1 ENS Live Breaking News

భోగి మంటకు ఎమ్మెల్వే పర్వత ప్రత్యేక పూజలు

శంఖవరంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన భోగిమంటకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి 
మంటకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుతో కలిసి ప్రజ్వలన చేసిన తరువాత. గ్రామసచివాలయ మహిళా పోలీసులతో కలసి భోగి మంట చుట్టూ ప్రదక్షిణలు 
చేశారు. అనంతరం పేడ పిడకలను భోగికి ఆహుతి చేశారు. ఈ భోగి, సంక్రాంతి పండుగ నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలను కలుగజేయాలని 
కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, వైఎస్సార్పీపా నాయకులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-13 17:14:04

జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబుకి ఘనంగా స్వాగతం

శంఖవరం మండల కేంద్రంలో సాంప్రదాయ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకు ఘనస్వాగతం లభించింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్, సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసచివాలయ మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, చిన్నారీలు  ఎస్పీకి పుచ్చగుచ్చాలతో స్వాగతం పలికి సభావేదిక వద్దకు సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన సంక్రాంతి సంబురాల్లో వివిధ స్టాళ్లను తిలకించారు.  కార్యక్రమంలో ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-13 17:04:09

సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా భారీ ముగ్గు..

శంఖవరం మండల కేంద్రంలో కాకినాడజిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లోని ముగ్గుల పోటీల్లో శంఖవరం మండలంలోని 
గ్రామ, వార్డు సిచివాయ మహిళా పోలీసులు వేసిన రంగవల్లిక ప్రత్యేక ఆకర్షగా నిలిచింది. పల్లెటూరు వాతావరణం లాంటి సెట్ ముందు ఏర్పాటు చేసిన ఈ 
ముగ్గును అచ్చంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, గౌతమి, దుర్గ, చిన్నారీలు, నీలిమ, ప్రత్యేకంగా సుమారు 3 గంటల పాటు శ్రమించి వేశారు. 
ముగ్గుల పోటీల్లో చాలా ముగ్గులు పోటీ పడినా మహిళా పోలీసులు వేసిన ఈ భారీ ముగ్గు దగ్గరే సంబరాలను తిలకించడానికి వచ్చిన వారంతా సెల్ఫీలు దిగడం 
విశేషం. ఈ ప్రత్యేక ముగ్గుని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐలు పి.శోభన్ కుమార్, అజయ్ బాబులు ప్రత్యేక చొరవ తీసుకొని వేయించారు. ఈ ముగ్గే 
అందరినీ మంత్రముగ్దులను చేసింది. ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వచ్చి తిలకించేలా చేయడం విశేషం..!  

Sankhavaram

2023-01-13 16:31:54

శంఖవరానికి సరదాల సంక్రాంతి ముందే వచ్చింది

సరదాల సంక్రాంతి శంఖవరం గ్రామానికి 2రోజులు ముందే వచ్చింది.. ఊరంతా రంగవళ్లులు.. మైదానాల్లో ఉల్లాస భరిత క్రీడలు.. చూడచక్కని పల్లె 
వాతావారణంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. సాంప్రదాయ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శంఖవరం శ్రీవేంకటేశ్వరస్వామి 
ఆలయం వెనుక ప్రాంగణంలో నిర్వహించిన  కార్యక్రమాలు విశే షంగా ఆకట్టుకు న్నాయి. డూడూ బసవన్నలు, పిత్రు దేవతలను పొడిగే బుడబుడకల 
జంగాలు..చిన్న పిల్లల కోలాటాలు, ఫ్యాన్సీ డ్రస్ షోలు, స్టేజి డాన్సులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మె ల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రాద్, ఎంపీపీ పర్వత 
రాజబాబు, కుటుంబ సమేతంగా వచ్చి సందర్శించి మరీ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమాలను ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవ రం ఎస్ఐలు శోభన్ కుమార్, 
అజయ్ బాబు, రౌతులపూడి ఎంపీడీఓ గోవింద్ లు దగ్గరుండి ర్యవేక్షించారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులు  జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, గౌతమి, 
నాగమణి, రజియా సుల్తానా, గ్రామసచివాలయ-1 కార్యదర్శి శ్రీరామచంద్ర మూర్తి, జేఏబీసీ రమణ మూర్తి,  వైఎస్సార్సీపీ  నాయకులు లచ్చబాబు, జట్ల అప్పారావు, 
స్వామి, ఉప సర్పంచ్ కుమార్, కార్య కర్తలు, గ్రామంలోని పెద్దలు, పెద్ద సంఖ్య లో వైఎస్సార్సీపీ కార్యక ర్తల, స్థానికులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-13 15:59:45

