1 ENS Live Breaking News

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.54.70లక్షలు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి హుందడీ ఆదాయం రూ.54లక్షల 70వేల 311 వచ్చినట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. శుక్రవారం ఆయన ఆలయంలో మీడియాతో మాట్లాడారు. స్వామివారి హుండీ లెక్కింపు ప్రసాంతంగా జరిగిందన్నారు. ఇందులో 100 యుస్ డాలర్లు, 10 దిరామ్స్ రాగా బంగారం 32 గ్రాములు, 197 గ్రాముల సిల్వర్ వచ్చినట్టు పేర్కొన్నారు. వచ్చిన మొత్తాన్ని దేవస్థానం బ్యాంకు అకౌంట్లోకి జమజేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-09-24 09:12:00

వారంలో రెండు రోజులు డ్రై పాటించాలి..

శంఖవరం మండల కేంద్రంలో ప్రజలు వారానికి రెండు రోజులు డ్రైడే పాటించాలని సచివాలయం-2 ఆరోగ్యసహాయకులు దేవమణి పిలుపు నిచ్చారు. శుక్రవారం సచివాలయం పరిధిలో ఇంటింటికీ తిరిగి డ్రైడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటిలో మంచినీటి ట్యాంకుతు, కులాయిల ప్రాంతాలను పూర్తిగా రెండు రోజుల పాటు ఎండకు ఆరనివ్వాలన్నారు. ఏవిధంగా డ్రైడే పాటించాలో వారికి వివరించారు. కార్యక్రమంలో ఆశకార్యకర్త పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-24 09:10:15

నర్సీపట్నం ఎంపీపీగా సుర్ల రాజేశ్వరి..

నర్సీపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుర్ల రాజేశ్వరి ఎన్నికయ్యారు. అమలాపురం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మండల ఉపాధ్యక్షులుగా  ఈన్నంరత్నం ఎన్నికయ్యారు. ఈమె  చెట్టుపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే మండల పరిషత్ ఎన్నికల సమయంలో ఈమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా గుర్రంధర పాలెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ నియమితులయ్యారు. ఆయన ఒక్కడే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిషత్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని అధికారులు ప్రకటించారు.

నర్సీపట్నం

2021-09-24 07:48:19

శంఖవరంలో 194 మందికి కోవిడ్ వేక్సిన్ పంపిణీ..

శంఖవరంలో గురువారం 194 మందికి కోవిడ్ వేక్సినేషన్(కోవిషీల్డ్, కోవాగ్జిన్) పంపిణీ చేసినట్టు ప్రాధమిక వైద్య ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు పీహెచ్సీ నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం శంఖవరానికి మంజూరు చేసిన 200 వేక్సిన్ లలో 194 మాత్రమే పూర్తిచేశామన్నారు. ఇంకా 6 వేక్సిన్లు మిగిలిపోయాయని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో 18ఏళ్లు నిండినవారికి, తరువాత 84రోజులు దాటిన 2వ డోసు వారికి వేక్సిన్లు అందజేసినట్టు వైద్యాధికారి తెలియజేశారు. ఇంకా వేక్సిన్ వేయించుకోని వారు ఉంటే తక్షనమే ఆయా గ్రామసచివాలయాల పరిధిలోని ఆరోగ్య సహాయకులను సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Sankhavaram

2021-09-23 14:24:43

ఎమ్మెల్యే పర్వతకు వేదపండితుల ఆశీర్వచనం..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ ని దేవస్థానం పండితులు బుధవారం ఆయన స్వగ్రుహానకి వెళ్లి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ సత్యదేవుని దేవస్థానానికి తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎంపిపి పర్వత రాజబాబు, నూతనంగా ఎన్నిక కాబడిన జెడ్పీటీసీ లు, ఎంపీటిసిలు వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే మర్యాపూర్వకంగా కలిశారు.

Sankhavaram

2021-09-22 15:06:38

ఆ 50 కుటుంబాల బాధ్యత వాలంటీర్లదే..

గ్రామ వలేంటీర్లు తమ పరిధిలో గల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లా విధులు నిర్వహించాలి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ బుధవారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మ వలస మండలం ఇట్టిక, కొమరాడ మండలం మాదలింగి, పాలెం గ్రామ సచివాలయాలను  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా  సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయం సిబ్బంది, వాలెంటిర్లకు సీజనల్ వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే  పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. కొమరాడ మండలం మాదలింగి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మండగి సింహాచలం రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి పై తక్షణం  క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సచివాలయం ఆకస్మిక పర్యటనలో  జియ్యమ్మ వలస, కొమరాడ మండలాల  రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-22 12:43:09

44పాఠశాలల్లో ఏకగ్రీవం..2 పాఠశాలల్లో వివాదం..

