1 ENS Live Breaking News

ఎస్సెస్సీ, ఇంటర్, ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ విషయాలపై రెవెన్యూ విద్యా పోలీసు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 18వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎస్ ఎస్ సి పరీక్షలు ఉదయం గం 9:30 నిల .నుండి మధ్యాహ్నం గం 12 45 ని.ల వరకు జరుగుతాయని   ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉగం 9-00ని. ల నుండి మధ్యాహ్నంగం. 12-00ల వరకు, జరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఏపీపీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో  ఎటువంటి లోటుపాటులు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్తు తాగునీరు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులన్నీ పూర్తిగా ఉండాలన్నారు. 

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పనులన్నీ నియమిత కాలంలో ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రికల్ డిజిటల్ స్మార్ట్ పరికరాలు పరీక్ష హాల్లోనికి అనుమతించ రాదన్నారు. సమయపాలన కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక చికిత్స ఓ ఆర్ ఎస్ గ్లూకోస్ మొదలైనవి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల ప్రాంతంలో ప్రశ్న పత్రాలు ఆన్సర్ పత్రాలను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాలని పోస్ట్ ద్వారా ఆ రోజే పంపించాలన్నారు. అధికారులు సూచించిన చెక్ లిస్ట్ అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ పోలీస్ విద్యాశాఖ అధికారులతో స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు.  డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో 397 పాఠశాలలకు సంబంధించిన 21, 259 మంది రెగ్యులర్ విద్యార్థులు 2324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

 పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లకు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్ ఐ ఈ ఓ  బి. సుజాత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 13,323 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1074 మంది జనరల్, 2619 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు. రెండవ సంవత్సరం 15,298 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1278 మంది జనరల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి పరీక్షలు మార్చి 18 నుండి 27 వరకు ఐదు కేంద్రాల్లో జరుగుతాయని 788 మంది హాజరవుతున్నారన్నారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సం.పరీక్షలు 11 కేంద్రాలలో మార్చి 18 నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని 2205 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు ఐదు కేంద్రాలలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 3 తేదీ వరకు జరుగుతాయని 991 మంది హాజరవుతున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి అనకాపల్లి డి.ఎస్.పి సుబ్బరాజు ఉప విద్యాధికారి రవిబాబు డిఇసి మెంబర్లు డి ఈ సి మెంబర్లు ఎం శ్రీనివాసరావు పి శిరీష రాణి పివిఎన్ మూర్తి జిల్లా బల్క్ మెంబర్ ఎం.మోహన్ రావు పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పండా ఆర్ టి సి మేనేజర్ కే.ఎస్. నారాయణ ఎస్ టి ఓ పి రాజేష్ టెలిఫోన్స్ జే టి ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-13 14:29:08

అభివృద్ధి లక్ష్యాల దిశగా విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర‌

భారత‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆశయం, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌తి పౌరుడూ, అధికారీ, ప్ర‌జాప్ర‌తినిధి, స్వ‌చ్ఛంద సేవ‌కులు అభివృద్ధి లక్ష్యాల దిశగా విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర‌లో భాగ‌స్వామ్యం కావాల‌ని ఆర్ధిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ సోల్మన్ ఆరోక్యరాజ్ పిలుపునిచ్చారు.  2047 నాటికి భార‌త్ దేశం అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేర‌ట‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ  ప‌థ‌కాల‌ను రూపొందించి, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అందిస్తోంద‌ని పేర్కొన్నారు. విశాఖ వేదిక‌గా సోమవారం ఆయ‌న జివిఎంసి పరిధిలో జోన్-5 నందు 61వ వార్డులో మల్కాపురం నందు మరిడిమాంబ కళ్యాణ మండపం నందు విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసిన వివిధ ప‌థ‌కాల ఉద్దేశాల‌ను, ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. 2047 నాటికి భార‌త దేశం అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న త‌ప్ప‌క నిలుస్తుంద‌ని, ప్రపంచంలో 5వ ఆర్ధిక వ్యవస్థగా వున్న మన భారత దేశం రాబోయే కాలంలో 3వ ఆర్ధిక వ్యవస్థ గా అభివృద్ధి చెందుతుందన్నారు. 

