1 ENS Live Breaking News

రైతుల సంక్షేమం కంటే మిల్లర్లు ముఖ్యం కాదు..

రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరులో పర్యటించి సంగం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీచేశారు. శనివారం ధాన్యం కొనుగోలు జరుగుతున్నతీరును పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, నాణ్యత ప్రమాణాల పరంగా రైతులకు మేలుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక  నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాకే ప్రత్యేకమైన ఎడగారు పంట ధాన్యం కొనుగోలులో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే మిల్లర్లతో సమీక్ష నిర్వహించి అన్ని విషయాలపై మాట్లాడామని ప్రభుత్వానికి సహకరిస్తామని వారు చెప్పినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఒక వేళ అలా జరగని పక్షంలో ప్రభుత్వపరంగా కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడబోమన్నారు. సంగం మండలంలో ఈ ఏడాది సుమారు 10వేల ఎకరాలలో వరి పంట పండిందని మండల వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. తొలిసారిగా నెల్లూరు - 3354 రకం 3వేల ఎకరాలలో రైతులు పండించారన్నారు.  ప్రభుత్వం పుష్కలంగా నీరు ఇవ్వడం వలన పంట దాదాపు రెట్టింపుగా దిగుబడి వచ్చిందని ఓ రైతు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ పంటను అమ్ముకోవడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం కూడా సమస్యగా పరిణమించిందని రైతులు వాపోయారు. మిల్లర్లను నియంత్రించే చట్టం చేసి అన్నదాతలను ఆదుకోవాలని సంగం మండల రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.  అందుకు సమాధానంగా మంత్రి గౌతమ్ రెడ్డి ఏ మాత్రం ఆందోళన చెందవద్దని బదులిచ్చారు. అవసరమైతే రైతన్నల సమస్యల పరిష్కారానికి అడ్డుపడే ఏ వ్యవస్థనైనా తొలగించి..మరో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. కష్టాలు తీర్చే ప్రభుత్వం..అవసరమయితే ఆ కష్టాలను సృష్టించే వారిపై చర్యలకు ఎంతదూరమైనా వెళతామని మంత్రి పేర్కొన్నారు. 

ఆత్మకూరు

2020-09-19 15:52:17

ప్రజలకు పారదర్శకంగా సేవలందాలి..

శ్రీకాకుళం జిల్లా పిఎన్ కాలనీ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ శనివారం తనిఖీ చేశారు. సచివాలయం నుంచి అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రభు త్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజల పరిశీలనకు ప్రదర్శించారా ? లేదా అని గమనించారు.  వాలంటీర్లు, సచివాల య సిబ్బంది కోవిడ్  సందర్భంగా చేపట్టిన ఇంటింటి సర్వే చేసిన పరిస్థితిని తనిఖీ చేశారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టలేదని తద్వారా కోవిడ్ లేకుండా నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. వైరస్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద ఉండరాదని అన్నారు. కొంతమంది కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వాలంటీర్లు, సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి సేవలు అవసరం లేదని వ్రాతపూర్వకంగా తీసుకో తీసుకోవాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్పుడు ఎటువంటి సహాయం అందే పరిస్థితి ఉండదని గమనించాలని, అది స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. వాలంటీర్ల, సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. వృత్తిలో మంచి సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే పరమావధి, తద్వారా సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు అందించడంలో ఎటువంటి జాప్యం జరగ రాదని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు ఎక్కువ మంది సచివాలయానికి వస్తారని వారికి మెరుగైన సేవలు అందించి పంపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సేవలు అండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో  పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. సచివాలయాల ఏర్పాటు అందులో భాగమేనని అన్నారు. యువతగా అద్భుతమైన పనితీరు కనిపించాలని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట రావు , ఆయుష్ వైద్య అధికారి సి.హెచ్. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-09-19 15:41:06

28 ‌నుంచి ఏయూ డిగ్రీ చివరి సెమిష్టర్‌ ‌పరీక్షలు..

ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సెమిష్టర్‌ ‌పరీక్షలను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు నిర్వహిస్తామని యూజీ పరీక్షల డీన్‌ ఆచార్య డి.వి.ఆర్‌ ‌మూ ర్తి  తెలిపారు. ఏయూలో శనివారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం బిఎస్సీ కోర్సుకు, మద్యాహ్నం నుంచి బిఏ, బికాం కోర్సులకు పరీక్షలు జ రుగుతాయన్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలోని ఏయూ పరిధిలో డిగ్రీ విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. పూర్తి సమాచారం ఏయూ వెబ్‌సైట్‌ ‌నుంచి పొందాలన్నారు. ఈ నెల 21వ తేదీన  ఏయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో పరీక్షల నిర్వహణపై వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసా దరెడ్డి వెబినార్‌ ‌నిర్వహిస్తారన్నారు. ఈ వెబినార్ లో చాలా అంశాలు చర్చకు వస్తాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులు సామాజిక దూరం పాటించాల న్నా రు. ఖచ్చితంగా పరీక్షల సమయంలోనూ మాస్కులు ధరించే పరీక్షలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

Visakhapatnam

2020-09-19 15:31:03

అంతర్వేదిలో ప్రారంభమైన నూతర రథ నిర్మాణం..

అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శనివారం నూతర రధాన్ని నిర్మించే పనులకు దేవాదాయ ధర్మాదాయ అధికారు శ్రీకారం చుట్టారు. ఈమేరకు వనివా రం ఈ రోజు నూతన రథం నిర్మాణ పనులు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే స్వామి వారి కల్యాణోత్సవం నాటికి  స్వా మివారు నూతన రథం పై నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆగ మేఘాలపై రథం నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా  కొత్తపేట నియోజకవర్గం రావుల పాలెం వెంకటసాయి  టింబర్ డిపోలో ఉన్న కలపను గుర్తించారు. ఈ నూతన రధం నిర్మాణానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 95 లక్షలు కేటాయించింది. ఈ కొత్త రథనం పనులను దేవాదాయశాఖ రాష్ట్ర అధికారిణి బ్రమరాంబ సారధ్యంలో ప్రారంభించారు.  62 ఏళ్ల చరిత్రగల పాత రథం నమూనాలోనే కొత్త రధాన్ని కూడా నిర్మించడానికి అన్ని కొలతలూ తీసుకున్నారు నిర్మాణ దారులు. స్వామివారి రథం దగ్గం అయిన తరువాత వరుసగా రాష్ట్రంలో ఏదోమూల హిందూ దేవాలయాల్లో దుండగులు తెగబడుతూనే ఉన్నారు. కుట్రకోణంలో దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వం హిందువుల మనోభావాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతుంది. దీనిపై బీజేపి తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తూనే వుంది..

Antervedi Pallipalem

2020-09-19 15:12:27

స్వచ్ఛత లక్ష్యంతో..ప్రధానమంత్రి అవార్డు రేసులో..

విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొదటి స్థానంలో నెలబెట్టాలి...కాలుష్య విశాఖను స్వచ్ఛ విశాఖ చేయాలి...దేశం మొత్తం విశాఖ వైపే తొంగిచూడాలి...సాలిడ్ వేస్ట్ మే నేజ్ మెంట్ లో అగ్రభాగంలో నిలవాలి...అలాచేయాలంటే ఒక దమ్మున్న అధికారి కావాలి..ఆమే ప్రభుత్వం ఏరికోరి జీవిఎంసీకి నియమించిన ఆ ఐఏఎస్ అధికా రిణి డా.స్రిజన. ఈ అధికారిణి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సత్వర చర్యలతో దేశంలోని స్వచ్ఛ నగరాల్లో టాప్ 10లో నిలిచింది జివిఎంసి. ఇపుడు ఈ అధికారి ముందున్న లక్ష్యం టాప్ వన్ లో నిలబెట్టాలనే. దానికోసం ఈ అధికారిణి చేస్తున్న శ్రమ, తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పైగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు–2020కి ఎంపికైన 10 జిల్లాల జాబితాలో విశాఖ చోటు దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్‌(ఎస్‌బీఎం)లో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధాన మంత్రి అవార్డు కోసం విశాఖపట్నం దేశంలోని తొలి పది యూఎల్‌బీ క్లస్టర్ల జాబితాలో నిలిచింది. ఈసారి కేవలం విశాఖ నగరం మాత్రమే కాకుండా.. జిల్లాలోని యూఎల్‌బీలన్నీ కలిపి క్లస్టర్‌గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది కొరత కాస్త వెనుకబడి వున్న జివిఎంసికి ప్రభుత్వం అధికారులను కేటాయిస్తే ఆ లక్ష్యం నెరవేరుతుం దడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

మహావిశాఖ నగరపాలక సంస్థ

2020-09-19 14:02:35

నిన్న పంచకర్ల..నేడు వాసుపల్లి...రేపు..?

