1 ENS Live Breaking News

ఇళ్ళ నిర్మాణాలకు సామగ్రిని అందాల్సిందే

ఇళ్ల నిర్మాణానికి సామగ్రి లబ్దిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కొమరాడలో నిర్మిస్తున్న జగనన్న ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బుధ వారం పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర మెటీరియల్స్ అందజేస్తున్నారని,  బ్యాంకులతో మాట్లాడి రుణం ఇప్పించారని, కరెంట్  సమస్య కొంత ఉందని దాని వలన నీటిని దూర ప్రాంతాల నుడి తీసుకొని రావలసి వస్తుందని, నిర్మాణ పనులలో కొంచెం జాప్యం జరుగుతోందని లబ్దిదారులు వివరించారు. మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందజేయాలని,  బాధ్యత మీదే అని అధికారులను ఆదేశించారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని, ప్రతి ఒక్కలబ్ది దారుడు  గ్రౌండింగ్ చేసి డిసెంబర్ నెలాఖరుకు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని అధికారులకు, లబ్ధిదారులకు ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. రఘురాం, గృహ నిర్మాణ, మండల అధికారులు పాల్గొన్నారు.

Komarada

2022-12-07 09:58:10

ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి..

రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ఆర్పీకెల ద్వారా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకొని అధిక ధరలు పొందాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని భీమనపల్లి,  విలసవిల్లి గ్రామాలలో వ్యవసాయ, పౌర సరపరాలు, రెవెన్యూ ,తూనికలు కొలతలు అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తొలుత భీమనపల్లి రైతు భరోసా కేంద్రంలో రైతులు అధికారులతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ విధంగా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టిందన్న వివరాలను అధికారులు రైతుల ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బికేలు ఆశ్రయించి ధాన్యం నమూనాలను అందించి వారి సూచనలకు అనుగుణంగా దాన్యం ఆరబెట్టుకుని మంచి గిట్టుబాటు ధరలు పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. హమాలీ చార్జీలు ,రవాణా చార్జీలు చెల్లింపులు గూర్చి అధికారులు ఆరా తియ్యగా. హామాల్లి రవాణా చార్జీలు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

విశాఖపట్నం వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా రైతులు అప్రమత్తమై అమ్మకానికి సిద్ధపరిచిన తమ కళ్ళాలలోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు అధికారులు రైతులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కొనుగోలు ప్రక్రియలు యధావిధిగా కొనసాగించాలని అధికారులకు సూచించారు మండలంలో ఎంత మేర విస్తీర్ణంలో వరి సాగు చేపట్టింది అడిగి తెలుసుకున్నారు ఇంతవరకు హార్వెస్టింగ్ ఎంత మేర విస్తీర్ణంలో జరిగింది అధికారులను అడగగా సుమారు రెండువేల ఎకరాలు పంట విస్తీర్ణం ఉందని ఇప్పటివరకు వేయి ఎకరాలలో హర్వెస్టింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని రకాల చర్యలు పటిష్టంగావించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విల్లసవిల్లి గ్రామంలో రైతాంగం కళ్ళాలో ఆరబెట్టిన ధాన్యరాశులను ఆయన క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి వాతావరణ హెచ్చరికలు మూలంగా ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె తులసి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏ పాపారావు,డిపిఓ వి కృష్ణకుమారి తూనికలు కొలకలు శాఖల అధికారి వెంకటేశ్వర్రావు, తాసిల్దార్ ఏ వెంకటేశ్వరి క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Bhimanapalli

