1 ENS Live Breaking News

గిరి ప్రదక్షణను పరిశీలించిన కలెక్టర్

సింహాచలం  శ్రీ వరాహ లక్ష్మీనర సింహస్వామి గిరిప్రదక్షణ సందర్భముగా చేసిన ఏర్పాట్లపై పలువురు భక్తులు సంతృప్తి ని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సి సి కెమెరాలు ద్వారా గిరిప్రదక్షణ ఏర్పాట్లు, భక్తులు ప్రయాణించే మార్గం లో  కదలికలు గమనించారు.  అనంతరం పోలీస్ కమిషనర్ తో కలిసి జిల్లా కలెక్టర్  అప్పుఘర్ దగ్గర భక్తులకు కోసం ఏర్పాటు  చేసిన సదుపాయాలు గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా దేవరపల్లి మండలం నుంచి గిరి ప్రదక్షిణకు వచ్చిన శ్రీ ముత్యాలమ్మ అనే భక్తురాలు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల కోసం అనేక సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చిన్న చిన్న రాళ్లు గుచ్చుకునేవని, నేడు రోడ్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయని, అదేవిధంగా తాగునీటి సౌకర్యం, కూడా కల్పించిందని జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

Simhachalam

2022-07-12 16:10:35

సాగు నీటిని విడుదల చేసిన మంత్రి రాజా

పంపా నది నీటిని సాగు భూముల సేద్యానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి దాడిసెట్టి రాజా మంగళవారం విడుదల చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలోని సత్యదేవుని రత్నగిరిని ఆనుకుని పంపా జలాశయం ఉంది. మెట్ట ప్రాంత రైతాంగానికి వరప్రదాయినిగా ఈ పంపా రిజర్వాయర్‌  సేవలందిస్తోంది. పంపాలో ప్రస్తుతం 100.90 క్యూసెక్కుల నీరు నిల్వ ఉండగా దీనిలో 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షపు నీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటుందని, అందులో రోజూ 100 క్యూసెక్కుల నీటిని నది గర్భంలో నిలకడగా నిల్వ ఉంచుతూ ఆపై మిగులు జలాలను విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. 105 అడుగుల నీటి సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌ నుంచి తొండంగి, తుని మండలాల్లోని సుమారు 12,000 ఎకరాల ఆయకట్టు సాగు భూములకు నీరు అందుతుంది. రిజర్వాయర్‌ సామర్ధ్యానికి మూడు సార్లు నీరు నిండితే పూర్తి స్ధాయిలో ఆయకట్టుకు నీరందుతుంది. కాగా ఈ నీటి విడుదల సమయంలో మంత్రి దాడిసెట్టి రాజా వెంట అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

Annavaram

2022-07-12 14:43:00

స‌ర్వీస్ రిక్సెస్టులు పెరిగేలా చూడండి

గ్రామ స‌చివాల‌యాల్లో ప్ర‌జ‌ల నుంచి స‌ర్వీస్ రిక్వెస్టులు పెరిగేలా చూడాల‌ని, అన్ని ర‌కాల సేవ‌లు సుల‌భ‌త‌ర రీతిలో అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. మంగ‌ళ‌వారం ఆమె మ‌లిచ‌ర్ల గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను, హాజ‌ర‌ప‌ట్టీల‌ను ప‌రిశీలించారు. వాలంటీర్ల సేవ‌లు వాటిపై ప్ర‌జ‌ల స్పంద‌న గురించి ఆరా తీశారు. జ‌నాభాకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌జ‌ల నుంచి స‌ర్వీసు రిక్వెస్టులు ఎందుకు రావ‌టం లేదని ప్ర‌శ్నించ‌గా.. చాలా మంది స‌మీపంలో ఉన్న మీసేవ‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని సిబ్బంది బ‌దులిచ్చారు. సంతృప్తి చెంద‌ని క‌లెక్ట‌ర్ స‌చివాల‌యం ఉండ‌గా మ‌ళ్లా ప్ర‌జ‌లు మీసేవ‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందని, ప‌రిస్థితి మారాల‌ని అన్ని ర‌కాల సేవ‌లూ స‌చివాల‌యం ద్వారానే ప్ర‌జ‌ల‌కు అందాల‌ని ఆదేశించారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇక్క‌డ అందే సేవ‌ల‌పై విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు నిర్ణీత కాలంలో జారీ చేయాల‌ని చెప్పారు. వివిధ ర‌కాల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను లామినేష‌న్ చేయించాల‌ని సూచించారు. అలాగే ప్ర‌జా ఆరోగ్యంపై దృష్టి సారించాల‌ని ఏఎన్ఎంను ఆదేశించారు. స్పోర్ట్స్ క్ల‌బ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కార్య‌ద‌ర్శ‌కి సూచించారు. దీనిపై స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ల స‌దుపాయం కూడా ప్ర‌జ‌ల‌కు క‌ల్పించాల‌ని సూచించారు. ఆమె వెంట స్థానిక సర్పంచి, స‌చివాల‌య సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.

