1 ENS Live Breaking News

పశువుల టీకాలు సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం పాడి రైతుల సౌకర్యార్ధం అందజేస్తున్న ఉచిత పశువుల టీకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కోరారు. శుక్రవారం అన్నవరం గోశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువులకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి వాటిని పశువైద్యులు, సిబ్బందికి తెలియజేయడం ద్వారా ప్రభుత్వ పశువైద్య కేంద్రాల ద్వారా ఉచితంగానే వైద్యసేవలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు, ఎంపీపీ పర్వత గుర్రాజు, సర్పంచ్ కుమార్ రాజా, పశువైద్యాధికారి డా.వీరరాజు, డా.టి.లావణ్య, డా.కె. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు గోపూజ నిర్వహించారు.

Annavaram

2021-10-01 09:45:10

ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన సుర్ల రాజేశ్వరి..

నర్సీపట్నం మండలంలో దార్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపైనే అధికంగా ద్రుష్టికేంద్రీకరించి పరిష్కారానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని ఎంపిపి సుర్ల రాజేశ్వరి అన్నారు. నర్పీపట్నంలో శుక్రవారం ఆమె ఎమ్మెల్యే సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన ఎంపిపికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంపీడీవో జయమాధవి, వైసిపి నేత నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడుతో పలువురు అధికారులు అనధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాజేశ్వరి మాట్లాడుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ముఖ్యంగా మండలంలోని ఎంపీటీల పరిధిలోని ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు.  తనకు ఈ పదవి అప్పగించి ఎమ్మెల్యేకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. 

నర్సీపట్నం

2021-10-01 08:38:41

సచివాలయ సేవల ప్రజలకు చేరువచేయాలి..

సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు.  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన గురువారం పార్వతీపురం మండలం వెంకంపేట, చినబొండపల్లి  గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో  ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు.  ఈ పర్యటనలో పార్వతీపురం మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2021-09-30 11:39:23

పంట న‌ష్టాన్ని ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి.

ప్ర‌తీ గ్రామంలో కోవిడ్ వేక్సినేష‌న్ శ‌త‌శాతం పూర్తి కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి స్ప‌ష్టం చేశారు. వైద్యారోగ్య‌శాఖ సిబ్బందితోపాటు, స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు వేక్సినేష‌న్‌పై దృష్టి పెట్టి, పూర్తి చేయాల‌ని  ఆదేశించారు. జామి మండ‌లంలో ఆమె గురువారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. తుఫాను కార‌ణంగా జ‌రిగిన పంట న‌ష్టాన్ని ప‌రిశీలించారు. గులాబ్ తుఫాను కార‌ణంగా వివిధ గ్రామాల్లో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప‌రిశీలించారు. రామ‌య్య‌పాలెంలో రైతుల‌తో క‌లెక్ట‌ర్‌ మాట్లాడారు. పంట‌ల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించారు. ఏయే పంట‌లు, ఎంత‌మేర‌కు న‌ష్ట‌పోయిన‌దీ ఆరా తీశారు.  దెబ్బ‌తిన్న పంట‌ల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి నివేదించి, న‌ష్ట‌పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

          లొట్ల‌ప‌ల్లి గ్రామ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అటెండెన్స్ రిజిష్ట‌ర్‌ను, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారాన్ని ప‌రిశీలించారు. బ‌యోమెట్రిక్ అటెండెన్స్‌లో లోపాల‌ను గ‌మ‌నించారు. స‌చివాల‌య సిబ్బంది అంతా త‌ప్ప‌నిస‌రిగా బ‌యోమెట్రిక్ అటెండెన్స్ వేయాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌నుంచి అందే విన‌తుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందించాల‌ని, పెండింగ్ లేకుండా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. గ్రామంలో 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తీఒక్క‌రికీ కోవిడ్ వేక్సిన్‌ వేయాల‌ని, శ‌త‌శాతం పూర్తి కావాల‌ని ఆదేశించారు. అనంత‌రం అక్క‌డి రైతు భ‌రోసా కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. వ్య‌వ‌సాయ సిబ్బందితో మాట్లాడి, గ్రామంలోని పంట‌ల ప‌రిస్థితిని వాక‌బు చేశారు. ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ సిబ్బందితో మాట్లాడి, అక్క‌డి పాడిసంప‌ద గురించి వివ‌రాలు అడిగారు. రైతుల‌తో భేటీ అయ్యారు. ఎరువులు, విత్త‌నాల స‌ర‌ఫ‌రా, సిబ్బంది ప‌నితీరుపై ఆరా తీశారు. ప్ర‌తీఒక్క‌రూ వేక్సిన్ వేసుకోవాల‌ని రైతుల‌ను కోరారు.

