1 ENS Live Breaking News

క్రైస్తవ మతాన్ని వీడి హిందుత్వాన్ని స్వీకరించిన గిరిజనులు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్రమేపీ హిందూమతం పట్ల గిరిజనులు ఆకర్షితులు అవుతున్నారు. గత కొద్ది రోజులు క్రైస్తవ మతాన్ని వదిలి పెట్టి హిందూమతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొయ్యూరు మండలం, రేవళ్లు కంటారం గ్రామంలో క్రైస్తవ మతం వీడి 40 మంది హిందూ మతం స్వీకరించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులు స్థానిక సంస్కృతులు మరిచి క్రైస్తవ మత సేకరణతో సాంప్రదాయాలు మరువడంతో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయాలను అనుసరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉత్తేజితులైన  గిరిజనులు తమ హిందూ మతం వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించి హిందూమత స్వీకరణ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.

Koyyuru

2023-01-28 16:34:43

సింహగిరిపై వైభవంగా రథసప్తమి పర్వదిన వేడుకలు

సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో శనివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్దముగా నిర్వహించే ఈఉత్సవాన్ని ఈఏడాదికూడా వైభవంగా జరిపించారు. సింహాద్రి నాధుడిని సర్వాభరణాలతో సూర్య భగవానుడిగా అలంకరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవితో కలిసి వేదమంత్రోచ్ఛరణలు, మృధు మధుర మంగల వాయిద్యాలు నడుమ ఆలయ హంస మూలన ఉన్న రాతిరథంపై ఆసీనులు చేశారు. విశ్వక్సేన పుణ్యహవచనం ఆరాధన, అరుణ పారాయణంతో పాటు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం అక్కడే సింహాద్రి నాధుడు నిత్య కళ్యాణం ఘనముగా జరిపించారు. ఏఈఒ నరసింహరాజు పర్యవేక్షణలో..సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు.. ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కొండ దిగువన గోశాలలో
ఉన్న  సూర్య భగవానుడు విగ్రహం వద్ద ఆలయఅర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఏఈఓలు నరసింహారాజు వై.శ్రీనివాసరావు జంగం శ్రీనివాసు, పర్య వేక్షకులు పిల్లా శ్రీనువా సరావు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Simhachalam

2023-01-28 14:56:02

పండూరులో గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ శనివారం పండూరు-1 లేఔట్ ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 1,2,3  డివిజన్లకు సంబంధించి 1086 మంది లబ్ధిదారులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ళ నిర్మాణ ప్రగతిని పర్యవేక్షించేందుకు గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, హౌసింగ్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి  కమిషనర్ లేఔట్ ప్రాంతాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ మాట్లాడుతూ పండూరు లే అవుట్ లో  రహదారులు,డ్రైనేజీలు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సుమారు 800 మంది ఇళ్ల నిర్మాణానికి ఆమోద పత్రాలు కూడా ఇచ్చారన్నారు. ముఖ్యంగా ఉగాది నాటికి కనీసం 50 ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ చౌదరి, కాకినాడ నగరపాలక సంస్థ డిఈ ఎం. వెంకట్రావు, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, ఏ ఈ రమేష్, హౌసింగ్ ఏఈ భాష, తదితరులు పాల్గొన్నారు.

Panduru

2023-01-28 14:37:57

సముద్రుడికి విజయేంద్ర సరస్వతి పూజలు

పవిత్ర మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి పర్వదిన సందర్భంగా శ్రీ శంకర మఠం నిర్వహణలో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి  విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద శనివారం సూర్యారాధన నిర్వహించారు. రుత్విక్కులు, వేద పండితులు, వేద విద్యార్థులు ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అరుణ పారాయణం, మహాసౌరం, సూర్య నమస్కా రాలు సమర్పించారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సముద్రతీరంలో అర్ఘ్యప్రదానాలు అర్పించి, భక్తులకు అనుగ్రహ భాషణం గావించారు. కార్యక్రమంతో శంకరమం పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-28 14:29:56

గర్భిణి స్త్రీలకు శీమంతంచేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

జగనన్న ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో శనివారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ సీఎం వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భిణీల సీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొని గర్భిణీలకు నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ అందజేసి ఆశీర్వదించారు.

Kalyandurg

2023-01-28 13:44:56

108రోజులు గోవిందమాలతో వెంకటేశ్వర దీక్ష

శుభకృత్ రథసప్తమి నుండి మే15వరకు 108 రోజులు గోవిందమాలతో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దీక్షను చేపట్టినట్టు భ్రీ భోగిగణపతి పీఠం ఉపాసకులు  దూసర్లపూడి రమణరాజు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. దీక్ష పూర్తయిన వెంటనే స్వయంభు కాకినాడ శ్రీభోగివిఘ్నేశ్వర స్వామి వారి పీఠం నుండి స్వయంభు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండకు కాలినడకన పాదయాత్ర కూడా చేపట్టనున్నట్టు ఆయన వివిరంచారు. స్వామివారి మాలధారణ సమయంలో ఆలయంలో అన్ని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టనన్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2023-01-28 10:03:15

షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన కలెక్టర్

శ్రీకాకుళం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, షాపింగ్ కాంప్లెక్స్ న్యూ ఎనర్జీ మెర్కబా, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, రెవెన్యూ కమ్యూనిటీ హాల్ లను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు, ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీఓ బి.శాంతి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబోలు కృష్ణ మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వేణుగోపాలరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె. శ్రీరాములు, జిల్లా కార్యదర్శి బివివియన్ రాజు, జిల్లా ట్రజరర్ జి.ఎల్ఇ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ వెంకటరావు, కమిటీ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-01-28 08:07:30

నక్కపల్లి మండల తహశీల్దార్ గా నీరజ

నక్కపల్లి మండల తహశీల్దార్ గా నీరజ నూతనంగా బాధ్యతలు చేపట్టటారు. ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎస్ డీసీ గా  పదోన్న తి  లభించ డంతో ఆయన స్థానంలోఇదే కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న పనిచేస్తున్న నీరజను ప్రభుత్వం తహసీల్దార్ నియమించారు. ఈ మేరకు  (ఎఫ్ఏసీ) తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేయడంతోపాటు, మండలంలో రెవెన్యూకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. 

Nakkapalli

2023-01-28 03:26:12

కొత్తకాకినాడలో గడపగడపకూ మన ప్రభుత్వం

కాకినాడ 7, 8వ డివిజన్ల పరిధిలోని  కొత్త కాకినాడ ప్రాంతంలో గురువారం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మూడున్నరేళ్ళ పాలనలో ప్రభుత్వం అందించిన నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షురాలు, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్, కమిషనర్ కే. రమేష్. అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు  పలువురు అధికారులు, మాజీ కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారు. ఈ  సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వo అందిస్తున్న సంక్షేమ పథకాలను సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్ల వ్యవధిలో 87% హామీలను అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు, ఇటువంటి ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు పసుపులేటి వెంకటలక్ష్మి,మీసాల ఉదయ్ కుమార్, , మాజీ కార్పొరేటర్లు చిట్నీడి మూర్తి, సంగాని నందం,రోకళ్ళ సత్యనారాయణ, శిగల మధు, స్థానిక నాయకులు తొంపల తాతారావు, బత్తిన రాజు, నందకుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-01-27 15:02:04

ప్రణాళికా బద్ధంగా గృహనిర్మాణాలు పూర్తికావాలి

ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంగా ఉన్న గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేకాధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ఆదేశించారు. కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో జరుగుతున్న గృహనిర్మాణాలపై గృహనిర్మాణ అధికారులు, స్పెషల్‌ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లతో ఏడీసీ సీహెచ్‌ నాగనరసింహరావుతో కలిసి  సమీక్షించారు. డివిజన్ల వారీగా గృహనిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది అగ్రిమెంట్లు ఇచ్చారు? ఎన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి? సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై  ఆయన డివిజన్ల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ళుతోపాటు టిడ్కోలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను కూడా మరింత వేగవంతం చేయాలన్నారు.

 గృహనిర్మాణ లబ్థిదారులుగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు  రూ.35వేల బ్యాంకు లింకేజీపై బ్యాంకుల నుంచి అందే సహకారం, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే  పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  లక్ష్యాలను నిర్ధేశించుకుని ఎట్టిపరిస్థితుల్లోను వాటిని అధిగమించి వేగవంగా ఇళ్ళ నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు మాట్లాడుతూ అగ్రిమెంట్‌ ఇచ్చిన లబ్థిదారుల ఇళ్ళను మరింత వేగవంతం చేయడంతోపాటు రెండవ దశ నిర్మాణాలపై దృష్టిపెట్టాలన్నారు. గృహనిర్మాణాలకు ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, గృహనిర్మాణశాఖ డిఈ గుప్త, టీడీపీఆర్వో మానే కృష్ణమోహన్, పలువురు ప్రత్యేక అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2023-01-27 14:59:41

పవన్ ఆశయాలు నచ్చే జనసేనలో చేరాను

పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని విశాఖ32వ వార్డు కార్పొరేటర్ కందులనాగరాజు తెలిపారు. శుక్ర‌వారం అల్లిపురంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన వార్డు కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే తాను జనసేనలో చేరినట్లు పేర్కొన్నారు. తాను దక్షిణ నియోజ కవర్గంలో పలు సేవాకార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తనకు వార్డులో, అలాగే నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ నియో జకవర్గం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్న వర్గపోరు వలన పార్టీకి తీవ్రనష్టం జరుగుతుందనన్నారు. ఆపార్టీలో నియోజక వర్గంలోని కార్పొరేటర్లందరూ వర్గాలుగా విడిపోయారని చెప్పారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కె. ఎన్. ఆర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-27 12:32:45

అవహేలనచేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై  చేస్తున్న పోరాటాలను అవహేళన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం పాలిట బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. శుక్రవారం ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న బివి రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత పై పోరాడుతున్న వారిలో మత విద్వేషాలను సృష్టించడం, ఐక్యతను విఘాతం చేసే విధంగా కృషి చేయడం, ఉద్యమాలను బలహీనపరిచే విధంగా కుట్రలు కుతంత్రాలు చేయడం తద్వారా ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు ధారపోయడం కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన ఆరోపించారు. 