నేడు శంఖవరంలో జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు పర్యటన

శంఖవరం గ్రామంలో ఈరోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు పర్యటించనున్నారు. మండల కేంద్రంలో జరగనున్న సంక్రాంతి సంబరాలు నేపథ్యంలో శంఖవరంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల ఫైనల్స్ ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీపీ పర్వత రాజబాబులతో అయన స్వయంగా తిలకించి విజేతలకు బహుమతి ప్రధానోత్స కార్యక్రమంలో పాల్గొంటారు. గత రెండు రోజులుగా శంఖవరంలో గ్రామంలో వాలీబాల్, ప్రో కబడ్డీ, రంగవల్లికల పోటీలు పెద్ద ఎత్తున  జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం సంక్రాంతి సంబరాలు భారీ ఎత్తున నిర్వహించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాలను ప్రతిపాడు సీఐ కిషోర్ బాబు అన్నవరం ఎస్ఐలు శోభన్ కుమార్ అజయ్ బాబులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని గ్రామ సచివాలయ మహిళా పోసులు పాల్గొని కార్యక్రమాలను చేపడుతున్నారు.

Sankhavaram

2023-01-13 04:56:40

ఉల్లాసంగా..ఉత్సాహంగా శంఖవరంలో ప్రొకబడ్డీ పోటీలు

సాంప్రదాయ సంక్రాంతి సంబురాల్లో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉల్లాస భరిత వాతావరణంలో ప్రోకబడ్డీ పోటీ లు శంఖవరంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్, ఎంపీ పీ పర్వత రాజబాబు, ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం స్టేషన్ ఎస్ఐలు శోభన్ కుమార్, అజయ్ బాబులు స్వయంగా తిలకించారు. క్రీడాకారులను ఉత్సహాపరిచేందుకు ప్రతీ ఆటకూ తొలుత హెడ్ అండ్ టాస్ వేసి వారి ని ఉల్లాస పరిచడంతోపాటు క్రీడాకారులను పరిచియం చేసుకున్నారు.. ఈసందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, శంఖవరానికి పండుగ ముందే వచ్చిందనట్టుగా క్రీడా పోటీలను ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. పోటాపోటీగా ఆరు జట్లు తలపడ్డాయి. ఉపసర్పంచ్ చింతనీడి కుమార్, జట్ల అప్పారావు, గ్రామసచివాలయ మహిళా పోలీసులు, జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-12 16:30:07

ఇతర ప్రాంతాలకు వెళితే మాకు తెలియజేయండి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయనగరం1వ పట్టణ పోలీసు పరిధిలో ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళితే తమకు సమాచారం అందించాలని సిఐ బి.వెంకటరావు ప్రజలను కోరారు. ఇల్లు విడిచి బయట ప్రాంతాలకు వెళ్ళినపుడు ముందుగా సమాచారాన్ని అందిస్తే, సదరు ఇండ్లపై నిఘా పెడతామని తెలియ జేశారు. ఈమేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ మైక్ ప్రచారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విలువైన వస్తువులు ఏమీ ఇంట్లో ఉంచవద్దని, LHMS సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో రక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-12 11:28:22

యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి.. డీఎస్పీ పడాల

నేటి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని కాకినాడ సబ్ డివిజన్ డిఎస్పి పడాల మురళీకృష్ణారెడ్డి అ న్నారు. బుధవారం కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించా రు.  ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, యువత వివేకానంద ఆశయ సాధనకు ముందడుగువేయాలన్నా రు.  కాకినాడ బీచ్ మార్తాన్ రన్, సంస్కృతి కార్యక్రమాలలో పాల్గొన్న విజేతలను జ్ఞాపకలతో మెడల్స్ వేసి సత్కరిం చారు.  డైరెక్టర్ కె.వాసు మాట్లాడుతూ, కళాశాల కరస్పాండెంట్ చిరంజీవి కుమారి కృషితో తమ విద్యార్ధులు చదువుతోపాటు ఆటల్లోనూ ముందుంటున్నారన్నారు. అనంతరం డిఎస్పి పడాల మురళీకృష్ణా రెడ్డిని దుస్సా ల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2023-01-11 11:33:42

ఆంధ్రా శబరిమలలో 14న మకరజ్యోతి దర్శనం..

కాకినాడ జిల్లా శంఖవరం మండలం సిద్ధివారిపాలెం దివ్యక్షేత్రం ఆంధ్రాశబరిమలలో ఈ నెల ఆదివారం 14 భోగి పండుగ రోజున మకర జ్యోతి దర్శన భాగ్యం కలుగనుంది.‌  సాక్షాత్తూ అయ్యప్పస్వామి ప్రతిరూపమైన మకర జ్యోతి దర్శనం భక్తులందరికీ కలుగజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ ధర్మకర్త డా.కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు తెలియజేశారు. ఆ రోజు వేలాది మంది భక్త గణానికి సాక్షాత్తూ స్వామి అయ్యప్ప మూల విరాఠ్ స్వరూప ప్రతిరూప మకరజ్యోతి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధి గాంచిన ఈ అయ్యప్ప ఆలయ ప్రాంగణం పరిసరాల్లో దర్శనమిచ్చే మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయం సమీపంలోని ఎత్తైన పర్వత శ్రేణులపై రాత్రి సమయంలో అయ్యప్ప అఖండ మకర జ్యోతి దర్శన  భాగ్యం వేయి జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. సరిగ్గా 12 గంటలకు స్వామికి దివ్యాభరణాలను ధరింపజేసే 'తిరువాభరణ' ఘట్టం పేరుతో ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో స్వామిని ఘనంగా ఊరేగిస్తారు. 

ఆ సమయంలో స్వామి వారి ఆభరణాలు కాపాడటానికి ఒక గరుడ పక్షి తిరుగుతుంది. స్వామిని పలు ఆభరణాలతో అలంకరించి కర్పూర హారతి ఇచ్చే సమయంలోనే ఏటేటా ఎప్పుడూ మకర సంక్రాంతి రోజునే ప్రత్యక్షం అయ్యే అయ్యప్ప మకర జ్యోతి ఈ ఆలయానికి చుట్టూ ఉండే తూర్పు కనుమల శ్రేణిలోని తూర్పు దిశలో ఉండే పర్వతాలపై దర్శన మిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నోట వెలువడిన నామ సంకీర్తనతో శబరిగిరులు ఒక్క సారిగా మార్మోగుతాయి. స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలు మూలల నుంచి మాల ధారణ చేసిన స్వాములు, సాధారణ భక్తులు, స్వామి వారి మండల పూజలు పూర్తి చేసుకున్న భక్త స్వాములు ఈ ఆంధ్రా శబరిమలకు చేరుకుంటారు. కాగా మకరజ్యోతి దర్శనం రోజు భక్తుల కోసం ఏర్పాట్లు చేసి, తీర్ధ ప్రసాద సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ గురుస్వామి డా.కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు తెలియజేశారు. స్వామి, మకరజ్యోతి దర్శనం చేసుకొని అయ్యప్ప కటాక్షం పొందాలని కోరారు.

