1 ENS Live Breaking News

24నుంచి రాములోరి పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూలై 23న సాయంత్రం అంకురార్పణంతో ఈ  ఉత్సవాలు ప్రారంభమవుతాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక  దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా  నివారించేందుకు ప్రతి ఏడాది  మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tirupati

2022-07-18 11:04:43

సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి

పశ్చిగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన  స్పందన  కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ  అధికారి కె.కృష్ణవేణి కలెక్టరేట్ ఏవో వై రవికుమార్, డిఎస్పి కె.ప్రభాకర్, స్పందన తాసిల్దార్ దుర్గా కిషోర్, అనంత కుమారి, భీమవరం ఎంపీడీవో జి పద్మ లతో హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంధర్బంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుండి  వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారుల అందించిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారంకు సంబందించి  సంబంధిత అధికారులకు డిఆర్ఓ ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా డిఆర్ఓ  మాట్లాడుతూ స్పందన ద్వారా అందిన దరఖాస్తులను ఎట్టిపరిస్థితులలోనూ నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. స్పందనలో అందిన వినతుల పరిష్కారం లో ఎటువంటి జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్పందన కార్యక్రమం ఉండాలన్నారు.  ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు  క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా, అర్జీదారుడు సంతృప్తిచెందేలా  నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.  స్పందన అర్జీలను  మరింత సులభతరంగా, నాణ్యతతో పరిష్కరించడంతో పాటు పరిష్కార నివేదికను కూడా సంబందిత పోర్టల్లో పొందుపరచాలన్నారు. అనర్హత కలిగిన దరఖాస్తులను అందుకు తగిన కారణాలను తప్పనిసరిగా వివరిస్తూ తిప్పి పంపాలన్నారు. స్పందన కార్యక్రమంలో  వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Bhimavaram

2022-07-18 10:37:37

ఆరు నూరైనా విశాఖ పరిపాలన రాజధాని

ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, విశాఖను  పరిపాలనా రాజధానిగా చేస్తామని, మరో 2, 3 నెలల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు,  ఐ.టి శాఖామంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేసారు. విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ శనివారం స్థానిక స్థానిక  ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమర్నా థ్ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విశాఖపట్టణానికి ప్రత్యేక స్థానం ఉందని దేశ, విదేశాల నుంచి వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ముందుగా చూడాలని అనుకుంటారని అన్నారు. ఈ శనివారం పశ్చిమ ఆస్ట్రేలియా బృందం కూడా మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినపుడు వాళ్ళు బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైని మాత్రమే ఎంచుకున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.  తను అధికారికంగా ఏప్రాంతానికి వెళ్ళినా, వీలైనంత త్వరగా విశాఖ వచ్చేయాలని అనుకుంటానని, ఇంతటి సుందరమైన ప్రదేశాన్ని రాజధానిగా  చేస్తే  ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అమర్నాధ్ చెప్పారు. 

యజమానులు రుణాలు తిరిగి చెల్లించడంలో ఒక్క. రోజు ఆలస్యమైనా బ్యాంకులు ఇబ్బందులకు. గురిచే స్తూన్నాయని ఈ విషయాన్ని ప్రభుత్వంలో మాట్లాడి వారికి కొంత వెసులు బాటు కల్పించాలని బాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సతీష్ కోరారు. దీనిపై మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు,సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవలసిన అధికారులు. అందుకు భిన్నంగా వ్యవరించడం వలన ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.   తన పరిధిలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని అమర్ నాధ్  హామీ ఇచ్చారు. అధికారాన్ని తాను చాలా దగ్గరగా చూస్తున్నానని, అయితే అది శాశ్వతం కాదన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుంచు కుoటానని అమర్ నాథ్ చెప్పారు.   తను అధికారంలో ఉన్నoతవరకూ వీలైనంత మందికి సహాయం అందించాలని కోరుకుంటూ వుoటానని అమరనాథ్ స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా విశాఖలో త్వరలోనే ఎం.ఎస్. ఎంఈ.  పార్క్ ను ఏర్పాటు చేస్తామన మంత్రి అమరనాధ్ తెలియచేసారు. ప్రభుత్వ స్థలం అందుబటులోకి రాగానే పార్క్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 1.25 లక్షల ఎం ఎస్ ఎంఈలు 15వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నామని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయ ని ఆయన చెప్పారు. కాగా విశాఖ లో ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో .సి.ఇ.ఇ. సదస్సు  నిర్వహించి మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వస్తామని అమరనాద్ ఆ తెలియ చేశారు.

