1 ENS Live Breaking News

నరేగా నిధులు పూర్తిగా వినియోగించాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద సమకూరుతున్న నిధులు శత శాతం సద్వినియోగం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు విచ్చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు చినతాతయ్యలతో కలసి సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ క్రింద నిధులు అధిక మొత్తంలో సమకూరుతున్నాయని, వాటిని వినియోగించుకుని వివిధ పనులు చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, సిసి రహదారులు, మురుగుకాలువలు తదితర పనులను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిధులు పూర్తి స్ధాయిలో వినియోగానికి తమ వంతు సహకారం ఉంటుందని చినతాతయ్యలు చెప్పారు. సకాలంలో సిమెంటు, ఇతర సామగ్రి అందాలని అందుకు ప్రధాన కార్యాలయం నుండి తగు సమన్వయం చేయడం ద్వారా సాధ్యం కాగలదని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంజనీర్లు తెలిపారు.            ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ కమీషనర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు, గ్రామీణ నీటిసరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు, పంచాయతీరాజ్ ఇన్ ఛార్జ్ పర్యవేక్షక ఇంజనీరు కె.ఎం.వి.ప్రసాద రావు, ఇడబ్యుఐడిసి, గిరిజన సంక్షేమ శాఖ, సమగ్ర శిక్షా అభియాన్ కార్యనిర్వాహక ఇంజనీర్లు వరుసగా కె.భాస్కర రావు, జి.మురళి, వి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-12 20:25:06

15న ఆ ఉద్యోగాలకు కంప్యూటర్ పరీక్ష..

విశాఖపట్నం జిల్లాలోని  వై.ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విభాగంలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులో అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 15న విశాఖలో కంప్యూటర్ పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖలోని డాక్టర్. ఎల్.బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో  పరీక్షలను నిర్వహిస్తామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి  డా. పి.ఎస్. సూర్యనారాయణ తెలిపారు . పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్ధి ఆధార్ కార్డును విదిగా తీసుకుని కాలేజీ ప్రాంగణానికి ఉదయం 9 గంటలకు సకాలంలో చేరుకోవాలి. అర్హులైన అభ్యర్ధులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల తాలూకా వివరాలను http://visakhapatnam.nic.in మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం లోని నోటీసు బోర్డులో  పొందుపరిచినట్టు డిఎంహెచ్ఓ తెలియజేశారు. నోటిఫికేషన్ లో ప్రకటించిన విద్యార్హతలు ప్రకారం ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే అర్హులు. డిప్లొమా ఇన్ ఫార్మసి అభ్యర్ధులు అర్హులు కాదని వివరించారు..

Dr. Lankapalli Bullayya College

2020-11-12 20:20:26

పి.శ్రీనివాసరావుకి జెఎన్టీయూ పీహెచ్డీ..

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం  పి.శ్రీనివాసరావు కి బుధవారం కాకినాడలో  పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది.  పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఆయన సిద్ధాంత వ్యాసం ‘‘మ్యూచువల్‌ ‌కప్లింగ్‌ ‌రిడక్షన్‌ ఇన్‌ ‌మిమో యాంటెన్నాస్‌’’ ‌జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈయనకు పిహెచ్‌డి ‘డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ’ అవార్డు ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ‌కమ్యూనికేషన్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగంలో లభించినది. పి.శ్రీనివాసరావు తన సిద్ధాంత వ్యాసాన్ని ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్‌ ఆన్స్ ‌కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ & ‌టెక్నాలజీ ఈసిఈ విభాగం ప్రొఫెసర్‌ ‌డా.కె.జగదీష్‌ ‌బాబు మరియు కాకినాడలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాకినాడ (యుసిఇకె) ఈసిఇ విభాగం ప్రొఫెసర్‌ ‌డా.ఏ.ఎం.ప్రసాద్‌ ‌ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. శ్రీనివాసరావుకి పీహెచ్డీ అవార్డు లభించడం పట్ల, సహచర అద్యాపకులు, ఇతరులు హర్షం ప్రకటించారు. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు..

కాకినాడ, జెఎన్టీయూ

2020-11-12 13:40:33

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..