రెండు కోట్ల మంది మహిళలకు  లక్షాధికారులను చేయడమే సంకల్ప యాత్ర ద్యేయమన్నారు. మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. కనీస అవసరాల కల్పన దిశగా ప్రతి ఒక్కరికి గృహాలను అందించి మౌలిక వసతులను కల్పించామన్నారు. ఇప్ప‌టికే ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌, పీఎం ఆవాస్ యోజ‌న‌, పీఎం పోష‌ణ్ అభియాన్, దీన‌ద‌యాల్ అంత్యోద‌య యోజ‌న‌, పీఎం ఉజ్వ‌ల్ యోజ‌న‌, పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌, పీఎం భార‌తీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న తదిత‌ర ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ‌, ఆర్థిక ఫ‌లాలు అందాయ‌ని ఆయన గుర్తు చేసారు. భారత్ దేశం ఆర్ధిక వ్యవస్టగా పెంపొందించడానికి పరిశ్రమలు, ఆదాయ మార్గాలు పెరగాలని ఆ దిశగా గత మూడు సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసి కొన్ని వేల, లక్షల క్లిలోమీటర్ల రోడ్లు, రైల్వే లైన్లు, పోర్ట్లులు అభివృద్ధి కి కృషి జరుగుతుందన్నారు. ఇవన్ని తెలియ పరచటం కోసమే గత రెండు మాసాల నుండి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు విశాఖ నగరంలో జరుపుతున్నామన్నారు. ఆ దిశగా ప్రజలకు అందిస్తున్న 17 నుండి 20 రకాల ప్రయోజనాలు, సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుతూ సంబధిత స్టాళ్లను ఏర్పాటు చేయడమైనదన్నారు. 

ఈ స్టాళ్లలో పధకాలు పొందని అర్హులైన లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే, ఇక్కడ విచ్చేసిన అధికారులు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు పధకాలను, ప్రయోజనాలను కల్పించే దిశగా చర్యలు చేపడతారన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి ప్రోత్సాహకాలను అందించే దిశగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నిత్య సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను, విద్యార్ధులకు బహుమతులను అందించి కార్యక్రమానికి  విచ్చేసిన వారితో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం బిజెపి స్టేట్ సెక్రటరీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ వికసించిన భారత్ దేశం కోసం అభివృద్ధి దిశగా సంకల్పం తీసుకోవాలని, ఇప్పటికే 11 కోట్ల మందికి ఉజ్వల పధకం క్రింద 7 వేల రూపాయల విలువ చేసే ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించామన్నారు.

         అనంతరం జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందినా దేశంగా సంకల్పమే వికసిత భారత్ యాత్రను ప్రధాన మంత్రి ప్రారంభించారన్నారు.  విశాఖ నగరం లో 60 రోజుల నుండి ఈ సంకల్ప యాత్ర కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. సంకల్ప యాత్రలో కల్పిస్తున్న వివిధ పధకాలు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లల్లో పేర్లను నమోదు చేసుకొని సంక్షేమ పధకాలను పొందాలని అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణకు విశాఖ నగరాన్ని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని సహకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మలేరియా అండ్ హెల్త్ ఆఫీసర్ డి.జగదీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.        

Visakhapatnam

2024-02-12 14:01:30

నువ్వా-నేనా.. అనకాపల్లి టిడిపి-జనసేన ఎంపీ సీటుకి త్రిముఖ పోటీ

అనకాపల్లి జనసేన-టిడిపి ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రధాన సమస్యలపై పోరాడుతున్నయువనేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షలు టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్, జనసేనాని అన్నయ్య పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో కిషోర్, విజయ్ లు లోకల్ క్యాండిడేట్లు కాగా  పొత్తుపార్టీ జనసేన నుంచి స్థానికుడిగా కొణతాల రామక్రిష్ణ, కొణిదెల నాగబాబు మాత్రం నాన్ లోకల్. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో లోకల్ ఫీలింగ్ పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇపుడు ఉమ్మడి విశాఖజిల్లాలోని అనకాపల్లి ఎంపీ స్థానానికి డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ పార్టీ ముందు కాస్త ఆర్ధిక బలాన్ని చూపిస్తున్న మరో వ్యక్తి పేరు కూడా సామాజిక మాద్యమల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ప్రముఖంగా పోటీ మాత్రం ఈ ముగ్గురిలోనే కనిపిస్తున్నది. ఆది నుంచి అనకాపల్లి పార్లమెంటు ఎంపీ సీటుని ఆశిస్తున్న ఆడారి కిషోర్ కుమార్ పార్టీలోని అందరు సీనియర్ నాయకులతోపాటు అధినేత చంద్రబాబుని సైతం స్వయంగా తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీస్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల మాడుగుల మండలంలో జరిగిన టిడిపి కదిలిరా సభలో నేరుగా అయ్యన్నపాత్రుడు చంద్రబాబుని స్టేజి మీద నుంచే తన కొడుక్కు కి ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. వీరిద్దరి మధ్యలో ఈసారి అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం, దానికి అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు జరుపుతుండటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 

