రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సందర్భంగా తిరుపతిలో స్వాగత ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ వైఎస్ఆర్ సమావేశం నందు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గిరీష మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23, 24 తేదీలలో పర్యటించనున్నారని కమిషనర్ గిరీష తెలిపారు. ఈ నెల 23 బుధవారం మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డుమార్గన తిరుమల చేరుకుని, కొంతసేపు విశ్రాంతి తీసుకొని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయం చేరుకుని శ్రీవారికి సమర్పించి, శ్రీవారిని దర్శించుకుని రాత్రి పద్మావతి అతిధిగృహం బస చేస్తారు, 24వ తేదీ ఉదయం తిరుమల నుండి 9 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడకి బయలుదేరుతారు కనుక రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి తిరుచానూరు మీదుగా 150 బైపాస్ రోడ్ మీదుగా ఉప్పరపల్లి కూడలి వరకు, అక్కడి నుంచి పద్మావతి మహిళా కాలేజీ మీదుగా, వెస్ట్ చర్చి, పూలే విగ్రహం, బాలాజీ కాలనీ, అలిపిరి వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, స్వాగత తోరణాలు, వైయస్ఆర్ ఆసరా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల లో తిరిగే గోవులును గోసాల కి తరలించాలని, కుక్కలను అనిమల్ కెర్కు తరలించాలని, నగరమంతా శుభ్రం చేసి అద్దంలాగ ఉండేలా చేయాలన్నారు. మట్టి దిబ్బలు తొలగించాలని, ప్యాచ్ వర్క్లు ఉంటే రేపటి లోపులో ప్యాచ్ వర్క్ చేసి పూర్తిచేయాలని, రోడ్లలో ఎక్కడ అ వర్షపు నీరు నిలువకుండా చూడాలని మరియు 50 మీటర్లకు ఒక్కొక్కరి చొప్పున రోడ్డుకు ఇరువైపులా శుభ్రం చేయించాలని. 24 వ తేదీ గురువారం అలిపిరి నుంచి కరకంబాడి రోడ్డు మీదుగా ఎయిర్ పోర్ట్ ముఖ్యమంత్రి బయలుదేరతారు గనుక ఆ రోడ్డు మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం పరచాలని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ తిరుమల బైపాస్ రోడ్డు వద్ద స్మార్ట్ సిటీ పనులు చూసే అవకాశం ఉన్నందున దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషన్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రాంరెడ్డి, మేనేజర్ హాసిమ్, శానిటరీ సూపర్వైజర్ గోవర్ధన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముఖం, రెవెన్యూ ఆఫీసర్ సుధాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు మొదలగు వారు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జేసి మార్కండేయులు అధికా రులనుఆదేశించారు. సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో ఐజీ శశిధర రెడ్డి, జేసి , అర్బన్ ఎస్.పి. రమేష్ రెడ్డి, భద్రతా అధికారులు, విధులు కేటా యించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేసి మాట్లాడుతూ, సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23, 24 తేదీలలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ నెల 23 బుధవారం మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డుమార్గన తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5.45 గంటలకు బేడిఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారన్నారు. శ్రీవారికి వస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీవారిని దర్శించుకుని రాత్రి 7.10 గంటలకు శ్రీ పద్మావతి అతిధిగృహం చేరుకుని బస చేస్తారని వివరించారు. గురువారం ఉదయం 6.25 గంటలకు మరోమారు శ్రీవారిని దర్శించుకుని నాద నీరాజనం సుందర కాండ కార్యక్రమంలో పాల్గొని ఉదయం 8.10 గంటలకు కర్నాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల నుండి 9 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నావరం బయలుదేరనున్నారని తెలిపారు. ఐజీ శశిధర రెడ్డి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత , ప్రయాణ మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గాన ముందస్తు వాహన శ్రేణి పరిశీలించారు. తిరుమలలో ముఖ్యమంత్రి బస చేయనున్న శ్రీ పద్మావతీ అతిథి గృహం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయం ప్రాంగణం , నాదనీరాజనం ప్రాంగణం, కర్నాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రం శంఖుస్థాపన ప్రాంతం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. రహదారికి ఇరువైపుల అవసరమున్న చోట బారీకేడ్లు ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రథమశ్రేణి వాహన పరిశీలనలో, సమీక్షలో పాల్గొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా ఐ ఏ ఎస్ , ఎయిర్పోర్టు డైరెక్టర్ సురేష్, చీఫ్ విమానాశ్రయ భద్రతా అధికారి దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, రేణిగుంట డిఎస్పీ చంద్రశేఖర్, తిరుపతి రూరల్ తహశీల్దార్ కిరణ్ కుమార్ , రేణిగుంట ఇంచార్జి తహశీల్దార్ శివప్రసాద్, రుయా సూపరింటెండెంట్ డా.