1 ENS Live Breaking News

అల్లూరి పోరాట పటిమను స్పూర్తిగా తీసుకోవాలి

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం వీరుడు 'విప్లవ జ్యోతి' అల్లూరి సీతారామరాజు  స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడని  జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం రాజమండ్రి పి.వి. నరసింహారావు పార్క్  (గోదావరి బండ్) వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం  అధికారికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు జీవించినప్పటికీ  స్వాతంత్ర్య సుముపార్జనకు ఆంగ్లేయులను ఎదురొడ్డి  పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు.  స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ, ఆత్మ విశ్వాసం, దైర్యసాహాసాలు ఎనలేనివన్నారు. ఆయన స్ఫూర్తిని  భావితరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు జారిచేశారన్నారు. రాష్ట్రంలో ఆయన పేరు ఒక జిల్లా పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు  ఆ మహనీయుని జయంతి జరుపుకోవడంతోపాటు భావితరాలకు స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు భావితరాలకు చెప్పే విధంగా
ఫోటో ప్రదర్శన శాలను ఏర్పాటు చేసేందుకు  కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి 125 జయంతోత్సవం చిరస్మరణంగా ఉండే విధంగా గోదావరిపై ఉన్న పాత రైలు వంతెనకు లేదా అల్లూరి పోరాటానికి ముఖద్వారంగా ఉన్న మధురపూడి విమానాశ్రయానికి గాని అల్లూరి పేరు పెట్టాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరంకు అల్లూరి చరిత్ర ముడిపడి ఉందని అందువల్ల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం నిర్ణయించిందని ఆ విజ్ఞాన కేంద్రంలో అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన అపురూపమైన తైలవర్ణ చిత్రాలు, సాహిత్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన కలెక్టర్ ని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా విభూది  బ్రదర్స్ ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ, అల్లూరి  వేషధారణ సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కే. దినేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, జాతీయ అల్లూరి సీతారామరాజు   యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యులు, యర్ర ఉమామహేశ్వరరావు, ఎస్ఎస్ రాఘవేంద్ర, శ్యామల, పార్వతి,
 యర్ర కృష్ణ కుమార్, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను( ఈఎన్ఎస్ బాలు) తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-04 17:48:03

28 గ్రామ పంచాయితీలో రీసర్వే పూర్తి

తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న భూహక్కు భూరక్ష పథకంలో భాగంగా చేపట్టిన రీసర్వే పనులను ప్రామాణికత తో కూడి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత అధికాలను ఆదేశించారు.  సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరు ఛాంబరులో రీసర్వే అశంపై సర్వే, పంచాయితీ , రెవెన్యూ అధికారులతో కలెక్టరు మాధవీలత జాయింట్ కలెక్టరు సీహెచ్ శ్రీధర్ తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు  మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 272 గ్రామాల్లో రీసర్వే పనులను ప్రారంభించగా ఇప్పటి వరకు 28 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామన్నారు. రీసర్వేలో భాగంగా ఇంత వరకు 73 గ్రామాల్లో  డ్రోన్ సహాయంతో సర్వే చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 28 గ్రామాల్లో  సమగ్ర సర్వే అనంతరం 13 నోటిఫికేషన్ ఇచ్చి సర్వే పూర్తి చేశామని తెలిపారు. రెవిన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీ జోన్ యాక్టివీటీస్ కింద భూముల హద్దులను సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్ చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. 43 గ్రామాల్లో ఓఆర్(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ) ఇచ్చిన వంద రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు . 21 గ్రామాల్లో  డ్రాఫ్టు ఆర్వోఆర్  పూర్తి చేసినట్లు తెలిపారు. రాజమహేంధ్రవరం డివిజన్ లోని కడియం మండలంలో 7,  గోకవరంలో 15, రాజానగరంలో 14, రంగంపేటలో 14, సీతానగరంలో 17,   కోరుకొండలో 19,  రాజమహేంధ్రవరం రూరల్ మండలంలో 7 గ్రామాల్లో డ్రోన్ ప్లే ద్వారా కవర్ చేశామని తెలిపారు. ప్రతి వారం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు  రీసర్వే అంశంపై సమీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో  జాయింట్ కలెక్టరు సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఏ.చైత్రవర్షిణి, ఎడీ సర్వే లక్ష్మణరావు,  జిల్లా పంచాయితీ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-04 15:48:20

భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన సేవ, చూపిన తెగువ, మన్యం ప్రజల హక్కుల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ కొనియాడారు. విజయనగరం జల్లా కొండకారకంలో గల సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈరోజు జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ దొరలపై అల్లూరి సీతారామరాజు చూపించిన వీరత్వం తెగువ అప్పటి ప్రజలను ఆకట్టుకున్నాయని అతడు బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశాడని అలాంటి విప్లవ వీరుడు 27 సంవత్సరాలకే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు చరిత్ర వీడియో ద్వారా ప్రదర్శించి సీతారామరాజు జీవిత చరిత్రను అతని తెగువను దేశం కోసం అతను ప్రాణత్యాగం చేసిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ వ్యక్తిగత కార్యదర్శి సుప్రియ దాస్, సెక్షన్ ఆఫీసర్ బానోతు రాము, డాక్టర్ పి వి పి ఎస్ అరుణ్, డాక్టర్ దేవాంజన నాగ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-04 14:15:34

మానవాళి మేలు కోసమే ప్రేరణ ప్రాజెక్టు

మానవాళి మేలు కొరకు ప్రజాపిత  బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 700 కోట్ల ప్రజలకు మేలుచేసే  ప్రేరణ ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని ఆల్‌ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్పిలేట్ అథారిటీ (ఏఐసిటిఈ)చైర్మన్ ఆచార్య జిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. సోమవారం వి.జె.ఎఫ్. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్లను రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఈ ప్రాజె క్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఇందు కోసం 700కోట్ల మంది ప్రజలు ఒక్కోక్క పని చేస్తే అందరికీ సంతోషం కలుగుతుందన్నారు. అది సేవలు, సహయం, ఇలా ఏ రూపంలోనైనా సాటివారికి మేలు చేసేదిగా ఉండాలన్నారు.  ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని యూఎస్ లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికి
40 దేశాల్లో 30 వేల కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో విద్యార్థులను కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడించారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ యూఎస్ లో ఒక చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నేడు 40 దేశాలకు విస్తరించడం జరిగిందన్నారు.ఏడు వందల కోట్ల సత్కర్మలకు ప్రేరణ ప్రాజెక్టు నిర్వహణ ద్వారా ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఒక అద్భుతమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు.

 ప్రజలకు ఆనంతమైన ఆత్మీయ సంతోషం కలుగుతుందనే ఆలోచనతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు
ప్రాజెక్టు నిర్వాహకులు రామ్ సింఘాల్, సోదరి శివలీల మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన కార్యక్రమాలను ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహించే ఒక మంచి అవకాశం రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రపంచ శాంతికి అలాగే ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశించిన  ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బికె రామేశ్వరి,  సోదరి సత్యవతి, శశికళ, లలిత తదితరులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకు విశేష ప్రచారం కల్పించాలన్నదే బ్రహ్మకుమారీస్‌ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆచార్య రాజును ఘనంగా సత్కరించారు. 

Visakhapatnam

2022-07-04 14:02:26

ఏఎంసీలో డా.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివి

విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైఎస్ ప్రిన్సిపాల్ డా.జి.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివని డా.ఎంవీవీ మురళీమోహన్ అన్నారు. శుక్రవారం ఆంధ్రామెడికల్ కాలేజీలో ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసి క్రిష్ణబాబును పలువురు వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లడుతూ, ఎన్నో ఏళ్ల చరిత్రగల ఏఎంసీలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉత్తమ సేవలు అందించారని అన్నారు. ఈ క్రమంలోనే ఎందరినో వైద్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగాలనికి ఉద్యోగ విరమణ ఉన్నా.. వైద్యునిగా జీవితాంతం ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.పద్మశ్రీ, డా.నాగమణి, డా.దేవీమాధవి, డాక్టర్ పి.జె.శ్రీనివాసల్ పలువురు మెడికోలు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-01 15:43:19

ఘనంగా AIIEA 72వ ఆవిర్భావ దినోత్సవం

ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 72వ ఆవిర్భావ దినోత్సవం విశాఖలోని ఎల్ఐసీ ప్రధానకార్యాలయంలో ఘనం జరిగింది. ఈ సందర్భంగా  ఏఐఐఈఏ జెండాను సీనియర్‌ ఉద్యోగి పి.వెంకట రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  హాజరైన మాజీ ఎమ్మెల్సీ  ఎంవిఎస్‌ శర్మ  మాట్లాడుతూ, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఉనికిలోకి రాకముందే 17-1951న AIIEA ఏర్పడిందని గుర్తుచేశారు. దీనికింద 245 ప్రైవేట్ బీమా కంపెనీలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. నాటి నుంచి ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్సు సంస్థను  రక్షించడానికి విశేషంగా క్రుషి చేస్తుంటే.. కానీ నేడు, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలను అమ్మేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని, అయితే అధికార బీజేపీ ఎప్పుడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదన్నారు. ఈ విభజన శక్తులను ఓడించి ఐక్యంగా ఉండటమే నేడు యూనియన్ సభ్యుల ముందున్న ప్రధాన సవాల్ అన్నారు.  దేశ ప్రజలను ఐక్యం చేసేందుకు, ప్రభుత్వ రంగ బీమాను పరిరక్షించేందుకు బీమా ఉద్యోగులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి వరప్రసాదరావు, గేట్ మీటింగ్‌ ఐసిఇయు అధ్యక్షురాలు ఎం.కామేశ్వరి అధ్యక్షత వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Visakhapatnam