మలిచర్ల

2022-07-12 13:33:04

రూ.30కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కాకినాడలో రూ.30 కోట్లతో నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరు కృతికా శుక్లా.. సాంఘిక సంక్షేమం, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాకినాడ పాత బస్టాండ్ వద్దన్న డా. బి.ఆర్ అంబేద్కర్ భవన్ ను పరిశీలించి అత్యవసర మరమ్మత్తుల పనులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడలో ఉన్న అంబేద్కర్ భవన్ ను గత రెండు సంవత్సరాలగా కోవిడ్ మెటీరియల్ స్టోర్ చేయడంతో వినియోగం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి కొవిడ్ స్టాక్ ను పూర్తిగా తొలగించామన్నారు.  అత్యవసర మరమ్మతులు, ఎయిర్ కండిషన్ కనెక్షన్ ఇతరులకు సంబంధించి రూ.13 లక్షల మంజూరు చేయడం జరిగిందని, సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లును కూడా చెల్లించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు15 నాటికి అత్యవసర మరమ్మతుల పనులు పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులకు ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 30 కోట్ల రూపాయలతో నూతన అంబేద్కర్ భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశాలకు అనుగుణంగా కాకినాడలో నూతన అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే.రంగలక్ష్మీదేవి, ఏపీఈడబ్ల్యుఐడీసి ఈఈ వి లక్ష్మణ రెడ్డి డీఈ కె.వెంకటరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-12 11:55:55

స్వచ్ఛంద సేవలు అభినందనీయం

సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ లు  చేసే భక్తులకు జన్మ జన్మల పుణ్య ఫలం లభిస్తుందని అప్పన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భూఫల ప్రదక్షిణ తో సమానం అనీ పురాణ ఇతిహాసాల కథనం. ఈ నేపథ్యంలోనే  మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు కాలినడకన తమ గిరిప్రదక్షిణ యాత్రను ప్రారంభించారు. సుమారు 32 కిలోమీటర్ల పొడవునా భక్తులు కాలినడకన తమ  ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. సింహాచలం దేవస్థానం, పోలీస్, రెవెన్యూ జీవీఎంసీ, అధికార యంత్రాంగాలు అన్ని భక్తులు కు విశేష సేవలు అందిస్తున్నాయి. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో సింహగిరి చుట్టూ పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ గోశాల జంక్షన్ లో ఎస్ ఎన్ ఆర్ కళ్యాణమండపం అధినేత బీవీ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాలు, బాదం పాలు, మజ్జిగ  కౌంటర్లను  జోన్  8 జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు  మాట్లాడుతూ భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు  ప్రశంసనీయం అని కొనియాడారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులతోపాటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు అంతే పుణ్యం లభించాలని వీరు ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో చంద్ర మౌళి, గంట్ల కిరణ్ బాబు,ఈశ్వర్..సీతారామయ్య. విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2022-07-12 10:34:00

వరదల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి

రాష్ట్రంలో నదుల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున వరద  ముందస్తు చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.  ఈ విషయమై ఆయన మంగళవారం తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలు, ముంపు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. నదులు జలాశయాల గట్లు పరిశీలించి పటిష్టం చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో తగిన ఆహారం, పాలు, తాగు నీరు, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. గోదావరి ముంపు ప్రాంత జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అనకాపల్లి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, పోలీసు సూపరింటెండెంట్ గౌతమి సాలి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-07-12 10:15:49

