1 ENS Live Breaking News

స్టేషన్ కి వచ్చే ప్రతీ ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలి

పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతీ ఫిర్యాదు దారుడికీ రసీదు ఇవ్వాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు సూచించారు. మంగళవారం ఆయన తొండంగిలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా స్టేషన్ లోని రికార్డులు, స్టేషన్ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. సమస్య, కష్టం అని వచ్చిన వారికి స్వాంతన కలిగేలా సేవలు అందించాలన్నారు. చోరీలను తక్షణ రికవరీ చేయాలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీలు అంబికా ప్రసాద్, వెంకటేశ్వర్రావు, సిఐ సన్యాసిరావు, తొండంగి స్టేషన్ ఎస్ఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tondangi

2023-01-10 11:15:53

కాలువ నిర్మాణ పనులు సత్వరమే పూర్తిచేయండి.

పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంగళరాయ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఆధునీకరణ లైనింగ్ పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  పరిశీలించారు. మక్కువ మండలం చెముడు గ్రామం వద్ద కాలువ లైనింగ్ పనులను, సాలూరు మండలం లక్ష్మీపురం వద్ద హెడ్  వర్క్స్ పనులను  మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల పరిధిలోని సుమారు 16,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ వద్ద నున్న ఆక్విడక్ట్ ద్వారా ఎంత మేర సాగునీరు అందినది, ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. సుమారు 2.05 కిలోమీటర్ల ఆక్విడక్ట్ తో ఆయా ఆయకట్టుకు సాఫీగా సాగునీటి సౌకర్యం ఉండేదని, ఆక్విడక్ట్ మరమ్మతులకు గురి కావడంతో సాగునీటికి కొంతమేర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

 కాలువ లైనింగ్ పనులతో పాటు నూతన ఆక్విడక్ట్ నిర్మాణం చేపట్టాలని, శివారు ప్రాంతం ప్రతీ సెంటు భూమికి కూడా సాగునీటి సౌలభ్యం కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వెంగళరాయ సాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు విస్తీర్ణం, నీటి సామర్థ్యం తదితర విషయాలను మ్యాప్ ద్వారా  అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం హెడ్ సప్లైస్, స్పిల్ వే, గేట్లు, సైరన్ పనితీరును పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్. అప్పలనాయుడు, డి ఈ సురేష్, జే ఈ ఈ లు శ్రీనివాసు, జగదీష్, రాజశేఖర్, ప్రశాంత్, బి.తిరుపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.స్వాతి, ఏ ఎస్ ఐ బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

Makkuva

2023-01-10 09:47:18

జి-20 సదస్సుకు కాంట్రాక్టర్లు సహకారం అందించాలి

విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే  జి-20 సదస్సుకు జీవీఎంసీ కాంట్రాక్టర్లు సహకారం అవసరమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయంలో వారి డైరీ ని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, వైయస్సార్సీపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు తో కలిసి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి కాంట్రాక్టర్ల సహకారం ఎంతో అవసరమని,  మార్చి నెలలో నిర్వహించే జి - 20 సదస్సుకు దాదాపు 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తారని వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగర సుందరీకరణలో కాంట్రాక్టర్లు భాగస్వాములై పనులు పూర్తి చేయాలన్నారు. కాంట్రాక్టర్లు పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎస్సీ స్లాబ్ బిల్లులు రూ. 38 కోట్లు, జీవీఎంసీ సాధారణ పద్ధతి కింద రూ. 299 కోట్లు, టిఎస్పీ  గ్రాంట్లు రెండు కోట్లు, ఈ ఎండిలు రూ.20 కోట్లు చెల్లినట్టు పేర్కొన్నారు. 

కాంట్రాక్టర్లు వారి సమస్యలు పరిష్కరించేందుకు, పనుల యొక్క గ్రాంట్లు చెల్లించే విధంగా కౌన్సిల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి  నివేదించి వారికి చెల్లింపులు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వీరారెడ్డి మాట్లాడుతూ, విశాఖ నగరాభివృద్ధికి ఎల్లప్పుడూ మా కాంట్రాక్టర్ అసోసియేషన్ తరపున సహకారం ఉంటుందని, పనుల యొక్క బకాయిలు త్వరితకటిన అందించేందుకు నగర మేయర్, కమిషనర్, పాలకమండలి ఎంతో కృషి చేస్తున్నారని అందుకు కాంట్రాక్ట్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆర్ సాదురావు, కన్వీనర్ చంద్రమౌళి, జాయింట్ సెక్రటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ చినఅప్పారావు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-10 09:34:32

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి అమర్

ఆంధ్ర రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ సోమవారం  విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్న పీఠం వార్షిక మహోత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజశ్యామల యాగం నిర్వహణకు సహకరిస్తామని పీఠాధిపతులకు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాగంలో పాల్గొంటున్నందున చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో చర్చించారు.

