1 ENS Live Breaking News

ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిది

ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిదిపైనా ఉందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అటవీశాఖ, ఆన్ సెట్ సంయుక్త ఆధ్వర్యంలో కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి నగర మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  వసీం మాట్లాడుతూ, లాక్‍డౌన్‍ సమయంలో కాలుష్యం లేని వాతావరణాన్ని మనమంతా చూశామని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో లాక్‍డౌన్‍ మనకు చూపించిందన్నారు. ఇదే సందర్భంలో ఆక్సిజన్ విలువ కూడా కోవిడ్ విపత్తు మనకు తెలియచేసిందని,ఉచితంగా లభించే ఆక్సిజన్ డబ్బులు పెట్టినా మనకు దొరకని పరిస్థితి మనం చూశామని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాలి సూచించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణలో ఎంతో ముఖ్యమైనదని,పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో తమ పాలకవర్గం అండగా నిలుస్తుందని మా వంతు సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో,ఆన్ సెట్ కేశవ నాయుడు,జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య,కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య,డాక్టర్ సింధూర రెడ్డి వైసీపీ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-07-28 13:04:26

ఓటరు సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు

ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీనుండి నూతన మార్గని ర్దేశకాలు అమలు కానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని మీనా తెలిపారు. జాబితాలో పేరు తొలగింపుకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించనున్నామన్నారు.

నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఉన్న నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ నాటికి తమ ఆధార్ నంబర్ను తెలియచేయవలసి ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్ నంబర్ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని మీనా స్పష్టం చేసారు.  ఇప్పటికే ఓటర్లుగా నమెదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్ వి ఎస్ పి, వి హెచ్ ఎ తదితర వెబ్ సైట్ లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంటుందన్నారు. 6బి ధరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘంకు సమర్పించవచ్చన్నారు. ఎన్ విఎస్ పి, ఓటర్ల హెల్ప్లైన్ యాప్ని అనుసరించి స్వీయ-ప్రామాణీకరణతో యుఐడిఐఎతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ ఓటిపిని ఉపయోగించి ఆధార్ను ప్రామాణీకరించవచ్చన్నారు.

స్వీయ-ప్రామాణీకరణ పట్ల ఆసక్తిలేని వారు, స్వీయ-ప్రామాణీకరణ విఫలమైన సందర్భంలో అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బిని ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. మరోవైపు బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుండి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని మీనా పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని,  ఓటర్లు ఆధార్ నంబర్ను అందించలేకపోతే  ఫారం 6బి లో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలన్నారు. ఆధార్ సంఖ్యను సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకూడదని, ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్తో సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని, యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమీషన్  నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్లో ఓటర్ల ఆధార్ నంబర్ జాగ్రత్త చేయబడుతుందని మీనా స్పష్టంచేసారు.

Vizianagaram

2022-07-28 12:46:28

మన్యం జిల్లాలో 1,429 మందికి కాపునేస్తం

పార్వతీపురం మన్యం జిల్లాలో వై.యస్.ఆర్ కాపు నేస్తం పథకం క్రింద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం శుక్ర వారం జరుగుతుందని బి.సి.కార్పొరేషన్ ఇన్ ఛార్జ్ కార్యనిర్వా హక సంచాలకులు ఆర్. గడ్డెమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం సంవత్సరానికి రూ.15,000/-ల చొప్పున ఐదు సంవత్సరాలకి రూ.75,000/-లు ఆర్ధిక సహాయం చేయుటకు ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంత లబ్దిదారుల కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు లోబడి ఉన్నవారు పథకానికి అర్హులని ఆమె పేర్కొన్నారు.  సమగ్ర కుల దృవీకరణ పత్రం, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కలిగి ఉండాలని, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి ఉద్యోగ విరమణ పింఛను పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్హులని ఆమె స్పష్టం చేశారు. కుటుంబంలో ఎవరికైనా మాగాణి భూమి మూడు ఎకరములు పైబడి లేదా మెట్ట భూమి 10 ఎకరములకు పైబడి లేదా మాగాణి, మెట్ట భూమి వెరసి 10 ఎకరములకు పైబడి ఉన్నా, కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన నాలుగు చక్రముల సొంత వాహనము కలిగి ఉన్నా పథకానికి అనర్హులని చెప్పారు. పట్టణ ప్రాంతములో కుటుంబ సభ్యులలో ఎవరికైనా వెయ్యి చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహము ఉన్నవారు కూడా అనర్హులని ఆమె సూచించారు. 