Visakhapatnam

2022-07-16 15:38:12

కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక

తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి వరద ప్రవాహం కొనసాగు తుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక  కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 25.29 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని..ఈ రాత్రి వరద ప్రవాహాం తగ్గే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల వారి సమాచారం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వారికి కావాల్సిన సదుపాయాలను సైతం జిల్లా యంత్రాంగం ఏర్పాట్టు చేస్తున్నది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.

Dhavaleswaram

2022-07-16 13:11:16

2023లోగా భవన నిర్మాణాలు పూర్తికావాలి

తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలువైన విజ్ఞానం దాగివున్న మాను స్క్రిప్ట్స్‌ను (చేతి రాత‌ల ప్ర‌తులు) చక్కగా స్కాన్ చేసి భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం ఆయన టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ లో క్యాన్సర్ యూనిట్ లోని ఈ, ఎఫ్‌ బ్లాక్ ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బర్డ్ ఆస్పత్రి సమాచారం, ఓపి ఇతర వివరాలన్నింటితో కలిపి మొబైల్ యాప్ తయారు చేయాలన్నారు. బర్డ్ లో కొత్తగా 100 పడకలు అందుబాటులోకి తేవడానికి తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో ఈ నెలాఖరులోపు నూతన యంత్రాలను పూర్తిగా ఏర్పాటు చేసి అక్టోబర్ నుంచి 266 రకాల కొత్త మందుల తయారీకి త‌గు అనుమ‌తుల‌తో చర్యలు తీసుకోవాలన్నారు.

       తిరుమలలో మ్యూజియం అభివృద్ధి, అంజనాద్రి, వెంగమాంబ ధ్యాన మందిరం,  ఘాట్ రోడ్ల‌లో కొండ చరియ‌లు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఈ- ఎం బుక్‌ అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. అలాగే తిరుమలలో విద్యుత్తు పొదుపు కోసం మీటర్ల ఏర్పాటు తదిత‌ర‌ అంశాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనం ఆధునీకరణలో భాగంగా వర్క్ స్టేషన్స్, ప్రధాన ద్వారం ఎలివేషన్ అత్యద్భుతంగా వచ్చేలా వైకుంఠ ఏకాదశి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. జమ్మూ, చెన్నైలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. గో శాలలో నిర్మిస్తున్న‌ ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు, నెయ్యి త‌యారీ ప్లాంట్‌, గోశాల నిర్వహణ, దేశీయ గో జాతుల పిండోత్పత్తి విషయాలపై స‌మీక్షించారు.

       టిటిడి విద్యాలయాలకు సంబంధించి న్యాక్‌ గుర్తింపు, విద్యార్థుల వివరాలతో అప్లికేషన్ రూపొందించాల‌న్నారు. తిరుమల శేషాచ‌లం అట‌వీ ప్రాంతంలో అకేషియా చెట్ల తొలగింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 28 నోడల్ గోశాలల నిర్వాహకులకు శిక్షణ గురించి అధికారులతో చర్చించారు. అదివో అల్లదివో కార్యక్రమం ఫైనల్ పోటీలను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు. వేదాల సారాన్ని ప్రజలకు అందించేలా ఎస్వీబిసి కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్నారు. అలిపిరిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవ‌స‌ర‌మైన నియ‌మావ‌ళిని సిద్ధం చేయాల‌న్నారు.  జెఈవోలు  సదా భార్గవి,  వీర‌బ్ర‌హ్మం,  సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్ ఎసిఎవో  బాలాజి, ఎస్వీబిసి సీఈవో  షణ్ముఖ కుమార్,  సిఎవో  శేష శైలేంద్రతో పాటు పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Tirupati

