1 ENS Live Breaking News

రైతాంగాన్ని ఆదుకోవడానికే ఈ ఎత్తిపోతల పథకం

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎత్తిపోతల పధకాలను మంజూరు చేసినట్టు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శుక్రవారం అద్దంకి నియోజకవర్గ పరిధిలోని బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.8.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పధకాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గం మేరక ప్రాంతం మని ఈ ప్రాంతం ఎత్తిపోతల పధకాల వల్ల సస్యశ్యామల మవుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Addanki

2023-01-06 13:19:59

సాలూరులో గృహనిర్మాణాల వేగం పెంచాలి

సాలూరులో పట్టణ గృహ నిర్మాణాలు జరగాలని పార్వతీపురం ఐటిడిఎ పీఓ, సాలూరు గృహ నిర్మాణ ప్రత్యేక అధికారి సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. సాలూరు మునిసిపాలిటీ పరిధిలో నెలిపర్తి జగనన్న గృహ నిర్మాణ కాలనీని శుక్ర వారం పీఓపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగం పుంజుకోవాలని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు అనువుగా సామగ్రి సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. జగనన్న కాలనీలో మౌళిక సదుపాయాలు ముందుగా ఏర్పాటు చేయాలని తద్వారా నిర్మాణాలకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ హెచ్. శంకర రావు, గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Salur

2023-01-06 11:03:42

ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం

కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పై తరచుగా ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించామని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ మాధవీలత కొవ్వూరు సి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేయ్యాడమే కాకుండా నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగు తోందన్నారు. కొవ్వూరు ఆసుపత్రి పై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. వైద్య సేవలు పరంగా, రక్త తదితర పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు సేవలు అందించడా నికి నిరాకరించినా, రాజమండ్రి ఆసుపత్రికి గానీ, ప్రవేటు ఆసుపత్రికి గానీ సిఫార్సు చేసినా, ల్యాబ్ ద్వారా చేసే రక్త, తదితర పరీక్షలు ఇక్కడ కాకుండా బయట ప్రవేట్ ల్యాబ్ లకు సిఫార్సు చేస్తే, వాటిపై ముందుకు వచ్చి ఫిర్యాదు చెయ్యాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు. అప్పుడే అటువంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

ముఖ్యమంత్రి విద్యకు, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా నాడు నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఇకపై ప్రతిరోజూ ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి వివరాలు ప్రజలకు తెలియచేయడం జరుగు తుందన్నారు. గైనకాలజిస్ట్, అర్థో, పీడియాట్రిస్ట్ (చిన్న పిల్లల వైద్య నిపుణులు) తదితర నిపుణులైన వైద్యుల సేవలు కొవ్వూరు ప్రజలకు ఇకపై అందుబాటులో తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.

  పోస్ట్ మార్టం గదికి, ఇతర సమస్యల కు సంబంధించిన సౌకర్యాల కోసం తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వైద్య సేవలు పొందుతున్న వారిని ఎవరినైనా బయటకు వెళ్లి పరీక్షలు, సేవలు చేసుకోవాలని  సిఫార్సు చేస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇందుకోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు.కలెక్టర్ వెంట అదనపు డి ఎం అండ్ హెచ్ వో డా. ఎన్. వసుంధర, ఆసుపత్రి పర్యవేక్షకురాలు డా కె. సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.

Kovvur

2023-01-06 09:07:10

డ్రోన్ తో మందుల పిచికారీపై రైతులకు అవగాహన

డ్రోన్ లతో పంటలపై పిచికారీ చేసుకోవడం ద్వారా సమాంతరంగా పంట మొత్తం మందు చల్లేందుకు వీలుంగా వుంటుందని జిల్లా వ్యవసాయాధికారి త్రినాధస్వామి రైతులకు సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం గ్రామంలో వ్యవసాయంలో డ్రోన్ ల ఉపయోగంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ లతో ఏ విధంగా పంటలపై రసాయనాలను ఎలా పిచికారి చేయాలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, మొక్కజొన్న రైతులకు పంటకోత అనంతరం చేపట్టే మొక్క మొదళ్లు రైతులు కాల్చకూడదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ తేజస్వరరావు, ఏడీఏలు నాగభూషణ్, మహారాజన్, ఏవో ధనలక్ష్మి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సామంతుల పైడిరాజు, గ్రామ వ్యవసాయ సహాయకుడు వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. 

