1 ENS Live Breaking News

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యాన్ని ఇక సహించేది లేదు

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం నగర పాలక సంస్థ ఎన్ని చర్యలు తీసుకొంటున్నా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మార్పు రావడం లేదని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నర్సింహరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని 11వ డివిజన్‌ పరిధిలోని డెయిరీ ఫారం సెంటర్, రాజీవ్‌ గృహకల్ప ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణ నుంచి తడి–పొడి చెత్తను వేరు చేసే విధానం సక్రమంగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజల్లో సరైన అవగాహన కొరవడిందన్నారు. చెత్తను కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకుండా డ్రైనేజీల్లో వేయడాన్ని గుర్తించారు. చాలా మంది ప్రజలు ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారని అక్కడ విధి నిర్వహణలో ఉన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకొంటున్న దాఖలాలు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 

ఇదే ప్రాంతానికి చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు గతంలో షోకాజ్‌ నోటీసు ఇచ్చామనీ, శానిటరీ సెక్రటరీని సస్పెండ్‌ చేశామని ఏడీసీ చెప్పారు. అయినప్పటికీ వీరిలో మార్పు కనిపించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే వీరి నిర్లక్ష్యాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించకపోతే పారిశుద్ధ్యం క్షీణించి దోమలు పెరిగి జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు.

Kakinada

2022-12-15 11:09:45

కాకినాడ కార్పోరేషన్ పరిధిలో 1531 కొత్త పింఛన్లు

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా మంజూరైన 1531 పింఛన్లను జనవరి నెల నుంచి పంపిణీ చేయనున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ కే.రమేష్‌ చెప్పారు. గురువారం ఆయన కాకినాడ సీతారామనగర్, శెట్టిబలిజ రామాలయ ప్రాంతం, కృష్ణానగర్‌ బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో కొత్తగా మంజూరైన పింఛన్లను కమిషనర్‌ రమేష్‌ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఆయా ప్రాంతాల్లోని కొత్త పింఛన్‌దారులతో మాట్లాడారు. పింఛన్ల మంజూరుకు సంబంధించిన విధి విధానాలు ఇతర అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. ప్రస్తుతం కాకినాడలో సుమారు 30వేల పింఛన్లను అందిస్తున్నామన్నారు. తాజాగా 1531 కొత్త పింఛన్లు కూడా మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ జనవరి నెల ఒకటో తేదీన పాత పింఛన్లతో పాటు పంపిణీ చేస్తామన్నారు. అలాగే, ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల సొమ్మును రూ. 2500 నుంచి రూ. 2750కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. పెరిగిన పింఛన్ల మొత్తాన్ని కూడా వచ్చే నెల నుంచి అందజేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వెంట టీపీఆర్‌వో మానే కృష్ణమోహన్, ఆయా డివిజన్ల సంక్షేమ కార్యదర్శులు ఉన్నారు. 

Kakinada

2022-12-15 11:01:53

యాచకులకు దుస్తులు పంపిణీచేసిన బాలభానుమూర్తి

నా అనేవారు లేని యాచకులను ఆదుకోవడానికి మనసున్న దాతలు ముందుకి రావాలని సామాజిక కార్యకర్త బాలభానుమూర్తి అన్నారు. గురువారం సింహాచలంల ప్రాంతంలోని యాచకులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధులకు, నిరాశ్రయులకు, యాచకులకు దుస్తులు పంపిణీ చేసే నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు బిక్షాటన చేసే యచకులకు నేడు నూతన చీరలు, రెడీ మేడ్ జాకెట్టులు, పంచెలు పంపిణీ చేశామన్నారు. దాతలు సహాయంతో వారికి కాస్త స్వాంతన లభిస్తుందన్నారు.

Simhachalam

2022-12-15 08:47:15

నిబంధనల ప్రకారమే ప్రభుత్వ పథకాల అమలు..