ఖరీఫ్ సీజన్ లో రైతులకు గిట్టుబాటు ధరను అందించి, వారిని సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా  గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది పనిచేయాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. రైతుల వివరముల నమోదు, ధాన్యం నాణ్యత, ధాన్యం రకాలు, ధాన్యం కొనుగోలు విధానంపై గురువారం గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం స్థానిక సన్ రైజ్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 1 లక్ష 75 వేల మంది రైతులు ఉన్నారని, వీరిద్వారా ఖరీఫ్ సీజన్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యతను పరిశీలించి, సరైన గిట్టుబాటు ధరను అందించి రైతులు సంతోషంగా కొనుగోలు కేంద్రాల నుండి తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. రైతుల రిజిస్ట్రేషన్, రీషెడ్యుల్, రైస్ మిల్లర్ల వివరాలు , సార్టెక్స్ , నాన్ సార్టెక్స్ వంటి తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ధాన్యం సేకరణకు ఇంకా 15 రోజుల వ్యవధి ఉన్నందున మీ పరిధిలోని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్.బి.కెల ద్వారా ధాన్యం కొనుగోలు రిజిస్ట్రేషన్ దగ్గర నుండి నగదు చెల్లింపులు వరకు జరిగే ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఇందుకు గ్రామ వ్యవసాయ సహాయకులు ముందుగా ఈ నిర్వహణపై క్షుణ్ణంగా తెలుసుకోవాలని జె.సి వివరించారు. జిల్లాలో 70 శాతం మంది రైతులు ధాన్యంపైనే ఆధారపడి ఉన్నారని, కావున గ్రామ వ్యవసాయ సహాయకులు మిల్లర్ల వైపు నుండి కాకుండా రైతుల నుండి ఆలోచన చేయాలని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం  ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్న సంగతిని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. రాష్ట్రస్థాయి అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేపడుతున్న చర్యలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, అలక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని జె.సి ఆకాంక్షించారు.          ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, ప్రత్యేక ఉపకలెక్టర్ శైలజ, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్యనారాయణ, శిక్షకులు సహాయ మేనేజర్ ( టెక్నికల్ ) శిరీష, నీలిమ, సహాయ మేనేజర్ ( జనరల్ ) నరేంద్రబాబు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

శ్రీకాకుళం

2020-11-12 13:28:38

కె.రాధికకు జెఎన్టీయూ పీహెచ్డీ..

జవహర్ లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం కె.రాధికకు బుధవారం కాకినాడలో  పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. ఈ మేరకు ‘‘క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ‌మల్టీస్పెక్ట్రల్‌ ‌శాటిలైట్‌ ఇమేజస్‌ ‌యూజింగ్‌ ఎన్‌సెంబల్‌ ‌సబ్‌స్పేస్‌ ‌డిసిక్రిమినెంట్‌ ‌టెక్నిక్‌ ‌ఫర్‌ ‌ఛేంజ్‌ ‌డిటెక్షన్‌ అప్లికేషన్స్’’ ‌జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈమెనకు పిహెచ్‌డి ‘డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ’ అవార్డు ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ‌కమ్యూనికేషన్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగంలో లభించింది. కె.రాధిక తన సిద్ధాంత వ్యాసాన్ని చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోని ఎస్‌వియు కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ఈసిఈ విభాగం అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డా.ఎస్‌.‌వరదరాజన్‌ ‌గారి ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. రాధికకు పీహెచ్డీ అవార్డు లభించడం పట్ల, సహచర అద్యాపకులు, ఇతరులు హర్షం ప్రకటించారు. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు..      

కాకినాడ జెఎన్టీయూ

2020-11-12 13:15:41

వీరఘట్టం ఎంపీడీఓకి కలెక్టర్ షోకాజ్ నోటీస్..

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.పైడితల్లికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ షోకాజ్ నోటీసు జారీచేసారు. 9వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలో భాగంగా వీరఘట్టాం మండలం వండువ గ్రామ సచివాలయం సందర్శించారు. ఆ సమయంలో గ్రామ సచివాలయం ఆవరణలో ప్రదర్శించాల్సిన చేయూత, కాపు నేస్తం లబ్దిదారుల జాబితాను ప్రదర్శించలేదు. గ్రామ సచివాలయంలో ప్రదర్శించాల్సిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై  షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి బుధ వారం తెలిపారు. షోకాజ్ నోటీసుపై తగు సంజాయిషీని రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఎంపీడీఓకి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీచేయడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బందిలో కలకలం మొదలైంది. ఎంపీడీఓకే షోకాజ్ నోటీసు ఇస్తే..తప్పుచేసిన సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేస్తారంటూ ప్రచారం జరగడం విశేషం..

