1 ENS Live Breaking News

రాబిస్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి..

రాబిస్ వ్యాధిపై పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డా.కుమార్ యాదవ్ సూచించారు. గురువారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబిస్ వ్యాధి నివారణ- నియంత్రణపై అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు.  రాబిస్ సోకిన కుక్క, గబ్బిలాలు,  చిట్టి ఎలుక, పిల్లి, కోతి వంటి జంతువులు మనుషులను కరిస్తేనే రాబిస్ వ్యాధి వస్తుందన్నారు. ఇది లాలాజలం ద్వారా వస్తుందన్నారు. రాబిస్ సోకిన జంతువు గాట్లు పెట్టినా,  గీరి నా వెంటనే సబ్బు నీటితో కడగాలన్నారు. దీనివలన వైరస్ ను నివారించే అవకాశం ఉందన్నారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. రాబిస్ వ్యాధి వస్తే కుక్కలాగా మొరగడం, నీటి భయం ఎక్కువగా ఉంటుందన్నారు. లూయిస్ పాశ్చర్ రాబిస్ వ్యాక్సిన్ కనుగొనడంతో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రపంచ రాబిస్ దినోత్సవం గా జరుపుకుంటున్నామని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-29 08:29:40

గుర్రం జాషువా జీవితం స్ఫూర్తిదాయకం

బడుగు బలహీన వర్గాల  అభివృద్ధి కోసం అహరహం శ్రమించిన జాషువా సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయక మని విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు  పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన జన్మించారని అన్నారు. ఆధునిక తెలుగు సాహిత్య లోకాన ఆయనది ఒక ప్రత్యేకమైన స్థానమన్నారు. సామాజిక దృష్టి కోణంతో భావ,  అభ్యుదయ భావనల మేలమింపుతో తనదైన శైలిలో సాంఘిక ఆర్థిక అసమానతల మూలాలను ఛేదిస్తూ  ఆత్మ గౌరవానికి ప్రత్యేక గా నిలిచారని అన్నారు. జాషువా ఖండకావ్యాలన్నీ అఖండ కీర్తిని అర్జించి పెట్టే అద్భుత కావ్యాలు అని అన్నారు. సర్వ మానవుల సంతోషాన్ని తన రచనల ద్వారా కోరుకున్నారని అన్నారు. సామాజిక సమానత్వాన్ని ఆయన ఆకాంక్షించారని  బాపిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-29 08:26:33

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి

ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారి పి గాంధీ సిబ్బందికి సూచించారు. బుధవారం శంఖవరం రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సిబ్బంది సాగు చేయడమే కాక ఎక్కువ మంది రైతులు ఈ విధానంలో వ్యవసాయం చేసే విధంగా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సిబ్బంది శంఖవరం,నెల్లిపుడి , కొత్తపల్లి, పెదమల్లపురం, వేళంగి గ్రామాల్లో ఈ పద్దతుల్లో చేపడుతున్న పంటల సాగు విధానాలను వివరించారు. గ్రామీణ వ్యవసాయ సహాయకుల డ్యూటీ రిజిస్టర్ లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్తిబాబు,అప్పన్నదొర,సతీశ్,వీరబాబు, లక్ష్మణ్,ప్రసాద్,గోవింద్,లక్ష్మి,లోలాక్ష్మి,సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-09-28 11:39:11

పైడిమాంబ సిరిమాను చెట్టుకు పూజలు

ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు, బుధవారం గంట్యాడ మండలం సిరిపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సిరిమాను తయారీ ప్రక్రియలో భాగంగా, ముందుగా సిరిమాను, ఇరుసుమాను చెట్లకు, నిర్ణయించిన ముహూర్తం ఉదయం 8.15 గంటలకు, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, చెట్లను నరికే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చెట్లను నరికి బుధవారం సాయంత్రానికి విజయనగరం పట్టణం, హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.

      ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, అమ్మవారి దయతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలకు అనుగుణంగా, అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమ్మవారి సిరిమానోత్సవాన్ని భక్తులు నేరుగా తిలకించలేకపోయారని, ఈ ఏడాది అందరినీ ఉత్సవానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.

    కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,  ఎంమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఆలయ ఈఓ కిషోర్, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Gantyada

2022-09-28 06:56:14

శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైఎస్.జ‌గ‌న్‌

బ్ర‌హ్మోత్స‌వాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉద‌యం రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మో హ‌న్‌రెడ్డి శ్రీ వేంకటేశ్వర‌స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న సీఎంకి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ప‌లికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్‌  వైవి సుబ్బారెడ్డి ఈవో ఎ వి  ధర్మారెడ్డి తో కలిసి ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.

ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ భ‌వ‌న నిర్మాణానికి రూ.23 కోట్లు విరాళంగా అందించిన దాత  ముర‌ళీకృష్ణ‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తరువాత రాజ్యసభ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన విపిఆర్ విశ్రాంతి గృహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-09-28 05:45:59

రీ-సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి

అనకాపల్లి జిల్లాలో భూముల రీసర్వే వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు.  ఆమె బుచ్చయ్యపేట తాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీ సర్వే ప్రోగ్రెస్ ను పరిశీలించారు. ఎన్ని గ్రామాలు రీ సర్వే జరిగాయి, ఇంకా ఎన్ని జరగాలి అనే విషయమై తాసిల్దార్ ఎస్.బి. అంబేద్కర్, డిటి పి.మురళి, మండల సర్వేయర్ లతో చర్చించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా రీ సర్వే పక్కాగా జరగాలన్నారు. రీ సర్వే మూలంగా కలిగే లాభాలను రైతులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Butchayyapeta

2022-09-23 03:29:53

సామాజిక చైతన్య జాడ గురజాడ

సామాజిక చైతన్యానికి బాటలు వేసిన మహనీయులు గురజాడ అప్పారావు అని రాజీవ్ విద్యామిషన్ పిఒ రోణంకి జయప్రకాష్ కొనియాడారు.  శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో గురజాడ 160వ జయంతి వేడుకలు గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్ జామి భీమశంకర్, అధ్యక్షులు పత్తి సుమతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయప్రకాష్ మాట్లాడుతూ, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ నినదించిన ఆధునిక వైతాళికుడు గురజాడ అన్నారు.  అనంతరం పిఒ మాట్లాడుతూ సమాజంలోని సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తి తన అక్షరాలనే శస్త్రాలుగా చేసి ప్రశ్నించిన అభ్యుదయ కవి గురజాడ అన్నారన్నారు. 

సొంతలాభం కొంతమానుకొని పొరుగువారికి తోడ్పడాలంటూ ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను పెంపొందించాలని చెప్పారన్నారు. గురజాడ సృష్టించిన అక్షర అణిముత్యాలు కన్యాశుల్యం నేటికీ సాహితీవనంలో ఆచంద్రతారారక్కం వెలుగొందుతోందని రోణంకి జయప్రకాష్ చెప్పారు. రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఉన్న కస్తూరిబా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనాన్ని సందర్శింపచేసి స్ఫూర్తి పొందేలా తన వంతు సహకరిస్తాననన్నారు. గురజాడ అధ్యయన వేదిక కన్వీనర్ జామి భీమశంకర్, అధ్యక్షురాలు పత్తి సుమతి మాట్లాడుతూ గడిచిన పదేళ్లుగా మహాకవి గురజాడ భావజాలాన్ని భావితరాల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్నామన్నారు.

 పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కంతో పాటు నాటి సమాజంలో ఉన్న దురాగతాలపై సాహిత్యపు అంకుశాలను వదిలిన గురజాడ ఎప్పటికీ సజీవమే అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు పీవో రోణంకి జయప్రకాష్  బహుమతులు అందజేశారు. అనంతరం గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు ఎం.ప్రసాదరావు, సురంగి మోహన్ రావు, బరాటం లక్ష్మణరావు, వావిలపల్లి జగన్నాథంనాయుడు, హారికాప్రసాద్, పొన్నాడ రవికుమార్, నిక్కు అప్పన్న, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకరరావు, పందిరి అప్పారావు, తర్జాడ అప్పలనాయుడు బృందం పీవోను శాలువ, మెమెంటో ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాధరి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-21 09:36:00

