1 ENS Live Breaking News

శ్రీకాకుళం జిల్లాలో 3వ రోజు 75% హాజరు..

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్  తెలిపారు. జిల్లాలో ఉదయం 13 కేంద్రాలలోను, రెండవ పూట (మధ్యాహ్నం ) 9 కేంద్రాలలోను సచివాలయ ప్రవేశ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు.  ఉదయం జరిగిన పరీక్షలకు 72 శాతం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 75 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. రెండవ పూట 1434 మంది అభ్యర్ధులకు గాను 1071 మంది అభ్యర్ధులు హాజరైనారని, 363 మంది అభ్యర్ధులు గైర్హాజరైనారని తెలియచేసినారు.  ఉదయం ఇద్దరు కరోనా పేషెంట్లు, మధ్యాహ్నం జరిగిన  పరీక్షకు ఒక కోవిడ్ పేషెంట్ హాజరైనట్లు తెలిపారు.కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతించామన్నారు. ఇవే నిబంధనలు 26వ తేదీవరకూ అమలు చేస్తామని కలెక్టర్ వివరించారు.

Srikakulam

2020-09-22 19:43:45

సచివాలయ పరీక్షలకు 3వ రోజు 76% హాజరు..

విశాఖపట్నం జిల్లాలో సచివాలయ రాత పరీక్షలకు మంగళవారం 76 %  అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చెప్పారు. కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు పరీక్షలకు 13,374 మంది హాజరు కావలసి వుండగా 10,186 మంది హాజరుకాగా, 3,188 మంది హాజరు కాలేదన్నారు.  ఉదయం పరీక్షలకు 8,468 మందికి 6,384 మంది (75 శాతం) హాజరవగా 2,084 మంది హాజరు కాలేదన్నారు. మధ్యాహ్నం పరీక్షలకు 4,906 మందికి 3,802 మంది (77 శాతం) హాజరవగా 1,104 మంది హాజరు కాలేదని వివరించారు.  పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో కోవిడ్ వచ్చిన వారు ఎవరు లేరన్నారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతించామన్నారు. ఇవే నిబంధనలు 26వ తేదీవరకూ అమలు చేస్తామని కలెక్టర్ వివరించారు.

విశాఖజిల్లా

2020-09-22 19:09:51

కరోనా నుంచి కోలుకున్న 583 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో  కరోనా నుంచి కోలుకోవడంతో 583 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, డిశ్చార్జి చేసిన వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్యవిధానాలతో కరోనా వైరస్ వచ్చినప్పటికీ అధిక సంఖ్యలో రోగులు కోలుకుంటున్నారని చెప్పారు. డిశ్చార్జి చేసిన తరువాత ఐసోలేషన్ లో వున్న 14 రోజులు కూడా వారి ఆరోగ్యం ఎలావుందనే విషయమై సచివాలయ ఏఎన్ఎంలతో పర్యవేక్షణ చేపడుతున్నట్టు వివరించారు. డిశ్చార్జి అయినవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి బలవర్ధక ఆహారం తీసుకోవాలన్నారు. కోలుకున్నవారు తర్వాత ఏదైనా లక్షణాలు కనిపించినా ఆరోగ్యసిబ్బంది ద్వారా పీహెచ్సీల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టరేట్

2020-09-22 18:56:38

క్యాన్సర్ ఆస్పత్రికి ఏసిలు విరాళం..

అనంతపురంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి  రెండు (2 టన్స్)  ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజేశారు. నగరంలోని శారదా నగర్ లో ఉన్న ప్రభుత్వ క్యాన్స ర్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ (విలేజ్ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్)  ఏ సిరి  ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమీషనర్  పి వి వి ఎస్ మూర్తి విజ్ఞేప్తి మేర కు నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మరియు  ప్రైవేట్ ఏజెన్సీస్  వారి సహకారంతో  2 ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజే శా రు. అంతకుముందు జాయింట్ కలెక్టర్  ఆస్పత్రిలోని కరోన పాజిటివ్ పర్సన్  తో మాట్లాడుతూ వారికి అందించే భోజనం అక్కడ సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి  వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పించడమే ద్యేయంగా  జిల్లా అధికారులు శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి రాజేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-09-22 18:51:31

హోం ఐసోలేషన్ లో ఉన్నావారిని రోజూ సందర్శించాలి..