విశాఖజిల్లా వైఎస్సార్సీపీ లో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి...మొన్నటి వరకూ పార్టీని ఎండగట్టిన వారంతా ఒక్కసారిగా పార్టీలోకి అమాంతం క్యూ కట్టేస్తున్నారు. ముందుగా పార్టీలో రావాలనుకున్న గంటా శ్రీనివాసరావుకి బెర్తు ఖరారు కానప్పటికీ ఎమ్మెల్యేలకి మాత్రం లైన్ క్లియర్ అవుతుంది. మాజీలు నేరుగా పార్టీలో చేరిపోయారు. నిన్న పంచకర్ల రమేష్ అధికారాపార్టీ తీర్థం పుచ్చుకుంటే..నేడు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల చైర్మన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ మహా నగరంలో నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క స్థానం కూడా అధికారపార్టీ గెలవలేకపోయింది. కానీ 2020లో మాత్రం గెలిచిన ఎమ్మెల్యే ఖాతా ఒకటి అధికారపార్టీలోకి చేరిపోయింది. మరికొద్ది రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, వెలగపూడి, పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు తదితరులు పార్టీ తీర్ధం పుచ్చుకోవడినికి సిద్ధ పడుతున్నారనే వార్తలు గుప్పు మంటు న్నాయి. టిడిపి రాజున్న రోజుల్లో తన బలాన్ని నిరూపించుకునే అవకాశాలు లేనందునే అధికారపార్టీలోకి వలసలు పెరుగుతున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. కొత్తవారి రాకతో..పదేళ్లుగా పార్టీకి సేవలు చేసిన వారి పరిస్థితి ఏమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ అందరికీ న్యాయం జరగడంతో అవకాశం వున్నవారంతా అధికారపార్టీ తీర్ధం పుచ్చుకోవడం చర్చనీయాంశం అవుతుంది...!

Visakhapatnam

2020-09-19 13:34:42

నిలకడగానే మంత్రి ఆరోగ్యం.. ఫోనులో అందుబాటు

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోగ్యం నిలకడగానే వుంది. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం బాగానే వున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. మంత్రి ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, నాయకులకు ఫోన్ లే అందు బాటులో ఉంటున్నారు. ఎవరినీ ఇంటికి రావొద్దని, తన ఆరోగ్యం బాగానే వుందని నాయకులకు సూచిస్తున్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న తరుణంలో కొందరు నాయకులు మంత్రి ఆరోగ్యంపై ఆరాతీస్తున్న సమయంలో తాను మందులు వాడుతూ, ఇంటిలోనే ఉన్నాని ముఖ్య కార్యకర్తల ద్వారా సమాచా రం పంపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అదే సమయంలో ప్రభుత్వ నిభందనల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా వాడా లని ఏ నాయకుడు ఫోన్ చేసినా వారికి సూచించడం విశేషం. కరోనా వైరస్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, అలాగని అశ్రద్ధ కూడా చేయకూ డదని మంత్రి ప్రజలకు వివరిస్తున్నారు.

Visakhapatnam

2020-09-19 11:21:07

అమ్మగా ఆలన..అధికారిణిగా పాలన..!

