1 ENS Live Breaking News

కనుచూపు మేర మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లు

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకొని న‌గ‌రంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన స‌మైక్య‌తా ర్యాలీ స్ఫూర్తిదాయ‌కంగా సాగింది. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్య‌లో పాల్గొని జాతి నేత‌ల‌కు నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా స్థానిక గుర‌జాడ స‌ర్కిల్ వ‌ద్ద పింగ‌ళి వెంక‌య్య చిత్ర ప‌టానికి ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్ రేవ‌తీ దేవి, గుర‌జాడ మ‌న‌వ‌రాలు ఇందిర‌, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులు 100 అడుగులు జాతీయ ప‌తాకాన్ని చేత బ‌ట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీ ముగింపులో మ‌హారాజ ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఉన్న హ‌రిక‌థ పితామ‌హుడు ఆదిభ‌ట్ల నారాయ‌ణ‌దాసు, వ‌యోలిన్ విధ్వాంసుడు ద్వారం వెంక‌ట‌స్వామినాయుడు విగ్ర‌హాల‌కు ఎమ్మెల్యే, జేసీ, డీఆర్వో పూల‌మాల‌లు వేశారు.

మ‌హ‌నీయుల త్యాగాలు మ‌రువ‌లేనివి..
కార్య‌క్ర‌మం అనంత‌రం స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి.. జీవితాల‌ను త్యాగం చేసిన మ‌హ‌నీయుల సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వాల్లో భాగంగా స్వాతంత్య్ర స‌మ‌రయోధుల స్ఫూర్తిని భావిత‌రాల‌కు చాటి చెప్పేలా ప్ర‌తి ఒక్క‌రూ హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్తి పింగ‌ళి వెంక‌య్యకు ఘ‌న‌మైన నివాళి అర్పించి జాతి స‌మైక్య‌త‌ను చాటి చెప్పాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు.

పింగ‌ళి చిత్రప‌టానికి పుష్పాంజ‌లి
పింగ‌ళి వెంక‌య్య‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని కలెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆయ‌న‌ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, జిల్లా స్థాయి అధికారులు పుష్పాంజ‌లి ఘటించారు.కార్య‌క్ర‌మాల్లో న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ రేవ‌తీ దేవి, జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాధిత్య‌, డీఎస్‌డీవో అప్ప‌ల‌నాయుడు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, ప‌ర్యాట‌క శాఖ అధికారి ల‌క్ష్మీ నారాయ‌ణ‌, డీఈవో స్వామినాయుడు, మెప్మా పీడీ సుధాక‌ర్‌, వ‌యోజ‌న విద్యా శాఖ డీడీ సుగుణాక‌ర్ రావు, క‌లెక్ట‌రేట్ ఏవో దేవ్ ప్ర‌సాద్‌, వివిధ సెక్ష‌న్ల సూప‌రింటెండెంట్లు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-02 09:10:00

105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం తెలుగుజాతికి గర్వకారణం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం, గాంధీ మందిరంలో మంగళవారం పింగళి వెంకయ్య 144వ జయంతి వేడుకలు, జాతీయ జెండా రూపకల్పన చేసిన వందేళ్లు పూర్తయిన సందర్భంగా 105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలుత పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేలా.. ఉత్సాహం ఉరకలేసేలా చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకం అంతకుముందే పింగళి వెంకయ్య గుర్తించి పతాకాన్ని రూపొందించడం గొప్ప విషయమన్నారు. గాంధీ మందిరం సమరయోధుల స్పూర్తివనంలో కమిటీ నిర్వాహకులంతా పదవులు, హోదాలతో ప్రమేయం లేకుండా అందరూ వలంటీర్లుగా పనిచేయడం శుభపరిణామమన్నారు. సిక్కోలు జిల్లాలో గాంధీ మందిరం ఏర్పాటు కావడం ఓ చరిత్ర అయితే ఎందరో సమరయోధుల స్పూర్తివనం మరో చరిత్ర అని ఆయన కొనియాడారు. 

