విజయనగరం జిల్లాలోని పరిశ్రమల్లో భద్రత విషయమై ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అన్ని పరిశ్రమలు ప్రమాదాలకు అవకాశాలకు లేకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు అన్నారు. జామి మండలం అన్నంరాజుపేటలోని శ్రీచక్ర సిమెంటు పరిశ్రమను జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. పారిశ్రామిక భద్రత విషయంలో ప్రభుత్వం రాజీలేని ధోరణి అవలంబిస్తోందని, ఆయా పరిశ్రమలు తమ పరిశ్రమల్లో చేపట్టిన భద్రతా చర్యలపై తమ కమిటీకి నివేదిక ఇవ్వాలన్నారు. శ్రీచక్ర సిమెంట్స్‌లో చేపట్టిన భద్రత చర్యలపై పరిశ్రమ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు, బృందం సభ్యులకు వివరించారు. ఈ బృందంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోట ప్రసాదరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ బి.సుదర్శనం, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహావిశాఖ నగరవాసులు సురక్షిత, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రముఖ సంఘసేవకులు సాన రాధ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో చాలా మంది ప్రజలకు ఎంతో నష్టపోయారని ఇలాంటి సమయంలో దీపావళి పండుగను అసలైన దీపాల సమూహంతోనే నిర్వహించుకోవాలన్నారు. ఒక వేళ టపాసులతో దీపావళి చేసుకున్నప్పటికీ కాలుక్ష్యం తక్కువగా వుంటే పటాలసుతో దీపావళి జరుపుకోవాలన్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్టు దీపావళి చేసుకునే సమయంలో అంతా పరిశుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి తప్పితే ఎవరూ శానిటైజర్లు ఉపయోగించకూడదన్నారు. శానిటైజర్లలో మండే స్వభావం కలిగిన ఆల్కాహాలు ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా వుంటాయన్నారు. అంతేకాకుండా దీపావళి జరుపుకునే సమయంలో అందరూ కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. ఎక్కువగా దీపాల సమూహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకొని అసలైన దీపావళిని జరుపుకోవడానికి అంతా ముందుకు రావాలని సాన రాధ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణహిత దీపావళి జరుపుకోవడానికి జిల్లా ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సామగ్రి విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంను శుక్ర వారం కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సామగ్రి విక్రయం అనంతరం మైదానాన్ని శుభ్రం చేయాలని, అందుకు అవసరమైతే వినియోగ ఛార్జీలను వసూలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న విక్రయాలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం పాటించాలని, దీపావళి సామగ్రి కొనుగోళుకు వచ్చే వ్యక్తులు భౌతిక దూరం పాటించుటకు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసారు. ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే మైదానంలో అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని లాటరీ విధానంలో కేటాయింపు చేస్తారని తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్) మాత్రమే అనుమతించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళి సామగ్రిని 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విక్రయించుటకు అనుమతించినట్లు కలెక్టర్ చెప్పారు. సామగ్రి కొనుగోళుకు వచ్చే వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. దీపావళి వేడుకలను 14వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావళి వేడుకలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షిత చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కోవిడ్ కాలంలో శానిటైర్ల వినియోగం అలవాటు ఉందని, అయితే శానిటైజర్లు పూసుకుని టపాసులు వెలిగించే ప్రయత్నం చేయరాదని సూచించారు. దీపావళి రోజున ప్రజలు ఇంటివద్దనే ఉన్నందను సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు వై.వి.ప్రసాద్, పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కళాశాలలు కోవిడ్ నింబంధనలు పాటిస్తూ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలకు ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసారు. ప్రతి పాఠశాల, కళాశాల ప్రవేశ ద్వారం వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ “ హోర్డింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులoదరికీ కరోనాపై జాగ్రత్తలు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రత పై పోస్టర్లు లేదా ఫ్లెక్స్ లను అసెంబ్లీ పాయింట్ వద్ద, తరగతి గదుల లోపల అతికించాలని అన్నారు. క్లాసు రూoలను సోడియం హైపోక్లోరైడ్ తో పరిశుభ్రపరచాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడరుతో పరిశుభ్రపరచాలని ఆయన స్పష్టం చేసారు. జూనియర్ కాలేజీలో 50 శాతం విద్యార్థుల వరకు మాత్రమే హాజరు కావాలని, ప్రతి తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని ఆయన