Gajapatinagaram

2023-01-05 13:33:02

చెత్త నుంచి సంపద కేంద్రాలు వినియోగించాలి

చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసువచ్చి, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించాలని ఎంపీడీవో డి.సీతారామరాజు పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.  ఈవోపీఆర్డీ వెంకట నారాయణతో కలిసి నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేట మత్స్యకార గ్రామంలో గురువారం సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, కేంద్రం నిరంతరం వినియోగించేలా సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించి గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. గృహాలు, గ్రామాలు పరిశుభ్రంగా వుండాలన్నారు. ఎప్పటికప్పుడు వార్డుల వారీగా చెత్తను సేకరించి ఈ కేంద్రానికి తరలించాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nakkapalli

2023-01-05 12:10:49

ప్రత్తిపాడులో దూకుడు పెంచిన వరుపుల రాజా

ప్రత్తిపాడు నియోజవకర్గంలో టిడిపీ నేత వరుపుల రాజా తన దూకుడు పెంచారు. ఏలేశ్వరం మండలం రమణయ్యపేట  గ్రామంలో 100 మంది గిరిజనులు   వైస్సార్సీపీని విడిచి టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ వరుపుల వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ, వరుపుల రాజా నాయకత్వంపై  నమ్మకంతో  టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజాను ఎమ్మెల్యే గా  అత్యధిక  మెజారిటీ తో  గెలిపించుకొంటామని పేర్కొన్నారు. రాజా మాట్లాడుతూ  రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతందని చెప్పడానికి పెరుగుతున్న చేరికలు, వైఎస్సార్సీపీని వీడుతున్న కార్యకర్తలే నిదర్శమన్నారు. నియోజకవర్గం లో  అనేక  గ్రామాలలో టీడీపీ  చేరడానికి  ఆసక్తి  చూపుతున్నారు  అన్నారు. కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Yeleswaram

2023-01-05 12:00:02

అడారికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్.జగన్

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎలమంచిలి వచ్చి విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. భార్య, కుమారుడు, కుమార్తెలకు, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం మధ్యాహ్నం గం.12-25 ని.లకు హెలికాప్టర్లో ఎలమంచిలి కళాశాల మైదానం చేరుకున్నారు.  ఆయనకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి  బూడీ ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్వాగతం పలికారు.

అనంతరం ఆడారి తులసిరావు పార్సివదేహాన్ని దర్శించిన అనంతరం ముఖ్యమంత్రి హెలిపాడ్ దగ్గర ఇద్దరు బాధితులను కలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి వారికి సీఎం సహాయ నిధి నుండి లక్ష రూపాయల చొప్పున చెల్లించమని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి గం.12-55ని. లకు హెలికాప్టర్లో బయలుదేరి విశాఖపట్నం అక్కడి నుంచి విజయవాడ వెళ్లేందుకు బయలుదేరారు.

యలమంచిలి

2023-01-05 11:20:56

షాపుల నిర్వాహకులు విధిగా సిసి కెమెరాలు పెట్టాలి

కిరాణా, పాన్ షాపులు, దేవాలయాల నిర్వహాకులు తప్పని సరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే శంఖవరం మండల కేంద్రంలోని కిరాణా, పాన్ షాపులు, దేవాలయాలకు పోలీసుశాఖ ఆదేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీస్ మాట్లాడుతూ, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నిర్వహణ ప్రాంతాలకు రక్షణతోపాటు, గొడవులు, అల్లర్లు, దొంగతనాలు జరిగే సమాయాల్లో అవన్నీ సిసి కెమెరాల్లో చిత్రీకరించడానికి అవకాశం వుంటుందన్నారు. నిడివి వున్న స్టోరేజి బాక్స్ లు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు శాఖ సూచనలు తప్పక పాటించాలని షాపుల నిర్వాహకులకు సూచిస్తున్నారు.

Sankhavaram

2023-01-05 08:32:27

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

సంక్రాంతి పండుగ సందర్భంగా, ముందు, తరువాత కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని  నర్సీపట్నం రూరల్ సిఐ పి.రమణయ్య హెచ్చరించారు. గురువారం ఆయన ఈఎన్ఎస్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని నాలుగు స్టేషన్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.  మహిళల రక్షణపై 
ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్టు సిఐ చెప్పారు. దిశయాప్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతోపాటు ఇనిస్టాల్స్ సంఖ్యను మరింతగా పెంచేందుకు సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా ఎప్పుడైనా స్టేషన్ ను సంప్రదించవచ్చునన్నారు.

