1 ENS Live Breaking News

జగనన్న గ్రుహ హక్కుపై అవగాహన కల్పించండి..ఎంపీడీఓ కె.స్వప్న

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న గృహ‌హ‌క్కు ప‌థ‌కం గృహ‌నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ఎంతో ప్రయోజ‌న‌క‌ర‌మ‌ని, ఈ ప‌థ‌కం ద్వారా వారు త‌మ గ్రామంలోనే త‌మ పేరిట ఇంటి స్థలం రిజిష్టర్ చేసుకునే అవ‌కాశం ఏర్పడుతుంద‌ని కరప ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు కరప ఎంపీడీఓ కార్యాలయం నుంచి అన్ని గ్రామసచివాలయ కార్యదర్శిలతోనూ ఆమె టెలీ కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, జగనన్న గ్రుహహక్కు పథకాన్ని ల‌బ్దిదారులంతా వినియోగించుకునేలా ల‌బ్దిదారులంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లకు ఎంపీడీఓ సూచించారు. అంతేకాకుండా స‌చివాల‌య స్థాయిలో వ‌చ్చే ప్రజా సేవ‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను త్వర‌గా ప‌రిష్కరించాల‌ని ఆదేశించారు. గ్రామాల్లో అపారిశుధ్యం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్ని సచివాలయ సిబ్బందిని ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆదేశించారు.

Karapa

2021-11-18 09:46:10

ఓటిఎస్‌పై ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించాలి..

జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై ప్ర‌జ‌ల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, స‌చివాల‌య సిబ్బందిని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆదేశించారు. బొండ‌ప‌ల్లి మండ‌లం నెలివాడ‌, రాచ‌కిండాం గ్రామ స‌చివాల‌యాల‌ను ఆయ‌న బుధ‌వారం ఆక‌స్మికంగా తీనిఖీ చేశారు. ఆయా స‌చివాల‌యాల్లోని అటెండెన్సు రిజిష్ట‌ర్‌ను, రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స‌చివాల‌యాల‌కు వ‌చ్చిన విన‌తులు, ప‌థ‌కాల అమలును ప‌రిశీలించారు. కోవిడ్‌ వేక్సినేష‌న్‌పై ఆరోగ్య‌మిత్ర‌ను ప్ర‌శ్నించారు. శత‌శాతం వేక్సినేష‌న్‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు.  ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే విన‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని అన్నారు. గృహ‌నిర్మాణ ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు ఓటిఎస్ ప‌థ‌కం సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం ద్వారా అతిత‌క్కువ మొత్తాన్ని చెల్లించి, ఇంటిపై సంపూర్ణ హ‌క్కును శాశ్వ‌తంగా పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి, అంద‌రూ దీనిని స‌ద్వినియోగం చేసుకొనే విధంగా స‌చివాల‌య‌ సిబ్బంది కృషి చేయాల‌ని జెసి కోరారు.

Bondapalli

2021-11-17 10:58:22

సస్యరక్షణతో చీడ పీడల నివారణ.. ఉద్యావనశాఖ అధికారిణి సైలజ

వాణిజ్య పంటలు, కూరగాయల పంటలకు వర్షాలు తగ్గుముఖం పట్టగానే చీడపీడలు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కాకినాడ రూరల్ ఉద్యావనశాఖ అధికారిణి సైలజ పేర్కొన్నారు. బుధవారం ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాణిజ్య పంటలకు పదిశాతంలో లోపు మాత్రమే నష్టం వాటిల్లిందన్నారు. రైతులు వాణిజ్య పంటల పెంపకంలో చీడలు ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టం పెరగకుండా చేసుకోవడానికి వీలుపడుతుందన్నారు. అంతేకాకుండా చీడలను ఆదిలోనే నాశనం చేయడానికి అవకాశం వుంటుందన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరువాత 19-19-19, 30-0-45 లేదా యూరియా ఏదో ఒకటి పంటలపై పిచికారి చేసుకోవాలన్నారు. రైతులు వాణిజ్య పంటల సస్యరక్షణ చర్యలు, సూచనలు, సలహాల కోసం గ్రామసచివాలయాల పరిధిలోని గ్రామీణ ఉద్యానవన సహాయకులను సంప్రదించాలన్నారు. లేదంటే పంట పొలాల్లో నిర్వహించే తోడ బడి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టే విధానాలను తెలుసుకోవడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఈ సందర్బంగా సూచించారు.

