1 ENS Live Breaking News

తెలుగు భాషకే గొప్పదనం గిడుగు

గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషాగా తీసుకుని వొచ్చిన సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి అని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో వాడుక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఇంఛార్జి డీఆర్వో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు ఆయన చిత్రపటానికి పూల మాలలంవేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వ్యవహారిక వాడుకభాష ఉద్యమానికి ఆద్యులైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి జరుపుకుని ఆయన సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. తెలుగు భాషను వాడుక  భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చేసిన సంస్కరణలు బహుముఖ ప్రజ్ఞాశాలి గా గుర్తించాయన్నారు. 

ఈరోజు ఆ మహనీయుని జయంతి కార్యక్రమాన్ని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆయనకు ఇవ్వడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఇకపై కలెక్టరేట్ నందు ప్రతి రోజూ  "రోజుకో ఒక తెలుగు పదం " వ్యాఖ్య వ్రాయడం కోసం ప్రదర్శన పలక ముందు భాగంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అందులో ప్రతి రోజూ ఒక తెలుగు వాక్యాన్ని  తప్పనిసరిగా రాయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

సవర భాష కోసం శ్రీకాకుళం వెళ్లి ఆ భాషకు లిపిని తీసుకుని వచ్చి వాడుక భాష ఔనిత్యాన్ని చాటిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహేచ్. శ్రీధర్ పేర్కొన్నారు. తెలుగు భాషను మన పిల్లలకు నేర్పించడం ద్వారా వారిలోని సృజనాత్మకతను పెంపొందించడం సులభసాధ్యం అవుతుందని ఆయన అన్నారు.

Rajamahendravaram

2022-08-29 15:32:25

గ్రుహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల ప‌థ‌కం కింద చేపట్టిన గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్‌లో హౌసింగ్ నిర్మాణ పనులు, సిమెంట్ సరఫరా, స్టేజ్ కన్వర్షన్, అప్రోచ్ రోడ్లు, క‌ల్వ‌ర్టుల నిర్మాణ పనులు తదితర అంశాలపై హౌసింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సమీక్షించారు. తుని, సామర్లకోట, గొల్లప్రోలు, పెద్దాపురం, పిఠాపురం, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లు, కాకినాడ అర్బన్ కొమరగిరి లేఅవుట్‌కి  సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణ పట్టా పొందిన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించి స్టేజ్ కన్వర్షన్ చేసే విధంగా చూడాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన యాప్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు స్టేజ్ కన్వర్షన్‌కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ స‌మావేశంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ కె.రమేష్, పెద్దాపురం ఆర్‌డీవో జే.సీతారామరావు, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం మున్సిపాలిటీల కమిషనర్లు, కాకినాడ గ్రామీణ మండలాల అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-29 14:05:06

అమ్మ లాంటి తెలుగు బాషని మరవద్దు

అమ్మలాంటి తెలుగు భాషని మరువరాదని నగర మేయర్ గొలగాని వారి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాష కొరకు విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి 159 వ జయంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ తో కలిసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తెలుగు భాషా నిర్మాతలలో ముఖ్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో జన్మించారని, జీవిత కాలం తెలుగు భాష కొరకు, తెలుగు భాష ఔన్నత్యం కొరకు పాటుపడ్డారని గుర్తు చేశారు. అమ్మ లాంటి తెలుగు వాడుక భాష కొరకు అనేక ఉద్యమాలు చేశారన్నారు. 

కొంతమంది ప్రాచీన భాష సంస్కృతం లో విద్యాబోధన జరగాలని వాదించే వారిని, కానీ ఆయన  తెలుగు భాష స్వచ్ఛతంగా రాయడం చదవడం కొరకు పాటుపడే వారిని, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తెలుగు కమ్మదనాన్ని విద్యార్థులకు చూపించడమే కాకుండా ఎన్నో రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారిని తెలిపారు. రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా మేయర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, ప్రధాన ఇంజనీర్, పట్టణ ప్రణాళిక అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-29 14:01:18

ఘనంగా గిడుగు జయంతి ఉత్సవం

వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి పురస్కరించి సోమవారం ఉదయం కలెక్టరేట్ స్పందన హాలులో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ముఖ్య అతిధిగా హాజరై, జిల్లా అధికారులు, తెలుగు భాషాభిమానులతో కలిసి  గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ  గ్రాంధిక శైలిలో సాగుతున్న తెలుగు భాషా రచన, బోధనలను అందరికీ అర్థమయ్యే వాడుక భాషలోనికి తెచ్చేందుకు గిడుగు వెంకట రామమూర్తి వ్యవహారిక భాషాఉద్యమాన్ని నిర్వహించారని, ఆయన కృషికి  వల్లే నేడు విద్య, విజ్ఞానం, సాహిత్యం ప్రజలందరికీ అందుబాటులో వచ్చాయన్నారు.  అంతేకాక తన వంటి తెలుగేతర మాతృభాష కలిగిన వ్యక్తులు కూడా సులువుగా తెలుగు భాషను నేర్చుకునేందుకు వాడుక భాష దోహదం చేస్తోందన్నారు.

