1 ENS Live Breaking News

విజయనగరం జిల్లాలో 2.1సెంమీ వర్షపాతం..

విజయనగరం జిల్లాలో మంగళవారం భారీగా కురిసన వర్షాలు 2.1 సెంమీగా నమోదు అయ్యింది. జిల్లాల్లో 9 మండలాల్లో అత్యధికంగా కురిసాయి. కాగా గుమ్మలక్ష్మీ పురంలో 34.2 మిల్లీమీటర్లు, గరుగుబిల్లిలో 10.4 మిల్లీమీటర్లు, శీతానగరంలో 6.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలియజేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్నందున అత్యవసర సర్వీసులు అందించేందు అధికారులు సిద్ధంగా ఉండాలని, రెయిన్ ఫాల్ ఎప్పటికప్పుడు నమోదు చేయడంతోపాటు, జిల్లా, డివిజన్ కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ లకు వచ్చిన సమాచారాన్ని జిల్లా కేంద్రాలకి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లోని పారిశుధ్య, వైద్యసిబ్బంది అందుబాటులో వుంటూ తాజా పరిస్థితిని తెలియజేయాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తహశీల్దార్లు, ఎంపీడీలను కలెక్టర్ ఆదేశించారు.

Vizianagaram

2020-09-22 13:08:03

మంత్రి ముత్తం శెట్టికోసం మ్రుత్యుంజయ హోమం..

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ సింహాచలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మంగ ళవారం త్రయంబక నవగ్రహ మృత్యుంజయ హోమం జరిపించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలు వల్లిస్తుండగా,నాయకులందరూ దేవతామూ ర్తులకు పూజలు చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి సత్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈహోమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని పూజలు చేసారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, కరోనా ప్రారంభం నుంచి ప్రజా సంక్షేమమే ద్యేయంగా  మంత్రి  ముత్తంశెట్టి సుడిగాలి పర్యటనలు  జరిపారన్నారు. కరోనా విపత్తు నుంచి ప్రజలను ఆదుకోవడానికి అనేక ప్రాంతాల్లో నిరంతరం పర్యటన లు చేసి  నిత్యవసర వస్తువులను  పంపిణీ చేయడం జరిగిందన్నారు. మంత్రి  ఆరోగ్యం కొంత కుదుటపడిందని త్వరలోనే మరింత ఆరోగ్యంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. వార్డు ఇన్చార్జి ఈటి  శ్రీనివాస్ మాట్లాడుతూ, మంత్రి కోలుకొని  తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని తామంతా స్వామిని కోరుకుంటున్నామన్నారు. హోమం నిర్వాహకుడు కర్రి సత్తిబాబు మాట్లాడుతూ, మంత్రి ఆరోగ్యం మెరుగుపడటం కోసం మృత్యుంజయ హోమం జరిపించామన్నారు. వార్డు వైసిపి అభ్యర్థి ఎర్ర వరాహ నరసింహము మాట్లాడుతూ, త్వరగా మంత్రి  కోలుకోవాలని ఆకాంక్షించారు.అందరికీ హోమ ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బెహరా భాస్కరరావు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నెంబరు ఆశా కుమారి, వార్డ్ అధ్యక్షులు  కొలుసు ఈశ్వరరావు, గునిశెట్టి శ్రీనివాస్, దాసరి కనకరాజు, లండ శ్రీను, గేదెల మురళీకృష్ణ, పలువురు నాయకులు మహిళలు పాల్గొన్నారు. 

Simhachalam

2020-09-22 12:57:27

మూడోరోజు సచివాలయ పరీక్షలు ప్రశాంతం..

విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా.హరిజహర్ లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో జరుగుతున్న మూడవ రోజు పరీక్షలను స్వయంగా పరీశిలించారు. ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు, ఎంత మంది గైర్హాజరయ్యారు తదితర వివరాలను పరీక్షల సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున అభ్యర్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిర్వాహకులకు సూచించారు. వైద్యసిబ్బంది ఎప్పుడు అవసరమొచ్చిన వైద్యసేవలతో పాటు మందులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, సామాజికి దూరం, మాస్కుల ధారణ తదితర అంశాలను క్షణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయానికి వచ్చిన వారినే అనుమతించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Vizianagaram

2020-09-22 12:42:49

తీరు మార్చుకోకపోతే ఇంటికి పంపిస్తా..జెసి

విశాఖజిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది విధినిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినా, ప్రజలతో సఖ్యతో మెలకపోయినా, పనితీరును మెరుగుపరుచు కోకపో యినా  కఠిన చర్యలు తీసుకుంటామని  సంయుక్త కలెక్టరుఎం. వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం సోమవారం విశాఖ నగరంలోని  ఊటగెడ్డ వార్డు సచివాల యాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఆయన  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్నిఅభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పనిచేయాలని సిబ్బందిని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రికార్డులను సవ్యంగా నిర్వహించాలని కోరారు.  పంపిణీ చేయ కుండా మిగిలిఉన్న 15 రేషను కార్డులను వాలంటీర్ల ద్వారా పంపిణీచేయాలని ఆదేశించారు. రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయకుండా సరిగ్గా సమాదానాలు యివ్వలేకపోయిన అడ్మినిస్ట్రేటర్ ను తీవ్రంగా మందలించారు.  పనితీరును మెరుగుపరచుకోకపోతే  తదుపరి పరిపాలనా చర్యలను తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకుండా గైరుహాజరైన వి.ఆర్.ఒ. వి.సూర్యప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతీశాఖ సిబ్బంది హాజరు పట్టికను సక్రమంగా నిర్వహించాలన్నారు. అదే భవనంలో ఉన్న యితర సచివాలయాల సిబ్బందిని కూడా బాద్యతాయుతంగా పనిచేసి  ప్రజలకు  మెరుగైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మహరాణిపేట మండల తహశీల్దారు అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఊటగెడ్డ సచివాలయం

2020-09-21 20:11:25

అభ్యుదయ కవి గురజాడ నేటి తరానికి ఆదర్శనీయం...

సంఘసంస్కర్త, అభ్యుదయ కవి, సామాజిక దురాచారాలను రూపుమాపిన గొప్ప వైతాళికుడు  గురజాడ అప్పారావు అని డిప్యూటీ సీఎం మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నా రు.  సోమవారం పార్వతీపురంలో గురజాడ  158 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాస్ , పాముల పుష్ప శ్రీ వాణి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గురజాడ సాహితీ ప్రక్రియలు నేటి తరానికి కూడ ఆచరనీయమని, తన రచనల ద్వారా ఎంతో మంది మహిళలను ప్రభావితం చేసి చైతన్యవంతం చేసిన మహావ్యక్తి గురజాడ మంత్రి ఆళ్ల నాని  అన్నారు. బాల్య  తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయంఅని గురజాడ వ్రాసిన కన్యాశుల్కం సినిమా చూసిన తర్వాత గురజాడ బావుకత ప్రగాఢ మైన ముద్ర వేసిందని మంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణ దాస్, పాముల పుష్ప శ్రీ వాణి, డాక్టర్ అప్పలరాజు  అన్నారు.ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం వాడుకభాషలో అర్థమయ్యే విధంగా రూపొందించిన మహాకవి గురజాడమంత్రులు  అన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర అనే బిరుదు ఇచ్చి సత్కరించారు అని తెలిపారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయం ఎక్కడ కనపడినా గురజాడ గుర్తుకు వస్తారని తెలిపారుగొప్ప సంఘసంస్కర్తగా అనేక దురాచారాలను రూపుమాపడంలో విశేష కృషి చేశారని మంత్రులు  కొనియాడారు. 

Parvathipuram

2020-09-21 20:08:29

రైతుల నడ్డివిరవడానికే వ్యవసాయబిల్లు ఆమోదం..

