1 ENS Live Breaking News

సోమవారం జివిఎంసీలో “స్పందన”

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు  కమిషనర్ పి రాజబాబు  తెలియజేశారు. ఈ  కార్యక్రమాన్ని జివిఎంసి ప్రధాన కార్యాలయంలో జరుగుతుందన్నారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కమిషనర్ మీడియాకి విడుదల చేసిన ప్రకటన లో పేర్కొన్నారు. జివిఎంసీతోపాటు, అన్ని వార్డులలోని వార్డు సచివాలయాలు, జోన్ కమిషనరేట్లలో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

Visakhapatnam

2023-02-12 14:35:44

వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో మనం ఖర్మ అనుభవిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఖర్మ అనుభవిస్తున్నారని మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి పేర్కొన్నారు. ఆదివారంపాడేరు నియోజకవర్గంలోని గొండెలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్  యంవివి.ప్రసాద్ కలిసి  ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. అనంతరం ఇదే గ్రామంలో వికలాంగుల పింఛను కోల్పోయిన రొబ్బ లక్ష్మమ్మ, బొయిని పోలమ్మ లను పరామర్శించి, అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తొలగించిన పెన్షన్ విషయం తీసుకెళ్లి వెంటనే పునరుద్ధరణ చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు, మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి,  స్థానిక నాయకులు కిముడు నారాయణ నాయుడు,  కిముడు రామలింగం నాయుడు, రొబ్బ బొంజుబాబు , బాలయ్య దొర, ఉమామహేశ్వర నాయుడు, దళపతి రాజయ్య, ఈశ్వర్ నాయుడు  అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Paderu

2023-02-12 07:09:55

ఈ ఒక్క వీడియోతో మీరూ ఇంగ్లీషులో మాట్లాడేస్తారు

భారతదేశంలోనే స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవడానికి అత్యుత్తమ వీడియో ఇది. స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుడు మనోహర్ సర్ ఎంతో చక్కగా ఇంగ్లీషు భాషపై భయం పోగొట్టి.. తెలుగు మీడియం విద్యార్ధులు, గ్రుహిణిలు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడాలనే ఎంతో ద్రుఢ సంకల్పంతో  రూపొందించిన  మంచి వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఎవరైనా 70% ఇంగ్లీషులో మాట్లాడేస్తారు. చూడకపోతే మాత్రం ఆణిముత్యంలాంటి స్పోకెన్ ఇంగ్లీషు క్లాస్ చాలా మిస్ అయిపోతారు.. ఇది మాత్రం పక్కా..!

Visakhapatnam

2023-02-11 13:48:37

ప్రతీ ఒక్కరూ దిశయాప్ ఇనిస్టాల్స్ కి ముందుకి రావాలి

సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్ధులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని గ్రామసచివాలయ మహిళాపోలీస్ జిఎన్ఎస్.శిరీష సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూలులోని విద్యార్ధులకు సైబర్ నేరాలు, వాటి రకాలు, తీసుకోవాల్సిన జగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు ముఖ్యంగా ఆన్లైన్ లో డబ్బులుపెట్టి ఆడేఆటలకు దూరంగా ఉండాలన్నారు. ఆసమయంలో వచ్చే ఫోన్ చేసి మాట్లాడేవారికి ఓటీపీలు, బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఆధార్ నెంబర్లు చెప్పకూడదన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి లక్కీడిప్ లో ప్రైజులు వచ్చాయని చెప్పే కల్లబొల్లి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగినా ఎందుకు సమాధానం చెప్పాలని గట్టిగా గద్దించాలని, లేదంటే ఈనెంబరుతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని దైర్యంగా  చెప్పాలన్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్ధులే తెలిసేలా చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-02-11 13:30:20

వంజరి గ్రామంలో ఇదేం కర్మ-మన రాష్ట్రానికి

పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలం వంజరి గ్రామంలో  ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమం మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింద న్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం వి వి ప్రసాద్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగాలు లేవని, కూలీలకు పనులు కూడా లేకుండా చేసిన ఘనత వైఎస్సార్సీపీ పార్టీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంటింటికీ తిరిగి వైఎస్సార్సీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  టిడిపి రాష్ట్ర కార్యదర్శి  బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, జిల్లా మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు , మహిళా ప్రధాన కార్యదర్శి  బొర్రా విజయరాణి , బొడ్డేటి వరలక్ష్మీ, ఉల్లి లక్ష్మయ్య, పొత్తురు రామారావు, శ్యాం సుందర్, చిరంజీవి, పరశ్ రాము  అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


G.Madugula

2023-02-10 06:18:42

తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 59,090 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.03 కోట్లు వచ్చింది. 22,593 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-10 02:26:55

