1 ENS Live Breaking News

విశాఖజిల్లాలో 16843 మంది గైర్హాజరు..

విశాఖ జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షలు తొలిరోజు విజయవంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నా రు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామకం కొరకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా  ముందుగా అభ్యర్థులకు కరోనాకు సంబంధించి థర్మల్ టెస్ట్ చేస్తున్న తీరుతెన్నులను ఏ.ఎన్.ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు పరీక్షకు 73246 మంది హాజరు కావాల్సి వుండగా, కేవలం 56403 మంది మాత్రమే హాజరయ్యారని చెప్పారు. 16843 మంది గైర్జాజరయ్యారని చెప్పారు.  జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్ మొదలు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, కరోన లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల ఏర్పాటుచేశామని చెప్పారు.  దీనివలన జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తలేదని, అభ్యర్థులు ఏ.పి.పి.ఎస్.సి సూచించే నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాశారని కలెక్టర్ తెలిపిన కలెక్టర్ కరోనా లక్షణాలు, పాజిటివ్ ఉన్నవారికి 19 ఐసోలేషన్ గదువు ఏర్పాటు చేసినట్టు వివరించారు. రాబోయే ఆరు రోజులు కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరీక్షలను విజయవంతం చేస్తామని కలెక్టర్ వివరించారు.

Visakhapatnam

2020-09-20 17:29:20

తొలిరోజు సచివాలయ పరీక్షలు విజయవంతం..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షలు తొలిరోజు విజయవంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామకం కొరకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా  శ్రీకాకుళం రూరల్ మండలం మునసాబుపేటలో గల గాయత్రి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆదివారం ఉదయం కలెక్టర్ సందర్శించారు. ముందుగా అభ్యర్థులకు కరోనాకు సంబంధించి థర్మల్ టెస్ట్ చేస్తున్న తీరుతెన్నులను ఏ.ఎన్.ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్ మొదలు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, కరోన లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి వచ్చిన విభిన్న ప్రతిభావంతుల కోసం 17 పరీక్షా కేంద్రాల వద్ద వీల్ చైర్లు, సహాయం కోసం రెడ్ క్రాస్ వాలంటీర్లను ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనివలన జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తలేదని, అభ్యర్థులు ఏ.పి.పి.ఎస్.సి సూచించే నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాశారని కలెక్టర్ తెలిపారు. రాబోయే ఆరు రోజులు కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరీక్షలను విజయవంతం చేస్తామని కలెక్టర్ వివరించారు.  సంయుక్త కలెక్టర్ డా . కె.శ్రీనివాసులు   కూడా  నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పలు సూచనలు  చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-20 16:57:38

విజయనగరం జిల్లాలో ఉదయం పరీక్షకు 4879 గైర్హాజరు..

విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తెలిపారు. ఆదివారం గరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని సెయింట్ ఆన్స్, సెయింట్ జోసెఫ్ స్కూళ్లు, మయూరి కూడలి వద్ద ఉన్న ఆర్.కే. డిగ్రీ కళాశాల, బాలాజీ నగర్ లోని శ్రీనివాస జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల కేంద్రాలను స్వయంగా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు ప్రదేశాల్లో 88 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు.  ప్రతి అభ్యర్థిని కరోనా నిబంధనల మేరకు థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించామన్న కలెక్టర్ మొత్తం 20,918 మంది అభ్యర్థులకు గాను 16,039 మంది అభ్యర్ధులు మాత్రమే హాజరయ్యారని అన్నారు. కరోనా ప్రభావంతో చాలా మంది హాజరు కాలేకపోయరని వివరించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు.

Vizianagaram

2020-09-20 13:08:35

గ్రామ సచివాలయ వ్యవస్థలో విశేష సేవలు..