105 అడుగుల జాతీయ జెండాతో సిక్కోలు జిల్లా మరో రికార్డు సృష్టించిందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సిక్కోలులో ఘనంగా జరుగుతాయనడానికి ఇక్కడ జరుగుతున్న వేడుకలే ఓ సంకేతమన్నారు. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, డీఎడీవో మాధురి, విశ్రాంత డీఈవో బలివాడ మల్లేశ్వరరావు, తహసీల్దార్ వెంకటరావు, గాంధీ మందిరం నిర్వాహకులు ఎం.ప్రసాదరావు, సురంగి మోహనరావు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ జామి భీమశంకర్, కొంక్యాన వేణుగోపాల్, డాక్టర్ బాబాన దేవభూషణ్, మహిబుల్లా ఖాన్, ఆచంట రాము, నిక్కు అప్పన్న, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కొంక్యాన మురళీధర్, ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, పందిరి అప్పారావు, భట్లు, నిక్కు హరిసత్యనారాయణ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, పెంకి చైతన్య, పొన్నాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

దాతలను సత్కరించిన కలెక్టర్
మహాత్మా గాంధీ మందిరం, సమరయోధుల స్పూర్తివనంలో 105 అడుగుల జాతీయ జెండా రూపకల్పన కోసం నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు పెద్దఎత్తున విరాళాలు అందించారు. ప్రముఖ శిశువైద్య నిపుణులు, ఐతమ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు రూ.లక్ష, పీవీఎస్ రామ్మోహన్ ఆసుపత్రుల అధినేత పీవీఎస్ రామ్మోహన్ రూ.2 లక్షలు, వి డెంటల్ అధినేత డాక్టర్ జాన్, మేనేజర్ రామ్మోహన్ రూ.25 వేలు, కేవీఎస్ఎన్ వర్మ రూ.పదివేలు, కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రూ.పదివేలు, పారిశ్రామికవేత్త నడికుదిటి ఈశ్వరరావు (ఎఈఆర్) రూ.50 వేలు విరాళం ఇచ్చారు. వీరిని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 105 అడుగుల జెండా నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న ఆచంట రాము, బజాజ్ ఎలక్ట్రికల్స్ సంస్థ సాంకేతిక విభాగ ప్రతినిధులు ధర్మేంద్ర, హుస్సేన్లను కూడా కలెక్టర్ సత్కరించారు.

Srikakulam

2022-08-02 07:16:32

అన్నవరం ఆగమ పాఠశాలపై తీవ్ర అశ్రద్ద

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం ఆగమ విద్యకు మంగళం పాడేలా వుంది. ప్రతీ ఏటా ఆగమపాఠశాల ప్రవేశాల విషయంలో అధికారుల ప్రచార లోపం  విద్యార్ధులకు శాపంగా మారుతోంది. దీనితో ప్రతీ ఏడాదీ విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దానికి ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని అన్నవరం శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలలో స్మార్త ఆగమ విద్యను అధ్యయనం చేయడానికి కేవలం 23 మంది విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం వచ్చిన దరఖాస్తు దారులందరికీ అవకాశం కల్పించే విధంగా మీడియా ద్వారా కనీసం ఎప్పుడు తరగతులు ప్రారంభించే విషయం కూడా తెలియజేయకపోవడం అత్యంత దారుణం దీనితో దరఖాస్తు చేసుకున్నావారిలో కేవలం  19 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు కావడంతో.. ఆ వచ్చిన విద్యార్ధులకే నేటి నుంచే దేవస్థానం వైదిక కమిటీ  సంక్షేములో విద్యార్థులను పరిశీలన చేశారు. వారికే 5 సంవత్సరముల కోర్సు అధ్యయనం చేయుటకు గాను ఎంపిక చేశారు. వాస్తవానికి అన్నవరం ఆగమ కోర్సుకు మంచి డిమాండ్ వుంది. అయితే దానిని అధికారులు వారి వారి స్వలాభం కోసం దీనిపై ప్రచారం తగ్గించేయడంతో అసలు ఇక్కడ ఆ కోర్సు చెబుతున్నదీ లేనిదీ తెలియకుండా పోతుంది. ఈ దేవస్థానంలో ఆదాయ మార్గాలపై చూపించే చొరవ వేద విద్యార్ధులకు ఆగమ పాఠశాల యొక్క గొప్పతనాన్ని..అందులో విద్యార్ధుల సంఖ్యను పెంచే విషయంలో చూపలేకపోవడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది విద్యార్ధుల తల్లిదండ్రులు దేవాదాయశాఖ ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం అత్యంత శోచనీయం. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చేఏడాది పది మంది విద్యార్ధులు కూడా వేద విద్యకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు కూడా కనిపించేటట్టుగా లేవు..!

