1 ENS Live Breaking News

ఎఫ్.డి.సి ముందస్తు షెడ్యూల్ తెలియజేయాలి

ఫ్యామిలీ డాక్టరు విధానం (ఎఫ్.డి.సి)లో గ్రామాల పర్యటన షెడ్యూల్ ముందుగా తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు అన్నారు. వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో సోమ వారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టరు వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బం ది నిర్వహిస్తున్న రిజిస్టర్లు, కేస్ స్టడీ షీట్ లను పరిశీలించారు. వైద్య శిబిరం వద్దకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడారు. వైద్య సేవలు, మందులు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. మందులు సూచనల మేరకు వేసుకోవాలని తద్వారా వ్యాధులు త్వరగా నయం అవుతాయని చెప్పారు. ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్యామిలీ డాక్టరు వైద్యానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ప్రేమ ఆప్యాయతతో వైద్య సేవలు అందించాలని డి.ఎం.హెచ్.ఓ వైద్యులు, వైద్య సిబ్బందిని సూచించారు.

 వైద్య పరీక్షలు చేసి అవసరమగు మందులు ఇస్తూ సూచనలు పక్కాగా చేయాలని ఆయన చెప్పారు. పౌష్ఠిక ఆహారం గూర్చి వివరించాలని, సంపూర్ణ పోషణ అభియాన్ కిట్లు అందుతున్నదీ లేనిది గుర్తించాలని అన్నారు. బిపి, మధుమేహం, కిడ్నీ, కేన్సర్ వంటి అంటు వ్యాధులు (ఎన్.సి.డి) కాని వాటితో పాటు అంటువ్యాధులు (సి.డి) పై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డా. ఉమా మహేశ్వరి, డెమో వై. యోగేస్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Veeraghattam

2023-02-20 06:36:01

ఇలా డోలీలోనే లోకం చూడబోయే ప్రాణాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ గిరిజన మహి ళలు, వారి కడుపులోని లోకాన్ని చూడబోయే ప్రాణాలు డోలీలో ఊగిసలాడుతున్నాయి. కనీసం గ్రామం నుంచి ప్రధాన రహదారికి వెళ్లడానికి రహదారి లేకపోవడంతో ప్రాణం మీదకు వచ్చిన గర్భిణీ స్త్రీలను అక్కడి గిరిజనులు డోలీలోనే మోసుకెళ్లాల్సిన దుస్తితి ఏర్పడింది.  జిల్లాలో పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీకి చెందిన రెంజల మామిడి గ్రామంలో రోడ్డు లేక ఒక నిండు గర్భిణీ స్త్రీ డోలీ మీదనే  గ్రామస్తులు ఐదు కిలోమీటర్లు రోడ్డు వర కూ తీసుకు వెళ్లారు. మార్గ మధ్యలో ఏం జరిగినా సేవలు అందించడానికి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూడా డోలీతోనే రోడ్డు వరకూ వెళ్లారు. ఇక్కడి గ్రామస్తులు గమ గ్రామానికి రోడ్డు కావాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికికా ఐటీడీఏకి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో హామీలు ఇచ్చే నేతలు.. తరువాత మళ్లీ సదరు గ్రామాలను కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనితో ఏళ్ల తరబడి కనీస రహదారి సౌకర్యానికి కూడా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు నోచుకోవడం లేదు.

Peda Bayalu

2023-02-20 06:07:34

గిరిజన విలేకరుల సంఘం భారీ అన్నసమారాధన

మహాశివరాత్రి మహోత్సవం  సందర్భంగా హుకుంపేట మండలం మత్స్యగుండం, అడ్డుమండ లో గిరిజన విలేకరుల (సేవా) సంఘం ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయాల్లో స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల ఆకలి తీర్చడానికి మంచి కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన గిరిజన విలేకరులకు సేవా సంఘం సభ్యులను  అభినందించారు. పుణ్యక్షేత్రాల్లో భక్తుల దాహార్తిని తీర్చడానికి చేసిన ఏర్పాట్లు ఎంతో చక్కగా ఉన్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, తశీల్దార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Hukumpeta

2023-02-18 14:30:33

కాకినాడ బర్మా కాలనీలో "జ్యోతిర్లింగార్చన"

