1 ENS Live Breaking News

మంచు దుప్పటి క్రింద ఆంధ్రాఊటీ అరకులోయ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయ పట్టణ పరిసర ప్రాంతం అంతా మంచు దుప్పటి కప్పుకుంది. గత రెండు రోజుల 
నుంచి దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉదయం 10 గంటల వరకూ ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలు దాటిన సూర్యుడు 
కనిపించడం లేదు. మంచుతోపాటు చలిగాలుల ప్రభావంతో మండలంలోని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ పట్టణ 
పరిసర ప్రాంతంలో వారం రోజులుగా ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ లాడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 
సాయంత్రం గిరిజనులు చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఈనెల చివరి వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని ఆయా గ్రామాల 
గిరిజనులు చెబుతున్నారు.

ARAKU VALLEY

2023-01-24 09:12:30

బాలికల సంరక్షణ ప్రతీఒక్కరు బాధ్యత తీసుకోవాలి

బాలికల సంరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని శంఖవరం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లిపూడి సచివాలయంలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లను ప్రతీ ఇంట్లో మహలక్ష్మిలా చూసుకోవాలన్నారు. సచివాలయ కార్యదర్శి దుర్గాదేవి మాట్లాడుతూ, ఆడిపిల్లపై వివక్ష చూపకూడదని సూచించారు. గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్ కళాంజలి మాట్లాడుతూ, పోలీసుశాఖ పరంగా బాలికలకు, మహిళలకు కల్పిస్తున్న రక్షణ వ్యవస్థల కోసం వివరించారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న అసమానతలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సత్యన్నారాయణ, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.

Nellipudi

2023-01-24 09:08:29

విశాఖలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం

బాలవికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు మంగళవారం ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ 2008 నుంచి వివిద సమాజ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పదవిలో ఉండగా మేదిటిసారి 2009 జనవరి 24న మొదటి దినోత్సవ వేడుకలకు అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. ఆడపిల్ల దేశానికి గర్వకారణమని వారిని స్వేచ్చగా పెరిగే అవకాశం ఒక బరోసా ఇవ్వాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన పారిశ్రామిక వేత్త భరణికాన రామారావు మాట్లాడుతూ, బాలికల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకనూ హింసకు బలవుతున్నారని చట్టాలను నిజాయతీగా అమలు చేయాలని కోరారు. బాలికలకు భారతదేశం సురక్షితం అనేవిధంగా చట్టాలు అమలు చేయాలన్నారు.  సమావేశంలో గృహం అధికారి  ఎవి ఎస్ సునీత డాక్టర్ బాబ్జీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-24 07:46:53

జీతాలకోసం రోడ్డెక్కిన 108అంబులెన్సు సిబ్బంది

నెలంతా పనిచేసినా తమకు సకాలంలో జీతాలు రాకపోతే తాము ఎలా బ్రతకాలని 108 అంబులెన్సు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చింతపల్లిలో తమ డిమాండ్ల సాధన కోసం జీతాల కోసం ఉద్యమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో  26  108 అంబులెన్సుల్లో  65 మంది ఈఎంటిలు, మరో 65 మంది పైలెట్లు సేవలందిస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెల వేతనాలు ఇంకా జమ కాలేదు. దీనితో జీతాలకోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ డిమాండ్ల సాధనకు విధులు నిర్వహిస్తూనే మండలాల వారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

Chinthapally

2023-01-23 15:52:03

27న అన్నవరం సత్యదేవుని హుండీల లెక్కంపు

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు ఈనెల27న చేపట్టనున్నట్టు దేవస్థానం అధికారులు 
తెలియజేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి హుండీల లెక్కింపు, బ్యాంకులో నగదు 
జమ జరుగుతుందని పేర్కొన్నారు. దానికోసం పరకామణి సిబ్బందిని ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొ్న్నారు. ఆరోజు ఉదయం 7.30 గంటల నుంచి 
లెక్కింపు ఆలయ ఈఓ, చైర్మన్, ఇతర సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమక్షంలో జరుగుతుందని తెలియజేశారు.

Annavaram

2023-01-23 12:13:07

నేతాజీ పోరాట పటిమను యువత అలవర్చుకోవాలి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని ప్రతీ ఒక్కరూ అలవరుచుకోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన 126 జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతని కుటుంబంపై కూడా గూఢచర్యం చేశారని ఆరోపించారు.  స్వాతంత్య్ర సమరయోధుని 126వ జయంతిని పురస్కరించుకుని అండమాన్ దీవుల్లో నేతాజీ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిపాదిత స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించినందుకు ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీకి ఎంపీ జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి తదితరులు పాల్గొన్నారు.

