1 ENS Live Breaking News

ఉపాది హామీ పథకం లక్ష్యాలు అధిగమించాలి..

విశాఖ జిల్లాలో  ఉపాధి హామీ పథకం లో చేపట్టిన  భవన నిర్మాణాలు రాబోయే మార్చి నెలలోగా పూర్తి చేయాలని   జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. బుధవా రం  స్థానిక కలెక్టర్ కార్యాలయంలో  ఉపాధి హామీ  పథకం   అమలుపై  ఎస్ ఇ లు , ఇ ఇ లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నఈ పనులను  ఎలాంటి జాప్యం లేకుండా చేయాలని  తెలిపారు.  మెటీరియల్ కాంపోనెంట్  ఖర్చు చేయడం, భవనాల నిర్మాణం పూర్తి చేయడం  లక్ష్యాలకు అనుగుణంగా  జరగాలని తెలిపారు. అంగన్ వాడీలు, రైతు  భరోసా కేంద్రాలు , సచివాలయాలు , విలేజ్  హెల్త్ క్లినిక్ లు , కాంపాండ్ వాల్స్ నిర్మాణాల పనులన్నీ తప్పని సరిగా  శనివారం లోగా  ప్రారంభించాలని  తెలిపారు. ఇంజనీర్లు వారికి కేటాయించిన  హెడ్ క్వార్టరు లో నివాసం ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు.  కొంత మంది ఇంజనీర్లు  లక్ష్యాలను చేరుకోవడంలో  విఫలమౌతున్నారని , వారి పని తీరు  మెరుగుపర్చుకోకపోతే  పరిపాలనా చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. ఇప్పటి నుంచి  ప్రతిరోజు  టెలి కాన్పరెన్స్ ద్వారా సమీక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర రెడ్డి,  ఆర్ డబ్ల్యు ఎస్  ఎస్ ఇ  రవికుమార్, ఎస్ ఎస్ ఎ పిడి మల్లికార్జునరెడ్డి, హౌసింగ్ పిడి జయరామ్ చారీ, డ్వామా పిడి సంధీప్, గిరిజన సంక్షేమ ఇ ఇ లు ,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-09-23 19:02:21

నిర్మాణ పనులకు సిమెంట్ సరఫరా కీలకం..

ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిమెంట్   సకాలంలో  అందించడమే కీలకమని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో ఈ విషయమై ఆయన సమీక్ష నిర్వహించారు.  ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు కుదుట పడ్డాయని, రవాణా కు ఎటువంటి ఆటంకాలు లేనందున సిమెంటును సకాలంలో అందజేయాలన్నారు. సిమెంట్ కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను నిర్మాణం జరిగే చోటికి చేరవేయ వలసిన బాధ్యత కంపెనీలకు ఉండదని స్పష్టం చేశారు. సిమెంట్ సరఫరా లేనట్లయితే పనులు సాగక నిర్మాణ కార్మికులకు, ప్రభుత్వ అధికారులకు ఎంతో సమయం వృధా అవుతుందన్నారు. ఆయా కంపెనీలతో చెల్లించవలసిన మొత్తాలను ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నామని వీలైనంత వేగంగా పూర్తి చెల్లింపులు  చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, గృహ నిర్మాణం, నీటి పారుదల పథకాలు, రోడ్ల నిర్మాణం మొదలైన వాటిని అన్నింటికీ పెద్ద ఎత్తున సిమెంటు అవసరం అవుతుందన్నారు. సిమెంట్ కంపెనీలు తమ బాధ్యతగా తమకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సరఫరా చేసి అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ పర్యవేక్షక ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ  రవికుమార్ గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు జయ రామాచారి, నీటిపారుదల శాఖ తదితర  శాఖల ఇంజనీరింగ్ అధికారులు వివిధ సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-09-23 18:59:48

అనంతలో రేపు కరోనా పరీక్షలు చేసేదిక్కడే..