 మన పూర్వ కవులు, భాషావేత్తలు  మధురమైన తెలుగు భాషను సుసంపన్నం చేసి వారసత్వ సంపదగా మనకు అందించారని, భాషా పరిరక్షణతో పాటు, భాషా ప్రచుర్యానికి, విస్తృతికి కృషి చేయాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు.  ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష గొప్పదనాన్ని, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని వివరించి మాతృభాష పట్ల మక్కువ పెంపొందించాలని,  కుటుంబాలలో తప్పని సరిగా తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని కలెక్టర్ కోరారు.   జీవన అవసరాల కోసం ఎన్ని ఇతర భాషలు నేర్చినా, తల్లి భాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారని, వారందరూ తెలుగు భాష ప్రాచుర్యానికి కృషి చేయడం ముదావహమన్నారు.  తెలుగు భాషలో రచనా అనురక్తిని నేటి తరం యువత పెంపొందించుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం అందించామని తెలిపారు.  అలాగే ప్రజలతో జరిపే  ఉత్తర ప్రత్యురాలను అధికారులు వ్యవహారిక తెలుగు భాషలోనే సాగించాలని, పాలనా ఫలాలు ప్రజలకు సమగ్రంగా చేరేందుకు ఇది దోహదం చేయగలదన్నారు. 

కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి జిల్లాలో  తెలుగు భాషా ప్రాచుర్యానికి విశేష సేవలు అందింస్తున్న కవులు, భాషా వేత్తలను జిల్లా కలెక్టర్ సత్కరించారు.  ఇందులో భాగంగా  శతావధాని, విశ్రాంత తెలుగు పండితులు పోచినపెద్ది సుబ్రమణ్యం, కవి, భాషా,సాహిత్య ప్రచారకలు కొరుప్రోలు గౌరినాయుడు, కవయిత్రి, సాహితీ విమర్శకులు డా. కాళ్లకూరి శైలజ లను ఆమె దుస్సాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా తెలుగు భాషకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన సేవలను కొరిప్రోలు గౌరినాయుడు, తెలుగు భాషా ప్రశస్తి, మాధుర్యాలను పోచిన పెద్ది సుబ్రమణ్య కవి, ఆధునిక విజ్ఞానం, సాంకేతి పరిజ్ఞానాలను కూడా వాడుక తెలుగు భాషలో భోదించాల్సిన అవసరాన్ని కవయిత్రి డా.కాళ్లకూరి శైలజ వివరించారు.  
కార్యక్రమానికి జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ స్వాగతం పలుకగా, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధరరెడ్డి, బిసి కార్పొరేషన్ ఈఢి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.  అనంతరం మద్యాహ్నం కలెక్టరేట్ కు విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగాగీతా విశ్వనాథ్ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించి గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు ఘనంగా నివాళులు అర్పించారు. 

Kakinada

2022-08-29 13:49:57

ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు

కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డిల‌తో కలిసి కారుణ్య నియామకం కింద ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. యార్లగడ్డ శ్రీనివాసరావు గ్రేడ్-2 వీఆర్వోగా వక్కలంక సచివాలయం, అంబాజీపేట మండలంలో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన భార్య ఉందుర్తి దుర్గా పార్వతిని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  గంటా రామకృష్ణ, గ్రేడ్-2 వీఆర్వోగా వాకతిప్ప గ్రామం, యు.కొత్తపల్లి మండలంలో పనిచేస్తూ మరణించగా ఆయన భార్య పితాని మహాలక్ష్మిని కాకినాడ డివిజన్‌లో ఆఫీస్ సబార్డినేట్‌గా నియ‌మించారు.  మాదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గ్రేడ్-2 వీఆర్వోగా రామవరంగ్రామం, జగ్గంపేట మండలంలో ప‌నిచేస్తూ రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందగా ఆయన కుమారుడు మాదిరెడ్డి రాజా మురళీకృష్ణను పెద్దాపురం మండలం, పులిమేరులో గ్రామ రెవెన్యూ అధికారిగా నియమించారు. 