vizag

2023-01-23 10:47:00

బీచ్‌రోడ్డులో మరమ్మతులకు మేయర్‌ ఆదేశం

విశాఖలో ప్రతిష్టాత్మక జీ-20సదస్సులున్న నేపథ్యంలో నగర సుందరీకరణపై అధికారులు దృష్టి  సారించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె బీచ్ రోడ్ లోని వరుణ్ బీచ్ పార్క్ తదితర ప్రాంతాలలో జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, మార్చి నెలలో జి-20 సదస్సు జరుగుతున్నందున నోవాటెల్‌ హోటల్‌లో ప్రముఖులు బస చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంత రోడ్లపై జీవీఎంసీ దృష్టి  సారించాలన్నారు. తక్షణమే ఆయా ప్రాంతాల్లో మరమ్మతుల తోపాటు పెయింటింగు సుందరీకరణ పనులు చేయించాలని అందుకు అంచనాల తయారు చేసి స్థాయి సంఘం ఆమోదం కొరకు పంపించాలన్నారు.  ఈ పర్యటనలో  ప్రధాన ఇంజినీర్‌ రవికృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-23 10:16:15

పోర్టు హాస్పటల్ ప్రైవేటీకరణ విరమించుకోవాలి

విశాఖలోని సాలిగ్రామపురం సమీపంలో గల విశాఖ పోర్టు ట్రస్ట్ ఆసుపత్రి నిర్వహణ, దానికి అనుకొన్న మరో నాలుగు ఎకరాల స్థలాన్ని పిపిపి పద్దతిలో ప్రైవేటు పరం చేయాలని పోర్టు ట్రస్ట్ యాజమాన్యం నిర్ణయించడం సమంజసం కాదని ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం జివిఎంసీ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. కార్మికుల, ఉద్యోగుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయం చేయడాన్ని  వ్యతిరేకిస్తున్నట్టు విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బి సిహెచ్ మసేన్ అన్నారు.  ఇటీవల పలుమార్లు ఈ అంశంపై అభ్యంతరాలు తెలిపినట్టు పేర్కొన్నారు. కార్మికుల నిరసనకు టిడిపి నేత బండారు సత్యన్నారాయణ తన మద్దతు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాగే ప్రైవేటు పరం చేయాలని చూస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న అంశాన్ని గుర్తు చేశారు.

Visakhapatnam

2023-01-23 08:04:17

విశాఖలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ టాలెంట్ టెస్ట్

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాలను సాధించాలనుకుంటున్నవిద్యార్థులకు  తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈనెల 29న ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్టు 
సంస్థ నిర్వాహకులు జి.సాయిరాం ఒకప్రకటనలో తెలియజేశారు.  పరీక్షను విశాఖలోని సంపత్ వినాయక టెంపుల్ పక్కన గోఠీ సన్స్ వెనుక ఉన్న తక్షశిల 
క్యాంపస్ లో నిర్వహిస్తున్నామన్నారు. ఈపరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు, ప్రధమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ బహుమతి రూ.25వేలు, తృతీయ 
బహుమతి రూ.15వేలు నగదు ప్రోత్సాహంగా ఇస్తామన్నారు. ప్రతిభ చూపించిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఈఏడాది 10వ తరగతి 
చదువుతున్న, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ టెస్ట్ రాసేందుకు అర్హులన్నారు.మరిన్ని వివరాలకు 
9965 252 252 , 9965 262 262 లో సంప్రదించాలని కోరారు.

Visakhapatnam

2023-01-23 07:29:41

సింహాచలంలో చిరకాల మిత్రుల అపూర్వ కలయిక

సింహాచలం గ్రామం, ఆయిల్ మిల్ ప్రాంతంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం గడచిన 39 ఏళ్ళుగా అనేక ఉత్సవాలు, సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతోంది. వినాయక దుర్గాదేవి, అమ్మవార్ల ఉత్సవాలతో పాటు భవానీమాత  అగ్నిగుండం తొక్కే కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ మిల్ ప్రాంతానికి చెందిన చిరకాల మిత్రులంతా ఆదివారం బైరవవాక వద్ద తోటలో కలుసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఈ సమావేశాని వచ్చి మిత్రులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 39 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ ప్రాయముగా నిలిచిందన్నారు. పాతతరం మిత్రులందరు ఒకేచోట కలుసుకోవడం అభినందనీమన్నారు.

 భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని తామంతా నిర్ణయించుకున్నామన్నారు. మిత్రుల కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదామనీ అందరం కలిసి మెలిసి ఉండాలని అందరూ తమ ఆకాంక్ష వ్యక్తం చేశారని చెప్పారు.  రానున్న రోజుల్లో పాత ,మధ్య ,నేటి తరం మిత్రులను కూడా సంఘంలో పూర్తిగా  భాగస్వాములు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్రీను బాబు  చెప్పారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ సాయంత్రము వరకు ఇక్కడే గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ మిత్రులు  నాగు, అక్కిరెడ్డి అప్పలరాజు, గంట్ల కిరణ్ బాబు,కొల్లి చిన్న, సిడగం రాము, గండ్రెడ్డీ ఈశ్వర రావు, ప్రతాప్, ములకల పల్లి రాజు, నాని, జగదీశ్, కొల్లి శంకర్, మారుతి శ్రీను, శేఖర్ తదితర మిత్రులంతా పాల్గొన్నారు.