హోం ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ పాజిటివ్ వ్యక్తులను ఎవరో ఒక వైధ్య సిబ్బంది ప్రతి రోజు సందర్శించేలా వైధ్యాదికారులు ప్రణాళికను సిద్దం చేసి పరీక్షలు నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జెసి(డి) లతో కలసి వైద్య అధికారులతో  వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులలోపు జరిగిన కరోనా మరణాల పై పి.హెచ్.సి. స్థాయిలో, సబ్ సెంటర్ పరిధిలో అలాగే గ్రామ/ వార్డు సచివాలయ పరిధిలో అందుకు గల కారణాల పై సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  ట్రయాజింగ్ పెండెన్సీ ఎక్కువగా ఉన్న వైధ్యాదికారుల మీద ఏ.ఎన్.ఏం లు సూపర్ వైజర్ల మీద అందుకు గల కారణాలను సమీక్షించి అలసత్వం వహించిన వారి పై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని వైధ్యాదికారులు, ఏ.ఎన్.ఏం లు, సూపర్ వైజర్లు సందర్శించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి డేటా ఎంట్రీ చేయని వారి పై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  క్షేత్ర స్థాయిలో ఏ.ఎన్.ఏం, ఆశాలు కరోనా లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి  వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ట్రయాజింగ్ చేసి హోం ఐసోలేషన్ లో లేదా కోవిడ్ ఆసుపత్రికి తరలించడం మరియు కోవిడ్ మరణాలు అను అంశాల పై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.  పట్టణ స్థాయిలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని వార్డు ఏ.ఎన్.ఏం లు, సూపర్ వైజర్లు తక్కువగా సందర్శించడం జరుగుతున్నదని ప్రతి మూడు రోజులకు ఒక సారి ఏ.ఎన్.ఏం నాలుగు రోజులకు ఒకసారి వైధ్యాదికారులు సందర్శించి వారికి సాదారణ పరీక్షలు నిర్వహించాలని అలా చేయని వారి పై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని ఎవరో ఒక వైధ్య సిబ్బంది ప్రతి రోజు సందర్శించేలా వైధ్యాదికారులు ప్రణాళికను సిద్దం చేసుకొని అందుకు తగ్గట్టుగా పర్యవేక్షణ చేసి డేటా ఎంట్రీ చేపట్టాలన్నారు.  కరోనా వ్యాధి గ్రస్తులను వైధ్యాదికారులు మరియు వైధ్య సిబ్బంది వ్యక్తి గతంగా సందర్శించడం గాని లేదా ఫోన్ ద్వారా పరామర్శించి వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం ద్వారా వారు చాలా సంతృప్తి చెంది మనో దైర్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో చిత్తూరు నుండి డి.పి.ఏం.ఓ డాక్టర్ శ్రీనివాస్, డెమో నిర్మలమ్మ, ఎపిడమాలజిస్ట్ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-22 18:47:03

యువతను క్రియీశీలకంగా మార్చాలి..