2022-07-16 13:00:07

ఎమ్మార్పీ ధరలకే ఎరువులు అమ్మాలి

ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన ఎం.ఆర్‌.పి. ధ‌ర‌ల‌కే ఎరువుల‌ను విక్ర‌యించాల‌ని, అలా కాకుండా నిబంధ‌న‌లు అతిక్ర‌మించి అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించిన‌ట్ల‌యితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వని జిల్లాలోని ఎరువుల డీల‌ర్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ హెచ్చ‌రించారు. రైతుల‌కు నాణ్య‌మైన ఎరువుల‌ను అందించాల‌ని, వారితో స‌ఖ్య‌త‌గా మెల‌గాల‌ని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ఎరువుల‌ డీల‌ర్ల‌తో జేసీ శ‌నివారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా వ్య‌వ‌సాయ అధికారి వి.టి. రామారావు ఎరువుల విక్ర‌యంలో అనుస‌రించాల్సిన నిబంధ‌న‌లు, నియ‌మావ‌ళి గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. 
ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతుల‌కు నాణ్య‌మైన ఎరువులను అందించాల్సిన బాధ్య‌త  ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. అధిక లాభాపేక్ష‌కు పోకుండా రైతుల ప‌ట్ల‌ సేవా దృక్ప‌థాన్ని డీల‌ర్లు క‌న‌బ‌ర‌చాల‌ని జేసీ హిత‌వు ప‌లికారు. ఎరువుల కృత్రిమ కొత‌ర సృష్టించ‌టం, నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌టం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. 

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు మంచి చేయాల‌నే దృక్ఫ‌థంతో ముందుకు వెళ్తోంద‌ని దానికి అనుగుణంగా మ‌నంద‌రం న‌డుచుకోవాల‌ని పేర్కొన్నారు. క‌ల్తీ ఎరువులు విక్ర‌యించినా.. అధిక ధ‌ర‌ వ‌సూలు చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. రైతు భ‌రోసా కేంద్రాలు, ఎరువుల దుకాణాల వ‌ద్ద ఎం.ఆర్‌.పి. ధ‌ర‌లు వేస్తూ ధ‌ర‌ల ప‌ట్టిక‌ను ఏర్పాటు చేయాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను, డీల‌ర్ల‌ను జేసీ ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబ‌ర్‌ను అందుబాటులో ఉంచాల‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. నానో యూరియా, పొటాస్ ప్ర‌యోజ‌నాల‌ను రైతుల‌కు తెలియజేయాల‌ని, వాటి వినియోగాన్ని పెంచాల‌ని డీల‌ర్ల‌కు సూచించారు. ఏ రోజుకా రోజు ఎరువుల విక్ర‌యానికి సంబంధించిన నివేదిక‌ను ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌ని, బిల్లుల పుస్త‌కాల‌ను, స్టాక్ రిజిస్ట‌ర్ల‌ను మెయింటైన్ చేయాల‌ని సూచించారు. స‌మావేశంలో జిల్లా వ్యవ‌సాయ అధికారి వి.టి. రామారావు, ఏడీ అన్న‌పూర్ణ‌, ప‌రిశోధ‌క‌ అధికారి ప్ర‌కాశ్‌, మండ‌ల వ్యవ‌సాయ అధికారులు, అధిక సంఖ్య‌లో డీల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-16 12:39:42

ఫ్రై డే డ్రై డే గా తప్పకుండా పాటించాలి

వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖల సమన్వయంతో  పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సూచించారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని అన్నారు. పారిశుధ్యం,  వ్యాధుల నివారణ పై మున్సిపల్ కమీషనర్లు, వైద్య శాఖ అధికారులతో   శనివారం కలెక్టర్ సమీక్షించారు.  ఎక్కడ చెత్త కుప్పలు కనపడిన, నీటి నిల్వలు  గుర్తించినా, డ్రైనేజీ లు ఓవర్ ఫ్లో అయినా వాటిని  సంబంధిత యాప్ లో. హెల్త్ సెక్రటరీ, సానిటరీ సిబ్బంది తో కలసి అప్లోడ్ చేయాలని , సంబంధిత శాఖలు  వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి క్లియర్ చేయాలన్నారు. ఫ్రై డే డ్రై డే గా తప్పక పాటించాలని ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సహాయకులు, వాలంటీర్లు ,సానిటరీ సెక్రటరీలు, డ్వాక్రా మహిళలు భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లాలో డెంగీ కేసు లు నమోదు అయితే సహించేది లేదని, అందరూ సమన్వయం  తో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, డి.పి.ఓ సుభాషిణి, జిల్లా  పరిషత్ సి.ఈ.ఓ అశోక్ కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-16 12:21:45