2022-12-07 07:45:16

సీఐటీయూ జిల్లా మహసభలు జయప్రదం చేయండి

అనకాపల్లి జిల్లాలోని  పరవాడ మండల కేంద్రంలో ఈనెల 18,19 తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ 12వ జిల్లా మహసభల ను జయప్రదం చే యాలని సీఐటీ యూ మండల కార్యదర్శి ఐకెపి యునియన్ జిల్లా అద్యక్షులు కె సూ రిబాబు వ్వసాయ కార్మిసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డివెంకన్న పిలుపు నిచ్చారు. బుధవారం  దేవరా పల్లిలో మహసభల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈమహసభల్లో ఆశ, అంగన్వాడీ వీఆర్ఏ విద్యుత్ కోఆపరేటివ్ సం స్థలు బలోపేతం, మద్యాహ్నం భోజన కార్మికులు విఓఎలు,మొత్తం స్కీం వర్కర్లు సమస్యలుతో పాటు అసంఘ టిత కార్మికులు సమస్యలు పరి ష్కారం కాంట్రాక్టు ఆవుట్ స్టోర్సింగ్ ఉద్యోగులు, ఉద్యోగ పరిరక్షణ కనీస వేతనాలు అమలు,గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని 200 వందలు రోజులు పని 600 కూలి ఇవ్వడం, విద్యా వైద్యం ప్రవేటికరణ ప్రభుత్వ రంగస్థలు పబ్లిక్ సెక్టార్లు ప్రవేటికరణ,వంటి కీలకమైన అంశాలను చర్చిస్తామన్నారు. ఈకార్యక్రమంలో స్రుజన అప్పారావు లక్ష్మీ లీలా వరలక్ష్మి తో పాటు అదిక సంఖ్యలో కార్మికులు పల్గోన్నారు.

దేవరాపల్లి

2022-12-07 05:28:05

ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు వినియోగించుకోవాలి

 ప్రభుత్వ వైద్య సేవలు ప్రజల ఇంటి వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ (డాక్టర్) సేవలను అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  మంగళవారం ఆయన ఎలమంచిలి మండలంలో నాడు నేడు పనులను పరిశీలించారు.  ఎలమంచిలి సి.హెచ్.సి, రేగుపాలెం పి.హెచ్.సి., ఎలమంచిలి పట్టణంలోని కొత్తపేట పాఠశాలను పరిశీలించారు.  వచ్చిన రోగులతో ఆయన మాట్లాడుతూ వైద్య సేవలను గూర్చి ఆరా తీశారు. రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలను పరిశీలించారు. ప్రతి పిహెచ్ సి పరిధిలో ఒక డాక్టరు నియమిత కాలాలలో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యం పరిశీలిస్తారని డిఎంహెచ్వో చెప్పు తెలియజేయగా అక్కడికి వచ్చిన మహిళలను ఈ విషయమై కలెక్టర్ అడిగారు.  మహిళలు తమ ఊరికి డాక్టర్ వస్తున్నారని చెప్పారు.

అదేవిధంగా ఆశా కార్యకర్తలను గూర్చి కూడా అడిగి తెలుసుకున్నారు.  నాడు నేడు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో డిఎంహెచ్వో డాక్టర్ ఏ. హేమంత్, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Elamanchili

2022-12-06 12:27:35

21 సామూహిక గృహప్రవేశాలకు సిద్దం కావాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 21న సామూహిక గృహ‌ప్ర‌వేశాల‌ను నిర్వ‌హించేందుకు ఇళ్ల నిర్మాణాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని, గృహ‌నిర్మాణ శాఖాధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఆమె మంగ‌ళ‌వారం గంట్య‌డ మండ‌లంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా తాశిల్దార్ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల  అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై స‌మీక్షిస్తూ,  శ్లాబ్ పూర్త‌యిన ఇళ్ల‌న‌న్న‌టినీ ఈనెల 21నాటికి గృహ‌ప్ర‌వేశాల‌కు సిద్దం చేయాల‌ని ఆదేశించారు. మండ‌లంలో సుమారు వెయ్యి ఇళ్ల‌లో గృహ‌ప్ర‌వేశాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఇప్ప‌టికీ మొద‌లుపెట్ట‌ని ఇళ్ల‌ను, త‌క్ష‌ణ‌మే నిర్మాణాన్ని ప్రారంభించి, ఈ నెలాఖ‌రునాటికి పునాదులను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. వ‌లంటీర్ల ద్వారా ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని సూచించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా గృహ‌నిర్మాణ శాఖాధికారి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి,  తాశిల్దార్ శ్ర‌వ‌ణ్‌కుమార్‌, ఇన్‌ఛార్జి ఎంపిడిఓ భానూజీరావు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