అనకాపల్లి సీటు తనకు ఇవ్వాలని..లేని పక్షంలో చింతకాలయ విజయ్ కి ఇచ్చినా తాను శ్రమించి పనిచేస్తానని కిషోర్ కుమార్ అయ్యన్నపాత్రుడినే అభ్యర్ధించారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో డెమెక్రసీ ఇన్ డేంజర్, సేవ్ డెమెక్రసీ పేరటి సుమారు 54 రోజుల పాటు ఉద్యమాలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న అన్నిరోజులూ కిషోర్ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసంఘాలు, అన్ని రాజకీయపార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. అంతేకాకుండా ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం, విమానాలు, రైళ్లు, డిల్లీ వేదిక గా కూడా తన గళాన్ని బలంగా వినిపించారు. అయితే చాలా కాలంగా పార్టీలో సీనియర్ నేతగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా గెలిచి పార్టీని అభివృద్ధి చేశానని..తన తరువాత తన వారసుడికి సీటు ఇవ్వడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేస్తాని అయ్యన్నపాత్రుడు సైతం తన డిమాండ్ ను పార్టీ ముందు ఉంచుతున్నారు. ఇదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ఒక ట్రస్టు సభ్యుడు వీరిద్దరికంటే తాను ఆర్ధికంగా బలంగా ఉన్నానని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపించుకుంటానని ప్రచారం చేసుకుంటూ..తనకే ఎంపీ సీటు ఖరారు అయిపోయిం దని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడారి కిషోర్ కుమార్ కి సామాజిక బలం ఎక్కువగా ఉండటం, గతంలో బీజేపీ లాంటి పార్టీలో పనిచేసి ఉండ టం, స్థానికు కావడంతో  అటు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిసింది. 

అయితే టిడిపిలో చేరిన తరువాత పతాక స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ, ప్రజల్లోనే ఉంటూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈయన పార్టీ ఏం చేసినా తాను శిరసా వహిస్తానంటూ తన పనిచేసుకొని వెళుతున్నారు. దీనితో ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఈ మూడు పేర్లు పరిగణలోకి తీసుకొని బేరీజు వేస్తున్నాయి. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ సామాజిక బలం ఉన్న నాయకులను రంగంలోకి దించడం ద్వారా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. అదే సమయంలో జనసేన సీనియర్ నేత కాకపోయినా ఇటీవలే పార్టీలోకి చేరిన కొణతాల రామక్రిష్ణనైనా సామాజికంగా బేరీజు వేస్తూ ఎంపీగా దించాలని యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటం టిడిపిలో ఇంకా ఎమ్మెల్యే స్థానాలే ఖరారు కాకపోవడం, ఎంపీ స్థానానికి బలమైన పోటీ ఉండటంతో అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, సొంతపార్టీ నిర్వహిస్తున్న సర్వేలో సైతం ఈ మూడు పేర్లేనే ప్రస్తావిస్తుండటం విశేషం. అధికార పార్టీ, వారి గ్రౌండ్ నెట్వర్క్ లలో కూడా ఈ మూడు పేర్లకు డిమాండ్ ఉండటంతో అటు కొందరు సీనియర్లు కూడా సీటు గవర సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా పైచేయి సాధించడానికి అవకాశం వుంటుందనే విషయంలో కాస్త సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. కౌన్ బనేగా అనకాపల్లి ఎంపీ సీటు ఈ ముగ్గురిలో ఎవరిని వరిస్తోందో..లేదంటే ఆర్దికంగా బాలంగా ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్న నాన్ లోకల్ ట్రస్ట్ నిర్వాహకుడికి వస్తుందో లేదంటే ఇటీవలే పార్టీలో చేరిన కొణతాల రామక్రిష్ణను వరిస్తుందోననేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది..!

Anakapalle

2024-02-12 09:35:51

జగనన్న కాలనీ లో మౌలిక సదుపాయాలు పూర్తి కావాలి

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన  జగనన్న కాలనీ లేఅవుట్ లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించే  ప్రక్రియను  త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి లు సంయుక్తంగా హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్  చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మెన్ మోహిత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ లతో కలిసి జగనన్న కాలనీ లేఅవుట్ లలో  సదుపాయాల కల్పన  ప్రక్రియపై  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ, నవరత్నాలు  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద లేఅవుట్ లలో పెండింగ్ మౌలిక అంశాలు ఏర్పాటుతో లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను చూయించా లని, దీనిపై హౌసింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో బాగంగా చంద్రగిరి నియోజకవర్గంకు సంబందించి వడమాల పేట, రామచంద్ర పురం మండల తదితర మండలాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్ లలో పెండింగ్ అంశాలు ఉన్నవాటిలో  గ్రావెల్ రోడ్, అప్రోచ్ రోడ్ వంటి స్టోన్ ప్లాంటేషన్ తదితర సదుపాయాలని కల్పించి త్వరగా లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించాలని  హౌసింగ్ అధికారులను ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, హౌసింగ్ డిఈ లు, ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2024-02-10 16:05:17