Annavaram

2022-08-01 14:06:42

మానవ మనుగడలో మొక్కలు కీలకం

మానవ మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పరిధిలోని 44వ డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ శాంతి సుధ ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం,వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటంలో మొక్కలు ఎంతో దోహదపడుతాయన్నారు.సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాడాన్ని ఉద్యమంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని  పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇషాక్ ,బాబా ఫక్రుద్దీన్,నాయకులు మధు,ఖాజా  పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్ ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-07-30 07:46:15

ఆగష్టు 13 తేదీన జాతీయ లోక్ అదాలత్

 కేసులు పరిష్కాకారానికి   రాజీ  మార్గమే  ఉత్తమమని  రెండవ అదనపు  జిల్లాజడ్జి  సిహెచ్‌. రాజ గోపాల రావు తెలిపారు. ఆగష్టు 13 తేదీన నిర్వహించనున్న  జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా శనివారం జిల్లా కోర్ట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆగష్టు 13 తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ కార్యక్రమాన్ని  వినియోగించుకొని  జాతీయ లోక్ అదాలత్ లో వారి యొక్క  కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు.  బ్యాంకులు , ఏలక్ట్రికల్, ఎక్సైజ్ , కుటుంబ సంబందిత కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించు కోవచ్చునన్నారు. చిన్నచిన్న కేసులకు కూడా కోర్టులచుట్టూ తిరిగి డబ్బు, కాలం వృధా చేసుకోవద్దని  సూచించారు.  కేసులు  రాజీ  పర్చుటకు  పోలీసులు, లాయర్లు , పబ్లిక్  ప్రాసిక్యూటర్ ,  అసిస్టెంట్  పబ్లిక్  ప్రాసిక్యూటర్  సహకరించాలన్నారు.  ముఖ్యంగా  చిన్న కారణాలకే  తగువుపడి,  రాజీపడాలనుకునే  భార్య,భర్తలను, కుటుంబాలను  ప్రోత్సహించి  రాజీ చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్  వారీగా  పెండింగ్  కేసులు  వివరాలు సమీక్షించారు.  వాటిలో  సాద్యమైనన్ని కేసులు  లోక్ అదాలత్ లో  పరిష్కరించే విదంగా  చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఈ సమావేశంలో  సీనియర్ సివిల్ జడ్జి జి. యజ్ఞనారాయణ , అడిషనల్ జుడీషియల్  ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్  డి. సౌజన్య , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్  ఎన్. శ్రీనివాసరావు , పోలీసు అధికారులు , న్యాయవాదులు , కార్మికశాఖ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-30 07:35:56