రైతుల‌ను అప్ర‌మ‌త్తం చేయాలి
               మ‌రో రెండు రోజుల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున‌, రైతులు న‌ష్ట‌పోకుండా అప్ర‌మ‌త్తం చేయాల‌ని మండ‌ల వ్య‌వ‌సాయాధికారుల‌కు క‌లెక్ట‌ర్ సూచించారు. వ‌ర్షాల ముప్పు పూర్తిగా తొల‌గిపోయేవ‌ర‌కు, వ‌రి నూర్పుళ్లు చేయ‌కుండా రైతుల‌ను హెచ్చరించాల‌ని కోరారు.  మండ‌లంలోని ర‌బీ పంట‌ల స్థితిగ‌తులు, వ‌రి కోత‌లు, ధాన్యం కొనుగోలు ప‌రిస్థితిపై స‌మీక్షించారు. ధాన్యం కొనుగోలుపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. వ‌రికోత‌లు మొద‌లైన చోట్ల వెంట‌నే కొనుగోలు కేంద్రాల‌ను తెర‌వాల‌ని ఆదేశించారు. ఒకేసారి గ్రామమంతా కోత‌లు జ‌ర‌గ‌కుండా, ద‌శ‌ల‌వారీగా నిర్వ‌హిస్తే, కొనుగోలు ప్ర‌క్రియ‌లో ఇబ్బందులు ఉండ‌వ‌ని సూచించారు. రెండో పంట‌గా అప‌రాలు లేదా మిన‌ప‌, పెస‌ర పంట‌ల‌ను వేసేలా రైతుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని చెప్పారు. మండ‌లంలో సీడ్ విలేజ్‌ల‌ను ఏర్పాటు చేసి, విత్త‌నాల‌ను సొంతంగా ఉత్ప‌త్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. మండ‌ల వ్య‌వ‌సాయాధికారి శ్యామ్‌కుమార్‌, సిఎస్‌డిటి ఇందిర స‌మావేశంలో ఉన్నారు.

అర్హులంద‌రికీ ఓటు హ‌క్కు
                అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని, బూత్ స్థాయి అధికారులను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఓటుహక్కు నమోదుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మండ‌లంలో జ‌రుగుతున్న‌ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను, ఎంఎల్‌సి ఓట‌ర్ల న‌మోదును పరిశీలించారు. ఎమ్మెల్సీ ఓట్లకు దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. బిఎల్వోలతో మాట్లాడి, ఓటర్ల నమోదు, ఇత‌ర అంశాల‌పై ఆరా తీశారు. 17 ఏళ్లవారితో కూడాఓటు కోసం ద‌ర‌ఖాస్తు చేయించాల‌ని సూచించారు. అన‌ర్హుల‌ను తొల‌గించి, ఖ‌చ్చిత‌మైన ఓట‌ర్ల జాబితాను త‌యారు చేయాల‌ని, ఇందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించాల‌ని సూచించారు. స‌మావేశంలో తాశిల్దార్ శ్ర‌వ‌ణ్‌కుమార్‌, డిటి సంతోష్‌, బిఎల్ఓలు ఉన్నారు.

విద్యార్థుల‌ను అభినందించిన క‌లెక్ట‌ర్‌
                 నిర్మాణాత్మ‌క మూల్యాంక‌ణ ప‌రీక్ష‌ల్లో (ఎఫ్ఏ 1) అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన గంట్యాడ జెడ్‌పి హైస్కూలు విద్యార్థుల‌ను క‌లెక్ట‌ర్ అభినందించారు. ఈ ప‌రీక్ష‌ల్లో త‌ర‌గ‌తుల వారీగా అత్య‌ధిక మార్కుల‌ను పొందిన విద్యార్థుల‌తో ఆమె మ‌చ్చ‌టించారు. వారి లక్ష్యాల‌ను తెలుసుకున్నారు. భావ ప్ర‌క‌ట‌నా సామ‌ర్ధ్యాన్ని, ఆంగ్ల భాషా ప‌రిజ్ఞానాన్ని ప‌రిశీలించారు. పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంలో అమ‌లు చేస్తున్న మెనూపై ఆరా తీశారు. డిక్ష‌న‌రీ వినియోగంపై విద్యార్థుల అవ‌గాహ‌న‌ను ప‌రిశీలించారు. విద్యార్థులంతా క‌ష్ట‌ప‌డి బాగా చ‌దువుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో హెచ్ఎం ఝాన్సీ, పిడి  స‌న్యాసినాయుడు ఉన్నారు.