ముద్దులొలికే ఆ బాబుకి అమ్మగా ఆలన చూస్తూనే...అధికారిణిగా పాలన కూడా చేస్తున్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన... అమ్మతనానికి, అధికారి పాలన ఎలాంటి అడ్డూ ఉండదని రుజువు చేస్తున్నారు... అధికారిక కార్యక్రమాలకు కూడా తన బాబుని తీసుకువచ్చి బాబుకి తల్లిదూరమైన లోటుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిణి అంటే మామూలు విషయం కాదు ఎన్నో పనులు, మరెన్నో ఒత్తిడిలు వాటన్నింటినీ దైర్యంగా ఎదుర్కొంటూనే కరోనా సమయంలో తన బాబుని జాగ్రత్తగా చూసుకుంటూనే, అధికారిక కార్యక్రమాలకు ఎలాంటి డోకా లేకుండా ముందుకి సాగిపోవడం ఈ ఐఏఎస్ అధికారిణికి అలవాటుగా మారిపోయింది. ఐఏఎస్ అధికారిణి అంటే..చుట్టూ పదిమంది అధికారులు..బంట్రోతులు..పరిపాలన సిబ్బంది...ఎలా చూసుకున్నా చిటికేస్తే ఏ పనైనా చేయాల్సిందే...కానీ అవేమీ తన సొంత అవసరాలకు వినియోగించుకోరు ఆమె...కేవలం కార్యాలయ పనులకు మాత్రమే అధికారులను సిబ్బందిని వినియోగిస్తూ, సొంతపనులు తానే స్వయంగా చేసుకుంటూ ముద్దులొలికే బాబుని మరింత అపురూపంగా చూసుకుంటున్న ఈ ఐఏఎస్ అధికారిణి తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి సన్నివేశం శుక్రవారం జివిఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈఎన్ఎస్ కంటపడింది. చూసింది చూసినట్టు...అక్షరాక్షరం ఏరి కోరి అమ్మకి వందనం చేస్తూ...అధికారిణికి నమస్కరిస్తూ  ఎంతగానో ఆలోచింపజేసేలా రాసిన వార్తే ఇది...

జివిఎంసి

2020-09-18 19:45:23

ఏపి సెట్‌ ‌కి అక్టోబరు 5 వరకు దరఖాస్తు గడువు..

రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (ఏపిసెట్‌) ‌పరీక్షను డిసెంబరు 20వ తేదీన నిర్వహించనున్నట్లు మెంబర్‌ ‌సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు  తెలిపారు. శుక్రవారం ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ వెయ్యి అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ 2 వేలు అపరాధ రుసుముతో అక్టోబరు 21వ తేదీ వరకు, రూ 5 వేలు అపరాధ రుసుముతో నవంబరు 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చునన్నారు. పూర్తి సమాచారం ఏపిసెట్‌ ‌వెబ్‌సైట్‌ ww.apset.net.inనుంచి పొందవచ్చునన్నారు. విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆశక్తిగల విద్యార్ధులు, దరఖాస్తు చేద్దామని మరిచిపోయిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-18 19:22:31

అట్టడుగు వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి

సమాజంలో అట్టడుగు వర్గాలను అభివృద్దిలో మిళితం చేయడం ద్వారా సమ్మిళిత ప్రగతి సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శుక్రవారం ఏయూ సెంటర్‌ ‌ఫర్‌ ‌స్టడీ ఆఫ్‌ ‌సోషల్‌ ఎక్స్‌క్యూజన్‌ అం‌డ్‌ ఇం‌క్లూజివ్‌ ‌పాలసీ(సిఎస్‌ఎస్‌ఇఐపి) నిర్వహించిన ‘ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ ఇన్‌ ఇం‌డియా- రోడ్‌ ‌మ్యాప్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ ఇం‌క్లూజన్‌’ ‌వెబినార్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను పూర్తిస్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా సామాజిక వేర్పాటును రూపుమాపడం సాధ్యపడుతుందన్నారు.  తద్వారా పేదలు, అట్టడుగు వర్గాలు జీవనంలో మెరుగైన అభివృద్ధి సాకారం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేస్తోందన్నారు. దీనిలో భాగంగా పేదలకు ఉపయుక్తంగా జగనన్న అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ‌వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, జగనన్న వసతి దీవెన వంటి పథకాలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. సామాజిక వేర్పాటు ప్రజల హక్కులను దూరం చేస్తోందదని జెఎన్‌యూ డిల్లీ ఆచార్యులు వై.చిన్నారావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వేర్పాటులు, అణచివేతలు ఉన్నాయన్నారు. వీరిని సమాజంలో భాగం చేయడం ఎంతో ప్రధానమన్నారు.  ఏయూ ఆంత్రపాలజీ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ ‌వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివాసీలు నేటికీ ప్రధాన జీవన స్రవంతికి దూరంగా జీవనం సాగిస్తున్నారన్నారు. కులాల వారీగా జనాభా గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్రం సంచాలకులు ఆచార్య పి.సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. సదస్సులో 90 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Andhra University

2020-09-18 19:04:44

ఆధారాలు చూపిస్తే మంత్రిపదవని వదిలేస్తా..