తెలుగు సాహిత్యంలో సినారే ఉద్దండులు

తెలుగు సాహిత్య, సంగీత రంగంలో సినారే సేవలు ప్రశంసనీయమని ఆంధ్రాయూనివర్సిటీ నృత్యవిభాగ ఉపాధ్యాయురాలు కె.వి.విజయవేణి కొనియాడారు. శుక్రవారం సాయంత్రం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తెలుగువీర సంస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వర్ధంతి, ప్రముఖ భాషావేత్త, కవి సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది చిన్నారులు కూచిపూడి, జానపద, శాస్ర్తీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవేణి మాట్లాడుతూ, వెంపటి చినసత్యం యుగంను నాట్య యుగంగా పేర్కొనవచ్చన్నారు. ఆయన హయాంలో శాస్ర్తీయ నృత్యాలకు పెద్ద పీటవేశారన్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో సి.నారాయణరెడ్డి అందించిన కథలు, రచనలుతో పాటు ఆయన రచించిన విశ్వంభర గ్రంథానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించిందన్నారు. వీరిద్దరూ భాషాభిమానులేనని వారి వల్లే ప్రస్తుత, భవిష్యత్ తరాలకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయన్నారు. గౌరవ అతిధిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగువీరసంస్థానం ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. శాస్ర్తీయ నృత్యాల వల్ల పిల్లలకు ఆధ్యాత్మిక భక్తిభావం పెరుగుతుందని, అంకితభావం, క్రమశిక్షణ కూడా అలవడుతాయన్నారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు సంస్థానం ట్రస్టు అధ్యక్షులు దొడ్డి శివకుమార్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా తెలుగుభాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

DABA GARDENS

2022-07-29 15:37:52

గ్రూప్-4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన జరగనున్న రెవెన్యూ డిపార్టుమెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్ (గ్రూప్-4) పోస్టుల నియామకం కోసం నిర్వహించే పరీక్షను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు అధికారుల‌ను ఆదేశించారు. గ్రూప్ -4 ప‌రీక్ష నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆయ‌న స్థానిక‌ క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో లైజన్ అధికారులు, స‌హాయ‌క లైజన్ అధికార‌లు, చీఫ్ సూపరిండెంట్స్, పోలీస్, ఆర్టీసీ, మెడికల్, విద్యుత్ శాఖ, స‌మాచార పౌర సంబంధాల శాఖ అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. జ‌రిగిన ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలో 52 కేంద్రాల్లో ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని, 19,153 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కానున్నార‌ని పేర్కొన్నారు. ఉద‌యం 11.00 నుంచి 1.30 గంట‌ల వ‌ర‌కు పరీక్ష జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అభ్య‌ర్థుల‌ను గ్రేస్ పిరియ‌డ్ 5 నిమిషాల‌తో క‌లిపి ఉద‌యం 10.30 నుంచి 11.00 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. 11.00 త‌ర్వాత ఒక నిమిషం ఆల‌స్య‌మైనా ఎవ‌రినీ కేంద్రం లోప‌లికి అనుమతించ‌రాద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సంబంధిత విభాగాల అధికారులంద‌రూ స‌మ‌న్వ‌య లోపం లేకుండా అన్ని ఏర్పాట్ల‌ను ప‌క్కాగా చేసుకోవాల‌ని సూచించారు. ఎలాంటి అవ‌క‌త‌వ‌కలు జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పరీక్ష‌ను నిర్వ‌హించాల‌ని చెప్పారు. ప్ర‌ధానంగా లైజ‌న్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అంద‌రితీ కో-ఆర్డినేట్ చేసుకోవాల‌ని పేర్కొన్నారు. చీఫ్ సూప‌రింటెండెంట్లు ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన మెటీరియ‌ల్‌ను జాగ్ర‌త్త‌గా తీసుకొని వెళ్లాల‌ని, కేంద్రాల్లో అన్ని ర‌కాల వ‌స‌తులు క‌ల్పించాల‌ని సూచించారు.

