1 ENS Live Breaking News

తల్లీ పిల్లలకు సంరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట..

తల్లీ పిల్లల సంరక్షణు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం పోలాకి మండలం చితవానిపేట లో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు.  అంగన్వాడీ కేంద్రాలన్నీ త్వరలోనే కార్పోరేట్ స్థాయి ప్రీ స్కూళ్లుగా మారనున్నాయన్నారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ పిరీయ విజయ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు కరిమి రాజేశ్వరరావు, యువ నాయకులు, జడ్పిటిసి సభ్యులు  డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ ముద్దాడ బైరాగి దమయంతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Polaki

2021-10-21 09:10:45

గాలికుంటువ్యాధి టీకాలను వినియోగించుకోవాలి..

ప్రభుత్వం పాడి రైతుల సహాయార్ధం పశువులకు ఉచితంగా అందజేసే గాలికుంటు వ్యాధి టీకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పర్వత రాజబాబు పిలుపునిచ్చారు.  గురువారం శంఖవరం ప్రభుత్వ పశువుల ఆసుపత్రి వద్ద నిర్వహించిన 30వ విడత పశువులకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా వీటిని పశువులకు ఉచితంగానే అందిస్తున్నదన్నారు. గతంలో కంటే ఇపుడు అన్ని రైతు భరోసా కేంద్రం, సచివాలయాల పరిధిలో గ్రామీణ పశువైద్య సహాయకులకు ప్రభుత్వం నియమించిందన్నారు వారి ద్వారా ఈ సేవలను పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.వీరరాజు, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్, వైఎస్సారీపీ నాయకులు లచ్చబాబు, పడాల బాషా, పడాల షతీష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-21 08:54:01

గిరిజనుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..

గిరిజనుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యురాలు కె. భాగ్యలక్ష్మి అన్నారు. ఐటీడీఏ, ఆరోగ్యశ్రీ సంయుక్తంగా మండలంలోని నిర్మతి ఆశ్రమ పాఠశాలలో  ఏర్పాటు చేసిన మెగావైద్య శిబిరాన్ని   ఐటీడీఏ పి ఓ రోణంకి గోపాలకృష్ణ తో కలిసి గురువారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు ఆరోగ్య  పరిరక్షణకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేని మారు మూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న  వైద్య శిబిరాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రాష్టం లోని అతి పెద్ద పాడేరు ఐటీడీఏ పరిధిలో  ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.వైద్య శిబిరాలపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ  రాష్ట్ర  ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు మేరకు ఏజెన్సీలో 15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరాన్ని  నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటివరకు  అరకు నియోజకవర్గ పరిధిలోని రెండు, పాడేరు నియోజకవర్గంలో పెదవలస, నుర్మతి మెగావైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.  12వేల మందికి వైద్యం అందించామన్నారు. స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లలు, చెవి ముక్కు గొంతు వైద్యులు, కంటి,చర్మ, జనరల్ వైద్యనిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్యు నిపుణులు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఐటీడీఏ నుంచి ఉచితంగా మందులు, రవాణా సౌకర్యం, తాగునీటి సదుపాయాలు,భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలో 4.30లక్షల మందికి కోవిడ్ వాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. ఇంకా లక్ష మందికి కోవిడ్ టీకాలు వేయాలని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో చిన్న పిల్లలు, స్త్రీల వైద్య నిపుణులను నియమించామని చెప్పారు. అనేస్థీషియా వైద్యుల పోస్టు ను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. అంతకు ముందు వివిధ విభాగాలలో పర్యటించి రోగులతో మాట్లాడారు. మందులు సక్రమంగా వినియోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ఎం.గాయత్రి దేవి, ఆరోగ్యశ్రీ  కో ఆర్డినేటర్ డా.రాజేష్, అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలప్రసాద్, ఎంపిడిఓ వెంకన్నబాబు, తహసీల్దార్ చిరంజీవి పడాల్,ఏటీడబ్ల్యుఓ క్రాంతి ,పలువురు వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Paderu

2021-10-21 08:51:53

ఎన్.బూర్జివలస లో ఇద్దరే జ్వర పీడితులు..

విజయనగరం బలిజిపేట మండలం ఎన్. బూర్జి వలస గ్రామంలో జ్వరాల తీవ్రత ఏమీ లేదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ గ్రామాన్ని బుధవారం తాను సందర్శించినట్లు చెప్పారు. తమ వైద్య బృందాలతో గ్రామంలోని 720 మందికీ ఆరోగ్య తనిఖీలు చేశామని అందులో ఇద్దరు మాత్రమే జ్వర పీడితులు ఉన్నట్టు పేర్కొన్నారు. వారికి అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య పరంగా ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఈ గ్రామంలో భయాందోళనలు చెందే పరిస్థితి లేదని తెలిపారు.

ఎన్.బూర్జివలస

2021-10-20 14:59:01

జలవిద్యుత్ కేంద్ర కమిటీ అభివ్రుద్ధి చెందాలి..

