1 ENS Live Breaking News

ఉద్యాన పంటల పై అవగాహన కల్పించాలి..

ఉద్యాన పంటలతోనే గిరిజనులు ఆర్థికంగా అభివృధి చెందుతారు అని ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గ్రామంలో ఎం.జి. ఎన్.ఆర్.జి.ఎస్ పండ్ల తోటల పెంపకంపై   ఉద్యానవన రైతు  శిక్షణా తరగతులకు ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరిజన రైతుల ఆదాయం అభివృద్ధికి కోసమే ఈ శిక్షణా తరగతులు, నాటిన ప్రతి మొక్క మంచి ఫలసాయం అందించేలా, మొక్కలకు ఎటువంటి హాని కలుగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం పోడు భూములు ఇవ్వడం జరిగిందని, దానితో పాటు అధిక దిగుబడిని ఇచ్చే జీడి అంట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి గిరిజన రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివృధి చెందాలని హితవుపలికారు.ఈ ఉద్యానవన రైతుల శిక్షణా కార్యక్రమానికి పి.హెచ్. ఓ  శ్రీనివాస రావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు,  ఎ.పి.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యాన రైతులు తదితరులు పాల్గొన్నారు.

Gummalaxmipuram

2021-10-30 12:40:37

శంఖవరం గొల్లవీధిలో భారీ అన్నదానం.. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు..

శంఖవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో శ్రీశ్రీశ్రీ విజయదుర్గ మాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు పూర్తియిన తరువాత భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టునట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఈ అన్నదానంలో సాధారణ భక్తులతోపాటు, అయ్యప్పస్వాములు, భవానీ భక్తులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మూడువేల మందికి పైనే ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో దాతలు కూడా విరాళాలు సమర్పించారు. 15ఏళ్ల నుంచి ప్రతీఏటా కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగించడం విశేషం.ఈ కార్యక్రమంలో నిర్వహాకులు శ్రీనివాస్,దుర్గాప్రసాద్ తోపాటు, అప్పారావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-10-29 06:23:22

పట్టాలమ్మ ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి పూజలు..

కోటవురట్ల మండలం పాములవాక గ్రామంలోని పట్టాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం, అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. పట్టాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి హారతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ, అమ్మవారి దయతో ఈ ప్రాంతమంతా అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఎస్వీ.రమణ, డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ, నీలవేణి, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Kotavuratla

2021-10-28 08:12:48

రేపు శంఖవరం దుర్గాదేవి ఆలయంలో అన్నదానం..

శంఖవరం మండల కేంద్రంలోని గొల్లపేట దుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం భారీస్థాయిలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం శంఖవరం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఎప్పటి మాదిరిగానే నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్ని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

Sankhavaram

2021-10-28 08:06:49

నాణ్యతో రాజీపడకుండా నిర్మాణాలు చేపట్టాలి..

కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో రాజీపడకుండా పనులు చేపట్టాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం వైద్య నగర్  ప్రాంతాల్లో రూ. 7. 65లక్షలతో నిర్మించిన జిమ్ సెంటర్, జనచైతన్య హౌసింగ్ ప్రాంతాల్లో నిర్మించిన రూ.7.50 లక్షలతో నిర్మించిన కల్వర్ట్ల నిర్మాణ నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. నాణ్యతలో తేడాలొస్తే దానికి అధికారులే బాధ్యత వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏ. ఈ. రమేష్ బాబు,  శానిటేషన్ ఇన్స్పెక్టర్, స్ధానిక సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-10-28 07:27:55

2021-10-28 07:01:45

నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాస్కరనాయుడు ప్రమాణ స్వీకారం..