2022-07-01 15:33:58

సులభతరం వాణిజ్యంలో మొదటి స్థానం

అన్ని శాఖల భాగస్వామ్యంతో దేశంలోనే సులభతరం వాణిజ్యం మొదటి స్థానం సాధించ డం చాలా సంతోషంగా ఉందని అదే స్ఫూర్తితో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జిల్లాలో పోల్యుషన్ ప్రపోజల్స్ పెండింగులో ఉన్నాయని ఎస్.ఎల్. ఎ పీరియడ్ దాటకుండా చూడాలన్నారు.  పలాసలో నక్క ప్రవీణ్ కుమార్ పైప్స్ పరిశ్రమ నిమిత్తం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించి లోన్ మంజూరు చేయడం జరిగిందని, అయితే పరిశ్రమకు విద్యుత్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది అని తెలిపారు. అందుకు సంబంధించి బ్యాంక్ వారి అనుమతితో స్థలాన్ని మార్పు చేయు నిమిత్తం అనుమతులు కోరగా జిల్లా కలెక్టర్ మంజూరు తెలియజేశారు. ప్రస్తుతం పరిశ్రమలు నడుపుతున్న యూనిట్స్ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇతర పరిశ్రమలకు 10, 15 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తే ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందన్నారు. ఋణాలు తీసుకున్న పరిశ్రమలు ఋణాల రాయితీ పొందుతున్న వారు మంజూరు చేసిన ఋణం మొత్తం పరిశ్రమలలో పెట్టుబడి పెట్టారా లేదా అన్న విషయం పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో  డి.ఐ.ఓ ఉమామహేశ్వర రావు, అగ్నిమాపక శాఖ అధికారి, డిపిఓ రవికుమార్, సేఫ్టీ అధికారి, పరిశ్రమల శాఖ ఎడి ఆర్ వి రమణ రావు, ఎడి రఘునాథ్, వివిధ పరిశ్రమల అసోషియేషన్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-01 15:23:07

వైద్యకళాశాల ఏర్పాట్లు పరిశీలన..

విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లపై వైద్య విద్య శాఖ డైరెక్టర్ డా.రాఘవేంద్ర రావు జిల్లాలో శుక్రవారం పర్యటించారు. నగరంలోని మహారాజ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఆసుపత్రిలో ప్రధమ సంవత్సరం వైద్య విద్యార్ధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు లతో మాట్లాడారు. వచ్చే ఏడాది 2023-24 నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో  ప్రధమ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నందున ఆ విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించామని వైద్య విద్య డైరెక్టర్ చెప్పారు. ఆ మేరకు వసతులు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనాటమీ, ఫిజియాలజి, బయో కెమిస్ట్రీ తదితర సబ్జెక్టు లకు సంబంధించి సౌకర్యాలు అవసరమని డైరెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో వున్న సౌకర్యాలు, అదనంగా కల్పించే వసతులపై మ్యాప్ ద్వారా డైరెక్టర్ కు వివరించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డ్ లను డైరెక్టర్ సందర్శించారు.

గాజుల రేగ ప్రాంతంలో నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాన్ని కుడా వైద్య విద్య డైరెక్టర్ పరిశీలించారు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులని పరిశీలించారు. పనులపై వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించగా సంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో నిర్మాణంలో వున్న కొత్త వైద్య కళాశాలలన్నింటిలో ఇక్కడే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఇదే సరళిని కొనసాగిస్తూ పనులు మరింత వేగవంతం చేయాలని ఇ.ఇ. సత్య ప్రభాకర్ కు సూచించారు.

Vizianagaram

2022-07-01 14:02:14

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-30 03:34:58

కనీస వేతనాలపై కీలక ఆదేశాలు..

శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖలలో కనీస వేతనాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.   కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కనీస వేతనాల అమలు పై బుధవారం ఆయన సమీక్షించారు. అన్ని ఇంజనీరింగ్ శాఖలలో కనీస వేతనాలు అమలు పై చర్చించారు.  ఇంజనీరింగ్ శాఖలతో పాటు డ్వామా, వ్యవసాయం, పట్టు పరిశ్రమ, కార్మిక, వైద్య ఆరోగ్య శాఖ, ఉద్యానవన, మున్సిపల్ కార్పొరేషన్, తదితర శాఖల అధికారులతో ఆయన కనీస వేతనాలు పై చర్చించారు. ప్రస్తుతం అన్ని శాఖలలోను కనీస వేతనాలు అమలు జరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ రోజారాణి, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, పట్టు పరిశ్రమ శాఖ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, పరిశ్రమల శాఖ డిడి ఉమామహేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ కృష్ణ మోహన్, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాదరావు,  కార్మిక శాఖ నుండి శైలేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-29 15:33:34

Visakhapatnam

2022-06-28 16:49:53

2వ దశ నాడు-నేడు త్వరగా పూర్తిచేయాలి

మనబడి నాడు-నేడు 2వ దశ పాఠశాల పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ), పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో రెండోదశ మనబడి నాడు-నేడు పనుల పురోగతి, సిమెంట్ ఇతర మెటీరియల్ సరఫరా, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో రెండవ దశ మనబడి  నాడు-నేడు కార్యక్రమం కింద 663 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు పనులు పూర్తయిన వెంటనే బిల్లు అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

అదేవిధంగా మండలాల వారిగా ఫీల్డ్ ఇంజనీర్, ఎంఈఓ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి  ఎన్ని చోట్ల అదనపు తరగతులు అవసరమో గుర్తించి, వివరాలు తెలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎక్సపండెచర్ ను నిర్దేశిత సమయంలో ఖర్చుచేసి పనుల్లో పురోగతి చూపాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం కానున్నందున మండలాల వారీగా పాఠశాల ఇండెంట్ ప్రకారం సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రెండో దశ పాఠశాల పనులకు సంబంధించి అవసరమైన సిమెంటు ఇతర మెటీరియల్ అందుబాటులో ఉండే విధంగా మండల విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వి. లక్ష్మణ రెడ్డి, జిల్లా సమగ్ర శిక్ష ఈఈ డి. నటరాజన్, నగరపాలక సంస్థ సూపరింటిండెంట్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ సూపరిండెండెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-06-28 15:00:12

విద్యార్ధుల కోసం ఆధార్ శిబిరాలు

కాకినాడ జిల్లాలో ఈ నెల 29న పాఠశాల విద్యార్ధుల కోసం ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అధార్ సేవలు అందుబాటులో ఉన్న 37 గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆధార్ నిబంధనల కనుగుణంగా జిల్లాలో 5 నండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలు చేతి వేలి ముద్రల బయోమెట్రిక్స్  అప్ డేషన్ తో పాటు, ఇప్పటి వరకూ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు, ఇతర ఆధార్ సంబంధిత సేవలు పొందేందుకు  ఈ ప్రత్యేక శిభిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఆయా సచివాలయాల పరిధిలోని పాఠశాల విద్యార్థులు 29వ తేదీన ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Kakinada

2022-06-28 14:47:04

నూతన పంధాలోకి వెళ్లి..ఆర్ధికంగా ఎదగాలి

నూతన విధానాలను అవలంబించి ఆర్ధికంగా ఎదుగుదామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయం సహాయక బృందాలకు పిలుపునిచ్చారు. మంగళవారం పాడేరు ఐటిడిఎ సమావేశమందిరంలో సూక్ష్మ ఆహార శుద్ధ పరిశ్రమలు, క్రమబద్ధీకరణ అనే అంశంపై జిల్లా అధికారులకు, స్వయం సహాయక సంఘాలకు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నప్పటికీ అవగాహనా లోపంతో లబ్ధిదారులు అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.  పి.ఎం.ఎఫ్.ఎం.ఇ  పథకం క్రింద ఒక లక్ష రూపాయలు నుండి ఒక కోటి రూపాయల వరకు, వ్యక్తిగత, బృందాలుగా రుణాలు మంజూరు చేస్తారని,  దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐతే ఈ పథకంలో ఆహార ఉత్పత్తులు గ్రేడింగ్, ప్యాకింగ్, శుభ్రపరచటం లాంటి అవసరాలకు ఋణం అందించటమే కాకా మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారని వివరించారు. యూనిట్ స్థాపిస్తే 55 శాతం బ్యాంకు ఋణం లభిస్తుందని, 35 శాతం సబ్సిడీ ఉంటుందని, కేవలం 10 శాతం లబ్ధిదారు వాటా గ చెల్లిస్తే సరిపోతుందని,  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరించారు. ఈ పథకం క్రింద ప్రతి మండలం నుండి కనీసం రెండు యూనిట్ల స్థాపనకు వెలుగు సిబ్బంది స్వయం సహాయక బృందాలకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. 
     ఐటిడిఎ పిఓ రోణంకి గోపాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, ఉత్పత్తులకు కొదవ లేదని, వాటికి విలువ పెంచి అమ్మకం చేయటం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు విస్తారంగా లభిస్తున్నాయని, వాటి నుండి కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేసి అమ్మటం ద్వారా లాభాలు పొందవచ్చని, అందుకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సౌకర్యాలకు సహకారం అందిస్తామన్నారు. 
       ఈ కార్యక్రమంలో విజయవాడ నుండి విచ్చేసిన ఎపి ఫుడ్ పోసెస్సింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ మారుతి పలు అంశాలపై అవగాహన కల్పించారు. 
          ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి మురళి, విశాఖపట్నం ఎపిఎంఐపి సహాయ సంచాలకులు రహీం, జిల్లా వ్యవసాయ అధికారి బిఎస్ నంద్ , బ్యాంకర్లు, స్వయంగా సహాయక బృందాల సభ్యులు వెలుగు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-06-28 14:37:45

