1 ENS Live Breaking News

శంఖవరంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

శంఖవరం మండల కాంప్లెక్స్ లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్   స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు ఎంపీపీ పర్వత రాజబాబుతో కలిసి పూలమాలలు వేసి అనంతరం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకొని స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందకి ఎమ్మెల్యే ఉత్తమ అవార్డులు, ప్రసంశా పత్రాలను అందజేశారు.  విద్యార్ధులు శతశాతం మార్కులు సాధించడానికి  ఉపయోగపడే స్టడీ మెటీరియల్ ను ఎమ్మెల్యే విద్యార్ధులకు అందజేశారు. తదుపరి వర్మీ కంపోస్టు సేల్ పాయింట్ ను ప్రారంభించారు. 
కార్యక్రమంలో జెడ్పీటీసీ టి.మల్లేశ్వరి, వైఎస్సార్సీ నేత లచ్చబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు,ఎంఈఓ ఎస్వీరమణ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-01-26 11:09:14

గ్రామసచివాలయ ఉత్తమ సర్వేయర్ గా వీర్ల సురేష్

కాకినాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శంఖవరం గ్రామ సచివాలయం-1 సర్వేయర్ వీర్ల సురేష్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జెసి ఇలాక్కియా, జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు చేతుల మీదుగా సురేష్ ఈ అవార్డును స్వీకరించారు. సురేష్ కి ఉత్తమ అవార్డు రావడం పట్ల సచివాలయ కార్యదర్శి రామచంద్రమూర్తి, జేఏబీసీ రమణమూర్తి, సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష, వీఆర్వో సీతారాం, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.

Kakinada

2023-01-26 10:48:32

సచివాలయ మహిళా పోలీస్ కళాంజలికి ఎమ్మెల్యే ప్రశంస

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగులు ప్రజలకు అందించిన ఉత్తమ సేవలే ప్రజలు గుర్తించి పేరు తెచ్చేలా చేస్తాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. గురువారం శంఖవరం మండల కాంప్లెక్స్ లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగాజెండా ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో ఉన్నత సేవలు అందించిన నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్.కళాంజలిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం పూర్తిస్థాయిలో తీసుకురావడానికి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగులు మరింత ఉన్నతంగా పనిచేసి ప్రజలకు సేవలందిస్తూ.. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ పర్వతరాజబాబు తదితరులు పాల్గొన్నారు. 

Sankhavaram

2023-01-26 10:23:55

అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

ఐసీడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శంఖవరం సీడీపీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వీడీలకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్ అటెండెన్సు యాప్ రద్దు చేయాలని, సభలు సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకునే జీఓనెం-1ని రద్దుచేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5లక్షలు ఇవ్వాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలనే 13 డిమాండ్ లతో నిరసన చేపట్టారు. ఫిబ్రవరి 6వ తేదీన కలెక్టరేట్, పీడి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఇన్చార్జి సిడిపీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బుల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Sankhavaram

2023-01-25 14:40:42

ఉత్తమ సచివాలయ మహిళా పోలీస్ గా కళాంజలి

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రతిభ అవార్డుకు శంఖవరం మండల ఉత్తమ గ్రామసచివాలయ మహిళా పోలీస్ గా పిఎస్ఎస్ కళాంజలి ఎంపికయ్యారు. శంఖవరం మండల కేంద్రంలో  జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ఈఅవార్డును ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణ చంద్రప్రసాద్ ద్వారా స్వీకరించనున్నారు. ఈమెకు అవార్డు రావడంపట్ల సహచర మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, నాగమణి, గౌతమి, చిన్నారి, రజియాసుల్తానా, సచివాలయ కార్యదర్శి కనకదుర్గ, వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావులు అభినందించారు.

Sankhavaram

2023-01-25 14:22:26

ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు ఒక్కటే

ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు ఒక్కటేనని శంఖవరం తహశీల్దార్ సుబ్రహ్మం పేర్కొన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, సామాన్యుడు సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క ఓటుతోనే సాధ్యపడుతుందని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం ఓటరుగా నమోదు కావాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఓటరు నవీకరణను కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవలని సూచించారు. అనంతరం సిబ్బంది, గ్రామ పెద్దలతో ఓటరు దినోత్స ప్రతిజ్ఞను చేయించారు. ఈకార్యక్రమంలో డిటీ దుర్గాప్రసాద్, ఆర్ఐ రేవతి, సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, బూత్ లెవల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

శంఖవరం

2023-01-25 10:08:45

ఓటు హక్కు పవిత్రతను ప్రతీ ఒక్కరూ గ్రహించాలి

ఓటు యొక్క పవిత్రను అందరూ గ్రహించాలని మండల శంఖవరం తహశీల్దార్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా  నెల్లిపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ఓటుతోనే నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అవకాశం వుంటుందన్నారు.18ఏళ్లు నిండినవాంతా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అనంతరం సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఓటరు దినోత్సవరం సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరాల శ్రీనివాస్, సచివాలయ మహిళా పోలీస్ కళాంజలి, కార్యదర్శి దర్గాదేవి, వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు, గ్రామ పెద్దలు, స్కూలు పిల్లలు  పాల్గొన్నారు.