శంఖవరం మండలంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈఓ ఎస్వీరమణ తెలియజేశారు. బుధవారం శంఖవరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం పాఠశాలల్లో రెండు పాఠశాలల్లో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల మధ్య విభేధాల కారణంగా అక్కడ ఎన్నికలు వాయిదా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన పాఠశాలల్లో అంతా ప్రశాంతంగా జరిగినట్టు ఆయన వివరించారు. మిగిలిన రెండు పాఠశాలల విషయమై జిల్లా విద్యాశాఖ అధికారికి నిదేవించినట్టు ఆయనవ వివరించారు.

Sankhavaram

2021-09-22 12:28:37

దారకొండలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ..

విశాఖ ఏజెన్సీలో రెండేళ్లకు పైగా  కొనసాగిన అల్లూరి సాయుధ పోరాటంలో గూడెం కొత్తవీధి ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు.  గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ ప్రాంతంలోగల దారాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కోటనందూరుకు చెందిన అల్లూరి సీతారామరాజు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు లక్కాకుల బాబ్జి అల్లూరి విగ్రహాన్ని అందజేయగా.. ప్రముఖ సినీనటుడు జోగి నాయుడుతోపాటు పడాల వీరభద్రరావు, మహర్షి రమణ తదితరులు అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  పడాల వీరభద్ర రావు మాట్లాడుతూ, అల్లూరి ముఖ్య అనుచరుడు గాం మల్లు దొర గూడెం కొత్తవీధి ప్రాంతంనుంచే  పార్లమెంట్‌ సభ్యుడిగా  ఎన్నికయ్యారన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసం సాయుధ పోరాటం చేసిన ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు గూడెం కొత్తవీధి మండలం లోని దారకొండ, పెదవలస, దామనపల్లి తదితర ప్రాంతాల్లో సంచరించారన్నారు. దారకొండలోని దారాలమ్మ అమ్మవారు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు ఆరాధ్య దైవమని ఆయన నటించే ప్రతి సినిమా షూటింగ్‌కు ముందు ఒకసారి దారాలమ్మను ఆయన దర్శించుకుంటుంటారని అన్నారు. బ్రిటిష్‌ పాలన హయాంలోనే గూడెం కొత్తవీధి మండలంలో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైం దని, ఇంతటి ఘన చరిత్ర గల గూడెం కొత్త వీధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. దారాలమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ  ప్రాంతాలనుంచి ఎందరో భక్తులు వస్తూ ఉంటారని అయితే రహదారుల దుస్థితి అత్యంత దయనీయంగా ఉందని పడాల ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీలో అరుకు, బొర్రా గృహాలు ప్రాంతాలకు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం అదే విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను కూడా అభివృద్ధిచేసి పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీ అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ  సంఘం అధ్యక్షురాలు శ్యామలా వరలక్ష్మి, దారకొండ సర్పంచ్‌ నడిగట్ల రాజు, ఆలయ ప్రధాన అర్చకుడు సాగిన నారాయణమూర్తి, దివ్య అర్చకుడు కంకిపాటి ప్రసాద్‌, దార్లపూడి రాము, ఎమ్‌.నాగేశ్వరావు, జి.గణేశ్వరరావు, కోటనందూరు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ  ప్రతినిధులు   కొంకిపూడి ప్రసాద్‌, దాడి లోవరాజు, తోలెం సత్తిబాబు, బొడ్డేటి స్వామి, బుద్ద చెల్లారావు, లక్కాకుల ధనుంజయ, గజ్జెలపు జయప్రకాష్‌, మళ్ళ తాతాజీ, మామిడి ఏసుబాబు, అనకాపల్లి వెంకటరమరణ, మళ్ళ లక్ష్మణ, చింతాకుల వెంకటేష్‌, అంకారెడ్డి రాజశేషు, గొంప వరహాలబాబు, కొంకిపూడి శ్రీను, దాడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Darakonda

2021-09-22 08:37:29

మీఇల్లైతే ఇలా దుమ్మూ దూళిలోనే ఉంటారా..

మీ ఇల్లయితే ఇలా అపరిశుభ్రంగా ఉన్నా  ఇంట్లోనే ఉంటారా.. అసలు సచివాలయాన్ని  నిర్వహించే పద్దతి ఇదేనా.. ఎక్కడ చెత్త అక్కడే..ఎక్కడి దుమ్ము అక్కడే వుంది.. కనీసం సచివాలయం ముందు బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు..అంటూ జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ విరవ గ్రామ సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో తనిఖీలు చేసిన కలెక్టర్ కి అక్కడి సిబ్బంది విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు వందలాది మంది సచివాలయానికి వస్తారు..బ్లీచింగ్ చల్లించడం వలన పరిశుభ్రంగా కనిపిస్తుంది..కనీసం అలా కూడా ఎందుకు ఆలోచిండచం లేదు..పోనీ విధులైనా సక్రమంగా నిర్వహిస్తున్నారా అదీలేదూ అంటూ విరవ గ్రామసచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో అక్కడ అపరిశుభ్రవాతావరణం కనిపించడంతో ఒక్కపెట్టున కలెక్టర్ సిబ్బందిపై నిప్పులు కక్కారు. ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు, అనర్హుల వివరాల జాబితాలను సక్రమంగా నిర్వహించక పోవడం, సచివాలయం ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ సచివాలయం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సచివాలయం భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి అక్టోబర్ నెలాఖరు నాటికి ప్రారంభించి, వినియోగంలోకి తెచ్చేలా విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.  వర్షాలు తగ్గుముఖం పట్టినందున రైతు భరోసా కేంద్రం, బల్క్ మిల్క్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణ పనులను కూడా ముమ్మరం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పిఠాపురం ఎంపీడీవో డీఎల్ఎస్.శర్మ,  ఇతర రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Pithapuram

2021-09-21 13:16:07

రైతులకు ఆర్బీకేల ద్వారా పూర్తిసేవలందాలి..