Kakinada

2022-08-29 13:46:13

స్పందన పరిష్కారంలో నాణ్యత ఉండాలి

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అర్జీని నిర్ణీత స‌మ‌యంలో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మిల‌తో క‌లిసి  ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 353 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌రాల అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి ఫొటోల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రెవెన్యూ అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న ఫొటోల‌ను ప‌రిష్కార నివేదిక‌కు జ‌త‌చేయాల‌ని ఆదేశించారు. స్పంద‌న అర్జీల ప‌రిష్కార నాణ్య‌తా ప్ర‌మాణాల త‌నిఖీలో భాగంగా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసే ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ ద్వారా అర్జీదారుల‌కు ఫోన్ చేసి, ప‌రిష్కారంపై అభిప్రాయాలు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. అంత‌కుముందు స్పంద‌న కార్య‌క్ర‌మంలో అర్జీలు ఇచ్చేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే అర్జీదారుల కోసం క‌లెక్ట‌రేట్‌లో చేసిన ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా తో పాటు, స్పంద‌న హాల్‌లో జ‌రిగిన జిల్లాస్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మంలో కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొని.. కొంతసేపు అర్జీల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక స్పంద‌న‌కు 32 అర్జీలు:
మధ్యాహ్నం కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-29 13:42:51

డిసెంబర్ నాటికి 2744 టిడ్కో ఇళ్లు సిద్ధం

పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 160 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న టిడ్కో ఇళ్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అనకాపల్లి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న సంకల్పించారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనకాపల్లి జిల్లాలో  టిడ్కో ఇళ్లను ఒక ఉద్యమంగా చేపట్టి అర్హులైన వారందరికీ అందించాలని మంత్రి అమర్నాథ్ ఆదిశగా అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురంలో 2744 టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది. ఇక్కడ పనులను మంత్రి అమర్ నాథ్ సోమవారం స్వయంగా పరిశీలించారు.

 సంబంధిత అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. 2744 ఇళ్లలో 300 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 2292 ఉన్నాయి. 365 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 96, 430 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 365 వున్నాయి.  వీటిలో 1352 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు మంత్రి అమరనాథ తెలియజేశారు. సుమారు 136.67 కోట్ల  రూపాయలతో 29 ఎకరాల్లో  ఈ ఇళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 95 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో రెండు మూడు నెలల్లో మౌలికసదుపాయాల పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రి తెలియజేశారు. మౌలిక సదుపాయాలకు 18.6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశామని, మురుగునీరు పోయేoదుకు నాలుగు కోట్ల రూపాయలతో సివరేజ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని, ఇల్లు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రాకపోతే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి, ఇక్కడ ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.

Anakapalle

2022-08-29 13:36:09

స్పందనకు హాజరుకాకపోతే చర్యలు తప్పవు

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు భావన ప్రజలనుండి వినతులు స్వీకరించారు.  ప్రజల సమస్యలను సంబంధిత జిల్లా అధికారులకు నేరుగా అందజేసి  త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ   ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపాలన్నారు.  ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని, ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  సంయుక్త కలెక్టరు ఒ.ఆనంద్  మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్లక్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా స్పందన కార్యక్రమానికి  ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వినతులు అందజేసారు. 118 వినతులు అందాయి. 

2022-08-29 13:27:34

ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి

తెలుగు ఆధునిక భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సంధర్బం గా  "తెలుగు భాషా దినోత్సవం" సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి  జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో జన్మించిన  గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగుబాషాభివృద్దికి విశేషకృషిచేసారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసిగా వ్యవహారిక భాషా ఉద్యమానికి ముఖ్యంగా సవర, గిరిజన బాషల అభివృద్దికి అవిశ్రాంతంగా కృషిచేసారని తెలిపారు. 

  అన్ని శాఖల అధికారులు తెలుగు భాషను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాద్యాయులు మరియు కవులు తెలుగుబాషాభివృద్దికి కృషిచేసిన  బెళగం భీమేశ్వరరావు,  చింతా అప్పలనాయుడు లను జిల్లా కలెక్టర్  నిశాంత్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు భావన, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఉమామహేశ్వరరావు,  జిల్లా అధికారులు, కలెక్టరు కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-29 13:21:01