Gantyada

2022-12-06 11:23:56

గ్రామ సచివాలయ సేవలం మరింత విస్తరించాలి

గ్రమా  స‌చివాల‌యాల ద్వారా అందిస్తున్న సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అన్నారు. గంట్యాడ మండ‌లం కొర్లాం గ్రామ స‌చివాల‌యాన్నిమంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్‌ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స‌చివాల‌య ప‌రిధిలో జ‌రుగుతున్న ఎంఎల్‌సి, సాధార‌ణ‌ ఓట‌ర్ల న‌మోదును ప‌రిశీలించారు. ఎంఎల్‌సి ఓట్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. అర్హ‌త ఉన్న‌వారంద‌రికీ ఓటుహ‌క్కు క‌ల్పించాల‌ని ఆదేశించారు. 17 ఏళ్ల వారినుంచి కూడా ఓటుకోసం ద‌ర‌ఖాస్తు స్వీక‌రించాల‌ని సూచించారు. మ‌ర‌ణించిన వారిని, వ‌ల‌స వెళ్లిపోయిన వారిని, వివాహం అయి అత్త‌వారింటికి వెళ్లిపోయిన వారిని జాబితాలో నుంచి తొల‌గించి, ఖ‌చ్చిత‌మైన ఓట‌ర్ల జాబితాను త‌యారు చేయాల‌ని సూచించారు.

                స‌చివాల‌యాల ద్వారా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. నెల‌కు క‌నీసం 250 సేవ‌ల‌ను అందించాల‌ని సూచించారు. విద్యుత్ బిల్లుల‌ను కూడా స‌చివాల‌యాల్లో చెల్లించేలా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చాల‌న్నారు. స్పంద‌న విన‌తుల‌ను ప‌రిశీలించారు. గృహ‌నిర్మాణంపై ప్ర‌శ్నించారు. అర్హ‌త ఉన్న‌వారికి ఇళ్లు మంజూరు చేసి, వెంట‌నే ప్రారంభించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశిల్దార్ స్వ‌ర్ణ‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.              

Gantyada

2022-12-06 11:18:27

వర్షాలు లేనప్పుడే నిర్మాణాలు వేగవంతం చేయాలి

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం కింద ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అందుబాటులో ఉన్నందున‌, ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉన్నందున ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. శ‌నివారం హౌసింగ్ డే సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. కాకినాడ డివిజ‌న్‌లోని సామ‌ర్ల‌కోట ఈటీసీ లేఅవుట్‌ను, పెద్దాపురం డివిజ‌న్ సూరంపాలెం రోడ్డులోని అర్బ‌న్ లేఅవుట్‌ను ప‌రిశీలించారు. ఇప్ప‌టికే పూర్త‌యిన ఇళ్ల‌తో పాటు ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల్లో ఉన్న ఇళ్ల‌ను కలెక్ట‌ర్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. లేఅవుట్‌ల‌లో క‌ల్పించిన మౌలిక వ‌స‌తుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఉచితంగా ఇసుక‌, రాయితీపై స్టీలు, సిమెంటు అందుబాటులో ఉన్నాయ‌ని అందువ‌ల్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌మిచ్చే రూ. 1.80 ల‌క్ష‌లకు అద‌నంగా రూ. 35 వేలు రుణాన్ని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అందించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. అందువ‌ల్ల ఇంకా నిర్మాణాల‌ను ప్రారంభించని వారు వెంట‌నే ప్రారంభించాల‌ని సూచించారు.

 ఎవ‌రికి ఏ స‌మ‌స్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాల‌న్నారు. నిర్మాణం పూర్త‌యిన ఇళ్ల‌కు క‌రెంటు, నీటి స‌ర‌ఫ‌రా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు. డిసెంబ‌ర్‌-ఏప్రిల్ వ‌ర‌కు వాతావ‌ర‌ణం అనుకూలం ఉంటుంది కాబ‌ట్టి నిర్మాణాల‌ను త్వ‌రిగ‌తిన పూర్తిచేయాల‌ని సూచించారు. ఇంకా అవ‌స‌రం మేర‌కు అప్రోచ్ ర‌హ‌దారుల‌ను ఏర్పాటుచేయాల‌ని, విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధికారుల‌కు సూచించారు. ఇంకా ఎవ‌రికైనా రూ. 35 వేలు రుణం అంద‌కుంటే వెంట‌నే బ్యాంక‌ర్ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి.. సంబంధిత ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కార‌మయ్యేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్ వెంట హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్‌, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో జె.సీతారామారావు, హౌసింగ్ ఇంజ‌నీరింగ్ అధికారులు, మెప్మా, రెవెన్యూ, మున్సిప‌ల్, విద్యుత్‌ తదిత‌ర శాఖ‌ల అధికారులు ఉన్నారు.