విశాఖ ఎంపీ కేండిట్ విషయంలో టిడిపి వినూత్నవిధానం

విశాఖ ఎంపీ కేండిట్ ను ఎంపిక చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్న విధానాన్ని ఎంచుకున్నది. దానికోసం ప్రజల నుంచే స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఒక ఫోన్ కాల్ విశాఖలోని పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు వస్తుంది..అందులో శారాంశం ఏంటంటే మీతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడతారని, తప్పకుండా కాల్ లిఫ్ట్ చేయాలన్నది. ఆ వెంటనే మరొక ఫోన్ వస్తోంది. అందులో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా ఎం.భరత్ ను ఎంపిక చేయాలనుకుంటే ఒకటి నొక్కండి లేదు నోటా అనుకుంటే రెండు నొక్కండి అనే చంద్రబాబు వాయిస్ వినిపిస్తుంది బీప్ శబ్దం తరువాత ఓటరు తన నెంబరుని ఎంచుకున్న తర్వాత కాల్ కట్ అవుతుంది. అంటే విశాఖ ప్రజలు ఎవరిని ఎన్నకుంటారో తెలుసుకోవడానికి టిడిపి ఈ తరహా టెక్నాలజీని వినియోగించడం ఇపుడు నగరంలో చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా ఎంపీ రేసులో ఉన్నవారి పట్ల ప్రజల్లో ఎంత విశ్వాసం, నమ్మకం ఉందనే విషయంలో కూడా గ్రౌండ్ నెట్వర్క్ బృందాలు కూడా జనంలో కలసిపోయి పాన్ షాపులు, టీ షాపులు, సలూన్ షాపులు, చికెన్ మటన్ షాపులు, రైతు బజార్లు, సినిమా థియేటర్ల వద్ద కూడా కొందరు సర్వేలు చేస్తుండటం విశేషం. ఏ అభ్యర్ధి అయితే గెలుస్తారో తెలుసుకోవడానికి టిడిపి అన్ని రకాల చర్యలు చేపట్టడం ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రజల పల్స్ కూడా స్పష్టం చాలా చోట్ల బయటపడుతుంది. దానిని బట్టి విశాఖ ఎంపీ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి.

Visakhapatnam

2024-02-10 08:31:20

అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ శాంతి సదస్సును అడ్డుకోవడం తగదు..కె.తారీఖ్ అహ్మద్

అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు ప్రయత్నించడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని సంస్థ జాతీయ ప్రతినిధి కె.తారీఖ్ అహ్మద్ పేర్కొన్నారు. విశాఖ నగరంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ శాంతిపై జనవరి 28న గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించాల్సి ఉంద‌ని కానీ. కానీ కొన్ని ముస్లిం సంస్థలు ఈ సదస్సును అడ్డుకోవాలని పిలుపునివ్వ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ అన్యాయపు ప్రయత్నాన్ని ఆహ్మదియ్య ముస్లిం సంఘం తీవ్రంగా ఖండిస్తూ, తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు విశాఖ‌లో మీడియాకి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విశాఖపట్నం శాఖ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించే ప్రయత్నాన్ని బలపర్చడం రాజ్యాంగ ఉల్లంఘన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ మనసా వాచా “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” కలిమాను విశ్వసిస్తూ, ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి (స.అ.స) ఆయన దైవ సందేశహరుడు, ఖాతమున్నబియ్యీన్ అని, పవిత్ర ఖురాన్ అల్లాహ్ యొక్క అంతిమ దైవ గ్రంథం అని విశ్వసిస్తుందన్నారు. 

అహ్మదీయ ముస్లింలు ఇస్లాం యొక్క మూల సూత్రాలు,విశ్వాసాలపై మనస్పూర్తిగా నడుచుకుంటార‌ని తెలియ‌జేశారు. భారతదేశంలోని అనేక హైకోర్టులు అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఒక ఇస్లామిక్ సంస్థ అని తీర్పులనిచ్చాయనే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా 2011 జనాభ లెక్కల రిపోర్ట్ అధికారికంగా అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ఇస్లాంలో ఒక శాఖగా గుర్తించిందని తెలియ‌జేశారు.  ప్రపంచంలో అశాంతి, ఆందోళనలు, 3వ ప్రపంచ యుద్ధం  అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్త నాయకుడు ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్  ఆధ్యాత్మిక నాయకత్వంలో విశ్వవ్యాప్తంగా శాంతి సదస్సు లు నిర్వహిస్తోందన్నారు.

