ఉత్తరాంధ్రా రాజకీయాన్ని మూడు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న మహా మనిషి ఇక లేరనే వార్త అందరిని కలచివేసింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగ బోయింది. సాయం కోసం వెళ్లే వారికీ ఆపన్న హస్తం అందించే ఆపద్బాంధవుడు అస్తమించారనే వార్త అనుచరులతోపాటు అన్ని వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ 1961 ఫిబ్రవరి 1న జన్మించారు. 1980-81లో బుల్లయ్య కళాశాలలో చదువుతున్నప్పుడు, రాజకీయాలపై ఆసక్తి చూపించి, ఎన్‌ఎస్‌యుఐ నాయకుడయ్యారు. శ్రీనివాస్ లా విద్యను అభ్యసించారు. శ్రీనివాస్ తన కెరీర్లో అనేక రాజకీయ పదవులను నిర్వహించారు. 1984-85లో పెందుర్తి నియోజకవర్గంలో యువ కాంగ్రెస్ నాయకుడు అయ్యారు. 1987-89 మధ్య జిల్లా యువ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. తరువాత, అతను 1991 నుండి 1997 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రాథమిక కార్యదర్శిగా పనిచేశారు.. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడయ్యాడు 2000 వరకు ఆ పదవిలో పనిచేశారు. 2001 నుండి 2006 వరకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు 1994 , 2014, 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2006 , 2009 ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయిదు సార్లు ఎమ్మెగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ విఫ్ గా, టి టి డి సభ్యుడుగా పని చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా , నగర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కాంగ్రెస్ లో అనేక కీలకమైన పదవులు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఎంతో మందితో సత్స సంబంధాలు కలిగిన మచ్చ లేని నిజాయితీ పరుడైన నేత ద్రోణంరాజు శ్రీనివాస్ . వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడారు, జగన్ శ్రీనివాస్ ను గుర్తించి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ( వీఎంఆర్డీఏ) తొలి చైర్మన్ గా నియమించారు
గత నెల రోజుల కాలంగా కరోనా బారిన పడి చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ద్రోణంరాజు శ్రీనివాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు . పార్టీలకు అతీతంగా అందరితో సత్స సంబంధాలు కలిగి వున్నా ఏకైక నేత ద్రోణం రాజు రాజు శ్రీనివాస్ అటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాల బాధాకరం . సాయం కోసం వెళితే మన సమక్షంలో సంబంధిత అధికారికి ఫోన్ చేసి పని చేయండి అంటూ సౌమ్యంగా చెప్పడం శ్రీనివాస్ నైజం మనం ఆహ్వానించే కార్యక్రమానికి అతిథిగా కాక కుటుంబ సభ్యుడుగా పాల్గొనడం గొప్ప విషయం .నీతి నిజయతీలే ఊపిరిగా, నిష్కలంక రాజకీయ నాయకుని మనం మళ్ళీ చూడలేం..
శ్రీకాకుళం జిల్లాలో మాస్కు ధరించని వారిలొనే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి ఉంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కు ధారణపై ఇంకా అలక్ష్యం వహిస్తున్నారని ఆయన చెప్పారు. పాజిటివ్ కేసులను విశ్లేషణ చేస్తే మాస్కు ధరించని వారికే ఎక్కువగా వైరస్ సోకుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆదివారం సమీక్షించారు. కంటైన్మెంట్ జోన్లను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. జోన్లలో కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని, ఫస్ట్, సెకండరీ కాంటాక్ట్ లకు నమూనాలు తీసి పరీక్షించాలని చెప్పారు. మెలియాపుట్టి, పాతపట్నం, నందిగాం తదితర ప్రాంతాలతో సహా గ్రామీణ ప్రాంతాల కూడలి ప్రదేశాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మాస్కు ధారణ జరగాలని ఆయన పేర్కొన్నారు. మాస్కుతో పాటు తరచూ చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తో గాని శుభ్ర పరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కోవిడ్ వైరస్ ను జిల్లా నుండి పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్ గుండాల, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, శ్రీకాకుళం ఆర్డిఓ ఐ కిషోర్, నగర పాలక సంస్థ కమీషనర్ పల్లి నల్లనయ్య, ఆరోగ్య అధికారి ఎం.వెంకట రావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, తహసీల్దార్ వై.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిషనర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ eస్పందన ద్వారా అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవచ్చున్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు నగరపాలక సంస్థకు విన్నవించుకోవాలని కమిషనర్ కోరారు.