రాష్ట్రంలో సంచనలం స్రుష్టించి ఈఎస్ఐ స్కాంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టిడిపి అన్ని ప్రయత్నాలు చేస్తుందని  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూ రు జయరాం ఆరోపించారు. ఈఎస్ఎఐ స్కాంలో ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై జయరాం తీవ్రంమండిపడ్రారు. శుక్రవా రం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్‌ కారు తమది కాదని, దాని పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అంటూ చమత్కరించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిన మంత్రి టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు దండిగా వసూలు చేసుకున్నారన్నారు.

అలూరు

2020-09-18 15:42:20

ఉప్పుటేరుకి భారీగా వరదనీరు..

క్రిష్ణాజిల్లాలో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కరాణంగా కొల్లేరు సరస్సు నుంచి ఉప్పుటేరు మేజర్ డ్రైన్ ద్వారా సముద్రంలోకి పొంగిపొర్లుతుంది. అంతేకాకుండా చిన్న గొల్లపాలెం గ్రామంతోపాటు,  పల్లెపాలెం లో ఇళ్ళల్లోనికి నీరు చేరింది. దీనివలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.చిన్నగొల్లపాలెం చరిత్రలో ఇలాంటి మునక అత్యంత అరుదని,కొల్లేరు సరస్సు,యనమదుర్రు డ్రై లనుండి వచ్చే వ్యర్ధ జలాలను సముద్రంలోకి తీసుకెళ్లే ఉప్పుటేరు సముద్రపు మొగవద్ద ఇసుక మేట వేయటం తో నీరు సముద్రము లోనికి వెళ్లే అవకాశం లేక ఈ ముంపుకి గురవుతున్నామని ఆ దీవి గ్రామవాసులు తెలిపారు. వరద నీరు పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నం-చిన్నగోల్ల పాలెం గ్రామాలను కలుపుతూ  ఉప్పుటేరు పై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పై పొంగి ప్రవహించటం తో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంతం గూండా భీమవరం,నర్సాపురం,పాలకొల్లు,ఏలూరు ఇతరప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. గతంలో వరదత కారణంగా చిన్నగొల్లపాలెం దీవిలో షుమారు 1500 వందల ఎకరాలకు పైనే సారవంతమైన సర్వే,మామిడి, కొబ్బరి ఇతర ఫల తోటలు కోతకు గురై సముద్రం లో కలిసిపోయి అనేకమంది రైతుల పొలాలు సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా తిరిగి ఈ వరద నీరు ఊరి మీదకు రావటంతో అలాంటి దుర్ఘటన పునరావృతం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

చిన్నగొల్లపాలెం

2020-09-18 15:23:09

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు...

ప్రకాశం బ్యారేజికి వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజ్ కి ఇన్‌ఫ్లో 3.95 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 3.90 లక్షల క్యూసెక్కులుగా నమోదు అవుతుంది. కాగా సాగునీటి అవసరాల కోసం 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరో నాలుగు రోజులపాటు ఈ వరద ప్రవాహం కొన సాగుతుందన్న అధికారులు..లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజి దిగువున వున్న ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల తీవ్రతను తెలియజేసేందుకు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితిని గమనించడానికి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడం, పిల్లకాలువల నుంచి నీరు భారీగి వచ్చి చేరడంతో బ్యారేజికి వర్షపునీటి తాడికి అధికమైందని అధికారులు చెబుతన్నారు.

Prakasam Barrage

2020-09-18 15:10:14

రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పరిశోధన ద్వారా చ‌ర్య‌లు..