కాకినాడ రూరల్

2021-11-17 07:04:00

విద్యతోనే సమాజ అభివృద్ధి..ఐటీడీఏ పీఓ

నేటి ఆధునిక యుగంలో విద్యతోనే సమాజ అభివృద్ధి  సాధ్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ  అన్నారు. మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామంవద్ద ఏకలవ్య మోడల్ రెసిడెన్సిల్ స్కూల్ భవన నిర్మాణాలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్రమోడీ  సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఐటీడీఏ పిఓ  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో అజాదిక అమృత మహోత్సవం, గిరిజన భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా అరకులోయ మండలంలోని మజ్జివలస,పెదబయలు మండలం లకేపుట్టు, జి.మాడుగుల మండలం పి.జి.మాడుగులలో  రూ.5.976కోట్లు  వ్యయంతో మూడు పాఠశాలలకు శంకుస్థాపన చేసినట్లు
 ఆయన తెలిపారు. ఉన్నత విద్యాభయసంతో నవసమాజ నిర్మాణం చేపట్టడమే కాకుండా సమస్యలు సునాయాసంగా పరిస్కరించు కోవచని ఆయన పేర్కొ నారు.నిరక్షరాస్యత నిర్మూలించి శత శాతం అక్షరాస్యత పెంపొందించడంలో భాగంగా  నవోదయ తరహాలో 5 వేలమంది గిరిజన బాల బాలికలకు విద్యను అందించడానికి అంకురార్పణ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన 14 నెలల గడువులోగా నూతన భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. నాణ్యతతో నిర్మాణాలు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులో కి  తీసుకుని రావాలన్నారు. ఏకలవ్య పాఠశాలలో 480 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. గిరిజనుల విద్యాభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని అనంతగిరి, పాడేరుకు చెందిన గిరిజనులు స్వచ్ఛందంగా వచ్చి భూదానం చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏ లో స్కిల్ డెవలప్మెంట్ సెల్ , టూరిజం సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. 15రోజులకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు.
గురుకులం సెక్రెటరీ డా.కె.శ్రీకాంత్ ప్రభాకర్ మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయడం గిరిజనులకు వరమని అన్నారు. ఆంద్రప్రదేశ్ లోనే ఏకలవ్య పాఠశాలలకు మొట్టమొదటి సరిగా భూసేకరణ జరిగిందన్నారు. ఏకలవ్య లో 52 మంది ఉపాధ్యాయులు వుండి,అత్యున్నత విద్యను అందిస్తారాని అన్నారు. ఐ ఐ టిలో 90 మంది సీట్లు సాధిస్తే పాడేరు నుంచి 27 మంది సీట్లు సాధించారని అన్నారు.ఈ ఏడాది ప్రభుత్వం 9 ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయగా వాటిలో 9 పాడేరు డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో గురుకులం పాఠశాల, కళాశాల ,ఏకలవ్య పాఠశాలలు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో  ఈ పి ఐ ఎల్  డైరెక్టర్ రాధాకృష్ణ, గ్రూప్ జనరల్ మేనేజర్ అరుంధతి భౌమిక , టీడబ్ల్యూ ఎస్.ఈ. ఎస్.శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ వెంకట రాంబాబు, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, సర్పంచ్ దురుయా భాస్కర రావు,గురుకులం కళాశాలల ప్రిన్సిపాల్ లు తదితరులు పాల్గొన్నారు.

Araku (St)

2021-11-15 15:58:13

విద్యార్ధి దశనుంచే జనరల్ నాలెడ్జ్ లో పోటీపడాలి..ఎమ్మెల్యే పెట్ట ఉమాశంకర్ గణేష్

విద్యార్ధి దశనుంచే జనరల్ నాలెడ్జ్ లో మంచి ప్రావీణ్యం సాధించడం ద్వారా విద్య అనంతరం పోటీపరీక్షల్లో మంచి ఉద్యోగాలు సంపాదించడానికి ఆస్కారం వుంటుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఆదివారం నర్సీపట్నం స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేదిక ఫంక్షన్ హాల్ లో, బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్ధులకు క్విజ్, జనరల్ నాలెడ్జ్ పోటీలు పోటీ తద్వాన్ని పెంచుతాయన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైస్కూలు, కాలేజీ స్థాయిలో నిర్వహించిన ఈ జనరల్ నాలెడ్జ్, క్విజ్ పోటీల్లో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన 154 మంది ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్థానాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి రానున్న రోజుల్లో ఉన్నత చదువుల్లో కూడా ఇదే పోటీని ప్రదర్శించాలని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి శ్రీనివాసరావు, స్టార్ ఫౌండేషన్ అధ్యక్షులు శర్మ ,కార్యదర్శి నాగిరెడ్డి, కోశాధికారి వూడ రాము తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-11-14 12:42:59