ఏజెన్సీలోని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు ఆధార్ బ్యాంక్ అకౌంట్లో అనుసంధానంతో లబ్ధిదారుల ఎకౌంట్లో నిబంధనల ప్రకారం  అమలు చేస్తున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  సూరజ్ గనోరే  పేర్కొన్నారు.  బుధవారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశంహాలులో ఏపీవో జనరల్,  ఎపీడీ వెలుగు,  ఏడిఎం అండ్ హెచ్ ఓ, డి ఎల్ డి ఓ. పి హెచ్ ఓ, అగ్రికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ తాసిల్దార్, ఎంపీడీవో, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్  అధికారి,  ఆధార్ సెంటర్ కోఆర్డినేటర్  తదితరులతో ప్రభుత్వం పథకాలు నేరుగా లబ్ధిదారులకు సకాలంలో  అందించే విధంగా ప్రాజెక్ట్ అధికారి  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ సూరజ్ గనోరే  మాట్లాడుతూ, ప్రతి ఐటీడీఏలో  ప్రోగ్రాం  రివ్యూ కమిటీలు    (పిఆర్ సి)గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి వారి ఆదేశాల మేరకు నాతోపాటు  మొత్తం ఎనిమిది మంది  సభ్యులు ఉంటారని అదేవిధంగా అమ్మ ఒడి, రైతు భరోసా. ప్రధానమంత్రి కిసాన్ పథకం, అడవి హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన రైతులకు  అదేవిధంగా రైతులకు భరోసా పథకం వర్తింపు, ఉపాధి హామీ పథకం తదితర పథకాలపై మండలాల వారిగా  ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు. 

 అమ్మ ఒడి పథకం ద్వారా. ఇప్పటివరకు ఎంత మంది లబ్ధిపొందినది ఆదివిధముగా ఆధార్. బ్యాంకు అకౌంట్లు తప్పులను ఎంతమందికి  సరిచేసింది  అయన ఆరాతీశారు. పియం కిసాన్ పథకం ఇకెవైసి.డెలివరీ అయినా ప్రతి స్త్రీ కి తప్పనిసరిగా చేయించాలని అన్నారు. ఆర్ఓయఫ్ఆర్ పథకం నుండి పట్టాలు పొందిన రైతుకు రైతు భరోసా పథకం అమలు చేయాలనీ అన్నారు, ఏజెన్సీ లోని  జాబ్ కార్డ్ ఉన్న ప్రతి వ్యక్తికి   వంద రోజలు ఉపాధి పనులు ఎంతమందికి కల్పించిన ది అదేవిధముగా ఎన్ని జాబ్ కార్ట్ లు  ఉన్నవి మండలాల వారీగా అయన ఆరాతీశారు,10సంవత్సరం ముందు ఆధార్ కార్డ్  చేయింకున్న ప్రతి వారు తిరిగి ఆప్లోడ్ చేసుకోలాని అన్నారు. 

ఆదివిధముగా 10ఎకరాల భూమి ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు రావని అందుకు కుటుంబ సభ్యులకు మ్యూటేషన్ తప్పనిసరిగా చెయ్యలని అన్నారు, ముందుగా చనిపోయిన వారి గురించి గ్రామ సభ నిర్వహించాలని అన్నారు, అన్ని గవర్నమెంట్ పధకలకు ప్రతి ఇంటికివెళ్లి సర్వే చేయాలనీ అన్నారు, ప్రభుత్వం పధకలకు మోనేటరింగ్ చేయాలనీ  పియంయూ అధికారిని ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఎపిఓ జనరల్  సి హె. శ్రీనివాసరావు. ఏపిడి వెలుగు  ఎ.శ్రీనివాసరావు. ఏడియం అండ్ హెచ్ వో.టి. అనూష. పీహెచ్ఓ. కె. చిట్టిబాబు. డి ఎల్ డి ఓ. కె. కోటేశ్వరరావు. ఎంపీడీవో  ఎం వి ఆర్ కుమార్ బాబు. తాసిల్దార్  పి. వెంకటేశ్వరరావు. ఏ డి ఏ సిహెచ్ కెవి చౌదరి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అధికారిని  డి. సారా కోసల. మండల అగ్రికల్చరల్ అధి కారి చక్రధర్  తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2022-12-14 17:02:45

పశ్చిమగోదావరిలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు..

