ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ ఆసరా పథకం పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని క్రిష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు పసగడుగుల గిరిబాబు చెప్పారు. గొలుగొండ మండలంలో క్రిష్ణదేవిపేట గ్రామంలో డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలకు వైయస్సార్ ఆసరా పథకంపై అవగాహన కార్యక్రమంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్పీ నాయకులు గిరిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే ప్రతీ పథకంపై మహిళలకు అవగాహన ఉండాలన్నారు. తద్వారా పథకాల అమలు సులభతరం అవుతుందని అన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఎం.వరహాలు,ఎం.నానాజీ, అర్జునరావు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.