భారతి, ఈఈ ఆర్.అండ్ బి సహదేవ రెడ్డి, 108 డి.ఎం. భాస్కరరావు, ఎ.ఎస్.ఓ. ఝాన్సీ లక్ష్మి, ఎస్పీడిసిఎల్ ఎస్.ఈ. చలపతి, సమాచార శాఖ ఎడి పద్మజ, తదితర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలో అక్టోబర్ 4 న యుపిఎస్ సి ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇందు కోసం హాల్ టిక్కెట్లు నెంబర్లు వారీగా తిరుపతి లో 14 కేంద్రాలలో హాజరు కానున్న 6802 మంది ఎక్కడ ఎంమంది పరీక్షలు రాస్తున్నారో అధికారులు తెలియజేశారు. ఆ క్రమ సంఖ్య పరంగా....50001 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- ఎ) - 576 మంది అభ్యర్థులు, 50002 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50003 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- ఎ) – 576 మంది అభ్యర్థులు, 50004 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50005 – శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల, బాలాజీ కాలనీ – 480 మంది అభ్యర్థులు, 50006 – ఎస్వీ యునివర్సిటి క్యాంపస్ హైస్కూల్ – 480 మంది అభ్యర్థులు, 50008 – ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ – 576 మంది అభ్యర్థులు, 50015 – శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం – 576 మంది అభ్యర్థులు, 50007- ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ – 576 మంది అభ్యర్థులు, 50009 –శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్ -576 మంది అభ్యర్థులు, 50025- కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ – 384 మంది అభ్యర్థులు, 50011- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -ఎ) – 480 మంది అభ్యర్థులు, 50012- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీ (వింగ్- బి ) – 343 మంది అభ్యర్థులు , 50013- ఎస్వీ హైస్కూల్ – 27 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారు.
తిరుపతి లో అక్టోబర్ 4న యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ ప్రిలిమినరీ పరీక్షలు 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని డిఆర్వో మురళి చెప్పారు. సోమవారం ఈ మేరకు పరీక్షల విధివిధాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, సివిల్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్ లు, పరీక్షా సమయం, కేంద్రాలలో పాటించాల్సిన నిబందనలు అభ్యర్థులకు అందాయని సూచించారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. అక్టోబర్ 1 న మరో మారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు వ్రాయనున్నారని, అర గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజీలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు. ఈ సమీక్షలో వెన్యూ సూపర్వైజర్లు ప్రకాష్ బాబు, సులోచనారాణి, మహాదేవమ్మ, బద్రమణి,పద్మావతమ్మ, వెంకటేశ్వర రాజు, కూల్లాయమ్మ , సావిత్రి , కృష్ణమూర్తి , శ్రీనివాసుల రెడ్డి, మధుసూధన రావు, ముణిరత్నం నాయుడు, సి. సూపర్ నెంట్ వాసుదేవ , డిటిలు లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి సోమవారం 15 ఫిర్యాదులు వచ్చా యని కమిషనర్ గిరీష చెప్పారు. ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులు పరిష్కార మార్గాలు చూపించాలన్నారు. అనంతరం నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను అదనపు కమిషనర్ హరిత ద్వారా అధికారులకు బదలాయించిరు. ఈ కార్యక్రమంలో ఎస్ఇ చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్ రామ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ సుధారాణి, మేనేజర్ హసిమ్, రెవిన్యూ ఆఫీసర్లు సుధాకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రఘు కుమార్, శ్రీధర్, దేవిక, సూపర్డెంట్ రవి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముఖం, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శారదమ్మ, వెటర్నరీ ఆఫీసర్ రవికాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, ముని రాజా, ప్రకాష్, మధుసూదన్ రెడ్డి, సూరిబాబు, శంకరయ్య, రఫీ,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి చేసే తరగతులు ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. కోవిడ్-19 తర్వాత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద నున్న పి ఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సోమవారం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించి,కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 9 ,10 తరగతులకు సంబంధించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సమ్మతితో సందేహాల నివృత్తి తరగతులు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యార్థులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు, ఇతర సామాగ్రి అంతా సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది అన్నారు. తల్లిదండ్రులకు ఏవిధమైన సందేహాలు ఉన్నా పాఠశాల ఉపాధ్యాయులు వద్దకు వచ్చి వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కొవిడ్ పట్ల భయం ఆందోళన చెందాల్సిన పనిలేదని, అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. డి ఆర్ డి ఎ ద్వారా ప్రతి విద్యార్థికి మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా 50 శాతం విధులకు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ 9,10 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మరియు మాస్క్ ను అందజేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు నిర్మాణ పనులు విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్రహం, డి వై ఇఓ వై.జయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాచిరాజు, ఉపాధ్యాయులు ,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని ఎంతో ఘన చరిత్ర గల మహారాజా కళాశాల మన వారసత్వ సంపద అని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సచివాలయ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంఆర్ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, దానిని సంరక్షించి, ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. కళాశాలలో అందమైన మొక్కలను నాటడంతోపాటు, ప్రాంగణం బయట ఉన్న చెట్లకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని కళాశాల ప్రిన్సిపాల్ జి.ఏ.కళ్యాణికి సూచించారు. గురజాడ విగ్రహం ఉన్న జంక్షన్‌ను కూడా అందంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. కళాశాలలో మొక్కలను నాటడమే కాకుండా, హరిత విజయనగరం సాధించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి హోర్డింగులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
వ్యవహరిక భాషోద్యమానికి అంకురార్పణ చేసిన వ్యవహార మహావ్యక్తి గురజాడ అప్పారావు అందించిన సేవలు చిరస్మరణీయమని జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం గురజాడ 158వ జయంతి వేడుకలును ఉడా గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ, మూఢా చారాల ముసుగులో జరిగే అమానుషాలను ఖండించడంతో పాటు, తెలుగు పదకవితకు ముత్యాలసరాలను అలంకరించిన ధన్యజీవి అని ప్రశంసించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు కథావనంలో తొలి కథా దిద్దుబాట్లు వెలయించిన ఆధునిక తెలుగు కథా సృష్టికర్త గురజాడ మాత్రమేనన్నారు. దేశమంటే మట్టికాదోయ్..దేమశమంటే మనుషులోయ్ అని గొప్ప జీవిత సత్యాలని జాతికి చాటి చెప్పిన మహాకవి అన్నారు. ఈ కార్యక్రమం లో ఏయూ విద్యార్థి నాయకులు విఎన్ మూర్తి, ఏపి నిరుద్యోగ జేఏసీ విశాఖజిల్లా అధ్యక్షులు సనపల తిరుపతిరావు, శ్రీకాకుళంజిల్లా అధ్యక్షులు ఎం.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో సోమవారం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహా కవి గురజాడ అప్పారావు 158 వ జయంతిని గురజాడ స్వగృహంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవేడుకల్లో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన అప్పల నాయుడు, మాజీ ఎం.పి. బొత్స ఝాన్సీ, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు గురజాడకు నివాళులు అర్పించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆరోజుల్లో గొప్ప పరిష్కారం చూపిన దార్శినికుడని కొనియాడారు. భావితరం అంతా గురజాడ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఆయన నేర్పిన స్పూర్తి ఎందరినో ప్రభావితం చేసిందని కలెక్టర్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయాన్ని ఆలపించిన సంగీత కళాశాల విద్యార్థులు ఆలపించారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను ఈరోజు నుంచి పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేసిన అధిరాలు ఈ ఉదయం నుంచి తిరిగి దర్శనాలు పునరుద్దరించారు. యాధావిధి గానే స్వామివారికి మేలుకొలుపు, వేకువ జామున పూజలు అనంతరం దర్శనాలకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ భద్రాజీ మాట్లాడు తూ, స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ క్యూలైన్‌లో రావాలని సూచించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని చెప్పారు. స్వామివారి దర్శనాలు ప్రారంభం కావడంతో అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది. వేకువ జామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు...