జిల్లాలో నిర్మాణాలు వేగవంతం చేయాలి

ప్రణాళిక బద్ధంగా ముందస్తుగా నిర్మిస్తున్న కట్టడాలు భావితరాల  అనువుగా ఉంటాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంళవారం అనకాపల్లి జిల్లా దేవారపల్లి మండలం, తారువ గ్రామంలో ని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మౌళిక నిర్మాణాలు, బిటి రోడ్లు, సి.సి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై మాడుగుల నియోజకవర్గంలోని (దేవారపల్లి, కె.కోటపాడు, చీడికాడ, మాడుగుల) నాలుగు మండలాల పంచాయతీరాజ్ & ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  గత ప్రభుత్వాలు చేపట్టిన నిర్మణాల వల్ల వాటిని పునర్నిర్మాణం చేయడం తప్పనిసరి అవుతుందని, జగన్ ప్రభుత్వం లో చేపట్టే ఏ నిర్మాణమైన భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటనలో గుర్తించిన సమస్యలను, త్వరితంగా పరిష్కరించాలని ఆదేశించారు. నాడు-నేడు పనులు, జిల్లాలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు తదితర అత్యవసర నిర్మాణాలు ఏమేరకు పూర్తయ్యో మండలాల వారీగా నివేదికలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

దేవరాపల్లి

2022-07-12 10:06:38

బాలలను తప్పనిసరిగా బడికి పంపాలి

బాలల బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి గాను బడి ఈడు పిల్లలను  విధిగా పాఠశాలకు పంపాలని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాలలకు  నిర్బంధ ప్రాథమిక విద్య అమలులో ఉన్నందున సద్వినిపరచుకోవాలని అన్నారు. 14 ఏళ్లలోపు బాలలను ప్రమాదకర పనిలో పెట్టుకోవడం నేరమన్నారు. మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలకమైన దశని వాళ్లు సుఖంగా, సంతోషంగా ఉండేలా చేయడం పెద్దల కర్తవ్యం అని అన్నారు. బాలలకు రాజ్యాంగమే రక్షణ కల్పించిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-12 07:33:25

లయన్స్ ఆధ్వర్యంలో గుడ్లు పంపిణీ

కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్  సభ్యులు ద్వారంపూడి విపుల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు గుడ్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ  పోషకాహారంలో తల్లిపాల తర్వాత స్థానం గుడ్డుదేనన్నారు. శరీరానికి అవసరమైన అన్ని కీలకమైన   విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృతులు గుడ్డు ద్వారా లభిస్తాయని అన్నారు. ముఖ్యంగా మహిళల ఎముకల ఆరోగ్యానికి గుడ్డు చాలా సహాయపడుతుందని డాక్టర్ అడ్డాల తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రవికుమార్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-12 07:32:17

ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తే కేసులే

హానికర ప్లాస్టిక్ తయారీ, వినియోగాన్ని  కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిషేధించిందని దీనిని ఉల్లంఘిస్తే కేసులు బారిన పడే అవకాశం ఉందని న్యాయవాది యనమల  రామం పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని రమణయ్యపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 16 రకాల సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం నిషేధించిందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మానవ జీవితంలో మమేకమయ్యాయని అయితే వాటిని రోడ్లపై కాలువల్లో పడేస్తుండడం వలన మురుగు కాలువల్లో మురుగునీరు ముందుకు పోవడం లేదన్నారు. అదే విధంగా వ్యర్ధాలను ప్లాస్టిక్ సంచుల్లో వేసి రోడ్లపై పాడేయడం వలన ఆవులు తదితర జంతువులు వాటిని తినడం వలన పశువుల జీర్ణవ్యవస్థ పనిచేయక మరణిస్తున్నాయని అన్నారు. భూ కాలుష్యానికి ప్రధాన  కారణం ప్లాస్టిక్ వస్తువులు వినియోగమని అన్నారు .మార్కెట్ కి వెళ్లేటప్పుడు జూట్ లేదా గుడ్డ  సంచులను  తీసుకువెళ్లడం మేలని  యనముల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-11 09:58:45

అందరికీ శుభాలనిచ్చే శ్రావణ మాసం..