అనంతపురం జిల్లాలో రేపు (24.09.2020)  కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాల వివరాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వరుసగా..హిందూపురం మున్సిపాలిటీ, మడకశిర మున్సిపాలిటీ,  పుట్టపర్తి మున్సిపాలిటీ, ధర్మవరం మున్సిపాలిటీ, తాడిపత్రి మున్సిపాలిటీ, గుంతకల్లు మున్సిపాలిటీ, గుత్తి మున్సిపాలిటీ,  పామిడి మున్సిపాలిటీ, రాయదుర్గం మున్సిపాలిటీ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, కదిరి మునిసిపాలిటీ, ఓడీ చెరువు పి.హెచ్.సి, అమడగూరు పి.హెచ్.సి, గాండ్లపెంట  పి.హెచ్.సి, ఎన్ పి కుంట  పి.హెచ్.సి, తలపుల పి.హెచ్.సి,  కురుగుంట పి.హెచ్.సి, బుక్కరాయసముద్రం  పి.హెచ్.సి, రాప్తాడు  పి.హెచ్.సి, కొర్రపాడు పి.హెచ్.సి,  కూడేరు పి.హెచ్.సి, ఆత్మకూరు పి.హెచ్.సి, ధర్మవరం ఏరియా ఆసుపత్రి, సీకే పల్లి  పి.హెచ్.సి, ఎన్ ఎస్ గేట్  పి.హెచ్.సి, బత్తలపల్లి పి.హెచ్.సి, కనగానపల్లి పి.హెచ్.సి,లేపాక్షి పి.హెచ్.సి, చిలమత్తూరు పి.హెచ్.సి, పరిగి  పి.హెచ్.సి,  సోమందేపల్లి పి.హెచ్.సి, కళ్యాణదుర్గం సి.హెచ్.సి, శెట్టూరు  పి.హెచ్.సి, వజ్రకరూరు పి.హెచ్.సి, బ్రహ్మసముద్రం  పి.హెచ్.సి,  హిందూపురం మండలం (పిపి యూనిట్స్/పిహెచ్ సి), ఫిక్స్డ్ లొకేషన్స్ వివరాలకొస్తే... మునిసిపల్ గెస్ట్ హౌస్,  జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, సి.డి.హాస్పిటల్, ఓల్డ్ టౌన్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కరోనా లక్షణాలున్నవారు తక్షణమే ఆయా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు. 

Anantapur

2020-09-23 18:57:30

కిసాన్ రైల్ ఛార్జీలు 50% తగ్గించాలి..

కిసాన్ రైల్ ద్వారా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్ కు చేరవేసే అనంత ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను 50 శాతం  తగ్గించాల్సిందిగా గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారికి మంగళవారం లేఖ ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. గుంతకల్లు డి ఆర్ ఎంకు పంపిన లేఖ నందు కిసాన్ రైల్ ప్రవేశపెట్టడంతో పాటు ఈనెల 9వ తేదీన మరియు 19వ తేదీన అనంత ఉద్యాన ఉత్పత్తులను న్యూఢిల్లీలోని అజాద్పూర్ మండికి తరలించడంలో రైల్వే శాఖ ద్వారా అందించిన సహాయ సహాకారాలకు జిల్లాలోని రైతులు మరియు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ నేపథ్యంలో కిసాన్ రైల్ ద్వారా ఒక టన్ను  ఉద్యాన ఉత్పత్తులు ఢిల్లీకి చేరవేసేందుకు 5136/- రూపాయల రవాణా చార్జీలు  చెల్లించడంతో పాటు వాటికి అదనంగా ఉద్యాన ఉత్పత్తుల లోడింగ్ మరియు అన్ లోడింగ్ ఖర్చులు  రైతులకు భారంగా అయ్యాయన్నారు. కిసాన్ రైల్ ద్వారా ఒక టన్నుకు రూ. 5136 / - లు చొప్పున 23 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 15 వ్యాగన్స్  ద్వారా 345 మెట్రిక్ టన్నులను నెలలో నాలుగు పర్యాయాలు కిసాన్ రైల్ ద్వారా పంపేందుకు ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మే 2021 వరకు 32 సార్లు కిసాన్ రైల్ నడిపే విధంగా ప్రతిపాదించారన్నారు.  టన్నుకు రూ 5136/- ల చొప్పున  345 మెట్రిక్ టన్నులకు రూ.17.71 లక్షల రవాణా చార్జీలను రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 32 సార్లు కిసాన్ రైల్ ద్వారా 11,040 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్ కి చేరవేసేందుకు 567 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఇందులో 50 శాతం రవాణా చార్జీలు అనగా రూ.283.50 లక్షలు  రైల్వే శాఖ ద్వారా భరిస్తే, మిగిలిన రూ.283.50 లక్షలను రైతులు భరిస్తారన్నారు . రైల్వే శాఖ ద్వారా భరించే రవాణా ఛార్జీల మొత్తాలను కేంద్ర ఆహార తయారీ మంత్రిత్వశాఖ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం' నుండి గానీ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన వనరులు నుండి కానీ చెల్లించేందుకు చర్యలు తీసుకుని రైతులకు సహాయం చేయవలసిందిగా   జిల్లా కలెక్టర్ గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ కు  లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Anantapur