సూచించారు. డిగ్రీ కాలేజీలో 33 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని, 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున నెలలో 3 బ్యాచ్ లుగా విద్యార్థులను విభజించి తరగతులు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని అన్నారు. ఇతర విద్యార్థులకు ఆన్ లైన తరగతులు నిర్వహించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులoదరూ జగనన్న విద్యా కానుకగా యిచ్చిన ఏకరూప దుస్తులు, బూట్లు విధిగా తప్పని సరిగా ధరించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలలకు హాజరుయ్యే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు హాజరుయ్యే సిబ్బంది, విద్యార్ధులు ఎవరికైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తదితర ఆరోగ్య సమస్య ఉంటే సమీప వార్డ్ సచివాలయ హెల్త్ సెక్రెటరీకి గానీ, వైద్యునికి గారికి గానీ వెంటనే సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేసారు. కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాత ఎవరికైనా “ కరోనా పాజిటివ్ “ గా నిర్ధారణ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, హెల్త్ సెక్రెటరీ లేదా వైద్యుడికి తెలియజేసి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ హోమ్ ఐసోలేషన్ కిట్లను పొంది ఉపయోగించాలని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణహిత దీపావళి జరుపుకోవడానికి జిల్లా ప్రజలు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. దీపావళి సామగ్రి విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంను శుక్ర వారం కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సామగ్రి విక్రయం అనంతరం మైదానాన్ని శుభ్రం చేయాలని, అందుకు అవసరమైతే వినియోగ ఛార్జీలను వసూలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న విక్రయాలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాల మధ్య ఆరు మీటర్ల దూరం పాటించాలని, దీపావళి సామగ్రి కొనుగోళుకు వచ్చే వ్యక్తులు భౌతిక దూరం పాటించుటకు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేసారు. ఈ ఏడాది 20 దుకాణాలకు మాత్రమే మైదానంలో అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిని లాటరీ విధానంలో కేటాయింపు చేస్తారని తెలిపారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్) మాత్రమే అనుమతించడం జరిగిందని, నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దీపావళి సామగ్రిని 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విక్రయించుటకు అనుమతించినట్లు కలెక్టర్ చెప్పారు. సామగ్రి కొనుగోళుకు వచ్చే వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. దీపావళి వేడుకలను 14వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావళి వేడుకలలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షిత చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. కోవిడ్ కాలంలో శానిటైర్ల వినియోగం అలవాటు ఉందని, అయితే శానిటైజర్లు పూసుకుని టపాసులు వెలిగించే ప్రయత్నం చేయరాదని సూచించారు. దీపావళి రోజున ప్రజలు ఇంటివద్దనే ఉన్నందను సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి.జె.డి.ఎస్.ప్రశాంత్ కుమార్, తహశీల్దారు వై.వి.ప్రసాద్, పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల భూసేకరణను నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పలు సాగునీటి ప్రాజెక్టులు, మినీ రిజర్వాయర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేపట్టిన భూసేకరణపై సంబంధిత రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఓ మార్గదర్శకాలపై అధికారులకు ముందుగా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన వివరాలు, ప్రస్తుత పరిస్థితిని ఆయా ప్రాజెక్టుల వారీగా జెసి కిశోర్ అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి, వెంగళరాయసాగర్, గుర్లగెడ్డ, కంచరగెడ్డ, అడారుగెడ్డ, గడిగెడ్డ, గుమ్మిడిగెడ్డ ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎంతవరకు భూ సేకరణ జరిగిందీ, ఇంకా సేకరించాల్సిన భూమి, భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. సిఎఫ్ఎంఎస్ విధానం కారణంగా, భూసేకరణకు సంబంధించిన కొన్ని వివాదాలను పరిష్కరించడంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని రెవెన్యూ అధికారులు జెసికి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కోసం ఇంకా మిగిలిఉన్న భూసేకరణను, నిర్ణీత కాలవ్యవధిని ఏర్పాటు చేసుకొని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇక్కడి నిర్వాసితులకోసం నిర్మిస్తున్న లేఅవుట్లను, ఇళ్ల నిర్మాణాన్ని, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసి, వారికి అప్పగించాలని జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.