1 ENS Live Breaking News

వినియోగదారులకు చట్టాలతో మరింత రక్షణ

వినియోగదారునికి ఉన్న హక్కులను నిర్ధారించి వారికి రక్షణ కల్పించేందుకు చట్టం రూపొందించబడిందని న్యాయవాది యనమల  రామం పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్న వస్తువు లేదా ఒప్పందం ప్రకారం అసంపూర్తి సేవ చేసినా వినియోగదారుల క్రింద భావించి నష్టపరహారాన్ని పొందవచ్చు అన్నారు. 1986లో రూపొందిన వినియోగదారుల చట్టానికి 2019లో కొన్ని సవరణలు చేసి 2020 జూలై నుండి నూతన చట్టం అమలులోకి వచ్చిందన్నారు. నూతన చట్టం ప్రకారం దేశంలో వస్తువులను ఎక్కడ కొనుగోలు చేసి నా వినియోగదారుడు నివసించే ప్రాంతం నుండి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఉత్పత్తిలో లోపం ఉంటే ఉత్పత్తిదారులతో పాటు విక్రయించిన వారు, ప్రచారం నిర్వహించేవారు కూడా బాధ్యులేనని అన్నారు. వస్తువుల నాణ్యతలో లోపం ఉంటే కొనుగోలు చేసిన 21 రోజుల్లోపు ఫిర్యాదు చేయాలని  అన్నారు. సంబంధిత బిల్లులతో పాటు  అపిడవిట్ దాఖలు చేయాలని రామo తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

2022-10-13 16:17:33

స్వాతంత్ర సమరయోధుడు భూలాబాయి దేశాయి

1877 అక్టోబర్ 13న గుజరాత్ రాష్ట్ర సూరత్ లో జన్మించిన  భూలాభాయ్ దేశాయ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అని  పలుసార్లు  జైలు శిక్ష అనుభవించిన నేత అని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ శ్రీరామ నామ క్షేత్ర ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో  భూలాభాయ్ దేశాయ్ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో సైమన్ కమిషన్ ను వ్యతిరేకించడమే గాక విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి ఉద్యమాల్లో ఆయన చురుకుగా  పాల్గొన్నారని అన్నారు. ఆయన ప్రముఖ న్యాయవాది కావడంతో బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి రైతుల నుండి భూ ఆదాయాన్ని సవరించడం, జప్తు చేసిన భూములను తిరిగి రైతులకు ఇప్పించడం, ఉద్యమ ఖైదీలను విడుదల చేయించారని పట్నాయక్ తెలిపారు.  క్షేత్ర అధ్యక్షులైన రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కుమార్ యాదవ్, అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 16:03:42

గర్జన ఏర్పాట్లు పరిశీలించిన నాయకులు

విశాఖలో ఈ నెల 15వ తేదీన జరగనున్న విశాఖ గర్జనకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సీర్సీపీ ముఖ్య నాయకులు,  మంత్రులు గురువారం పరిశీలించారు. విశాఖలోని ఎల్ఐసి భవనం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ దగ్గర ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ముగుస్తుంది. సుమారు 12 గంటల ప్రాంతానికి పాదయాత్ర ఇక్కడకి చేరుకోనుంది. అనంతరం పార్టీ పెద్దలు , మంత్రులు, ముఖ్య నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఉమ్మడి విశాఖ జిల్లాల వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే నాగిరెడ్డి తదితరులు పరిశీలించారు.

2022-10-13 15:47:17

ఆహార సరఫరాలో అక్రమాలు జరిగితే సహించం

ఆహార సరఫరాలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. గురువారం అరకువేలి మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, స్థానిక ఏరియా ఆస్పత్రిని  , ఎండపల్లి వలస, పద్మాపురం అంగన్ వాడి కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత్తర గూడ గ్రామంలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీని పరిశీలించారు. నిత్యావసర సరుకులు సక్రమంగా సరఫరా చేయాలని ఆదేశించారు.పేద బడుగు వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరకుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేస్తున్న ఆహార పదార్ధాలు పరిశీలించారు.జి.సి.సి. గొడౌన్లో కాలం చెల్లిన 180 బస్తాల కంది పప్పు ను సీజ్ చేసారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కమీషన్ లక్ష్యాలు, సేవలుపై అవగాహన కల్పించారు. విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 26జిల్లాలో పర్యటించి 339కేంద్రాలు తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పౌసరఫరాలశాఖ అధికారులు శివ ప్రసాద్,వేణుగోపాల్, శ్రీహరి, జీసీసి డి.ఎం.లు పార్వతమ్మ, సింహాచలం, తహశీల్దార్ వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.