విజయనగరం స్పందనకు 212 దరఖాస్తులు

విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం  నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 212 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 09, డి.ఆర్.డి.ఏ కు 20, అందగా అత్యధికంగా   రెవిన్యూ కు సంబంధించి 143 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారం లో నాణ్యత ఉండేలా చూడలంబరు.   అర్జీదారు తో మాట్లాడి వారికి సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వాలని ఆదేశించారు.  అప్పుడు మాత్రమే రీ ఓపెన్ లోకి వెళ్లకుండా డిస్పోజల్  అవుతుందని అన్నారు.  సమాధానానికి తగు ఫొటోగ్రాఫ్ ను కూడా అప్లోడ్ చేయాలన్నారు.  ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. అధికారులు స్పందన లాగిన్ లో స్వయంగా వినతులు పరిశీలించి, సమాధానం నాణ్యత ఉండేలా పరిష్కారం చేయా లన్నారు. అనంతరం  స్పందన లో వికలాంగుల శాఖ ద్వారా శరీరీక వికలాంగునుకి రూ . 40 వేల  విలువ గల లాప్టాప్ ను కలెక్టర్ అందజేశారు. వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 13:14:12

చవితి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి

విజయనగరం జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో భద్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం సూచనలు ఇచ్చినట్లే కొన్నిఈ ఏడాదికి కూడా ఇచ్చినట్టు  జిల్లా కలెక్టర్ సూర్య  కుమారి సోమవారం ఒక ప్రకటన లో  పేర్కొన్నారు.  భద్రత దృష్ట్యా ఎప్పటిలాగే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కలెక్టర్  గుర్తు చేశారు. వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్బంగా కొన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.  వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని,  ఫైర్, విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు, మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసారు.  నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం,  విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా  దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు.

 పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని, పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా  స్పీకర్లను ఉపయోగించాలని తెలిపారు.  ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని,  మండపాల వద్ద క్యూ లను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉందని స్పష్టం చేసారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని,  వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే వంటివాటికిపైన ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్  సూచించారు.

Vizianagaram

2022-08-29 13:10:12

స‌చివాల‌యాల్లో 2రోజులు ఈ-శ్ర‌మ్ రిజిస్ట్రేష‌న్

అసంఘ‌టిత రంగ కార్మికుల ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-శ్ర‌మ్ ప‌థ‌కంలో చేరేందుకు ఇంకా రిజిస్ట్రేష‌న్ చేయించుకోనివారి కోసం ఆగ‌స్టు 30, 31వ తేదీల్లో ప్ర‌త్యేకంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌త్యేకాధికారి బాలాజీ తెలిపారు. ఈ ప‌థకంలో చేర‌టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టే అన్ని పథకాలను పొంద‌వ‌చ్చ‌ని, ప్ర‌మాదాలు లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల చ‌నిపోయిన వారికి రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక సాయంతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. కావున జిల్లాలోని అసంఘటిత రంగంలో ప‌ని చేస్తున్న‌ వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, వాలంటీర్లు, కొరియర్ బాయ్స్, చిల్లర వర్తకులు, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతి వృత్తి పనివారు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలకు చెందిన స‌భ్యులు త‌దిత‌రులు స‌మీపంలోని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాల‌ని ఆయ‌న సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా  కోరారు. మొబైల్ నెంబ‌ర్‌తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా మొద‌టి పేజీ జెరాక్సు కాపీల‌ను స‌చివాల‌యంలో అంద‌జేయాల‌ని సూచించారు.

Vizianagaram

2022-08-29 13:01:53

నులిపురుగుల దినోత్సవంపై అవగాహన

విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 8,9 తేదీలు లో జరిగే నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమన్నీ పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో విజయవంతం అయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు పనిచేయాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఛాంబర్ లో డి-వార్మింగ్ కార్యక్రమం పై జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్లు ఆయా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఉండే పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఉండే టీచర్లు, లైన్ డిపార్ట్మెంట్లు తో ఏ.ఎన్. ఎం. , ఆశా వర్కర్స్ సహాయం తీసుకొని ప్రేత్యేక అవగాహన సమావేశం నిర్వహించాలని తెలిపారు. 

అలాగే ఒకటవ ఏడాది పిల్లలు నుండి 19 ఏళ్ళు వయసు కలిగిన పిల్లలు వరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి టీచర్ పర్యవేక్షణ లో
అల్బెన్డ్ జోల్ మాత్ర మింగకుండా, చప్పరించే విధంగా చూడాలి అని తెలిపారు. ఈ మాత్రలు ఆరోగ్యం బాగోలేని వారికి, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి వెయ్యదు అని తెలిపారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లో  అనివార్య కారణాలు వల్ల రాలేని వారికి , తిరిగి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగే మాప్ అప్ డే లో మాత్రలు వెయ్యాలి అని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు చేతికి మాత్రలు ఇవ్వవద్దు అని, అంగన్ వాడి , పాఠశాల, కళాశాలలో మాత్రమే వెయ్యాలి అని తెలిపారు.   ప్రతి పి.హెచ్.సి లో అల్బెన్డ్ జోల్ మాత్రలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ పి.రవి కుమార్, డి.ఈ.ఐ.సి. మేనేజర్ లోకనాధ్, తదితరులు పోల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 12:59:20

విశాఖలో ఘనంగా తెలుగుభాష జయంతి..