పశ్చిమ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుచున్నదని,రైతులకు మరింత అవగాహన కల్పించాలని  జిల్లా  కలెక్టరు పి. ప్రశాంతి సంబధిత  అధికారులకు ఆదేశించారు. బుధవారం పాలకొల్లు మండలం  లంకలకోడేరు గ్రామంలో  రైతు బరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా  కలెక్టరు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్బంగా జిల్లా  కలెక్టరు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులు లోపుగానే నగదు జమ జరుగుతుందన్నారు. ధాన్యం  రవాణాను ప్రభుత్వం చేపడితే ఏజెన్సీకి రవాణా ఖర్చులు చెల్లించడం జరుగుతుందని, అలాగే రైతు గాని స్వయంగా రవాణా, గన్ని బ్యాగులు, హమాలీలను ఏర్పాటు చేసుకుంటే దాన్యం డబ్బుతో పాటు సదరు ఖర్చులను కూడా రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. 

గన్ని బ్యాగులకు ఇబ్బంది లేదని ఇప్పటికే  గన్నిబాగ్ లు  జిల్లాలో అన్ని  ఆర్ బి కె కేంద్రాలలో  సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఏక్కడయినా ఏటువంటి సమస్య తలెత్తినా వెను వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని , నిర్లక్ష్యం అలసత్వం వహించినా , పిర్యాదు లు వచ్చినా  సంబంధిత అధికారులు, సిబ్బందిని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా  కలెక్టరు  అన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో ఎంతమంది రైతుల దగ్గర నుండి దాన్యాన్ని కొనుగోలు చేశారు.  ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేశారు, ఎంతమంది రైతులకు ఎన్ని డబ్బులు చెల్లించారు,  ఇంకా ఎంతమంది రైతులకు డబ్బులు చెల్లించవలసి ఉంది తదితర వివరాలను కంప్యూటర్ లో ,  రిజిస్టర్లు జిల్లా కలెక్టరు పరిశీలించారు.

 అనంతరం లంకలకోడేరులోని  వెంకటసాయి ట్రేడర్సు రైస్ మిల్లును జిల్లా కలెక్టరు తనిఖీచేశారు.  ఈ రైస్ మిల్లు కు ఎప్పటి వరకు ఎంత ధాన్యం తరలించడం జరిగిందని , ఇంకా ఎంత ధాన్యాన్ని మిల్లుకు సరఫరా చేయాలి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ధాన్యం నిల్వల రికార్డులను పరిశీలించారు. ధాన్యం నిల్వలలో వ్యత్యాసాలు ఉంటే  సంబంధిత యాజమాన్యపై చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి  హెచ్చరించారు.

  ఈ తనిఖీలో జిల్లా సివిల్ సప్లై అధికారి యన్.సరోజ , ఏ యస్ వో యం.రవి శంకర్, వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రహీమ్, రైతు భరోసా కేంద్రం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Palakollu

2022-12-14 11:08:10

ప్రతీ ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలుచేస్తుంది

మాండూస్ తుపాన్ ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు రైతాంగం పండించిన  ధాన్యం తడిసిన మూలంగా ఎవరూ ఆందోళన చెందవద్దని రైతు పండించిన చిట్ట చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం జనుపల్లి గ్రామంలో రైతుల కళ్లల్లో రోడ్లపైన ఆరబెట్టుకున్న ధాన్యo రాశులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ మాండోస్ తుఫాన్ ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకుని కనీస మద్దతు ధరకు విక్రయించుకునే విధంగా సౌకర్యవంతం చేయడం జరుగుతుందని ఆందోళన 
చెందవద్దని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ తడిచిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు.  పంట మార్పిడిలో భాగంగా వరికి ప్రత్యామ్నాయంగా తుఫాను ప్రకృతి వైపరీత్యాలను అధిగమించే ఇతర పంటలపై కూడా కోనసీమ రైతాంగం దృష్టి సారించాలని పేర్కొన్నారు.

పంట పొలాల్లో పనల రూపంలో పంటతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం రాశుల స్థితిగతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీ లించి సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీ లించి అన్నదాతలలో ధైర్యాన్ని  నింపుతున్నామన్నారు. అనంతరం కామనగరువు లో వెంకట సత్యనా రాయణ ట్రేడర్స్ రైస్ మిల్లును ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం కొంచెం అటు ఇటుగా ఉన్న మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లకు సూచించారు. ఆరుగాలం శ్రమించి ప్రజానీకానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మానవ దృక్పథంతో గిట్టుబాటు ధరలు కల్పించడంలో మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వసంతరాయుడు స్థానిక తాసిల్దార్ పి శ్రీ పల్లవి, గ్రామ సచివాలయ సిబ్బంది సర్పంచ్ నక్కా అరుణకుమారి ,రైతులు పాల్గొన్నారు.