అడ్డతీగల మండలం వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం ద్వారా జలవిద్యుత్ కేంద్రం కమిటీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.  బుధవారం అడ్డతీగల మండలం వేట మామిడి మినీ జలవిద్యుత్ కేంద్రమును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య పర్యటించి, సందర్శించారు. ఈ మినీ జలవిద్యుత్ కేంద్రం కమిటీ తో ప్రాజెక్ట్ అధికారి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా ఎంత కరెంటు ఉత్పత్తి అవుతున్నది ఎంత ఆదాయం వచ్చుచున్నది ఇక్కడ పనిచేసే వారికి వేతనాలు పోగా ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉన్నది  తదితర వివరాలు ప్రాజెక్టు అధికారి మినీ జలవిద్యుత్ కేంద్రం అధ్యక్షురాలు బి. సత్యవతిని ప్రాజెక్టు అధికారి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా కరెంటు ఉత్పత్తి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కమిటీ సభ్యులను ప్రాజెక్టు అధికారి కోరారు. అదేవిధంగా ఈ మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ప్రతి ఈవెంట్ దగ్గరికి వెళ్లి ప్రాజెక్టు అధికారి పరిశీలించి ఏ ఏ పరికరాలు పనిచేస్తున్నాయి.  క్షుణ్నంగా ప్రాజెక్టు అధికారి పరిశీలించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మినీ జలవిద్యుత్ కేంద్రం కమిటీ అధ్యక్షురాలు బి.సత్యవతి, జడ్ పి టి సి ఎం.వీర్రాజు, ఎంపీపీ బి.రాఘవ, తాసిల్దార్ సి.హెచ్. శ్రీనివాసరావు, ఎంపీడీవో ఏం. బాపన్న దొర,  ఏ.ఈ.మురళీ, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2021-10-20 13:30:15

కొఠియా గ్రామ ప్రజలకూ ప్రభుత్వ పథకాలు..

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రకటిస్తున్న పథకాలను కొఠియా గ్రామాల మహిళలు అందుకొని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ క్రాంతి పథం(వెలుగు)ఎపిడి సత్యం నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం మండలంలోని వివాదస్పద కొఠియా గ్రూపు గ్రామాలైన గంజాయి భద్ర, ఎగువ శంబి, దిగువ శంబి, ధూళి భద్ర మహిళా సంఘాలతో ఎగువ శంబిలోను, నేరెళ్ల వలస, మూలతాడివలస, దొరలతాడివలస గ్రామాల మహిళా సంఘాలతో నేరెళ్లవలస గ్రామంలో మండల ఎపిఎం ఎ. జయమ్మ ఆధ్వర్యంలో వేరువేరుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిడి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. తమ సిబ్బంది సలహాలు, సూచనలను పాటిస్తే అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నరు. ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకోకుండా తాము చెప్పినట్లుగా ఉన్నతి బ్యాంకు లింకేజి రుణాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానివల్ల మీకుటుంబాలు ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తాయన్నారు. అదేవిధంగా వెలుగు సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి సర్వే జరిపి నివేదికను ఇవ్వాలన్నారు. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందిస్తామని, కావున బయట వారికి పంటలను అమ్మరాదన్నారు. అనంతరం ఎసిఎం ఎం. ఆదయ్య, ఎపిఎం ఎ. జయమ్మ తదితరులు మాట్లాడగా, సిసిలు పడాల రామకృష్ణ, బాలరాజు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Salur

2021-10-20 11:59:46

గిరిజన రైతుకు పండ్ల మొక్కలు సరఫరా చేయండి..

విశాఖ ఏజెన్సీ వాతావరణానికి అనుకూలంగా ఉండే పండ్ల మొక్కలను గిరిజన రైతుకు సరఫరా చేయాలని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి ఆదేశించారు. బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా పాడేరు మండలం డి .గొందూరు పంచాయతీ మద్దుల బంద గ్రామానికి చెందిన గిరిజన రైతు సీదరి అప్పన్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వెలుగు ద్వారా మంజూరు చేసిన సోలార్ పంపును సద్వినియోగం చేసుకుని రెండు ఎకరాల విస్తీర్ణంలో అరటి, జామ పండ్ల తోటలు, టమోటా, పసుపు, సామలు, రాగులు తదితర చిరుధాన్యాలు సాగు చేస్తున్నానని రైతు అప్పన్న ప్రాజెక్టు అధికారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ రైతుకు షెడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కాఫీ మొక్కలు, జామ, కమలా, సపోటా , సీతాఫల మొక్కలను రైతుకు సరఫరా చేయాలని సూచించారు. ఏజెన్సీలో నూతన పంటలను సాగు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రాజెక్టు వ్యవసాయాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వ్యవసాయాధికారి బి.భాస్కరరావు,వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-10-20 11:57:38

గ్రామాలను స్వచ్చంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం..

