మహిళా ఆర్ధికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శనివారం గొలుగొండ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ ఆసరా పథకం నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ హాజరై చెక్కులు పంపీణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలన్ని మహిళల పేరుతోనే అమలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. పథకం ద్వారా మండలంలో 1022 సంఘాలలో 13744 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని చెప్పారు. మొదటి విడతగా గత ఏడాది కూడా ఆసరా పథకం ద్వారా రూ.7కోట్లు అందజేశామన్నారు. ఈ ఏడాది రెండో విడతగా రూ.7.40కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి చెందాలన్నారు. అనంతరం మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్.గోవిందరావు, ఎంపిడిఒ డేవిడ్ రాజ్, తహశీల్దార్ వెంకటేశ్వరావు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్‌నాయుడు, గొలుగొండ ఎంపిపి గజ్జల మణికుమారి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, వైస్ ఎంపిపి సుర్ల బాబ్జి, ఏఎసి చైర్మన్ లెక్కల సత్యనారాయణ, గొలుగొండ సర్పంచ్ బుజ్జి, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సాయి బాబా, ఏపిఎం గోవిందరావు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.