కాకినాడ ఆర్ టి సి కాంప్లెక్స్ వెనుక వున్న బర్మా కాందిశీకుల కాలనీలో గణేశ మందిరం వద్ద  శనివారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. కోలా ఎల్లారావు ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం నందు భోగిగణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీపపు జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధిస్తూ చేపట్టే సమైక్య జ్యోతిర్లింగార్చన  వలన సమతా భావం ఏర్పడుతుందన్నారు. లోకకల్యాణం సిద్ధించే మహాశివరాత్రి లయ బద్దమైన సృష్టి ప్రగతికి నాందిగా భక్తులు  విశ్వసిస్తారన్నారు.

Kakinada

2023-02-18 14:18:02

భోగి విఘ్నేశ్వరస్వామి పీఠంలో 'శతకోటి'శివనామపారాయణ

మహాశివరాత్రి సందర్భంగా స్వయంభు కాకినాడ శ్రీవిఘ్నేశ్వర స్వామివారి పీఠంలో శనివారం శతకోటి శివనామపారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెలకొల్పిన ధర్మోకోల్ శివలింగం విశేషంగా అలరించింది. ఉదయం నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివుడిని దర్శించుకున్నారు. పంచామృతాలతో స్పటిక శివలింగానికి అభిషేకం చేశారు.  శివరాత్రి జాగరణ చేపట్టిన పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ,  జన్మకోశివరాత్రిగా  సృష్టి నిలయం చేసే కాలస్వరూపుని ఆరాధనను ప్రకృతి తత్వంతో చేపట్టాలన్నారు. శివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనం ముక్తిదాయకమన్నారు.  భోగి గణపతికి  సంపూర్ణ కాంస్య కవచ ధారణ.. 208 కేజీల వరిధాన్యం తో మహాఅన్నాభిషేకం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు అటుకుల ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Kakinada

2023-02-18 14:14:56

శివరాత్రి రోజు పరమశివుని దర్శనం ముక్తిదాయకం

లోకానికి వెలుగులు నింపే ఆ పరమశివుడిని శివరాత్రి రోజు దర్శించుకుంటే అంతకు మించిన ముక్తి దాయకం మరొకటి ఉండదని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం బీచ్ రోడ్ లో డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి సేవా పీఠం ఏర్పాటు చేసిన  కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో కలిసి స్వయంగా శివలింగానికి వీరు అభిషేకం నిర్వహించా రు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా బీచ్ రోడ్ లో కోటి శివలింగాలని ఏర్పాటు చేసి భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించడం, ప్రత్యేక తీర్థ మహోత్సవం ఏర్పాటు ,సాయంత్రం సాంస్కృతికార్యక్రమాల నిర్వహన ప్రశంసనీయమన్నారు.

Ramakrishna Beach

2023-02-18 07:22:39

కొయ్యూరు మల్లికార్జున ఆలయంలో భారీ అన్నదానం

అల్లూరి జిల్లా కొయ్యూరులో ఎంతో ప్రసిద్దిగావించిన శ్రీబ్రమరాంభిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం మహా శివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. దీనితో వారికి అన్నప్రసాదాలను జిసిసి మాజీ చైర్మన్ ఎంవీపీ ప్రసాద్,  పాడేరు టిఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి అనిశెట్టిచిరంజీవి  అందించారు. ఈ సందర్భంగా ఎంవీవీ ప్రసాద్ మాట్లాడుతూ, స్వామివారి ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. శివరాత్రి పర్వదినం రోజున స్వామిని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయని, అందునా ఈఏడాది వచ్చిన  శివరాత్రి 20ఏళ్ల తరువాత వచ్చిందని అన్నారు. భక్తులందరికీ అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