Veeraghattam

2020-11-11 21:49:46

పర్యావరణ రహితంగా దీపావళి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గనందున జిల్లాలోని ప్రజలందరూ పర్యావరణ హితమైన దీపావళి జరుపుకోవాలని జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్  పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఉత్తర్వులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రతిపాదనలు ప్రకారం కలెక్టరు కొన్ని సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిలో నున్నందున గాలిలో కాలుష్యం పెరిగినట్లయితే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది అన్నారు. కోలుకున్న వారి శ్వాసకోశాల పైన బాణసంచా కాలుష్యం  తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరించినట్లు కలెక్టర్ తెలిపారు. తక్కువ కాలుష్యాన్ని కలిగిన బాణసంచాను   మాత్రమే విక్రయించాలని, వాటిని మాత్రమే అందరూ ఉపయోగించాలన్నారు. బాణసంచా వెలిగించే సమయం  2 గంటలకు పరిమితం చేయబడిందని దీపావళి రోజున. రాత్రి 8.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు మాత్రమే బాణసంచాను వెలిగించాలి. బాణాసంచా   విక్రయించే అన్ని దుకాణాలు ప్రతి దుకాణం మధ్య 10 అడుగుల దూరాన్ని నిర్వహించాలి. క్రాకర్లను కొనుగోలు చేయడానికి వచ్చే వ్యక్తులు దుకాణాల ముందు క్యూలో 6 అడుగుల సామాజిక దూరాన్ని  పాటించేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలుదారులు దీపావళి వేడుకల సందర్భంగా హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించవద్దని   దాని స్థానంలో సాధారణ సబ్బును వాడాలని సూచించారు.  తగిన జాగ్రత్తలతో  పర్యావరణ హితమైన బాణసంచాను ఉపయోగిస్తూ జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్య దీపావళి  జరుపుకోవాలని కలెక్టరు కోరారు.

కలెక్టరేట్

2020-11-11 21:46:13

పద్మావతి వార్షిక బ్రహ్మోత్సవాలకు భద్రత కట్టుదిట్టం..

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో గట్టిబధ్రతా చర్యలు తీసుకున్నట్టు అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ,  కోవిడ్ దృష్ట్యా కోవిడ్-19 కారణంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతం అయినప్పటికి అనుకోని విధంగా భక్తుల రద్దీ పెరిగితే వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు జారీచేశామన్నారు. అంతేకాకుండా భద్రతా ఏర్పాట్లపై ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించినట్టు వివరించారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే సమయంలో కూడా కల్పించాల్సిన భద్రతపై కూడా ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో యస్.బి డి.యస్.పి గంగయ్య, ఈస్ట్ డి.యస్.పి మురళీకృష్ణ, ట్రాఫిక్ డి.యస్.పి మల్లికార్జున, తిరుచానూర్ సి.ఐ సుదాకర్ రెడ్డి, ట్రాఫిక్ సి.ఐ సురేష్ కుమార్ వారు పాల్గొన్నారు.

Tirupati

2020-11-11 21:33:10

శ్రీవిద్యానికేతన్ తిరుపతికి ఆక్స్ ఫర్డ్ లాంటిది..

తిరుపతి అర్బన్ ప్రాంతంలో  ఆక్సఫర్డ్ లాంటి శ్రీవిద్యానికేతన్ విద్యాలయం ఉండటంటం విద్యాభివ్రుద్ధికి నిదర్శనమని అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అన్నారు. శ్రీ విద్యానికేతన్ అధినేత డా.మోహన్ బాబు తో కలిసి శ్రీ సాయినాథ్ నగర్ రంగంపేట సంస్థ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు చాలా అద్రుష్టవంతులని మంచి వాతావరణంలో విద్య అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను అదిరోహించడానికి వీలుపడుతుందన్నారు. కష్టపడి చదివితే సాధించరానిది అంటూ ఏది లేదన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి తల్లిదండ్రులను గుర్తించుకొని చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలి. ముఖ్యంగా పోలీస్ కన్నా ముందు ఇక్కడ చదువు నేర్పే గురువులే మీకు తొలి భద్రత అన్నారు. వారి తరువాత తల్లిదండ్రులు, వీరి తరువాత పోలీస్ ఉంటారన్నారు.  ఉపాద్యాయులకు, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి క్రమశిక్షణతో, మంచి నడవడికతో ఉన్నత స్థితికి చేరే మార్గాలను చూసుకోవాలి. శ్రీ విద్యానికేతన్ విద్యాలయం తిరుపతి నగరానికి దూరంగా ఉండటం వలన భద్రతా పరమైన కారణాలతో ఇక్కడ చదువుకునే విద్యార్థులకు గాని, పరిసర ప్రాంతంలోని ప్రజలకు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 24X7 పోలీస్ సిబ్బంది ఉండేటట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇది శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం యొక్క సహకారంతో ఏర్పాటు చేశామన్నారు.విద్యార్థులకు గాని, ప్రజలకు గాని ఏదైనా అవసరం వచ్చినా, అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది సహకారం తీసుకోవచ్చునన్నారు. ఈ సందర్బంగా యస్.బి డి.యస్.పి గంగయ్య, వెస్ట్ డి.యస్.పి నరసప్ప, యూనివర్సిటీ సి.ఐ రవీంద్ర, యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి మరియు విద్యాలయ యాజమాన్య సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు. 

