1 ENS Live Breaking News

వన్యప్రాణులను పరిరక్షణకు ముందుకి రావాలి

వన్యప్రాణులను పరిరక్షించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్నేక్ సేవర్ సొసైటీ వెబ్సైట్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష సర్పాలను కాపాడడంతోపాటు, వాటి వలన ప్రజలకు హాని కలగకుండా చూస్తున్న రొక్కం కిరణ్ కుమార్ ను అభినందించారు. ఇళ్లలోనూ పరిశ్రమల పరిసర ప్రాంతాలలోనూ సంచరిస్తున్న విష సర్పాలను పట్టుకోవడంలో కిరణ్ కుమార్ ఆరు తేరి ఉన్నాడని అని చెప్పారు. సొసైటీ సేవలను మరింత విస్తరించడానికి వెబ్ సైట్ ను ప్రారంభించటం ముదాహమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 68 వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2023-02-26 17:22:31

వైభవంగా బంగారమ్మతల్లి తీర్థ మహోత్సవం

సింహాద్రి నాథుడు సోదరి, అడవివరం పరిసర  14 గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అప్పన్న సోదరిగా సింహాద్రినాథుడి అనుబంధ దేవాలయంగా బంగారమ్మ తల్లి ఆలయ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందారు. తీర్థ మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారినీ సుప్రభాత సేవతో మేల్కొలిపి  ఆరాధన గావించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.  సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఏఈఓ వై శ్రీనివాసరావు. పర్యవేక్షకులు పిల్లా శ్రీనివాసరావు,  భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. 

Simhachalam

2023-02-26 17:07:21

చిరు ధాన్యాలతోనే మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం

చిరు ధాన్యాలు ఆరోగ్యకరం అని చిరుధాన్యాలు నిపుణులు రాంబాబు అన్నారు. ఆదివారం విశాఖలో ఓ హోటల్ లో  గోఆధారిత ప్రకృతి వ్యవ సాయదారుల సంఘం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. చిరుధాన్యాలను ఎనిమిది గంటలు నాన బెట్టి వండుకోవాల న్నా రు. చిరుధాన్యాలు వందినప్పుడు వచ్చే గంజి తరువాతి రోజు తీసుకోవడం చాలా ఆరోగ్యకమైనది , శరీరానికి అవసరమైన పోషకాలు వుంటా యని వివరించారు. అల్లం, వెల్లుల్లి, మజ్జిగ మంచి బ్యాక్టీరియా ను పెంచుతుందని పేర్కొన్నారు. చిరుధాన్యాలు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి వాటిని పిండి చేసుకోవటం మంచిదన్నారు.  రాగులతో చేసిన అల్వా వల్ల చాలా ఉపయోగాలున్నాయి అని ఆయన ఈ కార్యక్రమంలో భారతీయ కిసా న్ సంగ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు  దాట్ల వర్మ, అశోక్, ఎం.యుగంధర్ రెడ్డి, జే వీ రత్నం, రుషి తదితరులు పాల్గొని మాట్లాడారు.

Visakhapatnam

2023-02-26 15:00:57

శిక్షణ పొందిన విద్యార్ధులు ఉద్యోగాల్లో స్థిరపడాలి

స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధి ఉద్యోగాల్లో స్థిర పడాలని ప్రభుత్వ సలహాదారులు గాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇండి యన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (ISTD)జాతీయస్థాయి సొసైటీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ సభ్యులైన శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ సలహా దారులుగా నియమించిన నేపధ్యంలో ఓ హోటల్ లో ఆదివారం ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  విజయనగరం JNTU వైస్ ఛాన్సలర్ వెంకట సుబ్బయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసం హెచ్ ఆర్ లు వివరాలు ప్రభుత్వానికి అందించాలని శ్రీధర్ రెడ్డి కోరారు. నూతన ఒరవడితో స్కిల్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ పొందిన వారంతా  ఆయా రంగాల్లో స్థిరపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ సౌత్ ఫ్రొ.ఎన్.సాంబశివరావు, విశాఖ చాప్టర్ చైర్మన్ ఓఆర్ఎం.రావు, సెక్రటరీ హేమ యాదవల్లి, ఎన్సి మెంబెర్స్ ఠాగూర్, అప్పారావు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-26 08:21:05

రేపు పెదగుమ్ములూరులో ఉచిత వైద్య శిభిరం

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో బిబిఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ వైద్యులు బి.బంగారయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలను అందించనున్నామన్నారు. ఈ వైద్యశిబిరంలో అన్నిరకాల వ్యాధులకు ప్రముఖ వైద్యులచే ప్రత్యేకంగా పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. గుండె జబ్బులకు ప్రత్యేక వైద్యులులో పరీక్షలు నిర్వహిస్తామని, అవసరం అయిన వారికి ఈసిజి, బ్లడ్, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు.  ఈ కార్యక్రమాన్ని పెదగుమ్ములూరు చేపల మార్కెట్, అడ్డురోడ్డు తిమ్మాపురం విశాఖడైరీ పాలకేంద్రం ఎదురుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Payakaraopeta