జనుపల్లి

2022-12-13 13:56:51

శ్రీవారి లడ్డూలు ఆన్ లైన్ అనే ప్రచారం అవాస్తవం

ఆన్ లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టిటిడి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tirumala

2022-12-12 14:39:47

ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది..

సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
  కొల్లూరు మండలం రావికంపాడు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాగార్జున, జిల్లా కలెక్టర్  విజయ కృష్ణన్ కలిసి సోమవారం పాల్గొన్నారు. ముందుగా రూ.40 లక్షలతో గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కుంభమేళాతో రాష్ట్రమంత్రి,  కలెక్టర్ కి  గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
 గ్రామ ప్రజల ఇంటి ముంగిటకే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం తెచ్చిందని మంత్రి నాగార్జున చెప్పారు. సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చక్కగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల పాత్ర అభినందనీయమన్నారు. నిరుపేదలైన ప్రతి ఇంటికి నవరత్నాలతో సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.

 ప్రజలకు అన్ని సేవలు సచివాలయాలనుంచి అందించేలా అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
   అనంతరం ఉపకార వేతనం కింద రూ.55,000లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.14,050లు లబ్ధి పొందిన పల్లకట్టి హేమంత్ కుటుంబాన్ని మంత్రి, కలెక్టర్ సందర్శించారు. నవరత్నాలు బ్రోచర్ ను లబ్ధిదారుడికి అందజేశారు. పంటల బీమా రూ.25,980, సున్నా వడ్డీ, వైయస్సార్ పింఛన్ కానుక నగదు అందుకున్న మరో లబ్ధిదారులు లంక నాగేంద్రం కుటుంబాన్ని పరామర్శించి పత్రాన్ని అందించారు.
   కార్యక్రమంలో రేపల్లె ఆర్డిఓ పార్థసారథి, తాసిల్దార్, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.

Kolluru

2022-12-12 14:24:42

అనకాపల్లిలో దాడి జయవీర్ భూఆక్రమణలు అడ్డుకోండి

అనకాపల్లి జిల్లాలో అధికారపార్టీకి చెందిన నేత దాడి జయవీర్ భూ ఆక్రమణలు ప్రభుత్వం తక్షణమే అడ్డుకోవాలని జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొనతాల సీతారామ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా అనకాపల్లి మారిన తరువాత ఎక్కడ విలువైన భూములు ఉండే అక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా తాను అనకాపల్లిలో శంకర్ థియేటర్ వెనుక, హిమశేఖర్ స్కూలు ముందు దక్షిణంలోని సర్వే నెంబరు 50/13 లో కొనుగోలు చేసి  2018లో రిజిస్టర్ చేయించుకున్న భూమి 3920 గజాల భూమిని ఇపుడు అధికారపార్టీనేతలు కబ్జా చేశారన్నారు. దీనిపై తాను ముఖ్యమంత్రి కార్యాలయాలనికి  ఫిర్యాదు చేసినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నారు. కర్రి బ్రహ్మానందం అనే వ్యక్తి దగ్గర నుంచి తనబావమరిది రామచంద్రరావు కొనుగోలు చేశారని.ఆయన దగ్గర నుంచి తాముకొనుగోలు చేసుకున్నామని..నేటికీ మా పేర్లుతోనే రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఆన్ లైన్ లో విరాలు చూపిస్తున్నాయని మీడియాకి విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇపుడు ఎవరివ వద్దనైతే తాము ఈ భూములు కొనుగోలు చేశామో అదే వ్యక్తిని అధికారపార్టీనేతలు ప్రలోభాలకు గురిచేసి.. రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేస్తున్నారన్నారు. 