దేశంలో ఎన్ని భాషలు వాడుకలో  ఉన్న తెలుగు భాష తియ్యదనం కలిగిన భాష అని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున  అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ లో  తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా కలెక్టర్  డా. ఏ మల్లిఖార్జున పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాన్ని సరళీకరించి,  తెలుగు భాష తీయ్యదనాన్ని సామాన్యునికి చేరేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులుగారన్నారు. తెలుగు భాష సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా  నిలిచిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. పాఠశాలల్లో, విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు 5 నిమిషాల పాటు ఇంగ్లీషు పదాలు  ఉపయోగించకుండా  మాట్లాడటం, వ్రాయడం వంటి  కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు. ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో తెలుగు లో  హోర్డింగులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు అధికార భాష సంఘం అద్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ గ్రాంధిక భాష నుండి సంకెళ్ళు విడిపించి తెలుగు భాష  సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో  వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అన్నారు. భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి  శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో హిందీ తర్వాత తెలుగు భాష చరిత్ర కలిగిన భాష అని అన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇతర భాషలు  ఎన్ని నేర్చుకున్నా, తెలుగు భాష కమనీయ తియ్యదనం మర్చిపోకూడదన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రాంధిక భాష లో విద్యనభ్యసించినచో సామాన్య ప్రజలకు అర్థం కాదని, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వాడుకలోకి తెలుగు భాష తీసుకు రావడానికి గిడుగు - పిడుగై సపళీకృతం కాగలిగారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఉన్నంత కాలం తెలుగు భాష ఉంటుందని తెలిపారు.

అంతకు ముందు  జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా  రాష్ట్ర స్థాయి లో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన 44 మంది మహనీయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో  ఎ యూ  వైస్ ఛాన్సలర్ ప్రసాదరావు, ఉడా  చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జెడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర , ఎమ్ ఎల్ సి వరుదు కళ్యాణి,  వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు  కెకె రాజు, చొక్కాకుల లక్ష్మి, మధుసూదనరావు, వంగపండు ఉష, కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-29 10:35:03

తెలుగు మాధుర్యాన్ని అందించిన గిడుగు

పండితులకు మాత్రమే పరిమితమైన భాషను ప్రజలందరి వాడుక భాషగా రూపుదిద్దేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు, సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు అన్నారు. తెలుగుభాషతో పాటు సవర లిపి కనుగొని భాషోధ్యమానికి చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహుదూర్ అని బిరుదాకింతులు పొందిన కీర్తి గిడుగు సొంతమన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నూతన విగ్రహాన్ని కమిషనర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చిన ఘనత గిడుగుదే అన్నారు. సరుబుజ్జిలి మండలం పర్వతాల పేటకు చెందిన గిడుగు ఖ్యాతి తెలుగు భాష మాదిరిగా ఖండాంతరాలు వ్యాపించిందన్నారు. 

ప్రభుత్వం మాతృభాషలోని పరిపాలన ప్రజలకు అందించే దిశగా ఎన్నో చర్యలు చేపట్టిందని కమిషనర్ వివరించారు. ప్రజల భాష ఎప్పుడూ సజీవంగా ఉండేందుకు పౌర సమాజం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పరిపాలనలో తెలుగు భాష వాడకం పెరిగిందని కమిషనర్ తెలిపారు. జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, మేనేజర్ రమణ బృందం గిడుగు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విగ్రహదాత, హిందీ ఉపాధ్యాయులు మందపల్లి రామకృష్ణను కమిషన  పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. అలాగే తెలుగు తల్లి వేషధారణలో గాయత్రీ, నృత్య శిక్షకురాలు సుశీల బృందాన్ని మెమెంటో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర సమన్వయ బృందం సురంగి మోహన్‌రావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్, మహిబుల్లాఖాన్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, నిక్కు హరిసత్యనారాయణ, తర్జాడ అప్పలనాయుడు తదితరులున్నారు.

Srikakulam

2022-08-29 07:25:40