూ సేకరణ నిమిత్తం పరిహారం కింద రూ.343.26 కోట్లు చెల్లించాం. 3,760 ఎకరాల్లో . . చిత్తూరు అర్బన్ లో 117.31 ఎకరాలు, చిత్తూరు రూరల్ లో 225.95 ఎకరాలు ఉంది. ఈ మొత్తం లో 1903.9 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా . . 1856.47 ఎకరాలు డి కె టి . . పట్టా భూమి ఉంది. రూరల్ ప్రాంతాల్లో 1,81,661 మంది, అర్బన్ ప్రాంతాల్లో 64,970 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 1,267 లే అవుట్లు కలవు . .  చిత్తూరు రూరల్ పరిధిలో 1,206, అర్బన్ పరిధిలో 61 లేఔట్లు ఉన్నాయి. వీటిలో 54,242 ఇంటి పట్టాలు, 10,728 టిడ్కో పట్టాలు ఉన్నాయి. రూరల్ లో 87,533 ఇంటి పట్టాలు ఉన్నాయని తెలిపారు.   

Srikalahasti

2020-12-28 20:04:20

మల్టీలెవర్ కార్ పార్కింగ్ పనుల పరిశీలన..

మహావిశాఖ నగర పాలక సంస్థ జగదాంబ వద్ద నిర్మించిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ట్రయల్ రన్ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ జివిఎంసి కమిషనర్ జి. సృజనతో కలసి సోమవారం పరిశీలించారు.  9.70కోట్లు వ్యయంతో నిర్మితమవుతున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ లో ఐదు కారిడార్లు నిర్మిస్తుండగా ఒక్కొక్కదానిలో 20 కారులు చొప్పున 100 కారులు పార్కింగ్ చెయ్యవచ్చని కమిషనర్ మంత్రికి వివరించారు. ఈ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని ఈ నేలాఖరకు పూర్తిచేసి వినియోగించేందుకు అందుబాటులోనికి తీసుకువస్తామని కమిషనర్ మంత్రికి  వివరించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్  కుమార్ మాట్లాడుతూ, ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ తో చాలా వరకూ ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందన్నారు. ముఖ్యమైన కూడలి జగదాంబలో ఇలాంటి అత్యాదునిక వ్యవస్థ రూపొందించడం వలన ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అన్నాకు. కార్యక్రమంలో జివిఎంసి ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, జోనల్ కమిషనర్ ఫణిరాం తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-12-28 19:45:12

డయల్ యువర్ కమిషనర్ కు 24 ఫిర్యాదులు..

మహా విశాఖ నగర పాలక సంస్థ నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని అడిషనల్  కమిషనర్ అవ్వారి వెంకట రమణి అధికారులను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి.  ప్రధాన  కార్యాలయం లో  డయల్  యువర్ కమిషనర్  ప్రోగ్రామును  అడిషనల్  కమిషనర్ , టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా  నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ఈ డయల్ యువర్ కమిషరక్ కి 24 వచ్చిన ఫిర్యాదులను ఆయ శాఖలు, జోన్లకు బదలాయించారు. ఈ సందర్భంగా ఏడిసి మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన స్పందనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో సమాచారం అందించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన  కార్యక్రమానికి ఇందులో 1వ జోనుకు సంబందించి 02,  2వ జోనుకు సంబందించి 04, 3వ జోనుకు సంబందించి 04, 4వ జోనుకు సంబందించి 05, 5వ జోనుకు సంబందించి 03, 6వ జోనుకు సంబందించి 06, మొత్తము 24 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ సమావేశంలో డి.సి.(ఆర్.) రమేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, సిటీ ప్లాన్నర్ ప్రభాకర్, డి.సి.ఆర్. ఫణిరాం, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్ (ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు, డి.పి.ఓ. చంద్రిక, యు.సి.డి. (ఎ.పి.డి.) సూర్యకళ, తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-12-28 19:29:38

ఇళ్ట పట్టాలు పంపిణీ చేసిన తహశీల్దార్..

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సోమవారం   జి.మాడుగుల మండలం  తాహశీల్దార్ చిరంజీవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పధకాలన్నిటినీ ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని  ఒక ఇంటి నిర్మాణానికి  రూ.1,80,000 ఖర్చు అవుతుందని అన్నారు. జి.మాడుగుల మండలం లో 53 మందికి ఇళ్ల పట్టాలు ఈరోజు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు.  జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయతీ   నుండి 47 గురు,  గుల్లిపాడు గ్రామం నుండి పాంగి కుమారి, పాంగి లక్ష్మి, ఉగ్గంది వరలక్ష్మి, వంజిర గ్రామం నుండి  6 గురు  పాంగి శిరీషా, పాంగి సుండ్రి మొ.గు వారు ఈరోజు  పట్టాలు అందుకున్నారు.   ఈకార్యక్రమంలో  191 మందికి ROFR పట్టాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో 300 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

జి.మాడుగుల

2020-12-28 19:15:42

1.8లక్షల మందికి పట్టాలు పంపిణీ..