శాంతి స్థాపన కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొన్ని ముస్లిం సంస్థలు చూడడం దురదృష్టకరమని, ఖండనీయమని పేర్కొన్నారు.  భారతదేశం వంటి లౌకిక దేశంలో మతపరమైన ఫత్వాలు చట్టాలు కాజాలవని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఫత్వాలకు ఇస్లాం నిజమైన బోధనలకు ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి శాంతి సదస్సులు వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించి, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  ఇటువంటి కార్యక్రమాలను అన్ని వ‌ర్గా ముస్లి సంఘాలు ప్రోత్సహించి, మద్దతు ఇవ్వాలని కోరారు. ఇస్లాం అంటేనే ‘శాంతి, భద్రతలు’ అని అర్థమని.. శాంతిని పెంపొందించే ప్రయత్నాల్లో అడ్డంకులు సృష్టించడం, ఇస్లాం సిద్ధాంతాలకు,  బోధనలకు విరుద్ధమన్నారు. అన్ని ముస్లిం సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సామాజిక శాంతి, మత సామరస్యానికి హాని కలిగించే ప్రకటనలు జారీ చెయ్యకూడదనీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Visakhapatnam

2024-02-08 13:05:53

గ్రామ సచివాలయ ఉద్యోగులను నిలువునా మోసంచేసిన వైఎస్.జగన్.. ఆడారి కిషోర్ కుమార్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయ శాఖ సీఎం వైఎస్.జగన్ రెడ్డి మానస పుత్రిక అని చెబుతూ, ఉద్యోగులను మభ్యపెడుతూ నేటికీ ఈప్రభుత్వశాఖకు చట్టబద్దత తీసుకురాలేదన్నారు. చట్టబద్ధత లేని ప్రభుత్వశాఖ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉంటుందో ఉద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. అంతేకాకుండా పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం నేటికి సదరు పీఆర్సీ అరియర్స్ ఇవ్వలే దని, రెండేళ్ల తరువాత సర్వీసును రెగ్యులర్ చేస్తామని చెప్పి అదనంగా 9 నెలలు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోలేదా అని ప్రశ్నించారు. సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో నేటికీ ఎలాంటి ప్రకటనే చేయకపోవడం ఉద్యోగులను మోసం చేసినట్టు కాదా అని నిలదీశారు. నేటికీ కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేయలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 
ఒకేసారి 1.25లక్షలు ఉద్యోగాలు భర్తీచేశామని తెగ ప్రచారం చేసుకునే ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కల్పించిన ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఎందుకు అమలు చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీకే ఓట్లు వేయించుకునే విధంగా ఆఖరి క్యాబినెట్ సమావేశం వరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ శాఖకు ఈ క్యాబినెట్ లో చట్టబద్దత కల్పించడంతోపాటు, ఉద్యోగులకు గత పీఆర్సీ లో ఇవ్వాల్సిన అరియర్స్..9నెలల కాలానికి 2 డిఏలు, సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులను మోసం చేసిన తీరును రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసి వారిని చైతన్య పరిచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Visakhapatnam

2024-01-30 15:23:15

కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి.. కొయ్య ప్రసాద రెడ్డి

భారత దేశం అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా టిడిపి, వైఎస్సార్సీపి పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టం హామీలు సాధించలేని పార్టీలుగా మిగిలిపోయాయి అన్నారు. ఈ రెండు పార్టీల వల్ల అన్ని సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్లు నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు పదేళ్ల కాలంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రావాలన్నా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్న, కావాలన్నా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రాహుల్ గాంధీ ప్రధాని అయిన నాడే సాధ్యపడుతుందన్నారు. ప్రధాని మోడీ 
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఉల్లంగించారని అన్నారు. 
కాంగ్రెస్ గెలిస్తే ఏ పి కి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని, అలాగే
సుజల స్రవంతి పూర్తి చేస్తామన్న మేనిఫెస్టోతో ముందుకు వెళతామని పేర్కొన్నారు. 
అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని ఊర కుక్కలు మాదిరిగా షర్మిల మీద విమర్శలు చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదన్నారు. భీమిలిలో జగన్
సిద్దం సభకు నాలుగున్నర లక్షల మంది వస్తారని ప్రకటనలు గుప్పించిన వైసిపికి లక్ష మంది కూడా రాలేదని, జగన్ అర్జునుడు కాదు ఉత్తర కుమారుడు అని ఎద్దేవా చేశారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి, వై వి సుబ్బారెడ్డి దిగజారి షర్మిల మీద విమర్శలు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. కార్యకర్తలను జగన్ విస్మరిస్తున్నారని, 
దివంగత నేత వైఎస్సార్ మీద వున్న అభిమానం వల్లనే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
టీడీపీ, వైసీపీ వేలం పాట మాదిరిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. 
రైల్వే జోన్ జాప్యం వల్ల నష్టం జరుగుతోందని, విభజన హామీలు అమలు జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు.
గంగ వరం పోర్టుని అదానికి దోచి పెట్టారని, ఉత్తరాంధ్రను అభివృద్ది చేయలేదని, విశాఖను బొత్సకి తాకట్టు పెట్టారని విమర్శించారు.
పార్టీ నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పి సీ సీ అధ్యక్షురాలుగా వైయస్ షర్మిలా రెడ్డి రాకతో మాజీ కాంగ్రెస్ వాదులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో వైసీపీ లోకి వెళ్లి జగన్ తో ఇమడ లేని నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, తద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 
సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నబాబు, నాయకులు తలారి సురేష్, హాసిని వర్మ, మహ్మద్ హర్షద్ భాషా, నమ్మి రామారావు, దేవ తదితరులు పాల్గొన్నారు.