వెంకటేశ్వర్లు, కెబిటి సుందరి, హెచ్‌వి జయరామ్, సాల్మన్ రాజు, వివిధ ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో రైస్ కార్డుల జారీలో వేగం పెంచాలని, నిరీక్షణ జాబితా సంఖ్య తగ్గించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను జేసీ కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైస్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్ష చేశారు. నిరీక్షణ జాబితా ఎక్కువుగా ఉంటుందని, దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని సూచించారు. సచివాలయంలో నమోదు అయిన వెంటనే పరిశీలించి త్వరితగతిన కార్డు జారీ చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు వీఆర్వోలను ఫీల్డ్ కి పంపిస్తూ సమస్యను సత్వరమే పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అందరూ తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి దీపావళి పండుగలో ఎటువంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్ లో ఆయనతో పాటు, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేఖర్, విజయనగరం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఒకటిరెండూ కాదు ఏకంగా 234 కుటుంబాల్లో దీపావళి పండుగ మూడురోజులు ముందే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వారి ఇళ్లలో ఒక్కసారిగా ఆనందం వెళ్లివిరిసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని రెండో విడత ఖాళీల భర్తీ ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందుగా 234 మంది పశువైద్య సహాయకులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ నియామక పత్రాలను అందజేశారు. ఎట్టిపరిస్థితిలోనూ దీపావళి పండుగకంటే ముందుగానే, అభ్యర్థులకు నియామక పత్రాలివ్వాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారులు అభ్యర్థులకు హుటాహుటిన ఇంటర్వ్యూలు నిర్వహించి, మెరిట్ ప్రకారం ఖాళీలను భర్తీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 234 ఖాళీలను భర్తీ చేయగా, అర్హులు లేకపోవడంతో ఇంకా 148 ఖాళీలు మిగిలిపోయాయి. ఉద్యోగాలు పొందినవారికి తన ఛాంబర్‌లో గురువారం నియామకపత్రాలు అందజేసిన కలెక్టర్, ప్రతీఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎంవిఏ నర్సింహులు, డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ కన్నంనాయుడు, పశువైద్యులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి ముంగిటికే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమీషన్ సంయుక్తంగా మహిళలకు న్యాయవిజ్ఞానంపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా కలెక్టర్ జె నివాస్ తో కలసి ఐ సి డి ఎస్ రూపొందించిన పిల్లల దత్తతకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఇంటి వద్దకే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, మండల ప్రధాన కేంద్రాలు, గ్రామ స్థాయిలలోని మూరుమూల ప్రాంతాలలో సైతం మహిళా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. హిందూ వివాహ చట్టంపైన, ఎస్.సి, ఎస్.టి. అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కులు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. 18 సం.ల లోపు వయస్సు గల ఆడపిల్లలను వివాహం చేసుకున్న 21 సం.లు దాటిన మగపిల్లవాడు కూడా శిక్షార్హుడని తెలిపారు. పుట్టుకతోనే ఆడపిల్లకు ఆస్తిహక్కు సంక్రమిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు చట్టాలపై అవగాహన లేకపోవడం ద్వారా హక్కులు, న్యాయాన్ని పొంద లేక పోతున్నారన్నారు. ఎస్ సి ఎస్. టి అట్రాసిటీ కేసులో బాధితులకు కంపెన్సేషన్ వస్తుందని చెప్పారు. ముందుగా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకోవాలని, ఆతేదీ నుండి నష్టపరిహారాన్ని పొందవచ్చునని తెలిపారు. బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస వంటి చట్టాలపై అవగాహన కలిగివుండాలన్నారు. న్యాయాన్ని ఎవరి ద్వారా పొందాలి, ఎక్కడ పొందాలి అనే విషయాలు ముందుగా తెలుసు కోవాలన్నారు. మహిళల పరిరక్షణ కోసం గ్రామ స్థాయిలో ని మహిళా పోలీస్ ల నియమించడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో బాగా పని చేస్తున్నారని కరోనాను అరికట్టడంలో మహిళలు ప్రముఖపాత్ర వహించారని తెలిపారు. జిల్లాలో 70 శాతం మహిళలు మంచి సేవలందించారని తెలిపారు. సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మాట్లాడుతూ, దిశా చట్టం మహిళా పోలీస్ లు మహిళల రక్షణకు ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో ఫ్యామిలీ లా కి సంబంధించిన విషయాలపై అడ్వకేట్ కమ్ రిసోర్స్ పర్సన్ డి. విజయ లక్ష్మి అవగాహన కలిగించారు. మహిళా రక్షణ, రాజ్యాంగం, క్రిమినల్ లా, సివిల్ రైట్స్ అంశాలపై అడ్వకేట్ కం రిసోర్స్ పర్సన్ డి. సరళ కుమారి అవగాహన కలిగించారు. వైద్య పరమైన అంశాలపై డా. రామ్ మోహన్ రావు, డా. జ్యోత్స్న, డా. ఇందిర అవగాహన కలిగించగా, ఐ సి డి ఎస్ పి డి జయదేవి దిశా చట్టం, వన్ స్టాప్ సెంటర్, తదితర అంశాలు వివరించారు.