రానున్న శ్రావణమాసం ప్రతి ఇంటా నోములు, వ్రతాలతో  లక్ష్మీ కళ ఉట్టిపడుతూ కళకళలాడను న్నాయని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సర్పవరం జంక్షన్ లో విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. పట్నాయక్ మాట్లాడుతూ మహిళా లోకమంతా భక్తిశ్రద్ధలతో చేసే అనేక వ్రతాలలో  వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని ఈ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని నూతన వస్త్రాలు సమకూర్చిన బాపిరాజు   సేవా తత్పరత అభినందనీయమని పట్నాయక్ తెలిపారు .ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-11 09:57:49

పరిమిత కుటుంబంతోనే ఎంతో మేలు

మానవ వనరులలో జనాభా ముఖ్యమని అయితే అధిక జనాభా వలన ఆహార పదార్థాల కొరత, పేదరికం, ఉపాధి లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు తీర్చగలిగే స్థాయిలో వనరులు అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలు,  ఆశలు అపరిమితంగా ఉంటున్నాయన్నారు. పరిమిత జనాభా వలన పేదరికం తగ్గడంతో పాటు వనరులన్నీ సమృద్ధిగా అందరికీ లభిస్తాయని అన్నారు. అందుచేతనే ప్రభుత్వం ఇద్దరు లేక ముగ్గురు కార్యక్రమాన్ని ప్రకటించి ఆ దిశగా ప్రోత్సాహకాలు అందిస్తుందని  కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-11 09:56:54

రోడ్డు భద్రత కోసం పిల్లలకు తెలియజేయాలి

ఇంటి దగ్గర నుంచి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే సమయంలో  రోడ్డు ప్రక్కనుంచి నడుచుకుంటూ జాగ్రత్తగా  రావాలని గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష చిన్నారులకు తెలియజేశారు. సోమవారం కాకినాడ జిల్లా, శంఖవరం మండల కేంద్రంలోని సిబ్బంది వీధి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు రోడ్డు భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ జిఎన్ఎస్.శిరీష మాట్టాడుతూ, వర్షాకాలం మొదలైనందున చిన్నారులకు కేంద్రంలో కాచి చల్లార్చిన నీటినే అందించాలన్నారు. అదేవిధంగా ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలన్నారు. కేంద్రానికి వచ్చే పిల్లలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. చేతులు పరిశుభ్రంగా కడిగిన తరువాత ఆహారాన్ని పెట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కూడా చిన్నారులకు నిత్యం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బుల్లెమ్మ, కేంద్రం సిబ్బంది అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.

Sankhavaram

2022-07-11 09:00:32

చిన్న కుటుంబంతోనే దేశాభివృద్ధి

చిన్న కుటుంబం ఉన్ననాడే భావితరాలకు సహజ వనరులను అందించేందుకు వీలుకలుగుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని సంయుక్త కలెక్టర్ ఎం.విజయసునీత అభిప్రాయపడ్డారు. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ ర్యాలీ కార్యక్రమం స్థానిక డిఎహెచ్ఓ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనకున్న వనరుల్లో అసాధారణమైన వనరు మానవ జనాభా అని, ప్రకృతి విపత్తులను,అనేక అడ్డంకులు,ఆటంకాలను ఎదుర్కొని అప్రహితంగా మనుగడను కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. అసాధారణ రీతిలో జనాభాను పెంచుకుంటూ పోతే ప్రపంచానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కావున ఎప్పటికపుడు మన ప్రగతిని సమీక్షించుకుంటూ మరింత అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ఈ రోజు ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చని తెలిపారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆమె గుర్తుచేశారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని సమీక్షించుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. 1989సం.లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించగా, నాటి నుండి  ప్రతి ఏడాది ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.  1951సం. నుండి మనదేశంలో జన గణన ప్రారంభమైందని, నాటి నుండి 7 సార్లు జనాభా గణన జరిగిందని అన్నారు. గతేడాది జనాభా గణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు జెసి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8కోట్ల 53 లక్షలు కాగా, ప్రపంచ జనాభా 8 బిలియన్ల వరకు పెరిగిందని అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉందని, అందుకు తగిన విధంగా సహజ వనరులను భేరీజు వేసుకోవాలని ఆమె కోరారు. అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిద్దాం..నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం అని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ఆమె ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. 

