1 ENS Live Breaking News

ఈనెల 27న విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సమావేశం

ఉమ్మడి విశాఖజిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్టు జెడ్పీ సిఈఓ పి.శ్రీరామ్మూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో మీడియాకి విడుదల చేశారు. మొత్తం ఏడు అంశాలను స్థాయి సంఘ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలియజేశారు. కాగా ఈ సమావేశాలకు జిల్లాశాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో రావాలని కూడా జెడ్పీ సిఈఓ పేర్కొన్నారు. 

Visakhapatnam

2023-07-25 06:52:35

కాకినాడ జిల్లాలో మహిళా పోలీసులకు బదిలీల కౌన్సిలింగ్

కాకినాడ జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులు దరఖాస్తు చేసుకున్న అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి మంగళవారం జూమ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు పోలీసుశాఖ పేర్కొంది. పరస్పర బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు, డిజిపి కార్యాలయం నుంచి అప్రూవల్ వచ్చిన వారు మాత్రమే ఈ జూమ్ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు సదరు పనిచేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నో డ్యూస్ సర్టిఫికేట్ తోపాటు, ఇతర అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తోపాటు ఒక సెట్ జెరాక్సు ప్రతుల సిద్దం చేసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా అభ్యర్ధులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాలని కూడా జిల్లా పోలీసు కార్యాలయం పేర్కొంది. అన్ని శాఖల్లోని బదిలీ ప్రక్రియ పూర్తిఅయిపోయింది ఒక్క మహిళా పోలీసులకే ఆలస్యంఅయ్యింది. నేటి ఉత్తర్వులతో ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తికానుంది.

Kakinada

2023-07-24 15:23:42

టెక్నాలజీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా కృషి

పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా ప్రగతి సాధించేలా స్టార్టప్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్ల విస్తరణకు తగిన కృషి చేస్తున్నామని  సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ చైర్‌ రాయ్‌ కొడాలి అన్నారు. విశాఖలోని వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌, భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం నాడు ఇంటర్‌ప్రైజింగ్‌ భారత్‌ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ మధ్య కాలంలో స్టార్టప్స్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్లు నగరాల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే వీటిని రూరల్‌ ప్రాంతాల్లో సైతం విస్తరించేలా, గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా ఉపయోగపడాలనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు..   గ్రామీణ, పట్టణ వ్యాపార పర్యావరణ వ్యవస్థల మధ్య విభజనను తగ్గించడం తమ ఉద్దేశమన్నారు.  తద్వారా ఆర్థిక వ్యవస్థలను మరింత మెరుగ్గా తయారు చేసేందుకు దోహదపడుతుందన్నారు. భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు కార్యదర్శి, గ్రామీణ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పౌండర్‌ శ్రీరామమ్మూర్తి మాట్లాడుతూ  సాంకేతికత అందుబాటులోకి రావడంతో, భౌగోళిక సరిహద్దులు చెరిగిపోయాయన్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వారి ఇంటి నుంచి ప్రపంచ మార్కెట్‌లను ప్రభావితం చేస్తున్నారన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏపీఐఎస్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.  యువ ప్రతిభను పెంపొందించడంలో  స్టార్టప్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తాయన్నారు.

Visakhapatnam

2023-07-22 18:41:18

సచివాలయ మహిళా పోలీసులకు శనివారం విశాఖలో కౌన్సిలింగ్

గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు జూలై 22న విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ జరుగుతుందని పోలీసుశాఖ ప్రకటించింది. పరస్పర బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు, డిజిపి కార్యాలయం నుంచి అప్రూవల్ వచ్చిన వారు మాత్రమే ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు సదరు పనిచేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నో డ్యూస్ సర్టిఫికేట్ తోపాటు, ఇతర అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తోపాటు ఒక సెట్ జెరాక్సు ప్రతులతో కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి వుంటుందన్నారు. అదేవిధంగా అభ్యర్ధులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాలని కూడా జిల్లా పోలీసు కార్యాలయం పేర్కొంది. కాగా ఇప్పటి వరకూ అన్ని శాఖల్లోని బదిలీ ప్రక్రియ పూర్తిఅయిపోయింది ఒక్క మహిళా పోలీసులకే ఆలస్యంఅయ్యింది. నేటి ఉత్తర్వులతో ఈ ప్రక్రియ కూడా శనివారంతో పూర్తికానుంది.

