గ్రామాలలో సచివాలయం, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి గ్రామ స్వరాజ్యనికి సరైన భాష్యం చెప్పారని బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. గురువారం పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో జెప్పి నిధులు రూ.7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు, రూ.40 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సచివాలయ భవనం, రూ.17.50 లక్షల వైద్యంతో ఏర్పాటు చేసిన వైయస్సార్ హెల్త్ క్లినిక్, రూ.21.80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పారదర్శక పాలన సాగిస్తున్నారని, గ్రామ సచివాలయం, వెల్ నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా పాలనను గ్రామాలకే చేర్చారన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యన్ని మన ముఖ్యమంత్రి సాకారం చేశారన్నారు. 3,648 కిలో మీటర్ల పాద యాత్ర లో ముఖ్యమంత్రి పేదల కష్టాలు చూశారన్నారు. 700 రకాల సేవలు గ్రామ సచివాలంలో అందుతున్నాయన్నారు. గ్రామీణ భారతాన్ని బలపరిచిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చెప్పింది చేయని గత పాలకులను చూశామని, పేదరికం అనే దారిద్ర్యం పట్టి పీడిస్తున్న పేదలకు అండగా నిలిచిన నాయకుడన్నారు. ఆరోగ్యశ్రీ అనే సంజీవని తెచ్చిన నాయకుడు వై యస్ అర్ అని గత పాలకులు ఆ పథకాన్ని నీరు కార్చారన్నారు. 3,188 రోగాలను ఆరోగ్య శ్రీ లోకి తెచ్చిన మనసున్న నాయకుడని తెలిపారు. విద్యా వ్యవస్థ లో పెను మార్పులు తెచ్చాం అన్నారు.
45 ఏళ్ల మహిళలకు చేయూత తో అండగా నిలిచాం అన్నారు. 31 లక్షలపై చిలుకు ఇళ్లు పేదలకు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి అన్నారు. నాలుగేళ్ల లో కరువు అనే మాట లేదని జలకళ ఉట్టిపడుతుందన్నారు. భవన నిర్మాణాలకు శ్రద్ధతో కృషిచేసిన సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజును మంత్రి అభినందించారు. ఈరోజు ప్రారంభించిన నిర్మాణాలకు లక్షలు విలువ కలిగిన స్థలాన్ని డాక్టర్ భూపతి రాజు రామరాజు, డాక్టర్ భూపతి లక్ష్మీనరసింహ రాజు వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు భూపతి రాజు, కాశీ అన్నపూర్ణ పేరున విరాళంగా ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
ఈకార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం. యోగేంద్ర బాబు, సర్పంచ్ గొట్టుముక్కల వెంకట శివరామరాజు, స్థానిక నాయకులు గోకరాజు రామరాజు, మేడిది జాన్సన్ , మంల అధికారులు తదితరులు పాల్గొన్నారు.