యువ‌త‌ను క్రియాశీల‌కంగా చేసి గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో ‌యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేయ‌డం ద్వారా యువ‌త శ‌క్తి సామ‌ర్ధ్యాలు స‌మాజాభివృద్ధిలో వినియోగించుకొనే ల‌క్ష్యంతో భార‌త ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర‌మోడి ఒక కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశార‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా&సంక్షేమం) జె.వెంక‌ట‌రావు తెలిపారు. దీనిలో భాగంగా ప్ర‌తి గ్రామంలో యువ‌జ‌న  సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం, యువ‌త‌కోసం నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌ కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌న్నీ యువ‌జ‌న సంఘాల స‌హాయ స‌హ‌కారాల‌తో అమ‌లు చేసే ల‌క్ష్యంతో అన్నిగ్రామ పంచాయ‌తీలు, మునిసిప‌ల్ వార్డుల్లో కొత్త‌గా యువ‌జ‌న సంఘాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వెల్ల‌డించారు. నెహ్రూయువ కేంద్రం ఆధ్వ‌ర్యంలో జిల్లా పంచాయ‌తీరాజ్ విభాగం గ్రామాల్లోనూ, పుర‌పాల‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణాల్లోనూ ఈ సంఘాలు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఒక్కో గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో రెండు యువ‌జ‌న సంఘాలు, ఒక స‌చివాల‌యం ప‌రిధిలో ఒక గ్రామాభివృద్ధి సంఘం ఏర్పాట‌వుతాయ‌న్నారు. ఒక్కో మునిసిప‌ల్ వార్డులో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తార‌ని తెలిపారు. జిల్లాలోని 960 గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోనూ, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, ఐదు మునిసిపాలిటీల ప‌రిధిలో ఈ త‌ర‌హాలో సంఘాలు ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లా స్థాయి యువ‌జ‌న స‌ల‌హా క‌మిటీ స‌మావేశం జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం మ‌ర్రి చెన్నారెడ్డి భ‌వ‌నంలోని జె.సి. ఛాంబ‌రులో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు నెహ్రూయువ కేంద్రంతో యువ‌జ‌న సంఘాల ఏర్పాటు, యువ‌త‌కోసం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల అమ‌లులో పూర్తి స‌హ‌కారం అందించాల‌ని కోరారు. నెహ్రూ యువ‌కేంద్రం జిల్లా  యూత్ ఆఫీస‌ర్ జి.విక్ర‌మాదిత్య మాట్లాడుతూ జిల్లాలో న‌మోదు చేసుకున్న సంఘాల‌న్నింటికీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించ‌డంలో స‌హ‌కరించాల‌ని ఎల్‌.డి.ఎం.ను కోరారు. ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కె.ప్ర‌సాద‌రావు, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఇ.ఇ. బి.సుద‌ర్శ‌నం, ఎల్‌.డి.ఎం. శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర‌పాల‌క సంస్థ స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, డి.ఆర్‌.డి.ఏ. ఏపిడి ముర‌ళి, జిల్లా అట‌వీ అధికారి జాన‌కిరావు, డివిజ‌న‌ల్ పంచాయ‌తీ అధికారి మోహ‌నరావు, సెట్విజ్ సి.ఇ.ఓ. నాగేశ్వ‌ర‌రావు, ఎన్‌.సి.సి., ఎన్‌.ఎస్‌.ఎస్‌. అధికారులు, కార్మిక‌శాఖ‌, ఫ్యాక్ట‌రీస్ విభాగం అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Vizianagaram

2020-09-22 18:41:07

నేషనల్ ఫెలోషిప్ కి దరఖాస్తులు ఆహ్వానం..

గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ న్యూ ఢిల్లీ నేషనల్ ఫెల్లోషిప్,ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కొరకు 2020 - 2021 సంవత్సరానికి అర్హత కలిగిన గిరిజన విద్యార్థి, విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వేకరిస్తున్నరు.  నేషనల్ ఫెల్లోషిప్,ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కొరకు విద్యార్థులు  ఎంఫీల్, పి.హెచ్.డి కి ఏంపిక కాబడినవారు గతంలో అడ్మిషన్స్ / జాయిన్ అయిన ఎంఫీల్, పి.హెచ్.డి విద్యార్థులు ఆర్హులు అభ్యర్థులు ఇతర వివరాలకు http:// fellowship.tribal.gov.in వెబ్ పోర్టల్ లో సందర్శించగలరు. మొత్తం అవార్డులు 750, దరఖాస్తు చేసుకొనుటకు 30,సెప్టెంబర్,2020 చివరి తేదీ అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Parvathipuram

2020-09-22 18:35:57

జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం ల‌క్ష్యాల‌ను పూర్తిచేయాలి..

జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం ల‌క్ష్యాల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు. ఈ నెలాఖ‌రుక‌ల్లా త‌మ‌కు కేటాయించిన ల‌క్ష్యాల‌ను పూర్తి చేసేందుకు ఆయా శాఖాధిప‌తులు కృషి చేయాల‌ని కోరారు. జ‌గ‌న‌న్న‌ ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మం ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్‌ మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మం అమ‌ల్లో కొన్ని శాఖ‌లు వెనుక‌బ‌డి ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. వాట‌ర్ రీసోర్సు సూప‌రింటిండెంట్ ఇంజ‌నీర్‌, మైన్స్ అండ్ జియాల‌జీ, మెడిక‌ల్ అండ్ హెల్త్‌, సోష‌ల్ వెల్ఫేర్ శాఖ‌లు సున్నా ప్ర‌గ‌తిలో ఉన్నార‌ని చెప్పారు. మున్సిపాల్టీలు 9.32 శాతం, దేవాదాయ‌శాఖ 14శాతం‌ మాత్ర‌మే ల‌క్ష్యాల‌ను  సాధించార‌ని చెప్పారు. గృహ‌నిర్మాణ‌శాఖ‌కు 2.50ల‌క్ష‌ల మొక్క‌లు ల‌క్ష్యం కేటాయించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 40వేలు మాత్ర‌మే చేశార‌ని, వెంట‌నే కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. జిల్లా అట‌వీశాఖ‌ (టెరిటోరి య‌ల్‌) కేవ‌లం 19శాతం, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ 25శాతం, ఈ శాఖ‌ల‌న్నీ త‌మ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాల‌న్నారు. జిల్లా ప‌రిష‌త్ 26శాతం మాత్ర‌మే సాధించార‌ని, పంచాయితీరాజ్ శాఖ అధికారుల‌కు వెంట‌నే ఉత్త‌ర్వులు జారీ చేసి, ల‌క్ష్యాన్ని పూర్తి చేసేలా చూడాల‌న్నారు.  కాలుష్య నివార‌ణా సంస్థ‌, వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ‌లు కూడా మిగిలిన‌ త‌మ ల‌క్ష్యాలకు చేరువ కావాల‌ని సూచించారు. ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులంతా ఈ నెలాఖ‌రుకు త‌మకిచ్చిన ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఇప్ప‌టికే మొక్క‌లు నాటించిన‌ట్ల‌యితే, వాటిని వెంట‌నే అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు. మ‌రో వారం రోజుల త‌రువాత ఈ అంశంపై సమీక్షించ‌డం జ‌రుగుతుంద‌ని, ఈ నెలాఖ‌రుకు ప్ర‌తీఒక్క విభాగ‌మూ త‌మకు కేటాయించిన‌ ల‌క్ష్యాల‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2020-09-22 18:31:06

విజయనగరంలో 3రోజు 78.32% హాజరు..