Visakhapatnam

2023-07-21 03:58:28

విదేశీ వీసాలు పేరిట మోసాలతో జరభద్రం

విదేశీ విద్య, వీసాలు పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని సీతమ్మధారలో గల ఎన్ బీ ఎం లా కళాశాల లో ఇంటర్నేషనల్, ఇమ్మిగ్రేషన్ లా అంశంపై ఏర్పాటు చేసిన సదస్సు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులే లక్ష్యంగా ఆ రంగంలో నిత్యం జరుగుతున్న చాలా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన నకిలీ వీసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో తగిన విచారణ చేయాలన్నారు. సదరు సంస్థ గుర్తింపు, జాబ్ ఆఫర్ లెటర్ క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. నైజీరియా, ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్నారన్నారు. వీటి పట్ల అందరూ ముందు జాగ్రత్త గా వుండాలన్నారు. ఈ మేరకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎన్బిఎం లా కళాశాల ప్రిన్సిపాల్ డి.వి.రమణ, అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-20 09:30:19

వలస కార్మికులకు అవసరమైన సహాయం అందిస్తాం..

తమిళనాడులోని కోయంబత్తూర్ లో మంగళవారం ప్రహరీగోడ కూలిన ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానిక కలెక్టర్ తో మాట్లాడి మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని కోరామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయిన అనంతరం బాడంగి మండలంలోని వారి స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు సంబంధిత భవన నిర్మాణ కాంట్రాక్టర్ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వలస కార్మిక కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ విరించారు. మ్రుతు కుటుంబాలకు సమాచారాన్ని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు చేరవేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

Vizianagaram

2023-07-05 05:30:35

జూలై 6న అప్పలాయగుంటలో పుష్పయాగం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ గురువారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూలై 5న రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికిప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం చేపడతారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.40 నుండి సాయంత్రం 5 గంటలవరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

Tirupati

2023-07-05 03:20:09

భారత స్వతంత్ర పోరాటం లో అల్లూరి మార్గదర్శి

భారత స్వాతంత్ర్య పోరాటానికి  అల్లూరి సీతారామరాజు ఒక మార్గదర్శిగా నిలిచారని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. అతి పిన్న వయసు లోనే దేశం కోసం త్యాగం చేసి స్వతంత్ర స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి వీరుల  గాధలను భావి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని  మంగళవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో   ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి జేసీ, డి.ఆర్.ఓ, అధికారులు  నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభ లో  జె.సి మాట్లాడుతూ  అల్లూరిలోని నాయకత్వ లక్షణాలను,   వారి త్యాగ స్ఫూర్తిని ,దేశ భక్తిని ఆదర్శంగా తీసుకోవాలని  తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఆకాంక్షించారు. డి.ఆర్.ఓ గణపతి రావు మాట్లాడుతూ ఏమీ  ఆశించకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరుడు అల్లూరి అని అన్నారు. యువత నిస్వార్ధంగా ఆలోచించి దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మెప్మా పిడి సుధాకర్ అల్లూరి దేశ భక్తిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-04 06:42:25

విశాఖలో వైట్ రేషన్ కార్డు జర్నలిస్టులకు గుడ్ న్యూస్..

విశాఖపట్నం జిల్లాలో 2023-24 సంవత్సరంలకు అక్రిడిటేషన్ కార్డులు పొంది తెల్ల రేషన్ కార్డు కలిగిన పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు ( WJHS ) పొందుట కు చెల్లించవలసిన ప్రీమియం రూ.1250 /-  ను, జిల్లా కలెక్టర్,  విశాఖపట్టణం సి.ఎస్.ఆర్ నిధుల నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాత్రికేయులు ఈ దిగువ తెలిపిన డాక్యుమెంట్స్  జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయం, విశాఖపట్నంలో అందజేయవలసినదిగా కోరారు. రెన్యువల్ కొరకు జతపరచవలసిన ధృవపత్రాలు ( Already Having WJHS card):- 1)అప్లికేషన్ 2) పాత హెల్త్ కార్డు జెరాక్స్ కాపీ ( దరఖాస్తుదారుడు ) 3) తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ కాపీ  4) 2023-24 అక్రిడిటేషన్ కార్డు కాపీ. కాగా క్రొత్త హెల్త్ కార్డు కొరకు జత పరచవలసిన ధ్రువపత్రాలు
1) అప్లికేషన్ 2) తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ కాపీ  3) 2023-24 అక్రిడిటేషన్ కార్డు జెరాక్స్ కాపీ  4) ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ (కుటుంబ సభ్యులందరివి ) 5) ఫొటోస్ -2 ( కుటుంబ సభ్యులందరివి) 6) ఫ్యామిలి ఫోటో-1 జతపరిచిన ధృవపత్రాలు అన్ని స్కాన్ చేసి (ప్రతి ఫైల్ 50 kb కంటే తక్కువగా) wjhscards2023@gmail.
com కి  మెయిల్ చేయవలసినదిగా కోరారు. మరిన్ని వివరాలకు ఎం.కిషోర్ కుమార్-8008656504 - PRO, జి.లావణ్య 8143504193 - Jr.Asst. 
( తెల్ల రేషన్ కార్డు లేని వారు పాత పద్ధతిలో చలానా చెల్లించి ఆవివరాలు ఈ కార్యాలయానికి అందజేయాల్సి వుంటుంది.)