Koyyuru

2023-02-18 06:47:51

తూ.గో.జి.లో ఎన్నామ్మార్ కార్మికుల వేతనాల సవరణ

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎన్. ఎం. ఆర్ (NMR) కార్మికులకు, ఉద్యోగులకు రోజువారీ వేతనాల స్థిరీకరణ,ఉత్తర్వులు మేరకు వారి వేతన సవరణ చేసినట్టు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు. రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం
కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఎమ్ ఆర్ ఉద్యోగుల కార్మికులకు చెందిన రోజువారీ వేతనాలను నిర్ణయించే  జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , జిల్లాలో  2022-23 ఆర్థిక సంవత్సరానికి  జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు,  సంస్థల్లో పనిచేస్తున్న నైపుణ్యం, కొద్ది పాటి నైపుణ్యం, నైపుణ్యత లేని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులు  ఆయా నైపుణ్య వర్గాల వారి దినసరి వేతనం నిర్ణ ఇస్తూ కమిటీ ఆమోదం తెలపడం జరిగిందని పేర్కొన్నారు.

నైపుణ్యం  కలిగిన వారికి రోజుకు రూ.750/-  సెమీ స్కిల్ కలిగిన రోజుకు రూ.565/-, నైపుణ్యత లేని వారికి రోజుకు రూ.525/- ల చొప్పున నిర్ణయం చేస్తూ కమిటీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈరోజు కమిటీ నిర్ణయం మేరకు ఈ వేతనాలను 2022-23 ఆర్థిక సంవత్సరం నకు అమలు చేయడం తో పాటు, బకాయిలు చెల్లించాలని కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఉత్తర్వులను సర్క్యులేట్ చెయ్య వలసినదిగా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వల్లి ని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ లేబర్ బి ఎస్ ఎం వెళ్లి, ఈ ఈ ఆర్ అండ్ బి.  ఎస్ బి వి రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఏ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఇరిగేషన్   తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-02-17 14:47:49

ఏపీలో పోలీసులు YSRCPమాన్యువల్ వాడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అధికారిక మాన్యువల్ ను పక్కనపెట్టి వైఎస్సార్సీపీ మాన్యువల్ ను వాడుతున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడం చేతగానితన మన్నారు.  తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు సభలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేరశారు. ఢిల్లీ నే ఎదిరించిన దమ్మున్న నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ధైర్యం చంద్రబాబును ని చూసి ఎటు పోతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడి సభలకు రక్షణ కల్పించలేని చేతగాని ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఆటంకం కలిగిస్తే నేడు అధికారంలోకి వచ్చేవాడా? అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకొని చేస్తున్న చేతకాని పనులను ఆపాలన్నారు.

Visakhapatnam

2023-02-17 13:40:03

వామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పూజలు

మాకవరపాలెం మండలంలోని పెద్దమిల్లు జంక్షన్ లోఉన్న వామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు దొరబాబుశర్మ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ శివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉందని, 22 ఏళ్లకు ఒకసారి ఇలా వస్తుందన్నారు. శివునితోపాటు, శనిశ్వర పూజలు చేయించుకోవడం ద్వారా ఏలినాటి శనిదోషాలు నివ్రుత్తి అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే  ఆలయంలో తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభంవుతాయన్నారు. దానికోసం ఇప్పటికే ఆలయంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తామని,  ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Makavarapalem

2023-02-17 13:27:07

జగనన్న గృహాలను త్వరగా పూర్తి చేయాలి


జగనన్న గృహాలను త్వరగా పూర్తి చేయాలని మాకవరపాలెం మండల ప్రత్యేక అధికారి రమేష్ లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని రాచపల్లి, రామన్నపాలెం జగనన్న కాలనీలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఉగాదినాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేసేలా చూడాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  ఆయన వెంట ఎంపీడీవో అరుణశ్రీ, హౌసింగ్ అధికారులు ఉన్నారు.

Makavarapalem

2023-02-17 13:23:02

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం..

గాజువాక గంగవరం పోర్టు లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 74 వ వార్డు సిద్దేశ్వరం గ్రామానికి చెందిన గొరుసు సత్యారావు మృతి చెందాడు. బాధిత కుటుంబానికి  నష్టపరిహారం కింద కాంట్రాక్టర్ అప్పారావు, రూ.5 లక్షలు ప్రకటించారు. ఆ మొత్తాన్ని  చెక్ రూపంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మృతుడు భార్య అప్పల నరసమ్మ కు వార్డు కార్పొరేటర్ తిప్పల వంశి రెడ్డి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు. బాధితకుటుంబాని అండగా ఉంటామని అదైర్య పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గోరుసు సత్యారావు నాయుడు గోరుసు గురునాధ రెడ్డి గోరుసు చిన్న అప్పారావు గోరుసు సత్యం గోందేశీ తోట సత్యరావు,  అప్పారావు సతీష్ , సత్తిరెడ్డి భద్ర ఆనంద్ ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.