నర్సీపట్నం పెదబొడ్డేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా చిటికెల భాస్కరనాయుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు స్వకీరించారు. గురువారం ఈ మేరకు బొడ్డేపల్లా మార్కెట్ యార్డులోని కార్యాలయంలో చాంబరులో ప్రత్యేక పూజలు నిర్వహించి  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిటికెల దంపతులను అభినందించి ఘనంగా సత్కరించారు. వైస్ చైర్మన్ గా మల్లగణేష్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరందరికీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అభినందనలు తెలియజేశారు.  అనంతరం చైర్మన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ స్థానాన్ని కట్టబెట్టిన ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. మార్కెట్ కమిటీని అభివ్రుద్ధి పధంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని అన్నారు. అంతేకాకుండా రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు మార్కెట్ కమిటీ ద్వారా అందేచూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహ మూర్తి తమరాన అప్పల్ నాయుడు, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడు ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జమిల్, మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ, వీరమాచినేని జగదీశ్వరి, వైసీపీ నేతలు విజయ్ కుమార్, గుడిబండ నాగేశ్వరరావు, గణేష్ అన్న ఆర్మీ అధ్యక్షుడు తమరాన శ్రీను . గొలుగొండ, నర్సీపట్ం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాలుగు మండలాల్లోని పంచాయతీ సర్పంచ్ లు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-28 06:36:23

ప్రతీ ఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలి..

కరోనా కట్టడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ వేక్సిన్ వేయించు కోవాలని పార్వతీపురం ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రోజెక్ట్ అధికారి శనివారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మవలస మండలం బి.జె.పురం, తుంబలి గ్రామ సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే గ్రామాల్లో ఇంటింటి కి నిర్వహిస్తున్న వెక్షినేశాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పర్యటనలో ముందుగా  సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే  పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. అనంతరం గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి వాక్సినేషన్ నిర్వహణపై ఆరా తీశారు. వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని సూచించారు.  ఈ సచివాలయాల ఆకస్మిక పర్యటనలో  జియ్యమ్మవలస మండల, ఎం.పి.డి.ఓ కె.విజయలక్ష్మి,  రెవెన్యూ అధికారులు, సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2021-10-23 10:45:39

సత్యదేవుడిని దర్శించుకోనున్న మీజోరాం గవర్నర్..

అన్నవరంలోని  శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని రేపు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకోనున్నారని దేవస్థాన ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈ మేరకు అన్నవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్నిఏర్పాట్లు చేసినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  గవర్నర్ స్వామివారిని ఉదయం 11గంటలకు దర్శించుకొని పూజలు చేసి అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని తెలియజేశారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నాయకులు కూడా హాజరు కానున్నారని అందులో వివరించారు.

Annavaram

2021-10-23 10:41:42

ప్రభుత్వ న్యాయ సేవలను వినియోగించుకోవాలి..

ప్రభుత్వం న్యాయవ్యవస్థ ద్వారా అందించే అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు జ్యూడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.గోపాల క్రిష్ణ అన్నారు. శనివారం నెల్లిపూడి గ్రామసచివాలయం వద్ద ఏర్పాటు చేసిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చైతన్యం కలిగించారు. కోర్టుల ద్వారా మాత్రమే సత్వర న్యాయం జరుగుతుందన్న ఆయన ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా మహిళల హక్కులు, బాధ్యతల కోసం కూడా తెలుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్ఐ అజయ్ బాబు, బార్ కౌన్సిల్, నెల్లిపూడి సర్పంచ్ నరాల శ్రీనివాస్, మహిళా పోలీస్ కళాంజలి, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

నెల్లిపూడి

2021-10-23 10:40:29

సత్యదేవుని కాటేజీ లో గదికి రూ.5లక్షలు విరాళం..

అన్నరవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని హరిహర సదన్ కాటేజీలోని ఒక గదికి హైదరాబాదుకి చెందిన  వి.యల్. యన్.మూర్తి ఒక గదికి రూ.5,00,000/- విరాళంగా చెల్లించారు. ఈ మొత్తాన్ని శనివారం దేవస్థానం సిబ్బందికి అందజేశారు. అంతకుముందు దాతలు స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమందో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-23 10:38:56

సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.50116 విరాళం..

అన్నరవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలోని అన్నదాన ట్రస్టుకి బిక్కవోలుకి చెందిన వివిఎస్కేఎస్. ప్రకాశరావు,రామతులసి దంపతులు రూ.50116 విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని దేవస్థానంలోని ఇన్చార్జి పీఆర్వో కొండలరావుకి అందజేశారు. జూన్ 2వ తేదిన తమపేరుతో అన్నదానం చేయాలని అధికారులను కోరారు. అంతకుముందు దాతలు స్వామివారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమందో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-10-23 10:37:38

ప్రజల ఫిర్యాదులను తక్షణమే స్వీకరించండి..

