1 ENS Live Breaking News

దవళేశ్వరంవద్ద గోదావరి ఉగ్రరూపం

ఎగువ గోదవారిలో అత్యధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతకంతకూ  వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరదల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ , కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అటు వరదల్లో చిక్కుపోయిన వారికి ఆహారాన్ని అందించేందుకు డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.

Dhavaleswaram

2022-07-14 08:44:42

ఆడబిడ్డ భారమైతే శిశు కేంద్రానికివ్వాలి

ఆడపిల్లలంటే భారం అనుకుని కొందరు పుట్టగానే వదిలేయడం, చెత్తకుప్పల్లో వేయడం చేస్తున్నారని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు.  గురువారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందే పుట్టిన పసికందును చెత్తకుప్ప లేదా మురికి కాలువల్లో వేస్తున్నారని ఇది తగదని అన్నారు.  శిశువు జీవితాన్ని నాశనం చేసే హక్కు లేనందున ఆ శిశువును శిశు కేంద్రాలకు అప్పగించాలని సూచించారు. ఎక్కడైనా ఇటువంటి ఘటనలు ఎదురైతే శిశు కేంద్రాలకు సమాచారం అందించాలన్నారు. ఏ ఒక్క తల్లి పదిమాసాలు కడుపున మోసిన ఏ బిడ్డనైనా భారంగా అనుకోకూడదని అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా  ఉయ్యాలను ఏర్పాటు చేశారని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Sarpavaram Junction

2022-07-14 08:33:36

సీఎం పర్యటన విజయవంతం చేయాలి

ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో  రేపు జరగనున్న వాహన మిత్ర లబ్దిదారులకు 2వ విడత నగదు జమచేసే కార్యక్రమం   ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సభను విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, నెడ్ క్యాప్ చైర్మన్  కెకె.రాజు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో  ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్ రెడ్డి  ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు అనేక రకాల సంక్షేమ ఫలాలను అందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్  స్టాండింగ్ కమిటీ మెంబర్ వి. ప్రసాద్, శశికళ మరియు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

2022-07-14 08:19:54

వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాలంలో తాగే నీరు కలుషితం అవడం, మురుగు గుంటలో దోమలు వ్యాప్తి చెందడం వల్ల డెంగ్యూ, మెదడువాపు, చికెన్ గున్యా  వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రముఖ చర్మవ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ టి సి చంద్రగుప్త పేర్కొన్నారు. కాకినాడలోని  సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వర్షాకాలాల్లో వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.  జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళ నుంచి నీరు కారడం , ఆకలి తగ్గి వాంతులు అయ్యేలా ఉండడం, శరీరం పై దద్దుర్లు,  పొక్కులు రావడం, ముక్కు నుండి రక్తం కారడం, రక్త విరోచనాలు, తలనొప్పి వంటివి డెంగ్యూ వ్యాధి లక్షణాలని అన్నారు. దీని నివారణకు దోమలకు ఆవాసాలైన నీటి తొట్టెలు, టైర్లు, కుండీల్లో నీరు  నిల్వ ఉంచరాదని డాక్టర్ చంద్రగుప్త తెలిపారు. ఎలాంటి వ్యాధులు వచ్చినా సొంత నిర్ణయాలతో మందులు వాడేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకున్న తరువాత వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, బాపిరాజు, ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram Junction

2022-07-14 05:54:37

' మీకోసం' సేవలు అభినందనీయం

అభాగ్యులకు, నిరుపేదలకు మేమున్నామంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ' మీకోసం' స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త వీరభద్రరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోలని సర్పవరం జంక్షన్ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమైనందున ప్రతి ఒక్కరు నిష్కామ భావంతో సేవలు చేయాలని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన యువకులు తమ సంపాదనలో కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలకు  ఖర్చు చేయడం అభినందినీయమని వీరభద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు రావు, సందీప్, మూర్తి, వెంకటరమణ, అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram Junction

