1 ENS Live Breaking News

తాగునీటికి ఇబ్బంది రాకూడదు

గోదావరికి వరద, గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కారణం గా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ వాటర్ వర్క్స్,ధవళేశ్వరం లోని వాటర్ వర్క్స్ పనులను ఆయన పరిశీలించారు. రెగ్యులర్ గా చేసే క్లోరినేషన్ ప్రక్రియ,శుద్ధి చేస్తున్న ప్రక్రియ,  త్రాగునీరు సరఫరా చేసే దశలను క్షుణ్ణం గా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి నీటి కొరత రాకూడదని అన్నారు. వాటర్ ట్యాంక్ ల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. సిజనల్ వ్యాధుల వ్యాప్తి కి  త్రాగునీరు ఒక ప్రధాన కారణం అని, ఆ విషయం తెలుసుకునే అత్యంత నీటి సరఫరా విషయం లో జాగ్రత్తలు తీసుకోవసిందిగా ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.ఈ. పాండు రంగారావు, ఈ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-12 14:38:33

13,14 తేదీల్లో నాక్ కమిటీ పర్యటన

తిరుప‌తి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని  టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న ఏర్పాట్లను జెఈవో మంగళవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. కళాశాల లోని  అన్ని ల్యాబ్ లు  తరగతి గదులు మైదానం పరిశీలించారు . న్యాక్ కమిటీకి వివరించే అంశాల గురించి అధ్యాపకులు ,విద్యార్థులతో  చర్చించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు . కళాశాల కు సంబంధించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు. ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, క‌ళాశాల‌లో జ‌రుగుతున్న మౌళిక వ‌స‌తుల‌ అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేశారన్నారు. నాక్ కమిటీ సభ్యులకు ఆయా విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విభాగానికి సంబంధించిన అంశాలు వివరిస్తారని తెలిపారు. అదేవిధంగా కళాశాలలోని హిస్టరీ విభాగం అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్ప‌టికే క‌ళాశాల‌కు ఏ గ్రేడ్ గుర్తింపు ఉంద‌ని, నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని తెలిపారు. డిఈవో  గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయ‌ణ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-12 13:43:06

వాల్తేర్ రైల్వే లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవమే ఆజాదీకా ఆమ్రుత్ మహోత్సవ్ అని డీఆర్ఎం అనూప్ సత్పతి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్ ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహోత్సవాల్లో రైల్వే సాధించిన విజయాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ ర్యాలీలో 75 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని, మరో ఐదు బైక్‌లపై 10 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి  ఆగస్టు 14న న్యూఢిల్లీకి చేరుకుంటారని తెలియజేశారు.  ప్రతీ భారతీయుడు స్వాతంత్ర్య సమరయోధులను అనునిత్యం మననం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైల్వే స్వచ్చతపైనా అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజిక్ బ్యాండ్ తో దేశభక్తి గీతాలను ఆలపించారు.  ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్)  మనోజ్ కుమార్ సాహూ, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్  సిహచ్.రఘువీర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి, సీనియర్ డివిజనల్ సిగ్నల్ & టెలికాం ఇంజనీర్ దీప్తాంశు శర్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-12 13:28:29

15న YSRవాహ‌న‌మిత్ర‌, జ‌గ‌నన్న తోడు

వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, 26న జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కాల కింద ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హాయాన్ని ఈ నెల 15న అందించే కార్య‌క్ర‌మాల‌ను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో వీటికి సంబంధించి జిల్లాలో గ్రామ‌, వార్డు స్థాయిలో స‌న్న‌ద్ధ‌త ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రుల‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లాస్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్లు త‌దిత‌రుల‌తో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల్లో పురోగ‌తిపై స‌మీక్ష నిర్వ‌హించారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌నాల నిర్మాణం, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం, సీజ‌న‌ల్ వ్యాధులు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో వాలంటీర్ల ఖాళీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్తీ చేయాల‌ని.. ఇందుకు ప్ర‌తి నెలా నోటిఫికేష‌న్ జారీచేసి, వారం రోజుల్లో ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. సంక్షేమ కార్య‌ద‌ర్శి/అసిస్టెంట్‌, ఏఎన్ఎం, మ‌హిళా పోలీస్‌, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్‌లు ప్ర‌తి నెలా క‌నీసం ఒక‌సారి త‌మ ప‌రిధిలోని పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, వివిధ అంశాల‌ను త‌నిఖీ చేసి ప్ర‌త్యేక యాప్‌లో పొందుప‌రిచేలా చూడాల‌ని సూచించారు. 