Samarlakota

2022-12-03 11:58:00

నవరత్నాలు పేదల కలను సాకారం చేస్తున్నాయి..

నవరత్నాలు పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో అందచేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అభినందించారు శనివారం రాజమహేంద్రవరం తోర్రెడు గ్రామం లో హౌసింగ్ లే అవుట్ లో వెంకటలక్ష్మి అనే లబ్దిదారుని ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఎంతో విలువైన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం ద్వారా సొంత ఇళ్లు లేని పేద వారి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నట్లు తెలిపారు.. ఇప్పటికే ఇంటి నిర్మాణం చేపట్టి మరికొందరికి ఆదర్శంగా నిలిచిన లబ్ధిదారులను ఆయన అభినందించారు. జేసీ వెంట ఎంపీడీఓ కె. రత్న కుమారి, సచివాలయం సిబ్బంది, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

Torredu

2022-12-03 11:41:59

ఫ్యామిలీ డాక్టరు సేవలపై క్షేత్రస్థాయి పరిశీలిన

అమ్మా మీకు..ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టరు సేవలు అందుతున్నాయా.. మందులు ఇస్తున్నారా.. వైద్యులు ఎలా చూస్తున్నారు..అంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పాలకొండ మండలం వెలగవాడ ఉప ఆరోగ్య కేంద్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్ర వారం తనిఖీ చేశారు. సావిత్రి, లక్ష్మి, పార్వతి అనే మహిళలతో జిల్లా కలెక్టర్ మాట్లాడి సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టరు శిబిరంలో 60 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్కువ మందిలో బి.పి, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టరు విధానాన్ని అమలు చేస్తుందని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక రోగంతో కదలలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దనే వైద్యం అందించుట జరుగుతుందని ఆయన వివరించారు. గ్రామాల్లో అంటు వ్యాధులు, అంటు వ్యాధులు కాని బిపి, మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. సంబంధిత వ్యాధుల పట్ల సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 

గ్రామంలోనే అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పట్ల గ్రామస్తులు కూడా శ్రద్ద వహించాలని ఆయన సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యకర సమాజం ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని - ఆరోగ్యం చక్కగా ఉండుటకు శ్రద్ద వహించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎటువంటి రిస్క్ తీసుకోరాదని, ముందుగానే ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డెప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డా.పార్వతి, పి.హెచ్.సి వైద్యులు కమల్ నాథ్, 104 వైద్యులు లక్ష్మీ దేవి, తదితరులు పాల్గొన్నారు.

Palakonda

2022-12-02 10:25:02

నాగ‌ళ్ల‌వ‌ల‌స మీదుగా చీపురుపల్లికి ఆర్టీసీ బ‌స్సు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌త్యేక చొర‌వ‌తో విజ‌య‌న‌గ‌రం నుంచి చీపురుప‌ల్లికి కేటాయించిన ప్ర‌త్యేక బ‌స్సు శుక్ర‌వారం నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. అక్టోబర్ 21న నాగళ్ళవలస గ్రామంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రిని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ని కోరిన నేపథ్యంలో మంత్రి ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని బ‌స్సును న‌డిపేలా ఆర్టీసీ అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఆయ‌న విన‌తి మేర‌కు ఆర్టీసీ సంస్థ ముందుకొచ్చి తోండ్రంగి టు విజయనగరం వయా గుజ్జంగివ‌ల‌స‌, నాగ‌ళ్ల‌వ‌ల‌స‌, తోండ్రంగి గ్రామాల మీదుగా చీపురుప‌ల్లికి ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసును నడిపేందుకు ముందుకొచ్చింది. సంబంధిత బ‌స్సు స‌ర్వీసును గుర్ల మండ‌లం నాగ‌ళ్ల‌వ‌ల‌స వేదిక‌గా మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ‌, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్, జడ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావులు రిబ్బ‌న్ క‌ట్ చేసి శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై గుజ్జంగివ‌ల‌స‌, నాగ‌ళ్ల‌వ‌ల‌స‌, తోండ్రంగి త‌దిత‌ర గ్రామాల ప్ర‌జ‌లు, విద్యార్థులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 సంబంధిత బ‌స్సు స‌ర్వీసులు విజ‌య‌న‌గ‌రం నుంచి చీపురుప‌ల్లికి ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా అందుబాటులోకి వ‌స్తాయ‌ని జిల్లా ప్ర‌జార‌వాణా అధికారి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. నాగ‌ళ్ల‌వ‌ల‌స వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆర్టీసి జోనల్ చైర్మన్ జి. బంగారమ్మా, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర అధికారులు, స్థానిక గ్రామ ప్ర‌జ‌లు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Cheepurupalli

