ఏపీ సీఎం సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి దిశా నిర్దేశం మేరకు జిల్లాలో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలు అమలులో మరింత నిబద్దత గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనాలు, స్కూల్స్, ఆసుపత్రుల నాడు నేడు పనులు, టిడ్కో హౌసింగ్, జగనన్న భూ రక్ష, భూ హక్కు పథకం, స్పందన, భూ సేకరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం అమలులో సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనులు మరింత వేగవంతం చేయడానికి, ఇప్పటికే నిర్మాణాల్లో స్టేజ్ కన్వర్షన్ కూడా దృష్టి పెట్టాలని ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. అర్భికెలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ సంబందించిన భవనాల్లో పనులను పూర్తి చెయ్యడం, అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 390 గ్రామ సచివాలయ భవనాల్లో 238, అర్భికెల్లో 373 లో 168, హెల్త్ క్లినిక్స్ 337 లో 101 పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా 11 చోట్ల సచివాలయ, 18 చోట్ల అర్భికే, 38 చోట్ల హెల్త్ క్లినిక్స్ కు స్థల సేకరణ చెయ్యాల్సి ఉందన్నారు.
డిజిటల్ లైబ్రరీ లకు డిసెంబర్ 2022 చివరి నాటికి ఫైబర్ ఆప్టికల్ లైన్స్ పూర్తి చెయ్యాలని, ఇందుకు స్థానికంగా ఉండే వెండర్స్ ద్వారా కనెక్షన్స్ ఇచ్చేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు పూర్తి చెయ్యాలన్నారు. బల్క్ మిల్క్ యూనిట్స్ భవనాలు పనులు, భూసేకరణ పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సచివాలయ, అర్భికే, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ భవనాలు, స్కూల్స్ చేపడుతున్న నాడు నేడు పనుల ద్వారా ప్రజలకు చేకూర్చగలిగే ప్రయోజనం దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందన్నారు. మన బడి, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల లోనాడు నేడు పనుల విషయంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వ్యక్తిగత శ్రద్ద తీసుకొనవలసి ఉండాలన్న ఆదేశాలు నేపథ్యంలో ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రాధాన్యత కు అనుగుణంగా పనిచేయ్యాలని కలెక్టర్ డా మాధవీలత పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులు, ఇతర ప్రాధాన్యత నిర్మాణాల విషయం లో నాణ్యత ప్రమాణాలకు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు.
స్కూల్స్ లో చేపట్టే టాయ్ లేట్, స్కూల్స్ నిర్వహణ నిధులను ఖర్చు చెయ్యడంలో ప్రామాణికత పాటించాలని సూచించారన్నారు. వీటి నిర్వహణ విషయాన్ని ప్రశ్నించే విధానంలో సంబందించిన నిర్వాహకుల టెలి ఫోన్ నంబర్ బహిరంగ గా ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో చేపట్టే పనుల విషయంలో కూడా ఇదే తరహా భాధ్యత తో వ్యవహరించాలన్నారు. నవరత్నాలు పేద లందరికీ ఇళ్లు పథకం కింద చేపడుతున్న పనుల విషయంలో కన్వర్షన్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మంజూరు అయినా 48,143 ఇళ్లలో 9841 ఇళ్ళు పూర్తి అయినా , కన్వర్షన్ దశలో ఉన్న వాటి లో పురోగతి పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇంకా పనులు ప్రారంభం కానీ సుమారు 280 ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.
టిడ్కో ఇళ్ళ కి సంబంధించి 7936 ఇళ్ల కి సంబంధించి 4,733 ఇళ్లు లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన ఇళ్ల ను డిసెంబర్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి, లబ్దిదారుల పేరున రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం లో పురోగతి చూపాలని స్పష్టం చేశారు. లే అవుట్ లకు సంబంధించి అభివృద్ది సామర్ధ్య పెంచుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా రహదారులు, విద్యుత్, త్రాగునీరు పరంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం గా దిశా నిర్దేశనం చేశారని, ఆ విధానం లో క్షేత్ర స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.
హౌసింగ్ సైట్స్ సంబంధించి కేటాయింపు విషయంలో ఆడిట్ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో భాగంగా లబ్ధిదారులకు పట్టా ఇవ్వడం, అందులోకి లబ్దిదారుని పొజిషన్ లోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకో గలిగితే ఆడిట్ పూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందన్నారు. జగనన్న భూరక్ష, భూ హక్కు పథకం కింద ప్రోటోకాల్ ప్రకారం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో నాణ్యతతో రెడ్రెసెల్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అధికారులు ఎంతో భాద్యతతో ప్రజల నుంచి వచ్చే స్పందన ధరఖాస్తులు పరిష్కారం చూపాలన్నారు. ప్రతి బుధవారం స్పందన దరఖాస్తుల పరిష్కారం నాణ్యత పై సమీక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆమె తెలిపారు. స్పందనలో పరిష్కారం చేసిన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఫోటోలు వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలన్నారు. అప్పుడే స్పందన పరిష్కారం లో పారదర్శకతకు ఆస్కారం వుంటుందని తెలియచేశారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ , డ్వామా పిడి జి ఎస్ రామ్ గోపాల్, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఆర్ ఎం సి ఈ ఈ ఆర్ వి ఎస్ శేషగిరి రావు, పబ్లిక్ హెల్త్ ఈ ఈ - వై. నరసింహరావు , ఆర్ అండ్ బి ఎస్ ఈ - బివి మధుసూదన రావు, హౌసింగ్ డి హెచ్ వో టి. తారాసింగ్, తదితరులు పాల్గొన్నారు.