విద్యార్ధులకు క్రమంతప్పకుండా వైద్యపరీక్షలు చేయాలి

పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీ  పరిధిలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ  పాఠశాల (బాలిక) శ్రీకృష్ణ పురం లో చదువుతున్న  విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు  నిర్వహించినట్టు పాడేరు అదనపు జిల్లా   వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ తెలియజేసా రు.   జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మినుములూరు సిబ్బంది 617 మంది విద్యార్థినులలో 603 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  వీరిలో 32 మంది రక్తహీనత, చర్మ వ్యాధులు, దగ్గు, తక్కువబరువు, కంటి చూపు మరియు చెవి, దంత సమస్యలు  మున్నగు వ్యాధులతో బాధపడుతున్న వారికి పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని 4 మంది విద్యార్థినులకు ఇతర పరీక్షల కొరకు జిల్లా ఆసుపత్రి పాడేరులో తరలించి తదుపరి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అనుమానిత సికిల్ సెల్ అనీమియా కేసులను గుర్తించి తదుపరి పరీక్షల కొరకు జిల్లా ఆసుపత్రి పాడేరు తరలించి తదుపరి నిర్ధారణ పరిక్షలు జరిపించాలని సూచించారు.  వైద్యాధికారులు  క్షేత్ర స్ధాయి  సిబ్బంది శిబిరాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం కిచెన్ గదిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. శిబిరంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి.బి అధికారి డా. టి.విశ్వేశ్వరరావు గారు,   వైద్యాధికారి డా. కె బాబ్జి, పాడేరు జిల్లా ఆసుపత్రి ఆర్.బి.ఎస్.కె మేనేజర్ కిషోర్,  ఫిజియోథెరిపిస్టు మౌనిక, పాడేరు పి.ఓ డి.టి.టి కార్యాలయ ఆరోగ్య విస్తరణ అధికారి బి లక్ష్మణ్ ,  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ  (బాలికల) పాఠశాల శ్రీకృష్ణ పురం  ఉపాధ్యాయినులు, ఇతర వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.

Minumuluru

2023-02-09 13:57:02

నవోదయ దరఖాస్తుకు గడువు పొడిగింపు

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించడం జరిగిందని శంఖవరం మండల విద్యాశాఖ అధికారి ఎస్వీరమణ తెలియజేశారు. ఆయన  గురువారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం నవోదయకు గడువుపెంచినందున.. ఆసక్తి గల విద్యార్ధిని, విద్యార్థులు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తమ పాఠశాల పిల్లలను ప్రోత్సాహించి  నవోదయ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే విధంగా చూడాలన్నారు. 

Sankhavaram

2023-02-09 12:40:28

బకాయిలు ITDA చెల్లించేవరకూ ఉద్యమిస్తాం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ రైతుల బకాయిలు ఐటీడీఏ చెల్లించేవరకూ ఉద్యమం ఆపేది లేదని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోమ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గురువారం ముంచం పుట్టు మండలంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017 నుండి రైతులకు రావలసిన కాఫీ బకాయి సుమారు 60 కోట్ల పైచిలుకు ఉందని ఈ బకాయి చెల్లించడంలో ఐటిడిఏ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుండి ప్రోత్సహం రైతులకు లేకపోవడం వల్లనే కాఫీ పంటకు అంతరాయం ఏర్పడి.. రైతులు భూములు ఖాళీగా ఉండిపోయాయన్నారు.  లక్ష్యం పురం సర్పంచ్ కొర్ర త్రీనాథ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉన్న మన అరకు ఆర్గానిక్ కాపీని అభివృద్ధి చేయడంలో ఐటిడిఏ చొరవ చూపించాలని రైతులకు ఇవ్వవలసిన ప్రోత్సహకం ఇస్తూ కాఫీ సాగులో ఉన్న అటవీ భూములకు పోడుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండించిన కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్లు అందించి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కాఫీ మిరియాలు రైతులకు ఉచితంగా నిచ్చెనలు కట్టర్లు తరఫున పంపిణీ చేయాలని కాఫీ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. జిసిసి ద్వారా రుణాలు కాపీ పంట మిరియాలు కొనుగోలు చేయాలని అనేక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం 17వ తారీఖున పాడేరు ఐటిడిఏ వద్ద ఉద్యమం చేపడుతున్నామని పేర్కొన్నారు. అంతకుము సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.నర్సయ్య, మండల అధ్యక్ష కార్యదర్శి లు నారాయణ ఎంఎం .శ్రీను , కాఫి రైతులు సంఘం కన్వీనర్ గాసిరం  శంకర్ దోంబ్రు దిన్నబంద్ గణపతి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ కాఫి రైతులు పాల్గొన్నారు.

