ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల కొరకు ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేది వరకు “నన్నయ సెట్-2020” పరీక్షలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు చెప్పారు. విశ్వవిద్యాలయంలో శనివారం నన్నయ సెట్ 2020 పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను వీసీ విడుదల చేసారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నన్నయ సెట్ 2020 పరీక్షలను ఈ నెల 16వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. నన్నయ సెట్ కొరకు 6810 మంది విద్యార్థులు దరఖాస్తూ చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు. పరీక్ష కేంద్రాలను పెంచామని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నంతో కలిపి 10 నన్నయ సెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎం.ఎస్.ఎన్ క్యాంపస్ కాకినాడ, ఎస్.కె.వి.టి కాలేజ్ రాజమహేంద్రవరం, ఎస్.కె.బి.ఆర్ కాలేజ్ అమలాపురం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్ తాడేపల్లిగూడెం, శ్రీ సి.ఆర్.రెడ్డి పీజీ కాలేజ్ ఏలూరు, కె.జీ.ఆర్.ఎల్ పీజీ కాలేజ్ భీమవరం, శ్రీరామచంద్రా డిగ్రీ కాలేజ్ జంగారెడ్డిగూడెం, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే కోవిడ్ నిబంధనలను అనుసరించి భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నాలుగు రోజు పాటు ఉదయం 9.30 నుండి 11.00 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 16వ తేదీన ఉదయం లైఫ్ సైన్సెస్(101), మధ్యాహ్నం మ్యాథ్మెటిక్స్(103), జియాలజీ(105), 17వ తేదిన ఉదయం ఫిజికల్ సైన్సెస్(102), మధ్యాహ్నం కంప్యూటర్ సైన్సెస్(106), 18వ తేదిన ఉదయం కెమికల్ సైన్సెస్(104), మధ్యాహ్నం హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(201), 19వ తేదిన ఉదయం ఇంగ్లీషు(202), ఎం.పి.ఈడీ(205), మధ్యాహ్నం హిందీ(204), తెలుగు(203) పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 7వ తేది నుండి హాల్ టికెట్లును డౌన్ లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. కోవిడ్ నింబందనలు తప్పని సరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యార్థులు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబి సైట్ www.aknu.edu.in ను లేదా 7093008477 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేసారు.
సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ దస్త్రాలు నేరుగా ప్రత్యేక కమీషనర్ పరిశీలించేలాగా ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వడం వెనుక దురుద్ధేశాలు ఉన్నాయని హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం ఈ మేరకు సింహాచలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ జారీచేసిన ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ఆదాయం వచ్చే దేవాలయాల దస్త్రాలు క్రింది స్ధాయి నుంచి పరిశీలిస్తూ ప్రత్యేక కమీషనర్ కి చేరేలా నిబంధనలు ఉన్నాయన్నారు. వీటిని ఇప్పుడు ఒక్క సింహాచలం, మాన్సాస్ విషయంలో మాత్రమే మార్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటీవల సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కి ఓఎస్డీ గా బయటి వ్యక్తిని నియమించేందుకు పాలకవర్గం తీర్మానిస్తే, అందుకు నిబంధనలు అంగీకరించలేదన్నారు. కేవలం ఆలయ ఉద్యోగినే ఓఎస్డీ గా తీసుకోవాలని సంయుక్త కమీషనర్ చెప్పడమే ఇప్పుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి కారణమా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు దేవస్థానంతో సంబంధం లేని వ్యక్తి సింహాచలం కొండపైన ఏ హక్కుతో మే నెల నుండి తిష్ట వేశాడని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యక్తికి అధికారులు ఎందుకు అడుగులకి మడుగులొత్తుతున్నారో ప్రభుత్వం భక్తులకు చెప్పాలన్నారు. వెంటనే ఆ బయటి వ్యక్తిని సింహాచలం నుంచి తొలగించాలన్నారు. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ లకి ఛైర్మన్ గా రాత్రికి రాత్రి సంచయితను తీసుకు వచ్చినప్పటి నుండి వివాదాలు వస్తున్నాయని ఆరోపించారు. మాన్సాస్ కి చెందిన విద్యా సంస్థల ను ప్రైవేట్ పరం చెయ్యాలి అని కూడా మరో వివాదాస్పద నిర్ణయం సంచయిత తీసుకోవడం దారుణమన్నారు. ఎయిడ్ డెడ్ సంస్థగా వున్న దాన్ని ఎందుకు ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. సింహాచలం భూములు లీజుకు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, సింహాచలం భూములు, ఆస్తులు కొట్టేసే సీక్రెట్ మిషన్ ఏమైనా సంచయిత గారికి అప్పగించే ఆమెను రంగంలోకి దించారా అని ప్రశ్నించారు. సింహాచలం, మాన్సాస్ లో జరుగుతున్న వ్యవహారాల పైన స్వామీజీలు గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అలాగే ఇప్పుడు తాజాగా చేసిన నిబంధనల మార్పు ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నవరత్నాలలో భాగంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి అన్నారు. శనివారం కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఈ పధకాన్ని నగదు బదిలీతో అనుసంధానం చేయనున్నారని, రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. 2004 లో దివంగత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూనే.. నవరత్నాలలో భాగంగా ఇప్పటికే రాత్రి, పగలు గతంలో ఇస్తున్న విద్యుత్ ను పగలే 9 గంటలు అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకం నగదు బదిలీతో అనుసంధానం చేయడం వల్ల రైతుకు ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదని రైతులు విద్యుత్ వాడినా వాడకున్నా ప్రభుత్వం రాయితీ ప్రతి సంవత్సరం డిస్కమ్ లకు రూ.8500 కోట్లు చెల్లిస్తున్నదని ఒక రాయలసీమ జిల్లాల వాటా రూ.5300 కోట్లు గా ఉన్నదని అన్నారు. గతంలో రైతు విద్యుత్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రశ్నించే తత్వం లేకున్నదని నగదు బదిలీతో జవాబుదారీ తనంతో పాటు విద్యుత్ అవసరమెంత తెలుస్తుందని ఆ మేరకు నాణ్యమైన విద్యుత్ అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ పథకంలో కొత్తగా నమోదు, పాత వారి పేర్లు ప్రస్తుతం ఉన్న వారి పేరుకు మార్పు, అనధికార కనెక్షన్లు రేగులరైజేషన్ చేసుకోవచ్చని అన్నారు. మొదటిసారిగా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ఈ పథకానికి అనుసంధానం చేసి పటిష్టంగా అమలు చేయనున్నదని అన్నారు. గ్రామ స్థాయి కమిటీలో వీ ఆర్ ఓ అధ్యక్షులుగా లైన్ మాన్ మెంబర్ గా ఉంటారని, నమోదు చేస్తున్నవారికి బ్యాంకు ఖాతా కొత్తది ప్రారంభిస్తారని ఇది కేవలం ఒక విద్యుత్ బిల్లులు మీటర్ ప్రకారం ఎంత వచ్చింది, ప్రభుత్వం ఎంత చెల్లిస్తున్నదని తెలియడానికే అని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,89,544 కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓ లు, మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లు పథక అధ్యక్షులుగా ఉంటారని, సచివాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించనున్న నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలు ప్రతి రైతు ఇంటికీ పంపిణీ చేపట్టి అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రచురించిన పోస్టర్ లు, కరపత్రాలు ఆర్డీఓ , విద్యుత్ శాఖ అధికారులు ఆవిష్కరించారు. 2020-ఆర్థిక సంవత్సరం నుండి అమలు కానున్నది తెలిపారు. ఈ అవగాహన సదస్సులో డి ఎల్ పి ఓ ఉపేంద్ర రెడ్డి, తిరుపతి డివిజన్ స్థాయి విద్యుత్ శాఖ అధికారులు, కన్వీనర్లు వాసుదేవ రెడ్డి, కృష్ణారెడ్డి , మురళి , ఎడిఇ లు, ఎఇ లు భీమేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హరి, శేషాద్రి రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, తహశీల్దార్ లు హజారుద్దీన్, వెంకటేశులు, గణేష్, వెంకటరమణా రెడ్డి, శివ ప్రసాద్, డీటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి మనబడి-నాడు నేడు పనులు మొత్తం పూర్తి చేయాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకే సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో పండగ వాతావరణం, ఆహ్లాదకరంగా అందమైన రంగులు, అవగాహన కలిగించే అందమైన బొమ్మలు ఉండాలని, అన్ని స్కూళ్లలో అందమైన చెట్లు నటించాలన్నారు. నిరంతర వసతితో మరుగుదొడ్లు, ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత తాగునీరు, విద్యార్థులకు ఉపాధ్యాయులకు, ఫర్నీచరులు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. మనబడి, నాడు – నేడు చేపట్టే ప్రతి పనిలో నాణ్యత వుండాలని, తొమ్మిది అంశాలుతో పాఠశాల్లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పాఠశాల అభివృద్ధి చేయాలన్నారు. పేద విద్యార్థులకు చదువులకు కార్పొరేట్ స్థాయి పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచాలన్న కమిషనర్ పాఠశాలల్లో జరుగుతున్న పనులు, వారం లోపల పూర్తిచేసి ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనిన్నారు. చేస్తున్న పనులు ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రాధమికోన్నత పాఠశాలలు,నగర పాలక ఉన్నత పాఠశాలలు మొత్తం 44 స్కూల్స్ ఉన్నాయని మొదటి విడత 16 మున్సిపల్ పాఠశాలల్లో,6 జిల్లా పరిషత్ పాఠశాలలు మొత్తం 22 పాఠశాలలు జరుగుతున్న పనులన్నింటినీ వారం లోపల పూర్తి చేసి మన తిరుపతి ఆదర్శంగా నిలచేలా చూడాలన్నారు. ప్రతి హెచ్ఎంలు( స్కూల్ ట్రాన్స్ఫర్ రేషన్ మానిటరింగ్ సిస్టం యాప్) ఎస్ టి ఎం ఎస్ యాప్ డౌన్లోడ్ చేసి ఎప్పటికి అప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఎస్ఈ చంద్రశేఖర్, డివైఈవో జనార్దన్ రెడ్డి, స్కూల్ సూపర్వైజర్లు ప్రభు కుమార్, హరికృష్ణ బాబు, మహాలక్ష్మి, నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, చంద్రశేఖర్రెడ్డి,రవీంద్రనాథ్రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, గోమతి, దేవిక,ఏఈలు శంకర్ రెడ్డి, తేజస్విని, ఏక్నాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల పోస్టుల పునరుద్దరణకు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.00గం.ల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.శ్రీరాములు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు పనిచేసిన అధ్యాపకులు మాత్రమే తిరిగి దరఖాస్తు చేస్తునోకోవాలని, వారని మాత్రమే అర్హులుగా గుర్తించడం జరుగుతుందని చెప్పారు. అధ్యాపక పోస్టుల పునరుద్దరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 7వ తేదీన కలెక్టర్ వారి కార్యాలయంలో నిర్వహించు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని కోరారు. ఈ అవకాశాన్ని గతంలో పనిచేసిన అద్యపకులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాలలు ప్రారంభం అవుతున్న ద్రుష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు...
సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలను అందించడంలో ఇతర జిల్లాలకు విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచింది. ఇ-రిక్వెస్టులన్నీ నిర్ణీత గడువు కంటే ముందుగానే పరిష్కరిస్తూ, రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే గడువు దాటిన తరువాత పరిష్కరించిన వినతుల విషయంలో కూడా, అతితక్కువ సంఖ్యతో ఇతరజిల్లాకంటే ముందంజలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలే ఇప్పుడు ప్రభుత్వవ సేవలకు కేంద్ర బిందువులు. ప్రస్తుతం సుమారు 500కు పైగా ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. ప్రజలు ప్రతీ ప్రభుత్వ సేవ పొందేందుకూ నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించింది ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా నిర్ణీత గడువులోగా , ఆయా సేవలను అందించేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 4లక్షల, 82వేల, 947 ఇ-రిక్వెస్టులు రాగా, వాటిలో 3లక్షలా, 99వేల 599 వినతులను నిర్ణీత కాలవ్యవధిలోపలే పరిష్కరించడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రంలో మన జిల్లా గత కొంతకాలంగా నెంబరు 1గా కొనసాగుతోంది. కొన్ని రకాల సేవలను వివిధ కారణాల రీత్యా నిర్ణీత గడువులోగా అందించడం సిబ్బందికి సాధ్యపడటం లేదు. అయినప్పటికీ ఇలాంటి సుమారు 61,173 వినతులను గడువు దాటినప్పటికీ, పరిష్కరించడం జరిగింది.
సచివాలయాల ద్వారా అందిన వినతులను సంబంధిత ప్రభుత్వ విభాగాలు గడువు లోపల పరిశీలించాల్సి ఉంటుంది. వినతులను పరిశీలించే అంశంలో కూడా ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలిచింది మన జిల్లా. గడువు దాటిన తరువాత పరిశీలించిన ధరఖాస్తులు కేవలం 1860 మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంలో అతి తక్కువ వినతులతో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండగా, విశాఖ, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 13,047 వినతులతో ప్రకాశం జిల్లా 13వ స్థానంలో ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ నిరంతర పర్యవేక్షణలో, జిల్లాలో అందిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని పరిష్కరిస్తుండటంతో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.
విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సంబ్బం హరి జీవిఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించి అడ్డంగా కట్టేసి పబ్బం గడిపిన నిర్మాణాలను జీవిఎంసీ అధికారులు ఒక్కపెట్టున కూల్చేశారు. ఇన్నాళ్లూ సబ్బంహరి వాటిని అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేసిన విషయం అధికారులకి తెలిసినప్పటికీ వివిధ సాకులతో జీవిఎం అధికారులు, అటువైవపు వెళ్లేవారు కాదు. ఇక సబ్బం అనుకూల మీడియా అయితే అతనికి భజన చేయడానికే సరిపోయేది. పైగా ఎవరైనా ఈ ఆక్రమణల విషయం వార్త రాయాలని చూస్తే సబ్బం అనుచర మీడియానే వార్త రాయాలని చూసే వారిని బెదిరిస్తూ వచ్చేది. ’కాలం కలిసొస్తే అధికారం చలాయించే రోజుస్తుందన్నట్టు’... ఇన్నేళ్లు ఆక్రమణ స్థలంలో పబ్బం గడిపేసిన సబ్బం హరి ఆక్రమ నిర్మాణం కూల్చివేయడం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. చేసిందే ఆక్రమణ అయినప్పటికీ కూల్చివేసే సమయంలో జివిఎంసి ఎందుకు నోటీసు ఇవ్వలేదని సబ్బం అరిచిగోల చేసినా.. జీవిఎంసీ అధికారులు కనీసం పట్టించుకోకుండా వేకువజామునే జేసీబీలు తీసుకొచ్చి మరీ కూల్చేయడం విశాఖలోని రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జీవిఎంసీ అధికారులు ఆక్రమణ స్థలయంలో కట్టడాన్ని కూల్చేయడంతో పాటు అక్కడ హెచ్చరికబోర్డులు పెట్టడంతో ఆ ప్రాంతంలో ఆక్రమణలు చేసిన వారికి సైతం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసినట్టు అయ్యింది. అయితే ఇన్నేళ్ల పాటు సబ్బం జోలికి వెళ్లని జీవిఎంసి అధికారులు..ఇపుడు వెళ్లి నోటీసుకూడా ఇవ్వకుండా ఆక్రమణలు కూల్చివేయడం కూడా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.
రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒక చారిత్రక నిర్ణయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తియిన సందర్భంగా, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద చప్పట్లతో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ వల్ల పరిపాలన సులభతరం అయ్యిందన్నారు. ప్రభుత్వ సేవలు నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాదిమందికి ఉద్యోగాలు లభించడం ద్వారా, వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆచరణ సాధ్యం అవుతుండటానికి ఈ వ్యవస్థ ఒక కారణమన్నారు. పింఛన్ల పంపిణీ, స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో, జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రధమ స్థానంలో నిలవడానికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా ఒక కారణమని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పశుసంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, మెప్మా పిడి కోట్ల సుగుణాకరరావు, సమాచారశాఖ ఎడి డి.రమేష్, డిపిఎం పద్మావతి, ఫిషరీస్ డిడి జి.నిర్మలకుమారి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీజి 151వ జయంతిని పురష్కరించుకొని నగరంలో పచ్చదనం పెంపొందించడానికి జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మొక్కల పెంపకానికి పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, నగరపాలక సంస్థ ఉద్యాన విభాగం, ప్రగతి భారతి ఫౌండేషన్, తూర్పు నౌకాదళం భాగస్వామ్యంతో ఎత్తైన కొండ ప్రాంతా లలో, ఖాళీ మైదాన ప్రాంతాలలో వాయు మార్గం ద్వారా కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలైన పెదగంట్యాడ పరిసర ప్రాంతాలు, అగనంపూడి, నాయు డుతోట, చీమలపల్లి, చినముషిడివాడ, భీమిలి వద్ద పావురాల కొండ తదితర పరిసర ప్రాంతాలలో హెలికాప్టర్ ద్వారా 50వేల విత్తన బంతులను జల్లే కార్యక్రమంను చేపట్టారు. తూర్పు నావికాదళం స్థావరం INS డేగా నందు ఈ ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో పాటూ, విశాఖ పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యులు వి. విజయసాయిరెడ్డి, లోకసభ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ, శాసన సభ్యులు టి. నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, ఎ.