ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోవుంది..ఆ నియోజవకర్గానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.. నిత్యం ఆ గ్రామానికి అధికారులు, అధికారి పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చిపోతుంటారు.. కానీ దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన చోట ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ భర్త,
ఆ యాక్టింగ్ సర్పంచ్.. విగ్రహం చుట్టూ చెత్తా చెదారాన్ని వేస్తున్నా.. తనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరించినా అధికారపార్టీ నాయకులు ప్రశ్నించరు.. అధికారులు అసలే పట్టించుకోరు.. ఎందుకు వేస్తున్నారని, ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా వాడుతున్నారని, విగ్రహం ఉన్న నిర్మాణాలు ఎందుకు కూల్చావని గానీ ఎమ్మెల్యేతో సహా ఎవరూ ప్రశ్నించారు. ఆ గ్రామమే వెలంపాలెం(జంగులూరు వెలంపాలెం). ఇది పాయకరావుపేట నియోజవకర్గం, ఎస్.రాయవరం మండలంలో ఉంది. సాక్షాత్తు వైఎస్సార్ విగ్రహం పెట్టిన ప్రాంతాన్ని చెత్త చెదారాన్ని వేయిస్తూ..తన కాంట్రాక్టు సామాగ్రిని ఇదే ప్రాంతంలో పెట్టుకొని షెడ్డులా వాడుతున్నారు స్థానిక టిడిపి యాక్టింగ్ సర్పంచ్ వజ్రపు శంకర్రావు.. అంటే ఇక్కడ సర్పంచ్ వజ్రపు క్రిష్ణకుమారి కానీ యాక్టింగ్ మొత్తం ఆమె భర్తదేనని గ్రామస్తులు మొత్తం ఏకమై చెబుతున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం కూడా ఇక్కడ పరిస్థితి చూసిన ఎవరికైనా కనిపిస్తుంది.

వెలంపాలెం(జంగులూరు వెలంపాలెం) గ్రామంలో రోడ్డు ప్రక్కన డా.వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని చిన్నపార్కులా మార్చాలని, గ్రామస్తులకు త్రాగునీరు అందించడానికి ఎస్.రాయవరానికి చెందిన కర్రధనరెడ్డి దాత గ్రామంలోని రోడ్డు ప్రక్కన వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ ప్రహారీ
గోడ నిర్మాణాలు చేపట్టి.. తాగునీటి సౌకర్యం కోసం బోరు వేయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా, పంచాయతీ అనుమతి తీసుకోకుండా నిర్మించడానికి ఎవరికి అధికారం వుందంటూ జరుగుతున్న నిర్మాణాలను స్థానిక సర్పంచ్ భర్త శంకర్రావు జేసీబీతో గ్రామస్తులు చూస్తుండగానే కూల్చేశారని గ్రామ పెద్ద కర్రి సత్యారావు..కట్టుమూరి క్రిష్ణలతో పాటు మరికొంతమంది గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు దృష్టికి తీసుకెళ్లాని ఫలితం లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసినచోట చెత్తను వేసి, తన కాంట్రాక్టు పనులు చేసే ట్రాక్టర్ సామాగ్రిని విగ్రహం చుట్టూ వేసి షెడ్డులా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఆ ప్రాంతంలోనే గ్రామానికి చెందిన చెత్త వేయడంతోపాటు, ఆ ప్రాంతంలో ఎవరూ కూర్చోకుండా నిర్మాణాలు కూలదోసిన సిమ్మెంటు స్థంబాలను కూడా అక్కడే ఉంచారని, పక్కనే వున్న ఇరిగేషన్ కాలువలో నీరు క్రిందకి పోకుండా..నీరు నిల్వ ఉండిపోయేలా చేసి.. వైఎస్సార్
విగ్రహం ఉన్నచోట ఎవరూ కనీసం కూర్చోవడానికి వీలు లేకుండా చేశారన్నారు. పేరుకి మాత్రమే వజ్రపు క్రిష్ణకుమారి గ్రామ సర్పంచ్ అని, గ్రామంలో ప్రభుత్వ వ్యతిరేక పనులు చేసేది..అక్రమ నిర్మాణాలు చేసేదీ ఆయన భర్త వజ్రపు శంకర్రావేనని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో వున్న ఎమ్మెల్యేగానీ, పోలీసులుగానీ,
మండల అధికారులు గానీ ఎవరూ గ్రామం జరుగుతున్న స్వచ్ఛంద అభివ్రుద్ధికి వ్యతిరేకించి..నిర్మాణాలను కూలగొట్టే విధానాలను ప్రశ్నించకపోతే ఇక గ్రామంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వీరు ప్రశ్నించారు.
ఈయన అవినీతిపైనా.. అక్రమాలపైనా ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. మా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కి విగ్రహం కట్టించి..ఆ ప్రాంతాన్ని చిన్న పార్కుగా మార్చుకోలేని దుస్థితో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేరుగా జిల్లా కలెక్టర్, రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నట్టు గ్రామస్తులు తెలియజేశారు. అధికారపార్టీ, ఎమ్మెల్యే ఉన్న చోట పతిపక్షపార్టీకి చెందిన సర్పంచ్ భర్త, యాక్టింగ్ సర్పంచ్ చేస్తున్న వ్యవహరాలపై అధికారపార్టీ నేతలు నోరు మెదకపోవడం ఆశ్చర్యమే. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీని నమ్ముకోవడానికి గానీ..అభిమానించడానికి గానీ.. ఆదరించడానకి గానీ ఎవరూ రానని గ్రామస్తు భహిరంగంగా చెప్పడం విశేషం..!