2020-21 సంవత్సరంలో 1,398 మంది లబ్ధిదారులకు రూ.2.097 కోట్లు,  2021-22 ఆర్థిక సంవత్సరాలలో 1,384 మందికి రూ.2.076 కోట్లు కాపు నేస్తం క్రింద అందించటం జరిగిందని ఆమె తెలిపారు. 2022-23 సంవత్సరానికి వై.యస్.ఆర్. కాపు నేస్తం క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో 1,429 మందికి రూ.2.145 కోట్లు పంపిణీ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కురుపాం నియోజక వర్గంలో 165 మంది లబ్ధిదారులకు రూ.24.80 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. పాలకొండ నియోజక వర్గంలో 295 మంది లబ్ధిదారులకు రూ.44.30 లక్షలు, పార్వతీపురం నియోజక వర్గంలో 463 మంది లబ్ధిదారులకు రూ.69.50 లక్షలు, సాలూరు నియోజక వర్గంలో 506 మంది లబ్ధిదారులకు రూ.75.90 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.

Parvathipuram

2022-07-28 12:30:01

పటిష్టంగా ఓటరు జాబితా నిర్వహణ

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ మాధవీలత తెలియజేశారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె జిల్లాలోని రెవిన్యూ అధికారులతో  స్థానిక కలెక్టరేట్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సంరద్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్  ఏ. శ్రీనివాసరావు,  కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. 

Rajamahendravaram

2022-07-28 11:58:22

సత్వరమే భూసేకరణ పనులు పూర్తిచేయాలి

అర్హులైన పేదలందరికి ఇళ్లస్థలాల పట్టాలు మంజూరి చేసేందుకు అవసరమైన భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్  జె వి మురళి సంబంధింత అధికా రులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అర్హులైన పేదలకు  90 రోజులలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినందుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆయన సూచించారు.  జిల్లాలో అర్హులైన కౌలు రైతులకు అందరికీ సి సి ఆర్ సి  కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క  కౌలు రైతు కూడా సిసిఆర్ సి కార్డులు రాలేదని అనకూడదని అన్నారు.  మన జిల్లాలో కౌలు రైతులు చాలామంది ఉన్నారని వారందరికీ కచ్చితంగా సి సి ఆర్ సి కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. ఎం ఐ జి లేఔట్లకు స్థలాల సేకరణ   పట్టణ  ప్రాంతాలలో చేయాలని ఆయన సూచించారు. స్వామిత్వా రీ సర్వే  పై సమీక్ష చేశారు,  N H 165 అండ్  NH 216 నరసాపురం బైపాస్  కు అవసరమైన  భూసేకరణ పూర్తి చేయలన్నారు. ఏఎంసీయు,  బి ఎం సి యు లకు భూసేకరణ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డిఓ దాసిరాజు  , తాసిల్దార్లు ,కలెక్టరేట్ ల్యాండ్ సూపర్డెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-07-28 11:18:21

శ్రీకాకుళంలో భూసర్వే వేగవంతం చేయాలి

శ్రీకాకుళం జిల్లాలో భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ తెలిపారు.  జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే పై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భూ సర్వే పనులు జరుగున్నాయన్నారు. జిల్లాలో 348 మ్యాప్ లు ఉన్నాయన్నాయని, తీర ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి చెట్లు ఉన్నాయని అక్కడ సిగ్నల్స్ ఉండడం లేదని వివరించారు. సిగ్నల్స్ వచ్చేంత వరకు ఆగాల్సి వస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 11:07:00

స్వాతంత్య్ర గొప్పదనాన్ని తెలియజేయాలి

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.  గురువారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్   కాంపౌండ్ లో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా  రాష్ట్ర ఆర్కైవ్స్ ప్రాంతీయ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన పురావస్తు ఎగ్జిబిషన్ కార్యక్రమమును తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజు కిషోర్, ఆర్కివిస్ట్  డైరెక్టర్ రంగరాజలతో కలసి రిజిస్ట్రార్   ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ...  స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంను జరుపుకోవడం  సంతోషమని ఈ సందర్భంగా  మన దేశ స్వాతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాడిన విధానం , పోరాటానికి ముందు మన భారత  జీవన శైలి ఎలా ఉంది వంటి విషయాలపై  ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పురావస్తు పుస్తకాలను  ప్రదర్శించడం జరిగిందని తెలిపారు.  నేటితరం దేశానికి ఆదర్శంగా నిలవాలని అందుకు  అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా దేశ అభివృద్ధి కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధి లోకి రావాలని తెలిపారు. విద్యార్థులు కలలను కనడం కాదు వాటిని సాకారం చేసుకునే విధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.  

