1 ENS Live Breaking News

శత శాతం పనులు గ్రౌండ్ కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు క్రింద మంజూరైన భవన నిర్మాణ పనులు శత శాతం గ్రౌండింగ్ కావాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశించారు. విద్యాశాఖ మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనుల పురోగతిపై స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్  సురేష్ కుమార్, నాడు నేడు మౌలిక సదుపాయాల సలహాదారు మురళీధర్ తో కలసి  గురువారం  జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ప్రభుత్వ  జూనియర్ కళాశాలలు, అంగన్వాడి, పాఠశాల భవనాలు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందుకు అవసరమైన పాలనా అనుమతులు, రివాల్వింగ్ ఫండ్ జమ చేయాలని అన్నారు. లక్ష్యాల పూర్తికి పనుల వేగం పెంచాలన్నారు.  నూతన విద్యా విధానం లో మ్యాపింగ్ పూర్తి అయిన స్కూల్స్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులను  చేర్చాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో విస్తారంగా వర్షాలు కురవడం, సిమెంట్ , ఇసుక సకాలంలో చేరకపోవడం వలన పనులలో కొంత మేర జాప్యం ఏర్పడిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి పి.బ్రహ్మాజీ రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ప్రభాకర రావు, తదితరులు, పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-18 11:29:19

గత స్మృతులకు దర్పణం చాయాచిత్రం

గత స్మృతులకు దర్పణంగా నిలిచేది చాయాచిత్రం మాత్రమేనని  రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా  వాల్తేర్ ఫోటోగ్రఫిక్ సొసైటీ స్థానిక వేమన మందిరంలో గురువారం ఏర్పాటుచేసిన మెగా ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అద్భుత అందాలను కళ్లకు కట్టినట్లు చూపించగల శక్తి సామర్థ్యం ఒక్క  ఫోటోగ్రాఫర్ కి మాత్రమే వుందని  అన్నారు. కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి అని అన్నారు. డిజిటల్  ఫోటోగ్రఫీ వచ్చిన తరువాత  చాయచిత్రాలు మరుగున పడిపోయాయి అని మంత్రి అమర్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టిల్  కెమెరాలతో ఫొటోలు తీసి, వాటిని చాయచిత్రాలుగా మలచి భద్రత పరచుకోవలసి అవసరం ఎంతైనా వుందని ఆయన అన్నారు. అలాగే  ప్రొఫెషనల్  ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యానికి మరింత పదునుపెట్టి ఫోటోగ్రఫీ ఖ్యాతిని పెంచాలని అమర్ నాథ్  విజ్ఞప్తి చేశారు.  ప్రొఫెషనల్  ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక  గుర్తింపు అవసరమని, వీరికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందిస్తామని మంత్రి అమర్ నాథ్ హామీ ఇచ్చారు.

పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఫొటోలు జీవితాలను మార్చేస్థాయని అన్నారు. పూర్వం ఫొటోలు మాత్రమే చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వారని చెప్పారు. రాజకీయ నాయకులను పదవులలో  కూర్చో పెట్టాలన్నా, దించేయాన్నా ఆ శక్తి ఫొటోగ్రాఫర్లకు, వారు తీసిన ఫొటోలకు వుందని యార్లగడ్డ చమత్కరించారు. లీడర్ పత్రిక అధినేత రమణ మూర్తి మాట్లాడుతూ, పత్రికలో  వార్త  ఎంత ప్రధానమైనదైనా, ఆ వార్తకు సంబంధించిన ఫొటోనే పాఠకులు ముందుగా చూస్తారని, ఆ ఫొటో, ఆ వార్త సారాంశాన్ని  వ్యక్తీకరిస్తుందని  అన్నారు.  నక్సల్స్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య  ను తాను అత్యంత రహస్యంగా ఇంటర్వ్యూ చేశానని, తాను నిజంగా  ఆ ఇంటర్వ్యూ చేశానని తాను తీసిన ఫొటోల ద్వారానే బాహ్య ప్రపంచానికి తెలియచేశానని, అది ఫొటోకు వున్న గొప్పతనం అని రమణమూర్తి చెప్పారు.  ఈ కార్యక్రమానికి సొసైటీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్  కోదండరామయ్యని,సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రసాదరావును మంత్రి అమర్ నాథ్  ఘనంగా సత్కరించారు. అంతకు ముందు ఫొటో ఎగ్జిబిషన్ లో  పొందుపర చి న సుమారు 800 ఫొటోల ను  మంత్రి అమర్ నాథ్ ,యార్లగడ్డ  తదితరులు సందర్శించి నిర్వాహకుల ను  అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సేత్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-18 10:42:39