Munchingi Puttu

2023-02-09 10:33:34

ఆమ్ల ప్రభావంతో దంత క్షయ సమస్యలు

ఉదరకోశంలో అనేక ఆమ్లాలు ఉత్పత్తి అయి నోటిలోకి వస్తాయని దీంతో దంతాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ  దంత వైద్యులు  డాక్టర్ వెదురుపాక  సతీష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దంతాలలో  డెంటిన్ అనే సున్నితమైన బాగా  ఉంటుందని ఇది దెబ్బతిన్నప్పుడు దంతాలలో రంధ్రాలు పడతాయని అన్నారు. దీనివలన వేడి ,చల్లని ,తీపి పదార్థాలు తిన్నా  ,తాగినా బాధ కలుగుతుందన్నారు. దంతాలు గార పడటంతోపాటు పంటి మీద పింగాణీ పొర దెబ్బతింటుంది అని అన్నారు. శీతల పానీయాల వలన కూడా దంతాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-02-09 08:48:04

సత్యదేవుని సన్నిధిలో పాలకవర్గ ప్రమాణస్వీకారం

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కొత్త పాలకమండలి గురువారం  కొలువు తీరింది.  14 మంది సభ్యులతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసింది. వీరంతా స్వామివారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త పాలకమండలిలో ధర్మకర్త కుటుంబ సభ్యులు  ఐవీ.రోహిత్ చైర్మన్ గా మరో 13 మంది సభ్యులుగా ఉంటారు. ఈసారి పాలకమండలిలో ఐదుగురు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్యక్రమం అనంతరం వీరంతా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  కొత్త పాలకమండలి ఏర్పడడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, దేవస్థానం అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామని సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Annavaram

2023-02-09 08:42:40

ప్రజలకు రక్షణ చట్టంపై అవగాహన అవసరం

వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వినియోగదారుల కమిషన్  మీడియేషన్ సభ్యులు  కొమ్మూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని రమణయ్యపేట ఇందిరా కాలనీలో  మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నష్టపోయిన వినియోగదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించడానికి చట్టం రూపొందించారని అన్నారు. వస్తువు కొన్న తర్వాత సేవలు అందించకపోయినా, అసంతృప్తి సేవలకు కూడా పరిహారం పొందవచ్చు అని అన్నారు. ప్రతికోనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు  తీసుకున్నప్పుడే వినియోగదారుడికి హక్కు వస్తుందని శ్రీనివాస్ తెలిపారు .  అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

Ramanayyapeta

2023-02-09 08:23:16

అన్నవరానికి రూ.2.26కోట్లు జల్ జీవన్ మిషన్ నిధులు

అన్నవరం  పంచాయతీకి రూ.2.26 కోట్లు జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు అయ్యాయని సర్పంచ్ ఎస్.కుమార్ రాజా తెలియజేశారు. గురువారం ఆయన పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ క్రుషితో ఈ నిధులు మంజూరు అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈనిధులతో గ్రామంలో మూడు మంచినీటి ట్యాంకులతోపాటు, అన్ని కాలనీలకు నూతన కుళాయిలు వేయించున్నట్టు చెప్పారు. అంతేకాకుండా రెండు పూటలా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. గ్రామంలోని ప్రాధాన్యత ప్రాంతాల్లో వార్డు సభ్యులు కుళాయిల అవసరాలను ఇప్పటికే గుర్తించినట్టు చెప్పారు. జల్ జీవన్ మిషన్ నిధులతో అన్నవరం గ్రామంలో మంచినీటి కొరత, కొత్త కుళాయిలు, మంచినీటి పథకాల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని సర్పంచ్ వివరించారు.


Annavaram

2023-02-09 07:16:12

19న అనంతాళ్వారు 969వ అవతారోత్సవం

శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 19వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉప‌న్య‌సించ‌నున్నారు.  సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

         పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. 

మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు. నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

Tirumala

2023-02-08 17:11:33

కొత్తవలస హాస్టల్ ని సందర్శించిన కలెక్టర్

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి బుధవారం రాత్రి, కొత్తవలస బిసి బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో ఆమె హాస్టల్ కి వచ్చారు. బాలికలతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. మంగళవారం అస్వస్థతకు గురి అయి చికిత్స పొందిన బాలికలతో మాట్లాడారు. వారి అగోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి సమస్యలపై ప్రశ్నించారు. బాగా చదువుకోవాలని కోరారు. ఈ పర్యటనలో జిల్లా బిసి సంక్షేమాధికారి యశోదనరావు పాల్గొన్నారు.

Kothavalasa

2023-02-08 16:25:37