Tirupati

2022-07-28 11:03:32

డిజిటలైజేషన్ సమర్ధవంతంగా చేపట్టాలి

రాజమహేంద్రవరం జిల్లాలో ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ విధానాన్ని అత్యంత సమర్థవంతంగా చెప్పడం ఎందుకు చేపట్టేందుకు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మాధవి లత తెలిపారు. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్ కే మీనా జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితా ను డిజిటలైజేషన్ చేసే విధానం అమలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం చెయ్యాల్సిన అవసరం దృష్ట్యా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 80 శాతం మంది సచివాలయం సిబ్బంది ని బూత్ లెవెల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికి సంబందించిన వారి ఆధార్ వివరాలు సచివాలయం వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో తగినంత మానవ వనరులు ఉన్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఇచ్చే లక్ష్యాలను ఆచరణాత్మక విధానంలో చేపట్టి పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు. 2022 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించి మార్చి 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసెందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ కోసం కొంత సమయం, తదుపరి సేకరించిన డేటా ను కంప్యూటరైజేషన్ కోసం మరికొంత సమయం పడుతుందని మాధవీలత తెలిపారు. సేకరించిన డేటా వివరాలు తప్పులు లేకుండా నమోదు చెయ్యడం కోసం మరింత సమయం పడుతుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకత్వంలో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 800 నుంచి 1500 వందల వరకు ఓటర్లు ఉంటారు. వీరి డేటా సేకరణకు తగినంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్ కె మీనా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు మేరకు ఓటర్ జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో వాలంటీర్ లని భాగస్వామ్యం చెయ్యడం జరగదని పేర్కొన్నారు.  

జిల్లా స్థాయి సమీక్ష: జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1570 పోలింగ్ కేంద్రాలు ద్వారా క్షేత్ర స్థాయి లో బి ఎల్ ఓ లు ఇంటింటి సర్వే చేపట్టి ఓటరు జాబితా ను అత్యంత పారదర్శకంగా డీజీటలైజేషన్ చెప్పట్టాల్సి ఉందన్నారు. మొత్తం జిల్లాలో 15,44,735 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,57,735 మంది పురుషులు, 7,86,887 మంది స్త్రీలు, 119 మంది ట్రాన్స్ జెండర్ లు ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచి ఓటరు జాబితా డీజీటలైజేషన్ పై క్షేత్ర స్థాయి లో రూఉత్ మ్యాప్ రూపొందించి, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పనులు ప్రారంభించా లని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, ఆర్డీవో మల్లిబాబు, ఏ ఒ జీ. బీమారావు, తహశీల్దార్  ఏ. శ్రీనివాసరావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 10:34:57

ఓటరు కార్డుకు ఆధార్ సీడింగ్ చేయాలి..

ఓటరు కార్డుకు  ఆధార్ సీడింగ్ కొరకు, మార్పులు చేర్పులు, తప్పులు సరిదిద్దుట,   తొలగిం పులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని  ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. షెడ్యూలు ప్రకారం సవరణ చర్యలు చేపట్టాలని తెలిపారు.  ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమం, ఆధార్ సీడింగ్ కార్యక్రమం షెడ్యూలు ప్రకాకం  ప్రారంభించి పూర్తిచేయటకు చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఒ. ఆనంద్,  జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-28 10:17:13

ఆధార్ సీడింగ్ లకు చర్యలు తీసుకోవాలి

ఆధార్ లో మార్పులు చేర్పులు, తొలగింపులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్‌లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని  ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. ప్రణాళికా బద్దంగా తేదీలు నిర్ణయించుకొని చేయాలన్నారు. ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కార్యక్రమం ఆగస్టు 4వ తేదీ నుండి ప్రారంభిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, రెవిన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి, ఉప కలెక్టర్ జి. జయదేవి, అర్బన్ తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 10:14:12

ప్రభుత్వ ఉద్యోగులు ఫారం 16 సమర్పించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను కు సంబంధించిన ఫారం -16 ను ఖజానా కార్యాలయాలకు సమర్పించాలని జిల్లా ఖజానా అధికారి కవిటి మోహన రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నెల జీతాలు ఫిబ్రవరి నెలలో నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల 12 నెలల ఆదాయపు పన్ను వివరాలతో కూడిన ఫారం -16 ను డ్రాయింగ్ అండ్ డిస్బర్శింగ్ (డిడిఓ)లు తక్షణం తమ ఖజానాలలో సమర్పించాలని ఆయన కోరారు. ఉద్యోగులంతా తక్షణమే ఈ పనిని చేపట్టాలన్నారు. 