vizag

2023-07-03 08:51:09

రేపు విశాఖలో జగనన్నకు చెబుదాం(స్పందన) రద్దు

విశాఖజిల్లా కలెక్టరేట్ లో 3న సోమవారం జగనన్నకు చెబుదాం ( స్పందన ) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింహా చలం గిరి ప్రదక్షణ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ లో పొల్గొన నున్నందన, అధికారులు అందరూ ఏర్పాట్లలో ఉన్నందున జగనన్నకు చెబుదాం కార్యక్రమా న్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి  రావద్దని ఆయన కోరారు. తిరిగి జూన్10నుంచి జగనన్నకు చెబుదాం( స్పందన ) యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Visakhapatnam

2023-07-02 15:58:33

సింహాద్రి నాధుని గిరి ప్రదక్షిణకు అడ్డు తగిలిన వరుణుడు

సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణకు వరుణుడు అడ్డు తగిలాడు. ప్రదక్షిణ ప్రారంభం అయిన కొద్ది గంటలకే విశాఖలో వర్షం పడటంతో స్వామివారి ప్రదక్షిణకు ఆటంకం వాటిల్లింది. 32 కిలోమీటర్లు పాటు సాగే ఈయాత్రను విజయవంతం చేసేందుకు ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు దారి పొడవునా సీతల పానియాలు, ప్రసాదాలు, మం చినీరు, మజ్జిగ అన్నీ ఏర్పాటు చేశాయి. ఇటు జివిఎంసి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ను, మొబైల్ మరుగుదొడ్లను కూడా పెట్టింది. అంతా సజావుగా సాగుతుంద నుకునే లో పు వరుణుడి ప్రతాపానికి భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందులోనూ ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా వుంది. వర్షం కారణంగా భక్తుల ప్రదక్షిణకు ఆటం కం ఏర్పడింది. అప్పటికే కొందరు చమటలతో నడుస్తుండటం, మరికొందరు తడుస్తూనే యాత్రను కొనసాగించాల్సి వచ్చింది. అయితే కురుస్తున్న వర్షంతోపాటు ఉరుము లు, మెరుపులు భక్తులను అసహనానికి గురిచేశాయి.