విశాఖలో రెండ్రోజులు మెగా ఫోటో ప్రదర్శన

విశాఖలో ఈ నెల 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 18,19 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు ఆసిల్ ఆశీల్ మెట్ట వద్ద ఉన్న వేమన మందిరంలో మెగా ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాల్తేర్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ కార్యదర్శి ఎం.వి.శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  మంగళవారం పెద్ద వాల్తేర్ లోని అసంగానంద ఆశ్రమంలో  నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించే ఈ ప్రదర్శనలో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పత్రికా సంపాదకులు వి.వి.రమణ మూర్తి పాల్గొంటారన్నారు. దివంగత సీనియర్ ఫోటో జర్నలిస్ట్ డాక్టర్ పల్లా రాజారావు(వాసు) పేరిట జీవిత సాఫల్య పురస్కారాన్ని విఖ్యాత సీనియర్ ఫోటో జర్నలిస్టు కోదండ రామయ్యకు అందజేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ లతోపాటు 30 మంది ఇతర ఫోటోగ్రాఫర్లు తీసిన ఆర్ట్ ఫోటోలు, ఫోటో జర్నలిజంపై 800 ఫోటోలు సందర్శకులకు కనువిందుచేస్తాయి అన్నారు. చివరి రోజు సాయంత్రం జరిగే ముగింపు ఈ కార్యక్రమంలో వారికి ప్రోత్సాహక పత్రాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో  అధ్యక్షుడు పి ఎన్ సేత్, గౌరవ అధ్యక్షులు ఈ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి వి రామరాజు, సహాయ కార్యదర్శి  ఎం వి నర్సింగరావు, కోశాధికారి జగపతిరాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-16 15:13:26

వైఎస్సార్ బడుగు వికాసంతో ప్రోత్సాహం

వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించేందుకు సంప్రదాయ మద్యం తయారీ గ్రామాల్లో ఎంపికైన అభ్యర్థులకు రుణ సదుపాయాలు కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి  కలెక్టర్ ఛాంబర్ లో  అక్రమ మద్యం తయారీలో ఉన్న గ్రామస్తులకు  మద్దతు కార్యక్రమం నిర్వహించడం పరిశ్రమల, సిడ్బి, బ్యాంకర్ల, ఎంపిడివో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గతంలో అక్రమ మద్యం తయారీ చేసే రంగంలో ఉన్న వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గౌరవమైన జీవనాన్ని సాగించే ప్రక్రియలో మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు. అందులో భాగంగా సిడ్బి (చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా జిల్లా పరిశ్రమలు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా మండలాలు పరిధిలోని బ్యాంకులతో మాట్లాడి మెప్పించడం ద్వారా ఆదాయ వనరుగా యూనిట్స్ స్థాపన కార్యరూపం సాధించి ఒక రోల్ మోడల్ గా నిలవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ దిశలో  రాజానగరం మండలం శ్రీరామ్ పురం లో 7 యూనిట్స్, కొవ్వూరు మండలం మద్దూరి లంకలో 8 యూనిట్స్, చాగల్లు మండలం చిక్కాల , చిక్కాలపాలెం లో 14 యూనిట్స్ గ్రౌండింగ్ చేసే దిశలో తీసుకున్న చొరవను కలెక్టర్ అభినందించారు.  ఇటువంటి కార్యక్రమాలను మరింత మంది మెరుగైన జీవనోపాధి దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మరింత మందికి స్ఫూర్తి పొందే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇది ఆరంభం మాత్రమే నని ఆమె తెలిపారు.