Sankhavaram

2023-01-11 10:56:44

సరదా సరదాగా సాంప్రదాయ సంక్రాంతి సంబురాలు

శంఖవరం మండల కేంద్రంలోని సాంప్రదాయ సంక్రాంతి సంబురాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద ఎత్తున సరదా సరదాగా జరుగుతున్నాయి. శంఖవరానికి సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టుగా ఈ సంబురాలను ఉత్స వాల్లా చేస్తున్నారు. పాఠశాలల్లోని చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్ లో విద్యార్ధులు పిట్టల దొర, హరిదా సు,మిలట్రీ, పోలీస్, చర్చిపాస్టర్, సోదమ్మ, గ్రామీణ చీరకట్టు తదితర వస్త్రదారణలతో విద్యార్ధులు పాఠశాలల్లో సందడి చేస్తున్నారు. బుధవారం స్థానిక కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో గ్రామసచివాలయ మహిళా పోలీ స్ జిఎన్ఎస్.శిరీష ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు వైవీఎన్ఎస్ ప్రసాద్, కుమార్ నిర్వహించిన సం క్రాం తి సంబురాల కార్యక్రమం ఆహా అనిపించే విధంగా సాగింది. సుమారు 50 నుంచి 70 మంది పిల్లలు రంగు రంగుల దుస్తులు, పిండి వంటకాలతో చక్కగా ముస్తాబై తళుక్కుమనిపించారు.

Sankhavaram

2023-01-11 10:30:06

అన్ లోడ్ చేయడంలో జాప్యం వద్దు..జెసి

శ్రీకాకుళంజిల్లాలో రైతుల నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని మిల్లుల వద్ద అన్ లోడ్ చేయడంలో గాని, ఎఫ్.సి.ఐకి బియ్యం పంపించడంలో జాప్యం గాని జరగరాదని సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలోని పలు రైస్ మిల్లులను జెసి ఆకస్మిక తనిఖీలో భాగంగా  నరసన్నపేటలోని వెంకట నాగేశ్వర రైస్ మిల్ , వెంకట లక్ష్మి జగ్గన్న రైస్ మిల్లులను జెసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో ఎఫ్.సి.ఐకి బియ్యం పంపించడంలో  జాప్యం జరగడంపై విచారించి పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం  శిలగాం సింగువలస ఎఫ్.సి.ఐ గోదాముకు వెళ్ళి మిల్లుల నుండి వచ్చిన ధాన్యం లోడులను పరిశీలించి త్వరగా అన్ లోడ్ చేయాలని, అన్ లోడ్ చేయడంలో జాప్యం జరగరాదని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా సరఫరాల అధికారి డి.వెంకట రమణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Narasannapeta

2023-01-11 10:06:21

సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే చర్యలు

చౌకధరల దుకాణాలు, ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలలో  సరుకుల పంపిణీలో పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారి సూర్య ప్రకాష్ రావుతో కలిసి ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు విశాఖ నగరంలో పలు రేషన్ డిపోలను, రేషన్ పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. పూర్ణా మార్కెట్ ఏరియాలో గల డిపో నెంబర్ 0386149 ను తనిఖీ చేశారు. బియ్యం స్టాక్ ఎంత వచ్చింది, ఎంత పంపిణీ చేశారు, ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, రైస్ కార్డ్లు ఎన్ని ఉన్నాయి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కార్డ్ హోల్డర్స్ తో మాట్లాడి రేషన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, తక్షణ చర్యలు చేపడతామన్నారు. అనంతరం రైల్వే న్యూ కాలనీ దగ్గరలో గల చౌకధర దుకాణం నెంబర్ 39 ని తనిఖీ చేసి స్టాక్ సరిగా లేనందున మరియు రిజిస్టర్ సక్కమంగా లేనందున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అనంతరం హెచ్ బి కాలనీ సీతమ్మధారలో డిపో నెంబర్ 569ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎస్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-01-10 14:05:14