సచివాలయ వ్యవస్థతో  దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 4 లక్షల 20 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత  సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలో జరుగుతున్న సచివాలయ ఉద్యోగ  పరీక్ష కేంద్రం ఎస్.వి. కాంపస్ హైస్కూల్ లో నగరపాలక కమిషనర్ గిరిషా తో కలసి నిర్వహణను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ,  ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఆలోచనతో సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుందని తెలిపారు. గతంలో 20 లక్షల మంది 4లక్షల 20 వేల ఉద్యోగాలకు సచివాలయ పరీక్షలు వ్రాసారని అసమయంలో ఏర్పాటు చేసిన అన్నీ కేంద్రాలు నేడు 16,028 ఉద్యోగాలకు చేపట్టామని అందుకు కారణం కోవిడ్ అని బౌతిక దూరంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు కూడా పరీక్షలు వ్రాయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టి పరీక్షా కేంద్రాలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. నేడు జరిగే సచివాలయ సెక్రటరీల పరీక్షలకు 6,09,026 మంది అభ్యర్థులు ఉదయం 4,06,936 మంది 2221 పరీక్షా కేంద్రాల్లో , మద్యాహ్నం 2,02,090 మంది 1059 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని ఆన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో 10 నుండి 14 మంది సచివాలయ ఉద్యోగులు ,  ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లు,  పట్టణాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు వున్నారని చెప్పారు. సచివాలయ, రైతు భరోసా , అంగన్ వాడి కేంద్రాల  పక్కాభవనాల నిర్మాణం చేపడుతున్నామని మార్చిలోపు అవి పూర్తి కానున్నాయని అన్నారు. గతంలో అంగన్  వాడీలు నిర్మించి బిల్లులు చెల్లించని వాటికి కూడా బకాయిలు చెల్లిస్తున్నామన్నారు.  పరీక్షల నిర్వహణ పగడ్భందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి పర్యటనలో తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి,  నగరపాలక అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.

Tirupati

2020-09-20 12:28:21

అనంతలో సజావుగా సచివాలయ పరీక్షలు..

అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష సందర్భంగా ఆదివారం ఉదయం ప్రధాన కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలే జి) లోని కామర్స్ బ్లాక్  లో పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థుల గదిలోకి వెళ్లి పర్యవేక్షించారు. అలాగే పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు . అనంతరం అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. కామర్స్ బ్లాక్ లో 112 మంది అభ్యర్థులకు గాను 28 మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్ధులకు మంచినీరు, మందులు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పారామెడికల్ సిబ్బంది, కరోనా పాజిటివ్ వ్యక్తులను, లక్షణాలు వచ్చిన వ్యక్తులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. 

Anantapur

2020-09-20 11:48:22

విశాఖ దక్షిణ వైఎస్సార్సీపీలో నూతన ఉత్తేజం..!

విశాఖ దక్షిణంలో వైఎస్సార్సీపీకి నూతన ఉత్తేజం మొదలైంది...టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తోపాటు తన ఇద్దరు కుమారులతో వైఎస్సార్సీపీ తీర్ధం పు చ్చుకోవడం, బలమైన సామాజిక వర్గం మొత్తం సహకరించడం పార్టీకి కలిసొచ్చింది. అంతేకాకుండా డేరింగ్ అండ్ డేషింగ్ ఎమ్మెల్యేగా పేరున్న వాసుపల్లికి జనం లోనూ, నాయకుల్లోనూ మంచిపేరే వుంది. దానికితోడు కార్యదీక్షుడిగా, విద్యా, వ్యాపారవేత్తగా అన్ని వర్గాల్లో ముందున్నారు. అలాంటి వ్యక్తి అధికారపార్టీ వైఎస్సా ర్సీపీ లోకి రావడంతో యూత్ మొత్తం ఫుల్ జోష్ తో ఉన్నారు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో పార్టీకి వున్న పేరు అన్నీ వాసుపల్లికి బాగా కలిసొ చ్చాయి. వాసుపల్లి వెనుక వున్న సామాజిక వర్గం కూడా ఇపుడు పార్టీకి కూడా బలంగామారింది. కార్యకర్తలు, నాయకులు కూడా గణేష్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ఆయన వెనుక వున్న కేడర్ కూడా ముందుకు వస్తుంది. అటు వాణిజ్య విభాగంలోనూ మంచి నాయకులు వుండటం కూడా ఈ నియోజకవర్గానికి కలిశొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎన్నివిధాలుగా చూసుకున్నా వాసుపల్లి వైఎస్సార్సీపీలోకి రావడం అన్నివర్గాల కు కలిసొస్తుందనే భావన ప్రతీ ఒక్కరిలోనూవుంది. ఇదే ఉత్సాహంతో ముందుకెళితే నియోజవకర్గంలో నూతన ఉత్తేజం చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు..!