           అనంత‌రం అల‌మండ గ్రామంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌టించారు. గ్రామంలో జ‌రుగుతున్న కోవిడ్ వేక్సినేష‌న్‌పై ఆరా తీశారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, ప్ర‌తీఒక్క‌రికీ వేక్సిన్ వేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశీల్దార్ బి.నీల‌కంఠ‌రావు, మండ‌ల వ్య‌వ‌సాయాధికారి పి.కిర‌ణ్‌కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Jami

2021-09-30 11:37:14

దోమతెరలతో జ్వారాలకు దూరంగా ఉండండి..

ప్రభుత్వం అందించే దోమ తెరలను వినియోగించి మలేరియా, డెంగ్యూ జర్వాలకు దూంగా ఉండాలని వజ్రకూటం సర్పంచ్ సకురుగుర్రాజు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పంచాయతీ కార్యాలయంలో దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని చోట్ల దోమల ఉద్రుతితో జ్వరాలు పెరుగుతున్నాయన్నారు. వాటి నియంత్రణించడానికి ప్రతీ ఒక్కరూ ముందుకి వచ్చి విధిగా దోమతెరలను వినియోగించాలన్నారు. అంతేకాకుండా ఇంటి చుట్టుప్రక్కల మురుగునీరు లేకుండా, చూసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తిచెందకుండా రక్షణ చర్యలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీ గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వజ్రకూటం

2021-09-30 11:13:07

370 గొర్రెలు,మేకలకు పిపిఆర్ టీకాలు..

వర్షాకాలం సమయంలో పశువులకు వ్యాధులు సంక్రమించకుండా పాడి రైతులు జాగ్రత్తలు, మెలకువలు  వహించాలని మండపం పంచాయతీ గ్రామ సచివాలయం గ్రామీణ పశువైద్యసహాయాకులు దుమ్మాల వెంకట సతీష్ అన్నారు. మంగళవారం మండపం గ్రామంలో 370 గొర్రెలు, మేకలకు పిపిఆర్ (పారుడువ్యాధి) టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పశువులకు అందించే ఉచిత  టీకాలను పాడి రైతులు పూర్తిస్థాయిలో తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు అందించే సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందాలన్నారు.

Mandapam

2021-09-28 15:53:18

ప్రభుత్వ భవనాలు సత్వరమే పూర్తిచేయాలి..

 ఏజెన్సీలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచ్చివాలయ వ్యవస్ధ ద్వారా ప్రజలకు వివిధ రకాల సీవలందించేందుకు గ్రామ సచివాలయ నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబందించిన పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబందిత ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య సంబందిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గంగవరం మండలం కొత్తాడ, పిడతమామిడి, లక్కొండ, నెల్లిపూడి, మొల్లేరు గ్రామాలలోని గ్రామ సచివాలయాల నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రాజెక్టు అధికారి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఏజెన్సీలోని 120 గ్రామ పంచాయితీ సచివాలయాల పరిధిలోని వివిధరకాల సేవలు ప్రజలకందించేందుకు, ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతీ గ్రామ సచివాలయాల ద్వారా వివిధ రకాల సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అందుకు ఈ నూతన గ్రామ సచివాలయ నూతన భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబందించిన పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకోచ్చేవిధంగా ఈ నూతన భవనాలకు, నిబందనల ప్రకారం పూర్తిస్ధాయిలో పనులు పూర్తిచేయించాలని సంబందిత అధికారులను పి.ఒ. ఆదేశించారు. ప్రాజెక్టు అధికారి వారి వెంట ఎ.ఇ. శ్రీలత, జె.ఇ. అబ్బాయిదొర తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2021-09-28 12:18:01

అమ్మా మీకు పథకాలన్నీ అందుతున్నాయా..