పరిశ్రమల ఏర్పాటుకి ముందుకి రావాలి

ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.  అంతర్జాతీయ ఎంఎస్ఎంఇ దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంబంధించిన అధికారులు, ఔత్సాహికులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా  గత రెండేళ్లుగా కోవిడ్ వలన ప్రపంచ ఎంఎస్ఎంఇ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయామన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం నిర్వచనం అనుసరించి వర్గీకరణ జరిగిందని చెప్పారు.  జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇఓడిబి ద్వారా అన్ని  సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా 1 నుంచి 21 పని దినాలలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.  ఏదైనా పరిశ్రమకు అనుమతి జారీ చేయడం ఆలస్యం కాకుండా ప్రతీ నెల జిల్లా ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పపోర్ట్ ప్రమోషన్ కమిటీ ద్వారా ఎస్డీపి పని తీరు, పరిశ్రమలకు రాయితీలు, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.  

జిల్లాలో రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, గ్రానైట్ పాలిషింగ్, ఫార్మా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు.  ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టు కోటి రూపాయలు వరకు పెట్టుకోవచ్చును వివరించారు. సర్విసుల సైడ్ స్థాపనకు 75 లక్షల వరకు పెట్టుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు నెలలో  అర్హత గల ఎంటర్ప్రైన్యూర్స్ కు రాయితీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారన్నారు. ఎపిఐఐసి భూములకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు.  జిల్లాలో కొత్త పరిశ్రమ వాడలు నిమిత్తం ఎపిఐఐసి ద్వారా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సహకారంతో పలాస, పైడిభీమవరం, తదితర ప్రాంతాల్లో కొత్త ఎస్టేట్ లు స్థాపించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

        ఎపిఐడిసి డైరెక్టర్ అనూరాధ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈ లకు ఎంతో తోడ్పాటు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 75 శాతం స్థానిక ఎంప్లాయ్ మెంట్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామారావు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చిన్న, మత్య తరగతి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు.   ఐతం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుమూర్తి మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. స్టార్ట్ అప్ లు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రానైట్ ఇండస్ట్రీస్ లో బయటి నుండి ఆపరేటింగ్ కు వస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలు ఆపరేటింగ్ నేర్చుకుంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఎంఎస్ఎంఈ లు పెరగాలని చెప్పారు.

      పరిశ్రమల శాఖ ఎడి రమణారావు   మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు. మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతా యన్నారు. ఫ్యాక్టరీ డిపార్ట్ మెంట్ జిల్లా అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రింటింగ్ ప్రెస్, తదితరులు పలువురు ఎంటర్ ప్రెన్యూర్స్ వారి అనుభవాలను వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎడి ఆర్.వి. రమణారావు సుస్థిర అభివృద్ధి పై మాట్లాడారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ పది మంది ఒక  గ్రూపుగా వచ్చి పరిశ్రమల స్థాపనకు వస్తే పై అధికారులు నుండి అనుమతి తీసుకొని రుణం మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఎడి వి. రఘునాథ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం డి. లక్ష్మణరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. వీరభద్రరావు, ఎపిఐఐసి లైజన్ ఆఫీసర్ ఎ. సత్యనారాయణ, పలువురు ఎంటర్ప్రైన్యూర్స్, పరిశ్రమల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-06-27 14:19:26