తిరుమల ఈఓ(ఎఫ్ఏసి)గా ఎవి.ధర్మారెడ్డి ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళుతున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు ఎవి.ధర్మా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ఎవి.ధర్మారెడ్డి చేత జెఈఓ పి.బసంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత అనిల్ కుమార్ సింఘాల్, ఎవి.ధర్మారెడ్డి కలిసి శ్రీవారి దర్శనం చేసుకుని రంగనాయకుల మండపంలో వేద పండితులతో వేదాశీర్వచనం పొందారు. అనిల్ కుమార్ సింఘాల్ కు ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. జెఈఓ పి.బసంత్ కుమార్, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి కలిసి ధర్మారెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డెప్యూటి ఈఓ బోర్డు సెల్ సుధారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
విశాఖనగరంలో జరగుతున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రంను కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదివారం సందర్శించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష న్ పరీక్షలను నగరంలో పలు కేంద్రాలలో పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జ్ఞానాపురంలోని సోఫియా కళాశాలలో నిర్వహించుచున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రంను ఆయన సందర్శించి పరిశీలించారు. పరీక్ష అనంతరం ఒయమ్మార్ సీట్లు ప్యాకింగ్, తదితర అంశాలపై ఆయన కళాశాల సిబ్బందికి పలు సూచన లు చేశారు. కోవిడ్-19 పై జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటించి, అభ్యర్థులు మాస్క్ ధరించే విధంగా చూడాలని కళాశాల సిబ్బందిని ఆదేశించారు. బయటకు వెళ్లే సమయంలో కూడా సామాజిక దూరం పాటించేలా ఇన్విజిలేటర్లు చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు సియండి ఎ.పి.సోలార్, ఎనర్జీ ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
విశాఖలో ఎన్ఏడీ నుంచి గోపాలపట్నం వైపుగా వెళ్ళే ఫ్లైఓవర్ వంతెన నను పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్ఏడి దగ్గర వాహనాల రద్దీ తగ్గించేందుకే ఈ ఫ్లైఓవర్ ను త్వరగా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే గజువాక నుండి ఫ్లైఓవర్ మీదుగా తాటిచెట్ల పాలెం వైపుగా వెళ్ళే మర్గాన్ని ప్రారంభించడం జరిగిందన్న మంత్రి బొత్స త్వరలో అన్ని మార్గాల పనులు పూర్తి చేసి వాహన దారులకు ఫ్లైఓవర్ వంతెన నను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం ఎన్ .ఏడీ ఫ్లైఓవర్ ఫై రెండు మార్గాలు అందుబాటులొకి తేవటం వలన టాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని వీఎంఆర్డీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు, ఎం .పి .ఎం .వి.వి సత్యనారయణ , ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ , వి ఎమ్ ఆర్ డి ఎ కమిషనరు పి . కోటేశ్వర రావు, జీవీఎంసీ కమిషనర్ డా. జి.సృజన తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలు పరిష్కరించడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని విశాఖజిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం నూతన అధ్యక్షులు కెవి సత్యన్నారాయణ చెప్పారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ మాట్లాడుతూ, వ్యవసాయశాఖలో ఎప్పటి నుంచో విధులు నిర్వహిస్తున్న ఏఈఓల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పారు. ఏఈఓలంతా సమిష్టిగా ఒకేతాటిపై ఉంటే ఎలాంటి సమస్యనైనా..డిమాండ్లనైనా సాధించుకోవచ్చునని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అంతా పర్యటించి ఏఈఓల స్థితిగతులను తెలుసకొని సంఘం అభివ్రుద్ధికి కూడా క్రుషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వ్యవసాయ విస్తరణా అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆదివారం సర్క్యూట్ హౌస్లో మంత్రి బొత్సను కలిసి పుష్ఫగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించారు. ఇటీవలే వైఎస్సార్సీపీ పార్టీకి తీర్ధం పుచ్చుకున్న తన తనయుల విషయాన్ని మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. పార్టీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను, ఎంపీ ఎంవీవీసత్యన్నారాయణలను కూడా వాసుపల్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను కూడా మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేతోపాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి కూడా ఉన్నారు.