కొబ్బరి  రైతుల‌కు ఆదాయం పెంచి ఇత‌ర రాష్ట్రాల‌తో పోటి ప‌డే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పాల‌ని మంత్రి కన్నబా బు అధికారులను ఆదేశించారు. అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వెబినార్ లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసా ల కన్నబాబు మాట్ల‌డుతూ,  2020-2021 ఏడాదిని డా||వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయములో కొబ్బరి నామ‌ సంవత్సరంగా ప్రకటన చేయ‌డం కొబ్బ‌రి రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న బాధ్య‌త‌ను మ‌రింత‌ పెంచింద‌న్నారు. రైతు భ‌రోసా కేంద్రాల వ‌ద్ద ఉన్న వ్య‌వ‌సాయ స‌హ‌య‌కుల ద్వారా కొబ్బ‌రి రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కాల‌ను  చూపాల‌న్నారు. అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి కొబ్బ‌రి ఉత్పత్తిపై ప‌రిశోధ‌న‌లు నిరాటంకంగా చేయ‌డంపై మంత్రి  హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొబ్బరి రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరగాలన్నారు. కొబ్బరి ఉత్పత్తితో దేశములో నాల్గవ స్థానములోను, ఉత్పాదకతలో మొదటి స్థానములోనూ ఉందన్న మంత్రి 1955లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయశాఖ పరిధిలో కొబ్బరిపై పరిశోధన చేపట్టడానికి, మొట్టమొదటి కొబ్బరి పరిశోధన కేంద్రాన్న 60 ఎకరాల విస్తీర్ణములో ఏర్పాటు చేసింద‌న్నారు. అనంత‌రం  1966లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పరిధికి బదిలీ అయినదన్నారు.  ఇక్కడ చేసిన పరిశోధనల ఫలితముగా గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో 2007 లో 'గౌతమి గంగ' గా విడుదల చేయబడిందన్నారు. కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందులను కనిపెట్టిన  పద్ధతి, రాష్ట్రములో తొలుతగా ఈ పరిశోధనా స్థానంలోనే గుర్తించారని గుర్తు చేశారు. ఈ వెబినార్ లో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరామీరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Ambajipeta

2020-09-18 14:54:45

జాతీయ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వం మైనారిటీ వర్గాల విద్యార్ధిని, విద్యార్ధులకు అందించే జాతీయ ఉపకార వేతనాల కొరకు వచ్చే నెల 31 లోగా నమోదు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎమ్.అన్నపూర్ణమ్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధులు, జైనులు, సిక్కులు, పార్శీకుల విద్యార్ధినీ విద్యార్ధులు నేషనల్ స్కాలర్ షిప్ పొందుటకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 1 నుండి 5వ తరగతి విద్యార్ధులకు ఏడాదికి రూ.1,000/-లు, 6 నుండి 10వ తరగతి విద్యార్ధులకు రూ.5వేలు, 11,12 తరగతి విద్యార్ధులకు రూ.6వేలు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు రూ.6వేల నుండి 12వేలు, వృత్తి విద్యా సాంకేతి విద్యార్ధులకు రూ.25 వేల నుండి రూ.30 వేలు స్కాలర్ షిప్ పొందవచ్చని ఆమె చెప్పారు. 1 నుండి 10వ తరగతి విద్యార్ధుల కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు, ఆ తదుపరి విద్యార్ధులకు రెండు లక్షల రూపాయలు, వృత్తి విద్యా సాంకేతిక విద్యార్ధులకు రెండున్నర లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండాలని ఆమె చెప్పారు. ఉపకార వేతనం పొందు విద్యార్ధులు ముందు తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని ఆమె స్పష్టం చేసారు. అర్హత గల విద్యార్ధినీ విద్యార్ధులు www.scholarships.gov.in వెబ్ సైట్ నందు అక్టోబర్ 31లోగా నమోదు చేసుకోవాలని ఆమె  ఆ ప్రకటనలో కోరారు. ఇతర వివరాల కొరకు దుర్గా ప్రసాద్, జూనియర్ సహాయకులు 82475 54334, సూర్యనారాయణ, జూనియర్ సహాయకులు 94403 99588 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2020-09-18 13:48:19