2022-10-13 15:05:08

ఖాళీ స్థలాలపై సిబ్బంది దృష్టిసారించాలి..

కాకినాడ నగరంలోని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం వల్ల  అపరిశుభ్ర వాతావరణం నెలకొం టోందని ఏ డి సి సిహెచ్ నరసింహారావు చెప్పారు. ఈ విషయమై ఖాళీ స్థలాల యజమాను లకు సూచనలు ఇవ్వడంతో 30% మంది తమ స్థలాలను పరిరక్షించుకుని కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారన్నారు. బుధవారం నగరంలోని 24, 25 డివిజన్ లో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీసీ మాట్లాడుతూ, కొంత మంది మాత్రమే స్థలాలకు కాంపౌండ వాల్ నిర్మించుకున్నారని  మిగిలిన 70 శాతం మంది  స్థానికంగా లేకపోవడం, ఇతర కారణాల వల్ల స్థలాలను పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల  స్థానికులు చెత్తను తీసుకువచ్చి ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని అసహం వ్యక్తం చేశారు. అక్కడ పందులు, కుక్కలు,పాములు చేరి ప్రజారోగ్యానికి భంగకరంగా మారుతున్నాయన్నారు. 

దోమల కూడా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏడిసి చెప్పారు. ఆయా స్థల యజమాలను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత డెంగీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనికోరారు. ఫ్రైడే - ఫ్రైడే గా పాటించి ఎప్పటికప్పుడు నిలవనీటిని తొలగించుకోవాలని కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయకుండా నగరపాలక సంస్థ సమకూర్చిన  డస్ట్ బిన్ లలో మాత్రమే ఉంచి పారిశుద్ధ్య  సిబ్బందికి అందజేయాలని ఆయన కోరారు. పారిశుధ్య నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటే  సంబంధిత సచివాలయానికి ఫిర్యాదు చేయవచ్చని ఏ డి సి సూచించారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-12 13:28:28

పారిశుధ్యంపై అలసత్వాన్ని సహించేదిలేదు

పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన జగన్నాధపురం లోని  24, 25 డివిజన్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణను ఆరా తీశారు. చెత్తను నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన వేసిన ఓ షోరూం యజమాని వద్ద  వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేయాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. 24వ డివిజన్లో పారిశుద్ధ్య పనులలో  పర్యవేక్షణ లోపాన్ని గుర్తించారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే అక్కడి శానిటరీ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామన్నారు. వార్డుల వారీగా అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని హెచ్చరించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా సంబంధిత సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీసీ వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-12 13:27:36

జన విశ్వాసంతో కొలువుదీరిన ప్రభుత్వం మాది

అభివృద్ధి , సంక్షేమమే  ధ్యేయంగా  రాజకీయాల కు అతీతంగా పరిపాలన అందించడమే సీఎం జగన్ ఆశయమని మంత్రి బుడి ముత్యాలనాయుడు అన్నారు. బుధవారం దేవరాపల్లి మండలం  రైవాడ గ్రామంలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిడ్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు పాల్గొని  ప్రజలకు అందుతున్న  పధకాలను . గ్రామా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కాగా..  మొదటి దశలో భాగంగా బేతపూడిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి  48 23 లక్షల రూపాయలు నిధులతో  అదనపు తరగతి గదుల భవనానికి భూమిపూజ చేసారు. పనుల విషయం లో ఎటువంటి రాజీ పడకూడదని , సీఎం జగన్ మార్క్  కనిపించేలా  నిర్మాణాలు చేపట్టాలని  ఆదేశించారు. అనంతరం గ్రామంలో 23. 50 లక్షల రూపాయలతో నిర్మించిన మండలపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల  భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో  మంత్రి సరదాగా గడిపి , విద్యార్థినులు జగన్ పై పడిన పాటను ఆస్వాదించారు .ఈ కార్యక్రమంలో  మండల జెడ్పీటీసీ  కర్రి సత్యం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు  ఉర్రోకుల గంగా భవాని అప్పారావు,  చింతల బుల్లి లక్ష్మి వెంకట రమణ   మండల పరిషత్ మాజీ అధ్యక్షులు  కిలపర్తి భాస్కరరావు , పార్టీ అధ్యక్షులు బూరె బాబు రావు, ఎమ్మార్వో, ఎంపిడిఓ, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 11:31:54