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల‌కు రూ. 35,000 అద‌న‌పు రుణాల మంజూరు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. 90 రోజుల్లో ఇంటిప‌ట్టా జారీకి అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని.. వీటికి సంబంధించిన బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌లోడ్ చేయాల‌న్నారు. సీజ‌న‌ల్ వ్యాధుల క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని, ఫ్రైడే-డ్రై డే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని సూచించారు. 15 రోజ‌ల‌కోసారి గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వే జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, సీపీవో పి.త్రినాథ్‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌నాయ‌క్‌, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌లక్ష్మి, ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. ఆర్‌.ర‌మేశ్‌, డీఈవో డి.సుభ‌ద్ర త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-12 13:10:21

నిబద్దతతో పనిచేసి పేరుతీసుకురావాలి

కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందని, చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో పనిచేసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ‌ ఉద్యోగులకు సంబంధించి వారి సంబంధీకులకు మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా 18 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీలు ప్రకారం రిజర్వేషన్, రోస్టర్ ను అనుసరించి అభ్యర్థులకు ఉద్యోగాలను కేటాయించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ శాఖ-6,  శిశు మహిళా సంక్షేమం-2, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-2, రెవిన్యూ, ఏపీఎస్పీ బెటాలియన్,  పశుసంవర్ధక, పంచాయతీ, వ్యవసాయ, సెరీకల్చర్, కార్మిక, రిజిస్ట్రేషన్ తదితర శాఖలలో ఒకొక్క పొస్టు చొప్పున మొత్తం 18 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని కలెక్టరు తెలిపారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందన్నారు. విధుల్లో చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో విధులు నిర్వర్తించి కాకినాడ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ అభ్యర్థులకు తెలిపారు.
కాకినాడ కొత్త జిల్లాగా ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ఇంత మందికి ఒకేసారి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు అందించడం సంతోషంగా ఉందని, దీని వెనక కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది ముఖ్యంగా జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి కృషి ఉందని కలెక్టరు ఈ సందర్భంగా కలెక్టరేట్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జి.ఎస్.ఎస్ శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-12 13:00:52

గురు పూర్ణిమ అత్యంత ఉన్నతమైనది

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. జూలై 14వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.  జూలై 15వ తేదీ ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.  మధ్యాహ్నం 2.50 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పెద్దశేష వాహ‌నంపై స్వామి అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.

       ఇటీవల శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Visakhapatnam

2022-07-12 12:57:12

ప్రాణ నష్టం జరగకుండా చూడాలి

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న‌ వర్షాలు, వరదల కార‌ణంగా ఎక్క‌డా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకోవాల‌ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వివిధ‌ జిల్లాల‌ కలెక్టర్లతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై స‌మీక్షించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ మోహ‌న‌రెడ్డి మాట్లాడుతూ.. ముంద‌స్తు వ‌ర్షాల కార‌ణంగా జులైలోనే గోదావరికి  వరదలు వచ్చాయన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ నెల‌లోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, అయితే క‌ర్ణాట‌క‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌టం వ‌ల్ల‌ బుధవారం ఉదయానికి వరద పెరిగి, 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చ‌రించారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు స‌ర్వ‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని స్ప‌ష్టం చేశారు. 24 గంట‌లూ కంట్రోలు రూమ్స్ నిర్వ‌హించి, ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాల‌న్నారు. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్దంగా ఉన్నాయ‌ని చెప్పారు.