సత్యదేవుని సన్నిదిలో ఒకేరోజు 4800 వ్రతాలు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి సన్నిధి శనివారం భక్తులతో కిటకిటలాడింది. రెండురోజులు సెలవు కావడం, కార్తీక మాసం కావడంతో స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఈ ఒక్కరోజే 4800 సత్యన్నారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయంటే భక్తుల తాడికి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నవరం పుణ్యక్షేత్రంలో మాత్రమే శ్రీ సత్యన్నారాయణ స్వామివారి వ్రతాలు జరుగుతాయి. ప్రతీఏటా కార్తీక మాసంలో ఈ వ్రతాలు లక్షల సంఖ్యలో జరగడం విశేషం. ఎక్కువగా మండపాలు ఉండటంతో దేవస్థానానికి ఎంతమంది భక్తులు వ్రతాల కోసం వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వ్రతాలు జరుగుతుంటాయి. దేశంలో ఏ దేవస్థానంలోనూ లేనంత మంది ఇక్కడ వ్రత పురోహితులు పనిచేస్తుండం కూడా ఒక చరిత్రగా చెప్పవచ్చు..

Annavaram

2021-11-13 10:50:17

పరివర్తనతో యువత మత్తు వదలండి..

యువత మంచి ఆలోచనతో మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పరివర్త కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తుకు బానిసలైతే విలువైన మంచి జీవితం నాశనం అవుతుందన్నారు. అదే సమయాన్ని విద్యోన్నతి కోసం శ్రమిస్తే మంచి భవిష్యత్తు దక్కుతుందని సూచించారు. అంతేకాకుండా మత్తుకు చేరవయ్యేవారిని, మత్తు పదార్ధాలు అమ్మేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చక్ర రెడ్డి, రవీంద్ర ,పండు దొర సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Yeleswaram

2021-11-12 14:36:21

కోవిడ్ వేక్సినేష‌న్ శతశాతం పూర్తిచేయాలి..

. కోవిడ్ వేక్సినేష‌న్‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి, స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. గుర్ల మండ‌లం చోడ‌వ‌రం గ్రామ స‌చివాల‌యాన్ని ఆమె గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్‌ రిజిష్ట‌ర్‌ను, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్‌ను త‌నిఖీ చేశారు. సచివాల‌య ప‌రిధిలో పెండింగ్ ధ‌ర‌ఖాస్తుల‌పై ఆరా తీశారు. వ‌చ్చిన విన‌తుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, ఓటిఎస్ స్కీమ్‌పైనా ప్ర‌శ్నించారు. గ్రామంలో ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ వేక్సిన్ వేసుకొనే విధంగా చూడాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వేక్సిన్ వేసుకోనివారిని గుర్తించి, అవ‌స‌ర‌మైతే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు స‌హ‌కారాన్ని తీసుకొని, శ‌త‌శాతం వేక్సినేష‌న్ జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో తాశీల్దార్ లావ‌ణ్య‌, ఎంపిడిఓ క‌ల్యాణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Gurla

2021-11-11 16:21:35

పాన్ షాపులపై దాడులు రూ.15వేల గుట్కా స్వాధీనం..

ఏలేశ్వరం మండలంలోని ఏలేశ్వరం అప్పన్నపాలెం గ్రామాల్లో గుట్కా అమ్ముతున్న పాన్ షాపులపై దాడుల చేసి రూ.15 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు ఏలేశ్వరం ఎస్.ఐ సి.హెచ్ విద్యాసాగర్  తెలియజేశారు. గురువారం ఆయన స్టేషనల్ మీడియాతో మాట్లాడారు. తమ సిబ్బంది సన్యాసిరావు ,శ్రీను వాసు దొర,లోవరాజు, పండుదొర గుట్కా అమ్ముతున్న షాపుల పై రైడ్ నిర్వహించి ఏలేశ్వరం గ్రామంలో  ముగ్గురు వ్యక్తులు, అప్పన్నపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వారిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.

Annavaram

2021-11-11 16:15:29

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ సీజ్..