Pendurthi

2023-01-10 07:43:06

తిరువీధుల్లో గోవిందుడి హంస వాహన దర్శనం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక క్షేత్రంలో సోమవారం ఉదయం హంస వాహనంపై స్వామి వారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. తెల్లవారుజామున కొండపై ఉన్న స్వామివారి మూలవిరాట్ కు అర్చకులు సంకర్షణపల్లి 
రాజగోపాల కృష్ణమాచార్యులు పంచామృత అభిషేకం చేసి పుష్పాలంకరణ చేశారు. అనంతరం భక్తులను దర్శనాలకు అను మతించారు. కింద ఆలయంలో క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామికి ఆలయ ప్రధానార్చకులుగొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు,పీసపాటి వెంకట శేషాచార్యులు,భాగవతం గోపాల 
ఆచార్యులు,నల్లాన్ చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు నిత్య పూజలు, హోమాలు చేసి ధూప దీప నైవేద్య, నిరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.

  హంస వాహనంపై అలివేలు మంగా,పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను చిన్న పల్లకిపై గోదాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంక రించి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై లోని ఒరుత్తు మగనాయ్ పిరన్దు ఓరిరవిల్ 25వ పాశుర విన్నపం చేశారు. అనేక మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇందులో ఆలయ సిబ్బంది సందీప్,గురవయ్య,రమణ, గ్రామానికి చెందిన నండూరి వెంకట గోపాలాఆచార్యులు రేజేటి సింగరా చార్యులు,సిద్దాబత్తుల కృష్ణ పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Nakkapalli

2023-01-09 16:09:35

ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా నివారణకు కృషి

పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా నివారణకు కృషి చేయాలని ఐటిడిఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. సోమవారం పెరుమాళ్ స్వస్త్య సంస్థ ఆధ్వర్యంలో ఐటీడీఏ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సమావేశ మందిరంలో యూత్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ పై పెరుమల సంస్థ నిర్వహిస్తున్న అవగాహనపై సంస్థను ఆయన అభినందించారు పిరిమాల్ సంస్థ సేవలను 11 మండలాలకు విస్తరించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ భాగస్వామ్యంతో పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సికిల్ సెల్ అనిమియా బాధితులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు అందేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Paderu

2023-01-09 13:24:10

పీఎంఎస్ఎంఏ ద్వారా గర్భిణీస్త్రీలకు వైద్య పరీక్షలు

గర్భంలో శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీ స్త్రీలు భలవర్ధక ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యాధికారి డా.సత్యన్నారాయణ సూచించారు. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమం లోభాగంగా పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రతీనెలా 9వ తేదిన పీఎంఎస్ఎంఏ పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించను న్నట్టు పేర్కొన్నారు. ఈరోజు వైద్య పరీక్షలు చేసిన వారిలో 14 మంది హైరిస్క్ తల్లులను గుర్తించామన్నారు. 34 మందికి  రక్తపరీక్షలు చేసిన ఐరన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హై రిస్క్ ఉన్నవారికి కాకినాడ జిజిహెచ్ కి రిఫర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-09 12:06:15

నెల్లిపూడిలో ఉత్సాహంగా సంక్రాంతి సంబురాలు

సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనాన్ని చిన్నపిల్లలకు పాఠశాల స్థాయిలో తెలియజేయాలనే సంకల్పంతో అన్నవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంప్రదాయ సంక్రాంతి సంబురాలు కార్యక్రమం ఎంతో చక్కగా ఉందని శంఖవరం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్  నరాల శ్రీనివాసరావు అన్నారు. సోమవా రం శంఖ వరం మండలంలోని నెల్లిపూడిలోని ఎస్సీపేట ఎంపీపీ స్కూలు, ఎంపీపీ స్కూలు నెల్లిపూడిలో నిర్వహించిన సాంప్రదాయ సంక్రాంతి సంబురాల కార్యక్రమంలో  పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులు వివిధ రకాల దుస్తులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లిపూడి గ్రామానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నట్టుగా ఈకార్యక్రమంలో చిన్నాలు పాల్గొని సందడి చేశారు. గ్రామసచివాలయ మహిళా పోలీసు కళాంజలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు దేవి, ఉపాధ్యాయులు సాయిబాబ అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Nellipudi Village

2023-01-09 09:36:35

సంక్రాంతి సంబురాల్లో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్ షో

శంఖవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎంపీపీస్కూల్ లో చిన్నారులు చేసిన ఫ్యాన్సీ డ్రెస్ విశేషంగా ఆకట్టు కుంది. అన్నవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాఠశాలల చిన్నారులతో గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్. శిరీష సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎస్సీకాలనీ ఎంపీపీ స్కూలులో నిర్వహించిన ఈ షోలో చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నా రు. సుమారు 30 మందికి పైగా చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని తెలియజేసే దుస్తులు ధరించి పాల్గొన్నా రు. గ్రామాల్లో సోది చెప్పే సోదమ్మ చీరకట్టు, సాంప్రదాయ లుంగీ లాల్చి, ఆర్మీ దుస్తులు వేసుకు న్న విద్యార్ధు లు ఈషోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారే ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో దక్కించుకున్నారు. కార్యక్ర మంలో హెచ్ఎం బాలభాస్కర్, జి.నూకరాజు, పి.రవిబాబు, ఎస్.దేముళ్లు,జి.స్వరాజ్యలక్ష్మి, విద్యార్ధినీ, విద్యార్ధు లు  పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-09 09:08:20