Visakhapatnam

2020-09-20 11:37:13

శ్రీకాకుళంలో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర శాఖ..

శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర శాఖను జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ప్రారంభించారు. ఎచ్చెర్లలో ఈ శాఖను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారులకు మంచి సేవలు అందించాలని కోరారు. వినియోగదారుల మన్ననలు పొందడం ద్వారా కార్యకలాపాలు బాగా నిర్వహించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.కూన రాంజీ మాట్లాడుతూ బ్యాంకు బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బ్యాంకు జోనల్ హెడ్ దివేష్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిది, ఆంధ్ర ప్రదేశ్ లో 18 వ శాఖ అన్నారు. దేశ వ్యాప్తంగా 1848 శాఖలు, 1882 ఏటిఎంలు ఉన్నాయని వివరించారు. బ్యాంకు మొత్తం బిజినెస్ 2.50 లక్షల కోట్లని, అడ్వాన్సులు లక్ష కోట్ల రూపాయలని, డిపాజిట్లు 1.50 లక్షల కోట్ల రూపాయలని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన హైదరాబాదు జోన్ పరిధిలో రూ.9,600 కోట్లు బిజినెస్ ఉండగా, అడ్వాన్సులు రూ. 7,200 కోట్లు, డిపాజిట్లు రూ.2,400 కోట్లు అని వివరించారు. 2019 డిశంబరులో డిజిటల్ లావాదేవీల నిర్వహణలో దేశంలోనే ప్రధమ స్ధానం పొందిందన్నారు. స్వయం ఉపాధి కోర్సుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన బ్యాంకుగా అవార్డు పొందడం జరిగిందన్నారు. ఉద్యోగులు, రైతులు, విద్యార్ధులు, పారిశ్రామికవేత్తలు తదితర అన్ని రంగాలకు బ్యాంకింగు సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఉద్యోగులకు జీతాల ఖాతాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, అటువంటి వారికి రూ.40 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణ రుణాలు, వ్యవసాయ రుణాలు, వాహన రుణాలు తదితర అన్ని రంగాలకు సముచితమైన విధానంలో రుణాలు మంజూరు చేస్తామన్నారు. మహారాష్ట్రలో లీడ్ బ్యాంకుగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్, యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణా సంస్ధ డైరక్టర్ ఎస్.బి.శ్రీనివాస్, మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచి మేనేజర్ సి.హెచ్.అనిల్ కుమార్, విశాఖపట్నంకు చెందిన చీఫ్ మేనేజర్ బి. రామ్ శేఖర్, సీనియర్ మేనేజర్ ఎస్.శ్రీరామూర్తి, విజయవాడ నుండి బిజినెస్ డెవలప్ మెంటు అధికారి వై.తేజస్వీ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-19 19:36:44

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి...

మహిళలు చట్టాల  పట్ల అవగాహన కలిగి వుండాలని,  మహిళల్లో న్యాయ పరమైన చైతన్యం రావాలని  జిల్లా  ప్రధాన  న్యాయ మూర్తి  అవధానం  హరిహర నాధ  శర్మ  పిలుపు నిచ్చారు.  జాతీయ  న్యాయ సేవాధికార  సంస్థ,   జాతీయ  మహిళా  కమిషన్  దిశా  నిర్దేశంలో  శనివారం పెందుర్తి జిల్లా  సమాఖ్య   టెక్నికల్  ట్రైనింగ్  డెవలప్ మెంట్  సెంటర్  లో ఏర్పాటు  చేసిన మహిళా న్యాయ   అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు  చట్టాల పట్ల  అవగాహన  పెంచుకొని  చైతన్యం  కావాలని కోరారు.  విద్యావంతైన మహిళల్లో కూడా న్యాయ వ్యవస్థ, చట్టాల పట్ల సరియైన అవగాహన లేక పోవడం మూలంగా  ఇంటా, బయటా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సరియైన పోరాటం చేయలేక పోతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు న్యాయ సేవాధికార  సంస్థ  ద్వారా న్యాయ సహాయం  పొందాలన్నారు.   న్యాయ సేవాధికార  సంస్థ   టోల్ ఫ్రీ  నెంబరుకు  తమ సమస్యలు   తెలపాలన్నారు.  కరోనా  పరిస్థితులలో  మహిళలు  ఆరోగ్యం  పట్ల  శ్రద్ధ  వహించాలని, కరోనా పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వుండాలన్నారు.   జాతీయ  మహిళా  కమిషన్ ద్వారా  శిక్షణ  పొందిన  న్యాయ వాదులు  జహారా,  బి.అనంతలక్ష్మి  చట్టాలపై అంగన్వాడీ  వర్కర్లు,  సూపర్  వైజర్లు,   సీడ్ ఆర్గనైజేషన్    వాలంటీర్లు,  మహిళలకు  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా  న్యాయ సేవాధికార  సంస్థ  కార్యదర్శి  కె.కె.వి.బుల్లికృష్ణ, మహిళ శిశు  సంక్షేమాధికారి సంతోషి కుమారి, సీడ్  ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్  వి.యస్.రాజు  జిల్లా  న్యాయ  సేవాధికార  సంస్థ సభ్యులు , సిబ్బంది  పాల్గున్నారు.