పి ఎం ఈ జీ పి/వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ఏ పి ఖాదీ & గ్రామీణ పరిశ్రమల బోర్డ్ ద్వారా 24 యూనిట్స్ , జిల్లా పరిశ్రమల ద్వారా 5 యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎస్ బి ఐ  దివాన్ చెరువు బ్రాంచ్ ద్వారా 7 యూనిట్స్ రూ.22 లక్షలతో,  చిక్కాల బ్రాంచ్ ద్వారా 13 యూనిట్స్ రూ.66 లక్షల తో, నిడదవోలు బ్రాంచ్ ద్వారా ఒక యూనిట్ రూ.25 లక్షలతో, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడపల్లి బ్రాంచ్ ద్వారా 8 యూనిట్స్ రూ.22 లక్షల మూల ధనంతో బ్యాంకర్లు ముందుకు వచ్చారని తెలిపారు. ఇందులో లబ్దిదారుని వాట 5 శాతం, బ్యాంక్ రుణ సౌకర్యం 95 శాతం కల్పించడం జరిగిందని వివరించారు . ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్దిదారులు 35 శాతం మేర ప్రభుత్వ సబ్సిడీ గా పొందవచ్చు అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కె. వేంకటేశ్వరరావు, మెప్డా - సిడ్బి ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు, ఎల్ డి ఎం కె. దిలీప్ కుమార్, బ్యాంకు మేనేజర్ లు, చాగల్లు, కొవ్వూరు, రాజానగరం ఎం పి డి వో లు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-08-16 14:59:59

అమర్ ఓడినప్పుడే అనకాపల్లి కి స్వాతంత్య్రం

అనకాపల్లి జిల్లాలో 2024 లో జరిగే ఎన్నికల్లో గుడివాడ అమర్నాధ్ ఓడిన నాడే అనకాపల్లి ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పరుచురి భాస్కరరావు అన్నారు. మంగళవారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విశాఖకు చెంది జనసేన నాయకులు బోలిశెట్టి సత్యన్నారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాధ్ అవాకులు చవాకులు పేలడం తగదన్నారు. తమ మూడేళ్ల అధికార సమయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో ప్రజలకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నమ్మబలికిన వ్యక్తి నేడు దానిని అమ్ముకునేందుకు సిద్ధపడటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆరోపించారు. 25 ఎంపీలు ఉండికూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాడలేని దౌర్భాగ్య స్ధితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందన్నారు. పేరుకే కొత్త జిల్లాలు ఏర్పడినా ఎక్కడా అధికారికంగా ఎలాంటి వసతులు, జిల్లా స్థాయి కల్పన ఎక్కడచేపట్టలేకపోయారని దుయ్యబట్టారు. అమలు కానీ హామలు ప్రజల నెత్తిన రుద్ది అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారనే విషయాన్ని ముందు ప్రజలకు తెలియజేయాలన్నారు. జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో ఆ విషయం మా పార్టీ అధిష్టానం, తమ అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని..దానికోసం వైఎస్సార్సీపీ నేతలు ఆత్రుత పడాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Anakapalle

2022-08-16 14:50:01

శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలి

ఎం.ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా పొందే శిక్షణతో మత్స్యకారుల జీవితాలు మారాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మత్స్యకార బృందానికి పిలుపునిచ్చారు. మంగళవారం తమిళనాడులోని పూంపుహార్ ప్రాంతంలో గల ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొందేందుకు 33 మందితో బృందం బయలుదేరింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీతో కలిసి బస్సుకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందనున్న మత్స్యకారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జాతీయస్థాయిలో మత్య్సకారుల శిక్షణ నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇదే ప్రథమం అని, ఇటువంటి అవకాశం శ్రీకాకుళం జిల్లాకు లభించడం గర్వకారణమన్నారు. దీనివలన మిగిలిన అనుబంధ రంగాలైన వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, ఉద్యానవనం వంటి శాఖల శిక్షణకు స్పూర్తికావాలన్నారు. ఎం.ఎస్.స్వామినాధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే వారం రోజుల  శిక్షణతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 