2020-09-23 18:47:58

రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు..మంత్రి అవంతి

విశాఖపట్నం జిల్లాలో రెడ్డిపల్లి - పద్మనాభం రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు.  రెడ్డిపల్లి-పద్మనాభం రోడ్డు  సుమారు 3.50 కి.మీ. విస్తరణకుగాను  న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్.డి.బి.) సహకారంతో పనులు చేపట్టుటకుగాను ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నం.303, తే 22.11.2019 ది, టి.ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.10.04 కోట్లు (అక్షరాల పది కోట్లు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరగా  తక్షణమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు లను జారీ చేసినట్లు మంత్రి వివరించారు.  

Visakhapatnam

2020-09-23 18:27:09

బోగాపురం ఎయిర్ పోర్టు 2023కి పూర్తికావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా రానున్న రోజుల్లో జిల్లా ఆర్ధికాభివృద్ధి సాధ‌న‌లో భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డు విమానాశ్ర‌యం చోద‌క‌శ‌క్తి కానుంద‌ని రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌రికాల్ వ‌ల్ల‌వ‌న్ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అతిపెద్ద మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టు ఇదని, దీనిని ఎట్టి ప‌రిస్థితుల్లో 2023 నాటికి పూర్తిచేయాల‌ని కృత‌నిశ్చ‌యంతో వుంద‌న్నారు. ఈ ప్రాజెక్టు నిర్ణీత గ‌డువులో పూర్తి కావాలంటే నిర్మాణం ప‌నులు త్వ‌ర‌గా ప్రారంభించాల్సి వుంద‌న్నారు. దీనిని దృష్టిలో వుంచుకొని భూసేక‌ర‌ణ ప్రక్రియ‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. జిల్లా ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం న‌గ‌రానికి వ‌చ్చిన ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌రికాల్ వ‌ల్ల‌వ‌న్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్‌, రెవిన్యూ, భూసేక‌ర‌ణ అధికారుల‌తో స‌మావేశ‌మై భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేక‌ర‌ణ‌, పున‌రావాసంపై స‌మీక్షించారు. జిల్లా అభివృద్ధితోనే కాకుండా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీల‌క‌మ‌ని, అందువ‌ల్ల దీని ప్రాధాన్య‌త‌ను దృష్టిలో వుంచుకొని భూసేక‌ర‌ణ‌, పున‌రావాస ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌లో భాగంగా గుర్తించిన ప్ర‌భుత్వ భూమిని ముందుగా నిర్మాణ ప‌నులు చేప‌ట్ట‌నున్న జి.ఎం.ఆర్‌. సంస్థ‌కు అప్ప‌గించాల‌న్నారు. ఎయిర్ పోర్టుకు అవ‌స‌ర‌మైన 2,750.78 ఎక‌రాల భూమిలో ఇప్ప‌టివ‌ర‌కు 2383.02 ఎక‌రాల భూసేక‌ర‌ణ పూర్తిచేసి అప్ప‌గించార‌ని, ఇంకా అప్ప‌గించాల్సి వున్న 71 ఎకరాల ప్ర‌భుత్వ‌ భూమిని ప‌దిరోజుల్లో ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థ‌కు అప్ప‌గించాల‌ని సూచించారు. భూసేక‌ర‌ణ యూనిట్ వారీగా సేక‌రించిన‌, సేక‌రించాల్సి వున్న జిరాయితీ భూములు, ఎసైన్డు భూములు, ప్ర‌భుత్వ భూములు, కోర్టులో వున్న రిట్ పిటిష‌న్ల వివ‌రాల‌పై ఆయా భూసేక‌ర‌ణ అధికారుల‌తో స‌మీక్షించారు. ప్ర‌భుత్వ భూమిని నిర్ణీత ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి అప్ప‌గించే బాధ్య‌త రెవిన్యూ డివిజ‌న‌ల్ అధికారిదేన‌ని స్ప‌ష్టంచేశారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌ల‌కు భూసేక‌ర‌ణ‌పై సంపూర్ణ అవ‌గాహ‌న వుంద‌ని, వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని, భూసేక‌ర‌ణ అధికారులు కూడా త‌మ ప‌రిధిలో వేగ‌వంతం అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