అమ్మా మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా..వాలంటీర్లు మీ దగ్గరకు వస్తున్నారా..బాగోగులు చూస్తున్నారా..అంటూ శంఖవరం గ్రామసచివాలయం-2 కార్యదర్శి శంకరాచార్యులు ఆధ్వర్యంలో వాలంటీర్లు మంగళవారం ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, మండల కేంద్రంలో తమ సచివాలయ పరిధిలోని అన్ని వీధులల్లో తిరిగి ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. సచివాలయాల్లో అందించే సేవలను తెలియజేస్తున్నామన్నారు. గతంలో కంటే ఇపుడు ప్రజలకు గ్రామసచివాలయాల్లో ఎంత మంది అధికారులు, ఏఏ పనులకు ఉపయోగపడుతున్నారో గుర్తించే స్థాయికి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శితోపాటు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-28 04:56:01

సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన ఐటీడీఏ పిఓ..

ప్రముఖ పర్యాటక కేంద్రం అందాల అరకులోయ లో పర్యాటక సమాచార కేంద్రాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ ప్రాంభించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మ్యూజియం లో పర్యాటక సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. పర్యాటకులకు ఏకో టూరిజం వెబ్ సైటును ప్రారంభించారు. ఐటీడీఏ సౌజన్యం తో ఏర్పాటు చేసిన  పెడలబుడు,కొల్లాపుట్టు కాటేజీలను ఆన్లైన్ విధానంలో అరకు ఏకోటూరిజం డాట్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని పి.ఓ తెలిపారు. అనంతరం ఐటీడీఏ ద్వారా శిక్షణ పొంది ఏర్పాటు చేసిన హస్త కళల స్టాళ్లను ఆయన సందర్శించి చెక్కతో చేసిన లక్కబొమ్మల కిట్లను ఆయన ప్రారంభించారు. లక్కబొమ్మల కిట్లను ఏజెన్సీలోని పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తామని దిశ వెల్ఫేర్ సొసైటీ కో ఆర్డినేటర్  జయశ్రీ హట్టంగడి తెలిపారు. రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సి.వి రాజును గిరిజన నిరుద్యోగ యువతకు లక్కబొమ్మల తయారీలో శిక్షణ అందించాలని పిఓ కోరారు. ఈ సందర్భంగా 100మందితో ఏర్పాటు చేసిన దిమ్సా నృత్యం తిలకించారు. ఈకార్యక్రమంలో మ్యూజియం క్యురేటర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

Araku (St)

2021-09-27 13:40:48

వజ్రపుకొత్తూరు మండలంలోని 182 మంది తరలింపు..

శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలంలోని 182 మందిని వివిధ తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదివారం వెల్లడించారు. గులాబ్ తుఫాను కారణంగా మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజలను తుఫాను పునరావాస కేంద్రాలకు తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఇందులో మంచినీళ్ళపేట గ్రామంలో 12 మందిని, బైపల్లి గ్రామానికి చెందిన 54 మందిని, ఎల్.డి. పేట గ్రామానికి చెందిన 26 మందిని ఆయా గ్రామాలలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.  మెట్టూరు గ్రామానికి చెందిన 65 మందిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించగా, పూడిలంక గ్రామంలోని 73 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.

Vajrapukotturu

2021-09-26 11:54:07

కమ్యూనిటీహాలు నిర్మాణానికి సహకరించండి..

అన్నవరం మేజర్ పంచాయతీలోని వెలమ,శెట్టిబలిజి సామాజిక వర్గం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి సహకరించాలని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణను కోరారు. ఆదివారం అన్నవరం సత్యదేవుని దర్శనార్ధం వచ్చిన మంత్రిని ఈ మేరకు సర్పంచ్ ప్రత్యేకంగా వెళ్లి కలిసి కమ్యూనిటీ భవనం కోసం మాట్లాడారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన మీడియాకి తెలియజేశారు. అన్నవరంలో వెలమ,శెట్టిబలిజి సామాజిక వర్గం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అన్నివర్గాల మద్దతుతోపాటు ప్రభుత్వ సహాయ సహకారాలు కోరినట్టు ఆయన చెప్పారు. ఆయనతోపాటు పలువురు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Annavaram

2021-09-26 08:34:05

జోరు వానలోనూ.. జాలర్ల రక్షణ కోసం..