ముఖ్యంగా 20 ఏళ్ల తదుపరి మత్స్యకారుల జీవితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో శిక్షణ పొందనున్న మత్స్యకారులు తెలుసుకోబోతున్నారని కలెక్టర్ తెలిపారు. శిక్షణను శిక్షణ మాదిరిగా కాకుండా మీలో ఉండే ప్రతిభను వెలికితీసేలా వ్యవహరించాలన్నారు. జిల్లా తరుపున వెళుతున్న 33 మంది బృందం జిల్లా ప్రతిభను మరింత ఇనుమడింపజేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. శిక్షణ పొందిన వారు మిగిలిన వారికి శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నందున క్షుణ్ణంగా తెలుసుకొనిరావాలని, తద్వారా జిల్లా అంతటా వ్యాపించి జిల్లా రోల్ మోడల్  కావాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శిక్షణ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-08-16 14:02:50

ఆశ్రమ పాఠశాల సమస్య పరిష్కరించాలి

ఆశ్రమ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐ టి డి ఎ పి ఓ ఆర్. గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని  దిగుమోదపుట్టు ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేదని విద్యార్థులు దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ సమస్య ను వెంటనే పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయుడు, ఏ టి డబ్ల్యూ ఓ లను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో డ్రాపవుట్లు  ఎక్కువగా ఉన్నారని తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షమశాఖ డిడి,atwo ను ఆదేశించారు. అనంతరం తుంపాడ,చింతలవీది గ్రామ సచివాలయం లను తనిఖీ చేశారు. తుంపాడ వి ఆర్ ఓ ఎం. కొండమ్మ సక్రమంగా విధులకు హాజరు కాలేదని పరిశీలించి కావడం లేదనిక్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలనిఎంపీడీఓకు సూచించారు. విలేజ్ సర్వేయర్ డిప్యూటేషన్ రద్దు చేయాలని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. తుంపాడ 13వతేది నుండి హాజరు పట్టిక లో సంతకాలు చేయకుండా విధులకుపంచాయతీ కార్యదర్శి ఎన్. మత్త్య రాజు హాజరు కాలేదని తగిన చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి. ఓ ని అదేశించారు.

Paderu

2022-08-16 13:58:11

ఆగస్టు 17 నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు

అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే  దోషాల వల్ల  ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. ఆగస్టు 18న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, లఘు పూర్ణాహుతి చేపడతారు. ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.  ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tallapaka

2022-08-16 13:33:13

సరిక్రొత్త భారత దేశాన్ని అవిష్కరిద్దాం

76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం మేరకు సరి క్రొత్త భారత దేశాన్ని ఆవిష్కరించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలన్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది క అమృత్ వేడుకలను జిల్లా అంతటా ఘనంగా జరుపుకుని దేశ భక్తిని చాటుకున్నామని గుర్తు చేసారు. అదే స్ఫూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను  ప్రజలకు చేరువుగా ఉంటూ పారదర్శకంగా  అందేలా  చూడాలన్నారు.  అధికారులంతా అంకిత భావం తో , చిత్త శుద్ధి తో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు, కలెక్టర్ ఏ.ఓ దేవ్ ప్రసాద్, పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-15 11:58:14