2024-01-29 08:36:39

అనకాపల్లిజిల్లా పోలీసు స్పందన కు 26ఫిర్యాదులు

జిల్లా పోలీసు స్పందనకార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని ఎస్సీ కెవి.మురళీక్రిష్ణ అధికారులను ఆదేశిం చారు. సోమవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో అర్జీ దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించిన ఆయన చట్టపరిధిలోని ప్రభుత్వ నిబంధనల మేరకే పరిష్కారించాల్సిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆ విషయాన్ని అర్జీదారులకు తెలయజేయాలన్నారు. నేటి పోలీసు స్పందన కార్యక్రమానికి 26 ఫిర్యాదు లలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. అడిషనల్ ఎస్పీ పి.సత్యనారాయణరావు, ఎస్సై కె.సావిత్రి  పాల్గొన్నారు. 

Anakapalle

2024-01-22 12:20:26

పార్వతీపురం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు

పార్వతీపురం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియ జనవరి 12వ తేదీన ముగిసింది. తుది ఓటరు జాబితా ప్రచురణ ప్రతిని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాలలో తుది ఓటర్ల జాబితాలో 3,78,764 మంది పురుషులు,  3,96,766 మంది స్త్రీలు, 68 మంది థర్డ్ జెండర్  వెరసి నికర ఓటర్లు 7,75,598గా నమోదు అయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయుటకు శాయశక్తుల కృషి చేశామన్నారు. మృతి చెందిన ఓటర్లను తొలగించడం, శాశ్వతంగా వలసలు వెళ్లినవారిని గుర్తించడం, యువతను ఓటరుగా నమోదు చేయడం, జంక్ ఓటర్లను సరిచేయడం, పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను విచారణ చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించామని అన్నారు. బూత్ స్థాయి అధికారి నుండి శత శాతం దృష్టి సారించారని చెప్పారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమాచారం ఇచ్చి పుచ్చు కోవడం జరిగిందని తెలిపారు. ఫారం 8 దరఖాస్తులు దాదాపు 98 వేలు విచారణ చేశామని ఆయన చెప్పారు. జిల్లా ఏర్పడిన నాటికి దాదాపు పదకొండు వందల మంది యువ ఓటర్లు మాత్రమే ఉండగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి కారణంగా ప్రస్తుతం 14 వేల వరకు ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. 

జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉండగా అందులో పాలకొండ (ఎస్.టి) నియోజక వర్గంలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి 1,93,667 మంది ఓటర్లు., కురుపాం (ఎస్.టి) నియోజక వర్గంలో 93,592 మంది పురుషులు, 99,005 మంది మహిళలు, 39 మంది థర్డ్ జెండర్ వెరసి 1,92,636 మంది ఓటర్లు., పార్వతీపురం (ఎస్.సి) నియోజక వర్గంలో 92,655 మంది పురుషులు, 95,188 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ వెరసి 1,87,854 మంది ఓటర్లు., సాలూరు (ఎస్.టి) నియోజక వర్గంలో 98,189 మంది పురుషులు, 1,03,248 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్ వెరసి 2,01,441 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 

ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 27వ తేదీన ప్రచురించారు. అనంతరం డిసెంబరు 9వ తేదీ వరకు క్లైములు, అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. దానిని జనవరి 12వ తేదీ నాటికి పొడిగించారని చెప్పారు. తుది జాబితాను ప్రచురణకు అవసరమగు అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఓటరు జాబితా వివరాలు తాజా పరచి (update) సోమ వారం విడుదల చేశామని ఆయన అన్నారు. నవంబరు 4,5 తేదీలు., డిసెంబరు 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. 

జిల్లాలో 10,271 మంది మృతి చెందిన ఓటర్లు, 6674 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినవారు, 1093 మంది ఎక్కువ సార్లు ఓటరుగా నమోదు (multiple entries), 2587 ఇతరులు ఉన్నట్లు రాజకీయ పార్టీలు పిర్యాదు చేయగా వాటన్నింటినీ విచారించిన తరువాత 1316 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 382 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినట్లు, 358 మంది ఎక్కువ సార్లు ఓటరుగా నమోదైనట్లు గుర్తించామని ఆయన వివరించారు. 2,314 పిర్యాదులు అందక ముందుగానే విచారణ చేసి తొలగించామని ఆయన చెప్పారు. 16,255 మంది తమ చిరునామాలోనే ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. 

