రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయి లోని అర్హులైన ప్రజలకు అందించడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. గుడిపాల మండలంలోని నంగమంగళం గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హులు అనర్హుల జాబితాను, సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లను, సిబ్బంది హాజరు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నంగమంగళం గ్రామ పరిధిలో 3270 మంది ఉన్నారని,1119 ఇల్లు ఉన్నాయని ఇప్పటివరకు 2672 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. మరో పది మంది మాత్రం వాక్సినేషన్ వేయించుకోవాల్సి ఉందన్నారు. గ్రామంలోని మొత్తం 1700 మంది మహిళలకు దీక్ష యాప్ ను డౌన్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మొత్తం 134 మందికి ఇళ్ల తలా లతోపాటు నిర్మాణాలకు మంజూరు కావడం జరిగిందని, 29 మంది సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారని కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా వైయస్సార్ చేయూత, తోడు, పింఛన్లు, రేషన్ కార్డుల వివరాలను కలెక్టర్ అడిగారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందించే ఈ సమయంలో అందరూ కలిసి పని చేయాలని ఏ సంక్షేమ పథకాలు కైనా అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ,అనర్హుల జాబితాలను పరిశీలించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న పథకాలను, అందించిన ఎరువుల వివరాలను, వేరుశెనగ విత్తన కాయల పంపిణీ, ప్రస్తుత దిగుబడి లను సమీక్షించారు. ఈ క్రాఫ్ బుకింగ్ 349 ఎకరాలకు చేయడం జరిగిందని ఇందుకు సంబంధించి కొన్నింటికి రసీదు ఇవ్వాల్సి ఉందని కలెక్టర్ కుతెలిపారు. ప్రజలు కు సంబంధించి ఎటువంటి విజ్ఞప్తులు వచ్చిన వెంటనే స్పందించాలని సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే వారి అర్హతల గురించి వాలంటీర్లు ద్వారా పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉన్న వారికి ఆ పథకాలు అందించే విధంగా చూడాలన్నారు. బొమ్మసముద్రం వద్ద నిర్మిస్తున్న హౌసింగ్ కాలనీని కలెక్టర్ పరిశీలించారు. మొత్తం 42 మందికి ఆ కాలనీలో ఇండ్లు మంజూరు కావడం జరిగిందని ఒక్కరు మినహా అందరూ ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారని, 29 ఇండ్లు బేస్మెంట్ స్థాయి దాటాయని హౌసింగ్ అధికారులు వివరించారు. వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి పద్మనాభం, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, ఆర్డిఓ రేణుక, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్,బాల గణేశ్ తదితర అధికారులు,అనధికారులు పాల్గొన్నారు.