Simhachalam

2023-07-02 14:46:52

PMSY ప‌థ‌కంతో మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి

ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద‌యోజ‌న ప‌థ‌కం ద్వారా మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాల‌ని ఎమ్మెల్యే క‌డుబండి శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. అర్థ‌నాపాలెం క్యాంపు కార్యాల‌యం విజ‌య‌గ‌న‌రం మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు ఎన్‌.నిర్మ‌ల‌కుమారి, రాష్ట్ర కొప్పుల‌వెల‌మ కార్పోరేష‌న్ చైర్మ‌న్ నాయుడు బాబుల‌తో క‌లిసి పీఎంఎస్‌వై ప‌థ‌కంలో మంజూరైన 2 చేప‌ల ర‌వాణా వాహ‌నాల‌(లైవ్ ఫిష్ ట్రాన్స్ పోర్ట్ వెహిక‌ల్‌) ను మ‌త్స్య‌కారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌నరెడ్డి పిఎంఎస్‌వై ప‌థ‌కాన్ని పూర్తిస్థాయిలో ల‌బ్దిదారుల‌కు చేర్చ‌డంలోనూ, ప‌థ‌కం అమ‌లు చేయ‌డంలోనూ ప్ర‌త్యేకంగ ద్రుష్టిసారించి నిర్వ‌హ‌ణ చేప‌డుతున్నార‌ని అన్నారు.  ఫిష‌రీష్ డిడి నిర్మ‌ల‌కుమారి మాట్లాడుతూ,  పిఎంఎస్ వై ప‌థ‌కంలో యూనిట్ ధ‌ర రూ.20 ల‌క్ష‌లు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు 60శాతం, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వారికి 40శాతం రాయితీతో అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం ఎస్సీకేట‌రిగికి ఒక‌టి, జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి అంద‌జేశామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో మ‌త్స్య‌శాఖ అభివ్రుద్ధి కారి సిహెచ్ సంతోష్ కుమార్‌, పిఏసిఎస్ చైర్మ‌న్ జి.శివ‌, ఎల్‌.కోట ఎంపిపి  జి.శ్రీనివాస‌రావు, వేపాడ మండ‌ల‌పాల‌పార్టీ అద్య‌క్షులు ఎం.జ‌గ‌న్నాధం, కొత్త‌వ‌ల‌స జెఏసి ఇన్చార్జి బి.వెంక‌ట‌రావు, కొట్టాంసేనాప‌తి చంద‌ర్రావు, టి.శివాజీ, జి.గ‌ణేష్‌, సిహెచ్పి భీష్మ‌, సంత‌పాలెం ఎంపిటిసి వి.ర‌మ‌ణ‌,  డి.ర‌మ‌ణ‌, అప్ప‌న్న‌దొర‌పాలెం స‌ర్పంచ్ రాముల‌మ్మ‌, పి.వెంక‌టేష్‌, జ‌గ్గ‌న్న‌దొర‌, సోంబాబు, పెద‌బాబు, ఎస్‌.కోట త‌లారి అనంత‌, ఎ.ర‌మేష్‌, జి.రామానాయుడు, సిహెచ్‌.క్రిష్ణ నారాయ‌ణ‌మూర్తి మాష్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-06-30 06:24:32

జూన్30 నుండి శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి  జూలై 2వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6  నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా  దోషాలు జరిగినా,  ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూన్ 30న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 1న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 2న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

Tirupati

2023-06-28 05:59:58

వైజాగ్ లో రాజకీయం..హైదరాబాదులో వ్యాపారం..!

విశాఖలో కిడ్నాప్ కి గురైన నాకుటుంబం విషయంలో మీడియాచేసిన రాద్దాంతానికి తీవ్రమనస్థాపం చెంది తన వ్యాపారాన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విశాఖలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ప్రజలకు సేవచేయడానికి రాజకీయాల్లో ఉంటానని.. ప్రస్తుతం చేపట్టిన నిర్మాణాలు పూర్తయితే కొత్తవి ఏవీ ఇక్కడ చేపట్టనని అన్నారు. కేవలం డబ్బుకోసమే తన కుటుంబం, ఆడిటర్ జివి కిడ్నాప్ జరిగిందన్న ఆయన ప్రభుత్వం నుంచి తనకు సహకారం లేదని వస్తున్న వదంతులు నిజం లేదన్నారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ న్నారు. కానీ లేనిది ఏదో జరిగిపోతున్నట్టు వక్రీకరించి రాయడం తనను ఎంతో బాధకలిగించిందన్నారు. ఎవరైనా కుటుంబసభ్యులకు కిడ్నాప్ కి గురైతే ఎంతగా అల్లాడిపోతారో ఆ బాధ అనుభవించిన తనకు తెలుసునన్నారు. నాకు రౌడీ షీటర్ హేమంత్ కు ఎలాంటి లావాదేవీలు లేవని..కావాలంటే తన ఐదేళ్ల కాల్ డేటాకూడా చెక్ చేసుకోవాలన్నారు. బీజేపి నాయకులు జరిగిన సంఘటనపై సిబిఐ విచారణ చేయాలని అడుగుతున్నారని..తానే ఆ విచారణను ఆహ్వానిస్తున్నానని..అవసరమైతే సిబిఐకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ కిడ్నాప్ విషయంలో మొత్తం ర.1.75కోట్లు తన కుటుంబాన్ని బెదిరించి తీసుకున్నారన్నారు. దానిని రికవరీ చేశారని చెప్పారు. తనకుటుంబాన్నిమాత్రం తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని..దానిపై అధికారం ఉంటే కాల్చిపడేస్తానని జనసేన పవన్ కళ్యాణ్ అన్నమాట తనకి నచ్చిందని అన్నారు. నాడు చంద్రబాబునాయుడుపైనా అలిపిరిలో మావోయిస్టులు మందుపాతర పెట్టి పేల్చేసిన సంఘటన గుర్తుచేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కిడ్నాప్ లు, హత్యలూ జరుగుతూనే ఉంటాయని..దానిని ప్రభుత్వాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే ఉంటాయన్నారు. ఉన్నది ఉన్నట్టు మీడియారాయాలిగానీ ఏదో జరిగిపోతందన్నట్టు వక్రీకరించి రాయకుడదని..తన కుటుంబం కిడ్నాప్ జరిగిన తరువాత వచ్చిన వివిధ మీడియా కధనాలను ఎంపీ చూపించారు. 