నిరంతర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌ను, స‌మ‌యానికి కేంద్రాల‌కు చేరుకునేలా ఆర్టీసీ బ‌స్సులు న‌డ‌పాల‌ని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్ర‌తి కేంద్రం వ‌ద్దా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్ష‌న్ అధికారి శ‌ణ్ముఖ‌రావు, స‌హాయ సెక్ష‌న్ అధికారి గోపాల్‌, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ‌నివాస‌రావు, ఈపీడీసీఎల్ ఈఈ ధ‌ర్మ‌రాజు, ఏపీఆర్వో నారాయ‌ణ‌రావు, లైజ‌న్ అధికారులు, స‌హాయ‌క లైజ‌న్ అధికారులు, వివిధ ప‌రీక్షా కేంద్రాల చీఫ్ సూప‌రింటెండెంట్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-29 13:14:34

తూ.గో. కాపునేస్తం రూ.44.73 కోట్లు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లాలో  వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది కాపు మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.44.73 కోట్లు  జమచెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం 3 వ విడత కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి తో కలిసి రూ.44.73 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అంద చేశారు .  ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవిలత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆర్థిక సాధికారిక దిశగా అడుగులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పేద కాపు మహిళలకి వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 45 - 60 సంవత్సరాలు మధ్య ఉన్న కాపు మహిళలకు రూ.15000 చొప్పున నగదును బ్యాంకు ఖాతాలకు జమచేసారని తెలిపారు. మహిళలు వారి కాళ్ళ పై వాళ్ళు నిలదొక్కు కోవడానికి ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు చేయడం జరిగిందన్నారు. ఈ మొత్తంతో వారు ఆర్థిక వనరులను పెంపొందించే విధంగా వీటిని వినియోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  నేరుగా నగదు బదలీ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిపారు.  తూర్పు గోదావరి జిల్లాలో కాపునేస్తం పథకం కింద ప్రయోజనం పొందిన మహిళలకు తొలుత ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు. ఇంకా అర్హులు ఎవరికైనా ఈ పథకం అమలుకాక పోయిఉంటే  సాంకేతికమైన కారణాల వలన ఆధార్ లింక్, బ్యాంకు ఖాతా తదితర కారణాలు దృష్ట్యా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించడం జరిగిందన్నారు.  వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో నియోజక వర్గాల వారీగా :

రాజమహేంద్రవరం రూరల్ 4685 మంది లబ్ధిదారలకు రూ.7,02,75,000 లు, రాజమహేంద్రవరం అర్బన్ 2038 మందికి రూ.3,05,70, 000 ; అనపర్తి 4283 మందికి రూ.6,52,45,000 ;  రాజానగరం 6834 రూ.10,25,10,000 ; కొవ్వూరు 3976 మందికి రూ.5,96,40,000 ; నిడదవోలు 5299 మంది కి రూ. 7,94,85,000 ; గోపాలపురం 3387 మందికి రూ.5,08,05,000 లు

తొలుత గొల్లప్రోలు లో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని ఆన్లైన్ లో జిల్లా అధికారులు లబ్దిదారులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్, డిపివో జెవి సత్యనారాయణ, డి డి వో రత్న కుమారి, కొండగుంటురు సర్పంచ్ వి. నాగరాజు, లబ్దిదారులు పాల్గొన్నారు.