2022-07-14 05:53:41

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-07-14 04:31:19

విపత్తును, మత్స్య సంపదను గుర్తించండి

వేటకు వెళ్లే అందరూ మత్స్యకారులు ఫిషర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ పై అవగాహన కలిగి ఉండాలి, యాప్ ద్వారా విపత్తును, మత్స్య సంపదను గుర్తించవచ్చు అని జిల్లా వ్యవసాయ సలహా మండలి  అధ్యక్షులు డా.సిమ్మ నేతాజీ అన్నారు. జూలై 12, 13 తేదీలలో జిల్లాలో ముఖ్యమైన మత్స్యకార గ్రామాలలో మెగా డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు బుధవారం రణస్థలం మండలం జిరుపాలెం, అల్లివలస, ఇచ్చాపురం మండలం డొంకురు, సోంపేట డలం ఇసుకాలపాలెం, వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ, సంతబొమ్మాళి మండలం గెడ్డలపాడు, ఎం.సున్నాపల్లి మంలో వేటకు వెళ్ళే పలువురు మత్స్యకారులకు ఫిషర్ ఫ్రెండ్ మొబైల్ యాప్ అవసరాన్ని వివరించి వారి సెల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసి ఏవిధంగా వినియోగించాలో అవగాహన కల్పించారు. ఈ మెగా డ్రైవ్ కార్యక్రమానికి జేడీ ఫిషరీస్ పి.వి. శ్రీనివాసరావు, MS స్వామినాథన్ ఫౌండేషన్ స్టాఫ్ మెంబెర్స్ అయిన డెవలప్మెంట్ అసోసియేట్ ఎన్. టి. సంతోష్, ఎఫ్.డి. ఓ లు, లోకల్ ఫిషరీస్ అసిస్టెంట్ & సాగర మిత్ర, మరియు ఈ ప్రాజెక్ట్ మాస్టర్ ట్రైనర్స్ అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Ranastalam

2022-07-13 15:01:06

వైఎస్సార్సీపతోనే పేదలకు సమన్యాయం

పార్వతీపురం మన్యం జిల్లా  సీతానగరం మండలం జోగమ్మపేట గ్రామంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బుధ వారం నిర్వహించారు. గ్రామంలోని కాలనీలో ప్రతీ లబ్దిదారుని గడప వద్దకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలుంటీర్లుతో కలిసివెళ్ళి ప్రభుత్వం వారికి చేకూర్చిన ప్రయోజనాలను, గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటుగా వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. గత మూడేళ్ల కాలంలో లబ్దిదారునికి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తెలియజేసి, ఇంకా ఏమి చేయాలని అడుగుతూ ముందుకు సాగారు. గ్రామంలో గత మూడేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి పనులు చేశామని శాసన సభ్యులు చెప్పారు. నియోజకవర్గంలో 35 రోజుల పాటు కార్యక్రమాన్ని పూర్తి చేశామని, ఇంతవరకు 15 గ్రామ సచివాలయాల్లో పూర్తి చేశామని ఎమ్మెల్యే చెప్పారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మ, జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, నాయకులు బొంగు చిట్టిరాజు, శ్రీరాములునాయుడు, ఈశ్వర నారాయన, సర్పంచ్ కల్యంపూడి సింహాచలం, కల్యంపూడి శ్రీనివాసరావు, తెంటు వెంకటఅప్పల నాయుడు,సూర్యనారాయణ, రత్నాకర్, చింతల లక్ష్మణరావు, మహేష్, గాజాపు శ్రీను,కృష్ణంనాయుడు, ఆర్వీపార్థసారథి, అరవింద్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిడిఓ ప్రసాద్, తహసీల్దార్ రమణ,ఎంఈఓ సూరిదేముడు, ఏపిఓ నాగలక్ష్మి, తదితర అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలుంటీర్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Seethanagaram

2022-07-13 14:38:35

గోపాలపురం బాధితులకు అండగా ఉంటాం

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిత్రపటాన్ని డిస్పోజబుల్‌ ప్లేట్లపై ముద్రించి అవమానించడమే కాకుండా, దానిపై ప్రశ్నించిన 18 మంది దళిత యువకులపై కేసులు పెట్టి జైలు పాలు చేయడం తగదని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ గునపర్తి అపురూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా, శంఖవరం మండలంలో ఆయన బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.  ఈ ఘటనలో అత్యుత్సాహం చూపించి దారుణమైన సెక్షన్లతో దళిత యువకులపై కేసులు పెట్టి అరెస్టు చేసిన ఎస్‌ఐ, సిఐ, డిఎస్‌పిలను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టిన బాధితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలన్నారు. తప్పుడు కేసులను ఎత్తివేయాలని, ఘటనకు కారణమైన అన్నపూర్ణ రెస్టారెంట్‌ యజమానిని, ప్లేట్లను సరఫరా చేసిన వ్యక్తిని, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే అంబేద్కర్ ఇండియన్ మిషన్ కాకినాడ జిల్లా కన్వీనర్ దిలీప్ కుమార్ రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో పర్యటించి అరెస్టైన బాధితుల కుటుంబాలను పరామర్శించారని తెలియజేశారు.