Nellipudi

2023-01-25 09:59:25

ఉత్తమ గ్రామసచివాలయ మహిళా పోలీస్ గా శిరీష

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రతిభ అవార్డులకు శంఖవరం మండలకేంద్రంలోని గ్రామసచివాలయం-1 మహిళా పోలీస్ జిఎన్ఎస్.శీరిష ఎంపికయ్యారు. పెద్దాపురంలోని జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ఈఅవార్డును ఉన్నతాధికారుల ద్వారా స్వీకరించనున్నారు. ఈమెకు అవార్డు రావడంపట్ల సహచర మహిళా పోలీసులు పిఎస్ఎస్. కళాంజలి, నాగమణి, గౌతమి, చిన్నారి, రజియాసుల్తానా, సచివాలయ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, జేఏబీసి రమణమూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, సర్వేయర్ సురేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు హర్షం వ్యక్తం చేశారు.

Sankhavaram

2023-01-25 08:44:54

గ్రామాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన ద్వారా అభివృద్ధికి నిజమైన సారధిగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం కనిమెట్ట గ్రామపంచాయతీ పరిధిలో రామదాసు పురం గ్రామంలో సుమారు 73 లక్షల నిధులతో,  రాపాక పంచాయతీ పరిధిలోని ఇళ్లయ్య గిరిపేట గ్రామంలో సుమారు 55 లక్షల నిధులతో సిసి రోడ్డుl పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వివరించారు. 

Kanimetta

2023-01-24 15:12:15

క్షయ రోగులకు మరిన్ని సంస్థలు చేయూతనివ్వాలి

ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ పథకానికి విరాళాలిచ్చి క్షయ రోగులకు చేయూత నివ్వాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  మంగళవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని 40 మంది టీ.బి రోగులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు కావలసినది మందులు పౌష్టికాహారమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. 476 మంది టీ.బి రోగులను దత్తత తీసుకున్న హెటిరో ఫౌండేషన్ ను కొనియాడుతూ..  టీబీవ్యాధి రోగులు కోలుకునేందుకు సహాయం చేసేందుకు మరిన్ని సంస్థలు ముందుకి రావాలన్నారు.

Anakapalle

2023-01-24 12:43:36

గ్రంథాలయ ఉద్యోగులకు ఇన్నేళ్లకు మోక్షం కలిగించారు

విశాఖజిల్లా గ్రంధాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆసంస్థ ఛైర్పర్సన్ కొండా రమాదేవి శుభవార్త చెప్పి..  పదేళ్ల తరుబడి పెండింగ్ లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల పై కూడా ఉత్తరువులు జారీచేసి ఇద్దరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. రామా టాకీస్ వద్ద గల జిల్లా గ్రంధాలయ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగస్తులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా ఛైర్పర్సన్ రమాదేవి ఉద్యోగస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.

Visakhapatnam

2023-01-24 12:33:21

28 నుంచి ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం

విశాఖపట్నం నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు 14వ ట్రైబల్ యూత్ ఎక్సైజ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ జి మహేశ్వరరావు, సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఋషికొండలోని ట్రైబల్ కల్చరల్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ భవనంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-24 12:03:48

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వాస్తవాలను విస్మరిస్తే ఎట్టా

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వాస్తవాలను విస్మరించి  మాట్లాడుతున్నారని. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ ఆరోపించారు. మంగళవారం విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో 2,30,000 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని మోసం చేయడమా సీఎం జగన్ మోహనరెడ్డి విశ్వసనీయతా?  కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేయడం విశ్వసనీయతా? అని ప్రశ్నించారు. నేటికీ జాబ్ కేలండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఏకైన ముఖ్యమంత్రి జగన్ అనే విషయాన్ని ప్రజలు, యువత గుర్తుపెట్టుకున్నారని దుయ్యబట్టారు.

Visakhapatnam

2023-01-24 12:01:59

రాజాం నియోజకవర్గంలో మనమేరావాలి

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా వచ్చే ఎన్నికల్లో రెప రెపలాడాలని ఉత్తరాంధ్రా జిల్లాల ఇన్చార్జి, టిటిడి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం రాజాంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి 175 స్థానాల్లోనూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని..దానికో కార్యకర్తలంతా పార్టీ ని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే  కంబాల జోగులు ఎంపీ చంద్రశేఖర్రు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Razam

2023-01-24 11:34:08

ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా 30న ఉక్కు ప్రజా గర్జన

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల గతంలో ఈనెల 30వ తేదీన ఉక్కు ప్రజాగర్జన సభ స్టీల్ ప్లాంట్ వద్ద నిర్వహించనున్నారు. ఈ సభకు మద్దతు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఉక్కు కార్మిక సంఘాల నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జే.అయోధ్యరామ్ కోరారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నేతృత్వంలో కార్మిక సంఘాల నాయకులు మంత్రి అమర్నాధుని కలిశారు.  మంత్రిని కలిసిన వారిలో వి.శ్రీనివాసరావు, బొడ్డు పైడిరాజు, దాలినాయుడు తదితరులు ఉన్నారు.

Gajuwaka

2023-01-24 10:59:44