Tirupati

2020-11-11 21:20:42

విద్యాభివ్రుద్ధికి అబుల్ కలాం ఆజాద్ మార్గదర్శి..

భారత దేశపు తొలి విద్యాశాఖా మంత్రి గా విద్య లో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన గొప్ప మానవతవాది, రచయత, బహు భాష కోవిదులు భారతరత్న  మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.   వారి జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా మైనారిటీల సంక్షేమ దినోత్సవం గాను, జాతీయ విద్య దినం గానూ జరుపుకోవడం  వారికి ప్రభుత్వం  ఇచ్చే గౌరవమని తెలిపారు.  బుధవారం కలెక్టరేట్  ఆడిటోరియం లో భారత రత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  అంతకుముందు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వెలగపూడిలో మైనారిటీ దినోత్సవం వేడుకలను వీడియో  కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.  వీడియో  కాన్ఫరెన్స్ అనంతరం  కలక్టరేట్ ఆడిటోరియంలో  జరిగిన  కార్యక్రమంలో తొలుత  జ్యోతిని  వెలిగించి , అబుల్ కలాం చిత్రపటానికి పూల మాలలతో అలంకరించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  అబుల్ కలాం  విద్య రంగానికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకొని  రాష్ట్రం లో అనేక పధకాలను అమలు చేస్తున్నారని, ఆ పధకాలను జిల్లాలో  అమలు పరచే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని కలెక్టర్ అబిప్రాయ పడ్డారు.  నాడు-నేడు పధకం ద్వారా పాఠశాలల   మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యార్ధులకు పుస్తకాలు,యూనిఫారాలు , ఇతర సౌకర్యాలతో పాటు అమ్మ ఒడి,   జగనన్న విద్యా దీవన, జగనన్న వసతి దీవెన వంటి పధకాలను అమలుపరుస్తూ విద్యకు పెద్ద పీట వేయడం జరుగుతోందన్నారు.  ముస్లిం మైనారిటీల అభివృద్దికి వక్ఫ్ బోర్డు ద్వారా  ఆస్తులను రీ  సర్వీ చేయించి  డిజిటలైస్  చేయించడం ద్వారా పరిరక్షించడం జరుగుతోందన్నారు.  విజయనగరం లో  ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్ట్ ను  ముస్లిం ల విజ్ఞప్తి మేరకు  పూరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.         అభుల్ కలాం ఆజాద్ జయంతి రోజునే జిల్లాకు జలవనరుల నిర్వహణ లో జాతీయ అవార్డు రావడం ఆనందగా ఉందని కలెక్టర్ తెలిపారు.   జిల్లాలోని చెరువుల పరిరక్షణలో భాగంగా మన ఊరు- మన చెరువు, చెరువు శుద్ది కార్యక్రమాలు పెద్ద  ఎత్తున చేపట్టడం జరిగిందని,  అందుకు స్వచ్చంద సంస్థలు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు తోడ్పడ్డారని, సమిష్టి కృషితో జాతీయ గుర్తింపు లభించిందని హర్షం వెలిబుచ్చారు. సేవ భావం తో పని చేస్తే గుర్తింపు దానికదే వస్తుందని చెప్పడానికి  ఈ అవార్డే  ఉదాహరణ అన్నారు.  నీటి పరిరక్షణ వలన భావి తరాలకు  నీటి కష్టాలు ఉండవని, రైతులకు, పర్యావరణా నికి మేలు జరుగుతుందని, ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలని , అందుకు జిల్లా ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ లు డా. జి.సి.కిషోర్ కుమార్, జె. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతి రావు, ముస్లిం  ప్రతినిధులు ఎం.ఎ రహీం, బాషా, మునీర్, షేక్ కాసిం, హాజీ ఇక్బాల్, ఎస్.కే. కరీం, సుభాని, బషీర్, రషీద్, జోహార్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-11-11 21:19:10

గ్రీన్ విజయనగరంలో ప్రతీఒక్కరూ పాల్గొనాలి..