‌రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ బిల్లలను రాజ్యసభలో బిజెపి అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నగర కార్యదర్శి డా. బి.గంగారావ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయబిల్లుకి  వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ ‌విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‌మాట్లాడుతూ దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున రైతులు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నా, ఎన్డీయే మిత్రపక్షమైన అకాలిదల్‌కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేసినా కనీసం వాటిని పరిగణలోనికి తీసుకోకుండా బిల్లులను ఆమోదింపజేసుకోవడం గర్హనీయమన్నారు. ఈ బిల్లు వలన దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు.  వ్యవసాయం మొత్తం కోటీశ్వర్లకు, బడా వ్యాపారులకు, విదేశీ వ్యాపారులపరమౌతుందని అన్నారు. రాజ్యసభలో ఈ బిల్లును ఓటింగ్‌కు గాని, సెలక్ట్ ‌కమిటీకు గాని పంపించకుండా దొడ్డిదారిని అమలు చేయడం బిజెపి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని అన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసారని విమర్శించారు.తెలంగాణా రాష్ట్రసమితి (టిఆర్‌ఎస్‌)‌తో సహా వివిధ పార్టీలు లోక్‌సభ, రాజ్యసభలోని ఈ బిల్లులను వ్యతిరేకించినా మన రాష్ట్రానికి చెందిన అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఈ బిల్లులను సమర్థించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. మాజీకార్పొరేటర్‌ ‌బొట్టా ఈశ్వరమ్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు, జిఎస్‌టి, లాక్‌డౌన్‌ ‌మొదలగు విధానాలతో గత ఆరు సంవత్సరాల నుండి ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ‌బి.జగన్‌, ‌నగర కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, ఎం.రాంబాబు, ఆర్‌ఎన్‌.‌మాధవి, బి.సూర్యమణి, వి.కృష్ణారావు, ఆర్‌పి.రాజు, డి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

జవిఎంసీ గాంధీ విగ్రహం

2020-09-21 19:56:27

రూ.206 కోట్లతో ఆసుప్రతులు ఆధునీకరణ..మంత్రిఆళ్ల

శ్రీకాకుళం జిల్లాలో రూ.206 కోట్లతో నాడు – నేడు మరియు నాబార్డు క్రింద అన్ని ఆసుపత్రుల ఆధునీకరణ  పనులను చేపట్టాని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివా స్ ( నాని ) స్పష్టం చేసారు. ప్రత్యేకంగా సీతంపేటలోని ఆసుపత్రికి రూ. 19 కోట్ల నాబార్డు నిధులను మంజూరుచేయడం జరిగిందని, మంజూరైన నిధులతో టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలైనట్లు  తెలిపారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా పెనువిపత్తును ఎదుర్కొన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా  ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలిచామని, కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేసారు.  భవిష్యత్తులో ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆసుపత్రుల నిర్మాణమే కాకుండా  ఇటీవల 7వేలకు పైగా వైద్యులు, స్పెషలిస్టులు, నర్సుల నియామకం చేపట్టామని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత పెద్దఎత్తున రిక్రూట్ మెంట్ జరిగిన దాఖలాలు లేవని తేల్చిచెప్పారు. అదేవిధంగా కొన్ని వేల మంది వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కోవిడ్ నివారణ కోసం తీసుకోవడం జరిగిందని అన్నారు. నవరత్నాలు, నాబార్డు , నాడు – నేడు నిధుల క్రింద రూ16 వేల కోట్లు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా పి.హెచ్.సి నుండి పెద్ద ఆసుపత్రి వరకు, శిక్షణ సంస్థలు, ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి ఎక్వీప్ మెంట్ తదితర ఆధునీకరణ పనులు చేయబోతున్నామని తెలిపారు.  జిల్లాలోని 386 సబ్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందడం హక్కుగా కల్పిస్తామని చెప్పారు. రిమ్స్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని, ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలో రెట్టింపు శ్రద్ధతో ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా సీతంపేట ఎం.పి.డి.ఓ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రులకు మరియు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పోలీసులు నుండి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ పర్యటన కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ , రాజాం శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, మామిడి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, ఆర్.డి.ఓ టి.వి.ఎస్.జి.కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డా. ఏ.కృష్ణవేణి, డి.ఎం.హెచ్.ఓ డా.ఎం.అనూరాధ, డి.సి.హెచ్.ఎస్ జిల్లా సమన్వయకర్త డా.బొడ్డేపల్లి సూర్యారావు, నగర పంచాయతీ కమీషనర్ బి.ఎం.శివప్రసాద్,  పాలకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జె.రవీంద్ర కుమార్, సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డా.ఎన్.శేషగిరిరావు,  పాలకొండ మండల తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎం.పి.డి.ఓ జె.ఆనందరావు, సీతంపేట మండల తహశీల్ధారు పి.సోమేశ్వర్, ఎం.పి.డి.ఓ వై.ఉమామహేశ్వరరావు,  పాలకొండ మండల సర్వేయర్ పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Seethampeta