Visakhapatnam

2020-09-19 19:29:34

జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి..

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనబరచిన విభిన్న ప్రతిభావంతులు, స్వచ్చంధ సంస్థలు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురష్కరించుకొని సాంఘిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు  విభిన్నప్రతిభావంతులకు, స్వచ్చంధ సంస్థలకు అందించే జాతీయ పురస్కారం – 2020కు దరఖాస్తులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దివ్యాంగుల పునరావాసం, స్వయం ఉపాధి, ఉద్యోగకల్పన, సాంకేతికత, క్రీడలు, అవరోధ రహిత వాతావరణం, అత్యుత్తమ సృజనాజ్మకత కలిగిన విభిన్నప్రతిభావంతులైన వయోజనులు, ఉత్తమ సృజనాత్మకత కలిగిన విభిన్నప్రతిభావంతులైన చిన్నారులు, ఉత్తమ బ్రెయిలీ ప్రెస్, ఉత్తమ ప్రాప్యత కలిగిన వెబ్ సైట్ మొదలగు రంగాల్లో కృషిచేసి అత్యంత ప్రతిభ కనబరచిన విభిన్న ప్రతిభావంతులు, స్వచ్చంధ సంస్థలు ఈ పురస్కారానికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల విభిన్నప్రతిభావంతులైన చిన్నారులు, వయోజనులు, స్వచ్చంధ సంస్థలు ఈ నెల 21లోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం వారికి మూడు సెట్లు సమర్పించాలని ఆ ప్రకటనలో కోరారు. ఇతర వివరాలు, నిబంధనల కొరకు www.disabilityaffairs.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని లేదా 08942 – 240519 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2020-09-19 18:53:21

ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీలు నిర్వహించాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే  అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని, ఇందుకు నాడు - నేడు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు డా.జి.జయలక్ష్మి సి.డి.పి.ఓ లను ఆదేశించారు. సోమవారం  ఐ.సి.డి.ఎస్. కార్యాలయంలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్రస్తుత భవనాల మరమ్మతులపై  సి.డి.పి.ఓ లతో ఆమె సమీక్షించారు. తొలుత పంచాయతీల వారీగా అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు తెలుసుకున్న ఆమె ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని స్పష్టం చేశారు. నాడు - నేడు క్రింద అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అందులో భాగంగా అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ప్రభుత్వ భవనాల్లో ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, ఆ నివేదిక తమకు అందిస్తే వాటిని సంయుక్త కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని చెప్పారు. నూతనంగా నిర్మించబోయే అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాలకు, గ్రామాలకు దగ్గరలో ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ భవనాల్లో ఉన్నటువంటి  అంగన్వాడీ కేంద్రాలకు మరామ్మతులు చేపట్టవలసివస్తే వాటి అంచనా వివరాలను తమకు అందజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సి.డి.పి.ఓ లు, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-19 18:46:14

స్కానింగ్ సెంటర్లుకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

విశాఖజిల్లాలోని మెడికల్ స్కానింగ్ సెంటర్లు సెప్టెంబరు 21 నుంచి కేంద్రం వివరాలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డా.కె.విజయలక్ష్మి సూచించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 21 నుండి స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియ మరియు ఇతర సేవలు ఆన్ లైన్ లో మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు pcpndt.ap.gov.in వెబ్ సైట్ లోకి లాగాన్ అయ్యి నిర్ణీత ద్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్, రెవిన్యువల్ చేయించుకోవాలన్నారు. కేంద్రాల్లో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే, తనిఖీల్లో భారీగా అపరాద రుసుము విధించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నిబయ నిబంధనలు కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లోనే పొందుపరిచిందని డిఎంహెచ్ఓ వివరించారు.