ఓపక్కజోరు వర్షం.. మరో పక్క భారీ తుపాను హెచ్చరికలు.. తీర ప్రాంత మంతా అలజడిగా వుంది.. ఇలాంటి తరుణంలో ఏ ఒక్కరికీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు.. అనుకున్నదే తడవుగా అన్ని తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను దగ్గరుండి మరీ హెచ్చరిస్తున్నారు విజయనగరం జిల్లా ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి.. జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశాలతో..  తీర ప్రాంతాలను తన సిబ్బంది, పోలీసుల సహాయంతో  రెండురోజులుగా జల్లెడ పడుతున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ మత్స్యకారులకు దైర్యం చెబుతున్నారు. ఆదివారం చింతపల్లి ప్రాంతంలో స్థానిక పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. అక్కడి సమాచారాన్ని  జిల్లా కేంద్రంతోపాటు, రాష్ట్రకార్యాలయానికి సమాచారం పంపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, భారీ తుపాను హెచ్చరికతో మత్స్యశాఖ పరంగా అన్ని ప్రాంతాల్లోని ఎఫ్డీఓలను, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను అప్రమత్తం చేశామన్నారు. రేపటి వరకూ మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు చెప్పారు. పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని, అదేవిధంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా గ్రామ సచివాలయాల ద్వారాసమాచారం అందించాలని స్థానిక సిబ్బందికి సూచించినట్టు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సిబ్బందితోపాటు పోలీసులు పాల్గొన్నారు.

Chintapalli Beach

2021-09-26 07:39:39

పిల్లలూ నేనూ మీతో కలిసి భోజనం తినొచ్చా..

అన్నం రుచిగా ఉంటుందా..ఇంట్లో వండినట్టే వుంటుందా..రోజూ బాగా భోజనం చేస్తున్నారా..ఈ రోజు నాకు మీతోపాటు భోజనం పెడతారమరి..  నేనూ మీతో కలిసి  తినొచ్చా..ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు..విశాఖ జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున. నిరుపేదల కోసం బాగా తెలిసిన సిసలైన అధికారి. వాస్తవాలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే డేరింగ్ అండ్ డేషింగ్ ఐఏఎస్. ఈయన తలచుకుంటే స్టార్ హోటల్లో భోజనం చేయొచ్చు కానీ.. నిరుపేద పిల్లలకు ప్రభుత్వం అందించే భోజనాన్ని కలిసి తింటే ఆ చిన్నారుల్లో ఎంతో స్పూర్తినింపిన వారవుతారు. దానికోసం జిల్లాకి కలెక్టర్ అయినప్పటికీ ఆ విద్యార్ధులతోనే నేలపై కూర్చొని మరీ భోజనం చేశారు. ఈ సంఘటన చోడవరం మండలం గోవాడలో చోటు చేసుకుంది. శుక్రవారం నాడు –నేడు పథకంలో భాగంగా పంచాయితీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పిల్లలతో  మాట్లాడారు.  అదే విధంగా జెడ్ పి ఉన్నత పాఠశాల మరియు ఎం .పి.పి. మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ సందర్శించి  జగనన్న విద్యాకానుక కిట్ ను పరిశీలించారు.  అన్ని సక్రమంగా అందినవి లేనివి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నది లేనిది ఆరా తీసారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగారు.  నాడు – నేడు పనులను పరిశీలించారు. పాఠశాలలో టాయిలెట్స్, నిరంతర నీటి సౌకర్యం ఉన్నది, లేనిది పరిశీలించారు. హైస్కూల్ లో 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నదని, ఇంటర్ మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని విద్యార్ధులు కోరగా పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేస్తామని  కలెక్టర్ తెలిపారు. 