Vizianagaram

2020-09-23 15:57:09

ఇ-స‌ర్వీసుల్లో విజయనగరం అగ్రస్థానం..

వివిధ అంశాల్లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకొని అగ్ర‌స్థానంలో నిలుస్తున్న విజ‌య‌న‌గ‌రం జిల్లా, ఇ-స‌ర్వీసుల్లో కూడా రాష్ట్రంలో మొద‌టి స్థానంలో నిలిచింది. ఇ-రిక్వెస్టు ద్వారా వ‌చ్చిన ధ‌ర‌ఖాస్తులను స‌కాలంలో ప‌రిష్క‌రించ‌డం ద్వారా ఈ ఘ‌న‌త జిల్లాకు ద‌క్కింది.  అన్ని శాఖ‌ల‌కు సంబంధించి, వ‌చ్చిన ధ‌ర‌ఖాస్తుల్లో,  94.93శాతాన్ని ప‌రిష్క‌రించి, స‌కాలంలో ఆయా సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డం ద్వారా అగ్ర‌స్థానాన్ని సాధించ‌గా,  రెవెన్యూ ప‌ర‌మైన అంశాల్లో కూడా 93.37శాతం ప‌రిష్క‌రించ‌డం ద్వారా తాజాగా జిల్లాకు ఫ‌స్ట్‌ర్యాంకు ద‌క్కింది.   గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌భుత్వం వివిధ ర‌కాల సేవ‌ల‌ను అందిస్తున్న విష‌యం తెలిసిందే. వాటిని నిర్ణీత కాల‌ప‌రిమితిలో ప్ర‌జ‌ల‌కు అందించాల్సి ఉంది. దాని ప్ర‌కారం పౌర స‌ర‌ఫ‌రాలు, రెవెన్యూ, ఇంధ‌నం, ర‌వాణా, మున్సిప‌ల్, పంచాయితీరాజ్‌, యువ‌జ‌న సేవ‌లు, వ్య‌వ‌సాయం, మార్కెటింగ్‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌, ప‌రిశ్ర‌మ‌లు, నైపుణ్యాభివృద్ది, ఓట్ల న‌మోదు, స‌మాచార‌శాఖ‌, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమ‌శాఖ‌, కార్మిక‌శాఖ‌, వైద్యారోగ్య‌శాఖ త‌దిత‌ర ప్ర‌భుత్వ‌ విభాగాల‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా స‌చివాల‌యాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 4,56,732 ద‌ర‌ఖాస్తులు అందాయి. వీటిలో 4,33,592 ధ‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌డంతో, 94.93 శాతం స‌గ‌టుతో మ‌న జిల్లా మొద‌టి స్థానంలో నిలిచింది. శ్రీ‌కాకుళం, వైఎస్ఆర్ క‌డ‌ప‌, కృష్ణా జిల్లాలు మ‌న త‌రువాత స్థానాల్లో నిలిచాయి.  రెవెన్యూ శాఖ‌కు సంబంధించి కూడా తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు రాష్ట్రంలో మొద‌టి స్థానం ద‌క్కింది. కేవ‌లం రెవెన్యూ శాఖ‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 2,35,435 ధ‌‌ర‌ఖాస్తులు అందాయి. వీటిలో ఇప్ప‌టికే 2,19,845 ధ‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి, 93.37శాతం స‌గ‌టుతో మొద‌టి స్థానంలో జిల్లా నిలిచింది. విశాఖ‌ప‌ట్నం, కృష్ణా, వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లాలు మ‌న త‌రువాత స్థానాల‌ను సాధించాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ నిరంత‌రం ఇ-రిక్వెస్టుల‌పై స‌మీక్షించ‌డం, ఆయా శాఖ‌లు స్పందించి వాటిని స‌కాలంలో ప‌రిష్క‌రించ‌డం ద్వారా విజ‌య‌న‌గరం జిల్లాకు ఈ గౌర‌వం ద‌క్కింది.