అనంతపురం జిల్లాలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అనంతపురంలోని జెఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏ, బి సెంటర్ లను, కేఎస్ఎన్ గవర్నమెంట్ యూజీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, జీసస్ నగర్లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ వెన్యూ పరీక్ష కేంద్రాలను అనంతపురం సెంటర్ అబ్జర్వర్ కోన శశిధర్ ఐ ఏ ఎస్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అలాగే నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు లోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ డిగ్రీ కాలేజ్ ( అటానమస్), టవర్ క్లాక్ వద్దనున్న గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ( అటానమస్) వెన్యూ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. కలెక్టర్ వెంట యూపీఎస్సీ అండర్ సెక్రటరీ సాబిల్ కిండో, అబ్జర్వర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య ఉన్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని ప్రముఖ సామజసేవకులు సానారాధ పిలుపునిచ్చారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లా డుతూ, ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4.0, 5.0 నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. వైరస్ ఉద్రుతి తగ్గిందనే అపోహలు మానుకొని, వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ వైరస్ సోకి పాజిటివ్ వచ్చినా ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఇంటి పట్టునే ఉండి వైద్యసేవలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటూ, నిపుణుల సలహామేరకు ఎప్పటి కప్పుడు ఆవిరి పట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూనే, ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేయడానికైనా ముందు సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని కోరారు. నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే వినియోగించాలని, తక్కువరకం శానిటైజర్లు వినియోగించి చర్మవ్యాధులు కొని తెచ్చుకోవద్దని కూడా సానా రాధ ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్పా, బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారిని, ఐదేళ్ల లోపు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలని ఆమె మీడియా ద్వరా ప్రజలను కోరారు...
విజయసాయిరెడ్డి నా సంగతి నీకింకా తెలిసిట్టులేదు.. నాకోసం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలుసు.. నువ్వేదో విశాఖలో కూర్చోని ఏదో డాన్సులు చేద్దామనుకుంటే కుదరదు.. నేనేంటో 24 గంటల్లో చూపిస్తా... చూస్తావా... ఏంటి ఇవేవో కొత్తగా తీయబోయే బాలయ్య సినిమాలోని డైలాగులనుకుంటున్నారా...అలా అనుకుంటే మాజీ ఎంపీ సబ్బం కబ్జా చేసిన స్థలంలో కాలుమోపినట్టే.. విశాఖ మాజీ మేయర్, టిడిపినేత, సబ్బంహరి ఆక్రమణలను కూలగొట్టడానికి వచ్చిన జీవిఎంసీ అధికారులపై చిందేస్తూనే విజయసాయిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇవ్వడానికి చేసిన సబ్బం హల్ ఛల్.. ఇలాంటి మేటర్ లునాకు పెద్ద విషయం కాదు..లీగల్ గా తేల్చుకోవచ్చు కానీ అలాచేస్తే నేనేంటో మీకు తెలియదు కదా..వీడితో ఎందుకు పెట్టుకున్నానురా బూబూ అనేలా చేయకపోతే చూడండి అంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లాను వెంటబెట్టుకొని ఊగిపోయారు సబ్బం.. అయితే ఈవ్యాఖ్యలప పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి ఘాటుగానే స్పందించారు..నువ్వేదో అనుకుంటున్నావ్.. అధికారాన్నిఒక్కసారి పక్కన పెడితే... రౌడీయిజం మేమూ చేయగలమంటూ వెంట్రుకను తీసిపడేసినట్టుగా సబ్బం వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే బాగోదంటూ గట్టినా వార్నింగ్ ఇచ్చారు ముత్తం. ఆక్రమణలు, దురాక్రమణల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది..అంతే తప్పితే ఎవరిమీదా ప్రభుత్వానికి అక్కసు ఉండదు...పైగా అభిమానం మాత్రమే వుంటుందని చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ సబ్బం హరి జీవిఎంపీ పార్కు స్థలం సుమారు 12 అడుగులకు పైగా ఆక్రమించి అక్కడ మరుగుదొడ్లు నిర్మించారు. ఇంతకాలం బాగానే వున్నా జీవిఎంసీ అధికారులు ఈ మధ్యనే దీనిని గుర్తించి నోటీలిచ్చారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఉండిపోయారు. దీంతో ఏసీపి పోలీసులతో రంగంలోకి దిగి ఆక్రమించిన స్థలాన్ని అమాంతం కూల్చివేశారు. ఆ క్రమంలో సబ్బంహరి కోపం ఊగిపోతూ...నేనేంటో 24 గంటల్లో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం రాజకీయ చర్చకు మరింత ఆజ్యం పోసింది. సబ్బం హరి ఇంటి ఆక్రమణను కూలగొట్టే సమయంలో చేసిన వ్యాఖ్యలను అటు పోలీసులు, ఇటు జీవిఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండానే తమ పని తాము చేసుకుపోవడం విశేషం. పైగా నోటీసులు ఇచ్చిన తరువాత పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఆక్రమణలు తొలగించామని జీవిఎంసీ అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి పార్కు స్థలంలో ఎపుడో ఆక్రమించి సబ్బం హరి నిర్మాణాలు చేశారు. అప్పటి నుంచి చూస్తూ ఉండిపోయిన జీవిఎంసీ అధికారులు, తాజాగా ఈ విషయంపై ఫోకస్ చేయడం విశేషం. పైగా జీవిఎంసీ అధికారులను కాకుండా మాజీ ఎంపీ సబ్బం హరి, ప్రభుత్వాన్ని, మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై నోరు జారడాన్ని కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగానే పరిగనిస్తుండటం విశేషం.