2023 జూన్ నాటికి 8009 జంక్ / "0" గృహ సంఖ్యతో (సరైన చిరునామా లేని) ఉన్న ఓటర్లలో డబుల్ ఎంట్రీ గల 138 మినహా అన్నీ విచారణ చేశామని, పది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 64,550 గృహాలను విచారణ చేశామని అందులో డబుల్ ఎంట్రీ గల 132 మినహా అన్నీ విచారణ చేశామని, సాంకేతిక కారణాల రీత్యా ఫారం 7,8 గల 290 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఇ ఆర్ ఓ నెట్ ఓపెన్ అయిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఫారం 6,7,8 దరఖాస్తులను నామినేషన్ల చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. తుది ఓటరు జాబితా అన్ని పోలింగ్ కేంద్రాలు, సహాయ ఓటరు నమోదు అధికార్లు, ఓటరు నమోదు అధికార్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణ నిమిత్తం అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఒకటి, ఫోటోలు లేకుండా ఉన్న ఓటరు జాబితా ఒకటి ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె వెంకట రావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పారిశర్ల అప్పారావు, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి జి వెంకట నాయుడు, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి తామరఖండి వెంకట రమణ, సిపిఐ (ఎం) పార్టి ప్రతినిధి ఆర్ వేణు, వై.ఎస్.అర్. సి.పి పార్టీ ప్రతినిధి వి శ్రీనివాస రావు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి రవి కుమార్, జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Manyam

2024-01-22 07:08:21

అనకాపల్లి ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ కు 5దరఖాస్తులు

ఉద్యోగుల గ్రీవెన్స్ దరఖాస్తులను సంబంధిత జిల్లాశాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలనే జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించాలని కలెక్టరేట్ కార్యాలయ ఏఓ శ్రీనివా సరావు పేర్కొన్నారు.  శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కు 5 దరఖాస్తులు వచ్చాయి. నెలలో ప్రతి 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్ కలెక్టరేట్ పరిపాలనాధికారి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తులను ఆయాశాఖలకు బదిలీల చేసినట్టు తెలియజేశారు. ఉద్యోగుల గ్రీవెన్స్ పై ఆయాశాఖల అధికారులు తీసుకున్న చర్యలను ఉద్యోగుల చరవాణీలకు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వం ఎంతో మంచి లక్ష్యంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందని, దానిని అన్నిశాల్లోని సిబ్బంది  సమస్యలను వెంటనే పరిష్కరించి గ్రీవెన్స్ కి గుర్తింపు తీసుకురావాలన్నారు. ఈ గ్రీవెన్స్ ను ప్రభుత్వశాఖల్లోని 75శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Anakapalle

2024-01-19 14:12:13

ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి.. జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి

ల‌బ్దిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి కోరారు. రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వడ్డీ రాయితీ జ‌మ చేశారు. తాడేప‌ల్లిలోని సిఎం క్యాంపు కార్యాల‌యంలో గురువారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనిలో భాగంగా జిల్లాలోని సుమారు 29,686 మంది ల‌బ్దిదారుల‌కు రూ.301 కోట్లు వ‌డ్డీ రాయితీ ని జ‌మ చేశారు. దీనికి సంబంధించిన చెక్కును ల‌బ్దిదారుల‌కు క‌లెక్ట‌ర్ అంద‌జేశారు.  ఈ సంద‌ ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, పొదుపు సంఘాల ద్వారా ఇళ్ల నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం రూ.35వేల‌ను రుణంగా మంజూరు చేసింద‌న్నారు. వారికి  వ‌డ్డీ రాయితీ కింద జిల్లాలో రూ.3.01 కోట్ల‌ను సుమారు 29,686 మందికి జ‌మ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇళ్ల‌ను పూర్తి చేయ‌డానికి ల‌బ్దిదారుల‌కు ప్ర‌భుత్వం ప‌లు రాయితీల‌ను ఇస్తోంద‌ని చెప్పారు. ఉచితంగా ఇసుక‌ను,  సిమ్మెంటు, ఐర‌న్ కూడా స‌బ్సిడీ ధ‌ర‌పై స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని చెప్పారు. అలాగే ఇచ్చిన రుణాల‌కు వ‌డ్డీ రాయితీని కూడా ప్ర‌భుత్వం అంద‌జేస్తోంద‌ని తెలిపారు. వీట‌న్నిటినీ ఉప‌యోగించుకొని లబ్దిదారులు త‌మ ఇళ్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాని కోరారు. ఇప్ప‌టికే కాల‌నీల్లో  త్రాగునీరు, విద్యుత్ లాంటి క‌నీస స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని, ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే ఇత‌ర మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో హౌసింగ్ పిడి శ్రీ‌నివాస‌రావు, డి.ఇ.లు, ఏ.ఇ.లు, సిబ్బంది, ల‌బ్దిదారులు పాల్గొన్నారు.