Vizianagaram

2020-09-23 15:34:45

శ్రీకాకుళంజిల్లా లో 4వరోజు 72% హాజరు..

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  బుధవారం, ఉదయం,  గ్రామ వ్యవసాయ  సహాయ కులు  (గ్రేడ్-2) (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ) పోస్టునకు  పరీక్షలు జరిగాయి. జిల్లాలో 5 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్,  గీతాంజలి స్కూల్, భాష్యం హై స్కూల్, చైతన్య హై స్కూల్, ఎం.వి.ఎస్. డిగ్రీ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయని చెప్పారు.  మొత్తం 702 మంది అభ్యర్ధులకు గాను 508 మంది అభ్యర్ధులు హాజరైనారని, 194 మంది అభ్యర్ధులు గైర్హాజరైనారని  72 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు.  కరోనా పోజిటిన్ పేషెంట్లు ఎవ్వరూ హాజరు కాలేదని చెప్పారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. పరీక్షా కేంద్రం వద్ద మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బంది, వికాలంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన తరువాత అభ్యర్ధులను లోనికి అనుమతిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.

Srikakulam

2020-09-23 14:00:45

దేశంలోనే డైనమిక్ సిఎం వైఎస్ జగన్ మాత్రమే..

ఆంధ్రప్రదేశ్ కి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ తరువాత అంతటి డైనమిక్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మాత్రమేనని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఆశీల్ మెట్టలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలలు మనసు చంపుకొని తెలుగు దేశంపార్టీ  తరుపున కార్యక్రమాలు చేపట్టానని.. తలచుకుంటేనే ఆవేదన వుందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గం లో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసినపుడు కోరినట్టు వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. దమ్మున్న సీఎం ఏపీలో ఉన్నప్పుడు అలాంటి నాయకుడి టీమ్ లో పనిచేయాలనే ఆలోచనతోనే వైఎస్సార్సీపీ పార్టీలో చేరానని చెప్పిన గణేష్ కుమార్ 14 నెలల వ్యవధిలో ఇచ్చిన హామిలన్నీ 90శాతం పూర్తిచేసిన ఏకైన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో  ప్రతిపక్షానికి పని లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని కొనియాడారు. విశాఖ మేయర్ ఎలక్షన్స్ లో  ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  13 ఏళ్లుగా చిన్న స్థాయి నుంచి నేడు ఎమ్మెల్యే స్థాయి వరకు పెరిగానని అన్నారు. ప్రజలు, నాయకుల ఆశీస్సులతో పార్టీలో సేవచేసుకుంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు.