Rajamahendravaram

2022-07-29 10:09:53

స్పూర్తి నింపిన హెరిటేజ్ వాక్

అజాదీకా అమృత్ మ‌హోత్స‌వాలు నేటి యువ‌త‌లో స్ఫూర్తి నింపుతాయ‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు పేర్కొన్నారు. అమృతోత్స‌వాల్లో భాగంగా ప‌ట్ట‌ణంలోని మూడులాంత‌ర్లు నుంచి గంట‌స్తంభం వ‌ర‌కు, 150 అడుగుల‌ భారీ త్రివ‌ర్ణ ప‌తాకంతో, హెరిటేజ్ వాక్ పేరుతో, ఉజ్వ‌ల భార‌త్, ఉజ్వ‌ల్ భ‌విష్య‌త్‌ ర్యాలీని నిర్వ‌హించారు. నెహ్రూ యువ కేంద్రం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వ‌ర్యంలో  ఘ‌నంగా ఈ ర్యాలీ జ‌రిగింది. విద్యుత్ రంగంలో సాధించిన ఘ‌న విజ‌యాల‌ను ఈ ర్యాలీలో వివ‌రించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్య‌క్ర‌మాలు యువ‌త‌లో స్వాతంత్య్రోద్య‌మ స్ఫూర్తిని ర‌గిలించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. అన్ని రంగాల్లో దేశం సాధించిన విజ‌యాల‌ను వివ‌రించేందుకు ఉజ్వ‌ల భార‌త్‌, ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నినాదంతో దేశ‌వ్యాప్తంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అన్ని గ్రామాల‌ను విద్య‌దీక‌ర‌ణ‌ చేయ‌డం, విద్యుత్ రంగంలో సాధించిన విజ‌యంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కృషితో, ప్ర‌తీ ఇంటికీ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా జ‌రుగుతున్న ఈ అమృతోత్స‌వాలు, వందేళ్ల ఉత్స‌వాల‌కు పునాది లాంటివ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాదిత్య‌, ఉత్స‌వాల జిల్లా నోడ‌ల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం పి.ఆనంద్‌బాబు,  తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప‌ర్య‌వేక్ష‌క ఇంజ‌నీర్ పి.నాగేశ్వ‌ర్రావు, ఇఇ కృష్ణ‌మూర్తి, జిల్లా ప‌ర్యాట‌కాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, జిల్లా ప‌శుసంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, విద్యుత్ శాఖ ఉద్యోగులు, విద్యాశాఖాధికారులు, ఎన్‌సిసి కేడెట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-29 09:27:46

ఇలాగేనా స్పందన రికార్డులు నిర్వహించేది

విశాఖలోని వార్డు సచివాలయంలో స్పందన రికార్డుల నిర్వహణ సరిగా లేవని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కార్యదర్శుల పై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె 6వ జోన్ 88 వ వార్డు పరిధిలోని నరవ, కోటనరవ లోని 399, 404 సచివాలయాల వార్డ్ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు తో, జోనల్ కమిషనర్ సింహాచలం తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శుల హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీలను పరిశీలించారు. ముఖ్యంగా స్పందన రికార్డులను పరిశీలించగా వాటి నిర్వహణ సరిగా లేనందున సచివాలయల కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అటువంటి సచివాలయ  వ్యవస్థను నిర్యయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పనులపై మీ వద్దకు వస్తారని వారిని చిరునవ్వుతో స్వాగతించాలని సూచించారు. డయల్ యువర్ మేయర్, స్పందన లలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వార్డు సచివాలయాల స్థాయిలోని సమస్యలు ప్రధాన కార్యాలయం వరకు రాకూడదని, ప్రధాన సమస్యలైన త్రాగు నీరు విద్యుత్ దీపాలు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులు సచివాలయ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి, వాటిని 24 గంటల్లో పరిష్కరించాలని, మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు పైఅధికారులకు సకాలంలో పంపించి అవి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో ఫిర్యాదులు అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు కార్యదర్శులు ఫీల్డ్ విజిట్ చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు.