డెంకాడ మండ‌లం పిన‌తాడివాడ‌లోని రైతు భ‌రోసా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి, మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డి రైతుల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. ఈ-క్రాప్ న‌మోదుపై ఆరా తీశారు. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఈ-క్రాప్ న‌మోదు చేసుకోవాల‌ని రైతుల‌కు సూచించారు. గ్రామంలోని పంట‌ల ప‌రిస్థితిపై, విఆర్ఓను వివ‌రాలు అడిగారు. ఎరువులు, పురుగుమందుల స‌ర‌ఫ‌రా గురించి సిబ్బందిని ప్ర‌శ్నించారు. అనంత‌రం స‌మీపంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. పాఠ‌శాల‌లోని స‌మ‌స్య‌ల‌పై ఉపాధ్యాయుల‌ను అడిగి తెలుసుకున్నారు. మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌, ల్యాబ‌రేట‌రీలు, ఇత‌ర స‌దుపాయాల గురించి ప్ర‌శ్నించారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంపై ఆరా తీశారు. పాఠ‌శాల‌లో నెల‌కొన్న త్రాగునీటి స‌మ‌స్య‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

Denkada

2021-09-21 12:15:56

24న అన్నవరం సత్యదేవుని హుండీల లెక్కింపు..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో సెప్టెంబరు 24న హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్ట నున్నట్టు దేవస్థాన ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. ఈమేరకు సోమవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ నిబందనలు అనుసరించి ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నట్టు ఆ ప్రకటనలో వివరించారు. హుండీల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవస్థానంలో చేసినట్టు ఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Annavaram

2021-09-20 09:58:08

మానవత్వం చాటుకున్న నూతన జెడ్పీటీసీ..

గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు (ప్రధమ చికిత్స వైద్యుడు) ప్రమాదంలో గాయపడిన వారికి ప్రధమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. సోమవారం జెడ్పీటీసీగా గెలుపొందిన అధికారిక పత్రం తీసుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఒక యువకుడు ప్రమాదవసాత్తు బైక్ పై నుంచి కింద పడిపోయాడు. వెంటనే క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి ప్రాధమిక చికిత్స అందించారు.  ఆపదలో ఎల్లప్పుడు ముందుండే ఈయన తన చేతిలో వున్న ప్రాధమిక వైద్యాన్ని క్షగాత్రులకు అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు. జెడ్పీటీసీ చేసిన సహాయానికి గొలుగొండ ఎస్ఐ, వైఎస్సార్సీపీ నాయకులు అభినందనలు తెలియజేశారు.

Golugonda

2021-09-20 09:18:00

సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం..

విజయవాడకు చెందిన మాలంపాటి రామక్రిష్ణ, సీతాలక్ష్మి దంపతులు అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి నిత్య అన్నదాన ట్రస్టుకి సోమవారం దేవస్థానంలో రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఈఓ వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. అనంతరం దాతలకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తమ కుటుంబ సభ్యుల పేరుతో అన్నదానం చేయాలని దాతలు ఈఓని కోరారు. ఈ  కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Annavaram

2021-09-20 08:59:11

ఇది ప్రజా విజయం జెడ్పీటీసీ గిరిబాబు..

గొలుగొండ జడ్పీటీసీగా సుర్ల గిరిబాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప టిడిపీ అభ్యర్ధిపై 6917 ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నారు. గతంలోనూ గిరిబాబు జెడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ఫ తేడాతో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన గిరిబాబు తన సత్తాను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది ప్రజా విజయమన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన మండలవాసులకు రుణపడి ఉండటంతోపాటు అభివ్రుద్ధిలో కీలక భూమివ వహిస్తానని చెప్పారు.

Golugonda

2021-09-19 13:04:04

శంఖవరం జెడ్పీటీసీగా తురుము మల్లీశ్వరి..

శంఖవరం వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి తురుము మల్లీశ్వరి 14579 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. ఆమెకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గెలుపొందిన నియామక పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ స్థానాన్నికూడా అలవోకగా గెలుచుకొని మండలంపై పార్టీ జెండాను రెప రెపలాడించింది. దీనితో మండంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేపు గెలుపొందిన అభ్యర్ధులంతా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అన్నీ స్థానాలు గెలుపొందడంలో నాయకుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి..

Sankhavaram

2021-09-19 12:57:28