Sankhavaram

2022-07-13 14:11:16

శోభాయమానంగా సింహగిరి అలంకరణ

సింహగిరి ప్రదక్షిణ, ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చేసిన వివిధ రకాల పుష్పాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.  సింహాద్రినాధుడు ఆలయంతో పాటు వివిధ దేవతా మూర్తుల ఆలయాలు ను బుధవారం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో ప్రధాన ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులందరికీ కూడా ఆలయ వర్గాలు సంతృప్తికరంగా స్వామి దర్శన భాగ్యం కల్పించడం ప్రశంస నీయమని అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. 32 కిలోమీటర్ల పొడవునా కాలినడకన గిరిప్రదక్షిణ పూర్తి చేసుకున్న శ్రీను బాబు దంపతులు బుధవారం సింహాద్రి నాధుడును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించిన తాను  చిన్నప్పటి నుంచి కూడా గిరి ప్రదక్షణ చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ విరామం తర్వాత తిరిగి గిరి ప్రదక్షిణ పూర్తిచేయడం స్వామి అనుగ్రహం గా భావిస్తున్నట్లు ఆయన  
చెప్పారు. స్వామివారి అనుగ్రహం వల్లే తాను గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలిగానన్నారు. ఏటువంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామని తెలిపారు. కాగా  ఆషాడ పౌర్ణమి నేపథ్యంలో సిరులొలికించే సింహాద్రి నాధుడు కి ఆఖరి విడత గా  ఈరోజు మూడు మణుగుల చందనాన్ని  శాస్త్రోక్తంగా సమర్పించారు. సాయంత్రం ఆలయ మండపంలో ఢిల్లీ విజయోత్సవాన్ని కూడా ఆలయ అర్చక స్వాములు, అధికారులు ఘనంగా జరిపించారు.

Simhachalam

2022-07-13 11:38:38

సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

ఏపిలో మూడు రోజుల నుండి మున్సిపల్ కార్మికసమస్యల పరిష్కారం కోరుతూచేపట్టిన సమ్మె పరిణామాలుప్రజారోగ్యా నికి విఘాతం కలిగించే తీవ్రతరం అవుతున్నందున ప్రభుత్వ చర్చలు సఫలీకృతం చేయించి విరమింపచేయాలని రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు లేఖ వ్రాశారు. ఈమేరకు బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య బత్యంఆపాస్ సమస్యలు గ్రాట్యుటీ ఫెన్షన్ సమానపనికి సమానవేతనం  మున్నగు అంశాలపైమూడేళ్లుగా మున్సిపల్ కార్మిక సంఘాలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించే చొరవచూపలేదన్నారు.  చెత్తలు పేరుకుపోవడం వలన ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్నారు. ముక్కు పిండి పలు పథకాల సొమ్ము నుండి సచివాలయం సిబ్బందితో చెత్త పన్నులు బలవంతంగా వసూలు చేయిస్తున్న ప్రభుత్వం మున్సిపల్ చెత్తలు తరలించే విషయంలో పరిష్కార చర్యలు లేకుండా కాలయాపన చేయడం మంచిదికాదన్నారు. సమ్మె పరిష్కారానికి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు  చేయాలని కోరారు.కాకినాడ నగరంలో మూడు రోజులుగా 780మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకు పోయి వుందన్నారు. వర్షాల కాలంలో చెత్తలనిక్షిప్తం ప్రజారోగ్యానికి మంచిపరిణామం కాదన్నారు.