విజయనగరం జిల్లా కేంద్రం లోని ఏ.పి.ఐ.ఐ.సి. పారిశ్రామిక వాడ రోడ్డులో నిర్మించిన సెంటర్ డివైడర్ లో బుధవారం  ఉదయం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రీన్ విజయనగరం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చుట్టూ ఉన్న కలుపు మొక్కలును క్లియర్ చేస్తూ స్వచ్ఛ్ సేవలో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ఐదు మొక్కలు నాటి అవి చెట్లు అయ్యేదాకా సంరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వున్న ప్రతీఒక్కరూ తమ ఇంటిదగ్గరైనా ఈ విధంగా మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించడానికా అవకాశం వుంటుందన్నారు. కొనా కార్పస్ మొక్కలను హరిత విజయనగరం బృందం సభ్యులు మున్సిపల్ కమిషనర్ s.s.వర్మ,ఇంటెలిజెన్స్ డిఎస్సీ మధు, జనరల్ మేనేజర్ కె.ప్రసాద్ ,డిప్యూటీ డైరెక్టర్ ఆర్.పాపారావు,ఏడి సీతారాం ,ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బి.సుధాకర్, Dr. వెంకటేశ్వరరావు గారు,హరిత విజయనగరం కో.ఆర్డినేటర్ రామ్మోహన్, ఇండస్ట్రియల్ ఏరియా సిబ్బంది , ప్లాంటేషన్ రవి , సిబ్బంది పాల్గొన్నారు.

ఇండస్ట్రియల్ ఏరియా

2020-11-11 21:08:54

మైనార్టీలకు అండగా ప్రభుత్వం..

మైనారిటీలకు అండగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.  బుధవారం కలెక్టరేట్ లో  ఉప ముఖ్యమంత్రి పాత్రకేయులతో మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలామ్ కు ముఖ్యమంత్రి ఘన నివాళులు అర్పించారని తెలిపారు. భారత రత్న మౌలానా  అబుల్ కలామ్ ప్రధమ భారత విద్యా శాఖామాత్యులు, ఆదర్శనంతమైన రాజకీయ నాయకులు.  అని, అటునవంటి మహనీయుని జన్మదినాన్ని మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు.  ముస్లిమ్ లు  మరియు ఇతర మైనారిటీలకు దశల వారీగా  సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి అమలు చేయడం జరుగుతున్నదన్నదన్నారు.  నలుగురు  శాసన సభ్యులు  ముగ్గురు  శాసన మండలి సభ్యులు,  ఇందులో ఒక మహిళ కూడా వున్నారని తెలిపారు.  అంజాద్ భాషా  ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులుగా వున్నారని తెలిపారు.  మైనారిటీలు ఇతర  కమ్యూనిటీల సంక్షేమానికి సైతం ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని అన్నారు.    జిల్లాలో జిల్లా  కలెక్టర్, జే.సి ఇతర అధికారులంతా కార్యక్రమంలో పాల్గొని మౌలానా అబుల్ కలాంకు నివాళులర్పించారని తెలిపారు. మైనారిటీల అవసరాలను తెలుసుకుని, ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పారు. మైనారిటీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు.  ఇమాములు, మౌజన్లకు గౌరన వేతనం,  కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ సమయంలో పాస్టర్లు, ఇమామ్ లు,  మౌజాన్లకు ఆర్ధిక సాయం అంద చేయడం  జరిగిందని తెలిపారు.

Srikakulam

2020-11-11 21:06:15

అబ్దుల్ కలాం సేవలు చారిత్రాత్మకం..