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం దేశ పరిశ్రమల రక్షణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమన్న ఆయన  ఈ స్ఫూర్తితో దేశవ్యాప్త ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా సిఐటియు కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అనుసరిస్తున్న విధానాల్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఐక్యంగా ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతంగా చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. దీనికి ప్రధాన భూమికగా 30వ తారీకు జరుగుతున్న ప్రజాగర్జనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లా జేఏసీ కన్వీనర్ ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ 30వ తారీకు జరిగే ప్రజా గర్జనకు జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దీనిపై ప్రధాన భూమిక పోషించవలసిన ఉక్కు కార్మిక వర్గం మరింత చైతన్యవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు కె ఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎన్ రామారావు, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, గంగాధర్, యు వెంకటేశ్వర్లు, టి వి కె రాజు, కెవి సత్యనారాయణ, మరిడయ్య, నీలకంఠం, ఓవి రావు, బి ఎన్ మధుసూదన్, కె సత్యనారాయణ, డిసిహెచ్ వెంకటేశ్వరరావు, రామచంద్ర రావు, సూర్యనారాయణ తదితరులతో పాటు వివిధ విభాగాల కార్యదర్శిలు, కార్మికులు పాల్గొన్నారు.

Gajuwaka

2023-01-27 12:06:48

నక్కపల్లి టోల్ ప్లాజాకి అందుకే యుముడొచ్చాడు

నక్కపల్లి టోల్ ప్లాజాకి శుక్రవారం యముడు వచ్చాడు..ఏంటి నిజమైన యముడు అనుకుంటున్నారా..ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు హైవే టోల్ ప్లాజా సిబ్బంది వినూత్నంగా ఆలోచించి వాహనదారులను చైతన్య పరిచారు. హెల్మెట్లు ధరించకుండా బైక్ లు నడిపే వారికి వినూత్న రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, యమధర్మరాజు వేషధారణలో ప్రజలకు వేంపాడు హైవే టోల్ ప్లాజా మేనేజర్ చిరంజీవి నాయుడు, ప్రాజెక్ట్ మేనేజర్ రజనీకాంత్, అశోక్ కుమార్ లు అవగాహన కల్పించారు.  హెల్మెట్లు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

Nakkapalli

2023-01-27 11:58:46

లోక కళ్యాణం కోసమే రాజశ్యామల యాగం.

విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి మహో స్వాములు  తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా తొలుత గణపతి పూజ అనంతరం  రాజ శ్యామల  అమ్మవారికి. వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠం ప్రాంగణంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాగశాలను ప్రారంభించారు. వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి స్వరూపానంద అనుగ్రహభాషణము చేశారు. లోకంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అందుకు ఆ శారదా అమ్మవారు  నిరంతరం అనుగ్రహం అందించాలని  కోరుకున్నామన్నారు.  రాజ శ్యామల అమ్మవారు గొప్ప మహిమాన్వితురాలని కొనియాడారు.గొప్ప ఉపాసన మంత్రంతో అమ్మవారు యాగం జరుగుతుందన్నారు.. వేరే ఎక్కడా ఈ తరహో లో జరగవన్నారు. 

విశాఖ శారదా పీఠం ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  వార్షికోత్సవాలు విజయవంతం కావాలనీ, శారదా మాత,రాజ శ్యామల అమ్మవారు అనుగ్రహము  దేశములో  ప్రజలందరి పైనా ఉండాలని తాను కోరుకోవడం జరిగిందని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు . తెలిపారు శుక్రవారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మా నందేంద్రలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో దేవత మూర్తులను దర్శించుకున్నారు. ప్రతి ఏటా పీఠం వార్షికోత్సవాలతో పాటు నిరంతరం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాథుడు జ్ఞాపికను స్వామీజీలకు శ్రీనుబాబు అందజేశారు.

Pendurthi

2023-01-27 09:38:05

సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం

శంఖవరం సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మద్యాహ్నం 2 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని  ఏపీఈపీడిసిఎల్ జగ్గంపేట డిఈ రత్నాలరావు మీడియాకి ప్రకటన విడుదలచేశారు. విద్యుత్ సరఫరా కేంద్రం, లైన్లలో మరమత్తులు కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం  ఏర్పనుంద ని పేర్కొన్నారు. ఈ అసౌకర్యాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని డిఈ శంఖవరం సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులను కోరారు. అంతేకాకుండా అదనపు విద్యుత్ కోతలు కూడా మరమ్మతులు కారణంగానే జరుగుతున్నాయని తెలియజేశారు.

Sankhavaram

2023-01-26 14:47:01