తమ భూముల్లోని బోర్డులను పీకేసి..ఆక్రమించుకున్నవారి బోర్డులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు పనులకు, భూ కబ్జాలకు పాల్పడే వారు ఎలాంటి వారైనా కఠిన చర్యలు చర్యలు తీసుకుంటుందనే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటనపై నమ్మకంతోనే ఇపుడు తాను తనభూమి అన్యాక్రాంతం అయిన విషయాన్ని ఫిర్యాదు చేశానన్నారు. త్వరలోనే తన భూమి వివరాలు, రికార్డులు ఎవరెవరు తప్పుడు డాక్యుమెంట్లుతో తారుమారు చేశారో వారి వివరాలతో ముఖ్యమంత్రిని కలవనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే విషయమై జిల్లా రిజిస్ట్రార్, మరియు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలోతెలియజేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాట సాగిస్తానని తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో ఎరికైనా విలువైన భూములుంటే తక్షనమే నిర్మాణాలు చేసుకోవాలని లేదంటే..అధికారపార్టీ నేతల కంట్లో పడితే రాత్రికి రాత్రే ఆ భముల రికార్డులు మారిపోయే ప్రమాదం వుందని కొణతాల సీతారామం హెచ్చరించారు. ప్రభుత్వం అధికారపార్టీనేత భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేసేందుకు వెనుకాడేది లేదన్నారు.

Anakapalle

2022-12-12 13:36:21

అంగన్వాడీల ద్వారా మాతా శిశువులకు పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద పిల్లలు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి చెప్పారు.  శుక్రవారం ఆమె కె.కోటపాడు మండల కేంద్రం లోని సెంటర్ 5, గొండుపాలెం  అంగన్వాడీ కేంద్రాలను  తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని వంటగది, వంట చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. పదార్థాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, నిర్ణయించిన మెనూ ప్రకారం ఆహారం వండాలని ఆదేశించారు.  ఏమాత్రం లోటుపాట్లు  వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించారు.

K. Kotapadu

2022-12-09 10:39:31

అన్నవరంలో మళ్లీ అన్నప్రసాదం అరిటాకులోనే

అన్నవరం దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన పథకంలో దేవస్థానం అధికారులు తిరిగి అరిటాకులోనే భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఆకుల కోసం ప్రతీఏటా అత్యధిక మొత్తం ఖర్చు అవుతుందని.. ఆ అదనపు ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన కంచంలోని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిలిపివేశారు. శుక్రవారం నుంచి మళ్లీ అన్నసత్రంలో యధావిధిగా దేవస్థానంలో అరికటాకులో స్వామివారి అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. పీఠాధిపలులు, పలువురు స్వామీజీలు అన్నవరం పుణ్యక్షేత్రంలో ట్రస్టుబోర్టు తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తప్పుపట్టడంతో గత్యంతరం లేక తిరిగి అరిటాకుల్లోనే ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. 
స్టీలు కంచాల్లో భోజనాలు పెట్టడంపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా ఇపుడు అన్నదానం కోసం ప్రత్యేంగా తీసుకున్న రెండు వేల స్టీలు కంచాలు మూలకు చేరినట్టు అయ్యింది.

Annavaram

2022-12-09 06:31:47

అన్నవరంలో మళ్లీ అరిటాకులోనే అన్నదానం

అన్నవరం దేవస్థానంలోని శ్రీ సత్యదేవ నిత్యాన్నధాన పథకంలో దేవస్థానం అధికారులు తిరిగి అరిటాకులోనే భోజనం పెట్టడం మొదలు పెట్టారు. ఆకుల కోసం ప్రతీఏటా అత్యధిక మొత్తం ఖర్చు అవుతుందని.. అదనపు ఖర్చు తగ్గించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన కంచంలోని అన్నప్రసాద కార్యక్రమాన్ని తిరిగి నిలిపివేశారు. శుక్రవారం నుంచి మళ్లీ యధావిధిగా దేవస్థానంలో అరికటాకులో స్వామివారి అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. పీఠాధిపలులు, పలువురు స్వామీజీలు అన్నవరం పుణ్యక్షేత్రంలో ట్రస్టుబోర్టు తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తప్పుపట్టడంతో గత్యంతరం లేకి తిరి అరిటాకుల్లోనే ప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు. 
స్టీలు కంచాల్లో భోజనాలు పెట్టడంపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా ఇపుడు అన్నదానం కోసం ప్రత్యేంగా తీసుకున్న రెండు వేల స్టీలు కంచాలు మూలకు చేరినట్టు అయ్యింది.