కోవిడ్ 19 నేపధ్యంలో తమ సంస్థ సామాజిక బాధ్యతగా 10వేల మందికి నిత్యావసర వస్తువులు అందచేయడం జరుగుతుందని జువారి సిమెంట్స్ జనరల్ మేనేజర్ తిలక్ బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అన్నం పేరిట ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం అక్కయ్యపాలెం విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేనన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1000 మంది కళాసీలు, వ్యాన్, ఆటో డైవర్లు ఇతర సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె తిలక్ బాబు మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా జువారి సిమెంట్ తన వంతు సామాజిక బాధ్యతగా సేవలను అందచేస్తోం దన్నారు. ఇందుకోసం ప్రతి సిమెంట్ బస్తా పైన ఒక రూపాయి పక్కన పెట్టి ఆ సోమ్ముతో ఆయా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవల కొనసాగిస్తున్నామని అయితే విశాఖలో మరింత మందికి నిత్యావసర వస్తువులను దశలవారీగా అందచేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గౌరవ అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఇప్పటికే సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ కార్యవర్గం సుమారు 6 లక్షల రూపాయిలతో దశలవారీగా నిత్యావసర వస్తువులను అందచేశారన్నారు. భవిష్యత్‌లో వారి సేవలు మరింతగా విస్తరించాలని ఆయన అకాంక్షించారు. కోవిడ్ నేపధ్యంలో జర్నలిస్టులు అందించిన సేవలు అందరి మన్ననలు పొందుతున్నాయిని అన్నారు. ప్రధాని మోడి తో పాటు ప్రతి ఒక్కరు మీడియా సేవలకు జేజేలు పలుకుతున్నారని ప్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శ్రీనుబాబు కోరారు. ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన విశాఖ జిల్లా స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుతరావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేక మందికి నిత్యావసర వస్తువుల అందచేశామన్నారు. ఇప్పుడు జువారి సిమెంట్ సంస్థ సౌజన్యంతో తొలివిడతగా వెయ్యిమందికి దశలవారీగా మరికొంతమందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ త్రినాధరావు, కార్యదర్శి ఉమామహేశ్వరావు కార్యవర్గసభ్యులు పాల్గోన్నారు.
ప్రధాన్ మంత్రి జన-ధన్ యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డులను రూ.లక్ష ప్రమాద బీమా కవరేజీతో అంతర్నిర్మితంగా చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 28.08.2018 తర్వాత తెరవబడిన పీఎంజేడీవై ఖాతాదారులకు ఈ కవరేజ్ మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ విషయమై మరిన్ని వివరాలను తెలియజేస్తూ, అర్హతగల , సుముఖంగా ఉన్న పీఎంజేడీవై ఖాతాదారులందరూ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాలలోనూ నమోదు కావొచ్చునని ఆయన తెలిపారు. పీఎంఎస్‌బీవై కింద రూ.రెండు లక్షల ప్రమాద బీమా కల్పిస్తారు. ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వార్షిక ప్రీమియం రూ.12 లుగా ఉంటుంది. ఖాతాదారుడు తమ సమ్మతి తెలియజేస్తే బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది ఆటో డెబిట్ అవుతుంది. పీఎంజేజేబీవై కింద రూ.రెండు లక్షల మేర జీవిత బీమాను కల్పిస్తారు. ఇందుకు ఖాతాదారులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి. దీనికి గాను వార్షిక ప్రీమియం రూ.330గా ఉంటుంది. ఖాతాదారుడు తమ సమ్మతి తెలియజేస్తే బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ప్రతి ఏడాది ఆటో డెబిట్ అవుతుంది.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిషనర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ స్పందన అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవచ్చున్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు విన్నవించాలని కమిషనర్ కోరారు.
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో గ్రామ / వార్డు సచివాలయాల వ్రాతపరీక్షల తీరును కమిషనర్ డా.స్రిజన స్వయంగా పరిశీలించారు. ఆదివారం పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో ఆమె పర్యటించి అక్కడ పరీక్షల ఏర్పాట్లును అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా జివిఎంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కూడా ఆమె పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఏ కేంద్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ – 20 నుండి 26వ సచివాలయ పరీక్షలు జరుగుతున్నందు, పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, మందులు, దివ్యాంగులకు వీల్ చైర్స్ తదితర ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరు రోజుల పాటు అధికారులు దగ్గరుండి పరీక్షాకేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూసి, పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట సంబందిత క్లస్టర్ అధికారులు, రూటు అధికారులు, కేంద్రాల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.