ప్ర‌జ‌ల నుంచి వివిధ ఫిర్యాదుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలని, పెండింగ్ ద‌ర‌ఖాస్తులను త‌క్ష‌ణ‌మే క్లియ‌ర్ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ సచివాల‌య సిబ్బందిని ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న కొత్త‌వ‌ల‌స మండ‌లం మంగ‌ళ‌పాలెం స‌చివాయాల‌న్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌కు సంబంధించిన రికార్డుల‌ను, ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను  ప‌రిశీలించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలకు సంబంధించిన అన‌ర్హుల జాబితాను ప్రద‌ర్శించాల‌ని సిబ్బందిని ఆదేశించారు. అనంత‌రం కంట‌కాప‌ల్లి గ్రామంలో అన‌ధికారికంగా న‌డుస్తున్న ఆర్‌వో వాట‌ర్ ప్లాంట్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఐ.ఎస్‌.వో. మార్కు లేక‌పోవ‌టం, ఇత‌ర‌ నిబంధ‌న‌లు పాటించ‌క‌పోటంతో వాట‌ర్ ప్లాంట్‌ను సీజ్ చేశారు. ఆయ‌న వెంట కొత్త‌వ‌ల‌స త‌హశీల్దార్‌, ఎంపీడీవో, ఇత‌ర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Kothavalasa

2021-10-23 10:34:32

28న లీ ప్యార‌డైజ్‌లో లోన్ మేళా..

విజ‌య‌న‌గ‌రంలో ఈ నెల 28న లీ ప్యార‌డైజ్‌లో ప‌లు బ్యాంకుల ఆధ్వ‌ర్యంలో లోన్ మేళా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎల్‌.డి.ఎం. ఎమ్‌. శ్రీ‌నివాసు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ అధీనంలోని డి.ఎఫ్‌.ఎస్‌. (డిపార్ట‌మెంట‌ల్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి జిల్లాలోని అన్ని బ్యాంకుల స‌మ‌న్వ‌యంతో రుణ విత‌రణ క్యాంపైన్ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అమ‌ల‌వుతున్న వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించిన రుణాల మంజూరు ప్ర‌క్రియపై అంద‌రి స‌మ‌క్షంలో స‌మీక్ష ఉంటుంద‌ని వివ‌రించారు. పీఎంఎంవై, ఎస్‌యూఐ, పీఎంఈజీపీ, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్సార్ చేయూత త‌దిత‌ర ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు ఆయా బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు ఉంటుంద‌ని, సంబంధిత చెక్కుల పంపిణీ జిల్లా క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ క్యాంపైన్‌లో సీడీఎం, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులు, నాబార్డు ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొంటార‌ని వివ‌రించారు. ఈ అవ‌కాశాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.

Vizianagaram

2021-10-22 12:54:18

జనాలను నమ్మించేందుకే చంద్రబాబు కుటిల దీక్షలు..

టిడిపీ ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబు తీరుమారలేదని.. 36 గంటలు కాకుండా 360 రోజులు పాటు ఎన్నిదీక్షలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు.  శుక్రవారం 2వ రోజు పట్టణంలో జనాగ్రహదీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు.  టీడీపీ నేతలు బూతు పురాణానికి నిరసనగా ప్రజలు తిరగబడుతున్నవిషయాన్ని టిడిపి గుర్తుంచుకోవాలన్నారు. ఉన్న కొద్దిపాటి ఉనికిని కాపాడుకోవడానికి టిడిపీ కొత్తడ్రామాలకు తెరతీసిందన్నారు. ఈ నిరసన లో మాకవరపాలెం,గోలుగొండ,నాతవరం, నర్సీపట్నం రూరల్ మండలాలకు చెందిన వైస్సార్ పార్టీ  ఎంపీపీలు, పంచాయతీ  సర్పంచ్ లు, ఎంపీటీసీలు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Narsipatnam

2021-10-22 08:50:41