Visakhapatnam

2020-09-19 18:39:49

సచివాలయ మెటీరియల్ స్టాక్ పాయింట్ సందర్శన

శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షల ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శనివారం  పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ లో ఏర్పాటుచేసిన సచివాలయ పరీక్షల  మెటీరియల్ స్టాక్ పాయింట్ ను జె.సి  సందర్శించారు. అనంతరం మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని  స్వయంగా పరిశీలించారు. తొలుత మండలాల వారీగా సచివాలయ పరీక్షల మెటీరియల్ పంపిణీ వివరాలను జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావుని అడిగి తెలుసు కున్న ఆయన మెటీరియల్ తీసుకున్న రూట్ అధికారులకు జె.సి పలు సూచనలు చేశారు. మెటీరియల్ ఉన్న వాహనాలు ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ఇందుకు రూటు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ఒక్కో మండలానికి ఒక్కో కోడ్ కేటాయించడం జరిగిందని, తమకు కేటాయించిన మెటీరియల్ సరిపోయినది లేనిదీ పరిశీలించుకోవలసిన బాధ్యత కూడా రూట్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జి.చక్రధరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఏ.కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-19 18:32:49

బి.సి. సంక్షేమానికి రూ.29.800 వేల కోట్లు..

రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి  ప్రభుత్వం రూ.29 వేల 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు  బి.సి. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. శనివారం ఆయన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.త్రినాధరావు మంత్రికి స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వామివారి దర్శనం, అర్చన చేయించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ  బడుగు, బలహీన వర్గాల వారిలో ఆత్మనూన్యతా భావాన్ని తొలగించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేలా  ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. బి.సి.ల అభ్యున్నతికి  56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దాన్ని ఆయన  బిసి సంక్షేమ ఉద్యమంగా అభివర్ణించారు. అర్హత గల వారందరికీ సబ్సిడిపై బ్యాంకు లోన్లు, ఫీజు రీఇంబర్స్ మెంట్, ఉపకారవేతనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పూర్తి పారదర్శకంగా , ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మరక్షణకు, హిందువుల మనోభావాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడివుందన్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని, ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడరని వెల్లడించారు. ముఖ్యమంత్రి తలంపులకు  స్వామివారి ఆశీస్సులను కోరుతూ పూజలు నిర్వహించినట్లు చెప్పారు.  

Simhachalam

2020-09-19 18:17:45

నిండుకుండలా కంభం పెద్దచెరువు...

ప్రకాశం జిల్లాలోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి..గత 4 రోజుల కురుస్తున్న వర్సాలకు ప్రఖ్యాత కంభం చెరువు కు భారీగా  వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో చెరువు నిండుకుండను తలపిస్తోంది.  నల్లమల లో కురుస్తున్న భారీ వర్షాలకు కంభం చెరువుకు  నదీ పాయల ద్వారానీరు భారీగా చేరుతుంది.ప్రకాశం జిల్లా కంభం చేరువుకు గుండ్లకమ్మ , జంపలేరు వాగుల ద్వారా కూడా వరద నీరు చేరుతుంది.ఇప్పటి వరకు కంభం చెరువు లో పది అడుగుల మేర నీరు చేరింది. తుఫావలన వచ్చే ఈ భారీ వర్షాల కారణంగా కంభం చెరువుకు వరదనీరు ఎక్కువగా చేరి చెరువు పూర్తిగా నిండే అవకాశం ఉందని  రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంభం చేరువు కు నీరు వస్తుండటంతో పర్యాటకులు రోజుకు వందల సంఖ్యలో వచ్చి చెరువుని తిలకిస్తున్నారు...

కంభం

2020-09-19 16:02:07