2022-12-02 09:45:57

అనకాపల్లి నూకాలమ్మతల్లికి కొణతాల ప్రత్యేక పూజలు..

అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారికి జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొణతాల సీతారాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తన అనుచరులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్థానికుడే నాయకుడు..నాయకుడే స్థానికుడు అనే నినాదంతో ప్రజలతోనే ఉంటున్నామని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని అన్నారు. అమ్మలగన్న అమ్మ నూకాలమ్మ దయతో ఈ ప్రాంతవాసులంతా శుభిక్షంగా ఉండాలని అమ్మను కోరినట్టు ఆయన తెలియజేశారు. తన జీవితం ఈ ప్రాంత ప్రజలకే అంకితం చేయాలనే నిర్ణంతో ప్రజానాయకుడిగా ముందుకి సాగుతున్నామని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రజాక్షేత్రంలో గెలిచిన వారంతా నియోజకవర్గాన్ని అభివృద్ధిచేయాలని కోరుకుంటున్నట్టు వివరించారు. ప్రజల మనిషిగా స్థానికుడిగా ఇక్కడే ఉంటూ అందిరకీ అందుబాటులో ఉంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో జై అనకాపల్లి సేన బృందం సభ్యులు, కొణతాల అభిమానులు, కార్యకర్తలు  పాల్గోన్నారు.

Anakapalle

2022-11-17 15:12:18

ఆర్బీకేలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి..

పెంటపాడు మండలం ఆకుతీగల పాడు, దర్శిపర్రు, పెంటపాడు 1,2,3 ఆర్ బి కేలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింటు కలెక్టరు  జె వి మురళి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు,  రైతులు పేర్లు నమోదు, టోకెన్లు జారీలను పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతం వ్యత్యాసం లేకుండా ఖచ్చితంగా నిర్ధారించాలన్నారు. రైతులకు నూతన ధాన్యం కొనుగోలు విధానంపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వమే రవాణాన్ని ఏర్పాటు చేసే విధానాన్ని,  రైతులే సొంతంగా హమాలీలను, రమాణా, గన్ని బ్యాగులు ఏర్పాటు చేసుకుంటే  చెల్లించే నగదు వివరాలను విపులంగా తెలియజేయలన్నారు.  రైతులకు ధాన్యం రవాణాలో వాలంటీర్లు సహాయంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రెవిన్యూశాఖల అధికారులు,  రైతు భరోసా కేంద్ర సిబ్బంది , రైతులు, తదితరులు పాల్గొన్నారు.