         అవసరమైనచోట సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఈ సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని, మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్ప‌ష్టం చేశారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాల‌ని, ఒక వ్య‌క్తికైతే వెయ్యి రూపాయ‌లు అంద‌జేయాల‌ని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. గ‌ర్భిణుల‌ను అవ‌స‌ర‌మైన ప‌క్షంలో ముందుగానే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు.  తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాల‌ని,   తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాల‌ని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాల‌ని, చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు, రోడ్లు, క‌ల్వ‌ర్టులు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సిఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, ఎస్‌పి ఎం.దీపిక‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-12 11:43:15

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. ఫీవర్ సర్వే జరుపు తున్నప్పుడు  ఏ.ఎన్. ఎం లు ప్రాధమికంగా వాడే మందులను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. వైద్య , స్త్రీ శిశు అభివృద్ధి శాఖల అధికారులతో  మంగళవారం  కలెక్టర్ టీం కాన్ఫరెన్స్  నిర్వహించి సీజనల్ వ్యాధులు, ఫీవర్ సర్వే,  నీతీ అయోగ్ సూచీ ల పై పలు సూచనలు చేశారు. ముఖ్య0గా  తల్లి పాలు, కుటుంభ నియంత్రణ, సిజేరియన్, సాలిడ్ ఫుడ్ అందించే అంశాల పై వైద్యులు, ఏ.ఎన్.ఎం లు, అంగన్వాడీ, వాలంటీర్ల సహకారం తో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీ ల నమోదు శత శాతం జరగాలని, వారికి ఐ.డి ల జారీ కూడా చేయాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్స్ లొనే వండి పెట్టాలని, అప్పుడు మాత్రమే పౌష్టికాహారం తీసుకుంటున్నది లేనిది ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని,  ఇళ్లకు రేషన్ గానీ, బాక్స్ లు గాని పంపరాదని స్పష్టం చేశారు. హై రిస్క్ గర్భిణీ లను వైద్యులే అంగన్వాడీ కేంద్రాలకు రిఫర్ చేయాలని అన్నారు.  సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్నారని, వీరి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.  ప్రధానంగా పిల్లలకు 10 నెలలు వచ్చే వరకు ఘనాహారం ఇవ్వడం లేదని, దీనివలనే పిల్లల పెరుగుదల తక్కువగా ఉంటుందని అన్నారు. ఆరు నెలలకే అన్న ప్రాసన చేసి ఘనాహారం అందించాలని, దీని పై అవగాహన కలిగించాలని తెలిపారు.  చిన్న ప్రయత్నం తోనే  మంచి ఫలితాలు సాధించగలమని, ఆ దిశ గా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో  డి ఎం హెచ్ ఓ డా.రమణ కుమారి, ఐ.సి.డి.ఎస్ పిడి శాంత కుమారి, వైద్యులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-12 11:37:53

తుపానుపై అప్రమత్తంగా ఉండండి

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా  అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వరదలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అందరు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, చెరువులకు గండ్లు, విద్యుత్ సరఫరా ,రోడ్డు మరమ్మతులు తదితర పనులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన నష్టాలను అంచనా వేసి నివేదికలను వేగవంతంగా పంపాలన్నారు. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలని పేర్కొన్నారు. సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్స్ సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికి సహాయం అందించాలని తెలిపారు. ఎవ్వరికి  అందలేదు అన్నమాట రాకూడదని, పునరావాస కేంద్రాలలొ ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని,వారికి అందించే సేవల్లో ఎక్కడ లోటు రానీయ కూడదని అధికారులను ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా నుంచి కలెక్టర్ ఎ.మల్లిఖార్జున , జాయింట్ కలెక్టర్ కే .ఎస్.  విశ్వనాథన్ , జీవీఎంసీ కమీషనర్  జీ.లక్ష్మీషా, ఈపీడీసిఎల్ సిఎండి కే.సంతోష రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-07-12 09:48:22