ప్రారంభదశలో అల్జీమర్స్ ను నియంత్రంచవచ్చు

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు, వినికిడి శక్తి తగ్గడం సహజమని అలాగే అల్జీమర్స్ కూడా అని అయితే దీనిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ వారిని గుర్తించకపోవడం, పేర్లు మరిచిపోవడం ,వెళ్ళవలసిన సమయం మరచి పోవడం, అధిక ఆత్రుత, భయం అల్జీమర్స్ లక్షణాలని అన్నారు. ప్రస్తుత సమయం, తేదీ, రోజులను మరిచిపోవడమే గాక ఇంటి చిరునామా కూడా మరిచిపోతారని అన్నారు. సాధారణ రక్ష పరీక్ష ద్వారా వీటి మోతాదును తెలుసుకొని మందులతో పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. అల్జీమర్స్ కు గురైన వ్యక్తిని ఒంటరిగా బయటకు పంపరాదని అన్నారు .రోగికి ప్రశాంత వాతావరణం కల్పించాలని, సమతుల ఆహారం అందించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-21 09:20:49

సర్పవరంలో ఘనంగా వామన జయంతి

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని అందు అయిదవ అవతారంగా  భాద్రపద మాస ద్వాదశిన వామనవతారం ఎత్తాడని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ అన్నారు. బుధవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో శ్రీరామ నామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి ఆధ్వర్యంలో వామన జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్టాడుతూ,  బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం నిర్వహించడం ,విశేషంగా బ్రాహ్మణులకు దానాలు చేయడం తో  అమిత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడని అన్నారు. దీంతో దేవతల తల్లి అయిన అదితి శ్రీమహావిష్ణువును వేడుకొనడంతో ఆయన వామావతారం ఎత్తి తనకు మూడు అడుగుల నేల కావాలని బలి చక్రవర్తిని కోరడం దానిపై దానికి అంగీకరించడం జరిగిందని అన్నారు. 

ఒక అడుగు నేలపై వేసి రెండో అడుగు ఆకాశం పై వేసి మూడో అడుగు ఎక్కడ వేయాలని బలి చక్రవర్తిని కోరగా తన నెత్తిపై వేయాలనగా వామనవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన మూడో పాదాన్ని బలి నెత్తి మీద వేసి పాతాళానికి తొక్కేస్తాడని పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ నామ క్షేత్ర అధ్యక్షులు రాజా సౌజన్యంతో వృద్ధులకు భోజన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-07 06:59:24

ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగించుకోవాలి

ఉజ్వల పధకం పంపిణీ చేస్తున్న గ్యాస్ కనెక్షన్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని  కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.  మంగళవారం కాకినాడ జిల్లా, శంఖవరంలోని సింధు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ ఎంపీ వంగా గీత పాల్గొని లబ్దిదారులైన మహిళలను గ్యాస్ స్టవ్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,  మహిళల ఆరోగ్య భద్రతకే కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేస్తోందని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో శంఖవరం మండలంనకు 259 దరఖాస్తులు రాగా వీటిలో 155 మందికి పంపిణీ చేస్తున్నారని, ఇంకా 104 కురదలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ పధకం కనెక్షన్లను అమ్ముకోవద్దనీ, అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె లబ్దిదారులను కోరారు.

శంఖవరం పంచాయతీ ఉపసర్పంచ్ చింతం నీడి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు కొన్ని గ్యాస్ కనెక్షన్లను లాంఛనంగా పంపిణీ చేస్తున్నారని, మిగతావన్నీ గ్రామాల వారీగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.  ప్రభుత్వం కల్పించే ఈ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల పరిషత్తు అధ్యక్షుడు, శంఖవరం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ది  సంఘం అధ్యక్షుడు పర్వత రాజబాబు, శంఖవరం ఎంపీటీసీ సభ్యులు గెడ్డం రాణీ, అడపా వీరబాబు, అన్నవరం ఎస్సైలు శోభన్ కుమార్, అజయ్ బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-09-06 13:57:42