West Godavari

2022-11-16 13:02:32

ఏజెన్సీలో సత్వరమే నిర్మాణాలు పూర్తిచేయాలి

రంపచోడవరం  ఏజెన్సీలోని  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న వివిధ భవనాలు త్వరితగతిన పూర్తిచేయాలని  రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సూరజ్ గనోరే సంబంధిత ఇంజనీర్లను  ఆదేశించారు, మంగళవారం  ఐటీడీఏ పీఓ చాంబర్లో  గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్మిస్తున్న భవనాలు పై సంబంధిత ఇంజనీర్లతో  ప్రాజెక్ట్ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా పీఓ సూరజ్ గనోరే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏడు మండలాలలో నాబార్డ్, సి సి డి పి, నిధులతో నిర్మిస్తున్న భవనాల ప్రగతిని ప్రాజెక్ట్ అధికారి మండలాల వారీగా నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు , నాబార్డ్, సి సి డి పి,నిధులు ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది  ఇంకా ఎంత నిధులు అవసరమోగుచున్నవిది మండలాల వారీగా ఆయన ఆరా తీశారు. ఈ శాఖ ద్వారా నిర్మిస్తున్న కల్వట్, గోడౌన్లు. తదితర భవనాలకు ఇసుక, సిమెంటు, మెటల్ ఎక్కడ నుండి కొనుగోలు చేయుచున్నది అదేవిధంగా మెటల్ యూనిట్ ఖరీదు ఎంత  ఇసుక యూనిట్ ఖరీదు ఎంత అదేవిధంగా ఇసుక, సిమెంటు, మెటల్ ఎంత పట్టుతున్నది తదితర వివరాలు   ప్రాజెక్ట్ అధికారి అడిగి తెలుసుకున్నారు. గుడిస  పర్యటక ప్రాంతాములో నిర్మిస్తున్న  భవనాలు, బొదులూరు గ్రామంలో నిర్మిస్తున్న గోడన్ రాజవొమ్మంగి,అడ్డతీగల మండలల లో నిర్మిస్తున్న కల్వర్టులు,కు సంబంధించిన పనులు ఈ దశలో ఉన్నవి ఆయన ఆరా తీశారు.

ఈ భవనాలకు ఏ సైజు మెటలు అవసరమగుచున్నది ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు , గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న భవనాలన్నిటికీ కరెంటు తో సహా  మౌలిక సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు, ఏజెన్సీలోని  ఎంపీక చేసిన ప్రదేశాలలో హాట్ బజార్లు ఏర్పాటు చేయుటకు ఎక్కడెక్కడ ఎంపిక చేసింది ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జి. డేవిడ్ రాజ్, ఆస్టింటే ఇంజనీర్లు, సత్యనారాయణ, నాగరాజు, మహేశ్వర రావు, వీరభద్రరావు  తదితరులు పాల్గొన్నారు,

Rampachodavaram

2022-11-15 12:48:09

వచ్చే విద్యాసంవత్సరం నుంచి త‌ర‌గ‌తి గ‌దుల్లో డిజిట‌ల్ బోర్డులు

వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో 3వ త‌ర‌గ‌తి నుంచి డిజిట‌ల్ బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. 1,2 త‌ర‌గ‌తుల‌కు స్మార్ట్ టీవీల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. వీటి ర‌క్ష‌ణ కోసం ప్ర‌తీ పాఠ‌శాల‌కు ఒక వాచ్‌మెన్‌ను నియ‌మించ‌డ‌మే కాకుండా, సిసి కెమేరాల‌ను కూడా అమ‌ర్చ‌నున్న‌ట్లు వెళ్ల‌డించారు. ఎంపిపి మీసాల విజ‌య‌ల‌క్ష్మి అధ్య‌క్ష‌త‌న ఎంపిడిఓ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ గ‌రివిడి మండ‌ల ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యారోగ్యం, గృహ‌నిర్మాణం, స్త్రీశిశు సంక్షేమం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు.

                  ఈ సమావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, విద్య‌, వైద్యారోగ్యం, వ్య‌వ‌సాయ రంగాల‌కు ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని అన్నారు. ఎటువంటి స‌మ‌స్య‌నైనా చ‌ర్చించి, ప‌రిష్క‌రించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు చెప్పారు. నాడూ-నేడు కార్య‌క్ర‌మం ద్వారా ద‌శ‌ల‌వారీగా అన్ని పాఠ‌శాల‌ల్లో  మౌలిక, అధునాత‌న‌ స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు.  సంక్రాంతి పండుగ లోగా రాష్ట్రంలోని సుమారు 5 ల‌క్ష‌ల‌మంది, 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉచితంగా ట్యాబ్‌ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్య‌మం చాలా అవ‌స‌ర‌మ‌ని, ఇది పేద ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. స‌భ్యుల సూచ‌న‌ల మేర‌కు ఇంగ్లీషు భాషా ప‌రిజ్ఞానం కోసం ప్ర‌తీ శ‌నివారం వారం ఒక పీరియ‌డ్‌ను కేటాయించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు వారంలో రెండు రోజులు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, మ‌ధ్యాహ్న భోజ‌నం, పారిశుధ్యం, త‌ర‌గ‌తుల‌ నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించాల‌ని కోరారు. దీనికోసం అన్ని పాఠ‌శాల‌ల్లో త్వ‌ర‌లో విజిట‌ర్స్ బుక్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ప్ర‌తీ ఒక్క‌రూ చ‌దువుకోవాల‌న్న ఉద్దేశంతోనే, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