న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా అర్హులైన పేద‌లంద‌రికీ ప్ర‌భుత్వం ఇళ్లు మంజూరు చేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ చెప్పారు.  దీనిలో భాగంగా జిల్లాలో ల‌క్షా, 08వేల‌, 230 మంది ల‌బ్దిదారుల‌కు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ఈనెల 30న జిల్లాకు వ‌స్తున్నార‌ని చెప్పారు. క‌లెక్ట‌రేట్ స‌మావేశ‌మందిరంలో సోమ‌వారం నిర్వ‌హించిన‌ మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్‌ వివ‌రించారు.   జిల్లాలో మొత్తం ల‌క్షా, 08వేల‌, 230 మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీని ఈనెల 25న ప్రారంభించామ‌ని, జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని చెప్పారు. న‌వ‌ర‌త్నాల్లో భాగ‌మైన పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న 71,249 మందికి, అలాగే 90 రోజుల కార్య‌క్ర‌మం క్రింద స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ 3,659  మందికి, మొత్తం 74,908 మందికి ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేశామ‌ని తెలిపారు. అదేవిధంగా 8,048 మందికి టిట్కో ఇళ్లు, గ్రామ‌కంఠాలు త‌దిత‌ర చోట్ల నివాసం ఉంటున్న‌‌‌ 25,261 మందికి,  ఆక్ర‌మిత స్థ‌లాల్లో ఉన్న 13 మందికి పొజిష‌న్ పట్టాల‌ను  మంజూరు చేసిన‌ట్లు వివ‌రించారు. ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1164 లేఅవుట్ల‌ను రూపొందించామ‌న్నారు. భూసేక‌ర‌ణ‌కు సుమారు రూ.228కోట్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. తొలిద‌శ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.1769 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని, 18 నెల‌ల్లో వీటిని పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ల‌బ్దిదారుల్లో 10355 మంది ఎస్సీలు, 7660 మంది ఎస్‌టిలు, 73,970 మంది బిసిలు, 6300 మంది ఓసిలు ఉన్నార‌ని చెప్పారు. టిట్కో ల‌బ్దిదారుల్లో 300 చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్ల ల‌బ్ద‌దారులు 5568 మంది, 365 చ‌ద‌ర‌పు అడుగుల ల‌బ్దిదారులు 643 మంది, 430 అడుగుల ల‌బ్దిదారులు 1840 మంది ఉన్నార‌ని కలెక్ట‌ర్ తెలిపారు.             విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం, కొండ‌క‌ర‌కాం, జ‌మ్మునారాయ‌ణ‌పురం, సారిక వ‌ద్ద  మొత్తం 554.82 ఎక‌రాల భూమిని సేక‌రించి, సుమారు రూ.5.75 కోట్ల ఖ‌ర్చుతో  నాలుగు లేఅవుట్ల‌ను  రూపొందించామ‌ని, మొత్తం 21,945 మందికి ప‌ట్టాలు ఇస్తున్నామ‌ని చెప్పారు. వీరిలో న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కం క్రింద 19,662 మంది, స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 2,283 మంది, టిట్కో ల‌బ్దిదారులు 3,776 మంది ఉన్నార‌ని చెప్పారు. టిట్కో ల‌బ్దిదారుల్లో 300 చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్ల ల‌బ్దిదారులు 2016 మంది, 365 చ‌ద‌ర‌పు అడుగుల ల‌బ్దిదారులు 448 మంది, 430 అడుగుల ల‌బ్దిదారులు 1312 మంది ఉన్నార‌ని చెప్పారు.            గుంక‌లాం లేఅవుట్‌లో 12,301 మందికి ఈనెల 30న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌నరెడ్డి ప‌ట్టాల‌ను పంపిణీ చేసి, పేద‌ల సొంతింటి క‌ల‌ను నిజం చేయ‌నున్నార‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోజు ఉద‌యం 11.10 గంట‌ల‌కు జిల్లాకు వ‌చ్చి, సుమారు 1 గంట వ‌ర‌కు ఉంటార‌ని, ముందుగా పైలాన్‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం, పట్టాల‌ను పంపిణీ చేసి, ల‌బ్దిదారుల‌తో ముఖాముఖిలో పాల్గొంటార‌ని చెప్పారు. సుమారు 397.36 ఎక‌రాల విస్తీర్ణంలోని ఈ లేఅవుట్‌ను 6 బ్లాకులుగా, రూ.4,36,73,186 ఖ‌ర్చుతో అభివృద్ది చేశామ‌న్నారు. దీనిలో 102.50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి కాగా, 428 మంది రైతుల‌నుంచి రూ.1,01,72,67000 ను ప‌రిహారం చెల్లించి 294.86 ఎక‌రాల అసైన్డ్ భూమిని సేక‌రించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాలు, వ‌స‌తుల‌తో ఈ లేఅవుట్‌ను అభివృద్ది చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.           ప‌ట్టాల పంపిణీ నిరంత‌ర కార్య‌క్ర‌మంగా కొన‌సాగుతుంద‌ని, అర్హులు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో ఇళ్ల స్థ‌లాన్ని మంజూరు చేస్తామ‌ని క‌లెక్టర్ అన్నారు. అవ‌స‌ర‌మైతే భూమిని సేక‌రించి ఇస్తామ‌ని, పేద‌లు అందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ట్టాల పంపిణీలో గానీ, ల‌బ్దిదారుల ఎంపిక‌లో గానీ ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావులేద‌ని, అటువంటివి త‌మ దృష్టికి వ‌స్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ల‌బ్దిదారుల జాబితాను ప్ర‌తీ స‌చివాల‌యంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచామ‌ని చెప్పారు. జిల్లాలో ప‌ట్టాల పంపిణీకి లేఅవుట్ల‌ను సిద్దం చేసిన రెవెన్యూ యంత్రాంగాన్ని, స‌ర్వే శాఖ‌ను, పంచాయితీరాజ్‌, డ్వామా త‌దిత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మ‌నఃస్ఫూర్తిగా అభినందించారు. అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని, ప‌ట్టాల‌పంపిణీకి ల‌బ్దిదారులు త‌ర‌లిరావాల‌ని కోరారు. దీనికోసం ప్ర‌భుత్వప‌రంగా వాహ‌న స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. వ‌చ్చే ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. మీడియా స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ ఎడి డి.రమేష్, ఎఫ్‌.సెక్ష‌న్ సూప‌రింటిండెంట్ టి.గోవింద‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-28 19:03:00