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వీరోచితంగా పోరాటడంతోపాటు, విద్యాభివ్రుద్ధి తొలి బాటలు వేసిన మహనీయులు భారతరత్న అబుల్ కలాం ఆజాద్ అని తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ అన్నారు. బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  స్వాతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివ్రుద్ధికి ఎంతో క్రుషి చేశారన్నారు. ఆయన జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను, సేవలను ప్రతీ భారతీయుడు గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో యస్.బి డి.యస్.పి గంగయ్య గారు, డి.పి.ఓ ఏ.ఓ కే.వనజాక్షి గారు, డి.సి.ఆర్.బి సి.ఐ హేమసుందర్ నాయుడు, ఆర్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, మరియు డి.పి.ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

2020-11-11 19:15:30

మ‌త్స్య సంప‌ద యోజ‌న ద్వారా ఎంతో లబ్ది..

మ‌త్స్యకారుల‌కు మార్కెటింగ్ పై అవ‌గాహ‌న లేక ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని ఈ రంగంలో మ‌రిన్ని స‌దుపాయాలు పెంపొందించేందుకు  పిఎం మ‌త్స్య సంప‌ద యోజ‌న ద్వారా ఎంతో లబ్ది చేకూరనున్నట్లు  రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం కృష్ణాజిల్లాలోని 377 మత్స్య సహకార సొసైటీ లకు చెందిన అధ్యక్షులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో  మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి  నీలి విప్లవం సాధించేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)’  వివరించారు. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ. 20,050 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని  నిర్ణయించారని,  ఇందులో కేంద్ర వాటా రూ. 9,407 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 4880 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ. 5763 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల పాటు అమలు చేయనున్నారు . కృష్ణాజిల్లాకు రూ. 15. 68 కోట్లు ఈ ఏడాదికి కేటాయించారు. మత్స్య ఉత్ప‌త్తి, ఉత్పాద‌క‌త , నాణ్య‌త‌, సాంకేతిక‌త‌, పంట అనంత‌ర మౌలిక స‌దుపాయాలు, యాజ‌మాన్యం, ఆధునీక‌ర‌ణ‌ గురించి అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని  377 మత్స్య సహకార సంఘాల అధక్షులు, ఉపాధ్యక్షులతో పలు అంశాలపై సమగ్రంగా చర్చించి నేరుగా వారి నుంచి   అభిప్రాయాలను అడిగి తెలుసుకొన్నారు.              నూతన మంచినీటి చేపల హేచరీల ఏర్పాటు,  అవసరానికి అనుగుణంగా కొత్త ఉప్పునీటి చేపలు, రొయ్యల హేచరీల ఏర్పాటు, ఉప్పు నీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు ఖర్చు,  మంచినీటి బయో ఫ్లాక్ చెరువుల నిర్మాణం సాగు ఖర్చు, రిజర్వాయర్లలో చేప పిల్లల స్టాకింగ్ , రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం ఏర్పాటు, సముద్రజలాల్లో , నాదీ ముఖద్వారాల వద్ద పంజరాలు ( కేజెస్ ) ఏర్పాటు, రిజర్వాయర్లలో పంజరాల ( కేజెస్ ) ఏర్పాటు, ఐస్ పెట్టె తో సహా మోటార్ సైకిళ్ళు , సంప్రాదాయ మత్స్య కారులకు లోతు సముద్ర జలాలలో వేటచేసే మరబోట్లు పొందడానికి తోడ్పాటు, సముద్ర వేట చేసే బోట్లలలో బయో టాయిలెట్ల ఏర్పాటు, ఆక్వాలో వ్యాధి నిర్ధారణ పరీక్షా సంచార లాబొరేటరీలు,  ఆక్వా క్లినిక్ ల ఏర్పాటు, మత్స్యకారులకు పాతబొట్ల స్థానాన్నే కొత్త బొట్లు, వలల ఏర్పాటు, జిల్లా మత్స్య ఉత్పత్తిదారుల మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో పనిచేసే చేపల వాణిజ్య హబ్ లకు అనుసంధానంగా చేపలు రొయ్యల వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కొరకు యూనిట్ల వివరాలు, బతికి ఉన్న చేప పిల్లల విక్రయ కేంద్రాలు, చేపల అమ్మకాలకు ఐస్ పెట్టెతో సహా మూడు చక్రాల ఆటోలు , ఈ - రిక్షాలు , రిటైల్ చేపల మార్కెట్ల ( హబ్ ) నిర్మాణం, చేపల దుకాణాలు , చేపల అదనపు విలువ జోడించే పప్పు రొయ్యి , పండుగప్ప , రొయ్యల పచ్చళ్ళు ద్వారా వ్యాపార కేంద్రాలు తదితర అంశాలపై చక్కని అవగాహన కల్పించారు.   ఈ సమావేశంలో మచిలీపట్నం మాజీ జడ్పిటీసి, మచిలీపట్నం బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ), కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ , జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు గోవిందరాజులు , మచిలీపట్నం, గుడివాడ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు రాధాకృష్ణ , నాగలింగాచారి తదితరులు పాల్గొన్నారు.  