Parvathipuram

2022-07-28 10:11:00

విజయనగరంలో హెరిటేజ్ వాక్

విజయనగరంలో శుక్రవారం ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా మూడు లాంత‌ర్ల జంక్ష‌న్ నుంచి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం వ‌ర‌కు హెరిటేజ్ వాక్ పేరుతో ఉద‌యం 7.00 గంట‌ల‌కు ర్యాలీని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా యుజ‌వ‌న అధికారి విక్ర‌మాధిత్య తెలిపారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం వ‌ర‌కు ర్యాలీ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లా పరిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ర్యాలీలో పాల్గొని స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను, స్ఫూర్తిని భావిత‌రాల‌కు తెలియ‌జేస్తార‌ని వివ‌రించారు. అధిక సంఖ్య‌లో యువ‌త‌, వాలంటీర్లు, ప్ర‌జ‌లు పాల్గొని ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని ఆయ‌న గురువారం ఓ ప్ర‌కట‌న ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.

Vizianagaram

2022-07-28 08:43:20

ఆహా మత్స్య ఉత్పత్తుల వంటకాల రుచులు

చేపల పులుసు..చేపల వేపుడు.. చేపల నూడిల్స్.. చేపల లాలీపాప్స్.. బోన్ లెస్ చేపల ఫ్రై.. చేపల బర్గర్.. చేపల ఊరగాయ.. రొయ్యల వేపుడు.. చేపల కట్లెట్.. రొయ్యల ఊరగాయ..ఇలా అన్నీ చేపలు రొయ్యలతో తయారు చేసిన వంటకాలే.. ఏంటి ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ లో కాస్ట్లీ మెనూ అనుకుంటున్నారా.. అలా అనుకుంటే చేప ముల్లు గుచ్చుకుంటుంది జాగ్రత్త..నోరూరించే ఈ వంటకాలన్నీ  విజయంనగంలోని శిల్పారామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో మత్స్యకారులే స్వయంగా వండిన వంటకాలు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవగాహనకై వీటిని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి ఆధ్వర్యంలో మత్స్యకారులు ఈ వంటకాలన్నీ సందర్శకులకు రుచి చూపించారు. స్టాల్ వద్దకు వచ్చిన వారందరికీ గ్రామీణ మత్స్య సహాయకులు చేపలు వాటి రకాలు, ఉత్పత్తుల కోసం వివరిస్తే.. ఫిష్  ఆంధ్ర పథకం ద్వారా మత్స్యకార మహిళలు నిర్వహిస్తున్న వాల్యూ యాడెడ్  ప్రోడక్ట్స్ ను పర్యాటకులకు, అక్కడికి వచ్చిన వారికి లైవ్ గా తయారు చేసి మరీ రుచి చూపించారు. వీటిని తిలకించిన వారంతా చేపల ఉత్పత్తులు ఇన్ని రకాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యలతో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను అక్కడికక్కడే చేశారేమో ఆ ప్రాంగణమంతా ఒక్కటే గుమ గుమలు. ఈ స్టాల్ దగ్గరకి వచ్చినవారంతా చేపల వంటకాలు రుచి చూసిన తరువాతే వెనుతిరిగారంటే ఎంతగా ఈ ప్రదర్శన ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.    ఏఏ రకాల మత్స ఉత్పత్తులతో ఏ ఏ రకాల తినుబండారాలు తయారు చేస్తారు వాటి విలవలను ఈ సందర్భంగా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి కూడా పలువు ప్రముఖులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మత్స్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు మత్స్య ఉత్పత్తులపై అవగాహన కల్పించడంతోపాటు మత్స్యకారులకు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వాల్యూ ఎడిట్ ప్రొడక్ట్స్ కు ప్రజలు, సందర్శకులు, పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. చేపల వేపుడు రొయ్యల వేపుడు చేపల కూర చేపల పచ్చడి తదితర అంశాలతో ఈ ప్రదర్శనను  ప్రదర్శనలో ఉంచినట్టు ఆమె పేర్కొన్నారు. అధికంగా ప్రజలు మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతోపాటు.. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు గ్రామీణ మత్స్యకార సహాయకులు మత్స్యశాఖకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-24 16:14:30