సర్వేయర్ల సేవలు ప్రశంసనీయం

గ్రామ సర్వేయర్లు అమూల్యమైన సేవలను అందిస్తున్నారని విజయనగరం ఆర్డీవో ఎంవి సూర్యకళ కొనియాడారు. భూముల రీ సర్వేలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో,  గ్రామ సర్వేయర్లు, వీఆర్వోల సత్కార సభ సోమవారం జరిగింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, వీఆర్వోలను ఈ సందర్భంగా సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో సూర్యకళ మాట్లాడుతూ, రీ సర్వేలో మన జిల్లా ముందంజ లో వుండటానికి సర్వేయర్లు, వీఆర్వోలే కారణమని అభినందించారు. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం క్రింద చేపట్టిన భూముల రీ సర్వే కి ప్రభుత్వం  అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రీ సర్వే పూర్తి అయితే, చాలా వరకు భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత సర్వేయర్ల పైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. సర్వేయర్లు, విఆర్వోలు అంకితభావంతో పని చేసి, సర్వేలో మన జిల్లాను అగ్రపథంలో నిలబెట్టాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే, భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకులు త్రివిక్రమరావు, ఆర్డీవో కార్యాలయ ఏఓ ప్రభాకరరావు, పది మండలాల తాసిల్డార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, విఆర్వోలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-15 11:50:15

పీఎంఎస్ వై పథకంతో మత్స్యకారులకు ఆర్ధిక తోడ్పాటు

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సముద్ర మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులకు ఉపాది, వ్యాపార అవకాశాలు మెరుగుపడి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న తెలిపారు. శనివారం విజయనగరంలోని  ఫిష్ సీడ్ ఫారంలో మత్య్స సంపద, వినియోగం, పథకం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారులు అభివృద్ధి, మత్స్య సంపద పెంపుదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, వై.ఎస్.ఆర్. పెన్సన్ కానుక, మత్స్య సాగుబడి, కిసాన్ క్రెడిట్ కార్డులు, పవర్ సబ్సిడీ వంటి ఎన్నో పధకాలు అమలు చేస్తోందని అన్నారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు            ఎన్.నిర్మలకుమారి మాట్లాడుతూ, స్థానికంగా చేపల వినియోగం పెంచేందుకు మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి SC, ST, మహిళలకు 60శాతం, ఇతరలకు 40శాతం సబ్సిడీపై ఈ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఔత్సాహిక మత్య్సకారులు ఇంకా ముందుకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా లబ్ది పొంది వినూత్న, సాంకేతిక పద్దతిలో రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టం(RAS) ద్వారా చేపల పెంపకం చేయుచున్న మహిళా లబ్దిదారు. నాగమణి గారు తన యొక్క అనుభవాలు,  RAS ప్రయోజనాలు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్  యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-13 14:54:46

మదినిండా స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి..

భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ మెండుగా ఉండాలని.. అదే స్ఫూర్తితో భావి భారత పౌరులకు స్వాతంత్ర ఉద్యమ చరిత్రను చాటి చెప్పాలనే లక్ష్యంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా మహనీయుల త్యాగాలను గురుతు చేసుకుంటున్నామని  మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి  తెలియజేశారు. శనివారం విజయనగరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 75సంవత్సరాల స్వాతంత్ర్య సంబురాల జాతర ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) నుంచి కోట, మూడు లాంతర్లు, గంట స్థంబం, మహా రాజ కళాశాల మీదుగా తిరిగి గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) వరకు కొసాగింది. ఈ ర్యాలీ మొత్తం “భారత్ మాత కి జై”, “వందేమాతరం” అనే నినాదాలతో పట్టణ వీధులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా మత్స్యశాఖ  ఉపసంచాలకులు ఎన్. నిర్మల కుమారి మాట్లాడుతూ, జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు  ప్రజలలో దేశభక్తిని పెంపొందించి, స్పూర్తిని కలిగించామన్నారు. భారతద్శానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారణమైన మహానుభావులను తలచుకుంటూ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగాల తో సిద్ధించిన స్వాతంత్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. 75సంవత్సరాల జెండా పండుగ కార్యక్రమంలో మత్స్యశాఖ ద్వారా తాము పాల్గొనడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మది నిండా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాగిన మువ్వన్నెల జెండా పండుగ ర్యాలీలో ఎఫ్డీఓ యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-13 14:23:35