విజయనగరంజిల్లాలో కంట్రోల్ రూమ్లు

విజయనగరం జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అంతటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలక్టరు కార్యాలయములో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-236947, రెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08922-276888, ఆర్డీఓ చీపురుపల్లి  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు9440717534, ఆర్డీ బొబ్బిలి కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08944 - 247288, తీర ప్రాంత మండలాలు అయినభోగాపురం&పూసపాటిరేగ తహసీల్దార్   కార్యాలయములలో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరుభోగాపురం: 8074400947, పూసపాటిరేగ : 7036763036,  మత్స్యశాఖ, విజయనగరం  కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-273812, విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 9490610102 ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు అందరికి ఈ విషయాన్ని తెలియచేసి ముందస్తు చర్యలు తీసుకొనవలసినదిగా జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలియజేసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజలందరూ అప్రమత్తం గా వుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం కోరింది.

Vizianagaram

2022-07-12 07:51:53

అధిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ - 08963 293046 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వసతి గృహాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. అన్ని ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరదలు తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, రవాణాకు బస్సులు, వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు. గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేయాలన్నారు.  రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. 

పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు.  లోతట్టు  ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు. వరదల సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటే తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగా టాంక్ లు నింపడం, జనరేటర్లను సిద్దంగా ఉంచడం చేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. బ్లీచింగ్ , క్లోరినేషన్ నిల్వలు సిద్దంగా ఉంచాలని, తాగు నీటిని ఇంజినీరింగ్ సహాయకులు ద్వారా నెల రోజులు పాటు టెస్టింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం పక్కాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆర్. సుగుణాకర రావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఆర్. అప్పల నాయుడు, ఆర్. రామచంద్ర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బాలివాడ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యానవన అధికారి కె.వి. సత్యనారాయణ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కిరణ్ కుమార్, రహదారులు భవనాలు శాఖ ఇంజినీరింగ్ అధికారి ఎం.జేమ్స్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, డి.ఆర్.డి.ఏ పిడి వై.సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ రవాణా మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా మత్స్య శాఖ అధికారి డి. గోపి కృష్ణ, జిల్లా పశు సంవర్థక అధికారి ఏ. ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-12 07:40:54

పౌష్టికాహార ప్రాముఖ్యత తెలుసుకోవాలి

విజయనగరంలోని మహారాజ ఆసుపత్రిలో  పౌష్టికాహార పునరావాస కేంద్రం (ఎన్. ఆర్.సి) లో పౌష్టికాహారం పై బాలింతలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు సామ్, మాం, తక్కువ బరువున్న పిల్లలకు ఎన్. ఆర్.సి లో  పౌష్టికాహారం  అందించడం ఐ.సి.డి.ఎస్ సూపర్ వైసర్లకు, తల్లులకు శిక్షణ నిచ్చారు. చిన్న పిల్లల వైద్యులు డా.గౌరీ శంకర్, పౌష్టికాహార నిపుణులు స్వర్ణ ఎలాంటి ఆహారం పౌష్టికారం, ఏ ఆహారం లో ఎలాంటి విటమిన్లు, న్యూట్రియాంట్ లు ఉంటాయి, పిల్లలకు ఎలా తినిపించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో 11 మంది తల్లులు వారి పిల్లలతో కలసి హాజరయ్యారు.  ఈ శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న ఐ.సి.డి.ఎస్ పి.డి శాంత కుమారి మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం మంగళవారం కూడా పెద్దాసుపత్రి లో నిర్వహించనున్నట్లు  తెలిపారు. అదే విధంగా జిల్లా అంతటా విడతల వారీగా పి హెచ్ సి వైద్యులు, సీడీపీఓల అధ్వర్యం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Vizianagaram