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలని ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచందరప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం శంఖవరం మండల కాంప్లెక్స్ జగనన్న స్వచ్ఛ సంకల్పం క్రింద మండలానికి కేటాయించిన చెత్త తరలించే మినీ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. అదేవిధంగా చెరువులు, కాలువల్లో కూడా చెత్తవేయకూడదన్నారు. మనఇంటిని ఎంత పరిశుభ్రంగా చూసుకుంటామో, గ్రామాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని సాధించేందుకు.. ఆయ‌న ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు అంద‌రూ క‌లిసి రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, ఎంపీడీఓ జె.రాంబాబు, పంచాయతీ సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, పంచాయతీ సిబ్బంది,  స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-20 06:12:12

వజ్రకూటం లో ప్రారంభమైన సమగ్ర భూసర్వే..

సమగ్ర భూ సర్వే ద్వారా భూహక్కుదారుడికి ప్రభుత్వం ద్వారానే అధికారిక పత్రాలు అందుతాయని తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ఎంపీడీఓ జె.రాంబాబు, సర్పంచ్ గుర్రాజుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా తహశీల్దార్ మాట్లాడుతూ, సమగ్ర భూ సర్వే వలన భూముల యొక్క స్వచ్చత బయటపడుతుందని, ప్రభుత్వ రికార్డుల్లో వున్న తప్పు ఒప్పులు కూడా సరిచేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. కార్యక్రమంలో, వీఆర్వోలు, సీతారాం, సర్వేయర్ సురేష్, మహిళా పోలీస్ కళాంజలి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

వజ్రకూటం

2021-10-18 08:58:34

అన్నవరం కొండపైకి ఆటోలు అనుమతి రద్దు..

తూర్పు గోదావరి జిల్లా  అన్నవరం శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం పరిధిలోగల ట్రాన్స్పోర్ట్ విభాగమునకు ఆటోలు టోల్ గేట్ నుంచి అనుమతించవద్దని ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ట్రాన్స్పోర్ట్ విభాగ అధికారులు మూడు చక్రాల వాహనాలను రత్నగిరికి వెళ్లకుండా నిలుపుదల చేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు కూడా వచ్చిన ఆదేశాలను  ఆకస్మికంగా అమలు చేయడంతో రాకపోకలు సాగిస్తున్న ఆటో డ్రైవర్లు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. అధికారికంగా కొండపైకి ఆటోలు అనుమతిలేకపోయినా.. టోల్ గేట్ చలానా కట్టించుకొని నేటివరకు చూసి చూడనట్లు అధికారులు వదిలేశారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం బస్సులను టోల్ గేట్ వద్ద సిద్ధం చేసి  నడుపుతున్నారు. దీనితో ప్రైవేటు వాహనాలకు అనుమతి పూర్తిగా రద్దు చేశారు.

Annavaram

2021-10-17 13:02:32

సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..

తూర్పుగోదావరి జిల్లా రామవరానికి చెందిన కర్రిసత్తిరెడ్డి కుటుంబం శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆదివారం ఏఈఓ కి చెక్కురూపంలో దాతలు అందజేశారు. కరాల సూర్రెడ్డి, వీరవెంకటలక్ష్మిల పేరుపై అక్టోబరు 19వ తేదిన అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-17 12:03:34

అన్నదాన ట్రస్టుకి రూ.200116 లక్షలు విరాళం..

కర్నూలు  జిల్లా  చెందిన ఎంసీ సత్యన్నారాయణ దంపతులు  శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ. రెండు లక్షల 116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆదివారం ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు కి చెక్కురూపంలో దాతలు అందజేశారు. వైశాఖశుద్ధ ఏకాదశి రోజున తన పేరుపై  అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-17 12:01:39

శ్రీ సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..

విజయవాడ గులాబితోట, దుర్గాపురానికి చెందిన టివిఎస్ ప్రసాద్ కుటుంబం శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని శనివారం ఇన్చార్జి పీఆర్వో కొండలరావుకి చెక్కురూపంలో దాతలు అందజేశారు. తంగెళ్ల స్నేహిత పేరుపై ఆగస్టు 7న అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-16 11:37:54

శ్రీసత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..

విశాఖజిల్లా అనకాపల్లికి చెందిన పట్టాసుజాత  కుటుంబం శ్రీశ్రీశ్రీ అన్నవరం వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని శనివారం ఇన్చార్జి పీఆర్వో కొండలరావుకి చెక్కురూపంలో దాతలు అందజేశారు. పట్టా వెంకటేశ్వర్రావు, చిట్టమ్మలు పేరుపై అక్టోబరు 1వ తేదిన అన్నదానం చేయాల్సిందిగా దాతలు దేవస్థాన సిబ్బందిని కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఆలయ సిబ్బంది ప్రసాదాలు అందించగా వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-16 11:36:26