2023-02-25 14:34:44

విమ్స్ సిబ్బందికి హెపటైటిస్ బి వాక్సినేషన్ డ్రైవ్

హెపటైటిస్ బి వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ వ్యాక్సినేషన్ విమ్స్ సిబ్బందికి పంపిణీ చేసినట్టు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు పేర్కొన్నారు. విశాఖ ఇన్సిట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి వేగంగా వైరస్ సోకే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్  వేస్తున్నామన్నారు.  కేజిహెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సహకారంతో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ డ్రైవ్ లో 400మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో కే జి హెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ విమ్స్ ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-25 14:27:24

అగ్నిప్రమాద బాధితుల పట్ల దుమంతి దాత్రుత్వం

కొయ్యూరు మండలం తాటిమానుపాకల గ్రామంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన 7 కుటుంబాలకు చెందిన బాధితులుకు దుమంతి సత్యన్నారాయణ తనవంతు సహాయం అందజేశారు. ఈ మేరకు గురువారం గ్రామంలో బాధితులకు 150 జతల బట్టలు, నిత్యవసర సరుకులు, ప్లాస్టిక్ బకెట్లు పంపిణీ చేసి తన దాద్రుత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో ఇళ్లుకోల్పోయిన వారు అదైర్య పడవద్దన్నారు. విషయం ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయడంతో తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి చేయూతనిచ్చిన తన స్నేహితులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ సుర్ల చందర్రావు, సుకంకరి బాలేసు, దుమంతి రామక్రిష్ణ, కిరణ్, దుంప సతీష్ తదితరులు పాల్గొన్నొరు.

Koyyuru

2023-02-23 16:24:49

శ్రీ పద్మావతి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట

చెన్నైలోని జిఎన్‌ చెట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ  పాంచరాత్ర ఆగమ సలహాదారు  శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు  ఎ జె శేఖర్‌ పాల్గొన్నారు. ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి రక్షాబంధనం, కళావాహనం చేసి నవధాన్యాలు, నవరత్నాలు, నవలోహాలతో ప్రతిష్ట చేశారు. అదేవిధంగా, కూర్మ, కుబేర, మహాలక్ష్మి యంత్రస్థాపన చేశారు.

Chennai

2023-02-23 13:20:34

అంతాడ తాటిమానుపాకల గ్రామంలో 4ఇళ్లు దగ్దం

కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ తాటిమానుపాలెం గ్రామంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కొర్రు వీర్రాజు, వెంకటేశ్వరరావు, దారమల్లేశ్, పాంగి శ్రీనులకు చెందిన నాలుగు ఇళ్లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. బట్టలు, బంగారం, వంట సామాగ్రి, అన్ని కాలిపోయా బాధితులు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంతో సుమారు  రూ.13 లక్షలు వరకూ ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. సంఘటన జరిగిన వెంటనే గ్రామ సర్పంచి చందు, కార్యదర్శి నాగమణి, డీఏ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ ప్రదేశాన్ని  సందర్శించారు. జరిగిన అగ్నిప్రమాదంపై మండల అధికారులకు తక్షణ సమాచారం అందించారు.

Anthada

2023-02-22 15:04:40

లక్ష్మీనారాయణ మద్దతుకోరిన పిడిఎఫ్ బృందం

ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీగా  పోటి చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్ధి డాక్టర్.కోరెడ్ల రమాప్రభకు మద్దతు ఇవ్వాలంటూ  మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణను మద్దతు  దారులు కలిశారు. మంగళవారం ఈ మేరకు విశాఖలో ఆయన నివాసానికి వెళ్లి కరపత్రం అందజేశారు. అభ్యర్ధి హామీలను వివరించారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిజాయితీ గల నాయకులను చట్టసభలకు పంపాలని అవినీతి రహిత రాజకీయాలు భవిష్యత్తుకి పునాదులు వేస్తాయని అన్నారు.  సమాజ అభివృద్దికి మేధావులు , సమాజ సేవకులు చట్టసభల్లో ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ  ప్రచారంలో పిడిఎఫ్ బృందం తరపున కె.లోకనాథం , ఎం.జగ్గునాయుడు , డాక్టర్ బి.గంగారావు ,తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-21 15:41:58

ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనలో తెలుగుభాష పట్ల గౌరవాన్ని ఇతర భాషలను ఆదరించే ఇంగితాన్ని ఒకభాష మరొక భాషపై పెత్తనం చాలాయించడాన్ని వ్యతిరేకించే స్ఫూర్తిని కలిగించాలని పైడా కృష్ణప్రసాద్, విజెఎఫ్ అధ్యక్షులు,సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, డా.ఎస్. విజయకుమార్ లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదండు ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లికి ఘనంగా నీరాజన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మాత్రుభాషను ప్రతీ ఒక్కరూ గౌరవించాలన్నారు. అధ్యక్షులు పరవస్తు సూరి మాట్లాడుతూ తెలుగు దండు ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని మాతృభాషను మ్రింగి వేసే మన దేశవాలి పాలకుల మూర్ఖపు చర్యలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. మాత్రుభాషలోనే విద్యాబోధన జరగాలన్నారు. ఫ్రొ.సూరప్పడు, ఎ.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2023-02-21 07:26:04