కీళ్ల నొప్పులు మహిళల్లోనే అధికం

కీళ్ల నొప్పులు స్త్రీలలో అధికమని.. అయితే తొలి దశలనే గుర్తిస్తే  మందులతో పూర్తిగా నియంత్రించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రమ ణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జన్యుపరమైన కారణాల వలన ఈ వ్యాధి వస్తుంది అని అన్నారు. కీళ్ల లో నొప్పి లేదా వాపు, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఎక్కువగా జుట్టు రాలడం, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రక్త కణాలు తగ్గడం,  కండరాల బలహీనత వ్యాధి లక్షణాలు అన్నారు. దీని నివారణకు గాను పౌష్టికాహారం తీసుకోవాలని ,క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్ష లు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 09:08:02

ప్రాథమిక హక్కుగా సమాచార హక్కు చట్టం

ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఏమేం చేస్తుందో తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్ట ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన  భావ ప్రకటన   స్వేచ్ఛలో సమాచార హక్కు చట్టం అంతర్భాగమని అన్నారు. ప్రజలు ఏదేని ఒక  అంశంపై సమాచారాన్ని కోరినప్పుడు నిర్ణీత సమయంలో దానిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుదారునికి 30 రోజుల లోపు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ చట్ట ప్రకారం సమాచారం అడిగితే ఇవ్వడానికి కుదరదని, అందుబాటులో లేదని చెప్పడానికి అధికారులకు అవకాశం లేదన్నారు. 2005 అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,స్థానికులు పాల్గొన్నారు.

2022-10-12 09:04:03

పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలి

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో పారదర్శకతతో నూతన విధానంలో నూటికి నూరుశాతం ధాన్యం కొనుగోలు చేసి మన జిల్లాను మొదటి స్థానంలో ఉండేలా సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని  జెసి జె.వి.మురళి అన్నారు. మంగళవారం స్వర్ణాంధ్ర ఇంజనీరింగు కళాశాల సమావేశ మందిరంలో నూతన విధానంలో ధాన్యం కొనుగోలుపై కస్టోడియన్ అధికారులు, వాలంటీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, తది తరులుతో   నియోజక వర్గం ఒక్క రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ధాన్యా గారంగా పేరున్న మన పశ్చిమగోదావరి జిల్లాలో పారదర్శకంగా నూతన విధానంలో ఖరీఫ్ 2022-23 ధాన్యం కొనుగోలు చేయాలని  అందుకు అనుగుణంగా అధికారులు సిబ్బంది పూర్తి అవగాహన కలగాలని అయన అన్నారు.

 రైతులకు తప్పనిసరిగా కనీస మద్దతు ధర అందే విధముగా పనిచేయాలని, గన్నీస్ , లేబరు , ట్రాన్స్ పోర్టు తది తర అంశాలు పై జిల్లా జాయింటు కలెక్టరు క్షుణ్ణంగా వివరించారు. ధాన్యం కొనుగోలులో  ఎలాంటి లోపాలు లేకుండా రైతులకు మంచి సేవలు అందించాలన్నారు. రైతులకు షెడ్యూల్, కూపన్ జనరేషన్  గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు భరోసా కేంద్రములో  చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు ,కస్టోడియన్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులకు మొబైల్ ఆప్ (MOBILE APP) లో ప్రతి ఒక్కరూ నమోదు చేసు కోవాలని, ఇంకా చేసుకోవలసిన వారు ఉంటే శిక్షణ పూర్తి అయ్యేలోపు చేసి చూపాలన్నారు.