వైద్య‌సేవ‌ల‌ను మరింత మెరుగు ప‌ర‌చాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని వైద్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు కృషి చేయాల‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు. దీనికి జిల్లా ప‌రిష‌త్ నుంచి త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. మెర‌క‌ముడిదాం మండ‌లం గ‌ర్భాం పిహెచ్‌సికి కంప్యూట‌ర్‌, ప్రింట‌ర్ క‌మ్ స్కాన‌ర్‌, యుపిఎస్‌ల‌ను, జిల్లా ప‌రిష‌త్‌లో శుక్ర‌వారం అంద‌జేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, గ‌ర్భాం పిహెచ్‌సి వైద్యులు, సిబ్బంది వీటిని స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెడ్‌పి సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్‌, మెర‌క‌ముడిదాం మండ‌ల నాయ‌కులు తాడ్డి వేణు, కోట్ల వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.          

Vizianagaram

2022-08-05 12:02:54

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మకు గంట్ల పూజలు

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం(వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంని పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు.. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం సందర్భంగా  శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి ఆలయంలో పంచామృత అభిషేక సేవలో పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరిని దర్శించుకునీ  ప్రత్యేక పూజలు చేసి.. తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో భక్తులకు విశేష ఏర్పాట్లు చేశారు.


వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని పాతనగరం లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బంగారు చీరతో అందంగా అలంకరించారు.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు.

Visakhapatnam

2022-08-05 08:09:49

ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం

 నూతన చట్టాలకు అనుగుణంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఓటర్ జాబితాలో నమోదైన ఓటరు  కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్  పేర్కొన్నారు. మంగళ వారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరం లో  ఓటర్ ఆధార్ సంధాన ప్రక్రియ పై పాత్రికేయుల  సమావేశంలో జేసీ మాట్లాడారు.  ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్లు 2023 మార్చి 31 నాటికి స్వచ్ఛందంగా తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం నూతనంగా ఫారం-6 బిని ప్రవేశపెట్టామని  తెలిపారు.  ఆధార్ నంబర్ అనుసంధానం స్వచ్చందమేనని   సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించడం ఉండదని  స్పష్టం చేశారు. దోషరహితమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఓటరు సహకరించాలని  అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.

ఓటరు నమోదుకు 4 సార్లు అవకాశం :
 2023 ఓటర్ల జాబితా వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో   ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు సమర్పించవచ్చని ఆయన సూచించారు.   ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం సంవత్సరంలో నాలుగు సార్లు అవకాశం కల్పిస్తుందని జే.సి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన  కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. జనవరి 1వ తేదీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వలన 18 సంవత్సరాలు నిండినప్పటికి పలు ఎన్నికలలో యువత ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఆగష్టు 1 నుండి కొత్త దరఖాస్తులు:
ఓటరు నమోదు ఫారాలు మరింత సులభంగా రూపొందించి ఆగష్టు 1వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకువస్తుందని సంయుక్త  కలెక్టర్ చెప్పారు. ఓటరుగా నమోదుకు ఫారం - 6, పేరు తొలగింపుకు ఫారం - 7, వివరాలను సరిదిద్దడానికి ఫారం -8, ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం చేయడానికి ఫారం - 6బి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు.  ఇప్పటికే పాత నమూనా దరఖాస్తులో దాఖలు చేసిన వారు కొత్తవి సమర్పించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ లో ప్రారంభం కానున్న సవరణ కార్యకలాపాల్లో ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాత స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ క్రింద ముసాయిదా ఓటర్ల జాబితాలో క్లెయింటు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక నెల వ్యవధి అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యెక సమ్మరీ రివిజన్ :  
ప్రత్యేక సమ్మరీ రివిజన్ 2023 షెడ్యూల్ ప్రకారం దోషరహితమైన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుండి అక్టోబర్ 24 వ తేదీ వరకు చేపడతామన్నారు. నవంబర్ 9వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించి అప్పటి నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 26వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు. తదుపరి 2023 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని  తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్  రూపొందించిన 6, 6బి, 8  ఫారాలను  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గణపతి రావు, ఎన్నికల్ల పర్యవేక్షకులు మహేష్ , డి ఐ.పి.ఆర్ .ఓ  రమేష్   తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-02 09:15:31