Narsipatnam

2023-01-05 02:44:21

సింగహగిరి అన్నదానంలో నూతన బాయిలర్

సింహాచలంలోని సింహగిరి పైన సింహాద్రి అప్పన్న అన్నదానం భవనంలో నూతన బాయిలర్ ను ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు ,దినేష్ రాజు, శ్రీదేవి వర్మ , ప్రత్యేక అహ్వనితులు చందు యాదవ్ తదితరులు సంయుక్తంగా ప్రారంభించారు. నూతనం ఏర్పాటు చేసిన బాయిలర్ వలన భక్తులకు ఆహారాన్ని సత్వరమే తయారు చేయడానికి వీలుగా వుంటుందన్నారు. అదే సమయంలో ఎక్కవ మందికి వేగంగా చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, అన్నదానం  సూపరెం డెంట్  పాలూరు నర్సింగరావు తదితరులు  పాల్గొన్నారు.

Simhachalam

2023-01-04 17:31:52

సింహాద్రి అప్పన్నకు ఎమ్మెల్సీ వంశీ ప్రత్యేక పూజలు

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్ దర్శించుకొని పూజలు చేశారు.  బుధవారం ఆయన సతీసమేతం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మల్సీ వంశీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఏపీలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పేదలకు ఇచ్చిన హామీలన్నీ 90% నెరవేర్చారని అన్నారు. ఆయనకు ఆ సింహాద్రి అప్పన్న మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి, రాష్ట్ర ప్రజలు శుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. అంతకుముందు వేద పండితిలు, ఆశీర్వచనం, ప్రసాదాలను ఆయకి అందజేశారు.

Simhachalam

2023-01-04 08:31:40

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టరు పి.ప్ర శాంతి ఆదేశించారు. నర్సాపురం పురపాలక సంఘం పరిధిలో  7వ వార్డులో ఉన్న మూడవ సచివాలయం జిల్లా కలెక్టరు  పి. ప్రశాంతి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడు తూ సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజే యాలన్నా రు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాల న్నారు. ఈ కార్యక్రమంలో  సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ, డిఇవో ఆర్.వెంకట రమణ ఉన్నారు.

నర్సాపురం

2023-01-04 07:16:08

వేగన్ వర్క్ షాపును తనిఖీ చేసిన ఏజీఎం

ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏజీఎం శరద్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం వడ్లపూడిలోని వేగన్ వర్క్ షాపు సందర్శించి తనిఖీ చేశారు.   వర్క్‌షాప్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. బోగీలు, వ్యాగన్ వెల్డింగ్ చేపట్టే హెడ్ స్టాక్ సెక్షన్, మెషిన్స్ షాప్, రోలర్ బేరింగ్, వ్యాగన్ షాప్, స్మిత్ షాపులో సౌకర్యాల ను ఆయన సమీక్షించారు. మోడల్ రూం, వ్యాగన్ల పునరుద్ధరణ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆయన వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి, ఏడీఆర్ఎం(ఆపరేషన్స్)  మనోజ్ కుమార్ సాహూ, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.

Visakhapatnam

2023-01-03 14:25:51

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

విశాఖ ఉక్కు కర్మకారాన్ని విక్రయించేందుకు కేంద్రం పావులు కడుపుతోందని, కర్మాగారాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ అన్నారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పోరాట కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ నేతృత్వంలో ని కమిటీ సభ్యులు మంగళవారం మిందిలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ క్యాంపు కార్యాలయంలో కలుసుకొ ని వినతి పత్రాన్ని సమర్పించారు. ఉక్కు కర్మాగారం సాధనకు 32 మంది ప్రాణత్యాగం చేశారని, 52 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి పోరాటంలో పాల్గొన్నా రని ఆదినారాయణ మంత్రికి గుర్తుచేశారు. మంత్రిని కలిసిన వారిలో వై.టీ. దాసు, వై. మస్తానప్ప ఎన్.రామచం ద్రరావు, రామకృష్ణ  వి.రామ్మోహన్రావు, బి.పైడిరాజు, డి.నాయుడు, మంగ వెంకట్రావు, ఎం.పరదేశి, పిట్టారె డ్డి తదితరులు పాల్గొన్నారు.

gajuwaka

2023-01-03 13:56:45

కోనసీమ జిల్లాలో 8,298 మందికి కొత్త పెన్షన్లు

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో అర్హత ఉన్న వివిధ  కేటగిరీల వారికి కొత్తగా 8,298 పెన్షన్లు మంజూరు చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం అవ్వ తాతలకు జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న వైస్సార్ పెన్షన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం నుండి ప్రారంభించిన నేపథ్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమకు పెన్షన్ మంజూరు చేయాలని పలు ధఫాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పెన్షన్ పొందని వారు ప్రభుత్వం కల్పించిన మార్గదర్శకాలతో పెన్షన్ పొందడం వారిలో సంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వి.శివశంకర్, అడిషనల్ డైరెక్టర్ జిలాని, అమలాపురం మున్సిపల్ కమిషనర్ వివిపి నాయుడు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-03 11:54:11