ప్రత్తిపాడు మండలం గోకవరం అటవీ ప్రాంతంలోని సారాబట్టీలపై గురువారం ప్రత్తిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. అశోక్ సారా బట్టి ఫై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా కాస్తున్న రామోజీ కన్నారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లుగా ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, గుట్టు చప్పుడు కాకుండా సారా కాస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. పరారైన వ్యక్తి శంఖవరం మండలం పెద్దమల్లపురం వాసిగా ర్తించామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి 200 లీటర్ల పలుపు తోపాటు పది లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా, వాటికి అవసరమైన ముడిసరుకులు అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ప్రత్తిపాడు ఎస్ఈబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా సేవలు అందజేస్తున్న కింగ్ జార్జ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన సేవలు మరింతగా అందించాలని నేవల్ డాక్ యార్డ్ కేటిబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. బుధవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.పి. అశోక్ కుమార్ ను అసోసియేషన్ సభ్యులు బృందం మర్యాదపూర్వకంగా కలిసి సింహాద్రినాధుని జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబుతో పాటు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలతో పాటు వసతి సౌకర్యాలు కూడా మరింతగా మెరుగుపడ్డాయి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో రోగులకు మరింత సేవలు అందించేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అద్యక్షులు బత్తుల చిరంజీవి, రమణ , తదితర సభ్యులు, పలువురు పాల్గొన్నారు.
నిరుపేదల ఆరోగ్యం పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం భాద్యతగా ఉంటుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని ఆర్లి గ్రామానికి చెందిన బొలెం ఎర్రా పాత్రుడు అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు పొందారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కు తారువలోని డిప్యూటీ సీఎం కార్యాల యంలో దరఖాస్తు చేసుకోగా రూ. 44 వేలు మంజూరు అయ్యాయి. ఆ చెక్కును సంబంధిత వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కోటపాడులో అందజేయ డం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి మోహన్ తదితరుల పాల్గొన్నారు.
బైజూస్ యాప్ వినియోగం పై ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ఈ యాప్ ద్వారా సోషల్ స్టడీస్ ను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను నిర్వహించాలని డి.ఈ.ఓ లింగేశ్వర రెడ్డి కి సూచించారు. మంగళవారం కలెక్టర్ చీపురుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ను డి.ఈ.ఓ తో కలసి సందర్శించారు. 10 వ తరగతి పిల్లలు పరీక్షల కోసం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నది వారితో మాట్లాడి తెలుసుకున్నారు. బై జ్యూస్ యాప్ ఎలా ఉపయోగపడు తున్నదీ అడిగారు. 10 వ తరగతి లో అందరూ మంచి రాంక్ లలో పాస్ కావాలని అన్నారు. పాఠశాలలోనే కెరీర్ గైడెన్స్ తరగతులను నిర్వహించాలని హెచ్.ఎం.కు సూచించారు. బాలికలతో మాట్లాడుతూ సఖి బృందాల సమావేశాలకు హాజరావుతున్నారా అని ప్రశ్నించారు. పాఠశాలల్లో, హాస్టళ్ల లో జరుగుతున్న సఖి సమావేశాలకు బాలికలంతా తప్పకుండా హాజరు కావాలన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, గిరిజనులకు ద్రోహం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి అన్నా రు. మంగళవారం పాడేరు మండలం మోదపల్లి పంచాయతీలో మోదా పెళ్లి, రాజాపురం, బుర్ర గరువు గ్రామాల్లో టిడిపి పాడేరు నియోజకవర్గం సీనియర్ నాయకులు బుర్ర నాగరాజు, కొట్టగుళ్లి సుబ్బారావు అధ్యక్షతన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబా బునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పా గిరిజనులకు మేలు జరగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిసిసి చైర్మన్ ప్రసాద్ , ఎక్స్ జెడ్పి చైర్మన్ వంజంగి కాంతమ్మ, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, బుర్ర విజయ రాణి, బాకూరి బాలరాజు, వణుకు దేవుడు రాములమ్మ వినోద్ నాయుడు, బారా సత్యనారాయణ, స్థానిక యువతి యువకులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామపంచాయతీ పరిధి ఎల్విన్ పేట పరిసర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కాలువలలో పూడికల తీయకపో వడంతో దోమలు పెరిగి వివిధ రోగాలు స్థానికులు జ్వరాల భారిన పడుతున్నాయి. పబ్లిక్ కుళాయిల నుండి వచ్చే నీరు కూడా ప్రజల పట్టుకోడానికి వీలు లేకుండా మురి కి కాలువలతో నిండిపోయి ఉన్నాయి. గ్రామపంచాయతీలో సేకరించిన చెత్తని కొమరగిరి వెళ్లే రహదారిలో పోయిటవలన ఆ రహదారి నుండి ప్రయాణించాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. గ్రామపంచాయతీ విస్తరణ అధికారి ఏం చేస్తున్నట్టో తెలియడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. హరిజనపేట ప్రాంతంలో పాఠశాల నిర్మాణంలో ఉండటంతో పక్కనే ఉన్న సామాజిక భవనంలో వారి స్కూలు ఏర్పాటు చేశారు. ఈ వేసవికాలంలో పిల్లలు చదు వుకునేలాగా చుట్టూ పరదాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము డిమాండ్ చేశారు.