Machilipatnam

2020-11-11 18:59:10

కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకోవద్దు..

శ్రీకాకుళం జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకోవద్దని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యల వలన ప్రస్తుతానికి తక్కువ కేసులు వస్తున్నాయని అయితే రానున్న మూడు నెలల కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పూర్తి సురక్షిత చర్యలు చేపట్టాలని, కోవిడ్ భారీన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. కళాశాలలు ప్రారంభిస్తున్న దృష్ట్యా డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులతో బుధ వారం బాపూజీ కళామందిర్ లో కరోనా అప్రమత్తతపై తీసుకోవలసిన చర్యలపై డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ పాల్గొని మాట్లాడుతూ కరోనా భారీన పడకుండా సురక్షిత జాగ్రత్తలు పాటించడం అత్యావశ్యమన్నారు. కళాశాలల్లో కరోనా వ్యాప్తి కాకుండా ప్రధానాచార్యులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తరగతిలో మూడవ వంతు విద్యార్ధులను మాత్రమే అనుమతించాలని, తరగతి గదిలో 16 మంది మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేసారు. శానిటైజేషన్ చేయుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులకు కళాశాలలకు అనుమతించరాదని, ఆన్ లైన్ లొనే తరగతులు నిర్వహించాలని సూచించారు.  కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్ధి సొంతంగా శానీటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకునే విధంగా సూచించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్ధి విధిగా మాస్కు ధరించాలని అన్నారు. కళాశాలకు వచ్చే స్ధానిక విద్యార్ధులు మాస్కు ధారణ కరోనా వ్యాప్తి కాకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందని సత్యాన్ని గ్రహించాలని అన్నారు. భౌతిక దూరం పాటించాలని అన్నారు. విద్యార్ధులు గుమిగూడకుండా తగిన సూచనలు జారీ చేయాలని తద్వారా కరోనా వ్యాప్తి కాకుండా చూడవచ్చని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్ధిని తరగతులకు అనుమతించరాదని స్పష్టం చేసారు. కరోనా లక్షణాలు కలిగిన వారు ఉంటే తక్షణం సమాచారం అందించాలని ఆదేశించారు. అటువంటి వారిని వెంటనే పరీక్షించుటకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. పాజిటివ్ వచ్చినా కళాశాల మూసివేయడం జరగదని పేర్కొంటూ లక్షణాలు గుర్తించడంలో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. తద్వారా వ్యాప్తికి కారణం అవుతారని బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కరోనా వ్యాప్తి పెరుగుతుందని గుర్తించాలని కలెక్టర్ అన్నారు. సదుపాయాలు లేని కళాశాలకు తరగతులు నిర్వహించుటకు అనుమతి లేదని అన్నారు. ప్రాణాలు ముఖ్యమని పేర్కొంటూ అధ్యాపకులు అన్ని సురక్షిత చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్లు కళాశాలలను తనిఖీ చేసి సదుపాయాలపై నివేదికలు సమర్పిస్తారని తెలిపారు. కళాశాలలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ఎటువంటి వ్యాప్తి లేకుండా చూస్తూ విద్యార్ధులకు విలువైన విద్యా సంవత్సరం కొనసాగుటకు తోడ్పడాలని అన్నారు. అధిక వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో సతమతమయ్యే వారు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.  పర్యావరణహిత దీపావళి వేడుకలు కావాలి : జిల్లాలో దీపావళి వేడుకలు పర్యావరణహితం కావాలని కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. దీపావళిలో పర్యావరణహిత టపాసులు (గ్రీన్ క్రేకర్స్)కు మాత్రమే ప్రభుత్వం అనుమతించిందని అన్నారు. సాధ్యమైనంతవరకు దీపావళికి దూరంగా ఉంటే మేలు అని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొ. కూన రాంజీ, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రో.కె.రఘుబాబు, కళాశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

Srikakulam

2020-11-11 18:33:54