విజ‌య‌న‌గ‌రం  ‌జిల్లాలో గ్రామ స‌చివాల‌య ఉద్యోగ నియామ‌క రాత‌ప‌రీక్ష‌లు ప్రశాంతంగా, స‌జావుగా జ‌రుగుతున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వెల్ల‌డిం చారు. జిల్లా కేంద్రంలోని గాజుల‌రేగ వ‌ద్ద వున్న‌ స‌త్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ టెక్నాల‌జీ ప‌రీక్షా కేంద్రంలో మూడో రోజు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న తీరును క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. క‌ళాశాలలో ప్ర‌వేశించే రిసెప్ష‌న్ కేంద్రం వ‌ద్ద అభ్య‌ర్ధులంద‌రినీ శానిటైజ్ చేస్తున్న‌దీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. ఆయా ప‌రీక్ష‌లు జ‌రిగే త‌ర‌గ‌తి గదుల్లోనూ ఇన్విజిలేట‌ర్ల‌ను ప్ర‌శ్నించి అంద‌రి వ‌ద్ద శానిటైజ్ బాటిళ్లు వున్నదీ లేనిదీ ప‌రిశీలించి అంద‌రికీ శానిటైజ్ చేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల‌లో ప‌రీక్ష‌ల‌కు ఎంత‌మంది హాజ‌ర‌య్యిందీ వివ‌రాల‌ను చీఫ్ సూప‌రింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో స‌చివాల‌య ఉద్యోగ నియామ‌క రాత‌ప‌రీక్ష‌ల‌న్నీ కోవిడ్ నిబంధ‌న‌లు పూర్తిగా పాటిస్తూ నిర్వ‌హిస్తున్నామ‌ని, ప‌రీక్ష‌లు రాసే అభ్య‌ర్ధుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా క‌నీస వ‌స‌తులు క‌ల్పించామ‌ని చెప్పారు. మూడో రోజు ఉద‌యం జ‌రిగిన ప‌రీక్ష‌కు మొత్తం 2482 మంది అభ్య‌ర్ధుల‌కుగాను 1811 మంది హాజ‌ర‌య్యార‌ని, 72.97 శాతం హాజ‌రు న‌మోదైన‌ట్టు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఒక ప‌రీక్షా కేంద్రంలో పాజిటివ్ ల‌క్షణాలున్న అభ్య‌ర్ధి ఒక‌రు ఐసోలేష‌న్ గ‌దిలో ప‌రీక్ష‌లు రాసిన‌ట్టు పేర్కొన్నారు. 671 మంది గైర్హాజరైన ట్టు తెలిపారు. మూడో రోజు మ‌ధ్యాహ్నం జ‌రిగిన ప‌రీక్ష‌కు మొత్తం 1204 మంది అభ్య‌ర్ధుల‌కు గాను 943 మంది హాజ‌ర‌య్యార‌ని, 78.32శాతం హాజ‌రు న‌మోదైన‌ట్టు పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నం ఐసోలేష‌న్ గ‌దుల్లో ఏ ఒక్క‌రూ ప‌రీక్ష రాయ‌లేద‌ని తెలిపారు. 261 మంది గైర్హాజరు అయినట్టు పేర్కొన్నారు. 

Vizianagaram

2020-09-22 18:28:02

ఆరోఓఎఫ్ఆర్ కి వినతులు స్వీకరణ..

అక్టోబరు 02 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలన నుసరించి భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పార్వతీపు రం ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, సెప్టెంబర్ 24వ తేదీ నుండి సబ్ ప్లాన్ మండల తహశీల్దార్ కార్యా లయాలో, ప్రతి గ్రామ సచివాలయాలో ప్రతి రోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందన్నారు. భూమి లేని గిరిజన రైతులు ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కి సంబందించిన సమస్యలు వుంటే మీ గ్రామానికి దగ్గరలో వున్న మీ సచివాలయంలో గాని మండల తహశీల్దార్ కార్యాలయంలో గాని వినతులు అందజేయాలని తెలిపారు. ఈ మేరకు ఏజెన్సీలోని అన్ని గ్రామసచివాలయాల్లోని వాలంటీర్లు ఈ మేరకు గిరి రైతులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. తద్వారా భూమిలేని గిరిజనులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుందన్నారు.

పార్వతీపరుం ఐటిడిఏ

2020-09-22 18:23:21

అనంతలో కోవిడ్ పరీక్షలు జరిగే ప్రాంతాలివే..