Visakhapatnam

2020-09-23 13:24:27

అగ్రీ అసిస్టెంట్స్ ప‌రీక్ష‌కు 79.69% హాజ‌రు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌్రామ స‌చివాల‌యాల గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుల‌ ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి సంబంధించి నాలుగో రోజైన బుధ‌వారం న‌గ‌రంలోని రెండు కేంద్రా ల్లో ఉద‌యం ప‌రీక్ష జ‌రిగింది. ఎం.ఆర్‌.ఆటాన‌మ‌స్ క‌ళాశాల‌, రింగురోడ్డులోని శ్రీ‌చైత‌న్య పాఠ‌శాల‌ల్లో ఈ ప‌రీక్ష నిర్వ‌హించారు. రెండు కేంద్రాల్లోనూ ఈ ప‌రీక్ష‌కు 896 మంది అభ్య‌ర్ధులు హాజ‌రు కావ‌ల‌సి వుండ‌గా వీరిలో 714 మంది ప‌రీక్ష‌కు హాజరైన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. మొత్తం 79.69 శాతం హాజ‌రు న‌మోదైన‌ట్టు పేర్కొన్నారు. 182 మంది ప‌రీక్ష‌కు గైర్హాజ‌రైన‌ట్టు తెలిపారు. ఎం.ఆర్‌.ఆటాన‌మ‌స్ ప‌రీక్ష కేంద్రంలో ప‌రీక్ష జ‌రుగుతున్న తీరును జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పరిశీలించారు. డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కె.సుబ్బారావు, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.జి.వి.క‌ళ్యాణి త‌దిత‌రులు వున్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు గ‌ల అభ్య‌ర్ధులు ఎవ్వ‌రూ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేద‌న్నారు. ఎం.ఆర్‌.క‌ళాశాల‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ క‌ళాశాల క్యాంప‌స్ ను అందంగా, ఆక‌ర్షణీయంగా తీర్చిదిద్దే అంశంపై క‌ళాశాల ప్రిన్సిపాల్ కు క‌లెక్ట‌ర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. వృక్షాల‌కు రంగులు వేయించాల‌న్నారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల సంద‌ర్భంగా క‌ళాశాల‌ను విద్యుద్దీపాల‌తో అలంక‌రించే ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Vizianagaram

2020-09-23 13:09:32

4వ రోజు అనంతలో 80.62% హాజరు..

అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన నాల్గవ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 80.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  తెలిపారు. బుధ వారం అనంత నగరం ప్రధాన కేంద్రం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3  గ్రేడ్ -2 గ్రామ వ్యవసాయ సహాయ కులు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 1156 మంది  అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 932  మంది హాజరయ్యారని ,  224 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరుకాగా ,  80.62 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 6 పరీక్ష కేంద్రాల్లో నాల్గవ రోజు పరీక్ష నిర్వహించారన్నారు. అలాగే జె ఎన్ టి యు వైపునున్న కెఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రంలో 1( ఒకరు)విభిన్న ప్రతిభావంతులు  వ్రాతపరీక్షను వ్రాసినట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. అటు జెసి సిరి కూడా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు.

Anantapur

2020-09-23 13:06:34

టిడిపి తీరు మారకపోతే కాంగ్రెస్ గదే పడుతుంది..

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం పట్ల విశాఖ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని..కాని రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుశకుని లా  తయా రయ్యారని వైఎస్ఆర్ సీపీ నగర శాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మద్దెలపాలెం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగిన అభివృద్ధి అంతా గతంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహనరెడ్డి  చేస్తున్నారన్నారని అన్నారు. అలాంటి  ప్రభుత్వ పథకాలను కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుని చంద్రబాబు  అడ్డుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న వంశీ రాష్ట్ర అభివృద్ధి చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారుని ఆరోపించారు. పేద ప్రజలకు  అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నారు. ఆ పాపం చంద్రబాబుకే తగులుతుంద న్నారు.  ఇలానే  వ్యవహరిస్తే రానున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు  పట్టిన గతే తెలుగుదేశానికి పడుతుందన్నారు జోస్యం చెప్పారు.

మద్దెలపాలెం

2020-09-22 21:04:14

ప్రజారోగ్యం కోసం..ఉచిత మందులు

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సిఐటియు జగదాంబ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ‌ద్వారా ఉచిత వైద్య సలహాలు మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మాజీ వైద్యాశాఖ అధికారి పెంటకోట రామారావు ఆన్‌లైన్‌ ‌ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన క్యాదర్శి  టి.కామేశ్వరరావు  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్‌ ‌బి.గంగారావు మాట్లాడుతూ కరోనా కాలంలో ఉచితంగా వివిధ మండలాలకు మందులు కిట్స్ ‌పంపిణీ చేశామని, భవిష్యత్‌లో మరిన్ని మెడికల్‌ ‌క్యాంపులు నిర్వహిస్తామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏరియా ప్రజలకు దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు, పడిశం జబ్బులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదిక నాయకులు చంద్రమౌళి, శ్రవంత్‌, ఎం.‌సంజయ్‌కుమార్‌, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సభ్యులు ఎంఆర్‌డి రాజు, ఇంజనీర్‌ ఆర్‌.‌కిరణ్‌, ఐద్వా నగర నాయకులు ఆర్‌ఎన్‌ ‌మాధవి, సిఐటియు నాయకులు బి.జగన్‌, ఎం.‌సుబ్బారావు, నర్సులు కావ్యశ్రీ, లిఖిత, శిరిష తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు కార్యాలయం

2020-09-22 20:48:45

పాండ్రంగి వంతెనకు రూ.14 కోట్లు ..