 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ఎందుకు ధాన్యం  అమ్మాలి ,కలిగే లాభాలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ చేసిన రైతుల నుండి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని,ఇంకా చేసుకోవలసిన రైతులను గుర్తించి వారితో చేయించాలని అయన అన్నారు. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి మనందరికీ అన్నం పెడుతున్న రైతన్నకు పండిన పంటకు గిట్టుబాటు ధర అందించి, సకాలంలో అమ్మినధాన్యానికి సొమ్ములు జమ చేయటమే మన ప్రథమ కర్తవ్యం అన్నారు. ధాన్యం కొనుగోలు విధులలో ఎవరైనా నిర్లక్ష్యం అలసత్వం వహించినట్లయితే అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని,బాగా పనిచేసిన వారిని గుర్తించి అభినందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు.

ఈ-కేవైసి నమోదుచేసిన జెసి..

ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ ప్రతి రైతు విధిగా చేయించుకోవాలని దీని వలన ప్రతి రైతు ప్రయోజనాలు పొందుతారని ఆయన అన్నారు. సీతారామపురం శ్రీ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద  రైతుకు స్వయంగా ఈ-కేవైసి, ఈ-క్రాప్ బుకింగ్ ను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి నమోదు చేశారు. ఈ శిక్షణ తరగతులలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ , సివిల్ సప్లై డి యం టి. శివ రామ ప్రసాదు, ఏ యస్ వో లు యం.రవి శంకర్, వై. ప్రతాప్ రెడ్డి, తహశీల్దారు యస్ యం ఫాజిల్ ,కస్టోడియన్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు , తది తరులు పాల్గొన్నారు.

2022-10-11 15:17:58

భూ రిజిస్ట్రేషన్లకు మరో 15 సచివాలయాలు

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను రెండవ దశలో  గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిం చేందుకు మరో 15 సచివాలయాలను ఎంపిక చేశామని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అన్నారు. శుక్రవారం భీమవరంలోని జెసి క్యాంప్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ అధికారి,సబ్ రిజిస్ట్రార్లతో మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ కమిటీ సమావేశం జిల్లా జాయింట్ కలెక్టరు జె వి మురళి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న ప్రభుత్వం భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ఇక్కడే నుంచే చెయ్యాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం జిల్లాలో మొదటి విడతలో సబ్ రిజిస్ట్రార్ అధ్వర్యంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామ సచివాలయంలో విజయవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించుకున్నామని ఆయన తెలిపారు.

 ప్రస్తుతం రెండో విడతగా మరో 15 సచివాలయాలు ఎంపిక చేయడం జరిగిందని ఆయన అన్నారు. అత్తిలి, భీమవరం, కాళ్ళ, పెంటపాడు, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, తణుకు, యలమంచిలి మండలాల్లో 15 సచివాలయాలను ఎంపిక చేసినట్లు జాయింట్ కలెక్టరు వివరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అయన చెప్పారు.సచివాయాలు ద్వారా ప్రజలకు  భూముల క్రయ,విక్రయాలు  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయ్యి  ప్రయాణ భారంతో పాటు ఖర్చులు కూడా తగ్గతాయని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రిజిస్ట్రారు  అధికారి ఆర్.సత్యనారాయణ, వివిధ సబ్ రిజిస్ట్రారులు , తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-30 12:08:18

ప్రజలకు మెరుగైన సేవలందించాలి..

గ్రామ,  సచివాలయం ,రైతు బరోసా కేంద్రాల సిబ్బంది రైతులకు ,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని  జిల్లా జాయింట్ కలెక్టరు  జె వి మురళి అన్నారు. శుక్రవారం ఉండి మండలం ఉండి -1, కలసిపూడి ,చెరుకువాడ  సచివాలయాలు,  రైతు బరోసా కేంద్రాలను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆకస్మిక తనిఖీలు చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది హాజరును పరిశీలించారు.  కేంద్రాలకు వచ్చే ప్రజలు, రైతులను చిరునవ్వుతో స్వాగతించి వారి పనులు త్వరితగతిన పూర్తి చేసి పంపించాలన్నారు. సచివాలయం, రైతు బరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేసిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. స్పందన అర్జీల పై ప్రత్యేక దృష్టి పెట్టి, వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి సంబంధిత శాఖలకు సకాలంలో పంపాలని ఆయన అన్నారు.