పీఎం కిసాన్ నమోదుకి రేపే ఆఖరు

పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతులు ఈకేవైసీ చేసుకోడానికి రేపటితో (7వ తేదీ )గడువు ముగుస్తుందని శంఖవరం మండల వ్యవసాయ అధికారి పి.గాంధీ రైతులకు సూచించారు. మంగళవారం నెలిపూడి, కొంతంగి రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈ మేరకు రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి మాట్లాడుతూ, వచ్చే 12 విడత సొమ్ము జమ కొరకు అర్హులైన ప్రతీ రైతు ఈకేవైసీ బుధవారం లోగా చేసుకోవాలని కోరారు. అనంతరం రైతులతో సమావేశమై ఈకేవైసీ,పంట నమోదు, వరిలో చీడ పీడల నివారణ తదితర అంశాలపై సూచనలు సహాలు చేశారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది చేసిన ఈ పంట నమోదు  రైతుల వివరాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు.వి.అర్. ఓ,సిబ్బంది తాతాజీ,శ్రావణి,రైతులు,వాలంటీర్లు పాల్గోన్నారు.

Sankhavaram

2022-09-06 11:10:35

రైతులు ఈ-క్రాప్ లో నమోదు కావాలి

రైతులు ఇ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. మంగళవారం సాలూరు మండలంలో  పర్యటించిన జిల్లా కలెక్టర్ నమోదు పరిస్థితిని స్వయంగా పంట పొలాల్లోకి వెళ్లి తెలుసుకున్నారు. ఇ క్రాప్  నమోదులో పరిస్థితులను పరిశీలించారు. స్థానిక అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇ క్రాప్ నమోదుకు బుధవారం వరకే గడువు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12,500 మంది తక్షణం ఇ క్రాప్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని వారందరికీ రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సహాయ సహకారాలు అందించి నమోదు అయ్యేటట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఇ క్రాప్ నమోదు కాకపోతే ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ కార్యక్రమాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

ప్రయోజనాలు కోల్పోకుండా తక్షణం ప్రతి రైతు ముందుకు వచ్చి తమ పంటలను ఇ క్రాప్ నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందాలని సూచించారు.  ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ భవన నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.  నిర్మాణాలను మరింత వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలో సిబ్బంది నియమాకునికి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మందులు అన్ని ఉండాలని, ప్రతి ఇంట జరుగుతున్న సిడి, ఎన్సిడి సర్వేలో భాగంగా రక్త నమూనాలను సేకరించి పరీక్షించాలని ఆయన చెప్పారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండి వచ్చే పేషెంట్లకు ఆహ్లాదాన్ని ఇవ్వాలని తెలిపారు.

 ఆసుపత్రికి వచ్చిన వెంటనే తగ్గిపోతుందనే విశ్వాసాన్ని వారికి కల్పించాలని చెప్పారు. వైద్యులు, సిబ్బంది ప్రేమ పూర్వకంగా పలకరించి వారికి సేవలందించడం వలన త్వరగా ఉపశమనం పొంది తిరుగు ముఖం పట్టగలరని కలెక్టర్ ఉద్భోదించారు. ఆసుపత్రికి వైద్యానికి వచ్చే వారికి సరైనటువంటి మార్గదర్శకం అందించాలని పేర్కొన్నారు. గర్భిణీలు పట్ల మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.108 వాహనాల్లో ప్రసవాలు జరగరాదని, గర్భిణీలు ముందుగా ఆసుపత్రికి వచ్చే విధంగా ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.   ప్రభుత్వ భవనాలు - రైతు భరోసా కేంద్రం , వైయస్సార్ హెల్త్ క్లినిక్, సచివాలయం నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ స్థాయిల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు తాసిల్దార్ రామస్వామి, ఎంపీడీవో, వ్యవసాయ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Salur

2022-09-06 11:00:06

భూముల రీసర్వే తో పక్కాగా రికార్డులు

భూములరీ సర్వేతో పక్కా రికార్డులు రూపొందుతాయని, భూమి కొలతల  విషయంలో  గతంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే   సరిదిద్దడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. మంగళవారం ఆమె అనకాపల్లి జిల్లా కశింకోట మండలం లో పర్యటించారు. తాసిల్దార్ కార్యాలయంలో రీసర్వే రికార్డులను పరిశీలించారు. చిన్న పొరపాటైనా జరుగకుండా సర్వే పక్కాగా జరగాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వే పై అధికారులు ఉద్యోగుల తో సమీక్షించారు. తరువాత వెదురుపర్తి గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వే చేసిన భూమి వివరాలు ప్రదర్శించారా, సర్వే పనులు ఎలా ఉన్నాయి అని అడిగారు.  సర్వే పనులు సంతృప్తిగా ఉన్నాయని , భూమి వివరాలు పెట్టారని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయుడు, సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Kasimkota