డెంకాడ గ్రామసచివాలయం నెంబర్ వన్

విజయనగరంజిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివా లయాలలో  అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి,  హౌసింగ్ తదితర అంశాల  ప్రామాణికంగా  ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా డేంకాడ రూరల్ గ్రామ సచివాలయం  రాంక్ 1 కైవసం చేసుకుంది. పూసపాటి రేగ మండలం   కోనాడ సచివాలయం  2 వ రాంక్, భోగాపురం మండలం సవరవల్లి సచివాలయం  3వ రాంక్ సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. సంతకవిటి మండలం మోదుగుల పేట, రేగిడి ఆమదాలవలస మండలం రేగిడి సచివలయాలు 4,5 స్థానాలలో నిలిచినట్లు తెలిపారు.

Vizianagaram

2022-07-16 11:28:27

ఆసుపత్రుల్లో నాడు-నేడు సత్వరం జరగాలి

కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన పనుల‌ను త్వరితగతిన పూర్తిచేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శ‌నివారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద చేపట్టిన మ‌ర‌మ్మ‌తులు, ఆధునికీక‌ర‌ణ త‌దిత‌ర పనుల పురోగతిపై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్ర‌తినిధుల‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తునిలోని 100 ప‌డ‌క‌ల ఏరియా ఆసుప‌త్రి ఆధునికీక‌ర‌ణ‌, ఏలేశ్వ‌రం సీహెచ్‌సీ సామ‌ర్థ్యాన్ని 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపుతో పాటు పెద‌పూడి సీహెచ్‌సీ, జ‌గ్గంపేట సీహెచ్‌సీ, తాళ్ల‌రేవు సీహెచ్‌సీ, ప్ర‌త్తిపాడు సీహెచ్‌సీ, రౌతుల‌పూడి సీహెచ్‌సీ త‌దిత‌ర ఆసుప‌త్రుల్లో చేప‌ట్టిన ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ప‌నులు జ‌రిగేలా చూడాల‌ని.. ఇందుకు ఆయా ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు ప్ర‌తి వారం స‌మీక్ష చేయాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యక్ర‌మంలో ప్ర‌ణాళికాయుతంగా ప‌నుల పూర్తికి కృషిచేయాల‌న్నారు. కాంట్రాక్టు సంస్థ‌లు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నులు పూర్తిచేసేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు,  డీసీహెచ్ఎస్ డా. పీవీ విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి డీఈలు ఎన్ఎస్. చక్రవర్తి, బి.రుసేంద్రుడు, వివిధ ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-16 10:11:50

ఈ సోమవారం స్పందన కలెక్టరేటులోనే

కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఈనెల 18వ తేదీ సోమవారం నాడు నిర్వహించే జిల్లా స్థాయి స్పందన ప్రజావిజ్ఞాపనల పరిష్కార కార్యక్రమం  జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టరేటులోని స్పందన సమావేశ హాలులో ఉదయం 9-30 గంటల నుండి జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ అంశాన్ని అర్జీదారులు గమనించి వారి సమస్యల పరిష్కారానికి స్పందన వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరో వైపు కలెక్టరేట్ లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వశాఖల  జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటలో జిల్లా కలెక్టర్  డా.కృతికా శుక్లా  కోరారు. 