 పథకాలు తెలియని వారికి తెలియ చెప్పి , అర్హులకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందించాలని ఆయన అన్నారు. గ్రామ వాలంటీర్లు పనితీరు ఎలా ఉందని వారికి కేటాయించిన ఇండ్లకు ప్రతి గడపకు వెళ్లుతున్నారా  అని అధికారులను  అయన అడిగి తెలుసుకున్నారు.కార్యాలయం బయట వివిధ పథకాలు డిస్ప్లే చేసిన బోర్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి జారీ చేశారు.

Undi

2022-09-30 12:05:46

సంక్షేమ పథకాల రథసారది వైఎస్ జగన్..

సంక్షేమ పథకాల రథసారథి అణ గారిన వర్గాల ఆశాజ్యోతి పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనాలు జేజేలు పలుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డ్ పూజారి పేట లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డి బి టి సిస్టం ద్వారా అర్హుడైన లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందుతున్నాయని ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న జగన్ మోహన్ రెడ్డి ఆశయం గొప్పదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

 ఆమదాలవలస మున్సిపాలిటీలో త్రాగునీరు కోసం 62 కోట్లతో ఏఐఐబి నిధుల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేశామని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని త్వరలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని స్పీకర్ తమ్మినేని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లం శెట్టి ఉమామహేశ్వర రావు, స్థానిక నాయకులు బొడ్డేపల్లి సుశీలమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, మామిడి ప్రభాకర్ రావు, మావిడి రమేష్ కుమార్, పొన్నాడ చిన్నారావు, దుంపల శ్యామలరావు పొడుగు శ్రీను, కూన రామకృష్ణ, సాదు చిరంజీవి,దుంపల చిరంజీవి,  వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-09-30 10:31:31

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానించాలి

ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం ప్రతి ఓటరు చేయించుకోవాలని,బి యల్ వో, తది తర సిబ్బంది ఫారం 6 బి తో తమ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఓటరూ సహకరించాలని  జిల్లాకలెక్టర్  పి.ప్రశాంతి అన్నారు. గురువారం కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం పక్రియ కార్యక్రమం ను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం చేసుకోవాలని, యువత తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నప్పుడే ఆధారం నెంబరు వేసి లింక్ చేసు కోవాలన్నారు. ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం తో బోగస్ ఓట్లు ను తొలగించడం సులభం అవుతుందని ఆమె అన్నారు. 

బి యల్ వో , తది తర సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఓటరూ ఆధార్ నెంబరు చెప్పి అనుసంధానం చేసుకోవాలని,అందు బాటులో లేనప్పుడు వచ్చిన తరువాత పోలింగ్ బూత్ కు గాని బి యల్ వో కలసి ఆధార్ నెంబరు లింక్ చేసుకోవాలని ఆమె తెలిపారు. ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం  వేగవంతం చేసి నూటికి నూరు  అనుసంధానం పక్రీయ పూర్తి చెయ్యాలని అధికార్లకు జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టరు వెంట ఆర్ డి వో దాసి రాజు, తహశీల్దారు టి ఏ కృష్ణా రావు,ప్రత్యేక అధికారి యం.రవి కుమార్, తది తర సిబ్బంది పాల్గొన్నారు.

Kalla

2022-09-29 08:41:37

గుండెను పదిలంగా కాపాడుకోవాలి

నేటి ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులోనే పలువురు గుండె  జబ్బులకు గురవుతున్నందున  అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గుండె వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, మధుమేహం నియంత్రణలో లేకపోవడం, అధిక రక్తపోటు వంటి కారణాల  చేత గుండె జబ్బు వెంటాడుతుందన్నారు. ఆయాసం, ఛాతిలో నొప్పి,  చెమట పట్టడం, అలసట, కళ్ళు తిరగడం, గుండెలో దడ ,చాతి మధ్యలో మంటగా, బిగుదుగా, బరువుగా ఉండడం గుండెజబ్బు లక్షణాలు అని అన్నారు. దీన్ని అధిగమించడం కోసం రోజు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలన్నారు. శరీర బరువును అదుపులో ఉంచాలన్నారు .ధూమపానం, మద్యపానం తగదన్నారు. యోగ, ధ్యానం వంటివి చేయాలని అన్నారు. ఆకుకూరలు, చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-29 08:31:38