భక్తితో పాదయాత్ర చేస్తే ఆధ్యాత్మిక జీవశక్తి ప్రాప్తిస్తుంది

భద్రాచల పాదయాత్రికుల గురు స్వామి ఉంగరాలవీరవెంకట సుబ్బారావు(వాసుదేవఆచార్య)ను కాకినాడ స్వయంభు భోగి విఘ్నేశ్వరస్వామి పీఠంలో గణపతికిధారణ చేసినపూల మాలశేషవస్త్రాలతోవిశేషంగా సత్కరించి ఆధ్యాత్మికగ్రంధాన్ని బహూకరించారు. కాకినాడ, పెద్దాపురంప్రాంతాల హనుమదీక్షా పరులతో 12ఏళ్లుగా ఫిబ్రవరిలో భద్రాచల పాదయాత్ర చేస్తున్నారని పీఠం ఉపాసకులు దూసర్లపూడిరమణరాజుపేర్కొ న్నారు. గురుస్వామిమాట్లాడుతూ పీఠంలో ముహూర్తం చేసి విఘ్నాలు లేకుండా విష్వక్సేనప్రసాదంగా  పాదయాత్ర చేస్తున్నామన్నారు. రు.11లక్షల తోనిర్మించిన శ్రీరామ రథంతో మూడేళ్లుగా300మంది పాల్గొంటున్నారన్నారు. పాదయాత్ర లు మానవజీవితా నికి ఆధ్యాత్మిక జీవశక్తిని సిద్ధిస్తాయన్నారు. భజన సంకీర్తనలో  భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.

Kakinada

2023-02-21 07:05:41

APUWJF కాకినాడ రూరల్ నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కాకినాడ రూరల్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా సీనియర్ జర్నలిస్ట్ దాసరి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రెడ్డి నాయుడుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం కాకినాడ రూరల్ మండలం ఎంపిడిఓ కార్యాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.నవీన్ రాజ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా పలివెల శ్రీనివాస్(ఇమేజ్ న్యూస్), జాయింట్ సెక్రటరీగా శీలి లక్ష్మణ్ రావు (ప్రజా వార్త),కోశాధికారిగా పాలిక మోహన్ కుమార్ (అభయ్),సభ్యులుగా దొండపాటి సుధీర్ కుమార్ (ఈవేళ), పి.శ్రీనివాస్(సిక్స్ టీవీ),త్రిమూర్తులు(ఈజీ టీవీ),శ్రీనివాస్(ఆంధ్ర పత్రిక)లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో ఏళ్లుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని సంఘ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేస్తామన్నారు. కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు.

Kakinada Rural

2023-02-21 06:55:11

ఆదివాసీ గర్భిణీలకు డోలీ మోతలే శరణ్యమా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక నేటికీ ఆదివాసీ గిరిజనులు డోలీల్లోనే గర్భిణీలను, రోగులను దవాఖానాలకు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని జనసేన అరకు పార్లమెంటు ఇన్చార్జి వంపూరు గంగులయ్య ఆరోపించారు. ఈరోజు పెదబయలు మండలంలో గుల్లెలు పంచాయతీ శివారు ప్రాంతానికి చెందిన బోండా రాజులమ్మ అనే గర్భిణీని డోలీలోనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఇలాంటివేమీ అధికార వైఎస్సార్సీపీ పార్టీకి కనిపించడం లేదన్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, గిరిజనులకు ఉపాది ఈ ప్రభుత్వంలో పూర్తిగా కరువయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఎందరో గిరిజనులు డోలీమోతల్లోనే తనువు చాలించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మారుమూల గ్రామాలకు వైద్యసేవలను కల్పించి ఆదుకోవాలని గంగులయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Paderu

2023-02-20 11:35:20

1988 తరువాత తాజాగా దర్శించా..కంచి పీఠాధిపతి

సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి అత్యంత మహిమాన్వితులని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామిపేర్కొన్నారు. శంకరమఠంలో విడిది చేసియు న్న స్వామిని సోమవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకొని సింహాద్రినాధుడు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి పలు అంశాలు వెల్లడించారు. 1988 తరువాత తాను ఇటీవలే సింహాచలం ఆలయాన్ని సందర్శించి సింహాద్రినాధుడిని దర్శించుకున్నట్టు చెప్పారు. ఆలయంలో శాసనాలను తాను నిశితంగా పరిశీలించానన్నారు. వేద పాఠశాల, గోశాల నిర్వహణ మెరుగ్గా ఉన్నాయని అయితే మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్వామి అభిప్రాయపడ్డారు. సింహాచలం ఆలయ అభివృద్ధిలో ధర్మకర్తలుగా పూర్తి స్థాయిలో సేవలందించి భక్తులు మన్ననలు పొందేలా చూడాలని స్వామి శ్రీనుబాబుకు సూచించారు.

Visakhapatnam

2023-02-20 09:02:29