స్వతంత్ర భారతదేశంలో తొలితగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిస్వార్ధంగా సేవలు అందించారని గ్రంథాలయ విశ్రాంతి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో ఆయన జన్మించారని అన్నారు. ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారన్నారు. వితంతువులు, వృద్ధులకు ప్రతినెల పెన్షన్ చెల్లించే పథకాన్ని ప్రవేశపెట్టి, అవినీతిని నిర్మూలించడానికి ఏసీబీను ఏర్పాటు చేశారన్నారు .ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆయన పేరుమీద స్టాంపు కూడా విడుదల అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా ,రేలంగి బాపిరాజు, ఎస్. శ్రీ నగేష్ పాల్గొన్నారు.
భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎయిర్ పోర్టు సలహా మండలి సభ్యులు, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం పరవాడ మండలంలోని వాడచీపురుపల్లి, దళాయపాలెం పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత శ్రీ రామచంద్ర అమ్మవారి తల్లి పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీనుబాబు కుటుంబ సభ్యులు దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి అమ్మవారు భక్తులపాటి కొంగుబంగారమని ఎంతో మహిమాన్విత మాతగా అభివర్ణించారు. ఆలయ ఆవరణలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అత్యంత ప్రశంసనీయముగా ఉన్నాయని అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీనుబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
కౌ హగ్ డేకి ప్రాధాన్యత కల్పించడం ద్వారా గోవుల యొక్క ప్రాముఖ్యత విశ్వవ్యాప్తం అవుతుందని సామాజిక కార్యకర్త విజిగిరి బాలభానుమూర్తి అన్నారు. మంగళవారం సింహాచలం గోసాలలో ఈ సందర్భంగా గోవులను హత్తుకొని కౌ హగ్ డే ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతినిత్యం గోవుల నుంచి వచ్చే పాలను, వెన్నను, నెయ్యిని, మజ్జిగను మనం సేవించి ఆరోగ్యం పొందుతున్నామని, అదేవిధంగా గోవుల పేడ, గోమూత్రంతో సేంద్రియ ఎరువుగా నేల సారవంతం అవుతుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. గోవులను దేవతలుగా పూజించే భారతదేశంలో కౌ హగ్(గోవును హత్తుకోవడం)ను అలవాటు చేసుకోవాల న్నారు. తద్వారా ప్రేమాభిమానాలు, జంతుప్రేమ విలువ మరింత మందికి చేరువ అవుతుందని చెప్పారు. భారతీయ సంస్కృతికి గోవులు వెన్నెముకని, గోవులు, మూగ ప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవడం లో సంస్కృతిలో ఒక భాగం అని గుర్తు చేశారు.
అతివేగం, ఓవర్ లోడుతో వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాడు సిఐ కె.కిషోర్ బాబు వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు భద్రత చర్యలలో భాగంగా సోమవారం ప్రత్తిపాడు నుండి ఏలేశ్వరం రోడ్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహన డ్రైవర్లకు, ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కోరాదని, తప్పని సరిగా యూనిఫాం ధరించాలని అన్నారు. అదేవిధంగా అన్ని రికార్డు లు కలిగి ఉండాలని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను ఎక్కించుకొరాదనీ, ప్రయాణీకులు కూడా కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణాలు చేయకూడదన్నారు. పరిమిత వేఘం పాటించాలని సూచించారు. ఏ ఒక్కరు నిబంధనలను అతిక్రమించినా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని వాహనాలకు జరిమానాలు కూడా విధించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న ప్రజావ్యతిరేక వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం.వి.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం అంజలి శనివారం గ్రామంలో ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం చర్యల వలన పన్నుల భారం ప్రజలపై పుడుతుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం మళ్లీ టిడిపిని అధికారంలోకి తెచ్చుకో వాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి , మాజీ మండల అధ్యక్షులు బేరా సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు కిముడు లక్ష్మ య్య, మాజీ యం.పి.టి.సి పొత్తూరు రామారావు, వైస్ సర్పంచ్ కుమారి, శ్యాం సుందర్, నారాయణరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో టిడిపి అధినేత, జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా ఒకప్రకటనలో కోరారు. ఈ మేరకు ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15 న తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జగ్గంపేటలో జరిగే భారీ బహిరంగ సభకు సాయంత్రం ఐదు గంగలకు హాజరవుతారని అన్నారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో ఈ సభకి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంతేకాకుండా ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు పెద్దాపురం లో కూడా చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారని ఆ సభను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని మండలాల నాయకులకు సమాచారం పంపించినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
టర్కీ, సిరియా భూకంప బాధితులకు తమ వంతు సహాయాన్ని విశాఖ జిల్లా గాజువాక ప్రాంత ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆపన్న హస్తాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైజాగ్ గాజువాక ఆల్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు రూ.1.80క్షలు నగదుతోపాటు, రెండు టన్నుల రిలీఫ్ మెటీరియల్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గాజువాక అజీమాబాద్ దీనియత్ ట్యూషన్ సెంటర్ వద్ద రిలీఫ్ మెటీరియల్ తో బయలుదేరిన వాహనాలను ఫెడరేషన్ అధ్యక్షుడు షాహిద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూకంప బాధితులను ఆదుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హయాజ్ అలీ, నశీర్, జాఫర్, ఫరూక్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను ఫిబ్రవరి 14న లెక్కించనున్నట్లు సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాకి ఒక ప్రకటన విడుదల చేసారు. మంగళ వారం ఉదయం 08.00గం.లకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనువంశిక ధర్మకర్త,అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరిచి, నిబంధనల ప్రకారం లెక్కింపు జరుపుతామన్నారు. ఆ మొత్తాలను స్వామివారి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు చెప్పారు. ఈ లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.