Simhachalam

2023-01-22 16:55:49

అన్నవరం సత్యదేవుని దేవస్థానం గదుల సమాచారం..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రకాశ్ సదన్ లో 43 గదులు, హరిహర సదన్ ఏసీ 56,  హరి హర సదన్ నాన్ ఏసీ 35,  హరి హర సదన్ సింగిల్ 4, న్యూ సెంటినరీ 10, ఓల్డ్ సెంటినరీ 15, విఐపీ ఎస్జీహెచ్ 15, సీతారామ చౌల్ట్రీ 25, సత్య నికేతన్ లో 37 గదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు నేరుగా సీఆర్వో కార్యాలయంలో సంప్రదించి భక్తులు తమకు కావాల్సిన వసతి గదులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Annavaram

2023-01-22 15:57:08

సచివాలయ మహిళాపోలీసులను అభినందించిన సిఐ

సాంప్రదాయ సంక్రాంతి సంబురాల్లో మహిళలతో ముగ్గులు వేయించడం, వాలీబాల్ క్రీడలకు క్రీడాకారులను సమకూర్చడం, టోకెస్ సిస్టమ్ ద్వారా క్రమపద్దతిలో 
కార్యక్రమాలు చేపట్టిన శంఖవరంమండల గ్రామ సచివాలయ మహిళా పోలీసులను ప్రత్తిపాడుసిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐలు శోభన్ కుమార్, అజయ్ 
బాబులు ప్రత్యేకంగా అభినందించారు. 3రోజులుపాటు శ్రమించి కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారని కితాబిచ్చారు. 
పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని కష్టపడి పనిచేసిన వారిని పేరుపేరునా అభినందించారు. 

Sankhavaram

2023-01-14 04:22:27

రౌతులపూడి ఎంపీడీఓ గోవింద్.. నువ్వేంటో తెలిసింది

శంఖవరంలో నిర్వహించిన సాంప్రదాయ సంక్రాంతి సంబురాల్లో రౌతులపూడి ఎంపీడీఓ గోవింద్ ను జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు, ఎమ్మెల్యే పర్వతశ్రీ 
పూర్ణచంద్రప్రసాద్ లు ప్రత్యేకంగా అభినందించారు. శంఖవరం మండలంపై అవగాహన లేకపోయినా.. శంఖవరం మండల గ్రామసచివాలయ 
మహిళాపోలీసులను సమన్వయపరిచి, స్టాల్స్ ఏర్పాటు, స్టేజి, క్రీడలు, మహిళలతో వేయించిన ముగ్గులపోటీల విషయంలో చాలాచక్కగా వ్యవహరించారంటూ 
అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా నువ్వేంటో తెలిసిందంటూ ఎమ్మెల్యే జిల్లాఎస్పీకి ఎంపీడిఓ  గోవింద్ కోసం చెప్పిమరీ అభినందించడం విశేషం.

Sankhavaram

2023-01-14 04:13:34

శభాష్ అన్నవరం పోలీస్ ఎస్పీరవీంధ్రనాధ్ బాబు కితాబు

శంఖవరం మండల కేంద్రంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలను ఎంతోచక్కగా ఏర్పాటుచేసిన అన్నవరంస్టేషన్ ఎస్ఐలు శోభన్ కుమార్, అజయ్ బాబు, 
ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబులను జిల్లాఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అభినందించారు. సంక్రాంతి సంబురాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి 
ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తో కలిసి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. 3రోజులపాటు క్రీడలు, ముగ్గుల పోటీలు, వివిధ స్టాల్స్ ఏర్పాటులో కీలకంగా 
వ్యహరించి మహిళాపోలీసులు జిఎన్ఎస్ శిరీష, కళాంజలి, నాగమణి, గౌతమి ఇతరులను సమన్వయపరిచి చక్కని ప్రతిభ కనపరిచారన్నారు.

Sankhavaram

2023-01-14 04:04:44

సంక్రాంతి సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా కొయ్యబొమ్మలు

సంక్రాంతి అంటేనే బొమ్మల కొలువు గుర్తొస్తొంది. అలాంటి కొయ్యబొమ్మల కొలువును శంఖవరంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, అన్నవరం ఎస్ఐ పి.శోభన్ కుమార్ లు ప్రత్యేకంగా ఏర్పాటుచేయించారు. పిల్లలు, పెద్దలు చక్కగా తిలకించే విధంగా ఏర్పాటుచేసిన ఈ కొయ్యబొమ్మల కొలువులో మంచి మంచి బొమ్మలను ప్రదర్శనకు వుంచారు. జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు, ఎమ్మల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్, ఎంపీపీ రాజబాబు ఈస్టాల్ సందర్శంచి బొమ్మలకొలువు ను ఆశక్తిగా తిలకించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-13 17:22:04