                 గృహ నిర్మాణ శాఖ‌పై స‌మీక్షిస్తూ, నిర్మాణం ప్రారంభించ‌ని ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. మండ‌లంలో 176 మంది ఇప్ప‌టికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించ‌లేద‌ని, మ‌రికొంత‌మంది గోతులు త‌వ్వేసి వ‌దిలేశార‌ని అధికారులు తెలిపారు.  వీరికి నోటీసులు ఇచ్చి, డిసెంబ‌రు 15 వ‌ర‌కు గ‌డువు ఇవ్వాల‌ని, అప్ప‌టికీ నిర్మాణాన్ని ప్రారంభించ‌క‌పోతే ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. వారి స్థానంలో అర్హ‌త ఉన్న‌కొత్త వారికి ఇళ్లు మంజూరు చేయాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రికీ పోష‌కాహారం అందించాల‌ని ఐసిడిఎస్ అధికారుల‌ను ఆదేశించారు. పాలు కొర‌త‌ మ‌ళ్లీ త‌లెత్త‌కుండా చూడాల‌ని, సంబంధిత అధికారుల‌తో మాట్లాడారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో గుర్తించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, ప్ర‌తిపాదిత ప‌నుల‌న్నిటినీ త్వ‌ర‌లో మంజూరు చేస్తామ‌ని చెప్పారు. అర్హులంద‌రికీ నేరుగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి విధాన‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అర్హులు ఎవ‌రైనా ఏదైనా కార‌ణం వ‌ల్ల‌ ప‌థ‌కాలు అంద‌కుండా మిగిలిపోతే,  అటువంటి వారికి కూడా ఇప్పించేందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు క‌లిసిక‌ట్టుగా, స‌మ‌న్వ‌యంతో ప్ర‌జల‌కు సేవ‌లందించాల‌ని మంత్రి కోరారు.

               జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, త్వ‌ర‌లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ ప్రారంభం కానుందని, పార‌ద‌ర్శ‌కంగా, ప‌క‌డ్డంధీగా నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ ప్ర‌క్రియ‌పై ముందుగానే రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. స‌భ్యుల కోరిక మేర‌కు మొక్క‌జొన్న పంట‌కు కూడా అవ‌స‌ర‌మైన ఎరువుల‌ను వెంట‌నే స‌ర‌ఫ‌రా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియ‌న్ సేవ‌లు అంద‌రికీ అందేలా చూడాల‌న్నారు. ఒక స‌చివాల‌యం ప‌రిధిలో రెండు గ్రామాలు ఉంటే, ఒక విడ‌త ఒక గ్రామానికి, రెండో విడ‌త రెండో గ్రామానికి  వెళ్లి వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని ఛైర్మ‌న్‌ సూచించారు.

               ఈ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, ఆర్‌డిఓ ఎం.అప్పారావు, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, డిఇఓ కె.వెంక‌టేశ్వ‌ర్రావు, ఆర్‌విఎం పీవో డాక్ట‌ర్ స్వామినాయుడు, ఎపిఎంఐపి పిడి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, డిపిఓ నిర్మ‌లాదేవి, డిప్యుటీ సిఈఓ కె.రాజ్‌కుమార్‌, జెడ్‌పిటిసి వాకాడ శ్రీ‌నివాస‌రావు, మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ ధ‌న్నాన జ‌నార్ధ‌న్‌, తాశీల్దార్ తాడ్డి గోవింద‌, ఎంపిడిఓ గొర్లె భాస్క‌ర‌రావు, స‌ర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Garividi

2022-11-15 12:13:35