2020-09-21 19:53:57

భూరికార్డుల స్వచ్చీకరణ త్వరగా చేపట్టాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ప్రతీ మండలంలో మూడు గ్రామాలను ఎంపికచేసి భూమి రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాలను వీలైనంత త్వరగా చేపట్టాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూరికార్డుల స్వచ్చీకరణపై సంబంధిత అధికారులతో జె.సి సమీక్షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మూడు గ్రామాలను ఎంపికచేసి నిర్ణీత ప్రోఫార్మా – 1 మరియు 2కు సంబంధించి అప్ డేషన్ పూర్తికావాలన్నారు. మూడు గ్రామాల మాన్యువల్ సర్వే భూరికార్డులను తీసుకొని గతంలో చేసిన డేటా ఎంట్రీతో సరిపోల్చాలని, ఏదైనా వ్యత్సాసం ఉంటే వాటిని సరిదిద్దాలని కోరారు. మాన్యువల్ భూరికార్డులో ఉన్న వివరాలు డేటా ఎంట్రీ చేయబడిన సర్వే మరియు భూవివరాలతో సరిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పనిని గ్రామ రెవిన్యూ సెక్రటరీలు, గ్రామ సర్వేయర్లు పూర్తిచేయాలని అనంతరం మండల సర్వేయర్ మరియు తహశీల్ధారు తనిఖీ చేసి మూడు రోజుల్లోగా వాటిని ధృవీకరించాలని వివరించారు. ఈ దశ పూర్తయిన తదుపరి మూడు గ్రామాలకు సంబంధించిన సర్వే మరియు భూరికార్డుల ప్రాప్తికి సిద్ధం చేసుకోవాలని, ప్రతి సర్వే నెంబరు సబ్ డివిజన్ లో గల విస్తీర్ణం మరియు వర్గీకరణ మరోసారి నిర్ధారించుకోవాలని స్పష్టం చేసారు. సర్వే మరియు భూ రికార్డులు గత 60 నుండి 90 ఏళ్ల క్రితం తయారు చేయబడినందున, సర్వే నెంబర్లు, విస్తీర్ణం మరియు వర్గీకరణ వంటి అనేక వివరాలు గణనీయంగా మార్పులు చెంది ఉంటాయన్నారు. కావున భూకమతాలు వారి అజమాయిషీ చేసిన తరువాత మాత్రమే వెబ్ ల్యాండ్ అడంగళ్ ప్రాప్తికి సర్వే మరియు భూ రికార్డుల్లో అవసరమైన వివరాలను నమోదుచేయవలసి ఉంటుందన్నారు. రైతులకు, పట్టాదారులకు సంబంధించిన భూములలో భాగ పంపకములు, క్రయవిక్రయాలు, గిఫ్ట్ లు, పట్టాదారుల మరణాంతరం వారసుల పేరున హక్కులు బదలాయించుట వంటి అనేక కారణాల వలన వెబ్ ల్యాండ్ అడంగళ్ లోని వివరాలు నవీకరించవలసిన అవసరం కూడా ఉంటుందని, భూ సేకరణ , డీపట్టా మంజూరు చేయుట, భూ బదలాయింపు, ఎలిమినేషన్ వంటి ప్రక్రియల ద్వారా భూరికార్డుల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులు, పట్టాదారులు గ్రామ సచివాలయాలు, మీ-సేవా కేంద్రాల ద్వారా అవసరమైన ఇ-పట్టాదారు పాసు పుస్తకాలు, 1బి ప్రతులు, అడంగళ్ కాపీలు దోషరహితంగా పొందే పరిస్థితి వస్తుందని, ఈ లక్ష్యంతోనే సర్వే బృందాలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలపై మండల తహశీల్ధారులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇతర సాంకేతిక కారణాల వలన రైతు భరోసా, వ్యవసాయ ఉత్పాదితాలు, సరఫరా మరియు కనీస మద్ధతు ధర పొందడం విషయంలో ఇబ్బందులు ఉండరాదని జె.సి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, సర్వే మరియు భూరికార్డుల సహాయ సంచాలకులు ఎప్పటికపుడు పర్యవేక్షించి నివేదికను తమకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, సర్వే మరియు భూరికార్డుల సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, డివిజనల్ ఇన్ స్పెక్టర్ జి.వెంకటరావు, మండల తహశీల్ధారులు,సర్వేయర్లు,వి.ఆర్.ఓలు , గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-21 19:38:17