అనంతపురము జిల్లాలో రేపు (23.09.2020)  కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మీడియాకి విడుదల చేసింది. క్రమ సంఖ్య ప్రకారం 1. హిందూపురం మున్సిపాలిటీ, 2. మడకశిర మున్సిపాలిటీ, 3. పుట్టపర్తి మున్సిపాలిటీ, 4. ధర్మవరం మున్సిపాలిటీ , 5. తాడిపత్రి మున్సిపాలిటీ, 6. గుంతకల్లు మున్సిపాలిటీ, 7. గుత్తి మున్సిపాలిటీ, 8. పామిడి మున్సిపాలిటీ,9. రాయదుర్గం మున్సిపాలిటీ, 10. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, 11. కదిరి మునిసిపాలిటీ, 12. ఓడీ చెరువు పి.హెచ్.సి, 13. అమడగూరు పి.హెచ్.సి, 14. గాండ్లపెంట  పి.హెచ్.సి, 15. ఎన్ పి కుంట  పి.హెచ్.సి, 16. తలపుల పి.హెచ్.సి, 17. కురుగుంట పి.హెచ్.సి, 18. బుక్కరాయసముద్రం  పి.హెచ్.సి, 19. రాప్తాడు  పి.హెచ్.సి, 20. కొర్రపాడు పి.హెచ్.సి, 21. కూడేరు పి.హెచ్.సి, 22. ఆత్మకూరు పి.హెచ్.సి, 23. ధర్మవరం ఏరియా ఆసుపత్రి, 24. సీకే పల్లి  పి.హెచ్.సి, 25. ఎన్ ఎస్ గేట్  పి.హెచ్.సి, 26. బత్తలపల్లి పి.హెచ్.సి, 27. కనగానపల్లి పి.హెచ్.సి, 28. లేపాక్షి పి.హెచ్.సి, 29. చిలమత్తూరు పి.హెచ్.సి, 30. పరిగి  పి.హెచ్.సి,31. సోమందేపల్లి పి.హెచ్.సి ,32. హిందూపురం మండలం (పిపి యూనిట్స్/  పి.హెచ్.సి), 34. కళ్యాణదుర్గం సి.హెచ్.సి, 34. శెట్టూరు  పి.హెచ్.సి, 35. వజ్రకరూరు పి.హెచ్.సి, 36. బ్రహ్మసముద్రం  పి.హెచ్.సి తో పాటు ఫిక్స్డ్ లొకేషన్స్ అనంతపురంలో గా 37. మునిసిపల్ గెస్ట్ హౌస్, 38. జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, 39. సి.డి.హాస్పిటల్, ఓల్డ్ టౌన్ నిర్వహిస్తున్నారని తెలియజేసింది. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలి అధికారులు కోరుతున్నారు.

Anantapuram

2020-09-22 15:09:49

విజయనగరంలో తగ్గుముఖం పడుతున్న కరోనా..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అధికార యంత్రాంగం తీసుకున్న క‌ట్టుధిట్ట‌మైన చ‌ర్య‌ల‌తోపాటుగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కూడా గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో కోవిడ్‌ కేసుల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ త‌గ్గుతూ వస్తుందని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ చెప్పారు. ఇప్పటి వరకూ 2,60,352 టెస్టులు చేయగా, అందులో పాజిటివ్ కేసులు 31,914 గా నమోదు అయ్యాయని అన్నారు. అదేవిధంగా కోలుకున్నవారు 24,654గా వుందని, ఏక్టివ్ కేసులు 7,078గా ఉన్నాయన్నారు. ఇదేవిధంగా రోజుకి ఐదేవలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుంటే..500 లోపుగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ కార‌ణంగా 182 మంది మాత్ర‌మే మ‌ర‌ణించారన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాల అమలు కూడా జిల్లా పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు.   మొన్న‌టివ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను వ‌ణికించ‌గా, ఇప్పుడు ఆ భ‌యం కూడా కొంత‌మేర‌ త‌గ్గింది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేయ‌డంతో, వ్యాపార‌, వాణిజ్య కార్య‌క‌లాపాలు, దైనందిన కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టిలాగే జోరందుకున్న‌ప్ప‌టికీ, కేసుల సంఖ్య‌ మాత్రం త‌గ్గుతుండ‌టం విశేషమని కలెక్టర్ వివరించారు. మొత్తంమీద కోవిడ్-19 వైర‌స్‌‌ ప్ర‌మాద స్థాయి నుంచి సాధార‌ణ స్థాయికి దిగివ‌స్తుండ‌టం ఊర‌టనిస్తుందన్నారు. అదే సమయంలో ప్రజలు ఖచ్చితంగా మాస్కుల ధారణ, సామాజిక దూరం, పాటిస్తూ, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ కోరుతున్నారు...

