విద్యతోనే అభివృద్ధి సాధ్యం మని విద్యాభివృద్ధికి రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలలు, వినియోగ దారుల శాఖ మంత్రి డా.కారుమూరి. వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం పాలకొల్లు మండలం పాలకొల్లు శ్రీ అద్దే పల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు మంచి చదువు నేర్చి ప్రయోజకులు కావాలన్నదే మన ముఖ్యమంత్రి సంకల్పం అని ఇందుకు అనుగుణంగా విద్య కోసం వేలాది కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అద్దే పల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో వేలాది మందికి బంగారు భవిషత్ ను ఇచ్చి ఈ రోజు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకొనడం ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం మంచి అవకాశంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు.
ధనిక, పేద అంతరాలు తొలిగేలా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దామన్నారు. మనబడి నాడు - నేడు కార్యక్రమం క్రింద అభివృద్ధి చేయడంతో విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్, బ్యాగ్, షూస్ వంటివి పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరిగింది అన్నారు. అమ్మవడి, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, విద్యాకానుక వంటి పథకాల ద్వారా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు, విదేశీ ఉన్నత విద్య వంటి కార్యక్రమాలను అమలు చేసి ఎంతో మంది విద్యార్థులకు చేయూతనివ్వడం జరిగిందన్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు వచ్చి అభివృద్ధి చేయడం ఎంతో అభినందించ విషయం అని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జూనియర్ కాలేజి, డిగ్రీ కళాశాలలకు ఇంకా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు మనబడి నాడు - నేడు క్రింద రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకు వెళ్లి పెండింగ్ పనులకు పూర్తి చేస్తామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు రావు అన్నారు.
కోడి రామకృష్ణ కాంస్య విగ్రహానికి కృషి..
పాలకొల్లులో పుట్టిపెరిగి సినీ దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్న స్వర్గీయ కోడి రామకృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రజలు అభీష్టం మేరకు నిర్మాణానికి ప్రభుత్వ పరంగా ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. చరవాణీ ద్వారా జిల్లా అధికారులకు స్థల సేకరణ,నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆదేశించారు .
పూర్వపు అధ్యాపకులు, ఉపా ద్యాయులకు శాలువా, పూల మాలలు వేసి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ను అందజేసి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఘనంగా సన్మానించారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావుని అధ్యాపకులు, ఉపా ద్యాయులకు, పట్టణ ప్రముఖులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, యం బి సి చైర్మన్ పెండ్ర వీరన్న,యస్ సి కమీషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాజీ శాసన మండలి సభ్యులు మేకా. శేషుబాబు, మాజీ డి సి యం యస్ చైర్మన్ యడ్ల.తాతాజీ, కళాశాలల ప్రిన్సిపాల్స్ టి. రాజ రాజేశ్వరి, వి కె మల్లేశ్వర రావు, గజల్స్ శ్రీనివాస్, తది తరులు పాల్గొన్నారు.