ముఖ్యమంత్రి పర్యటనకు పక్కా ఏర్పాట్లు..

 నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమం క్రింద పట్టాల పంపిణీకి ఈ నెల 30న  జిల్లాకు విచ్చేయచున్నరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  అధికారులకు ఆదేశించారు.  సోమవారం గుంకలాం లే అవుట్ లో జరుగుతున్న ఏర్పాట్లను డి.ఐ.జి. కె.వి. రంగారావు, వై.సి.పి. కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, సి.ఎం. భద్రతా విభాగం అధికారులు, జిల్లా అధికారులతో కలసి పర్యవేక్షించారు.  వేదిక వద్ద నిర్మాణంలో వున్న పైలాన్, మోడల్ హౌస్, హెలిపేడ్ లబ్దిదారుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.  వేదికపై  ప్రోటోకాల్ ప్రకారంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వేదికకు అనుకొని గ్రీన్ రూమ్, టాయిలెట్ తదితర సౌకర్యాలు వుండాలని తెలిపారు.  హెలిపేడ్ నుండి  ముఖ్యమంత్రి గారి ల్యాండింగ్, పైలాన్ కు, వేదికకు చేరుకొనే రూట్ ను పరిశీలించారు.  పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లైవ్ లో అందరూ చూసేలా వేదికపైన, బ్లాకుల మద్యలో ఎల్.ఇ.డి. తెరలను ఏర్పాటు చేయాలన్నారు.  పబ్లిక్ అడ్రిస్ సిస్టం, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని, అదనపు జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్, సమాచార ఇంజనీరింగ్ అధికారుకు సూచించారు.  ప్రతీ బ్లాకునకు ఇన్ఛార్జిలుగా తహశీల్లార్లు వుండాలని, వారికి సహాయక సిబ్బందిని నియమించి బ్లాక్ల వారీగా విధులు కేటాయించాలని, సచివాలయల సిబ్బంది సహకారంతో లబ్దిదారులను వారికి కేటాయించిన ప్లాట్లలో కూర్చోపెట్టాలని తెలిపారు.  ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా త్రాగునీరు, బిస్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు.  ఈ ఏర్పాట్లన్ని మంగళవారం నాటికి పూర్తి చేసుకొవాలన్నారు.  అధికారులంతా సమన్వయతో ఎప్పటికప్పుడు చెక్ లిస్టు వ్రాసుకొని ఏలాంటి లోపాలు లేకుండా పనిచేయాలన్నారు.  అధికారులు, లబ్దిదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వినియోగించేలా చూడాలన్నారు.  ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్లు  డా.జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జె.వెంకటరావు, సహాయ కలెక్టర్ కె.సింహాచలం, పోలీస, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2020-12-28 19:00:29