2022-09-06 10:06:28

పారదర్శకంగా ప్రభుత్వ పధకాలు అమలు

పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరు అద్భుతంగా ఉన్నదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డ్ లో లక్ష్మి నగర్ వీది లో నిన్న సందర్శించగా మిగిలి ఉన్న భాగం లో గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ఆయన సంబంధిత అధికారులు,పట్టణ వైసీపీ క్యాడర్ తో పాటు పాల్గొన్నారు.ప్రజల అవసరాలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం విషయంలో గుర్తెరిగి వాటిని అమలు చేస్తూ మనసెరిగిన నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలందిస్తున్నారని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ సందర్శించిన స్పీకర్... సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన లబ్దిదారులకు అందుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు.

సమయానికి వృద్దులకు,వితంతువులకు పింఛన్ లు అందుతున్నాయా అని పలువురు వృద్దులను,వితంతువులను అడిగి తెలుసుకున్నారు.జగనన్న దయతో సమయానికే వాలంటీర్లు తీసుకు వచ్చి అందజేస్తున్నారని వారు  బదులిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేని వారు,సంబందిత సచివాలయం అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్పీకర్ దృష్టికి వచ్చిన పలు  సమస్యలను అక్కడే ఉన్న అధికారులుతో చర్చించి పరిష్కారం అయ్యేలా చొరవ చూపారు.మున్సిపాలిటీ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు కు సంబంధించిన పూర్తి వివరాలను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన వివరించారు. 

వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగిందనే విషయాన్ని స్పీకర్ తమ్మినేని వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పారదర్శకతతో జవాబుదారీతనంతో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పథకాల ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్పీకర్ సూచించారు.ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో తక్షణం చేపట్టాల్సిన పనులకు రూ. 20 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లం శెట్టి ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు పట్టణ పార్టీ అధ్యక్షులు పోడుకు శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, శిల్లా మళ్ళి, పొన్నాడ చిన్నారావు,సాదు కామేశ్వరరావు, మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-09-06 09:08:44

మెనూప్రకారమే పిల్లలకు భోజనాలు పెట్టాలి

విజయనగరం జిల్లా కెల్ల జిల్లాప‌రిష‌త్ పాఠ‌శాల‌లో అమ‌లు చేస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని మంగళవారం క‌లెక్ట‌ర్ సూర్యకుమారి త‌నిఖీ చేశారు. ఆహార ప‌దార్ధాల‌ను స్వ‌యంగా ఆమె రుచి చూశారు. మెనూ, పిల్ల‌ల సంఖ్య‌పై ప్ర‌శ్నించారు. కిచెన్‌షెడ్ నిర్మాణాన్ని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. అనంత‌రం ప‌దో త‌ర‌గ‌తికి వెళ్లి, విద్యార్థుల‌తో మాట్లాడారు. వారిచేత పాఠాల‌ను చ‌దివించి, ప‌రీక్షించారు. బాలిక‌లంద‌రినీ స‌ఖి గ్రూపుల్లో చేర్చాల‌ని సూచించారు. విద్యార్థుల‌కు చ‌దువుతోపాటు, కెరీర్ గైడెన్స్ నిర్వ‌హించాల‌ని, వారు ల‌క్ష్యాన్ని సాధించే మార్గాల‌ను సూచించాల‌ని, హెడ్‌మాష్ట‌ర్ పైడిత‌ల్లిని ఆదేశించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ తమ తరగతి గదుల్లోకి వచ్చి పాఠ్యాంశాలు బోధించడం, తమను సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గుర్ల తాశీల్దార్ ప‌ద్మావ‌తి, ఎంపిడిఓ బి.క‌ల్యాణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


Kella

2022-09-06 09:01:44