క్రీడాభివ్రుద్ధి పనుల త్వరగా పూర్తిచేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో జ‌రుగుతున్న క్రీడాభివృద్ది ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు అధికారుల‌ను ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో జ‌రుగుతున్న క్రీడల‌కు సంబంధించిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న సోమ‌వారం ప‌రిశీలించారు. ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.  ఇండోర్ స్టేడియంను సంద‌ర్శించి, ఇక్క‌డ సుమారు రూ.6కోట్ల‌తో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ రూ.6కోట్ల‌లో రూ.3కోట్లు కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌ని, రూ.25ల‌క్ష‌లు ఎంపి లేండ్స్ కాగా, రూ.75ల‌క్ష‌లు రాష్ట్ర క్రీడాభివృద్ది సంస్థ మంజూరు చేసింద‌ని జిల్లా క్రీడాభివృద్ది అధికారి ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్రావు జెసికి వివ‌రించారు. మిగిలిన రూ.2కోట్ల‌ను విఎంఆర్‌డిఏ మంజూరు చేసింద‌న్నారు. ప‌నుల‌న్నిటీనీ త్వ‌ర‌గా పూర్తి చేసి, స్టేడియంను అన్ని వ‌స‌తుల‌తో సిద్దం చేయాల‌ని జెసి ఆదేశించారు.  అనంత‌రం విజ్జీ స్టేడియంను జెసి సంద‌ర్శించారు. ఇక్క‌డ నిర్మిత‌మ‌వుతున్న స్పోర్ట్స్ స్కూలు భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. స్పోర్ట్స్ స్కూలును రూ.20కోట్ల‌తో ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వం సుమారు రూ.60లక్ష‌లు మంజూరు చేసింద‌ని డిఎస్‌డిఓ తెలిపారు. ఈ నిధుల‌తో ప‌రిపాల‌నా భ‌వ‌నాన్ని, డార్మెట‌రీల‌ను నిర్మించిన‌ట్లు తెలిపారు. వాటిని త్వ‌ర‌గా పూర్తిచేసి, విద్యార్థుల‌కు అందుబాటులోకి తీవాల‌ని జెసి అన్నారు. అట‌వీశాఖ భూమిని వేరుచేస్తూ కంచెను నిర్మించాల‌ని సూచించారు. అలాగే విజ్జీ స్టేడియం సుమారు 70 ఎకరాల్లో విస్తరించి ఉండాల‌ని, మ‌రోసారి పూర్తిగా స‌ర్వే చేయించి,  విస్తీర్ణాన్ని ఖ‌రారు చేయాల‌ని జెసి ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జెసి వెంట డిఎస్డిఓతోపాటుగా, ఎపి క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సూర్య‌నారాయ‌ణ‌రాజు, గ‌ణేష్ త‌దిత‌రులు ఉన్నారు.

Vizianagaram

2020-09-21 19:10:12

సచివాలయ పరీక్షకు 2వ రోజు 68.15 శాతం హాజరు..