చిన్న కుటుంబం ఉన్నపుడే భావితరాలకు సహజ వనరులను అందించగలుగు తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు అందించిన డా.జయలక్ష్మి,పి.రేఖలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున, అగర్త తేజ మరియు బి.భారతిలకు రూ.5వేలు వంతున ప్రోత్సాహక బహుమతితో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన డెప్యూటీ ఎస్.ఓ డి.శ్రీనివాస పట్నాయక్,డా.ఎన్. శేషగిరి, డా.జి.గణపతి,డా.పి.తార తదితరులకు జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అనంతరం ర్యాలీ ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగగా ఆద్యంతం ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.మీనాక్షి, పైడి వెంకట రమణ,డా.కె.కృష్ణమోహన్,డా.కె.అప్పారావు,డా.ఎన్. షగిరి,డా.జి.గణపతి,డా.పి.తార, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహనరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.ప్రసాదరావు, మేనేజర్ వి.వి.అప్పల నాయుడు, జిల్లా చీఫ్ కోచ్ మాధవీలత, నటుకుల మోహన్, మంత్రి వెంకటస్వామి,  సోమేశ్వర రావు, కె.ఎల్.నారాయణరావు, పెంకి చైతన్య కుమార్, సూర్యకళ, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-11 08:36:57

బక్రీద్ పండుగ రోజు జంతు, గోవధ నిషేధం

బక్రీద్ సందర్భంగా జంతు, గోవధలను నిషేధించినట్లు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శాంతి శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన బక్రీద్ పండగ సందర్భంగా గోవులు, ఒంటెలు వదించకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  బక్రీద్ సందర్భంగా ఆవులను చంపివేసే ప్రమాదం ఉన్నందు వలన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్డ్ టు ఏనిమల్ ఆర్ట్ 1960 & AP Prohibition of Cow Slaughter and Animal Prevention Act 1977 & PCA Rules-2000 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అధికారులందరూ  అప్రమత్తంగా ఉండి  10వ తేదీన ఆవులను, ఒంటెలను క్రూరంగా నరికివేయకుండా, జంతు వధ ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జంతు వధ ప్రాంతాలకి తరలించకుండా చెక్ పోస్టుల ద్వారా పోలీసులు తనిఖీ చేసి ఆపాలన్నారు.  జంతు వధ కొరకు ఆవులు, ఒంటెలు, తదితర జంతువులు అమ్మకాలు, కొనుగోలు నిషేదిస్తున్నట్లు పేర్కొన్నారు.   జంతు వధ (గోవధ) కి ప్రయత్నించు వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  మున్సిపాలిటీలలో  గోవధ, ఒంటెల వధ నిషేధమని తెలియజేస్తూ ముఖ్య కూడలిల వద్ద ముఖ్యంగా బక్రీదు సమయంలో బోర్డులు ఏర్పాటు  చేయాలన్నారు.  

జంతు వధ నిషేధం కొరకు జంతువుల కొనుగోలు, అమ్మకాలు నిషేధం ప్రకటించి, అమ్మకాలు జరిగే ప్రాంతంలో అమ్మకాలు నిలుపుదలకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.    జంతువులు, గోవులు, తదితరమైనవి వాహనాలలో తరలించకుండా రవాణా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని,  తగిన సిబ్బందితో చెక్ పోస్టు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒంటెలు, గోవులు వధ నిషేధం - జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించరాదని తెలుపుతూ విద్యార్థులచే ర్యాలీలు చేపట్టేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గో వధ, జంతు వధ నిషేధంపై అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గోవులు, ఇతర జంతువులను తరలించకూడదని ప్రచారం నిర్వహించాలని, బక్రీద్ సమయంలో గో వధ నిషేధంపై ప్రజలను అప్రమత్తం చేయుటకు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని శాఖలను పశు సంవర్థక శాఖ అధికారులు సమన్వయ పరచి జంతు సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. బక్రీద్ సందర్భంగా జంతు, గో వధ నిషేధంపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Srikakulam

2022-07-08 13:58:03