రాష్ట్రంలో బాలికలు, మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మహిళలు సాధికారత లక్ష్యంగా రాజకీయ పదవుల్లోకూడా 50 శాతం పైగా మహిళలకే కేటాయిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం స్థానిక టిటిడీ కళ్యాణమండపం రోడ్డులో జగనన్నఉమెన్ సేఫ్ హెవేన్ షెల్టర్ ను జిల్లా ఇన్ ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లతో కలసి హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో జగనన్నఉమెన్ సేఫ్ హేవెన్ ఏర్పాటు స్వాగతీయం అన్నారు. మహిళా సాధికారికత దిశగా ముఖ్యమంత్రి జగనన్న ఎంతో ప్రాధాన్యతను, ప్రోత్సహాన్ని ఇస్తున్నారన్నారు. రూడా చైర్ పర్సన్ మహిళల రక్షణ, భద్రత కోసం షెల్టర్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన చర్యలు అభినందనీయం అన్నారు. ఆడపిల్లలు చదువు కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారని, ఒక తల్లి మనస్సుతో షర్మిలా రెడ్డి ఆలోచన చేసిన తీరు అభినందనీయం అన్నారు. ఈ ఆవుట్ పోస్ట్ నందు నిరంతరం పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచడం జరుగుతుందని హామీ ఇచ్చారు. జగనన్న ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను వారి పేరుతో ఇవ్వడం ద్వారా సామాజిక సాధికారిత కోసం చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నేడు ఈకార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జగనన్న మహిళలకు రక్షణా భద్రత కల్పిస్తే భరోసానివ్వడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఈ షెల్టర్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే ఏర్పాటు చేసామని ఇందులో ఏర్పాటు చేసిన ప్రతి సదుపాయం మహిళలు మాత్రమే వినియోగించుకునేలా ఉండాలన్నదే ముఖ్యఉద్దేశ్యం అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏటీయం కేవలం మహిళలు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని ఇందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని కోరారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, మహిళల రక్షణ స్వర్గ ధామం గా ఈ జగనన్న ఊమెన్ సేఫ్ హెవెన్ షెల్టర్ అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఈ షెల్టరు ఏర్పాటులో రూడా చైర్ పర్సన్ గా షర్మిలా రెడ్డి తనదైన ముద్ర వెయ్యడం జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలో ఒక నూతన ఒరవడికి ఇక్కడే నాంది పలకడం చారిత్రాత్మక సంఘటన అన్నారు. మహిళలకి అండగా, సాధికారికత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఆ దిశలో ఆర్థిక పరిపుష్టిని మహిళలకు కల్పిస్తునే రాజకీయ పదవుల్లో 50 శాతం ఇవ్వటమే నిదర్సనం అన్నారు. మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఇంటి స్థలాలు కూడా వారి పేరునే రిజిస్ట్రేషన్ చెయ్యడం జరిగిందన్నారు. మహిళలకి స్వర్గ ధామం గా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని రాబోయే రోజుల్లో మరింత భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి జగనన్న మద్దతుతో ఈరోజు జగనన్న ఉమెన్స్ సేఫ్ హెవేన్ ఏర్పాటు కల సాకారం అయిందన్నారు. దీనికి ముఖ్యమంత్రికి ఎంతో రుణపడి ఉంటానన్నారు. జగనన్న ఉమెన్ సేఫ్ షెల్టర్ ప్రతిపాదన మార్చి 8 మహిళా దినోత్సవం రోజునే ముఖ్యమంత్రి ద్వారా ఆమోదం పొందడం జరిగిందన్నారు. కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల ద్వారా ఏర్పాటు చేసిన కళాశాల ఆవరణలోనే ఈ షెల్టర్ నిర్మాణం చేపట్టామన్నారు. వారి స్ఫూర్తి భావి తరాలకు అందించడంతో పాటు ఈ సమీపంలో ఉన్న పలు కళాశాలల్లో 3 వేలమందికి పైగా విద్యార్థినీలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలనే సంకల్పంతోనే ఇక్కడ ఏర్పాటు చేసామన్నారు. మహిళలు విద్యార్థినీలు ఈ షెల్టర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ నుండి ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా ఆటో సేవలు అందుబాటులోనికి వస్తాయన్నారు. ఇదే ఆవరణలో పోలీసు అవుట్ పోస్టు ను ఏర్పాటు చేయడం వలన మహిళలకు ఆకతాయి యువకుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. సీసీటీవీ ఏర్పాటు చేసామని నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ షెల్టర్ నిర్వహణ విషయంలో ఎటువంటి అనుమానం అక్కరలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తూ, వారి ఆర్థిక సాధికారత కోసం పనిచెయ్యడం జరుగుతోందని షర్మిలా అన్నారు. ఈ షెల్టర్ లో ఏర్పాటు చేసిన స్టాల్ ఎటీయం ద్వారా వచ్చే ఆదాయ వనరులను షెల్టరు నిర్వాహణకు వినియోగిస్తామన్నారు.
జగనన్న ఉమెన్స్ సేఫ్ హేవెన్ .. విశ్రాంతి షెల్టర్ ను జిల్లా ఇన్ ఛార్జి మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఇందులో పోలీస్ ఔట్ పోస్ట్ ను హోంమంత్రి తానేటి వనిత, విశ్రాంతి రూంను జక్కంపూడి రాజా, హెచ్ డి ఎఫ్ సి - ఎ టి ఎం లు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా సాధికారిత షాపు ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆర్వో ప్లాంట్ ను చందన నాగేశ్వర్ లు ప్రారంభించారు.
తొలుత కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల చిత్ర పటానికి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, స్థానిక నాయకులు మేడపాటి అనిల్, నందేపు శ్రీనివాస్, గిరిజాల వ్యాస్, పిల్లి నిర్మల, సౌందర్య, హాసిని, ఆదిలక్ష్మి, రూడా వీసీ వి.వివేక్, సెక్రటరీ జి. శైలజవల్లి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు టి. చంద్రశేఖర్, ఏఓ జి. శ్రీనివాస కుమార్, ప్లానింగ్ అధికారి డీజీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.