విశాఖజిల్లాలోని పాండ్రంగి వంతెన నిర్మించడం వలన చుట్టు ప్రక్కల గ్రామాల అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  భీమిలి శాసన సభ నియోజక వర్గంలో పద్మనాభం మండలంలోని  స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మిస్తే చుట్టు ప్రక్కల గ్రామాలు అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మరియు భీమిలి శాసన సభ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరా వు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించే పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.  ఎన్నో ఏళ్ళ నుండి ఈ సమస్య నలుగుతున్నది కాని పాండ్రంగి వంతెన సమస్య పరిష్కారం కావడం లేదని,  ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన వెంటనే  తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నియోజక వర్గ ప్రజల తరఫున ఆయన కృజ్ఞతలు తెలిపారు.  వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేయడం పట్ల పద్మనాభం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Visakhapatnam

2020-09-22 20:29:08

సివిల్ సర్వీస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..

విశాఖజిల్లాలో అక్టోబరు 4న యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్  నిర్వహించే  సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు  సజావుగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం నాడు  స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈ పరీక్షల నిర్వహణ పై తొమ్మిది మంది రూట్ అధికారులు ,27 మంది వెన్యూ సూపర్ వైజర్లు, 27 మంది స్థానిక తనిఖీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే  అత్యంత ప్రతిష్టాత్మకమైన  సివిల్ సర్వీసెస్ పరీక్షలను యు పి ఎస్ సి నిబంధనల ప్రకారం  విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. గైడ్ లైన్స్ ను  క్షు ణ్ణం గా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు.  ఇద్దరు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు, యు పి ఎస్ సి తనిఖీ అధికారి  పరీక్షలను  పర్యవేక్షిస్తారని  తెలిపారు. జిల్లాలో  10,796 మంది అభ్యర్దులు  27 కేంద్రాలలో  పరీక్ష వ్రాస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల సూపర్ వైజర్లు ,  స్థానిక తనిఖీ అధికార్లు,ఇన్విజి లేటర్లు, ఎగ్జామ్ మెటీరియల్ ను తీసుకు వెళ్లడంలోను , పరీక్ష అనంతరం తిరిగి పంపించడంలోను  జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.  పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని , ఎగ్జామ్ మెటీరియల్ ను  పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి  తిరిగి  పోస్టు ఆఫీసు నుండి  డిల్లీకి  పంపేటప్పుడు  ఎస్కార్ట్ ను  ఏర్పాటు చేయాలని  పోలీసు శాఖ ను కోరారు. త్రాగునీరు సౌకర్యం కల్పించాలని , పరీక్షా కేంద్రాలను  శానిటైజ్ చేయాలని   జి.వి.ఎం .సి  అధికారులను కోరారు.  అంతరాయం లేకుండా  విద్యుత్తు సౌకర్యం  కల్పించాలని  ఈ పి డి సి ఎల్  ను కోరారు. ఆర్టీసి సంస్థ   అక్టోబరు 3,4 తేదీలలో రైల్వే స్టేషన్, ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి  పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని  తెలిపారు.  తపాలా శాఖ పరీక్ష అనంతరం  మెటీరియల్ ను  పంపించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం  పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్ లు , శానిటైజర్లు, థర్మల్ స్క్రీనర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు, పి పి ఇ కిట్లు అందుబాటులో ఉంచాలని  డి ఎం అండ్ హెచ్ ఓ ను కోరారు.  జిల్లారెవెన్యూ అధికారి ఆద్వర్యంలో  కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు  జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి పరీక్షల నిర్వహణపై యు పి ఎస్ సి నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో  డి ఆర్ ఓ ప్రసాద్, సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-09-22 20:25:19