ఇచ్చాపురం సి.డి.పి.ఓ. నాగరాణి మాట్లాడుతూ, తన కార్యాలయంలో పనిచేస్తున్న వర్కర్ కు మూగ. చెవిటి పిల్లవాడు పుట్టడంతో ఆమెను ఆమె భర్త వదిలివేసాడని, ప్రస్తుతం ఇల్లు గడవడం కష్టంగా వుందని, ఆమెకు న్యాయ సహాయం అందించే విధానంపై సలహాను అడిగారు. ప్రధాన న్యాయమూర్తి స్పందించి, మండల స్థాయిలోని న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని, ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. రణస్థలం సి.డి.పి.ఓ. జి.లక్ష్మి మాట్లాడుతూ, తమ కార్యాలయపు వర్కరుకు కేన్సర్ వచ్చిందని, ఆమె భర్త ఆమెను వదిలివేసేడని, ఆమెకు ఒక బిడ్డ వున్నాడని, ఆమెకు న్యాయ సహాయంపై సలహా అడిగారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకుని ఉచిత న్యాయాన్ని పొందవచ్చునని, ప్రభుత్వం నుండి ఆమె వైద్య ఖర్చులను పొందవచ్చునని ప్రధాన న్యాయ మూర్తి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెకెండ్ అడిషనల్ జడ్డ్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్.పి. విఠలేశ్వరరావు, లోక్ అదాలత్ శాశ్వత అధ్యక్షులు సత్యన్నారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, , ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఛైల్డ్ ప్రోటెక్షన్ అధికారి రమణ, సి.డి.పిఓ.లు రిసోర్స్ పర్సన్ లు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో రీఆర్గనైజేషన్/కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న భవనాలు, మౌలిక సదుపాయాల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ నంద్యాలలో సుడిగాలి పర్యటన చేసి కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పడబోయే నంద్యాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ , జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటు కోసం వివిధ భవనాలను పరిశీలించారు. ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ గారి వెంట భవనాల పరిశీలనలో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్ అండ్ బి ఎస్ఈ జయరామి రెడ్డి లను వెంటబెట్టుకుని కొత్త కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించేందుకోసం నంద్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల భవనాల సముదాయాన్ని, కోర్టు భవనాల సముదాయన్ని, తాలూకా ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, ఎక్సయిజ్ ఆఫీసు, నూనెపల్లె, టెక్కే లలో ఉన్న మార్కెట్ యార్డుల భవనాలను, ఎస్.ఆర్.బీ.సీ. కాలనీ, విక్టోరియా రీడింగ్ రూమ్, జీఎం కాలేజీ, స్టేడియం, పశుసంవర్ధక శాఖ సెమెన్ బ్యాంక్ భవనాలు, ఆర్.ఏ.ఆర్.ఎస్, స్పిన్నింగ్ మిల్ తదితర వివిధ భవనాలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. అనంతరం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, వాటి విస్తీర్ణం, స్థితి గతులపై సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్లు, మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ, డిఎస్పీ చిదానంద రెడ్డి తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప లు చర్చించారు. సమీక్ష సందర్భంగా, నంద్యాల కేంద్రంగా కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోసం ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్న అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, వాటి చుట్టు కొలతలు, భవనాల స్థితిగతుల వివరాల అసెట్స్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించడానికి వీలుగా వెంటనే తనకు సబ్మిట్ చేయాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్&బి ఎస్ఈ జయరామి రెడ్డి లను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం, నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గడివేముల మండలం ఘని గ్రామంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన 13 మంది రైతులకు రూ.1.57 కోట్ల ఆర్థిక పరిహారపు బ్యాంకు చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పంపిణీ చేశారు.
సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయిన రైతులకు కు1.57 కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మీడియాతో మాట్లాడుతూ, గడివేముల మండలం గని గ్రామ రైతులు సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయారని ఈ 13 మంది రైతులకు1.57 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుందన్నారు. అందులోభాగంగానే..ఈ మొత్తం పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP డా..పక్కిరప్ప. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.
దీపావళిలో పర్యావరణహిత టపాసులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణహిత టపాసులకు మాత్రమే లైసెన్సులు జారీ చేస్తామని స్పష్టం చేసారు. టపాసులు కాల్చేటపుడు పూర్తి సురక్షిత చర్యలు చేపట్టాలని, అందుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శానిటైజర్ ఉపయోగించి టపాసులు కాల్చడం వలన అగ్ని ప్రమాదం సంబంధించవచ్చని పేర్కొన్నారు. రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఆర్డబ్ల్యుఎస్ ఇఇ చంద్ర శేఖర్, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, మత్స్య శాఖ జెడి పివి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో ఈ నెల 14వ తేదీన వై.ఎస్.ఆర్.కళ్యాణ ఫంక్షన్ హాల్ లో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బెజ్జిపురం యూత్ క్లబ్ డైరక్టర్ ఎం.ప్రసాదరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, జిల్లా పోలీసు సూపరెంటెండెంట్ అమిత్ బర్దార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అడిషనల్ ఎస్.పి. పి.సోమశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గౌరవ అతిధిగా ఎల్.రమేష్ జిల్లా పౌర సంబంధాల అధికారి హాజరుకానున్నారని తెలిపారు. ఆపరేషన్ మస్కాన్ ద్వారా గుర్తించిన ఏభై మంది పిల్లలకు కేష్ అవార్డ్, నిత్యావసర కిట్లు అందించడం ని, కార్యక్రమం ఉదయం 11 గం.లకు ప్రారంభం కానున్నదని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, ఐసిడిఎస్.అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని సదరు ప్రకటనలో తెలిపారు.
ప్రతీఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కాలుష్యాన్ని నియంత్రించడానికి వీలుపడుతుందని రెడ్ క్రాస్ ప్రతినిధి సత్యన్నారాయణ అన్నారు.గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీకాకుళం జిల్లా శాఖ రాష్ట్ర వైస్ చైర్మన్ & జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్. పి. జగన్మోహన రావు గారి ఆధ్వర్యంలో దమ్మల వీధి 38,39 డివిజన్లలో వార్డు సచివాలయం వాలంటీర్స్ సహకారంతో 113 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కల పెంపకంలో వార్డు వాలంటీర్లు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అడ్మిన్ జి. దుర్గా రావు, వి.ఆర్. ఓ. రోహిణి, ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ, హెల్త్ సెక్రటరీ విజయ చేతుల మీదుగా మొక్కలు నాటి వాలంటీర్స్ కి అందజేయడం జరిగింది, రెడ్ క్రాస్ సిబ్బంది సత్య నారాయణ, విజయ్, కోటేశ్వర రావు, శ్రీధర్, పవన్ , తవుడు మరియు వాలంటీర్స్ రోషిని, సంతోష్, కృపాని,భారతి, నజ్మ, శిరీష, మాధురి మొదలగు వారు పాల్గొన్నారు.
భారతదేశపు తొలి విద్యాశాఖామంత్రిగా విద్యలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన గొప్ప మానవతవాది, రచయత, బహు భాషా కోవిదులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాదేనని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. గురువారం బుడ్డా సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ కైకలూరు ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమంలో భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి పేర్ని నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అబుల్ కలాం విద్య రంగానికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అనేక పథకాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. నాడు-నేడు పధకం ద్వారా పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యార్ధులకు పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర సౌకర్యాలతో పాటు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తూ విద్యకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి చేయడమే కాక ఎన్నో విప్లవాత్మక విద్యా సంస్కరణలను అమలుపరిచేందుకు మౌలానా అబుల్ కలాం ఆజాదే అంకిత భావంతో పనిచేశారన్నారు . చిన్నపిల్లల్లో ప్రాథమిక విద్యను ప్రోత్సహించడానికి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాాణానికి జాతీయ కార్యక్రమాన్ని ప్రణాళికను రూపొందించి 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించే ఆలోచనను ఆయనే ముందుకు తెచ్చారని మంత్రి పేర్ని నాని వివరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బుడ్డా సాహెబ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలిబ్ బాబు , 15 వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ రఫీ , అనీస్, రెహమాన్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.