నేను మాజీ ఎంపీని...మాజీ విశాఖ మేయర్ ని.. నేను ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అడ్డుకునేదవెవరు అనుకొని దర్జాగా కబ్జాచేసి ప్రభుత్వం, అందులో నిర్మించిన మరుగు దొడ్లు జీవిఎంసి అధికారులు అక్రమమంటూ కూల్చేస్తే తప్పా ఆక్రమణ ఫలితం ఎలావుంటుందో మాజీ ఎంపీ టిడిపినేత సబ్బంహరికి తెలియలేదు. జీవీఎంసికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి మరుగుదొడ్లు నిర్మించాననుకొని సంబరపడుతూ ఇన్నేళ్లూ అనుభవించిన సబ్బంకు..కళ్లముందే అధికారులు ఆక్రమణలు తొలిగిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది...చేసింది తప్పే అయినా అధికారులపైకి ఒంటికాలిపై లేచినా ఫలితం లేకుండా పోయింది. ఒకటికాదు రెండు కాదే ఏకంగా 12 అడుగుల స్థానిక పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు సబ్బం హరి. దీనితోపాటు మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా జీవిఎంసీ అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. అయినీ సబ్బం నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన జీవిఎంసీ అధికారులు మాజీ ఎంపీకి గట్టి ఝలక్ ఇస్తూ... అక్రమ నిర్మాణాలను ఉన్నఫళంగా కూల్చేశారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. అంతేకాకుండా సబ్బం మరోసారి ఆ స్థలాన్ని ఆక్రమించకుండా.. ఆక్రమించిన ఖాళీ స్థలంలోనే ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన అధికారులపై సబ్బం హరి గట్టిగానే నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఏం తమాషాలు చేస్తున్నారా ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేసుకున్నా పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారని వివరించారు. ప్రభుత్వ రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వానిదని.. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించామని వివరణ ఇచ్చారు. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె కూడా ఏర్పాటు చేశామన్న ఏసీపి... సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదని కొట్టిపడేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసామని అయితే ఆ నోటీసుకు సబ్బం హరి స్పందించలేదన్నారు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. ఇన్నేళ్లపాటు తొంగిచూడని జివిఎంసీ అధికారులు మాజీ ఎంపీ సబ్బంహరి ఆక్రమించిన స్థలాన్ని జేసీబీలతో కూల్చడం రాజకీయవర్గాల్లో చర్చకి దారి తీసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి టెలికాన్ఫరెన్సు ద్వారా రూట్ అధికారులు, వెన్యూ సూపర్ వైజర్లు, జీవీఎంసీ, పోలీసు, డిఎంహెచ్ఓ, ఈపిడిసిఎల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం (4-10-2020) నిర్వహించే ఈ పరీక్షల కు జిల్లా లో 27 పరీక్షా కేంద్రాల లో 10,796 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు.
పోటీ పడుతున్న అభ్యర్థులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని తెలిపారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, యూపీఎస్ సీ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన షెడ్యూల్ ను, టైమ్ లైన్ లను పాటించాలని నిర్వహణ అధికారులకు, సిబ్బందికి సూచించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్ సీ పరిశీలకులు పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేస్తారని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలు శానిటైజ్ చేసారని, త్రాగు నీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. డిఎంహెచ్ఓ సిబ్బంది కోవిడ్ నిబంధనల మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈపిడిసిఎల్ తరపున ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారని తెలిపారు. కలెక్టరేట్ లో డిఆర్ఓ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిందని, ఎగ్జామ్స్ మెటీరియల్ ను తరలించేందుకు ఎస్కార్ట్ ఇస్తున్నారని తెలిపారు. ఆర్ టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.