Annavaram

2022-12-09 06:21:11

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన కాకినాడ ఒకటవ సర్కిల్ పరిధిలోని రమణయ్యపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. తడి-పొడి చెత్త విభజించి ఇస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అపార్ట్మెంట్ల వద్ద చెత్త సేకరణ లో ఇబ్బందులను గమనించారు. బహుళ అంతస్తుల భవనాల యజమానులు పెద్ద డస్ట్ బిన్ లను సెల్లార్లలో  ఏర్పాటు చేసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన చెత్త వేయడానికి గుర్తించారు. ఆ ప్రాంతాలపై పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏ డి సి నాగ నరసింహారావు కోరారు., రోడ్ స్వీపింగ్ తో పాటు పుష్ క్యాట్ ద్వారా చిన్న చిన్న సందుల్లోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో విఫలమైతే  సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ తో పాటు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Kakinada

2022-12-07 13:48:10

రైతులు మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి

మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ రైతులను కోరారు. గరుగుబిల్లి  మండలం చినగొడబలో జాయింట్ కలెక్టర్ బుధ వారం పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తేమ, నాణ్యత కొలిచే యంత్రాల పనితీరును పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందికి వివరాలు అడిగి  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో ధాన్యం కొనుగోలు సాఫీగా జరుగుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులు పూర్తి అవగాహన పొందాలని కోరారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించ వద్దని పిలుపునిచ్చారు.  ప్రభుత్వము ద్వారా కొనుగోలు చేసిన ధాన్యము నింపడానికి రైతులే గోనె సంచులను ఏర్పాటు చేసుకుంటే, ప్రతి 40 కిలోల సామర్థ్యం గల గోనె సంచికి రూ.3.39 లు చెల్లించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు.

రైతులకు ధాన్యం రవాణా ఖర్చులు
రైతులకు ధాన్యం రవాణా ఖర్చులు చెల్లించుటకు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ధాన్యం రవాణా అంశాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించామని, అయితే రైతుల ధాన్యం కొనుగోలు నిబంధనలకు అనుగుణముగా  కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన తరువాత రైస్ మిల్లులకు తరలించడానికి అయ్యే రవాణా చార్జీలు రైతులు భరిస్తే దానిని చెల్లిస్తామని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను రైతులకు ఇస్తామన్నారు. పార్వతీపురం డివిజన్ లో 8 కిలో మీటర్ల వరకు ఒక మెట్రిక్ టన్నుకు రూ. 295 లు, పాలకొండ  డివిజన్ లో మూడు వందల రూపాయలు స్లాబ్ ధర చెల్లించడం జరుగుతుందని ఆయన అన్నారు. 8 నుండి 20 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు ఒక మెట్రిక్ టన్నుకు 7 రూపాయలు,   20 నుండి 40 కిలో మీటర్ల వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6.50 రూపాయలు, 40 నుండి 80 కిలో మీటర్లు వరకు ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 6 రూపాయలు,  80 కిలో మీటర్లు పైబడి ప్రతి అదనపు కిలోమీటరుకు మెట్రిక్ టన్నుకు 5.50 రూపాయలు చెల్లించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Garugubilli

2022-12-07 12:35:31

విద్యార్ధుల మధ్యాహ్నా భోజనంలో నాణ్యత తగ్గరాదు

ప్రభుత్వ మెనూ ప్రకారం పాఠశాలల్లో విద్యార్ధినీ, విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో పర్యటన సందర్భంగా బుధవారం ఈ మేరకు కరపమండలంలోని పెనుగుదురు 1వ నెంబరు  జిల్లా పరిషత్  హైస్కూలు, కరప మోడల్ ప్రైమరీ స్కూల్, జిల్లాపరిషత్ గురాజనపల్లి పాఠశాలల్లోని భోజన, వసతిని ఆయన పరిశీలించారు. అక్కడ పిల్లలకు అందుతున్న భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్నాన భోజన పథకాన్ని ప్రవేశ పెడుతోందని.. దానిని 
ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఎప్పుడైనా భోజనం బాగలేకపోయినా..సరుకులు నాణ్యత తగ్గినా తమ దృష్టికి  తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ తో పాటు ఇంచార్జి డీఈఓ, ఆర్జేడి రాజు, కాకినాడ అర్బన్ డీఐ  వాణి కుమారి ఎండీఎం డేటా అనాలిసిస్ట్ ఎం. వీరబాబు, ఎండీఎం కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ హరికృష్ణ, కరప ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

Karapa

2022-12-07 12:23:24