Visakhapatnam

2022-07-29 09:19:40

బాలికల హక్కులపై అవగాహన అవసరం

బాలికల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, దిశ చట్టం పై అవగాహన, బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలనే అంశాల పై విధ్యార్థునీలకు అవగాహన కల్పించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి యం.ఎస.శోభారాణి అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయసమావేశమందిరంలో37 వసతి గృహాలు 11 ఫ్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాలు మరియు ఐదు కాలేజీ వసతి గృహాలు చదువుతున్న బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న దాడులు వాటిని ఎలా ఎదురుకోవాలి, కౌమారదశలోని బాలికలు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలకు సంబందించి విద్యార్థినీలకు అవగాహన కల్పించామన్నారు.ఈ అవగాహనా కార్యక్రమానికి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 8 వ తరగతి చదువుతున్న విధ్యార్థీనీలు 90 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. ప్రతి విద్యార్థినీ వ్యక్తలు వివరించిన బాలికలు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈసందర్బంగా హాజరైన బాలికలకు నగదు పురస్కారం, బ్యాగ్ లు, అందజేశారు. 
ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి (గైనకాలజిస్ట్) దిశాపోలీస్ స్టేషన్ ఎస్ ఐ రేవతి, డీసీపీవో వెంకట్,   డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, చైల్డ్ లైన్ కోర్డినేటర్ బి శ్రీనివాసరావు, వరల్డ్ విజన్ ప్రోగ్రామర్ మేనేజర్ అరుణ్ ప్రకాష్,సాంఘికసంక్షేమ శాఖ,సిబ్బంది, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 16:39:28

చెరువు గట్లను అందంగా తీర్చిదిద్దండి..

చెరువు గట్లు ఆహ్లాదకరంగా తయారు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. అమృత్ సరోవర్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఉపాధి హామీ పథకం కింద బాగుచేయడం జరిగిందని, ఆ చెరువు గట్లను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.  చెరువు గట్లు పై మొక్కలు నాటి కూర్చోడానికి బెంచ్ లు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అభినందించారు. లక్ష్యాలకు చేరువ కావాలన్నారు.  జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీపతి, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ రోజారాణి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-28 16:36:12

128 మంది విఏహెచ్ కార్యదర్శిలు క్రమబద్దీకరణ

గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వి ఏ హెచ్ కార్యదర్శులు గా సేవలందిస్తున్న 128 మంది సర్వీసు క్రమబద్దీకరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వి ఏ హెచ్ కార్యదర్శులు గా క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు  డి ఏ హెచ్ ఓ సత్య గోవింద్ తో పాటు కలెక్టర్ ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ,  సచివాలయం పరిధిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  గ్రామ పశుసంవర్ధక సహాయకులుగా  (కార్యదర్శులు) జిల్లాలో సేవలు అందిస్తున్న 128 మంది ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేసినట్లు తెలిపారు. మరో 50 మందికి అక్టోబర్ నాటికి సర్వీసు క్రమబద్దీకరణ పూర్తి కానున్న ట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ భద్రత కల్పించినందున ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పడానికి తనవద్దకు రావడం జరిగిందన్నారు.  ప్రజలకు అందుబాటులో ఉంటూ పశువుల సంరక్షణ కోసం మెరుగైన సూచనలు సలహాలు అందించే క్రమంలో నిబద్దతతో  పని చేయాలని సూచించారు. పశుసంవర్ధక సహాయకుడు పోస్టుకు ప్రాథమిక అర్హత వెటర్నరీ పాలిటెక్నిక్ లేదా డైరీ సైన్స్‌తో ఇంటర్మీడియట్ వృత్తివిద్య లేదా పశుసంవర్ధక వృత్తి ఇంటర్మీడియట్‌తో 2 సంవత్సరాలు పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఏ హెచ్ ఓ  ఎస్జీటి సత్య గోవింద్,   పలువురు వి ఏ హెచ్ సహాయకులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 16:33:46