విజేఎఫ్ ప్రతిభకు ప్రోత్సాహం అవార్డులు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సభ్యులు పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్స్ అందజేయనున్నట్లు ఫోరం అధ్యక్షులు, స్కాలర్ షిప్స్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు విశాఖలోని డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఎల్ కేజీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టేట్,సీబీఎస్ఈ సిలబస్ లకు సంబంధించి స్కాలర్ షిప్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ లో ప్రతిభ కనబర్చిన ఒకరిద్దరు విద్యార్థులను కూడా గుర్తించి వారికి కూడా ప్రత్యేక అవార్డులు అందజేస్తామన్నారు.. కావున జర్నలిస్టుల పిల్లలు సంబంధిత మార్కుల జాబితా, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,  పూర్తిచేసిన దరఖాస్తుతో కలిపి వచ్చే నెల 5వ తేదీలోగా ప్రెస్ క్లబ్ కార్యాలయం పనివేళల్లో అందజేయాలన్నారు.. అదేవిధంగా త్వరలో ప్రతిభకు ప్రోత్సాహం పేరిట మీడియా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అవార్డు ల  కమిటీ చైర్మన్ ఆర్ నాగరాజు పట్నాయక్ తెలిపారు.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామన్నారు.. ఆగస్టులో ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.. మెరిట్ స్కాలర్ షిప్ లకు , అవార్డుల కమిటీకి సంబంధించి ఉపాధ్యక్షులు నానాజీ, జాయింట్ సెక్రటరీ (ఇంఛార్జి కార్యదర్శి) దాడి రవికుమార్,
కోశాధికారి పి ఎన్ మూర్తి,పలువురు  కార్యవర్గ సభ్యులు కో చైర్మన్ లుగా వ్యవహరిస్తారన్నారు.. నార్ల వెంకటేశ్వరరావు భవన్ (విజేఫ్, వినోద వేదిక) మరమ్మ త్తులు త్వరలోనే పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీను బాబు తెలిపారు..సమావేశములో
కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర రావు, ఎమ్మెస్సార్ ప్రసాదు, పైలా దివాకర్, డేవిడ్, పి. వరలక్ష్మి. దొండ గిరిబాబు, సనపల మాధవ్, శేఖర మంత్రి ,గయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-24 15:14:41

సంద‌ర్శ‌కుల‌ మనసు దోచిన మ‌త్స్య ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌య‌న‌గ‌రం శిల్పారామంలో  ఆదివారం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఏర్పాటు చేసిన మ‌త్స్య ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జిల్లాకు చెందిన స‌మ‌ర‌యోధుల జీవిత విశేషాల ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్శ‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయ‌గా న‌గ‌రంలోని ప‌లువురు త‌మ కుటుంబాల‌తో క‌ల‌సి మ‌త్స్య శాఖ స్టాళ్ల‌ను, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించి అరుదైన ఫోటోల‌ను తిల‌కించి ఆనందించారు. మ‌త్స్యశాఖ‌కు సంబంధించి ఫిష్ ఆంధ్ర మార్టు, లైవ్ ఫిష్ విక్ర‌యాలు, మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను వివిధ ర‌కాల ఆహార ప‌దార్ధాలుగా రూపొందించి రొయ్య‌లు, చేప‌ల‌తో చేసిన వంట‌కాలు, అక్వేరియం త‌దిత‌ర అలంక‌ర‌ణ మ‌త్స్య ఉత్ప‌త్తులు, అక్వాలాబ్ సేవ‌లు, మ‌త్స్య‌కారుల‌కు ఉద్దేశించిన ప‌థ‌కాల‌కు సంబంధించిన బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు ఎన్‌.నిర్మ‌ల కుమారి ఆధ్వ‌ర్యంలో మ‌త్స అభివృద్ధి అధికారులు చాందిని, మ‌త్స్య స‌హాయ‌కులు పాల్గొన్నారు.

75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్స‌వాల‌కు సంబంధించి నిర్వ‌హిస్తున్న ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా జిల్లాకు చెందిన 30 మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల అరుదైన‌ ఫోటోలు, వారి జీవిత విశేషాలు, వారు స్వాతంత్య్రోద్య‌మంలో పాల్గొన్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి విశేషాల‌తో స‌మాచార శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. ఫోటోల‌ను తిల‌కించ‌డంతోపాటు సంద‌ర్శ‌కులు వారి జీవిత విశేషాల‌ను కూడా ఆస‌క్తిగా తెలుసుకున్నారు. జిల్లా స‌మాచార పౌర‌సంబంధాల అధికారి డి.ర‌మేష్‌, స‌హాయ కార్య‌నిర్వాహ‌క ఇంజ‌నీరు మ‌ల్లేశ్వ‌ర‌రావు, ఏ.వి.ఎస్‌. డి.స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.


గంట్యాడ మండ‌లం ల‌ఖిడాంకు చెందిన పాశల కృష్ణ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌కు సంబంధించి తాను ప్ర‌చురించిన పుస్త‌కాల ప్ర‌తుల‌ను స‌మాచార శాఖ జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. 

Vizianagaram

2022-07-24 14:53:42