Chodavaram

2021-09-24 12:40:57

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేర్చాలి..

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి  చేరేవిధంగా విధులను నిర్వహించాలని జిల్లాకలెక్టర్  డా.ఎ.మల్లిఖార్జున  సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  శుక్రవారం చోడవరం మండలంలో ఆకస్మిక పర్యటన చేసి గ్రామ సచివాలయాలు, అంగన్ వాడి కేంద్రాలు, జిల్లా పరిషత్ హైస్కూల్,  ఎం .పి.పి. ఎలిమెంటరీ స్కూల్, పి.హెచ్.సి.లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ వెంకన్నపాలెం, గోవాడ గ్రామ సచివాలయాలను  సందర్శించి అక్కడి సిబ్బందితో  మాట్లాడారు. కార్యాలయ  రిజిష్టర్లను పరిశీలించారు.  ప్రభుత్వ సేవలు కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా వారి అర్జీలను పరిశీలించి పెండింగ్ లేకుండా  నిర్దేశిత సమయంలో  పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి  ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. అక్కడ గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అందుకు గ్రామస్దులు కలెక్టర్ తో సింగిల్ రైస్ కార్డులు సక్రమంగా ఇవ్వడం లేదని దానివలన పించన్లు ఆగిపోతున్నాయని, అదే విధంగా పాస్ బుక్ ల కొరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటున్నామని  అవి కూడా సరియైన సమయానికి  ఇవ్వడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసారు.  వెంటనే కలెక్టర్ సంబందిత తాసీల్దార్, ఆర్.డి.ఓ లతో వారి సమస్యలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. చెరువుకు సంబందించిన భూమిలో జగనన్న కాలనీ  లేఅవుట్ లను వేసారని ఫిర్యాదు చేయగా దానిపై ఎంక్వరీ చేయాల్సిందిగా  ఆర్.డి.ఓ ను ఆదేశించారు. సచివాలయ పరిధిలో 18-45 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్   వేసినది లేనిది అడిగి తెలుసుకున్నారు.  నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.  
నాడు –నేడు పథకంలో భాగంగా పంచాయితీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు.  అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పిల్లలతో  మాట్లాడారు.  అదే విధంగా జెడ్ పి ఉన్నత పాఠశాల మరియు ఎం .పి.పి. మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ సందర్శించి  జగనన్న విద్యాకానుక కిట్ ను పరిశీలించారు.  అన్ని సక్రమంగా అందినవి లేనివి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నది లేనిది ఆరా తీసారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగారు.  నాడు – నేడు పనులను పరిశీలించారు. పాఠశాలలో టాయిలెట్స్, నిరంతర నీటి సౌకర్యం ఉన్నది, లేనిది పరిశీలించారు. హైస్కూల్ లో 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నదని, ఇంటర్ మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని విద్యార్ధులు కోరగా పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేస్తామని  కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖి చేసారు. వార్డులను పరిశీలించి,  గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి  వారి కేస్ షీట్ లను పరిశీలించారు. ఆరోగ్య శ్రీ పథకం  వారికి వర్తింప చేస్తున్నది లేనిది డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపద్యంలో డెంగ్యూ, మలేరియా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ గోవాడ సుగర్ ప్యాక్టరీని సందర్శించి  సిబ్బందితో మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటనలో ఆర్.డి.ఓ సీతారామారావు, తాసిల్దార్ తిరుమల బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Chodavaram

2021-09-24 12:33:17

మక్కువ లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. ప్రభుత్వం సచివాలయ సేవలపై ఎన్నో అసలు పెట్టుకుందని, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సబ్ కలెక్టర్ భావన శుక్రవారం మక్కువ మండలం సరయీవలస  గ్రామ సచివాలయం ఆకస్మికంగా సందర్శించారు, ఈ సందర్భంగా సచివాలయంలో  ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేశారు, ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని హితవు పలికారు. ఈ పర్యటనలో మక్కువ మండలం రెవెన్యూ అధికారులు సిబ్బంది, సచివాలయాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Makkuva

2021-09-24 11:07:19