Gajuwaka

2023-02-17 11:33:16

సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కరానికి చర్యలు

ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కారానికై మండల పంట కాలువల స్థాయిలో బృందాలు నియమించి నిత్యం పర్యవేక్షించనున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు . శుక్రవారం సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కార సరళిని పరిశీలించేందుకై ఉప్పలగుప్తం వచ్చినట్టు పేర్కొన్నారు. మండల పరిధిలోని కూనవరం  డ్రైనేజ్ డివిజన్ పరిధిలోని కొరగనమూడి మైనర్ డ్రైయిన్ పై వేసిన క్రాస్ బండను ఆయన పరిశీలించారు. దీనిలో భాగంగానే డ్రైయిన్లో వేసిన క్రాస్ బండ్లను పరిశీలించి కాలువ చివరి భూము లకు సాగునీరు సరఫరా అవుతున్నది, లేనిది నిత్యం బృందాలు పర్యవేక్షించి, సరఫరా కాబడేలా చర్యలు తీసుకుంటారన్నారు. పంట చివరి దశ వరకు సాగునీరు ఈ బృందాలు పర్యవేక్షణలో సరఫరా చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రాస్ బండి మూలంగా ఎంత మేర విస్తీర్ణ ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతుందని స్థానికoగా వున్న అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

  ఈ సందర్భంగా  ఉప్పునీరు ఈ డ్రైయిన్ ద్వారా పొలాలకు చేరకుండా కేవలం, బ్యాక్ వాటర్ మాత్రమే పొలాలకు ఈ డ్రైయిన్ మూలంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా సముద్రపు ఆటుపో టులు సమయంలో ఈ డ్రైయిన్ ద్వారా ఉప్పునీరు పంట పొలాలకు చేరకుండా దోహదపడుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సర్కిల్ ఎస్. ఇ ఇ  జి.శ్రీనివాస రావు డ్రైనేజీ డివిజన్ కార్యనిర్వ హక ఇంజనీర్ కె సుబ్బయ్య, జల వనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఇ. ఇ. డి వి రామగోపాల్, డ్రైనేజీ డివిజన్, డివిజనల్ ఇంజనీర్ ఎం వి వి కిషోర్, జల వనరుల శాఖ డి ఇ  బి శ్రీనివాసరావు, తాసిల్దార్ జె వెంకటేశ్వరి , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కాకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Uppalaguptam

2023-02-17 07:22:23

అన్నవరంలో సత్యదేవుని ఆన్ లైన్ సేవలు

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో నేరుగా స్వామివారి సేవల్లో పాల్గొనలేని భక్తుల కోసం దేవస్థానం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.  స్వామివారి వ్రతం(ప్రతీరోజూ ఉ.9.కి)-రూ.1116, స్వామివారి నిత్య కళ్యాణం(ప్రతీరోజూ ఉ.9.కి) రూ.1500, ఆయుష్ హోమం(ప్రతీరోజూ ఉ.9కి.) రూ.2116, వనదుర్గా అమ్మవారి ప్రత్యంగిర హోమం(ప్రతీ శుక్రవారం) రూ.1116, శ్రీ కనక దుర్గా అమ్మవారి చండీ హోమం(మూలా నక్షత్రం రోజున) రూ.1116,  సూర్య నమస్కారాలు(ఆదివారం) రూ.1116, సత్యదేవుని అభిషేకం(మక నక్షత్రం రోజున) రూ.3116, సేవలకు ముందుగా( HDFCBANK-50100143 509400, HDFC0004010(IFSC)) ద్వారా నగదు చెల్లించి వివరాలు ఈఓ కార్యాలయంలోని 8519813124 ఈ నెంబరుకు వాట్సప్ ద్వారా తెలియజేయాల్సి వుంటుంది.

Annavaram

2023-02-17 03:14:18