Vizianagaram

2020-09-22 14:53:59

శ్రీకాకుళం జిల్లాలో 3వ రోజు 72% హాజరు..

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ/వార్డు సచివాలయ పోస్ట్ ల పరీక్షలకు 72 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ పరీక్షలు 13  కేంద్రాలలో జరిగాయని,  మొత్తం  2610 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా  1879 మంది  అభ్యర్ధులు హాజరయ్యారని చెప్పారు.  731 మంది అభ్యర్ధులు గైర్హాజరయ్యాని చెప్పారు. ఈ రోజు పరీక్షలకు హాజరైన వారిలో ఇద్దరు కోవిడ్ పేషెంట్లు  వున్నట్లుగా చెప్పిన కలెక్టర్ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ చైర్స్ అన్నింటినీ సమకూర్చనట్టు చెప్పారు. హాజరయ్యే వారందరికీ థర్మల్ మీటర్ ద్వారా టెంపరేచర్ చెక్ చేసిన తరువాత మాత్రమే లోనికి అనుమతిస్తున్నామన్నారు. ప్రతీఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నామని వివరించారు..

Srikakulam

2020-09-22 14:37:35

సచివాలయం ద్వారానే ప్రజలకు సేవలందాలి..

గ్రామసచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని జెసి డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం జెసి జిల్లాల్లోని రుద్రంపేట-1 గ్రామసచివాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు ఏవిధంగా సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలు నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినందున అర్హులైన వారిని గుర్తించి వెంటనే కార్డులు జారీ చేయాలన్నారు. గ్రామ వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతీరోజూ బయోమెట్రిక్ వేయడంతోపాటు, సచివాలయాల్లో అందే సేవలను వారికి కేటాయిం చిన 50 కుటుంబాలకు తెలియజేయాలన్నారు. విధి నిర్వహణలో ఎవరు అలక్ష్యం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నిశాఖల సిబ్బంద వారి డ్యూటీ డైరీని ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతీరోజు వారికి కేటాయించిన కుటుంబాలను కలుసుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సచివాలయంలో కార్యదర్శికి తెలియజేయాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా తదితర పనులను ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చేప్టాలని సిబ్బందిని ఆదేశించారు.

రుద్రంపేట-1

2020-09-22 13:48:11

సచివాలయ పరీక్షలకు 3రోజు ఉదయం 75.25% హాజరు

అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన మూడవ  రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 75.25  శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం అనంత నగరం ప్రధాన కేంద్రం లోఉదయం  నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3  గ్రేడ్ -2 వార్డు పారిశుద్ధ్యం కార్యదర్శి, పర్యావరణ కారదర్శి ,   ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 4320 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3251 మంది హాజరయ్యారని ,1069 మంది పరీక్షకు గైర్హాజరుకాగా , 75.25 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 24 పరీక్ష కేంద్రాల్లో మూడవ  రోజు అభ్యర్థులు వ్రాత పరీక్ష రాశారన్న జిల్లా కలెక్టర్ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ చైర్స్ అన్నింటినీ సమకూర్చనట్టు చెప్పారు. 

Anantapur

2020-09-22 13:33:26