జ‌య‌న‌గ‌రంజిల్లాలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోని ఖాళీ పోస్టుల భ‌ర్తీకి సోమ‌వారం నిర్వ‌హించిన రెండోరోజు ప‌రీక్ష‌లు కూడా ప్ర‌శాంతంగా జ‌రిగాయి. విజ‌య‌న‌గ‌ రంలోని 19 ప‌రీక్షా కేంద్రాల్లో ఉద‌యం ప‌రీక్ష జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు మొత్తం 5,756 మంది హాజ‌రు కావాల్సి ఉండ‌గా, 3,714 మంది హాజ‌ర‌య్యారు. 2042 మంది ప‌రీక్ష‌కు గైర్హాజ‌రు కావ‌డంతో, హాజ‌రు శాతం 64.52గా న‌మోద‌య్యింది.  మ‌ధ్యాహ్నం 9 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు 2,995 మంది హాజ‌రు కావాల్సి ఉండ‌గా, 2,041 మంది హాజ‌ర‌య్యారు. 954 మంది గైర్హాజ‌రు అవ్వ‌డంతో, హాజ‌రు శాతం 68.15గా న‌మోద‌య్యింది. విజ‌య‌న‌గ‌రం ఎంఆర్ క‌ళాశాల‌లోని ప‌రీక్షా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ త‌నిఖీ చేశారు. సెయింట్ జెసెఫ్ పాఠ‌శాల‌, ఎజిఎల్ క‌ళాశాల‌ల్లోని ప‌రీక్షా కేంద్రాల‌ను డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు త‌నిఖీ చేశారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్యసిబ్బందితోపాటు మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ సైకిళ్లను ఏర్పాటు చేశారు.

Vizianagaram

2020-09-21 19:07:42

రూ.186 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులు..

విజయనగరం జిల్లాలో రూ.186 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవనాలు  మౌలిక వసతులు కల్పించనున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ చెప్పారు. సోమవారం పార్వతీపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పల రాజు పార్వతీపురంలో పర్యటించి ఆసు పత్రులు నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపికచేయడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రూ.49 కోట్లతో ఇక్కడ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని, నెల రోజుల్లో ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం పై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలోని కోవిడ్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులు కోరిన వెంటనే బెడ్ కేటాయిస్తున్నారా లేదా అనే విషయాన్ని సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఆసుపత్రిలో కల్పిస్తున్న భోజన వసతి, అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై హెల్ప్ డెస్క్ వద్ద ప్రశ్నించారు. కోవిడ్ విభాగంలో బెడ్ ల అందుబాటులో వున్నదీ లేనిదీ తెలిపే విధంగా బయట ఏర్పాటు చేసిన బోర్డును పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక శాసన సభ్యులు అలజంగి జోగారావు, జాయింట్ కలెక్టర్  డా.జి.సి.కిషోర్ కుమార్, ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు ఆఫీసర్ ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విదే ఖర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2020-09-21 19:03:00

డిజివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ కమిటీలు వేయాలి..

విశాఖ జిల్లాలో డివిజన్ స్థాయి రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో సమావేశపరిచి, కమిటీలు ఏర్పాటుచేయాలని  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి., అట్రాసిటీలపై జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంను సోమవారం జిల్లాకలెక్టరేట్ లో నిర్వహించారు. ఎస్.సి., ఎస్.టి.లపై అట్రాసిటీలపై ఉన్న కేసులు సత్వరమే పూర్తి కావాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.లకు సంబంధించి రావలసిన నష్టపరిహారం రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  ఏజన్సీలో అతి తక్కువ కేసులు నమోదౌతున్నప్పటికి వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.  ఒక  ఉపాధ్యాయుని పై పై స్థాయి ఉద్యోగి కులం పేరుతో దూసించారని, దీనికి సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి.లకు సంబంధించి ఉంటున్న కేసులు న్యాయబద్దంగా ఉన్నవైతేనే చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఈ సమావేశం తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ లో సమావేశం ఉంటుందని, ఈ మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు.  కమిటీ సభ్యులు జోసెఫ్ మాట్లాడుతూ గోపాలపట్నంకు సంబంధించి ఒక ప్రిన్సిపల్, ఉద్యోగులకు మధ్య జరిగిన సంఘటన గూర్చి కలెక్టర్ వివరించగా దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత పోలీసు అధికారిని అడుగగా చార్జ్ షీట్ తయారు చేసినట్లు చెప్పారు.  తహసిల్థార్ల కార్యాలయాలకు, పోలీసు స్టేషన్లకు వెల్లి ఫిర్యాదులు ఇస్తే తీసుకొనేటట్లు ఆదేశాలు జారీ చేయవలసినదిగా కలెక్టర్ ను సభ్యులు మల్లేశ్వరరావు కోరగా సి.పి., ఎస్.పి., తహసిల్థార్లకు లేఖలు పంపాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి.లకు ప్రభుత్వం పంపిణీ చేసిన బంజర భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, 20 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారని కలెక్టర్ దృష్టిటి తీసుకురాగా  పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జిల్లా ఎస్.పి. కృష్ణారావు, జిల్లా జాయిట్ కలెక్టర్లు-1,2,3 ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, ఆర్డిఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి, పోలీసు అధికారులు, తదితర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-21 18:52:39