భవన నిర్మాణాల చెల్లింపుల్లో పురోగతి పెంచాలి

తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ కన్వర్షన్ లో, చెల్లింపుల విషయంలో మెరుగైన  పురోగతి సాధించాడంలో అధికారులు సమన్వయం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కొన శశిధర్ లచే ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జీ పనుల్లో భాగంగా చేపడుతున్న అర్భికెలు, సచివాలయ, హెల్త్ క్లినిక్స్, బి ఎమ్ సి యూ భవన నిర్మాణ పనుల పై, అమృత్ సరోవర్ పథకం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ  మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులను చేపట్టడం, వాటికి అనుగుణంగా నిధుల కేటాయింపు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అదే సమయంలో ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత సమయం లో పూర్తి చేసేందుకు మెటీరియల్, కాంపోనెంట్ పథకం కి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కే. మాధవీలత అధికారులతో సమీక్ష చేస్తూ,  జిల్లాలో జల జీవన్ మిషన్ కింద చేపట్టవలసిన టాప్ కనెక్షన్స్ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవారం 3,296 లక్ష్యం కోసం నిర్దేశించగా, కేవలం సుమారు 1400 మాత్రమే పూర్తి అవ్వడం పై వివరణ కోరారు.  ప్రతీ వారం లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  సచివాలయ భవనాలు 390 కి గాను 258 పూర్తి చేసి, మిగిలినవి పురోగతి లో ఉన్నాయన్నారు. అర్భికే లు 373 కి గాను 183 పూర్తి చేశారని, మిగిలినవి పూర్తి చేయాల్సి  ఉనాయన్నరు. సచివాలయ అర్భికే భవనాలు, హెల్త్ క్లినిక్స్, బిఎమ్ సియూ/ ఏఎమ్ సియూ లు స్టేజ్ కన్వర్షన్ ప్రగతి చూపాలని,  కోర్టు కేసులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని ప్రారంభం కావాలన్నారు. నియోజక వర్గం/ మండల వారీగా వారీగా ప్రాధాన్యత భవనాలు పై సమీక్ష చేస్తూ, వాటిని అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా స్థలం గుర్తింపు లేదా స్థల సమస్యలు పరిష్కారం చెయ్యాల్సి  అవసరం ఉంటే సంబందించిన మండల అధికారులకు తక్షణం ప్రతిపాదనలు చెయ్యాలని పేర్కొన్నారు.

ఆగస్ట్ 15 నుంచి ప్రతి ఇంటికీ డాక్టర్ టై అప్ చేసే కార్యక్రమం చేపట్టనున్న దృష్ట్యా హెల్త్ సెంటర్ నిర్మాణం పనులు మరింత త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. డ్వామా కి సంబందించిన ఉపాధి హామీ చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు  పి ఆర్ ఎస్ ఈ.,  ఎస్ బి వి ప్రసాద్, ఆర్ డబ్ ఎస్ ఎస్ ఈ డి బాల శంకర్, డ్వామా పీడీ పి. జగదాంబ,  డి ఎ హెచ్.ఓ  డా ఎస్టిజీ సత్య గోవింద్,  తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-28 13:17:08

వ్రుద్ధ కళా కారులకు పించన్లు..

విజ‌య‌న‌ర‌గ‌రం జిల్లాలోని రంగస్థల వృద్ధ కళాకారులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా పింఛన్లను మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. ర‌మేష్ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు అర్హులైన ల‌బ్ధిదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున‌ట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుద‌ల‌ చేశారు. ఏదైనా క‌ళారంగానికి చెంది 58 ఏళ్ల వ‌య‌సు నిండిన వారు, తెల్ల రేష‌న్ కార్డు క‌లిగి ఉన్న‌వారు వృద్ధ కళాకారుల పింఛను కొరకు దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. సంబంధిత ద‌ర‌ఖాస్తును జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి కార్యాల‌యంలో లేదా vizianagaram.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ల‌బ్ధిదారులు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 6వ తేదీలోగా స్వయంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాల‌యం, క‌లెక్ట‌రేట్ కాంప్లెక్సు, మొద‌టి అంత‌స్తు, రూం. నెం.16 చిరునామాలో అంద‌జేయాల‌ని పేర్కొన్నారు. ద‌రఖాస్తుతో పాటు రెండు పాస్ ఫోర్టు సైజు ఫోటోలు, కళాకారునిగా గుర్తింపు పత్రం, కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, ఆధార్ కార్డు, రేషన్ లేదా బియ్యం కార్డు జెరాక్స్ కాపీల‌ను తప్పనిసరిగా జతచేయాలని సూచించారు.

Vizianagaram

2022-07-28 13:08:56