అదీప్ రాజ్, తూర్పు నౌకాదళ అధికారి బిశ్వజిత్ దాస్ గుప్తా, ఇతర నౌకాదళ అధికారులు సందీప్ ప్రధాన్, కెప్టన్ పార్ధ వి. భట్ , జివిఎంసి ఉద్యానసాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటయిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి తిరుపతి లోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సంవత్సరం పూర్తయిన సందర్భంగా చప్పట్లు కొట్టాలని సూచించిన మేరకు కార్యక్రమం నిర్వహణ జరిగింది. తొలుత సచివాలయ సిబ్బంది, వాలిఁటర్లు కొవ్వొత్తుల ప్రదర్శన తో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రికి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజెసారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలొ ఇచ్చిన మాట మేరకు ఇంటి ముందుకే పాలన తీసుకురావాలని గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని గత సంవత్సరం అక్టొబర్ 2 న గ్రామ సచివాలయం వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటికి సంవత్సరం పూర్తి అయిందని అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందజేసి చాలా బాగా పని చేశారు, అందుకే వారి పనికి మనము ఈ రోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా చప్పట్లు కొట్టాలని ఏదైతే ముఖ్యమంత్రి తెలిపారో ఆచరణ చేపట్టామని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థ లేదు, ప్రధానమంత్రి గారు అభినందించిన విషయం తెలిందేనని అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రంలోనే ప్రధమం గా మొదలు పెట్టామని, ఈరోజు యుపిఎస్ ఎగ్జామ్స్ లోనూ , సెలెక్ట్ ట్రైనింగ్ లో కూడా దీనిని పాఠ్యాంశంగా చేర్చడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్యం శెట్టి విశ్వనాధ్, జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, తిరుపతి ఆర్ డి వో కనక నరసారెడ్డి, డ్వామా, డి ఆర్ డి ఎ పి డి లు చంద్రశేఖర్, తులసి, జెడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, మెప్మా పిడి జ్యోతి, పుంగునూరు మునిసిపల్ కమిషనర్ వర్మ, ప్రజా ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
"ఒక్క అడుగు స్వచ్ఛత వైపు" అనే నినాదంతో స్వచ్ఛభారత్ కార్యక్రమాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలు సాకారమవుతున్నాయని, దేశమంతా పరిపూ ర్ణమైన స్వచ్చత కలిగి ఉంటుందని రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వి. విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం గురజాడ కళాక్షేత్రం లో జాతిపిత మహాత్మాగాంధీ 151 వ జన్మదినోత్సవం సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రగతి భారత్ ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ 2020 కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వి. విజయసాయిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ విశాఖ స్వచ్ఛ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన విశాఖ జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యుల జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కలిసి ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను గౌరవ అతిథి వి. విజయసాయిరెడ్డి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా గౌరవ అతిధి మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి దినోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలైన భారతదేశం పరిపూర్ణత స్వచ్ఛత కలిగి ఉండాలని, ప్రజలు జీవన విధానం పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే కలలను సాకారం చేసే దిశగా భారత ప్రధానమంత్రి, మహాత్మా గాంధీ జయంతి 2014 అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. భారతదేశంలో 1981వ సంవత్సరంలో పరిశుభ్రత ఒక శాతం ఉండేదని అది 2013 నాటికి 32 శాతం కాగా 2014 సంవత్సరం నుండి శతశాతం వైపు అడుగులు వేస్తుందన్నారు. అలాగే బహిరంగ మల మూత్ర విసర్జన 550 మిల్లియన్లకు గాను ఇప్పుడు 50 మిలియన్లకు తగ్గిందని, 607 జిల్లాలు, 613 వేల గ్రామాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో విశాఖ నగరం పరిశుభ్ర నగరంగా 9వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. అందుకు కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందన్నారు. నగరంలో కాలుష్యం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నగరంలో ప్రజల పరిపూర్ణ ఆరోగ్య జీవన విధానానికి, పర్యావరణానికి అనుకూలంగా,పచ్చదనం నిండి ఉండేటట్లుగా ఈరోజు ప్రగతి భారత్ ఫౌండేషన్ - ఇండియన్ నేవీ, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థవారి సహకారంతో హెలికాప్టర్ ద్వారా ఒక లక్ష విత్తన బంతులు నగరంలో వివిధ ప్రాంతాలలో నాటడమైనదన్నారు. అలాగే ప్రజల శ్రేయస్సుకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదన్నారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021, విశాఖనగరం ప్రథమ స్థానం వైపు అడుగులు వేయాలని అందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కృషితో ప్రజల సహకారంతో సాధించాలన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ ఈ దేశానికి మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సేవలను కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షన్-2020 నగరానికి తొమ్మిదో స్థానం సాధనకు సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నగరంలో కాలుష్యం అదుపు చేయుటకై, పచ్చదనం పెంపొందించేందుకు ఇండియన్ నేవీ సహకారంతో ప్రగతి భారత్ పౌండేషన్ ఒక లక్ష విత్తన బంతులు హెలికాప్టర్ సహాయంతో నగరంలో చెల్లించడం చాలా సంతోషాన్నిచ్చింది అన్నారు. ఈ రోజు మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రథమ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ప్రజలకు హక్కుగా అందించవలసిన పౌర సేవలు కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా అందించే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన గౌరవ ముఖ్యమంత్రిగారి ఆలోచనలకు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ఈ రోజు రాత్రి 7 గంటలకు వార్డు కార్యదర్శులు, ప్రజలు ఒకేసారి చప్పట్లతో ఈ సేవలకు తమ చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021 లో విశాఖనగరం పరిశుభ్ర నగరాల జాబితాలో ప్రధమ స్థానం సాధనకు ప్రజల భాగస్వామ్యంతో జీవీఎంసీ కృషి చేస్తోందన్నారు.
అనంతరం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ COVID-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ నగర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రాన్ని అందించిన మహాత్మాగాంధీ సేవలను కొనియాడారు. వారి కలలను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తూ విశాఖ పరిశుభ్ర నగరంగా ప్రథమ స్థానంలో నిలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛభారత్ పథకమే ఒక ఉద్యమంగా భావించి ప్రతి ఒక్కరు సైనికుడిగా మారి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ విశాఖ నగరానికి 9వ స్థానంకు సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సేవలకు సచివాలయ వ్యవస్థ ఒక వారధి అని తెలిపారు. అనంతరం విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ మన విశాఖ నగరం అతి సుందర నగరమని, దేశంలో ఎక్కడ ఉన్న వారైనా చివరకు విశాఖలోని స్థిర పడాలనుకుంటారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరచవచ్చన్నారు.చెత్తను బహిరంగంగా పారవేయకుండా రోజూ జివిఎంసి సిబ్బందికి అందించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ పర్యావరణానికి సహకరించాలన్నారు. అనంతరం విశాఖ అంబాసిడర్ వి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ విశాఖ నగరంలో జీవించడం చాలా అదృష్టం అని పర్యావరణానికి ప్రజల జీవన విధానానికి సరైన నగరమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని. ప్రజల సహకారంతో విశాఖనగరం మెరుగైన స్థానం సంపాదిస్తుంది అని తెలిపారు. అందుకు కృషి చేసిన జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జి ఆర్ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎన్ మూర్తి మాట్లాడుతూ ఏ.పి.ఎఫ్.ఇ.ఆర్.డబ్ల్యూ.ఏ.ఎస్. ద్వారా నివాసిత సంక్షేమ సంఘాలు విశాఖ నగర అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్నాయన్నారు.
అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్లో లఘు చిత్రాల పోటీలో ఎంపికైన "ప్లాస్టిక్ పిశాచి" అనే లఘు చిత్రానికి ప్రథమ బహుమతి యడ్లపల్లి సంతోష్ కుమార్ కు గౌరవ అతిధి వి. విజయసాయి రెడ్డి అందించారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021లో ప్రజల అవగాహన కొరకు కరపత్రాలను గౌరవ అతిధి విడుదల చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రత్యేక సేవలు కనపరచిన పారిశుద్ధ్య కార్మికులకు, పరిశ్రమలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, హోటల్స్ లకు, ఆసుపత్రులకు, ఎస్.ఎల్.ఎఫ్ సభ్యులకు, ఎన్జీవోలకు, బల్క్ వేస్ట్ జనరేటర్ లకు, నివాసిత సంక్షేమ సంఘాలకు, ఎస్.హెచ్.జి. లకు, మార్కెట్లకు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు గౌరవ అతిధి ప్రశంసాపత్రాలు అందించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైకాపా నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డాక్టర్ పి. విశ్వేశ్వరరావు, సినీ నటుడు మరియు లఘు చిత్రాల ఎంపిక న్యాయనిర్ణేత ఐ. ప్రసన్న కుమార్, జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్లు డాక్టర్ వి. సన్యాసిరావు, ఆర్.సోమన్నారాయణ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె. ఎస్. ఎల్. జి. శాస్ట్రీ, సహాయ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ ఆశయ సాధన, పోరాట పటిమ అందరికీ ఆదర్శ ప్రాయమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషిచేయాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. పూజ్యబాపూజీ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ గాంధీజీ తాను నమ్ముకున్న ఆశయసాధన కోసం అహింసనే ఆయుధంగా పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ శాఖకు అప్పగించిన పనులను సకాలంలో నిర్వహించి విజయం సాధించాలని జె.సి ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, భూరికార్డులు మరియు సర్వే శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి, కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాలకు చెందిన పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట పట్టణంలోని దేశవానిపేటలో గ్రామ సచివాలయ భవనాన్ని శుక్రవారం ఉప ముఖ్య మంత్రి ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బికే) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం వైయస్సార్ జలకళ పథకం బోర్ రిగ్గును జెండా ఊపి ప్రారంభించారు. ఉప ముఖ్య మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాకారమైందని పేర్కొన్నారు. మహాత్ముడి జయంతి రోజునే సరిగ్గా ఏడాది కిందట ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైందని చెప్పారు. దశాబ్ధాల పరిపాలన చేసిన వారు, రాజకీయ అనుభవం ఉన్న వారు చేయలేని గ్రామ స్వరాజ్యం అనే సంకల్పాన్ని వై.ఎస్.జగన్ అనే యువకుడు చేసి చూపించారని కొనియాడారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారని, ప్రభుత్వ పాలనను గ్రామాల చెంతకు చేర్చారని చెప్పారు. ముందు చూపు ఉన్నవాడే సరైన నాయకుడని పేర్కొంటూ ఇలాంటి నాయకుడే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. దీనికి నిదర్శనం ఆయన పాలన అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి చేయాలన్న దానిపై స్పష్టతతో, ఏమి చేస్తాననే విషయం ముందుగానే ప్రజలకు తెలియజేసారని ఉప ముఖ్య మంత్రి తెలిపారు. నవరత్నాలు, గ్రామ సచివాలయాలు.. ఇలా ప్రతి అంశాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే ప్రజలకు వివరించారని, మాటల్లో కాదు చేతల్లో చూపించే సీఎంగా, బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. గ్రామ స్థాయి నుంచి పరిపాలన జరగాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేసే పధకాలు చేరువ కావాలనే ఆలోచనతో, లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడమే కాకుండా వాలంటీర్లతో కలుపుకొని 4.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. 560కి పైగా సేవలను సచివాలయాల ద్వారా గ్రామాల్లోనే అందిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామ సచివాలయానికి అదనంగా రైతులు, పాడి రైతులకు సేవలందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వై.ఎస్.ఆర్ విలేజ్ క్లినిక్ పేరిట ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని వివరించారు. గోదాములు, శీతల గిడ్డంగులు కూడా గ్రామ సచివాలయ ప్రాంగణంలోనే ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్‌లకు భవనాలు, గోదాము, శీతల గిడ్డంగులు అందుబాటులోకి రానున్నాయని ఉప ముఖ్య మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంకల్పించారని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తన స్వగ్రామమైన మబగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జాతిపిత బాపూజి మహాత్మా గాంధీజి 151వ జయంతి, దివంగత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం జివిఎంసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజి, లాల్ బహుదుర్ శాస్త్రిల విగ్రహాలకు విశాఖ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) వై. విజయ సాయిరెడ్డి, విశాఖ లోకసభ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి లోకసభ సభ్యురాలు డా. సత్యవతి, శాసన సభ్యులు టి. నాగిరెడ్డి, ఎ. అదీప్ రాజ్, జి. అమర్ నాద్, వాసుపల్లి గణేష్ కుమార్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, జివిఎంసి అదనపు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజి, లాల్ బహుదూర్ శాస్త్రిల సేవలను కొనియాడారు. గాంధీజిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమయంలో గాంధీజి పాత్రను మరోసాని నెమరువేసుకున్నారు.