ఇక గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ ప్రాధమిక వైద్యం

గ్రామస్థాయిలోనే ప్రాధమిక వైద్యం అందించేందుకు వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నదని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. మంగళవారం దేవరాపల్లిలో రూ.17.50 లక్షలు తో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మారేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో  గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో బాగంగా మరేపల్లి గ్రామంలో 17 మందికి మోటార్ సైకిళ్ళను మాడుగుల, చీడికాడ, దేవారపల్లి, కోటపాడు మండలాల లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. గ్రామ ప్రజల నీటి అవసరాల కోసం రూ.49 లక్షలతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన లక్షలు గ్రామ సచివాలయం భవనాన్ని,  అనంతరం 3లక్షల చేప పిల్లలను రైవాడ  జలాశయం లో విడుదల చేశారు. ఈ కార్యక్రమం మండల ఎంపిపి రాజేశ్వరీ భాస్కర రావు, ఎంపీడీఓ పార్టీ అధ్యక్షులు బాబు రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

దేవరాపల్లి

2023-01-10 12:50:46

ప్రభుత్వ భూ సర్వే ఖచ్చితమైన నాణ్యతతో ఉండాలి

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన భూ సర్వే నాణ్యత, ఖచ్చితంగా ఉండాలని అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పూసపాటిరేగ మండలం భరణికం గ్రామంలో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు. భరణికంలో జరుగుతున్న రీ సర్వే ను పరిశీలించారు. అక్కడకు విచ్చేసిన రైతులతో మాట్లాడారు.  రైతులు రీ సర్వే కు సహరించినప్పుడే వేగంగా సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని అన్నారు. రైతులు హాజరై   సరిహద్దులను, కొలతలు సరి చూసుకోవాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్షించారు.  ఓటర్ల జాబితాకు ఆధార్ సీడింగ్ వేగంగాచేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో పలు పథకాల అమలు, హౌసింగ్, పారిశుధ్య కార్యక్రమాలు తదితర అంశాల పై సమీక్షించారు.  స్పందన వినతులు పరిష్కారం క్వాలిటీ గాను,  వేగంగా జరగాలన్నారు. పలు రికార్డ్ లను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ భాస్కర రావు పాల్గొన్నారు.

Pusapatirega

2023-01-10 12:25:58

ఎస్సీ కార్పొరేషన్ పథకాలను తక్షణమే అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా విస్మరించిందని, గత మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జెవి ప్రభాకర్ అన్నారు. దళితుల బతుకు తెరువు కోసం అమలు చేయాల్సిన టాక్సీ, ఆటో కేటాయింపు స్కీం లను నిలిపవేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ... మంగళవారం ఎల్ఐసి కూడలి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నిధులు నవరత్నాలకు దారి మళ్ళించడం ఆపాలని, ఎస్సీ కార్పొరేషన్ లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కోటాయించిన నిధులు ఇతర పనులకు మళ్ళించడం చట్ట విరుద్ధం అన్నారు. హైకోర్టు 2003లోనే తీర్పు ఇచ్చింది సుమారు 7వేల కోట్లు నిధులు నవరత్నాలకు మళ్లించడం అన్యాయమన్నారు.
 జగన్ ప్రభుత్వం అధికరంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్లను మాల, మాదిగ, రెల్లి కార్పొ రేషన్లుగా విభజించి  మూడున్నర సంవత్సరాలైనా  ఒకరూపాయి  కేటాయించలేదన్నారు.

 ఎస్సీ కార్పొరేషన్  ద్వారా, భూమి కొనుగోలు పథకం, రోడ్లు, ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు కోసం ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలక ప్రభుత్వం ఖర్చు పెట్టడం దళితులను ద్రోహం చేయడమే అవుతుందన్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు మాట్లాడుతూ, దళితుల ఆర్థిక పురోగతికి దోహదపడే పథకాలన్నీ నిలిపివేశాలన్నారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి అన్నారు. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకు కోసం లక్షలాది రూపాయలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు సమర్పించుకుం టున్నారన్నారు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, కార్యదర్శి జి రాంబాబు, ఉపాధ్యక్షులు ఎం సత్యనారాయణ వివిధ సంఘాల నాయకులు ఓంకార్, అంబేద్కర్, రాజనరమని, బి అప్పారావు ,ఐ గురుమూర్తి ,కోటేశ్వరరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-10 11:34:19