2022-07-11 10:07:31

మనసుపెట్టి సమస్యలు పరిష్కరించాలి

స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్  శ్రీకేశ్ లాఠకర్ స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 275 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ లోనున్న స్పందన,ఏ.పి సేవా పోర్టల్ శాఖల వారీగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులు మరల అదే అంశంపై  రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు రీ ఓపెన్ అయిన యెడల ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరిస్తూ  నాణ్యతతో పరిష్కార మార్గాలు స్పష్టతతో పూర్తి స్థాయిలో చూపాలని ఆదేశించారు.ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పట్ల జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని, బుధవారం ఉదయం నాటికి పూర్తీ కావాలని  ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఎడ్యూకేషనల్ పోలసీ 2020ను అనుసరించి, అశాస్త్రీయంగా ఆ విధానాన్ని అమలు పరచి పాఠశాలను విలీనం చేస్తూ అనేక మంది విద్యార్థిని, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న జి.ఒ రద్దుచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. పాతపట్నం మండలం గంగువాడ, చిన్నమల్లిపురం గ్రామానికి చెందిన సి.హెచ్.కృష్ణవేణి తమకు కాపునేస్తం మంజూరు చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.పలాస మండలం, నీలకంఠపురం గ్రామానికి చెందిన పీతాంబర జగన్నాథరావు తను గత 6 సంవత్సరాలనుండి ప్రజ్ఞా జూనియర్, డిగ్రీ కళాశాలలో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నానని తనకు విధులు నుండి తొలగించారని న్యాయం చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

జిల్లాలో రక్త కొరతను అధిగమించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గత సంవత్సరం రెవెన్యూ శాఖ నుంచి 2 వేల యూనిట్స్ అందజేయడం జరిగిందన్నారు. అలానే ఉపాధ్యాయులు, డ్వామా సిబ్బంది సహకరించారని, ఈసారి అన్ని శాఖలు సమన్వయంతో జిల్లాలో రక్తం కొరత లేకుండా అధికమించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి అధిక మొత్తంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు అందజేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ల్యాప్ టాప్ లను దివ్యాంగులకు కలెక్టర్ అందజేశారు. స్పందన వినతులు స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ బి.లక్ష్మిపతి, ఎస్.ఇ ఇరిగేషన్ డోల తిరుమల రావు, ఎస్.ఇ, ఆర్ అండ్.బి ఎస్.ఈ కె.కాంతిమతి, డి.ఎస్.ఓ డి.వెంకటరమణ, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.త్రినాథరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-11 09:52:35

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-07-11 09:49:30

విజయనగరం స్పందనకు 220 దరఖాస్తులు

విజయనగరం కలెక్టరేట్  లో సోమవారం నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 220 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 41,  డి.ఆర్.డి.ఏ కు 13,   అందగా  రెవిన్యూ కు సంబంధించి 166 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను సంయుక్త కలెక్టర్  మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్ పద్మా వతి,  స్వీకరించారు.  అనంతరం జె.సి మయూర్ అశోక్ అధికారులతో మాట్లాడుతూ గడువు దాటి పెండింగ్ ఉన్న అర్జీలను శాఖల వారీగా సమీక్షించారు. రీ ఓపెన్ అయిన వాటిని తక్షణమే తగు సమాధానాలు రాసి    అర్జీలను డిస్పోజ్ చేయాలంబరు. జిల్లా అధికారులే కాకుండా శాఖ లో నున్న విభాగాల అధికారులు కూడా వారి లాగిన్ లో స్పందన అర్జీలను తనిఖీ చేయా లన్నారు. మండలాల్లో మంగళవారం ప్యాత్యేకాధికారులు నిర్వహించనున్న సమీక్షల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు పై ఆడిట్, గృహ నిర్మాణాల పురోగతి పై సమీక్షించాలన్నారు. విత్తనాల సరఫరా పై ప్రత్యేకంగా సమీక్షించా లన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు.  రీ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. 

Vizianagaram

2022-07-11 09:37:15