రఘురామక్రిష్ణం రాజు ఒక గజ్జికుక్క..కార్పోటర్ మూర్తియాదవ్ పిచ్చికుక్క..
ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ఒక గజ్జికుక్క అని..ఆఫ్ట్రాల్ కార్పోరేటర్ మూర్తియాదవ్ ఒక పిచ్చకుక్క అని మండిపడ్డారు. నియోజకవర్గానికే వెళ్లని వాడు ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేస్తూ కుక్కలా మొరుగుతూ ఉంటాడని అన్నారు. తాను విశాఖ విడిచిపోతే వీళ్లకి ఏం ఆనందమో తనకు తెలియడంలేదని తానేమీ ఎవరి ఆస్తులూదోచుకోలే దని..వేల నిర్మాణాలు చేసిన తనపై ఒక్క పోలీస్ కేసు కూడా లేదన్నారు. మీడియాలో తన నిర్మాణాలు చేస్తున్న ప్రదేశంలో బాంబు పేళుళ్లు అంటూ వార్తలు రాశారని..కొండలను తవ్వే సమయంలో అదొక చిన్న భాగమన్నారు. ఇక్కడ తన ప్రాజెక్టుకి రాయితీసే అనుమతులు 45రోజులు గడిచినా రాలేదన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన కుటుంబం కిడ్నాప్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కట్టుకదా అని మాట్లాడి..తరువాత తనను పరామర్శించడానికి తన కార్యాలయానికి వస్తానంటే సున్నితంగా తిరస్కరించానని అన్నారు. ఒకపార్లమెంటు సభ్యుడి కుటుంబం కిడ్నాప్ అయితే విశాఖసిపి రెండుగంటల్లో కిడ్నాపర్లను పట్టుకున్నారని అన్నారు. తాను ఆ బాధలో వుంటే మీడియా వక్రీకరించి రాసిన రాతలు..మరికొందరు దానిని రాజకీయం చేయడం తగదన్నారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు రాసిన వార్తలను ప్రదర్శించారు. కిడ్నాపర్లు హేమంత్ పై 13 కేసులున్నాయని, రౌడీ షీట్ కూడా ఉందని, రాజేష్ పై 45 కేసులున్నాయని ఆ వివవారాలను మీడియాకి తెలియజేశారు. తన కుటుంబానికి జరిగినట్టు మరెవరికీ జరగకూడదని అంటూనే ఈకిడ్నాప్ వెనుక ఎవరూ లేరని కేవలం డబ్బుకోసమే జరిగిందని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో కొన్ని టివి ఛానళ్లు ప్రసారం చేసిన వార్తలను కూడా ప్రస్తావించడంతో మీడియా వేసిన ఎదురు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండానే జరిగిన చెప్పలానే ఈ ప్రెస్ పెట్టానని చెప్పిలేచిపోయారు..!

Visakhapatnam

2023-06-21 09:37:03

విశాఖ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గా రాజారెడ్డి

విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ గా ఎస్.రాజారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ప్రస్తుతం డైరెక్టర్ గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్ రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముంబై ఐఐటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి 1995 లో ఎయిర్పోర్ట్ అథారిటీలో జాయిన్ అయ్యానని అన్నారు. గతంలో 2009 నుండి 2015 వరకు విశాఖ విమానాశ్రయంలో విధులు నిర్వహించారని, హుధూద్ సమయంలో నాలుగు రోజుల్లోనే విమాన రాకపోకలను పునరుద్ధరించామని గుర్తుచేశారు. అనంతరం విశాఖ నుంచి బదిలీపై వెళ్లి మహారాష్ట్ర, చెన్నై, ఢిల్లీలో పనిచేశా నన్నా రు. ఢిల్లీ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చానని,  ప్రస్తుతం విమానాశ్రయంలో చేపట్టవలసిన పలు అంశాలను శ్రీనివాసరావు వివరించారని తెలిపారు. గతంలో చేసిన అనుభ వంతో ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి,  ప్రణాళిక బద్ధంగా విశాఖ విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Visakhapatnam

2023-06-16 15:54:23