ఆసుపత్రులకు అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ స్టోరేజి పాయింట్ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు ను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ అడ్మిషన్లు, కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా, పరీక్షల పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగిందని, అందుకు అనుగుణంగా జిల్లాలో కెజిహెచ్ లోని సిఎస్ఆర్ బ్లాక్ వద్ద, విమ్స్, చెస్ట్, ఇఎన్టీ, సైకియాట్రి, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, అనకాపల్లి ఆసుపత్రి, నర్సీపట్నం, అరకు, పాడేరు, గాయత్రీ, గీతం, ఎన్నారై మెడికల్ కళాశాలల వద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు త్వరితగతిన తయారు చేయాలని, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డిఎ నాయుడుని ఆదేశించారు. సైకియాట్రి ఆసుపత్రిలో ఉన్న డ్రగ్స్ మెటీరియల్స్ ను ప్రక్కనే నిర్మాణం లో ఉన్న భవనంను త్వరితిన పూర్తి చేసి డ్రగ్స్ మెటీరియల్ ను అందులోకి మార్చితే అందులో ఆక్సిజన్ సరఫరా చేయుటకు వీలుగా కనెక్షన్లు ఉన్నాయని, అందులో కోవిడ్ పడకలు ఏర్పాటు చేయాలని ఇఇ ని ఆదేశించారు. ఒక ఆక్సిజన్ ప్లాంట్ రెండు, మూడు ఆసుపత్రులకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. నైట్రోజన్ జనరేషన్ ప్లాంట్ లు ఎన్ని ఉన్నాయో డ్రగ్ కంట్రోల్ ఎ. డి. జిఎం ఇండస్ట్రీస్ ను అడిగి తెలుసుకున్నారు. హైల్త్ సిటీ లో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా కు టెక్నీషియన్ తో చర్చించారు. నిరంతర ఆక్సిజన్ సరఫరా పై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లు ఉన్నాయో లేదో, ఒక రోజులో ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై
డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు రజిత ను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రుల్లో అడ్మిషన్లు :
ప్రతీ రోజు ఉదయం ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి ఖాళీ పడకల సంఖ్య తెలుసుకొని ఆ వివరాలను 104 కాల్ సెంటర్ నోడల్ అధికారి, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు కు తప్పనిసరిగా తెలియజేయాలని డిఎం అండ్ హెచ్ఓ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు.
కోవిడ్ - 19 మెటీరియల్ :
మెటీరియల్ ఎంత ఉన్నది, ఎంత అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మెటీరియల్ పరిశీలించి ఆక్సిజన్ మాస్క్ లు, గ్లౌజులు, N 95 మాస్క్ లు, పిపిపి కిట్స్, NIV మాస్క్ లు, సర్జికల్ మాస్క్ లు, తదితరమైనవి
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలుకు తగు చర్యలు తీసుకోవాలని ఎఎంసి ప్రిన్సిపాల్, డిఎంహెచ్ఓలను ఆదేశించారు.
విమ్స్ లో వచ్చే వారం నాటికి 650 పడకలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులు డాక్టర్ సత్య వరప్రసాద్, ఎపిఎంఎస్ఐడిసి ఇఇలను ఆదేశించారు. పెంచే పడకలకు ఆక్సిజన్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కోవిడ్ మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలవాలన్నారు.
ఈ సమావేశంలో ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రామలింగరాజు, డ్రగ్ కంట్రోల్ అధికారులు రజిత, కళ్యాణి, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.