Kakinada

2022-07-13 10:57:37

కాలనీల్లో మౌళిక వసతులు కల్పించాలి

జగనన్న కాలనీ లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలనీ, అదే విధంగా మౌలిక వసతుల కల్పన కూడా వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు.  బుధవారం  కలెక్టర్ విజయనగరం మండలం రూరల్, అర్బన్ లోని పలు లేఔట్లను, టిడ్కో  గృహాలను రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్ , మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడుతో కలసి  పరిశీలించారు.  తొలుత గుంకలాం లేఅవుట్ ను తనిఖీ చేసారు. ఆప్షన్ 3 క్రింద రిజిస్టర్ అయిన వారికీ వెంటనే బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశించారు.  పనులు పూర్తయిన మేరకు బిల్లులను జనరేట్ చేయాలనీ సూచించారు. ఎమేనిటీస్, ఇంజనీరింగ్ సహాయకులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని,  పూర్తి చేసిన గృహాలను వెంటనే మాపింగ్ చేయాలన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేసించుకొని పని చేయాలన్నారు. అవసరమగు  ట్రాన్స్ ఫార్మర్లకు అంచనాలను తయారు చేసి పంపాలని విద్యుత్ శాఖాధి కారులకు ఆదేశించారు. అనంతరం కొండకరకాం  లే ఔట్ ను  తనిఖీ చేసారు.  300 గృహాలకు  గాను 96 మాత్రమే పనులు ప్రారంభం కావడం పట్ల ఇంజనీరింగ్ సహకుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆషాడ మాసం అంటున్నారు, శ్రావణం  లో ప్రారంభిస్తారని వారు సమాధానం చెప్పగా శ్రావణం  లో ప్రారంభించక పోతే చర్యలు తప్పవని  హెచ్చరించారు. కట్టడానికి ముందుకు రానివారి ఇళ్ళను  ఆప్షన్ 3 క్రింద మార్పు చేయాలనీ అన్నారు.  లే అవుట్ వద్ద వీధి లైట్లను ఏర్పాటు చేయాలని ఎం.పి.డి.ఓ సత్యనారాయణ కు సూచించారు.  సారిక లే అవుట్ ను తనిఖీ చేసారు. 94 ఎకరాల్లో 4231  ప్లాట్లు  వేయుటకు ల్యాండ్ లెవెలింగ్, రహదారులు, ప్లాట్ మార్కింగ్ తదితర పనులు జరుగుతున్నాయి . ఎక్కువ యంత్రాలను  పెట్టి వేగంగా పనులు జరిగేలా చూడాలని సూచించారు.

 కొండవెలగాడ వద్ద నున్న సోనియా నగర్ లో నున్న టిడ్కో గృహాలను పరిశీలించారు.  మౌలిక వసతులను కల్పించి, లబ్ది దారులకు రుణాలను అందజేసే ఏర్పాట్లను చేయాలనీ టిడ్కో ప్రాజెక్ట్ అధికారి జ్యోతి కి సూచించారు.  కోరుకొండ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసారు. పిల్లలతో మాట్లాడి, పాటలు పాడించారు. కేంద్రానికి  వచ్చిన  గర్భిణీలు,  బాలింతలతో మాట్లాడారు. వారు  అక్కడే భోజనం చేయడం పై సంతృప్తిని వ్యక్తం చేసారు. మెనూ చార్ట్ ప్రకారంగా భోజనం పెడుతున్నాదీ లేనిదీ అడిగారు. శ్యాం , మాం పిల్లలు ఈ కేంద్రం లో  లేరని కార్యకర్త వివరించారు. కేంద్రానికి సరఫరా అయిన బియ్యం పోర్టిఫైడ్ బియ్యమా కాదా అని తనిఖీ చేసారు. రిజిస్టర్లను తనిఖీ చేసారు.   అక్కడికి వచ్చిన్ సర్పంచ్ తో మాట్లాడి కేంద్రానికి  కాంపౌండ్ వాల్ కట్టాలని, టాయిలెట్ లను మరమ్మత్తులు చ్పట్టాలని  కోరారు.  అదే విధంగా వేల్నేస్స్ సెంటర్ , ఆర్.బి.కే లను త్వరగా పూర్తి చేయాలనీ కోరారు.  అనంతరం  రైతు భరోసా కేంద్రాన్ని  తనిఖీ చేసారు. గ్రామం లో విత్తనాల సమస్య ఉందా అని సర్పంచ్ ను  అడిగారు. లేదని బదులిచ్చారు. వ్యవసాయ సహాయకులతో మాట్లాడి సి.హెచ్.సి లో ట్రాక్టర్  వినియోగ, డి.కృషి యాప్, పంటల మార్పిడి పై అవగాహన కల్పిస్తున్నారా  తదితర అంశాల పై ఆరా తీసారు. ఈ పర్యటన లో గృహ నిర్మాణ శాఖ డి.ఈ రంగారావు, తహసిల్దార్, వ్యవసాయ, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-07-13 10:40:52