ఏలేశ్వరం పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టరును సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఏలేశ్వరం ఎస్.ఐ సి.హెచ్ విద్యాసాగర్ తెలియజేశారు. గురువారం స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు తమ సిబ్బంది సన్యాసిరావు ,శ్రీను వాసు దొర,లోవరాజు, పండుదొర  తో తిరుమాలి గ్రామంలో పర్యటించి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని,ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా  ఎవరు ఇసుక తరలించినా కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్బంగా హెచ్చరించారు.

Yeleswaram

2021-11-11 16:14:44

సత్యదేవుని భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి భక్తుల సౌకర్యార్ధం మరిన్ని అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, కాకినాడ ఎంపీ వంగా గీత, చైర్మన్ రోహిత్ లు పేర్కొన్నారు. గురువారం దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలిసి ఆలయ పరిసరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అంతేకాకుండా సత్యదేవుని సన్నిధిలో  కార్తిక మాసంలో సందర్భంగా భక్తులు సౌకర్యాలు మరింతగా పెంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో   దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-11-11 16:13:46

రేపు సత్యదేవుని సన్నిధిలో గోపాష్టమి..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం గోపాష్టమి  సందర్భంగా శ్రీ గోకులంలో గో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు గురువారం అన్నవరంలో మీడియా ప్రకటన విడుదల చేశారు. గోపాష్టమి సందర్భంగా గోకులంలో గోవులకు ప్రత్యేకంగా పూజలు చేపడతామన్నారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏటా కూడా గోపూజ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి  పూజా కార్యక్రమాలు చేపట్ట నున్నట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Annavaram

2021-11-11 16:12:39

తరచుగా జమాబందీ నిర్వహించాలి..

విజయనగరం జిల్లాలోని సబ్ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో జామాబందీ కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి అధికారులు క్రుషి చేయాలని సబ్ కలెక్టర్ భావన ఆదేశించారు. జిల్లాలోని సాలూరు తహశీల్దార్ కార్యాలయంలో  బుదవారం జమాబందీ నిర్వహించారు. ఈ సందర్భం అర్జీలు అందజేయడానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వహించిన జమాబందిలో మొత్తం 04 దరఖాస్తులు అందాయని ఆమె పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే  పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Salur

2021-11-10 09:36:25

గిరిజనుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత..

ఏజెన్సీలోని మారుమూల గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల స్పష్టం చేశారు. మంగళవారం అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణతో కలిసి గుంటసీమ బాలుర  గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి పాత్రికేయులతో  మాట్లాడుతూ రాష్ట్ర ముఖమంత్రి వారి ఆదేశాలు జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున సూచనల మేరకు ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో పివి టిజి గిరిజనులకు అందుబాటులో  ఉండే విధంగా  మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ -ఐటీడీఏ సంయుక్తంగా కొరవంగి ,పెదవలస, ఉప్ప, నుర్మతి గ్రామాలలో మెగావైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు.వైద్య శిబిరాలను నిరంతరం  కొనసాగిస్తామని అన్నారు. మెగా వైద్య శిబిరం లో స్త్రీల వైద్యనిపుణులు, కంటి, చెవి,ముక్కు, జనరల్ వైద్యులు పాల్గొని వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ అవసమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తామని చెప్పారు. త్వరలో మన్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని దానికి అవసరమైన డేటా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పాడేరు లో రెడ్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి అవసరమైన భవనం కేటాయించామని తెలియజేసారు. సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు చేపడతామని అన్నారు. 30 పి.హెచ్ సి లలో నాడు నేడు అభివృద్ధి పనులు జరూగుతున్నాయని చెప్పారు. డెంగ్యూ పరీక్షలకు నిధులు విడుదల చేశామని చెప్పారు. గిరిజనులను ఎక్కడ నుంచి వచ్చారని పి.ఓ ఆప్యాయంగా పలకరించారు. ఒపి వివరాలు పరిశీలించారు. వెయ్యి. మందికి కోవిడ్ వాక్సినేషన్ వేయడం లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు
అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గునసీమ మెగా వైద్య శిబిరానికి గిరిజనులు భారీగా తరలి వచ్చారని చెప్పారు. మెగా. వైద్యశిబిరాలను  సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని ప్రాజెక్టు అధికారినకి పూల మాలవేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి.ఈశ్వరి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్ పి టి సి జనకమ్మ, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాజేష్ అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలప్రసాద్, డా.టి. విశ్వేశ్వరరావు, ఎంపిడివో ,తహసీల్దార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రీగుడ

2021-11-02 12:05:48

ఏజెన్సీలక్ష్మీపురం

2021-11-01 02:45:24