Vizianagaram

2024-01-18 15:20:33

రైతు బజార్ లో స్టాల్స్ ఏర్పాటుకు 27 తేదిన డ్రా..జెసి

విశాఖపట్నం రైతు బజార్లలో గిరిజన రైతులకు స్టాల్స్ కేటాయింపు కోసం  27 న డ్రా తీయనున్నట్టు విశాఖ జెసి కె. విశ్వనాధన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్స రం నుండి ఇప్పటి వరకు స్పందన ద్వారా, వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తులు చేసుకొని యున్న786 మంది రైతులలో 315 మంది రైతులకు డ్రా తీయవలసి యుండగా గిరిజన రైతులు హాజరు కానందున, 235 మందికి మాత్రమే 12న దరఖాస్తుదారుల సమక్షములో డ్రా తీశామన్నారు. మరోసారి బహిరంగంగా దరకాస్తుదారుల సమక్షంలో 233 జాబితా  నుండి 80 మంది గిరిజన  రైతులకు డ్రా తీయనున్నట్టు పేర్కొన్నారు. డ్రా తీయబోయే స్టాల్స్, ఇతర వివరాలు తెలుసుకొను నిమిత్తం www.visakhapatnam.ap.gov.in, లో పొందుపరచినట్టు తెలియజేశారు. ఎంపికైన రైతులు వారికి నామినీగా ఉన్నవారి యొక్క రక్త సంబందికులను మాత్రమే డ్రా లో పాల్గొనేందుకు అనుమతిస్తామన్నారు. రైతులు సాయంత్రం పూట రైతు బజార్లకు వెళ్లేందుకు అంగీకారం తెలపాల్సి వుంటుందని స్పష్టం చేశారు.  పూర్తి వివరాలకు సహాయ మార్కెటింగ్ ఏడి ఆఫీస్ గోపాలపట్నం రైతు బజార్ ప్రక్కన, లేదా ఫోన్:9959592474లో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Visakhapatnam

2024-01-18 14:34:57

విశాఖ స్టీలు ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాం..నష్టంలేదన్న యాజమాన్యం

అదేంటో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే కొద్దిగైనా సంస్థలకు నష్టం వాటిల్లుతుంది. కానీ విచిత్రంగా విశాఖ స్టీలు ప్లాంట్ లోని బిఎఫ్-3లో శనివారం అగ్ని భారీ అగ్ని ప్రమా దం జరిగినా సంస్థకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని యాజమాన్యం విశాఖలోని మీడియాకి ప్రకటన విడుదల చేసింది. స్టీలు ప్లాంట్ లో ప్రమాదాలు జరగడం కొత్తేం కాదు. కానీ ప్రమాదాలు జరిగిన ప్రతీసారి ఒక్కోసారి ఒక్కో సాకు చెబుతుంది యాజమాన్యం. ఈప్రమాదంలో పలువురు కార్మికులకి గాయాల య్యాయని ప్రచారం జరిగిన తరుణంలో యాజమాన్యం ఈ విధమైన ప్రకటన జారీచేసింది.

Steel Plant Township

2024-01-13 16:53:43

భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలు..మాజీ మంత్రి గంటా

భోగిమంటల్లో పనికి రాని వస్తువులను వేస్తారని..గత 4 ఏళ్ల 9 నెలలుగా పనికిమాలిన ప్రభుత్వం ఏపీలో ఉందని..ఎందుకూ ఉపయోగంలేని వైఎస్సీర్సీపి పాలనను, పనికిరాని జీఓ లను కాల్చి బోగిమంట్లో వేయాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భోగి,మకర సంక్రాంతి పర్వదినాల సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా  గంటా  మాట్లాడుతూ మునిగిపోతున్న నావలాంటి  పార్టీ వైఎస్సార్సీపీ అని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ నుంచి సురక్షితంగా బయటపడటానికి అనేక మంది వీడిపోతున్నారని.. స్వపక్షంలో వున్న వారూ సతమతం అవుతున్నారని అన్నారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని  ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  అంబటి రాయుడు ఏదేదో ఊహించుకుని వైఎస్సార్సీపికి వెళ్లి ఏ స్కోరూ చేయకుండానే పెవిలియన్ దారిపట్టి జనసేన వైపు వెళుతున్నారన్నారు. ఉమ్మడి విశాఖజిల్లాలో ఏఒక్క స్ధానం కూడా వైఎస్సార్సీపీ గెలిచే అవకాశం లేదని సర్వేలు వస్తున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లోకి రాబోతున్నారని.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగుతాయని ప్రజల్లో విశ్వాసం పెరుగు తుందన్నారు. అనంతరం జీఓలను బోగి మంటల్లోవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి ఎర్నాగుల జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు బోయి వెంకటరమణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సతివాడ శంకర రావు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-13 15:37:28