డిగ్రీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం..ఏయూ విసి

ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సెమిష్టర్‌ ‌పరీక్షలను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం పాలక మండలి సమావేశ మందిరం నుంచి ఆన్‌లైన్‌లో ఏయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. విద్యార్థుల వెంట పారదర్శకంగా ఉండే మంచి నీళ్ల సీసాను అనుమతించాలని సూచించారు. అనారోగ్య లక్షణాలతో ఉన్న విద్యార్థులకు వేరుగా పరీక్షల నిర్వహణకు వీలుగా పరీక్ష కేంద్రాలలో ప్రత్యేక గదులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాల్స్‌కు పలు సూచనలు చేశారు. వర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ, ఐదవ సెమిష్టర్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌తరగతులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా తరగతుల నిర్వహణ జరగాలన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.శ్రీనివాస రావు, పి.రాజేంద్ర కర్మాకర్‌, ఆర్‌.‌శివ ప్రసాద్‌, ‌కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ఎస్‌.‌వి సుధాకర్‌ ‌రెడ్డి, జె.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-21 18:44:16

తిరుమలలో సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ు పరిశీలన..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను సోమ‌వారం టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి ప‌రిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబ‌రు 23న గ‌రుడ‌సేవ రోజు ముఖ్య‌మంత్రి శ్రీ‌వారికి ప‌ట్టువ‌ స్త్రాలు స‌మ‌ర్పించేందుకు తిరుమ‌ల‌కు రానున్నారు. ఈ నేప‌థ్యంలో బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి ఆల‌యం వ‌ర‌కు, నాద‌నీరాజ‌నం వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త ఇత‌ర ఏర్పాట్లను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 24న ఉద‌యం 7 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ బిఎస్‌.య‌డ్యూర‌ప్ప నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. వేదిక‌పై భ‌ద్ర‌త‌, అలంక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన తీరుపై చ‌ర్చించారు. అనంత‌రం గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో ఈ అంశంపై అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్వీబీసీ సిఈవో  సురేష్ కుమార్ ఇతర విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

Tirumala

2020-09-21 18:42:22

సచివాలయ పరీక్షలకు 2వ రోజు 69.5శాతం హాజరు..

విశాఖపట్నం జిల్లాలో సచివాలయాల్లో నియామకాలకు రెండవ దఫా రాత పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. 54 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షల్లో  69.5 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈరోజు పరీక్షలకు 30,243 మంది హాజరు కావలసి వుండగా 20,897 మంది హాజరుకాగా, 9344 మంది హాజరుకా లేదు.  ఉదయం పరీక్షలకు 19036 మందికి 12 952మంది (68 శాతం) హాజరవగా 6084 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 11,207 మందికి 7945 మంది (71 శాతం) హాజరవగా 3260 మంది హాజరు కాలేదు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో ఒకరు  ఐసొలేషన్ గదిలో రాత పరీక్షకు  హాజరయ్యారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మీడియాకి వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, ఐసోలేషన్ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదేవిధంగా మిగిలిన పరీక్షలు కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నం జిల్లా

2020-09-21 18:26:27