Kakinada

2022-07-16 09:58:45

అప్పన్నను దర్శించుకున్న మంత్రి బుగ్గన

విశాఖలోని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)ని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  పూర్ణకుంభంతో ఈఓ, అర్చక స్వాముల తో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి గోదాదేవి సన్నిధిలో అర్చకుల మంగళహారతులు స్వీకరించారు. బేడామండపమలో మంత్రిని అర్చకులు ఆశీర్వదించారు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను మంత్రి కి ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Simhachalam

2022-07-16 07:54:08

పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితి పై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తో  సమీక్షించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద వరద ఉదృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.  ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ బృందాలతో క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రస్తుత వరద పరిస్థితి ని మంత్రికి వివరించారు.  ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరడం జరిగిందని, కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధపడటం లేదని, ముంపుకు గురికాము అనే ధీమా తో ఉన్నట్లు తెలిపారు. వరద పరిస్థితి కి అనుగుణంగా అవసరమైన పక్షంలో ప్రతి ఒక్కరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ ఈ నరసింహరావు గోదావరి బండ్ల పరిస్థితి, వాటి పటిష్టత కోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Dowleswaram Barrage

2022-07-16 07:42:39

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు.  శనివారం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు మంత్రి  వీడ్కోలు పలికారు. ఉదయం 8:00 గంటలకు ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. వీడ్కోలు పలికిన వారిలో ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. బాగ్చి, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా,  కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా, ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రమణ్యం రెడ్డి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఉన్నారు.

Gannavaram

2022-07-16 07:20:04

వరదల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్..

తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాజమండ్రి లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రత్యేక అధికారి హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తో కలిసి స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కంట్రోల్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కాల్ ను రిజిస్ట్రేషన్ చేయ్యాలన్నరు. ప్రజల నుంచి ఏ విధమైన ఫిర్యాదులు అందుతున్నాయో తెలుసుకున్నారు.  కంట్రోల్ రూం నంబర్ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అత్యవసర సేవలు, సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్ కు స్పందించి సంబందించిన అధికారులకు సమాచారం తెలిపి సమస్య పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తూన్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా , డివిజన్ స్థాయి లో కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్ 8977935609,  డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం 0883 2442344, కొవ్వూరు  088132 31488 లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ కె .మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్వో బి. సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-16 07:14:28

బాధితుల సహాయం కోసం రూ.2కోట్లు

వరద బాదితుల సౌకర్యార్థం ముంపు ప్రాంతాల్లోని 4 జిల్లా ల్లో జిల్లా కి  2 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి విడు దల చేశారని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం మద్దూరు లంక గ్రామం లో 393 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి వనిత మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యాసం సరుకులు పంపిణీ చేసి ముఖ్యమంత్రి అన్ని విధాల ఆదుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు కల్పిస్తున్నామని ఈసారి వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సుమారు 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఆకాశం ఉందని గతంలో మా ప్రాంతాలు మురగలేదని అనుకోవద్దని ఏదైనా ప్రమాదం జరిగితే చింటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ముంపు గ్రామాల ప్రజలు కుటుంబాలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కుటుంబానికి 2000 వ్యక్తిగత ఉన్నవారికి ₹1000 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఆపదలో అది కోవడానికి ప్రజలు సహకరించి అధికారులు చేసే సూచనలను పాటించాలని మంత్రి కోరారు. మద్దూరు లంక గ్రామంలో ప్రతి ఇంటికి మంత్రి, ఇతర ప్రజా ప్రతినిదులతో వెళ్ళడం జరిగింది.  ఈ సందర్బంగా ఎంపి మార్గని భరత్ రామ్, మాట్లాడుతూ 4 జిల్లా ల కలెక్టర్ లతో ముఖ్య మంత్రి సమీక్ష నిర్వహించారన్నారు.  వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.  బలహీనంగా ఉన్న గోదావరి గట్ల  పటిష్టత కు 40 వేల ఇసుక మూటలను సిద్ధం చేసామన్నారు. ఈ  కార్యక్రమం లో ఎం ఎల్ ఏలు జక్కంపూ డి రాజా,  జి. శ్రీనివాస నాయు డు, యం. పి. పి. కాకర్ల సత్య నారాయణ, మండల తాహి సీల్దార్, బి. నాగరాజు నాయక్ ప్రత్యేక అధికారి, గితాంజలి తదితరులు ఉన్నారు.

Rajamahendravaram

2022-07-15 15:55:10