మద్దూరు లంక గ్రామంలో జెసి పర్యటన

వరదలు కారణంగా ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణ ఆస్థి నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరు మండలం మద్దూరు లంక గ్రామంలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మద్దూరు లంక గ్రామంలో వరద ప్రభావం మూలంగా గట్ల పరిస్థితి పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీటి వసతి కల్పించాలన్నారు. పరిస్థితి అనుగుణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. పునరావాస కేంద్రంలో అత్యవసర మందులను , ఓ ఆర్ ఎస్ ప్యాకేట్లు ను సిద్దం గా ఉంచాలని సుంచించారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, మద్దూరులంక ప్రాంతంలో బలహీనంగా ఉన్న బండ్ వద్ద ఇసుక బస్తాలు, ఇతర రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని, ఇరిగేషన్ అధికారులు సూచనలకు అనుగుణంగా చర్యలు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డి ఎస్పీ బి. శ్రీనాథ్,  తహశీల్దార్ బి. నాగరాజు నాయక్,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మద్దూరులంక

2022-07-13 10:37:28

వ్యాపారుల ప్రత్యామ్నాయం చూసుకోవాలి

పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో రైతు బజార్లు, మార్కెట్లు, వ్యాపార సంస్థల నిర్వాహకులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే రమేష్ కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం ఆయన రమణయ్యపేట మార్కెట్ ను సందర్శించారు. అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న పర్మనెంట్ కార్మికులను అన్ని ప్రాంతాలకు విభజించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. అయితే చెత్త అధికంగా ఉత్పత్తి అయ్యే వ్యాపార వాణిజ్య సముదాయాలు,మార్కెట్లలో మాత్రం అక్కడి నిర్వాహకులు  సమ్మె పరిష్కారం అయ్యేవరకు సొంతంగా కార్మికులను ఏర్పాటు చేసుకుని చెత్తను సేకరించి కార్పొరేషన్ వాహనాలకు అందజేయాలని కమిషనర్ కోరారు. చెత్తను రోడ్ల ప్రక్కన డ్రైన్ ల లోను వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఓవైపు కార్మికుల సమ్మె తో పాటు, వర్షాలు కూడా పడుతున్నందున  ప్రజలు సహకరించకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మురికి నీటిపారుదల లేక డ్రైనేజీలు స్తంభించి దోమలు పెరగడం, ప్రజల అనారోగ్యాల పాలవడం వంటి ఇబ్బందులు. తలెత్తుతాయన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ రమేష్ కోరారు. కమిషనర్ వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్వి చరణ్ తదితరులు ఉన్నారు.

Kakinada

2022-07-13 10:25:14

విమానాశ్రయంలోనికి నీరుచేరకూడదు

విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం  ఉదయం తన ఛాంబర్‌లో విమానాశ్రయ నిర్వహణ కమిటీతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కారణంగా మేఘాద్రి రిజర్వాయర్ కు  అధిక మొత్తంలో నీరు చేరినందున, అదనపు నీరు విడుదల చేస్తున్న కారణంగా విమానాశ్రయం, పరిసర ప్రాంతాలలోకి నీరు చేరకుండా తక్షణమే  చర్యలు ప్రారంభించాలని అన్నారు. విమాన రాక, పోకలకు , ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  భారీ వర్షాలకు మేఘాద్రిగెడ్డ, కొండగెడ్డల నీరు విమానాశ్రయంలోనికి రాకుండా పూడిక తీత పనులు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.విమానాశ్రయం, ఐఎన్‌ఎస్‌ డేగ, పోర్టు, జివిఎంసి, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమీషనర్   జి.లక్ష్మీషా,  విమానాశ్రయ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, పోర్ట్ ట్రస్ట్ ఎజిఎం, ఐఎన్‌ఎస్‌ డేగ సిబ్బంది ,  జివిఎంసి ,ఇరిగేషన్‌ మొదలగు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-12 16:13:51