సంకల్పయాత్రకు ముగింపునకు నేటితో నాలుగేళ్లు

సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శంఖవరం మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సంకల్పయాత్ర ద్వారానే నవరత్నాల పథకాలకు రూపకల్పన జరిగిందని, వాటిని ప్రజలకు అందించి జనరజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-09 07:53:13

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయరాదు

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయరాదు అని ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. యువత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం జ్ఞాన సముపార్జన కోసమే ఉపయోగించాలి, స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ పాటించి కష్టపడి చదివి  మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా  శనివారం సీతమ్మపేటలోని ఐటిడిఏ కార్యాలయంలో న్యాయ అవగాహన, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జి  మాట్లాడుతూ ప్రజలు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు సెల్ఫోన్ వంటి వాటిని కేవలం జ్ఞానం పెంచుకోవడానికి పనులు సరళీకృతం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి తప్పితే దుర్వినియోగం చేయరాదని తెలిపారు.

 పూర్వకాలంలో గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టే అవసరం ఉండేదని కానీ నేడు ఒక క్లిక్ ద్వారా సెల్ ఫోన్ ద్వారానే అన్ని బిల్లులు పే చేసే సౌకర్యం కలిగిందని ఇటువంటి సౌకర్యకరమైన పనులకు కాలము వృధా కాకుండా ఉండే పనులకు సెల్ఫోన్ ఉపయోగించాలి తప్ప అనవసరమైన విషయాలకు సెల్ ఫోన్ ఉపయోగించి రాదని సైబర్ క్రైమ్ ల బారిన పడవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలపై మంచి కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని చెడ్డ విషయాలు అత్యంత ప్రభావితం చేస్తాయని కానీ మనిషి స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అలవర్చుకొని మంచిని మాత్రమే స్వీకరించాలలన్నారు. చెడు ప్రభావాలకు లొంగరాదని యువత స్వీయ నిర్దేశిత క్రమశిక్షణ అలవర్చుకొని చెడు ప్రభావాలకు లొంగకుండా కేవలం చదువు పైనే దృష్టి సారించాలన్నారు.

 ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యం సాధించే దిశగా అహర్నిశలు శ్రమించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. తద్వారా ఆర్థిక స్వావలంబన కలిగి తమ ఊరికి మంచి పేరు తేవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు, పాలకొండ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ విజయ రాజ్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ బి నవ్య, పాలకొండ డిఎస్పీ కేవీ కృష్ణారావు, పాలకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ, సీతంపేట డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కె విజయభారతి, తాసిల్దారు ఎంపీడీవో సీతంపేట మరియు ఇతర అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Seethampeta

2023-01-07 11:18:06

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రపై వక్తృత్వ పోటీలు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ధైర్యసాలి అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర, జీవిత అంశాలపై నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలను ప్రభుత్వ విశాఖ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఏ.ఎస్. రాజా మహిళా జూనియర్ కళాశాల విద్యార్థి చెన్నా ప్రణాళిక, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని  నేతాజీ జీవిత అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ గొర్లి మహేశ్వరరావు, పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్. జల్దీ విజయ భారతి, మహ్మద్ షఫీ లు వ్యవహరించారు. ఈ పోటీల్లో గొర్లి మహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలను నిర్వహించామన్నారు. ఎంపికైన విద్యార్థులను  ఢిల్లీ లోని భారత పార్లమెంటులో ప్రసగించేందుకు పంపుతామన్నారు. డిల్లీలో జరిగే కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం పరిపాలనాధికారి అల్లం రాంప్రసాద్, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-07 07:10:47

తులసిరావు కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయిరెడ్డి

విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. శుక్రవారం ఎలమంచిలి లోని తులసిరావు నివాసానికి విజయసాయిరెడ్డితో పాటు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తులసిరావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  తులసిరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తులసిరావు కుమారుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్, కుమార్తె పిల్లా రమాకుమారిని  ఓదార్చారు. తులసిరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఎంఎల్సీ వంశీక్రిష్ణ యాదవ్, వరుదు కళ్యాణి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు ఉన్నారు.

యలమంచిలి

2023-01-06 16:18:25

ప్రతీఒక్కరూ వారంలో ఒకరోజు డ్రైడే పాటించాలి

ప్రతి ఒక్కరూ డ్రై డే ను పాటించాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. శుక్రవారం డ్రైడేలో భాగంగా పార్వతిపురం వసుంధర నగర్, వెంకం పేట వద్ద జిల్లా మలేరియా అధికారితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని తద్వారా దోమలను నివారించవచ్చని అన్నారు. శుక్ర వారం ఇంట్లో అన్ని పాత్రలను ఖాళీ చేసి ఎండలో పూర్తిగా అరవేయాలని తద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా, లార్వా పూర్తిగా నశించిపోతుందని పేర్కొన్నారు. డ్రై డే పాటించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. దోమల నివారణకు ఇది అత్యంత ఆవశ్యమని చెప్పారు. దోమల నుండి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని అందుకు దోమతెరలను, దోమ నిరోధకాలను వినియోగించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-01-06 14:12:31